హైదరాబాద్: తల్లి మందలించడంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ బ్యాంక్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మీనాదేవికుటుంబం మల్లాపూర్ బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. బుధవారం తల్లి కూరగాయల మార్కెట్‌కు వెళ్తుండగా తను కూడా వస్తానని కూతురు ఖుషి చౌహాన్ (14) అడిగింది. దీంతో తల్లి వద్దని చెప్పి వెళ్లింది. మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మార్కెట్ నుంచి వచ్చిన తల్లి చూసేసరికి కుమార్తె ఆత్మహత్య చేసుకుంది.
ముఖ్య గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com


