దొంగతనం చేసిన ఇంట్లోనే కునుకు తీశాడు.. తెల్లారే సరికి | Hyderabad thief steals gold, falls asleep with loot in pocket. Cops wake him up | Sakshi
Sakshi News home page

దొంగతనం చేసిన ఇంట్లోనే కునుకు తీశాడు.. తెల్లారే సరికి

Aug 14 2026 3:30 AM | Updated on Aug 14 2026 4:36 AM

Hyderabad thief steals gold, falls asleep with loot in pocket. Cops wake him up

సాక్షి,హైదరాబాద్‌: నగరంలో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఇంట్లోకి చొరబడి బంగారం తస్కరించిన ఓ దొంగ, అక్కడే గాఢ నిద్రలోకి జారుకున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి దొంగతనం చేసేందుకు పక్కా ప్రణాళికతో ఒక ఇంటిలోకి ప్రవేశించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి, ఇంట్లోని బీరువాను తెరిచి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. అపై అక్కడి నుంచి పలాయనం చిత్తగించాల్సింది పోయి అలసట, మత్తు కారణంగా అక్కడే నేలపై నిద్రపోయాడు.

ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన యజమానులు ఇల్లంతా గందరగోళంగా ఉండటాన్ని, ఒక వ్యక్తి నేలపై గాఢ నిద్రలో ఉండటాన్ని చూసి ఖంగుతిన్నారు. వారు వెంటనే ఆ వ్యక్తిని పరిశీలించగా, తాము పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అతని జేబులోనే దర్శనమిచ్చాయి.

దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాఢ నిద్రలో ఉన్న దొంగను లేపి అదుపులోకి తీసుకున్నారు. అతని జేబులో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement