పాన్‌షాప్‌ యజమానికి రూ. కోటి ఆస్తి,కారు, మరి ఎంబీఏ చదివినోడికి? | Paan shop owner builds Rs 1 crore wealth car Jobless MBA grad questions value of his degree | Sakshi
Sakshi News home page

పాన్‌షాప్‌ యజమానికి రూ. కోటి ఆస్తి,కారు, మరి ఎంబీఏ చదివినోడికి?

Aug 13 2026 7:10 PM | Updated on Aug 13 2026 7:38 PM

Paan shop owner builds Rs 1 crore wealth car Jobless MBA grad questions value of his degree

చిన్న చిన్న బడ్డీ కొట్లు, చిన్నదుకాణాలు, చిన్న వ్యాపారాలు బయట నుండి నిరాడంబరంగా కనిపించవచ్చు. కానీ కొంతమంది భారీ స్థాయిలోనే ఆదాయాన్ని ఆర్జిస్తారు. దీని వెనుక ఏళ్ల తరబడి శ్రమ, నిబద్ధత ఉంటుంది. అయితే ఇటీవల తన పరిసరాల్లోని ఒక పాన్ దుకాణాన్ని సందర్శించిన 34 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ తన అనుభవాన్ని సోషల్‌మీడియాలో పంచు కోవడం నెట్టింట విశేషంగా నిలిచింది.

రెడ్డిట్‌ యూజర్‌, ఎంబీఏ పట్టభద్రుడు,పంచుకున్న అనుభవం ప్రకారం  తమ వీధిలోని  ఒక సాధారణ పాన్‌ షాప్‌ యజమాని గురించి వివరిస్తూ. .‘‘నేను ఇటీవల సిగరెట్ తాగడానికి దగ్గర్లోని పాన్ షాపుకు వెళ్ళాను. అక్కడ యజమాని సుమారు కోటి రూపాయల విలువైన కారు, షాపు కొన్నాడని తెలిసింది. అతను తన ఇంటిని కూడా  రెన్నోవేట్‌ చేస్తున్నాడు.  ఆయన పని చాలా కష్టమైన పనే. ఒకసారి, తెల్లవారుజామున 2 గంటలకు ఒకరికి సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించినందుకు అతనిపై కత్తితో దాడి కూడా జరిగింది.” అంటూ రాసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతను చుట్టూ ఉన్న  మరిన్ని చిన్నదుకాణాలు  ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, జ్యూస్ అమ్మేవారిని గమనించడం మొదలు పెట్టాడట.

మరోవైపు సదరు MBA గ్రాడ్యుయేట్ వెన్నునొప్పి కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం సరైన పని దొరకక ఇబ్బంది పడుతున్నారు.తమ చుట్టూ ఉన్నపాన్ షాప్ యజమానులే కాకుండా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, జ్యూస్ సెంటర్లు, మొబైల్ విక్రేతలు కూడా స్వయంగా వ్యాపారం చేసుకుంటూ మంచి ఆస్తులు కూడబెట్టుకోవడం, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడం చూశారని పేర్కొన్నాడు. అలాగే తమ ప్రాంతంలో ఒకతను పెద్దగా చదువుకోకపోయినా, భారతదేశంలో ఖరీదైన మొబైల్ ఫోన్‌లను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే అమ్మి బాగా సంపాదిస్తున్నాడంటూ మరొక ఉదాహరణను పంచుకున్నాడు. 

వీరిని చూశాక చిన్న వ్యాపారం ప్రారంభించడం బెటర్‌ అనిపిస్తోంది. తనకు నడుము నొప్పి లేకపోయి ఉంటే, తాను కూడా వడా పావ్ లేదా రామెన్ కియోస్క్ ప్రారంభించి ఉండేవాడిని, లేదా ఆన్‌లైన్ స్టోర్‌ల కంటే మెరుగైన ధరలకు మొబైల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మడం మొదలుపెట్టి ఉండేవాడినన్నాడు. అంతేకాదు చిన్న వ్యాపార యజమానులు గత 15-20 ఏళ్లలో ఒక టైర్-2 లేదా టైర్-3 కాలేజీ గ్రాడ్యుయేట్ తన జీవితకాలంలో సంపాదించే దానికంటే ఎక్కువే సంపాదించారు అంటూ ఉన్నత చదువులు (ఉదాహరణకు టైర్-2, టైర్-3 MBAలు) నిజంగానే మెరుగైన ఆర్థిక అవకాశాలను ఇస్తున్నాయా? లేదా చిన్న వ్యాపారాలే నయమా?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై  స్పందనలు
ఈ పోస్ట్‌పై రెడ్డిట్‌లో తీవ్ర చర్చ జరిగింది. యూజర్లు వేర్వేరు దృక్పథాలను పంచుకున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ "మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇది కేవలం సక్సెస్‌ అయిన యజమాని కథ మాత్రమే. ప్రతి పాన్ షాప్ యజమానీ కోటీశ్వరుడు కాలేడు. చాలామంది పూట గడవడానికే కష్టపడతారు.  సాధారణంగా ఒక సగటు MBA గ్రాడ్యుయేట్, ఒక సగటు పాన్ షాప్ యజమాని కంటే మెరుగైన ఆర్థిక స్థితిలోనే ఉంటాడు అంటూ వివరణ ఇచ్చారు.

“నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ మీ వైఖరి చాలా వర్గపరమైనది. అపారమైన లాభాలు సంపాదించేంత వ్యాపార చతురత ఉన్న పాన్ షాప్ యజమాని విలువైన వస్తువులు కొనుక్కోవడంలో తప్పేముంది’’ అని మరొకరు ప్రశ్నించారు. 

వ్యాపార ఆదాయానికి పరిమితులుండవు. ఉద్యోగాల్లో ఉండే పరిమితుల కంటే చిన్న వ్యాపారాల్లోనే ఎక్కువ సంపాదనకు అవకాశం ఉంటుంది. సరైన గ్రోత్ లేని తక్కువ జీతం ఉద్యోగాల్లో ఇరుక్కుపోయే కంటే, రిస్క్ తీసుకుని వ్యాపారం చేయడం మంచిదని  మరొకరు అభిప్రాయపడ్డారు.  అంతేకాదు వ్యాపార నైపుణ్యం ఉండి, శ్రమపడి సంపాదించిన వ్యక్తి కార్లు, ఆస్తులు కొనుగోలు చేయడంలో తప్పులేదని, ఏ పనినీ తక్కువగా చూడకూడదని మరికొందరు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ లేబుల్స్‌ : సుప్రీం సీరియస్‌, కేంద్రానికి అల్టిమేటం

చాలా మంది 20-30 లక్షల వార్షిక ఆదాయాన్ని అరుదైనదిగా భావించడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. వారు తమ ఉద్యోగ ప్రపంచం నుండి బయటకు వచ్చి, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే, 20-30 లక్షల వార్షిక ఆదాయం చాలా సాధారణం. మీరు భవిష్యత్తులో కెరీర్ వృద్ధి లేని తక్కువ జీతం గల ఉద్యోగంలో చిక్కుకుపోయి ఉంటే, మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా వ్యాపార అవకాశాలను అన్వేషించడం ప్రారంభించండి ఇంకొకరు సలహా ఇచ్చారు.

ఇదీ చదవండి: మాల్యా కేసు : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు 

ఉన్నత విద్య కేవలం ఉద్యోగ భద్రతను ఇచ్చే మార్గం మాత్రమే. స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారాలు చేసే శ్రమ, రిస్క్, కస్టమర్ మైండ్‌సెట్ ఉంటే చదువుతో సంబంధం లేకుండా గొప్ప ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. ఏమంటారు?

ఇదీ చదవండి: రోడ్డుపై టైగర్‌ : సెల్ఫీలకు ఎగబడిన పర్యాటకులు, వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement