breaking news
Police
-
అన్నం వడ్డించనందుకు భార్యపై దారుణానికి పాల్పడ్డ భర్త
నాగ్‌పూర్: అన్నం వడ్డించనందుకు ఓ మహిళను ఆమె భర్త కొట్టి చంపాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణలాల్ (41) అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి భార్య యామిని మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ హరేశ్ కల్సేకర్ మాట్లాడుతూ.. కృష్ణలాల్ పని ముగించుకుని ఇంటికి వచ్చి తన భార్య యామినిని భోజనం వడ్డించాలని అడిగాడని తెలిపారు. అయితే యామిని అందుకు నిరాకరించి, తాను డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లాలనుకుంటున్నానని, భోజనం అతడే వడ్డించుకోవాలని చెప్పినట్లు తెలిపారు.దీంతో దంపతుల మధ్య మొదలైన విభేదం తొలుత వాగ్వాదానికి, ఆ తర్వాత భౌతిక ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వారి ఫ్లాట్‌లో మహిళలకు డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఘర్షణ సమయంలో ఆగ్రహానికి గురైన కృష్ణలాల్ యామినిపై తీవ్రంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మెడ, పొత్తికడుపుపై లోతైన గాయాలయ్యాయి. ఆ గాయాలు ప్రాణాంతకంగా మారడంతో యామిని మృతి చెందింది.పోస్టుమార్టంతో అనుమానాలుయామిని మృతి తర్వాత పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే యామిని కుటుంబ సభ్యులకు ఏదో తప్పు జరిగిందనే అనుమానం కలిగింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పరీక్ష నిర్వహించాలని వారు పట్టుబట్టారు. పరీక్షలో తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆమె భర్తను ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో యామినిని హత్య చేసినట్లు కృష్ణలాల్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి వయసు 14 ఏళ్లు కాగా, చిన్న కుమారుడి వయసు 4 ఏళ్లు. -
పెళ్లి విషయంలో గొడవ.. 7 నెలల గర్భిణిని హత్య చేసిన ప్రియుడు!
తమిళనాడు: గర్భిణి అని కూడా చూడకుండా ఓ యువతిని గొంతు నులిమి హత్య చేసి, సంచిలో పెట్టి బావిలో పడేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సేలం జిల్లాలోని ఎడప్పాడి పక్కన కొంగనపురం సమీపంలోని వ్యవసాయ బావి నుంచి కొన్ని రోజుల క్రితం దుర్వాసన వెలువడింది. నీటిలో ఒక తెల్లటి సంచి తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న కొంగనపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.వారు బావిలో తేలుతున్న సంచిని బయటకు తీసి తెరిచారు. ఆ సంచిలో కుళ్లిపోయిన స్థితి ఓ యువతి మృతదేహం ఉంది. విచారణలో, కరుంగుళ్లవట్టం ప్రాంతానికి చెందిన పేరకౌండర్ కుమార్తె కోకిల (23) అని తెలిసింది. ఆమెని ఎందుకు హత్య చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాశాల చదువు పూర్తి చేసుకున్న కోకిల, పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆగస్టు 20వ తేదీన కోకిల తనకు తీవ్రమైన కడుపునొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే వారు సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి 7 నెలల గర్భవతి అని వెల్లడించారు..ఈ విషయం తెలుసుకుని కోకిల కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. విచారించగా, పొరుగు గ్రామానికి చెందిన అమ్మసి (26) అనే వ్యక్తితో తనకు పరిచయం ఉందని కోకిల చెప్పింది. దీని తర్వాత, కోకిల కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి మాట్లాడారు. ఆ సమయంలో, గ్రామంలో ఒక పండుగ ఉందని, ఆ తర్వాత కోకిలను పెళ్లి చేసుకుంటానని అమ్మాసి చెప్పాడు. అప్పటి వరకు ఆమె అక్కడ ఉండడానికి వీలుగా కోకిలను తన ఇంటికి తీసుకువెళ్లాడని తెలుస్తుంది.ఇంతలో, కోకిల 31వ తేదీ నుంచి కనిపించడం లేదని అమ్మాసి, కోకిల కుటుంబానికి తెలియజేశాడు. అంతటా వెతికినా జాడ దొరకలేదు. కోకిల హత్యకు గురైందని, ఆమె మృతదేహం బావిలో తేలుతున్న ఒక సంచిలో లభ్యమైందని తెలిసింది.. కొంగనపురం పోలీసులు అమ్మాసిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పెళ్లి విషయంలో జరిగిన గొడవ కారణంగా తాను దుపట్టాతో కోకిల గొంతు నులిమి చంపి, ఆమె మృతదేహాన్ని బావిలో పడేసినట్లు అమ్మాసి వెల్లడించాడు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి అమ్మాసిని అరెస్టు చేశారు. -
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
పోలీసుల కంటపడకుండా చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు.. పోలీసులు వెంటపడటంతో ఊహించని పని చేశాడు. ఏకంగా చెరువులోకి దిగి నీళ్ల కింద దాక్కున్నాడు. పోలీసులు వెనక్కి వెళ్లిపోతారని భావించాడు. కానీ.. పోలీసులు అంత ఈజీగా వదులుతారు. అతగాడి జాడను అవలీలగా పట్టేశారు. నీళ్లలోకి దిగి అతడిని పట్టుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన దిలీప్ అలియాస్ కారియా (19)పై మొత్తం 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో రెండు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో అతడిపై మూడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో దిలీప్ భద్రావతి న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారని గమనించిన దిలీప్.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. కొద్దిసేపటికి ఓ నీటి ప్రవాహం వద్దకు చేరుకుని.. ఎక్కడ దాక్కోవాలో తెలియక ఏకంగా నీళ్లలోకి దిగిపోయాడు.పోలీసులు చుట్టుపక్కల ఎంత వెతికినా తొలుత దిలీప్ కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకున్నాడని భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసుల కంటికి నీళ్లలో కలుపు మొక్కలు కదలడం, నీటి అడుగు నుంచి గాలి బుడగలు పైకి రావడం కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు.అంతే.. అసలు విషయం బయటపడింది. దిలీప్ నీళ్ల అడుగునే దాక్కుని ఉన్నాడు. వెంటనే ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది ప్రసన్న నీళ్లలోకి దిగి అతడిని బయటకు లాగారు. అక్కడికక్కడే చేతులకు బేడీలు వేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!” అంటూ ఖాకీలతో ఆ దిలీప్ చమత్కరించాడు.Hide and Seek : Cops dive into a pond to nab a rowdy sheeter hiding under weeds in ShivamoggaPolice in Shivamogga district have arrested a rowdy sheeter who was hiding in a pond to evade arrest despite three non bailable warrants issued against him by the court.The accused,… pic.twitter.com/6K0DBzRTUA— Imran Khan (@KeypadGuerilla) September 4, 2026 -
నిరసనకారులపై ఐపీఎస్‌ల దాడులా?
న్యూఢిల్లీ: పోలీసు అధికారుల నుంచి సామాన్య ప్రజలు ఆశించే సంయమనం, కరుణ కనుమరుగవుతున్నట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసు సిబ్బంది నిరసనకారులపై దాడి చేశారన్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో మాజీ భద్రతా కార్యదర్శి యశోవర్దన్ ఆజాద్ రచించిన ‘పోలీసింగ్ ది రిపబ్లిక్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ భూయాన్ మాట్లాడారు. ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్)కు చెందిన యువ అధికారులు స్వయంగా నిరసనకారులపై దాడి చేయడం చూసినప్పుడు మనమంతా కలత చెందుతామని అన్నారు. ఇది చూడటానికి చాలా బాధాకరమైన విషయమని చెప్పారు. ప్రజల పట్ల పోలీసులు సంయమనం పాటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అధిక బలప్రయోగం, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండానే సమర్థవంతంగా విధులు నిర్వహించవచ్చని స్పష్టంచేశారు. వీధిలో విజిల్, లాఠీతో కనిపించే పోలీసు అధికారిని ప్రభుత్వ అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయించే వ్యక్తిగా చాలామంది సామాన్యులు భావిస్తుంటారని పేర్కొన్నారు. తమకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు వారు పోలీసుల సహాయం కోరుతారని చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ తమ విశ్వసనీయతను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని ఉద్ఘాటించారు. అధికారులే చట్టాన్ని ఉల్లంఘించేవారిగా మారితే.. దేశంలో కస్టోడియల్ హింస, మరణాల కేసులు పెరుగుతుండటంపై జస్టిస్ భూయాన్ స్పందించారు. ఇలాంటివి నాగరిక సమాజంలో అత్యంత దారుణమైన నేరాలుగా అభివరి్ణంచారు. చట్టబద్ధమైన పాలన సాగే సమాజంలో కస్టడీ మరణం అనేది అత్యంత దారుణమైన నేరాల్లో ఒకటి అని స్పష్టంచేశారు. విచారణ, ప్రశ్నించడం లేదా మరే ఇతర సందర్భంలోనైనా జరిగే హింస, క్రూరమైన, అమానుషమైన, అవమానకరమైన ప్రవర్తన ఏదైనా ఆర్టీకల్ 29 పరిధిలోకి వస్తుందని వివరించారు. ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించేవారిగా మారినప్పుడు అది చట్టరాహిత్యాన్ని ప్రోత్సహించవచ్చని నొక్కిచెప్పారు. ఏ నాగరిక దేశమూ దీనిని అనుమతించదని ఉద్ఘాటించారు. ఒక పోలీసు అధికారి అరెస్టు చేసినంత మాత్రాన పౌరుడు తన ప్రాథమిక హక్కులను కోల్పోతాడా? అని ప్రశ్నించారు. అలాగే అరెస్టు సమయంలో జీవించే హక్కును తాత్కాలికంగా నిలిపివేయవచ్చా? అనే ఒక మౌలిక ప్రశ్నను న్యాయస్థానం లేవనెత్తిందని పేర్కొన్నారు. దీనికి సమాధానం కచ్చితంగా ‘కాదు’ అనేదే కావాలని తేలి్చచెప్పారు. అరెస్టు, విచారణకు సంబంధించి డి.కె.బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో ఇచ్చిన తీర్పులో అనేక నిర్దేశాలను నిర్దేశించిందని అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు గురైన బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరాన్ని కూడా న్యాయస్థానం గుర్తించిందని జస్టిస్ భూయాన్ వివరించారు. న్యాయపరమైన ప్రక్రియకు వెలుపల జరిగే హత్యలు లేదా నకిలీ ఎన్కౌంటర్లను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందని తెలియజేశారు. ఎన్కౌంటర్ అనేది నేరపూరిత విధానమని, అది పోలీసింగ్‌లో భాగం కాకూడదని అభిప్రాయపడ్డారు. పోలీసు సంస్కరణల ఆవశ్యకతను ప్రస్తావించారు. అలాగే పోలీసుల పనితీరులో రాజకీయ జోక్యం వల్ల కలిగే ప్రమాదాల గురించి మాట్లాడారు. -
గుంటూరు బాలిక ఆచూకీ కనిపెట్టిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: దాదాపు మూడు నెలల కిందట మాయమైన బాలిక ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదని చెబుతున్న పోలీసులు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం, హెచ్చరికల నేపథ్యంలో బాలికను, ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ హరియాణా రాష్ట్రం కర్నాల్ నగరంలోని ఓ లాడ్జిలో ఉండగా సిట్ బృందం అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. వారిద్దరినీ గుంటూరు తీసుకువస్తున్నారు. మూడు నెలలుగా ఆచూకీ కనిపెట్టలేకపోయిన పోలీసులు.. సోమవారానికల్లా బాలిక ఆచూకీ కనిపెట్టి కోర్టులో హాజరు పరచాలని ఆదేశించిన 24 గంటల్లోనే అంత దూరంలో ఉన్న వారిని ఎలా పట్టుకోగలిగారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వదిలేయడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా, దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నిందితుడు షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బాని అలియాస్ పండు ఆమెను జూన్ 9న తీసుకెళ్లిపోయాడు. ఆ సమయంలో బాలిక ఇంటి నుంచి 200 గ్రాముల బంగారం తీసుకెళ్లింది. ఆ బంగారంలో సగం వరకు అమ్మేసిన కిడ్నాపర్ సైదా మూడు నెలలపాటు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బాలిక అశ్లీల వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని, తన వెంట రాకపోతే గ్రూపుల్లో షేర్ చేస్తానంటూ బెదిరించి బాలికను తీసుకెళ్లినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నారు. షేక్ జాన్ సైదా సెల్‌ఫోన్‌ను స్వాదీనం చేసుకుని, అందులో బాలిక వీడియోలు, ఫొటోలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, పూర్తి విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు చెబుతున్నారు. కిడ్నాపర్‌కు ఎవరెవరు సహకరించారనేది విచారణలో తేలుతుందని, దాన్ని బట్టి వారిపైనా కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేదు? బాలిక కనిపించడం లేదంటూ ఆమె తండ్రి జూన్ 10న ఫిర్యాదు చేసినా గుంటూరు పట్టాభిపురం పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అన్ని ఆధారాలు ఇచ్చినా, వారి ఖర్చులు భరించినా కాలం వెళ్లదీశారు. పైగా షేక్ సైదా చేతనైతే పట్టుకోవాలని పోలీసులకు సవాలు కూడా విసిరాడు. అతడి గురించి సమాచారం ఉన్నా పట్టుకొని తీసుకురావడంలో పోలీసులు ఘోరంగా విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరకు బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గురువారం పోలీసులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారానికల్లా బాలిక ఆచూకీ కనిపెట్టి, హాజరుపరచాలని గట్టిగా హెచ్చరించడంతో దిగివచ్చిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులకు అధికారపార్టీ నేతలు, ఉన్నతాధికారుల అండ? బాలిక కిడ్నాప్ కేసును ఛేదించడంలో మూడు నెలలుగా నిర్లక్ష్యం వహించిన పట్టాభిపురం పోలీసులపై చర్యలు తీసుకుంటారా లేక వదిలేస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాలిక కిడ్నాప్‌పై స్పందించకపోవడం వెనుక పెద్ద తలకాయలే ఉంటాయన్న అనుమానాలున్నాయి. బాలిక తండ్రి పోలీసుల చుట్టూ తిరుగుతూ.. వారికి స్వయంగా కార్లు, ఫ్లైట్ టికెట్లు పెట్టి సహకరిస్తున్నా నిందితుడిని పట్టుకోకపోవడం వెనుక పెద్ద వ్యక్తులు ఉంటారని తేటతెల్లమవుతోంది. పట్టాభిపురం పోలీసులపై చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నేతలు, కొందరు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత
-
బావ హత్యకు బావమరిదే సూత్రధారి
గుంటూరు: కిడ్నాప్‌నకు గురైన పాలిష్ వ్యాపారి హత్య కేసులో బావమరిదే ప్రధాన సూత్రధారి అని తేలింది. కేసును తెనాలి రూరల్ పోలీసులు ఛేదించారు. బావ హత్యకు సుపారి ఇచ్చిన బావమరిదిని, కిరాయి ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... తెనాలికి చెందిన చుక్క కోటినాగవీరయ్య (53) అలియాస్ నాగ మహేష్ పాలిష్ వ్యాపారం చేసేవాడు. అతనికి 2006లో విజయవాడ వాసి సంధ్యారాణితో పెళ్లై, ఇద్దరు పిల్లలు. అతనికి 35 ఏళ్ల అట్టలూరి దీప్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రెండేళ్లుగా సరిగా ఇంటికెళ్లడం లేదు. తెనాలి నందులపేటలో దీప్తితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గత నెల 29న అతను సాయంత్రం ఇంటి నుంచి వెళ్లగా, ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో దీప్తి వెతుకుంటూ 30న ఆటోనగర్ వెళ్తుండగా సోమసుందరపాలెం శివారులో స్కూటీ, చెప్పులు కనిపించాయి. దీనిపై తెనాలి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అతడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో గాలించారు. విచారణలో విజయవాడ రాజీవ్‌నగర్‌లో ఉంటున్న నాగమహేష్ బావమరిది పగడాల రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. బావ హత్యకు బావమరిది కీలక సూత్రధారి అని గుర్తించామని చెప్పారు. బుధవారం రాత్రి రాజేష్‌ను, బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరుకి చెందిన కొమరబత్తిని సందీప్, బుస్సా సంజయ్, కొప్పుల అపర్ణ అలియాస్ బుజ్జి, దేవరకొండ మారుతీవరప్రసాద్ అలియాస్ మారుతీని అరెస్ట్ చేశామన్నారు. ఇసుక క్వారీ వద్ద మృతదేహం నాగమహేష్ దీప్తితో సహజీవనం చేస్తూ, ఆస్తి మొత్తం ఆమెకు రాసిస్తాడని రాజేష్ కక్ష పెంచుకున్నాడు. ఆస్తిని తన సోదరి, ఆమె పిల్లల పేరిట రాయకపోవడంతో బావ హత్యకు పథకం రూపొందించాడు. సందీప్‌కు రూ.4 లక్షల సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సందీప్ తన అనుచరులతో తెనాలిలోని ఓ హోటల్లో పది రోజులు బస చేసి, నాగమహేష్ కదలికలపై రెక్కీ నిర్వహించాడు. గత నెల 29న సోమసుందరపాలెం వద్ద బైక్‌పై వెళ్తున్న అతన్ని గుంటూరు నుంచి అద్దెకు తెచ్చిన కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లారు. తేలప్రోలు, అత్తోట, తుములూరు మీదుగా కరకట్టపై రేపల్లె వైపు వెళ్తూ కారులోనే గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. గురువారం ఓలేరు ఇసుక క్వారీ వద్ద మతదేహాన్ని గుర్తించారు. భట్టిప్రోలు తహసీల్దార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసును ఛేదించిన తెనాలి డీఎస్పీ జనార్దన్, తెనాలి గ్రామీణ సర్కిల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్, కొల్లిపర పీఎస్ ఎస్ఐ ప్రసాద్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. చదవండి: ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ -
‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’
సాక్షిప్రతినిధి, గుంటూరు: తమ చిన్నారిని రక్షించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ తండ్రి మూడు నెలలుగా అధికారులు, అధికారపార్టీ నాయకులు అందరి చుట్టూ కాళ్లరిగేలా తిరిగి కూతురి ఆచూకీ కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన సంఘటన అందరికీ తెలిసిందే. ప్రజల మాన, ధన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు ఆ బాధ్యతను మరిచిపోయి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం, సోషల్ మీడియా పోస్టులు పెట్టినవారిపై అత్యుత్సాహం చూపి అరెస్టు చేయడం వంటి వాటికి పరిమితమై పోయారు. లా అండ్ ఆర్డర్ గాలికొదిలేశారు. రక్షక భటులే భక్షకులుగా మారి జనాన్ని పీక్కుతింటూ పోలీసు శాఖ ప్రతిష్టను కొందరు అవినీతి ఖాకీలు దిగజారస్తున్నారు. గుంటూరు నగరంలో జరిగిన సంఘటనపై హైకోర్టు సీరియస్‌గా స్పందించి పోలీసులను చీవాట్లు పెట్టడంతో ఇప్పుడు హడావుడిగా సిట్ ఏర్పాటు చేసి వెతుకులాట ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... మూడు నెలలు దాటుతున్నా ఆచూకీ లేదు గుంటూరు నగరానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక జూన్ 9వ తేదీన ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి అదే రోజు సాయంత్రం నగరంలోని పట్టాభిపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు అనగా జూన్ 10వ తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికను గంజాయి తాగే ఓ యువకుడు (22 ఏళ్లు) కిడ్నాప్ చేశాడనే విషయం బయట పడడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కిడ్నాపర్ నెల్లూరు మొబైల్ షాపులో మొబైల్ కొన్నట్లు సీసీ çటీవీ ఫుటేజీలో గమనించిన తండ్రి అతని మొబైల్ ఈఎంఐ నంబరుతో సహా పోలీసులకు అందించారు. అదే నెల 18వ తేదీన ఫోన్ ఆన్ చేసినట్లుగా పోలీసులు చెప్పడంతో తండ్రి కార్లు ఏర్పాటు చేసి ఓ ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లను తీసుకుని హుటాహుటిన కోయంబత్తూరు వెళ్లారు. 13 నుంచి 18వ తేదీ వరకు కోయంబత్తూరులోని లాడ్జిల్లో వారు బస చేసినట్లు ఆధారాలు కూడా దొరికాయి. అనంతరం కోయంబత్తూరు రైల్వేస్టేషన్లో తండ్రే ఆరీ్పఎఫ్ పోలీసులను కలిసి రైల్వేస్టేషన్ పుటేజీ పరిశీలించగా సికింద్రాబాద్ రైలు ఎక్కినట్లు గుర్తించారు. దీంతో కారుల్లో వెళితే ఆలస్యమవుతోందని భావించిన తండ్రి ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లకు తానే విమాన టికెట్లు కొనుగోలు చేసి సికింద్రాబాద్‌కు వచ్చారు. అక్కడ కిడ్నాపర్ మేనత్తను పట్టుకుని ప్రశ్నించగా, తన ఇంటికి వచ్చివెళ్లినట్లు అంగీకరించింది. ఆ తరువాత సెల్ స్విచ్ ఆఫ్ చేసిన నిందితుడు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడో బాలికను ఎక్కడ దాచాడో తెలియని పరిస్థితి. మిస్సింగ్ కేసు నమోదు చేసి వదిలేశారు.. మైనర్ బాలికను గంజాయి తాగుతూ కత్తి పెట్టుకుని తిరిగే ఓ జులాయి కిడ్నాప్ చేశాడని జూన్ నెల 11వ తేదీన పోలీసులకు తెలిసినప్పటికీ మిస్సింగ్ కేసుగానే ఉంచి దర్యాప్తు చేశారే తప్ప, కనీసం కిడ్నాప్, పోక్సో చట్టం కింద సెక్షన్లు మార్పు చేయని పరిస్థితి. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన నిందితుడు షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అలియాస్ పండుగా పోలీసులు గుర్తించారు. అతనికి ఇన్‌స్ర్ట్రాగామ్‌లో 300 నుంచి 400 మంది వరకు కాంటాక్ట్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరిని పిలిచి విచారించిన పోలీసులు ఆతరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో చేతులెత్తేశారు. పోలీసులు, బాలిక తండ్రి, వారి బంధువులు కోయంబత్తూరు, పాల్గాడ్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో లాడ్జిల్లో వెతికారు. అయితే వీరి ఆచూకీ ముందుగానే ఎలా తెలుసుకున్నాడో తెలియదు గాని నిందితుడు వీరు అక్కడికి చేరుకునే రోజు లాడ్జిలు ఖాళీచేసి వెళ్లిపోతున్నాడు. అయితే పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడడం, ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఏం చేయాలో తెలియక హడావుడిగా గురువారం కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసు మార్పు చేసి హైకోర్టుకు నివేదించేందుకు నానా తంటాలు పడ్డారు. ‘ఫోన్ ఆన్ చేస్తే తప్ప ఏం చేయలేమంటూ..’జూన్ 21వ తేదీన సికింద్రాబాద్‌లో వెతికిన పోలీసులు ఇక ఆ తరువాత నిందితుడి ఫోన్ ఆన్ చేస్తే తప్ప, తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రాలు దాటి వెళ్లి అమాయకులను అర్ధరాత్రి పూట ఎత్తుకొస్తున్న పోలీసులకు ఓ మైనర్ బాలిక కిడ్నాప్ అయి మూడు నెలలు దాటుతున్నా చలనం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అప్పటి నుంచి మూడు నెలలుగా పోలీసు అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగి విసిగిపోయిన బాలిక తండ్రి చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో పోలీసులపై హైకోర్టు సీరియస్ అయిన విషయం అందరికి తెలిసిందే. బాలిక ఇంటి నుంచి వెళుతూ లక్ష రూపాయల నగదు, బంగారం తీసుకెళ్లినట్లు సమాచారం.పోలీసులకు సవాల్ విసిరిన కిడ్నాపర్ పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకున్న నిందితుడు సికింద్రాబాద్‌లో ఉండే తన మేనత్త ఫోన్ నుంచి జూలై 13వ తేదీన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. అయినా పోలీసుల్లో చలనం లేకపోవడం దారుణమైన విషయం. చదవండి: బావ హత్యకు బావమరిదే సూత్రధారి -
రోడ్డుపై ఈము.. పోలీస్ పరుగులు! చివరికి ఏం జరిగిందంటే?
అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అటువంటిదే ఈ ఘటన కూడా. రోడ్డుపైకి వచ్చిన ఓ భారీ ఈము పక్షి.. ఓ పోలీస్ అధికారిని పరుగులు పెట్టించింది. ఈమును పట్టుకునేందుకు అధికారి చేసిన ప్రయత్నం కాసేపు సరదా ఛేజింగ్‌గా మారింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో నాష్డేల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈము పక్షి రోడ్డుపైకి వచ్చి అటూ ఇటూ సంచరించడంతో వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సమాచారం అందుకున్న ఓ యువ పోలీస్ అధికారి అక్కడికి చేరుకున్నాడు. రోడ్డుపై నుంచి ఈమును పక్కకు పంపించేందుకు ప్రయత్నించగా.. అది ఆ అధికారిని పరుగులు పెట్టించింది. అధికారి ఎంత వేగంగా పరుగెత్తినా ఈము ఏమాత్రం దొరకకుండా ఉరకలు తీసింది. దీంతో అక్కడ కొద్దిసేపు సరదా ఛేజింగ్ కనిపించింది. ఎట్టకేలకు అధికారి ఆ పక్షిని రోడ్డుకు దూరంగా పంపించడంలో విజయవంతమయ్యాడు.అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ‘క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్’ అని పేర్కొంటూ పోస్ట్ చేశారు. రోడ్డుపై ఈము ఉండటం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డుపైకి వచ్చిన పశువులు, కంగారూలను పోలీసులు తరలిస్తుంటారు. అయితే ఈము కోసం ట్రాఫిక్ నిర్వహించాల్సి రావడం మాత్రం అరుదైన అనుభవమని అధికారులు పేర్కొన్నారు.ఈ వీడియోకు దాదాపు 90 వేల వ్యూస్ రావడంతో నెటిజన్లు కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘అది తిరిగి పోలీస్‌ను వెంటాడితే అసలు వేగం తెలుస్తుంది’ అంటూ కొందరు సరదాగా స్పందించారు. మరికొందరు ఈ ఘటనను 1932లో ఆస్ట్రేలియాలో జరిగిన ‘ఈము వార్’తో పోల్చారు. అప్పట్లో పంటలను నాశనం చేస్తున్న ఈములను నియంత్రించేందుకు సైన్యం చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించకపోవడంతో ఆ ఘటన చరిత్రలో నిలిచిపోయిందని గుర్తుచేసుకున్నారు.అయితే, ఈ ఘటన సరదాగా కనిపించినప్పటికీ రోడ్డుపైకి వచ్చే పెద్ద జంతువులు వాహనదారులకు ప్రమాదకరంగా మారవచ్చు. అలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లు వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ఉండాలి. పక్షులను, జంతువులను భయపెట్టకుండా దూరంగా వెళ్లి, అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిదని మరికొందరు వారి వారి అభిప్రాయాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. View this post on Instagram A post shared by ABC News (@abcnews) ఇవి కూడా చదవండి: సన్యాసం కోసం..రూ. 47 కోట్ల కంపెనీ అమ్మకానికి! -
ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
ప్రాజెక్ట్ సంజీవని.. 15 బ్రీత్ అనలైజర్ల అందజేత
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత పటిష్టం చేసేందుకు కీలక అడుగు పడింది. 'సేవ్‌లైఫ్ ఫౌండేషన్' (SLF) హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు 15 అత్యాధునిక బ్రీత్ అనలైజర్లను అందజేసింది. 'వర్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్' మద్దతుతో నడుస్తున్న 'ప్రాజెక్ట్ సంజీవని'లో భాగంగా ఈ పరికరాలను పంపిణీ చేసినట్లు తెలిపింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ (IPS) డి. జోయల్ డేవిస్, వర్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.వి.ఎమ్. కిరణ్ బాబు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ హ్యాండోవర్ 'ప్రాజెక్ట్ సంజీవని'లో ఒక భాగం. ఇది దేశంలోనే మొదటి పూర్తి స్థాయి రోడ్డు ప్రమాదాల తక్షణ వైద్య సహాయం హైవే రెస్క్యూ ప్రోటోకాల్. తెలంగాణ ప్రభుత్వం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు ఉన్న 251 కిలోమీటర్ల 'NH-44' కారిడార్‌లో దీనిని నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సేవలు అందించేందుకు 2026 ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఇప్పుడు అందిన సరికొత్త బ్రీత్ అనలైజర్ల ద్వారా ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అడ్డుకునేందుకు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను వేగంగా నిర్వహించేందుకు ట్రాఫిక్ పోలీసులకు వీలవుతుంది.మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల దేశవ్యాప్తంగా 2024లోనే 3,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ కొత్త పరికరాల వల్ల స్పాట్లోనే వేగంగా, స్పష్టమైన ఆధారాలతో డ్రైవర్లను పరీక్షించే వీలుంటుంది. దీనివల్ల నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులువవుతుంది. ఈ ప్రాజెక్ట్‌ను తెలంగాణలోని ఇతర జాతీయ రహదారులతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ (IPS) డి. జోయల్ డేవిస్ మాట్లాడుతూ, నగరంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి మరియు ప్రజల ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ పోలీస్ విభాగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. రోడ్డుపై తమ అధికారులు ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి అని, దీనిపై కఠినమైన నిఘా ఉంచడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. 'ప్రాజెక్ట్ సంజీవని' కింద అందిన ఈ బ్రీత్ అనలైజర్లు తమ అధికారుల సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిని వేగంగా, కచ్చితత్వంతో పట్టుకోవడానికి ఇవి సహాయపడతాయని తెలిపారు. తమకు మద్దతుగా నిలిచిన సేవ్‌లైఫ్ ఫౌండేషన్ మరియు వర్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయిపై కేసు
హైదరాబాద్: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయనపై డ్యాన్సర్ రమావత్ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేయటంతో ఆగస్టు 22న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈశ్వర్‌సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ‘బాసింగ బలాలే’ జానపద నృత్యంలో నటించి ఈశ్వర్‌సాయి పాపులర్ అయ్యారు. ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల బాహాబాహీ
సాక్షి యాదాద్రి: భువనగిరి జిల్లా కేంద్రంలోనూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పరం కార్యాలయాలపై దాడులకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ముందుగా బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం ఉదయం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్‌రెడ్డిల ఫ్లెక్సీలు, నేమ్ బోర్డులపై పెట్రోల్, డీజిల్, ఆయిల్‌తో పాటు కాషాయ రంగును చల్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేవైఎం దాడికి నిరసనగా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు భువనగిరి పట్టణ పరిధిలోని నల్లగొండ బైపాస్ రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో రెండు పార్టీల నాయకులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్–బీజేపీ శ్రేణులు ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ రాళ్లదాడిలో ఇరువర్గాల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.రాష్ట్ర బీజేపీకి అండగా ఉంటాం: నితిన్నబీన్ తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయన్న వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబీన్ ఆరా తీశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావుకు ఫోన్ చేసిన నబీన్ ఈ రెండు రోజుల్లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీకి, నేతలకు జాతీయ పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని రాంచందర్‌రావుకు నితిన్నబీన్ భరోసా ఇచ్చారు. ⇒ ‘ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? దాడులు చేసే వారిని కాపాడుతూ పరామర్శకు వెళ్లే వారిని అరెస్ట్ చేయడమేంటీ?’అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.⇒ ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన..వెయ్యి మోసాల దగా కోరు పాలన. ఇది ప్రజా పాలన కాదు. చేతల్లో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన’అని బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్ విమర్శించారు. ⇒ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. డీజీపీని కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం బీజేపీ కార్యాలయాలు, నాయకులపై జరిగిన దాడులపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి బీజేఎల్పీ ఉపనేత పాయల్‌శంకర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. యూత్ కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు బీజేపీ ఆఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన సంత్ శిరోమణి రవిదాస్ చిత్రపటాల పోస్టర్లపై నల్లరంగు పూసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెట్టాలని అబిడ్స్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ ఫిర్యాదు చేశారు.ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్టులు సాక్షి, నెట్వర్క్: బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా మంగళవారం ట్యాంక్‌బండ్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్‌గౌడ్‌లను అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ⇒ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావును మంగళవారం పోలీసులు తార్నాకలోని ఆయన నివాసం వద్ద అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డిని పరామర్శించేందుకు వెళుతుండగా, రాంచందర్‌రావును అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ రాంచందర్‌రావును అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
సాగునీళ్లడిగితే 'పోలీసు జులుం'
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్సార్బీసీ తదితర ప్రాజెక్టులకు సాగునీరు విడుదల చేసి కరువు ప్రాంతాల రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి వెలుగోడుకు బయలుదేరిన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. మంగళవారం వేకువజామునుంచే వెలుగోడు రిజర్వాయర్‌కు వెళ్లే దారిలో ఆత్మకూరు, కరివేన, వైఎస్సార్ స్మృతివనం, మోత్కూరు, బండి ఆత్మకూరు ప్రధాన రహదారితోపాటు గ్రామాల నుంచి వెలుగోడు వెళ్లే దారుల్లోనూ బారికేడ్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడుగడుగునా పోలీసులను మోహరించారు. వెలుగోడుకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై వస్తారని తెలుసుకున్న పోలీసులు సోమవారం రాత్రి గ్రామాలకు వెళ్లి ధర్నాకు వచ్చే వారందరిపైనా కేసులు పెడతామని, ప్రతి ఎడ్లబండికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని బెదిరించారు. అయినా ఖాతరు చేయని వైఎస్సార్సీపీ శ్రేణులు వెలుగోడు ముట్టడి కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు. వేల్పనూరు వద్ద కాటసాని అడ్డగింపు మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బనగానపల్లి సమన్వయకర్త కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త ధారా సు«దీర్, వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కర్నూలు మాజీ మేయర్ బీవై రామయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి తదితర నేతలను వెలుగోడు సమీపంలోని వేల్పూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిసి పాదయాత్రగా బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నేతలంతా పాదయాత్రగా వెలుగోడుకు చేరుకున్నారు. దారి పొడవునా పలుమార్లు పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న ప్రతిసారి వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల ఆంక్షల నడుమ వెలుగోడు గ్రామానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చంద్రబాబు డౌన్ డౌన్, శ్రీశైలం నుంచి తక్షణం సాగునీరు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. నీళ్లివ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ నీటి చౌర్యాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.బండి ఆత్మకూరులో శిల్పా నిర్బంధం మరోవైపు పార్టీ శ్రేణులతో కలిసి వెలుగోడుకు వస్తున్న శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల సమన్వయకర్త శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డిని పోలీసులు బండి ఆత్మకూరులో అడ్డుకున్నారు. దీంతో వారు పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి అక్కడే బైఠాయించి రెండు గంటలపాటు నిరసనకు దిగారు. వెలుగోడు దిగువన అన్ని సాగునీటి వనరులకు నీళ్లిచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆర్డీవో వెంకటశివ బండి ఆత్మకూరులో శిల్పా చక్రపాణిరెడ్డిని కలిసి మాట్లాడారు. నాలుగు రోజుల్లో నీటి విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శిల్పా చక్రపాణిరెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన విరమించారు. మరోవైపు మోటార్ బైక్‌లపై కార్యకర్తలతో కలిసి వెలుగోడు బయలుదేరిన శిల్పా రవిని మోతుకూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శిల్పా రవి, శిల్పా కిషోర్ అక్కడే ధర్నాకు దిగారు. గంటపాటు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం నియోజకవర్గంతోపాటు నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. -
పోలీసుల చిత్రహింసలకు దళిత యువకుడు బలి
తాడికొండ/గుంటూరు మెడికల్: రెడ్‌బుక్ రాజ్యాంగంలో పోలీసులు రెచ్చిపోయారు. ముగ్గురు దళిత యువకులపై దాష్టీకం ప్రదర్శించారు. ముగ్గురినీ స్టేషన్‌కు తీసుకువచ్చి విచక్షణారహితంగా కొట్టారు. పోలీసుల దెబ్బలు తాళలేక చలిజ్వరంతో బాధపడుతున్న యువకుడు ఒకరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా.. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో టీడీపీ నాయకుల ఫిర్యాదుతో అదే గ్రామానికి చెందిన చీకటి గోపీ (30), చిత్తజడ్ల గోపీ, నూతక్కి శాంతిరాజును గత నెల 26వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరిని రెండు రోజులపాటు విచక్షణా రహితంగా కొట్టడంతో చీకటి గోపీ స్పృహతప్పి పడిపోయాడు. ఆగస్టు 28వ తేదీన కుటుంబ సభ్యులను పిలిపించి గోపీని అప్పగించిన పోలీసులు మళ్లీ తాము పిలిచినపుడు రావాలని హెచ్చరించి పంపారు. తనకు జ్వరంగా ఉందని కొట్టవద్దని వేడుకున్నా పోలీసులు కనికరించలేదని ఆవేదన చెందుతున్న గోపీని కుటుంబసభ్యులు తొలుత పొన్నెకల్లు పీహెచ్‌సీకి, తరువాత తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ప్లేట్లెట్స్ పడిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఉన్నట్టు ఉండి ఆగస్టు 30న కాళ్లు చచ్చుబడిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో గోపీని గుంటూరు పెద్దాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు మృతి చెందాడు. ఆటో డ్రైవర్ అయిన గోపీకి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తల్లి, అన్నతో కలిసి నివసిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్ ఎదుట ఆందోళన పోలీసు స్టేషన్‌కు వెళ్లిన వ్యక్తి ఆస్పత్రిలో శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. పోలీసుల కారణంగానే తమ బిడ్డ మృతి చెందాడంటూ గుంటూరు జీజీహెచ్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రి గేటు ఎదుట ఉంచి పోలీసులపై కేసు నమోదు చేసే వరకు పోస్టుమార్టం చేయవద్దని అడ్డం తిరిగారు. దాంతో మంగళవారం రాత్రి వరకు మృతదేహానికి పోస్టుమార్టం జరగని పరిస్థితి నెలకొంది. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి సోదరుడు సతీష్ డిమాండ్ చేశారు. నా భర్త మృతికి పోలీసులే కారణంతాడికొండ పోలీస్‌స్టేషన్‌లో తన భర్తను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా కొట్టి ఆయన మరణానికి కారకులయ్యారని పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి భార్య జ్యోతి మంగళవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు తాడికొండ పోలీస్‌స్టేషన్‌లోని సీసీ కెమేరాల పుటేజీలు భద్రపరిచి, విచారణ చేపట్టాలని కోరారు. తన భర్తకు వచ్చిన ఫోన్ కాల్స్, ఆస్పత్రి రికార్డులు, పోస్టుమార్టం రిపోర్టు, స్కానింగ్, ఇతర నివేదికలు పరిశీలించి నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి తన భర్త మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన భర్త మృతికి కారకులపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సీఐ, ఎస్ఐలతో పాటు, విధుల్లో ఉన్న సిబ్బందిపైనా కేసు నమోదు చేయాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పేపర్ లీకేజీ కేసులో..అడ్డంగా దొరికిన ఏడో ర్యాంకర్
ముంబై: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) డ్రగ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సంచలనం వెలుగుచూసింది. ఈ కేసులో తాత్కాలిక మెరిట్ జాబితాలో ఏడో ర్యాంకు సాధించిన రుతుజా పాటిల్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నందుర్బార్లో అరెస్ట్ చేశారు. దీంతో ఈ కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకి చేరింది.పరీక్షకు ముందే రుతుజా పాటిల్‌కు లీకైన ప్రశ్నపత్రం అందిందని పోలీసులు తెలిపారు. అయితే, అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలనే ప్లాన్‌తో.. కావాలనే 10 ప్రశ్నలకు తప్పు సమాధానాలు రాయాలని నిందితులు ఆమెకు సలహా ఇచ్చినట్లు విచారణలో తేలింది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం రుతుజాను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.మార్చి 22న మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు డివిజనల్ కేంద్రాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ స్క్రీనింగ్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో జరిగింది. జూన్ 12న వెలువడిన ఫలితాల్లో 506 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా, జూలైలో ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. అయితే, పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ జూలై 22 నుంచి 26 మధ్య అభ్యర్థులు, ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. లీకైన ప్రశ్నపత్రాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సర్క్యులేట్ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.దీంతో అప్రమత్తమైన ఎంపీఎస్సీ మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, పారదర్శకత కోసం త్వరలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.ఈ పేపర్ లీక్ కుంభకోణంలో ఇప్పటికే ముగ్గురు ఎంపీఎస్సీ అధికారులతో పాటు మొత్తం ఆరుగురిని క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. విశ్వేశ్వర్ దత్తాత్రేయ నకాతే (ఎంపీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్),గోపాల్ భట్టు మరాఠే (ఎంపీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్) అభిజీత్ గణపత్రావ్ లెంద్వే (ఎంపీఎస్సీ అండర్ సెక్రటరీ),ప్రవీణ్ దిలీప్ పాటిల్ (కౌటిల్య అకాడమీ డైరెక్టర్),అమృత్ నామ్‌దేవ్ పాటిల్, లోకేష్ అలియాస్ గౌరవ్ రాజేంద్ర పాటిల్ (సహ నిందితులు),నిందితులంతా కలిసి పరీక్షకు ముందే ప్రశ్నలను సేకరించి, ప్రత్యేక సెట్‌గా తయారు చేసి అనధికార వ్యక్తులకు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వరదల్లో బ్యాంకు లాకర్లు.. కోట్ల నగదు, బంగారం?
ఖాట్మండు:నేపాల్ వరదలు సృష్టించిన బీభత్సం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అకస్మాత్తుగా వచ్చిన వరదలు తీవ్రమైన ప్రాణనష్టం కలిగించడంతో పాటు పెద్దఎత్తున ఆస్తినష్టం కలిగించాయి. మృతుల సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నేపాల్ పోలీసులకు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. భారీస్థాయిలో వచ్చిన వరదలకు పెద్దఎత్తున లాకర్లు నీటి ప్రవాహాంలో కొట్టుకుపోవడంతో వాటి కోసం ఇప్పుడు తీవ్ర స్థాయిలో గాలింపులు చేపడుతున్నారు. వరద ప్రవాహంలో దాదాపు 20 బ్యాంకులకు చెందిన లాకర్లు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. వాటిని సురక్షితంగా స్వాధీనం చేసుకోవడం, అవి దుండగుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటం పోలీసులకు మరో పెద్ద బాధ్యతగా మారిందని తెలిపారు. ఈ వాల్ట్‌లలో కొన్ని భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ వివరాలపై డీఐజీ అబి నారాయణ్ కాఫ్లే మాట్లాడుతూ, వరదల అనంతరం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రస్తుతం పోలీసుల ప్రధాన ప్రాధాన్యత గల్లంతైన వ్యక్తుల కోసం గాలించడం, వారిని రక్షించడమేనని తెలిపారు. అదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్నారు.“రసువా, ధాదింగ్, చిత్వన్ తదితర ప్రాంతాల్లోని పలు బ్యాంకులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు ఉన్న వాటిలో చాలా వాల్ట్‌లు వరదల్లో కొట్టుకుపోయాయి. మరికొన్ని భారీగా పేరుకుపోయిన బురద కింద కూరుకుపోయాయి. మా సిబ్బంది ప్రస్తుతం ఆ వాల్ట్లను గుర్తించి, సురక్షితంగా స్వాధీనం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొట్టుకుపోయిన వాల్ట్లను కొందరు వ్యక్తులు పగులగొట్టి నగదును దొంగిలించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి” అని కాఫ్లే తెలిపారు.ఈ పరిణామాల మధ్య ధాదింగ్ జిల్లాలో పోలీసులు 29 మందిని అరెస్టు చేశారు. ఎగువ రసువా ప్రాంతంలో వరదల్లో కొట్టుకుపోయిన ఓ బ్యాంకు వాల్ట్ నుంచి NPR 92 లక్షలు (నేపాలీ రూపాయలు) దొంగిలించినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన వివరాల ప్రకారం, ఆ వాల్ట్‌లో NPR 1.5 కోట్లు నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. అందులో NPR 50 కోట్ల విలువైన బంగారం సైతం ఉన్నట్లు తెలిపారు.ఇదే సమయంలో మరో ఘటనలో ‘కృషి వికాస్ బ్యాంక్’కు చెందిన నువాకోట్ వాల్ట్‌ను పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక, రక్షణ చర్యలను మరింత ముమ్మరం చేసిన నేపాల్ పోలీసులు భారీ స్థాయిలో సిబ్బందిని రంగంలోకి దించారు. సహాయక, రక్షణ చర్యల్లో ప్రస్తుతం 7,894 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు.గల్లంతైన వారి కోసం గాలింపు, బాధితులను రక్షించడం, వరద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు వాల్ట్లను గుర్తించి వాటిలోని నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను సురక్షితంగా కాపాడటం ఇప్పుడు నేపాల్ పోలీసులకు మరో కీలక సవాల్‌గా మారింది. -
ఇంటర్నెట్ కట్.. పాక్ నుంచి మరో మీమ్ వైరల్
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో.. వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే కొత్తదనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊహించని పరిణామాలు తప్పవు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన అందుకు ఓ ఉదాహరణ.పాకిస్తాన్లో టెక్నాలజీ ప్రయోగం కాస్తా.. పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టే ఘటనగా మారింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కసారిగా తెగిపోవడంతో రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న ఓ ఆటోమేటిక్ కారు అదుపు తప్పి నేరుగా పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయి నవ్వులు పూయిస్తోంది.ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి జర్నలిస్టు మహ్మద్ ఆలిజా కారులో ముందు సీట్లో కూర్చొని దాని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. అబ్బొట్టాబాద్కు చెందిన టెక్నాలజీ ఔత్సాహికుడు ఇహ్సాన్ జాఫర్ రూపొందించిన ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై రిపోర్టు చేసేందుకు తాను అక్కడికి వెళ్లినట్లు ఆలిజా వెల్లడించారు.కారు ముందుకు కదులుతుండగా.. ఒక్కసారిగా రిమోట్ ద్వారా నియంత్రించే స్టీరింగ్ స్పందించడం ఆపేసింది. పరిస్థితిని గమనించిన ఆలిజా వెంటనే హ్యాండ్‌బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు వేగంగా ముందుకు దూసుకెళ్లి అక్కడే ఉన్న పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది.కనెక్షన్ కట్.. కారు కంట్రోల్ ఔట్!ఈ కారును ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్ల సాయంతో రిమోట్‌గా నియంత్రిస్తున్నట్లు ఆలిజా తెలిపారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోవడంతో కారు నియంత్రణ కోల్పోయిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే కారు రద్దీగా ఉండే రోడ్డుపై అదుపు తప్పి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని ఆలిజా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎలా స్పందించారో అనేది మాత్రం ఆయన వివరించలేదు.A Pakistani innovator was demonstrating a driverless car he developed when it lost control and crashed directly into a police vehicle in Islamabad.The car is remotely controlled over the internet through an app or computer.Source: ProPakistani, Khabrain News pic.twitter.com/bUVuesS4cH— Planet Report HQ (@PlanetReportHQ) August 31, 2026ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం వెనుక టెక్నాలజీని రూపొందించిన యువకుడిని విమర్శించడం తన ఉద్దేశం కాదని ఆలిజా స్పష్టం చేశారు. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, ప్రయోగాలు చేయడం అవసరమేనని.. అయితే వాటిని ప్రజల్లోకి తీసుకురాకముందు పూర్తిస్థాయిలో పరీక్షించి భద్రతను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్లపై ఆధారపడే రిమోట్ డ్రైవింగ్ వ్యవస్థల్లో కనెక్షన్ తెగిపోయినప్పుడు వాహనాన్ని సురక్షితంగా నిలిపే ప్రత్యామ్నాయ వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలని ఈ ఘటన స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు.పాక్ నుంచి మరో మీమ్!ఈ తరహా ఘటనలను నెట్టింట ఎలా ట్రోలింగ్ చేస్తారో తెలియంది కాదు. గతంలో పాక్ నుంచి ఎన్నో ఇలాంటివి మీమ్స్ రూపంలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు పాక్ టెక్నాలజీ నాసిరకంగా ఉంటుందని ఎద్దేవా చేస్తుండగా.. మరికొందరు ఈ ఘటనను సరదాగా తీసుకుని మీమ్స్ చేస్తున్నారు. “పోలీసులను చూడగానే పాకిస్థాన్‌లో ఏఐ కూడా కంగారుపడుతుంది” అంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. మొత్తంగా.. ఇంటర్నెట్ కనెక్షన్ పోవడంతో పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టిన ఈ రిమోట్ కారు వీడియో పాకిస్థాన్‌లో నవ్వులు పూయిస్తోంది.ఇదీ చదవండి: నేపాల్ వరదలకు ఆమె కన్నీరే కారణమా? -
ఇంత దౌర్జన్యమా?.. పుష్పశ్రీవాణి కన్నీళ్లు
సాక్షి, విశాఖపట్నం: మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారు. గిరిజన మహిళ అని కూడా చూడకుండా చీర లాగి అనుచితంగా ప్రవర్తించారు. గిరిజన విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై మాజీ డిప్యూటీ సీఎం కన్నీరు పెట్టుకున్నారు.విశాఖ జిల్లా మారికవలస గురుకులం దగ్గర ఆందోళన కొనసాగుతోంది. తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రులు పుష్పశ్రీవాణి, బాలరాజు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పుష్పశ్రీవాణి, బాలరాజును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శ్రీవాణి అరెస్టు సమయంలో మాజీ డిప్యూటీ సీఎం అనే గౌరవం లేకుండా పోలీసులు వ్యవహరించారు. వాహనం ఎక్కించే సమయంలో పోలీసులు.. చీర పట్టుకొని లాగారు. పోలీసులు తీరుపై పుష్పశ్రీవాణి మండిపడ్డారు. మర్యాద లేకుండా వ్యవహరించవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పుష్ప శ్రీవాణి, బాలరాజు అరెస్ట్హాస్టల్ తరలింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని గిరిజన హాస్టల్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు వైఎస్సార్సీపీ నేతల మద్దతు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నేతలు కుంభా రవిబాబు, శోభా స్వాతి రోడ్డుపై బైఠాయించారు. గిరిజన హాస్టల్‌కు వచ్చే అన్ని మార్గాలో పోలీసులు బారికేడ్లు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు.మద్దతు తెలిపేందుకు వస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. మారికవలస గురుకుల పాఠశాల వెళ్తుండగా పోలీసులు అడ్డుకుంటున్నారు. మారికవలస హైవేపై పుష్ప శ్రీవాణి, బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అరకు ఎమ్మెల్యే మత్స్యలింగాన్ని కూడా అరెస్ట్ చేశారు. సాలూరులో రాజన్న దొర, గాజువాకలో దేవన్రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. -
చిన్నారిపై అమానుషం కేసులో నిందితుడు ఎన్కౌంటర్!
గ్రేటర్ నోయిడా: గ్రేటర్ నోయిడాలోని హల్దోని గ్రామంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులోని ప్రధాన నిందితుడు పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. క్రైమ్ సీన్ పునర్నిర్మాణం (సీన్ రీ క్రియేషన్) చేపట్టిన సమయంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. సదరు బాలిక శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో బాలిక కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి ఎకోటెక్-3 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు శనివారం ఉదయం గ్రామ చెరువు సమీపంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. దీంతో గ్రామ ప్రధాన రహదారిపై స్థానికులు నిరసనకు దిగారు.సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసులు 40 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా, నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని డి పార్క్ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలోని పొదల్లో దాచినట్లు అతడు తెలిపాడు. పోలీసులు అతడిని అక్కడికి తీసుకెళ్లగా, దాచి ఉంచిన పిస్టల్‌తో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడగా, ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడికి బుల్లెట్ గాయాలయ్యాయి.ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించగా, నిందితుడు చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని సెంట్రల్ నోయిడా డీసీపీ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. మరో నిందితుడి ఇంట్లో బాలికపై అఘాయిత్యం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు, బాలిక బంధువు పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాలిక బాబాయ్ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 65 (అత్యాచారం), 103 (హత్య) సహా పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఉజ్బెకిస్థాన్‌లో ప్రధాని మోదీ యోగా సందడి -
2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు
-
హిందూపురంలో కాల్పుల కలకలం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో కాల్పుల కలకలం రేగింది. దొంగల ముఠాపై పోలీసులు కాల్పులు జరిపారు. దొంగల ముఠాపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల నుంచి ముఠా తప్పించుకుని పారిపోయింది. పరిగి మండలం ఊటుకూరు దగ్గర ఘటన జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం హిందూపురం పట్టణంంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.అయితే, బోలేరో వాహనంలో వెళ్తున్న దొంగల ముఠా ఆగకుండా వెళ్లిపోయారు. ఏపీ- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో రెండు గంటల పాటు పోలీసులు ఛేజ్ చేశారు. పరిగి మండలం ఊటుకూరు దగ్గర పోలీసులు కాల్పులు జరిపారు. దుండగులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ నెల 6వ తేదీన దుండగులు పోలీసు జీపును ఢీకొన్నారు. ఇప్పుడు కూడా అదే గ్యాంగ్ హిందూపురంలో సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగల ముఠా కోసం హిందూపురం పోలీసులు గాలిస్తున్నారు. -
Telangana: రాష్ట్రంలో 7.15 శాతం పెరిగిన నేరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేరాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. గత మూడేళ్లలో అన్ని రకాల నేరాల సంఖ్యలో 7.15 శాతం పెరుగుదల నమోదైనట్టు పోలీస్ గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ప్రతి లక్ష జనాభాకు నేరాల నమోదు రేటు 481.58 నుంచి 491.59కి పెరిగింది. పోలీస్‌శాఖ అధికారుల అర్ధవార్షిక క్రైం సమీక్ష సమావేశంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేరాల నమోదు..పలు రకాల నేర సరళి తదితర గణాంకాలను పోలీస్‌శాఖ వెల్లడించింది. అందులో పేర్కొన్న ప్రకారం.. తీవ్ర నేరాల్లో 10.33% తగ్గుదల తీవ్ర నేరాలు (గ్రేవ్ క్రైమ్) గత ఏడాదితో పోలిస్తే గణనీ యంగా తగ్గాయి. 2024–25లో 7,019 కేసులు నమోదు కాగా.. 2025–26 జూలై వరకు 6,294కు తగ్గాయి. ప్రధాన కమిషనరేట్లలో పరిశీలిస్తే హైదరాబాద్‌లో 1,483 నుంచి 1,094కు తగ్గింది. సైబరాబాద్‌లో 656 నుంచి 613కు, మల్కాజిగిరిలో 664 నుంచి 549కు తగ్గాయి. అయితే కొన్ని జిల్లాల్లో తీవ్ర నేరాలు పెరిగాయి. చిన్న, గిరిజన జిల్లాల్లో పెరుగుతున్న తీవ్ర నేరాలపై ప్రత్యేక దృష్టి అవసరమని గణాంకాలు సూచిస్తున్నాయి. పెరుగుతున్న సాధారణ నేరాలు రాష్ట్రంలో తీవ్ర నేరాలు తగ్గుతున్నా, సాధారణ నేరాలు (నాన్–గ్రేవ్) మాత్రం పెరుగుతున్నాయి. 2023–24లో 2,59,201గా ఉండగా, 2025–26 జూలై నాటికి 2,78,069 కేసులకు చేరాయి. కమిషనరేట్లలో పరిశీలిస్తే..ఫ్యూచర్ సిటీలో 23.70 శాతం, సైబరాబాద్‌లో 17.32 శాతం, మల్కాజిగిరిలో 13.53 శాతం పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం 2.77 శాతం తగ్గుదల కనిపించింది. ట్రాఫిక్ నేరాల్లో 9.48 శాతం పెరుగుదల రాష్ట్రంలో ట్రాఫిక్ సంబంధిత నేరాల్లో పెరుగుదల నమోదవుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023–24లో 29,130 కేసులు ఉండగా, 2025–26లో 31,891కు చేరాయి. అన్ని జిల్లాల్లో ఈ తరహా కేసులు పెరుగుతుండగా, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్‌లో మాత్రం తగ్గుదల కనిపించింది. సైబర్, ఆర్థిక నేరాల్లో ఊరట సైబర్ నేరాలు 2024–25తో పోలిస్తే 2025–26లో 13.29 శాతం తగ్గాయి. మొత్తంగా నేరాల సరళిని పరిశీలిస్తే.. తీవ్ర నేరాలు, సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల కనిపిస్తున్నా, మాదక ద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలు, సాధారణ నేరాలు, ట్రాఫిక్ నేరాల్లో పెరుగుదల నమోదైంది.నార్కోటిక్ కేసుల్లో 46.10% పెరుగుదల రాష్ట్రంలో నార్కోటిక్ కేసుల పెరుగుదల పోలీస్‌శాఖకు ప్రధాన సవాలుగా మారుతోంది. 2023–24లో 2,026 కేసులు ఉండగా.. 2025–26 జూలై నాటికి 2,960లకు చేరాయి. కమిషనరేట్లలో సైబరాబాద్‌లో 266 నుంచి 508కు చేరి 90.98 శాతం పెరుగుదల నమోదైంది. వరంగల్లోనూ మూడేళ్లలో 142.31 శాతం పెరిగాయి. జిల్లాల్లో ఆదిలాబాద్‌లో 57 నుంచి 219 వరకు కేసులు పెరిగాయి. -
నదిలో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని లాగి.. చెవిదుద్దులు చోరీ
కాఠ్మాండు: చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదల వేళ బాధితులకు సాయం చేయాల్సిందిపోయి చోరీలకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. నారాయణి నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిదుద్దులు చోరీ చేశారు. వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.వరదలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకునిలాగిన ఇద్దరు వ్యక్తులు బంగారు చెవిదుద్దులను తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ అరెస్టులు జరిగాయి. నేపాల్ పోలీసులు ఆ 41 సెకన్ల వీడియోను తమ ఖాతాలోనూ పోస్ట్ చేశారు.వీడియోలో ఆ ఇద్దరు వ్యక్తులు చెక్క పలకలు, మహిళ జుట్టు ఉపయోగించి నీటిలో నుంచి ఆమె మృతదేహాన్ని బయటకు లాగడం కనిపించింది. తర్వాత ఆమె రెండు చెవుల నుంచి చెవిదుద్దులను తీసి పక్కన పెట్టారు. ఈ ఘటన జరుగుతుండగా పలువురు చుట్టూ నిలబడి వీడియోలు చిత్రీకరించారు.తర్వాత చిత్వన్ పోలీసులు దర్యాప్తులో ఈ ఘటనకు సంబంధించిన మృతదేహం భారీ వరద కారణంగా నారాయణి నదిలోకి కొట్టుకుపోయినట్లు గుర్తించారు. వీడియో ఆధారంగా పోలీసులు 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరీని గుర్తించారు. నేపాల్ మీడియా సంస్థ ఖబర్‌హబ్ పోలీసులను ఉటంకిస్తూ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం భరత్పూర్ మహానగరపాలక సంస్థ-1లోని పోఖరా బస్ పార్క్ సమీపంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడటం లేదా ఎలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటాన్ని సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నార్వే రాజు హరాల్డ్-5 ఇకలేరుకాగా, నేపాల్‌లో గత కొన్నేళ్లలో సంభవించిన అత్యంత ప్రాణాంతక వరద విపత్తుల్లో ఈ ఘటన ఒకటి. నేపాల్-టిబెట్ సరిహద్దును ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కొన్ని వందల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. వారి కోసం సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. సరిహద్దు మార్గానికి వెళ్లే రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ప్రాంతంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి భూకంపనలు లేదా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండవచ్చని కూడా అది తెలిపింది.मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026 -
ఫుట్ పాత్ పై పడుకున్న బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు
-
ఖాకీ బట్టలు విప్పి పసుపు చొక్కాలు వేసుకోండి
-
పనితీరు పసిగట్టేలా..!
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో ఇకపై పోలీసులు మరింత మర్యాదగా, బాధ్యతగా వ్యవహరించాల్సిందే. స్టేషన్లో తమకు ఎదురైన అనుభవం ఎలా ఉంది? సిబ్బంది సరిగ్గా స్పందించారా? వెంటనే ఫిర్యాదు స్వీకరించారా? కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది? పురోగతిపై సమాచారం అందిస్తున్నారా? వంటి అంశాలపై ఇక నేరుగా బాధితుల నుంచే పోలీస్ శాఖ ఫీడ్‌బ్యాక్ తీసుకోనుంది. పోలీసుల పనితీరును మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పోలీస్–సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ వ్యవస్థను ప్రారంభించే అవకాశముంది. ర్యాండమ్‌గా బాధితులకు ఫోన్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిన బాధితుల వివరాల నుంచి ఎంపిక చేసి.. కొందరికి ర్యాండమ్‌గా కాల్ చేయనున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కాల్ సెంటర్లోని టెలీకాలర్లు బాధితులతో మాట్లాడి వారి అనుభవాన్ని తెలుసుకుంటారు. రిసెప్షన్ వద్ద స్వాగతం మొదలు..దర్యాప్తు పురోగతి, కేసుకు సంబంధించిన సమాచారం అందుతున్న విధానం తదితర అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు.పోలీసులే కాదు.. థర్డ్ పార్టీతో.. ఫీడ్‌బ్యాక్ వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశంగా థర్డ్ పార్టీ ఏజెన్సీతో కాల్ సెంటర్ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. పోలీస్ సిబ్బందితోనే బాధితులకు ఫోన్లు చేయిస్తే వాస్తవ పరిస్థితులపై పూర్తిస్థాయి ఫీడ్‌బ్యాక్ రాకపోవచ్చనే ఉద్దేశంతో.. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా అభిప్రాయాలను సేకరించనున్నట్టు సమాచారం.ఏఐతో విశ్లేషణ.. బాధితుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా విశ్లేíÙంచేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఏ పోలీస్‌స్టేషన్‌పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి? ఏ అంశంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది? ఏ అధికారి లేదా సిబ్బంది పనితీరుపై పదేపదే ప్రతికూల అభిప్రాయాలు వస్తున్నాయి? వంటి అంశాలను గుర్తించే అవకాశం ఉంటుంది. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చర్యలు...బాధితుల అభిప్రాయాలు కేవలం రికార్డులకే పరిమితం కాకుండా.. పోలీసుల పనితీరు మెరుగుదలకు, అవసరమైతే సంబంధిత సిబ్బందిపై చర్యలకు ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. మంచి ఫీడ్‌బ్యాక్ వస్తున్న సిబ్బందిని ప్రోత్సహించడంతోపాటు.. పదేపదే ప్రతికూల ఫీడ్‌బ్యాక్ వస్తున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్, శిక్షణ లేదా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది. పోలీస్స్టేషన్లలో జవాబుదారీతనం పెరగడంతోపాటు, ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ అందించాలన్న లక్ష్యంతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. -
‘యాటిట్యూడ్ స్టార్’ వీరంగం.. ‘నా బూట్లు నీతోనే కడిగిస్తా!’
ఢిల్లీ: ‘నా బూట్లు నీతోనే కడిగిస్తా.. నువ్వు ఎంతటివాడివైనా సరే’ అంటూ గ్రేటర్ నోయిడాలోని ఓ హై-ప్రొఫైల్ సొసైటీలో సెక్యూరిటీ గార్డులను ఉద్దేశించి ఓ మహిళ బెదిరింపులకు దిగింది. డెలివరీ బాయ్‌ని గేట్ వద్దే ఆపారన్న చిన్న కారణంతో ఆ మహిళ కోపంతో ఊగిపోయింది. విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పరుష పదజాలంతో దూషిస్తూ ఆమె సృష్టించిన వీరంగం తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డబ్బుందనే అహంకారంతో సామాన్య సిబ్బందిపై ప్రదర్శిస్తున్న ఈ దౌర్జన్యానికి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని బిస్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘సెంచూరియన్ పార్క్ టెర్రస్ హోమ్స్’ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ బుక్ చేసుకుంది. అయితే భద్రతా దృష్ట్యా నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది డెలివరీ బాయ్‌ను గేట్ వెలుపలే ఆపారు.కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ రాకపోవడంతో మహిళ గేటు వద్దకు వచ్చి పరిశీలించింది. డెలివరీ బాయ్‌ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు గమనించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అది కాస్తా తీవ్ర వివాదంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ సెక్యూరిటీ సిబ్బందిని తీవ్రంగా దూషించడమే కాకుండా పోలీసులకు ఫోన్ చేస్తారా? చేసుకోండి అంటూ దురుసుగా వ్యవహరించింది.బెదిరింపులు.. దాడి యత్నంఒకానొక సమయంలో కుర్చీలో కూర్చున్న సెక్యూరిటీ గార్డుపై దాడి చేసేందుకు యత్నించగా, మరో సిబ్బందిని వెనక్కి తోసేసింది. నాతో పోలిస్తే నీ స్థాయేంటో తెలుసా? నీతో నా షూస్‌ను క్లీన్ చేయించుకుంటా అంటూ బెదిరింపులకు దిగింది. గార్డుల ఆర్థిక పరిస్థితిని కించపరిచేలా ఆమె మాట్లాడిన మాటలు వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి.డెలివరీ బాయ్‌ని ఎందుకు ఆపారనే కచ్చితమైన కారణం, ఈ ఘర్షణకు దారితీసిన ఇతర పరిస్థితులపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది పట్ల సదరు మహిళ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Next level nari shakti 🫡👍👏It peaks when she starts with - ग़रीब के पिल्ले..दो रोटी नहीं हैं तेरे पास - to the guard. Something tells me that her social media and corporate profile would be full of words like equality, feminism, etc etc. And as always, Noida society 😅 pic.twitter.com/FtK7HAIBsI— Maj Manik M Jolly,SM (@Manik_M_Jolly) August 26, 2026 -
బాబు పతనం స్టార్ట్.. TDP కి కోలుకోలేని దెబ్బ.. పోలీసులే అడ్డంగా ఇరికించారు!
-
నేను హర్టయ్యా..!
కరెంటు పోలు చివరికంటా ఎక్కి ధీమాగా వైర్లు పట్టుకు కూర్చున్న ఇతను జలాలుద్దీన్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణం అర్బన్ కాలనీకి చెందిన ఇతను.. బుధవారం పట్టపగలే పూటుగా మందేసి, దర్గా దగ్గరున్న పోలీసుల దగ్గరకొచ్చాడు. నా సమస్య చెబుతా వినండన్నాడు. మందు మత్తులో ఉన్నాడని పోలీసులు లైట్‌గా తీసుకున్నారు. దీంతో కోపగించిన జలాలుద్దీన్.. ‘నా సమస్య వినరా..? నేను హర్ట్ అయ్యాను’’ అంటూ ఇదిగో ఇలా కరెంటు పోలెక్కాడు. వెంటనే అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అక్కడే దర్జాగా కూర్చొన్నాడు. చివరకు సీఐ రాఘవన్ వచ్చి అతన్ని బుజ్జగించి, కిందకు దింపాడు. నీ సమస్యేమిటని అడిగితే సరిగా చెప్పలేకపోయాడు. దీంతో పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. – పెనుకొండ రూరల్ -
వాళ్ళో పెద్ద జేమ్స్ బాండ్స్.. పోలీసుల మాట్లాడిన వీడియోలు లైవ్ ప్రూఫ్
-
గంజాయితో అడ్డంగా దొరికిన పోలీసులు... లైవ్‌లో ఆధారాలతో బయటపెట్టిన జగన్
-
మళ్లీ వార్తల్లోకి ఖాన్ సర్.. ఈసారి వేధింపుల కేసు
పట్నా: బిహార్‌లోని పట్నాకు చెందిన ప్రముఖ విద్యావేత్త ఫైజల్ ఖాన్ (ఖాన్ సర్) వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ పిర్బహోర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు తగిన రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరారు. బాధిత మహిళ పేర్కొన్న వివరాల ప్రకారం... 2017–18 కాలంలో పట్నాలోని తన మహిళా స్నేహితురాలి గదికి ఖాన్ సర్ తరచూ వస్తూ ఎక్కువ సమయం గడిపేవారని ఆమె ఆరోపించారు. తాను దీనిని వ్యతిరేకించగా, తనపై పోలీసు కేసు బనాయిస్తామని, చంపేస్తామని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఖాన్ సర్‌కు సంబంధించిన పలు రహస్యాలు తనకు తెలుసని, ఆయన ప్రమేయంతో తనకేదైనా జరగొచ్చనే భయం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తనకు తెలిసిన సమాచారాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకే తనను అంతమొందించే అవకాశం ఉందని ఆమె పోలీసులకు విన్నవించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు డీఎస్పీ రాజేష్ రంజన్ తెలిపారు. ఫిర్యాదులోని అంశాలు, పూర్వాపరాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో తన ఇన్స్టిట్యూట్లో జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పొందిన ఖాన్ సర్, తాజా ఫిర్యాదుతో మరోసారి వార్తల్లో నిలిచారు.ఇది కూడా చదవండి: డేరింగ్ ప్రపోజల్ చేసిన నెట్‌ఫ్లిక్స్ జంటపై క్రిమినల్ కేసులు! -
గల్లీకో నకిలీ డాక్టర్!
సాక్షి, హైదరాబాద్: నర్సు... కాంపౌండర్... అనస్థీషియా అసిస్టెంట్... ఫస్ట్ ఎయిడ్ ప్రొఫెషనల్... ఈ కోర్సులు చదివిన వాళ్లు, ఇలా పనిచేసిన వాళ్లూ డాక్టర్లుగా మారిపోయారు. ఎవరికి వారుగా సొంత క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని సెలైన్లు ఎక్కించడం, ఇంజెక్షన్లు చేయడంతో పాటు ఎడాపెడా మందుల్నీ రాసేస్తున్నారు. మరికొందరు తమ కుటుంబీకుల ఎంబీబీఎస్ డిగ్రీలు అడ్డం పెట్టుకుని ప్రాక్టీసు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సూడో డాక్టర్లు నిర్వహిస్తున్న క్లినిక్‌లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుస దాడులు చేశారు. ఫలితంగా 12 మంది చిక్కారని, వీరినుంచి భారీగా ఔషధాలు, పరికరాలు, లెటర్‌హెడ్స్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మంగళవారం తెలిపారు. ఇన్స్పెక్టర్లు జె.రాజశేఖర్, సీహెచ్ యదేందర్లతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఇటీవల చోటు చేసుకున్న రోగుల మరణాల నేపథ్యంలో ఈ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులైన ఒక్కో ‘డాక్టర్’వెనుక ఒక్కో కథ ఉందని వివరించారు. మెడికల్ షాపు నడవటం కోసం క్లినిక్ కేపీహెచ్‌బీ ప్రాంతానికి చెందిన డి.రామశేఖర్ రెడ్డి 2015 నుంచి తన భార్య నాగజ్యోతి డి–ఫార్మసీ సర్టీఫికెట్ ఆధారంగా రహమత్‌నగర్‌లో ‘ఆక్వా ఫార్మసీ‘ని నడుపుతున్నాడు. ఈ దుకాణానికి వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గడంతో తానే ఓ క్లినిక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫార్మసీని శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌గా మార్చేసి డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ పూర్తి చేసిన నిజాంపేట వాసి రాగం సుధాకర్‌ను డాక్టర్ని చేశాడు. ఈయన రోజుకు దాదాపు 50 మంది రోగులకు వైద్యం చేస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.200 చొప్పున ఫీజు వసూలు చేసి పంచుకుంటున్నారు. నర్సు అనుభవంతో పీడియాట్రిక్ ప్రాక్టీస్ తూప్రాన్‌కు చెందిన మిరుదొడ్డి భారతి మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు చేసి, నర్సుగా పని చేసింది. ఈ అనుభవంతో డాక్టర్‌గా మారి రహమత్‌నగర్‌లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసింది. కొన్నాళ్లుగా పీడియాట్రిక్ డాక్టర్‌గా మారిపోయి చిన్న పిల్లలకూ వైద్యం చేస్తోంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ మానేసి క్లినిక్ జూబ్లీహిల్స్‌కు చెందిన కాటిక మహేశ్‌రావు బీఏ చదివాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టి నష్టపోయిన ఇతగాడు... నకిలీ వైద్యుడిగా మారి రెండేళ్ల క్రితం వెంకటగిరిలో ఒక గదిని అద్దెకు తీసుకుని క్లినిక్ ప్రారంభించి ప్రాక్టీసు చేస్తున్నాడు. కుమార్తె డిగ్రీతో తండ్రి వైద్యం షేక్‌పేటకు చెందిన పానుగంటి బాల నరసింహ ఫార్మసీ పూర్తి చేసి శ్రీ తిరుమల మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నడుపుతున్నాడు. ఈయన కుమార్తె పి.పరమేశ్వరి ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీకి సిద్ధమవుతున్నారు. ఆమె సర్టీఫికెట్ ఆధారంగా తన దుకాణం పక్కనే క్లినిక్ ఏర్పాటు చేశాడు. తానే డాక్టర్‌గా మారి వైద్యం చేస్తున్నాడు. ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్ ఇంటరీ్మడియట్ మధ్యలో ఆపేసిన మహమ్మద్ అబ్దుల్ వలీ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేశాడు. ఆ అనుభవంతో గంగానగర్ వెజిటబుల్ మార్కెట్ వద్ద క్లినిక్ తెరిచి డాక్టర్‌గా అవతారమెత్తాడు. తండ్రి సర్టిఫికెట్తో ప్రాక్టీస్ సికింద్రాబాద్‌కు చెందిన ఎ.సందానీ తండ్రి ఎస్జీ సుబానీ చర్మ వైద్యుడు. ఇంటరీ్మయట్లో బైపీసీ చదివిన ఇతగాడు తండ్రి సర్టీఫికెట్ ఆధారంగా నల్లగుట్టలో నాలుగేళ్లుగా సందానీ క్లినిక్ పేరుతో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఇతడు రోగులకు ఇస్తున్న పెట్రోలియం జెల్లీలో హానికరమైన కాల్షియం పౌడర్, జింక్ ఆక్సైడ్ తదితరాలు ఉన్నట్లు తేలింది. కాంపౌండర్లే క్లినిక్‌లు... బీహెచ్ఎంసీ చదివి, పదేళ్లు కాంపౌండర్‌గా పని చేసిన ఎన్.ప్రసాద్ చిలకలగూడలో ఫ్యామిలీ క్లినిక్, డిగ్రీ చదివి కొన్నాళ్లు కాంపౌండర్లుగా పని చేసిన ఎం.శ్రీనివాస్, పి.సదానంద్, సీహెచ్ రమేష్ , ఎస్.లింగయ్యలు లోయర్ ట్యాంక్‌బండ్‌లో సాయిరాం క్లినిక్, చిలకలగూడలో సాయిరాం క్లినిక్, మాణికేశ్వర్ నగర్లో సరోజినీ పాలీ క్లినిక్, సూర్య క్లినిక్‌లు ఏర్పాటు చేసి ఏళ్లుగా వైద్యం చేసేస్తున్నారు. తమ వైద్యంలో పరిస్థితి చేతులు దాటిన పేషెంట్లను ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్‌కు పంపిస్తున్నారు. -
పట్నాలో రణరంగం
పట్నా: బిహార్ రాజధాని పట్నా మంగళవారం రణరంగాన్ని తలపించింది. బిహార్ పబ్లిక్ సర్విస్ కమిషన్(బీపీఎస్సీ) వచ్చే నెలలో నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులు ర్యాలీ తలపెట్టగా పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు ముఖ్యమంత్రి నివాసం వైపునకు ర్యాలీగా వెళ్తుండగా అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వుతారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు.వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఉపాధ్యాయ నియామక రాత పరీక్షలను ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు దశల్లో కాకుండా ఒకే దశలో నిర్వహించాలని అభ్యర్థులు డి మాండ్ చేస్తున్నారు. ప్రభు త్వంపై ఒత్తిడి పెంచడానికి ‘ముఖ్యమంత్రి నివాస ముట్టడి’కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో బీపీఎస్సీ నిర్వహించిన ‘కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్’లో అక్రమాలు జరిగాయని నిరసనకారుల్లో మరో వర్గం ఆరోపించింది. ఆ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని పట్టుబట్టింది. పోరాటంలో భాగంగా పట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్ వద్ద ప్రారంభమైన ర్యాలీలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ వంటి సంఘాలకు చెందిన వామపక్ష కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. గాంధీ మైదాన్ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు దాదాపు 5 కిలోమీటర్ల మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జేపీ గోలాంబర్ వద్ద పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించగా, నిరసనకారులు నీటిలో తడుస్తూనే రెయిన్ డ్యాన్స్ చేయడం కనిపించింది. నిరసనకారులు బారికేడ్లను ఛేదించుకుని ముందుకు పరుగులు తీశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. నిరసనకారులను అదుపులోకి తీసుకొని నగరంలో వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం కొన్ని వారాలుగా ధర్నా చేస్తున్న అభ్యర్థులను కించపరిచేలా, బీపీఎస్సీ పరీక్షల నియంత్రణాధికారి రాకేష్‌కుమార్ సింగ్ సోమవారం ‘ఏనుగు బజారులో నడుస్తుంటే వేలకొద్దీ కుక్కలు మొరుగుతాయి’అనే హిందీ సామెతను ప్రయోగించడంపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోలీసులకు దండం పెట్టి అడుగుతున్న దయచేసి.. ప్రియాంక తండ్రి ఆవేదన
-
కొడుకు వరుసైన వ్యక్తితో భార్య అక్రమ సంబంధం
యాదాద్రి భువనగిరి జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని వరుసకు కొడుకైన వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య(38), శారద దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు పంతంగి గ్రామ శివారులోని శనిగలగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు.శారదకు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్న భర్త దానయ్య ఆమెను పలుమార్లు మందలించాడు. శారద గతంలో పంతంగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి వెళ్లిపోయి తిరిగి భర్త వద్దకు వచ్చింది. ఇటీవల దానయ్య సొంత అన్న కుమారుడు రాపోలు శివతో శారద వివాహేతర సంబంధం పెట్టుకుంది. దానయ్యకు ఈ విషయం తెలియడంతో ఇద్దరిని మందలించాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన రాపోలు శివ తన బాబాయి అయిన దానయ్యను చంపుతానంటూ గతంలో పలుమార్లు బెదిరించాడు. దురాజ్‌పల్లికి వెళ్లాల్సి ఉండగా..దానయ్య ఆదివారం సూర్యాపేట జిల్లాలోని దురాజ్‌పల్లికి వెళ్లాల్సి ఉండగా.. భార్య శారద అతడిని దురాజ్‌పల్లికి వెళ్లకుండా ఆపి పొలం వద్దకు తీసుకెళ్లింది. కొంతసేపటి తర్వాత తన ప్రియుడు రాపోలు శివను పొలం వద్దకు పిలిపించుకుంది. శారద, శివ ఏకాంతంగా ఉన్న సమయంలో దానయ్య గమనించి శివతో గొడవపడ్డాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో దానయ్య కిందపడిపోగా అతడి కాళ్లను శారద బిగ్గరగా పట్టుకుంది. శివ అక్కడే ఉన్న బండరాళ్లతో దానయ్యపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో..హత్య చేసిన తర్వాత శారద పక్క పొలంలో పనిచేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి తన భర్త కనిపించడంలేదని చెప్పింది. చుట్టుపక్కల వెతకగా దానయ్య రక్తపు మడుగులో కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శారద ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. నిజం ఒప్పుకుంది. అప్పటికే రాపోలు శివ సెల్ఫోన్లు, తన దుస్తులను తీసుకొని పారిపోయాడు. వాటిని చిట్యాల మండలం గుండ్రాంపల్లి చెరువులో పడేయగా.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులకు శివ పట్టుబడ్డాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడి భార్యకు చాలా మందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆమెకు సోషల్ మీడియాలో రకరకాల అకౌంట్లు ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు ఆమెతో సంబంధాలు కలిగి ఉన్నారని డీఎస్పీ తెలిపారు. -
రఘురామపై కేసు ఎందుకు పెట్టలేదు? పోలీసులపై హైకోర్టు సీరియస్
-
చిక్కిన నకిలీ డీఎస్పీ..
సాక్షి, హైదరాబాద్: డబ్బులు డబుల్ చేస్తామని వ్యాపారి నుంచి రూ.1.20 కోట్లు కాజేసిన కేసులో కీలక నిందితుడు నకిలీ డీఎస్పీ కొండూరు రెడ్డి వెంకట్ రాజు ఎట్టకేలకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. దాదాపు ఐదేళ్లుగా పరారీలో ఉన్న అతడిపై మరో మూడు కేసులు ఉన్నట్లు డీసీపీ చైతన్యకుమార్ సోమవారం వెల్లడించారు.మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్‌కుమార్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఆయన స్నేహితుడు కోడటి జయప్రతాప్ 2018 డిసెంబర్లో ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే పెట్టుబడులు పెట్టి, పక్షం రోజుల్లో రూ.18 కోట్లు ఇస్తాడని చెప్పగా.. సునీల్‌కుమార్ నమ్మలేదు.దీంతో 2019 అక్టోబర్ 28న అప్పుడు సీఐడీ విభాగంలో తిరుపతి డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.మునిరామయ్యను జయప్రతాప్ హైదరాబాద్ తీసుకువచ్చి సునీల్ కుమార్‌ను కలిశారు. రూ.1.20 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ మునిరామయ్య నమ్మించారు. ఇవ్వకుంటే పరిస్థితి ఏంటని సునీల్ ప్రశ్నించడంతో.. మునిరామయ్య ఓ నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపాడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రాజు అనే వ్యక్తిని తీసుకువచ్చి టాస్క్‌ఫోర్స్ డీఎస్పీగా పరిచయం చేశాడు.డబ్బు వసూలు చేయడం రాజుకు పెద్ద పనేంకాదంటూ ఒప్పించారు. రెండేళ్లయినా డబ్బు తిరిగిరాకపోవడంతో సునీల్‌కుమార్ ఆరా తీయగా రాజు అనే డీఎస్పీనే లేరని తేలింది. సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో జయప్రతాప్, మునిరామయ్య, రాజు సహా ఐదుగురిపై 2021లో కేసు నమోదు చేశారు. 2021, 2022లో కొందరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సూడో డీఎస్పీ రాజు బెంగళూరులో ఉన్నట్లు టీమ్–5 ఏసీపీ కె.కిరణ్ కనిపెట్టి పట్టుకున్నారు. -
రఘురామకృష్ణరాజుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?
సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుని దారి మళ్లించిన వ్యవహారంలో తన వద్ద ఉన్న ఆధారాలను సీబీఐ, ఎస్ఎఫ్ఐఓకి ఇవ్వొద్దంటూ బెదిరిస్తున్నారని, ఈ నేపథ్యంలో తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త మాదాల శ్రీనివాసు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. రఘురామకృష్ణరాజు రుణాల ఎగవేతలకు సంబంధించిన ఆధారాలను తమకిచ్చేయాలంటూ దాదాపు 30 మంది తన ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసేందుకు యత్నించారంటూ శ్రీనివాసు ఇచి్చన ఫిర్యాదు మేరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని గుంటూరు, పట్టాభిపురం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదు అందినప్పుడు కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు శ్రీనివాసు తరఫున మద్రాసు హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది మణిశంకర్ వాదనలు వినిపిస్తూ, ‘ఎన్సీఎల్ఏటీలో ఉన్న రూ. 267.88 కోట్ల రికవరీ వ్యాజ్యాలు, సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే క్రిమినల్ విచారణ భయంతో రఘురామకృష్ణరాజు భౌతిక దాడులకు పాల్పడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో రఘురామకృష్ణరాజుపై పట్టాభిపురం పోలీసులకు అన్ని ఆధారాలతో పిటిషనర్ ఫిర్యాదు చేశారు. అయితే వారు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వారు నిర్వర్తించాల్సిన చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడం లేదు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయినంత మాత్రాన ఆయన చేసే నేరపూరిత చర్యలకు చట్టపరమైన రక్షణ ఏదీ లేదు. పిటిషనర్‌కు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలి’ అని విన్నవించారు. -
చంద్రబాబుకు రాయలసీమపై ద్వేషం
సాక్షి ప్రతినిధి,కర్నూలు: కరెంటు ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నుంచి నీటిని కిందకు వదిలి చంద్రబాబు సర్కారు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. శ్రీశైలం నీటి మట్టం తగ్గితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు చుక్క నీరు కూడా అందదని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు నిండేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు పరిశీలనకు వైఎస్సార్సీపీ నేతలను అనుమతించకపోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాయలసీమ రైతుల హక్కుల కోసం అందరూ చైతన్యవంతులై ఉద్యమించాలని కాటసాని పిలుపునిచ్చారు. కరెంటు ఉత్పత్తి పేరుతో శ్రీశైలం డ్యాంను ఖాళీ చేస్తూ రాయలసీమ ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని శైలజానాథ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కులను అడగడానికి వచ్చిన వారిని అడ్డుకోవడం సరికాదని నేతలు మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లు అందే వరకు వైఎస్సార్సీపీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాయలసీమకు నీటి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పోతిరెడ్డిపాడు పరిశీలనకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోతిరెడ్డిపాడుకు ఐదు కిలోమీటర్ల దూరంలోని బన్నూరు–చాబోలు క్రాస్‌వద్ద ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు అనుమతులు లేవంటూ అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నేతలను అడ్డుకునేందుకు పోతిరెడ్డిపాడు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, పోతిరెడ్డిపాడు గేటుకు తాళం వేయడంపై ప్రతిపక్ష నేతల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో బన్నూరు క్రాస్‌వద్ద వైఎస్సార్సీపీ నేతలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పాచక్రపాణిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఆలూరు పరిశీలకుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నంద్యాల పరిశీలకురాలు శశికళారెడ్డి తదితరులు అక్కడే రోడ్డుపై బైఠాయించి గంటపాటు నిరసన తెలిపారు. చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతులకు సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు పోతిరెడ్డిపాడు పరిశీలనకు వస్తున్న మాజీ ఎమ్మెల్యేలు అమర్నాథరెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి తదితర నేతలనూ ఎస్ఆర్ఎంసీ ఎడమగట్టు కాలువ 0.6వ కిలోమీటరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. -
జలద్రోహంపై YSRCP సమరభేరి పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్
-
సాదిక్ ఖాన్ గురించి కీలక విషయాలు బయటపెట్టిన పోలీస్
-
CJP లాఠీ ఛార్జ్ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
-
గణేశ్ ఆగమన యాత్రలో గుడ్లతో దాడి
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మజ్గావ్ పరిధిలో వినాయక విగ్రహాన్ని తీసుకువస్తున్న క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. గణపతి మండలి డిప్యూటీ సెక్రటరీ వివేక్ రాణే వివరాల ప్రకారం గణేశుడి ఆగమన శోభాయాత్రను నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మండపం నుంచి సుమారు 30 నుంచి 40 మీటర్ల దూరంలో ఉన్న ఒక భవనం పైనుంచి కొందరు శోభాయాత్రపై గుడ్లు విసిరారు. విగ్రహంపై గుడ్లు పడ్డాయన్న వార్త వ్యాపించడంతో వెంటనే హిందూ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆ భవనం ఎదుట గుమిగూడారు. ఈ చర్య అత్యంత అభ్యంతరకరమని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అనుమానిత భవనం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.ముంబైలో 10,000కు పైగా గణేశ మండపాలుమహారాష్ట్రలో ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ముంబయిలో సుమారు 10,600 పబ్లిక్ గణేశ్ మండళ్లు ఉండగా, దాదాపు 2,500 మండళ్లు 10 రోజుల ఉత్సవాలకు ఇప్పటికే అనుమతులు పొందాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 28 లక్షల గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించనున్నట్లు అంచనా.పండల్ అనుమతుల కోసం ముంబయిలో ఆన్లైన్ సింగిల్ విండో వ్యవస్థను ప్రారంభించారు. దీని ద్వారా బీఎంసీతో పాటు స్థానిక పోలీసు, ట్రాఫిక్ విభాగాల నుంచి ఎన్వోసీలను ఆన్లైన్లో పొందవచ్చు. దరఖాస్తులకు సెప్టెంబర్ 13 వరకు గడువు ఉంది. ఈసారి పలు పందిళ్లో ఆకర్షణీయమైన థీమ్‌లను తీర్చిదిద్దుతున్నారు.ఇది కూడా చదవండి: ‘సిల్క్యారా’లో మళ్లీ ప్రమాదం.. 2023ను గుర్తుకు తెస్తూ.. -
ఇదేందయ్యా ఇది.. తమ్ముడనుకుంటే భార్యకు మొగుడయ్యాడు!
సీతాపూర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా పరిధిలో ఓ వింత ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తలతో పాటు ఆమె ప్రియుడు కూడా ఒకే ఇంట్లో కలిసి జీవించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మహమూదాబాద్ ప్రాంతానికి చెందిన శుభం వర్మ, అంజు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నితిన్ అనే యువకుడు తరచూ శుభం ఇంటికి వచ్చి వెళ్లేవాడు. శుభం అతడిని తన సొంత సోదరుడిలా భావించి, ఇంట్లోనే ఆశ్రయం కల్పించడంతో ఇంట్లోని మనిషిలా మారిపోయాడు.ఈ క్రమంలో అంజు, నితిన్‌ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అనంతరం తన భర్త శుభం, ప్రియుడు నితిన్‌లతో కలిసే ఒకేచోట జీవిస్తానని అంజు స్పష్టం చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో గొడవలు లేదా విడాకులకు దారితీస్తుండగా, ఇక్కడ భర్త శుభం భిన్నమైన వైఖరి కనబరిచాడు. తన భార్య అంజుతో పాటు నితిన్‌ను కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని అతడు తేల్చిచెప్పాడు. అవసరమైతే ఇంటిని వదిలి వెళ్లేందుకైనా సిద్ధమేగానీ, వారిద్దరితో బంధాన్ని తెంచుకోబోనని స్పష్టం చేశాడు. ఇద్దరు పిల్లలను కూడా తమతోనే ఉంచుకుంటామని దంపతులు తెలిపారు. అయితే, ఈ ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో నివసించడాన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.వివాదం ముదరడంతో వ్యవహారం మహమూదాబాద్ కొత్వాలీ పోలీసు స్టేషన్‌కు చేరింది. ఇరువర్గాలకు పోలీసులు గంటల తరబడి కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఇన్స్పెక్టర్ భాను ప్రతాప్ సింగ్ సైతం సర్దిచెప్పే యత్నం చేసినప్పటికీ, ముగ్గురూ తమ నిర్ణయానికే కట్టుబడి ఉండటంతో సమస్య కొలిక్కి రాలేదు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కేసు నమోదు కాలేదని సమాచారం.ఇది కూడా చదవండి: చండీగఢ్: ఉగ్ర కుట్ర భగ్నం.. ఆయుధాలతో ముగ్గురు అరెస్ట్ -
చండీగఢ్: ఉగ్ర కుట్ర భగ్నం.. ఆయుధాలతో ముగ్గురు అరెస్ట్
చండీగఢ్: చండీగఢ్‌లో ఓ భారీ ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం సాయంత్రం సెక్టార్-43లోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినస్ (ఐఎస్బీటీ) సమీపంలో అనుమానాస్పద ఐఈడీ, పేలుడు పదార్థాలు, తుపాకీతో తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడిన నిందితుల్లో ఇద్దరు తర్న్ తారన్‌కు చెందినవారు కాగా, మరొకరు అమృత్‌సర్‌కు చెందిన వ్యక్తి. సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లు, వైర్లు, పవర్ సోర్స్ సహా పేలుడు పరికరం (ఐఈడీ) తయారీకి ఉపయోగించే పలు ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సెక్టార్-36 పోలీస్ స్టేషన్లో ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం, ఆర్మ్స్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ప్రాథమిక దర్యాప్తులో ఈ ముగ్గురికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది సత్నామ్ సత్తా అలియాస్ నౌ షేరాతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఏదైనా భారీ ఉగ్ర కుట్రలో భాగంగానే వీరు ఈ పేలుడు పదార్థాలు సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారు పంజాబ్ లేదా చండీగఢ్ లేక మరేదైనా ప్రాంతంలో దాడికి ప్రణాళిక రచించారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఇంకా ఎవరైనా ఇందులో భాగస్వాములా అనే కోణాల్లో దర్యాప్తు అధికారులు నిందితులను విచారిస్తున్నారు.కొద్ది నెలల క్రితమే సెక్టార్-37లోని పంజాబ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు నాటు హ్యాండ్ గ్రెనేడ్ విసిరిన సంగతి తెలిసిందే. నగరంలో ఇటీవల ముఠా హింస, పట్టపగలు కాల్పులు, దోపిడీలు, హత్యలు పెరగడం.. పలు ముఠాలకు సరిహద్దు ఆవల సంబంధాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఘటనపై ప్రజలెవరూ భయాందోళనలకు గురికావద్దని, ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఆరుగురికి గాయాలు -
జగనన్న సైనికుడిగా చెప్తున్నా... మీకు కూడా అదే గతి పట్టించకపోతే
-
అంజయ్యనగర్‌లో చర్యలు చేపట్టిన హైడ్రా... (ఫోటోలు)
-
బిర్యానీ టైమింగ్ మార్పు ఏదీ?
బనశంకరి: బెంగళూరు సమీపంలోని హొసకోటెలో తెల్లవారకుండానే వేడి వేడి దొన్నె దమ్ బిర్యానీ తినడం చాలామందికి ఇష్టం. ఇందుకోసం బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి బైక్‌లు, కార్లలో వేలాదిగా వస్తుంటారు. దీనివల్ల విపరీతమైన ట్రాఫిక్ రద్దీ పెరిగి గొడవలు, ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని పరిష్కారానికి తెల్లవారుజామున 4 గంటలకు బదులు ఉదయం 6 గంటలకు హోటళ్లు తెరవాలని పోలీసులు ఆదేశించినా పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్కింగ్ గొడవలు ఇటీవల మణి దమ్ బిర్యాలీ సెంటర్ వద్ద ఓ టీవీ నటి కారు పార్కింగ్ విషయంలో గొడవపడి దాడులకు దిగారు. పోలీసు స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు. పైగా హోటళ్ల పరిసరాలు మందుబాబులకు అడ్డాలుగా మారాయి. మద్యం తాగుతూ రభస చేయడం వల్ల స్థానిక మహిళలు, పిల్లలకు ఇబ్బందిగా ఉంటోందని ఆరోపణలున్నాయి. ఉదయం 6 నుంచి: సీఐ నిబంధనలు ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐ గోవింద్, బిర్యానీ హోటల్స్‌కు నోటీసులు జారీ చేశారు. 6 గంటలకు రావడం ఇబ్బందిగా ఉంటోంది, కనీసం 5 గంటల నుంచి అనుమతించాలని బిర్యాని ప్రియులు కోరారు. -
పోలీసుల జల్సాలు.. ఏపీలో ఆటవిక పాలన.. చేతులెత్తేసిన చంద్రబాబు
-
టాక్సిక్ మేకర్స్‌కు షాక్.. కేసు నమోదు
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్లో తొక్కిసలాట జరగడంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు టాక్సిక్ చిత్ర యూనిట్‌తో పాటు మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న మూవీ టాక్సిక్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. మల్లారెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో యష్ మాట్లాడుతుండగా భారీ సౌండ్ బాక్స్ సెట్ కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులకు కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరమ్మాయిలకి గాయలు కాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు స్పృహ కోల్పోయినట్లు తెలిసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
30 సెకన్ల చీకటి.. మాయమైన కోట్ల విలువైన పెయింటింగ్!
ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు దేశ్‌పాండే ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఆర్ట్ గ్యాలరీ ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉన్నా, అక్కడ ఉత్కంఠ గాల్లో తేలుతోంది. మరుసటి రోజు ఉదయం భారత ప్రధాని ఆ గ్యాలరీని సందర్శించనున్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన, చరిత్రాత్మకమైన ఒక అరుదైన చిత్రపటాన్ని ప్రధానికి కానుకగా ఇవ్వడానికి దేశ్‌పాండే అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆ చిత్రపటం చుట్టూ లేజర్ కిరణాలు, బయోమెట్రిక్ లాకులు, నిరంతరం నిఘా ఉంచే సీసీటీవీ కెమెరాలతో కూడిన పటిష్ఠమైన సెక్యూరిటీ ఉంది.కానీ, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో హఠాత్తుగా గ్యాలరీలో పవర్ కట్ అయ్యింది. కేవలం ముప్పై సెకన్లలోనే బ్యాకప్ సిస్టమ్ ఆన్ అయ్యింది. కానీ, ఆ ముప్పై సెకన్ల చీకట్లోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. లేజర్ వలయాన్ని ఛేదించి, ఆ కీలకమైన చిత్రపటం మాయమైంది! దేశ్‌పాండే గుండె ఆగినంత పనైంది. తెల్లవారితే ప్రధాని వస్తారు. ఈలోగా చిత్రపటం దొరకకపోతే, దేశవ్యాప్తంగా తన ప్రతిష్ఠ గంగలో కలిసిపోతుంది. ఆయన వెంటనే సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి అత్యవసర సహాయం కోరారు. కేసు తీవ్రతను బట్టి కమిషనర్, క్రైమ్ బ్రాంచ్ నెంబర్ వన్ ఇన్వెస్టిగేటివ్ ఇన్స్పెక్టర్ అభిమన్యును రంగంలోకి దించారు. తెల్లవారేలోగా, అంటే కేవలం ఐదు గంటల్లో ఈ మిస్టరీని ఛేదించాల్సిన బాధ్యత అభిమన్యుపై పడింది.∙∙ గ్యాలరీకి చేరుకున్న అభిమన్యు చురుకైన కళ్లతో క్రైమ్ సీ¯Œ ను పరిశీలించాడు. అక్కడ ఎలాంటి బలాత్కారపు గుర్తులు లేవు. అంటే, లోపలి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఈ దొంగతనం అసాధ్యం. అభిమన్యు వెంటనే సెక్యూరిటీ చీఫ్ సాహూ, అసిస్టెంట్ మేనేజర్ రాహుల్, ఐటీ హెడ్ కిరణ్, ఎగ్జిబిషన్ డిజైనర్ శ్రుతిలను ఒకే గదిలో కూర్చోబెట్టాడు. ఇక్కడే అభిమన్యు అసలైన మైండ్ గేమ్ ప్రారంభమైంది.‘‘సార్, పవర్ కట్ కాగానే మెయిన్ సర్వర్ హ్యాక్ అయ్యింది. డిజిటల్ లాక్ ఎలా ఓపెన్ అయ్యిందో మాకే అర్థం కావడం లేదు. బహుశా అంతర్జాతీయ దొంగల ముఠా పని అయి ఉంటుంది.’’ అని సాహూ చాలా కంగారుగా, ఆవేదనగా వివరించాడు.సమయం తెల్లవారుజామున మూడు గంటలు అవుతోంది. అతను అందరి ముఖాల్లోని హావభావాలను గమనిస్తూ, ‘‘దొంగ ఎవరో నాకు తెలిసిపోయింది. చిత్రపటం గ్యాలరీ దాటి బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే పవర్ పోయిన వెంటనే గ్యాలరీ చుట్టూ ఉన్న ఆటోమేటిక్ గేట్లు లాక్ అయిపోయాయి. దొంగ ఆ పెయింటింగ్‌ను ఇక్కడే ఎక్కడో దాచాడు. నేను గ్యాలరీ మొత్తం సెర్చ్ చేయిస్తున్నాను.అప్పుడే ఒక ఇన్స్పెక్టర్ వచ్చి, అభిమన్యు వైపు చూసి, ‘‘సర్... ఆ చిత్రపటం ఎక్కడ ఉందో ట్రేస్ చేశాం...’’ అంటూ చెవిలో ఏదో చెప్పాడు.అది అభిమన్యు మైండ్ గేమ్‌లో ఒక భాగం అని వాళ్లకు తెలియదు.అభిమన్యు కావాలనే ఆ గదిలో ఒక నకిలీ వైర్లెస్ స్పీకర్‌ను వదిలి, బయటకు వచ్చి సీసీటీవీ కంట్రోల్ రూమ్ నుంచి వారిని గమనించసాగాడు. ఇది అతను ఆడిన మైండ్ గేమ్. దొంగతనం చేసిన వ్యక్తి కచ్చితంగా భయపడి, పెయింటింగ్ దాచిన చోటు మార్చడానికి ప్రయత్నిస్తాడని అభిమన్యు వ్యూహం. గదిలో ఉన్న నలుగురిలో టెన్షన్ పెరిగింది. సమయం నాలుగు దాటింది. హఠాత్తుగా సెక్యూరిటీ చీఫ్ సాహూ వాష్‌రూమ్‌కి వెళ్తానని చెప్పి బయటకు వచ్చాడు. అతను నేరుగా గ్యాలరీ బేస్మెంట్లోని ఏసీ డక్ట్ పైపుల వైపు వెళ్లాడు. సాహూ నేరుగా గ్యాలరీ బేస్మెంట్లోని ఏసీ డక్ట్ పైపుల వైపు వెళ్లి, అక్కడ దాచిన రోల్ చేసిన చిత్రపటాన్ని తీస్తుండగా, ఒక్కసారిగా లైట్లు ఆన్ అయ్యాయి. ఎదురుగా ఇన్స్పెక్టర్ అభిమన్యు నిలబడి ఉన్నాడు! సాహూ షాక్ తిన్నాడు.‘‘కంచె చేను మేసినట్టుంది మిస్టర్ సాహూ! నమ్మకద్రోహానికి నువ్వే బెస్ట్ ఉదాహరణ’’ అన్నాడు అభిమన్యు.‘‘ఇది నమ్మకద్రోహం కాదు, ప్రతీకారం...’’ సాహూ ముఖంలో పశ్చాత్తాపం లేదు, కేవలం కసి మాత్రమే ఉంది. ‘‘నమ్మాడా? అందరిముందు నన్ను అవమానించాడు. ఒక చిన్న పొరపాటుకు నా ముప్పై ఏళ్ల సర్వీసును మరిచిపోయి నన్ను చెంపదెబ్బ కొట్టాడు. అందుకే అతని ప్రతిష్ఠను ప్రధాని ముందు దెబ్బతీయాలని అనుకున్నాను.’’ అన్నాడు సాహూ.‘‘వ్యక్తిగతమైన ప్రతీకారాన్ని అతని ప్రతిష్ఠ దెబ్బ తీయడానికి వాడావు. ముఖ్యంగా నీ వృత్తికి అన్యాయం చేశావ్..‘నువ్వు ఐటీ రూమ్ పాస్వర్డ్ వాడి పవర్ కట్ చేశావు కానీ, ఏసీ డక్ట్ లోపల ఉన్న డస్ట్ సెన్సర్స్ నీ షూస్ గుర్తులను రికార్డ్ చేస్తాయని మర్చిపోయావు...’’ నేరం చేసినవాడు ఎప్పటికైనా సాక్ష్యానికి దొరుకుతాడు. నీ వృత్తికి కళంకం తెచ్చావు. నీలాంటివాళ్ళకి ఇదొక గుణపాఠం కావాలి’’ చెప్పాడు అభిమన్యు.సెక్యూరిటీ చీఫ్æ సాహూ పోలీసుల మధ్య సంకెళ్లతో... ∙∙‘‘ఇచ్చిన మాట ప్రకారం తెల్లవారేలోగా కేసును సాల్వ్ చేశారు. చిన్న రిక్వెస్ట్. ప్రధానికి చిత్రపటం బçహూకరిస్తున్నప్పుడు మీరు నా పక్కన ఉండాలి.’’ అభిమన్యుతో అన్నాడు దేశ్‌పాండే కృతజ్ఞతా పూర్వకంగా.- శ్రీసుధామయి -
వైజాగ్ క్రైమ్ ఫైల్స్!
సిటీ ఆఫ్ డెస్టినీలో రోజురోజుకూ క్షీణిస్తున్న శాంతిభద్రతలు ఫిర్యాదులొస్తున్నా ప్రేక్షకపాత్రలోనే ఖాకీలు పసి మనసుల్లోనూ కక్షలు.. నడిరోడ్డుపై విద్యార్థుల గ్యాంగ్‌వార్ పోలీస్ విధుల్లో మితిమీరిన ‘రాజకీయ’ జోక్యం కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి, మత్తు పదార్థాల వినియోగంసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం, మరోవైపు పోలీసుల నిర్లిప్తత విశాఖలో అశాంతికి కారణమవుతున్నాయి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించే పరిస్థితులు నగరంలో కనిపించకపోవడం విస్మయపరుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోవడం శాంతిభద్రతల వైఫల్యానికి ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖాకీలపై ఖద్దరు పెత్తనం! పోలీసులపై అధికార పార్టీ నేతల పెత్తనం శ్రుతిమించుతోంది. శాంతిభద్రతల పరిరక్షణ కంటే నేతల ఆదేశాలు పాటించడానికే ప్రాధాన్యమివ్వాల్సిన దుస్థితి నెలకొంది. నిందితులను అదుపులోకి తీసుకుంటే వెంటనే నేతల నుంచి ఒత్తిళ్లు రావడం, నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులపై బదిలీ వేటు వేస్తామని బెదిరించడం నిత్యకృత్యమైంది. తమకు నచ్చిన సీఐలను వేయలేదని ఏకంగా సిటీ పోలీస్ బాస్‌పైనే నేతలు ఫిర్యాదులు చేసే స్థాయికి పరిస్థితులు దిగజారాయి.బీచ్‌రోడ్డులో మాస్్కలతో దౌర్జన్యం! విశాఖ బీచ్ రోడ్డులో జరిగిన ఘటన నగరంలో రౌడీయిజానికి అద్దం పడుతోంది. నంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో, ముఖాలకు మాస్క్‌లు ధరించి వచ్చిన కొందరు దుండగులు ఏకంగా ఓ ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. అక్కడున్న షెడ్డును, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ దాడి వెనుక అధికార పారీ్టకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు ఇప్పటివరకు వారిని పట్టుకోలేకపోయారు.బాజీ జంక్షన్లో విద్యార్థుల వీరంగం 2024 ఆగస్టు 6వ తేదీన బాజీ జంక్షన్ వద్ద ఓ కళాశాల విద్యార్థులు ఏకంగా నడిరోడ్డుపై తీవ్ర ఘర్షణకు దిగారు. వీధి రౌడీల్లా కొట్టుకోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీస పోలీస్ పర్యవేక్షణ, చట్టం పట్ల భయం లేకపోవడం వల్లే విద్యార్థులు సైతం ఇలా రోడ్డెక్కి దాడులకు తెగబడుతున్నారు.రుషికొండ వద్ద అర్ధరాత్రి బీభత్సం రామానాయుడు స్టూడియో సమీపంలోని ఓ ప్రైవేట్ స్థలంలో సుమారు 20 మంది దుండగులు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. నంబర్ ప్లేట్లు కనిపించకుండా తెల్లకాగితాలు అంటించిన వాహనా ల్లో వచ్చి ఈ దమనకాండకు తెగబడ్డారు. భూ ఆక్ర మణే లక్ష్యంగా ముందుగా విద్యుత్ వైర్లు కత్తిరించి, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడున్న వాచ్మెన్లను కారులో బంధించి తిప్పుతూ, గెస్ట్ హౌస్, కాంపౌండ్ వాల్‌ను నేలమట్టం చేశారు. రాత్రే ఆ శిథిలాలను లారీల్లో తరలించారు.శాంతి ఆశ్రమం భూముల్లో రౌడీషీటర్ల హల్చల్ శాంతి ఆశ్రమం భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఆగడాలు ఆగలేదు. ఆ భూములను శాంతి ఆశ్రమానికే అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చినప్పటికీ, రౌడీïÙటర్లు పట్టపగలే రంగంలోకి దిగి నానా హంగామా సృష్టించారు. ఈ ఘటనపై కేసులు నమోదైనా ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. చివరికి నిందితులకు బెయిల్ రాకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారిని అదుపులోకి తీసుకున్నారు.పెందుర్తి భూకబ్జా దాడి ఘటనలోనూ అదే తీరు నగరంలో భూకబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. తమ భూములను ఆక్రమిస్తున్నారని బాధితులు, రైతులు స్థానిక పీఎస్‌లలోనూ, పోలీస్ కమిషనర్‌కూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటీవల పెందుర్తిలో జరిగిన ఎన్నారై స్థలం వివాదంలో జనసేన నేతలు చేసిన దాడి వ్యవహారంలోనూ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.మధురవాడలో విద్యార్థుల గ్యాంగ్ వార్! మధురవాడ: నగరంలో శాంతిభద్రతల వైఫల్యం పాఠశాల విద్యార్థులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మారికవలస, వాంబే కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య 10 రోజుల క్రితం వివాదం మొదలైంది. పాఠశాలలో గొడవపడటంతో ఉపాధ్యాయులు సర్దిచెప్పినప్పటికీ.. వాట్సాప్‌లో పరస్పరం రెచ్చగొట్టే సందేశాలు పంపుకోవడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో 9, 10 తరగతుల విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. గురువారం సాయంత్రం ఇరు వర్గాలు మారికవలస–తిమ్మాపురం రోడ్డుకు చేరుకున్నాయి. వారితో పాటు పూర్వ విద్యార్థులు, స్థానిక యువకులు కూడా చేరి కర్రలు, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అదే రోజు రాత్రి శివశక్తినగర్లోనూ మరోసారి ఘర్షణ జరిగి ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఈ ఘటనపై మారికవలసకు చెందిన యర్రా చందు (19), జస్వత్ (20), రాంజగన్ తేజ (21)లతో పాటు మరో ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేసినట్లు పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు. -
రాంచీలో బాహాబాహీ
రాంచీ: ఎంపిక పరీక్షల్లో అవకతవకలపై శుక్రవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీఎం హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు తలపడ్డాయి. విద్యా ర్థుల నిరాహార దీక్షలు, తీవ్ర ఆందోళనల నడు మ జార్ఖండ్ పబిŠల్క్ సర్వీస్ కమిషన్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం సోరెన్ ప్రకటించగా, అందుకు సంబంధించిన ఆదేశాలపై గురువారం స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం తన చర్యను సరైన రీతిలో సమర్థించుకోకపోవడమే హైకోర్టు ఆదేశాలకు కారణమని ఆరోపిస్తూ విద్యార్థులు జేపీ ఎస్సీ–జేఎస్ఎస్సీ రిఫామ్స్ మంచ్ సారథ్యంలో ర్యాలీగా నగరంలోని ఆల్బర్ట్ చౌక్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోరెన్, రాహుల్ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు, అధికార జేఎంఎం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణకు దారి తీసింది. విద్యార్థులు ముందుగా అనుమతించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో ర్యాలీ చేపట్టడంతోపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారని పోలీసులు ఆరోపించారు. ఈ సమయంలో మంచ్ నేత కునాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్పృహతప్పి పడిపోవడంతో సదర్ ఆస్పత్రిలో జాయిన్ చేశారని మరో నేత పియూశ్ కుమార్‌సింగ్ చెప్పారు. పోలీసులు విద్యార్థినులపైనా బలప్రయోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. హజారీబాగ్, గిరిదిహ్‌లోనూ విద్యార్థులు సీఎం సోరెన్ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు యత్నించడం, జేఎంఎం కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణలకు దారి తీసింది. -
నకిలీ తాళం చెవి చేయించి చోరీ
గచ్చిబౌలి: ఓ ఇంట్లో నివాసముంటున్న దంపతులు గురువారం ఉదయం ఆలయానికి వెళ్లారు. సాయంత్రం వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మూడు గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ భూపతి తెలిపిన మేరకు.. శివపురి కాలనీలో నివాసం ఉండే మాధురి దంపతులు పెద్దమ్మ ఆలయానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు. అయితే ఇంటి తాళం తీసి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించారు. రాయదుర్గం డీఐ రాంరెడ్డి సీసీ ఫుటేజీల ఆధారంగా ఓ మహిళను గుర్తించారు. మణికొండలో నివాసం ఉంటున్న, వంటమనిషిగా పనిచేసే కర్ణాటకకు చెందిన కామేటీ లక్ష్మి (37)గా తేల్చారు. అదే ప్రాంతలో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. తన బంధువు, సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వకలపురి శివ రాఘవేంద్ర (29)తో కలిసి చోరీ చేసినట్లు అంగీకరించింది. ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ గుర్తించి శివ రాఘవేంద్రను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7 తులాల బంగారు బ్రాస్లెట్లు (2), చైన్లు (2) స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఆధార్ కార్డు చూపించి.. ఇల్లు మాదే అని నమ్మించిశివపురి కాలనీలో రెక్కీ నిర్వహించిన లక్ష్మి ఇంటికి తాళం వేసినట్లు గమనించింది. సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి ముందుకు వెళ్లి చూసింది. తాళం చెవి తయారు చేసే వ్యక్తి వద్దకు వెళ్లారు. ఆధార్ కార్డు చూపించి ఆ ఇల్లు మాదేనని నమ్మించి ఆధార్ కార్డు ఇచ్చింది. దీంతో అతను తాళం చెవి చేసి ఇచ్చాడు. లోపలికి వెళ్లి నగలు తస్కరించి అక్కడి నుంచి ఉడాయించారు. చోరీ చేసిన అనంతరం ఆ మహిళ దూరంగా ఉండి ఆ ఇంటికి ఎవరు వచ్చి వెళుతున్నారో గమనిస్తోంది. పోలీసుల రాకను చూసి కొద్ది దూరం వెళ్లిపోయింది. అటుగా అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు చిక్కింది. గతంలో పనిచేసిన యజమాని ఇంట్లో చోరీకి పాల్పడటంతో లక్షి్మపై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. -
ధర్నా విరమించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషస్ వద్ద ధర్నాను విరమించారు. జంతర్ మంతర్ వద్ద గత నెల జరిగిన విద్యార్థుల నిరసన సమయంలో లోచవ్ (19) అనే విద్యార్థికి పెల్లెట్ గన్ల వల్ల గాయాలయ్యాయి. లోచవ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.పెల్లెట్ గన్ గాయాల ఘటనకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 118, 125 కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీఎన్ఎస్లోని సెక్షన్ 118 ప్రమాదకర ఆయుధాలు లేదా మార్గాలను ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా గాయపరచడం లేదా తీవ్రమైన గాయాలు కలిగించడం గురించి చెబుతుంది. సెక్షన్ 125 ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు సంబంధించినది.అంతకుముందు ఏం జరిగింది?ఈ ఘటనకు సంబంధించిన శుక్రవారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారని లోచవ్ ఆరోపించడంతో, రాహుల్ గాంధీ కొంతమంది కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ముందుగా వారు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని సమాచారం అందడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు.తెల్ల టీషర్ట్, లేత గోధుమరంగు ప్యాంట్ ధరించిన రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్లోకి నడుచుకుంటూ వెళ్లడంతో అక్కడి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తొలుత ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన అధికారులను ఒత్తిడి చేశారు. అయితే అధికారులు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ బయట బైఠాయించి నిరసన ప్రారంభించారు. లోచవ్ ఫిర్యాదును నమోదు చేసేందుకు అధికారులు అంగీకరించే వరకు తన నిరసనను విరమించబోనని ఆయన తెలిపారు.“లోచవ్ కంటిలో 3 గుళ్లు దిగాయి. అతని శరీరంలో 200 గుళ్లు ఉన్నాయి. అతని గుండె సమీపంలో తాకలేని గుళ్ల ముక్కలు ఉన్నాయి. తాము గాలి తుపాకులతో కాల్పులు జరపలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కాకపోతే గాలి తుపాకులతో కాల్పులు జరిపింది ఎవరు? బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని తమకు పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పారు” అని రాహుల్ మీడియాతో అన్నారు. విద్యార్థి శరీరం నుంచి వెలికితీసిన లోహపు గుళ్లను కూడా ఆయన మీడియాకు చూపించారు.ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కుమారి సెల్జా, జైరాం రమేశ్, రణదీప్ సుర్జేవాలా రాహుల్ గాంధీతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. వారు పోలీస్ స్టేషన్లోకి వెళ్లారు. చివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఇదీ చదవండి: ధర్నా విరమించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ -
గంజాయి కేసులో నిజాలు దాస్తున్నారా.. పోలీసుల రహస్య విచారణ
-
షార్ట్స్ ధరించిందని.. 8 ఏళ్ల బాలిక తల్లిదండ్రుల్ని ఈడ్చుకెళ్లి దారుణం
ముంబై:మహారాష్ట్ర పుణె సమీపంలోని చారిత్రక సింహగఢ్ కోట వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. కోటను సందర్శించడానికి వచ్చిన ఓ కుటుంబంలోని ఎనిమిదేళ్ల చిన్నారి షార్ట్స్ (పొట్టి దుస్తులు) వేసుకుందనే నెపంతో కొందరు దుండగులు ఆ చిన్నారి తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డారు.ఛత్రపతి శివాజీ మహారాజ్ నమ్మకమైన సైన్యాధిపతి తానాజీ మాలుసరే స్మారక చిహ్నం సమీపంలో ఈ ఘటన జరిగింది.పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు తన కుటుంబంతో కలిసి కోటను సందర్శిస్తూ ఫోటోలు దిగుతున్న సమయంలో నిందితులు వారిని సమీపించారు. చిన్నారి వేసుకున్న దుస్తులపై, వారు ఫొటోలు దిగడంపై నిందితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితులు వెంటనే కోటను విడిచి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.ఆ వాగ్వాదం కాస్తా తీవ్రరూపం దాల్చడంతో నిందితుల్లో ఒకరు ఫిర్యాదుదారుడిపై చేయి చేసుకుని, గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. అంతటితో ఆగకుండా, నిందితుల బృందంలోని ఒక మహిళ బాధితుడి భార్యను రోడ్డుపై ఈడ్చుకెళ్లి అరాచకం సృష్టించింది. అంతకుముందు అదే కోట వద్ద ఉన్న మరికొన్ని జంటలతో కూడా ఈ బృందం అసభ్యంగా ప్రవర్తించినట్లు హవేలీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేష్ రామఘరే వెల్లడించారు.బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో, ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఎనిమిది మంది నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.అదే ఆదివారం రోజున కోటను సందర్శించిన మరో మూడు గ్రూపుల నుండి కూడా ఈ బృందంపై ఇలాంటి ఫిర్యాదులే వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ఎనిమిది మంది నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది. -
పోలీస్ కారులో గంజాయి దొరికినా.. సర్కార్ నో యాక్షన్ ఎందుకంటే..?
-
పోలీసులను తప్పించే ప్రయత్నం.. గంజాయి కారులో TDP నేతలు..?
-
ఎల్లో డిక్కీలో.. N బ్రాండ్ గంజాయి.. అడ్డంగా దొరికిన పోలీసులు
-
అవిటి మహిళను ఇబ్బందిపెడితే మీకేమొస్తుంది?
కర్నూలు (సెంట్రల్): సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి కర్నూలు నుంచి విజయవాడ వరకు తలపెట్టిన వీల్‌చైర్ యాత్రపై చంద్రబాబు కూటమి సర్కారు ఉక్కుపాదం మోపింది. యాత్ర ప్రారంభం కాగానే.. అనుమతుల్లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎంతో క్రూరంగా, కర్కశంగా వ్యవహరించిన పోలీసులు ఆమెను ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనీయలేదు. తాను న్యాయం కోసం ఈ యాత్ర చేపట్టానంటూ కన్నీళ్లతో వేడుకున్నా పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె వీల్‌చైర్ యాత్రను విరమిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. తన కుమార్తె సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి హత్యచేసిన వారిని శిక్షించాలని కోరుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. తన యాత్రను ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. నిందితులు విదేశాల్లో తిరిగేందుకు అనుమతించిన ప్రభుత్వం.. తాను న్యాయం కోసం వీల్‌చైర్ యాత్ర చేపడితే పోలీసుల సాయంతో ఎందుకు అడ్డుకుంటోందని నిలదీశారు. అవిటి మహిళను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగం ఆరి్టకల్ 19 ప్రకారం శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించుకునే హక్కును ప్రసాదించిందని, అయితే కూటమి ప్రభుత్వం మాత్రం క్రూరత్వంతో పౌరుల స్వేచ్ఛను హరిస్తోందని దుయ్యబట్టారు. ఉదయం నుంచే కాపుకాసిన పోలీసులు సుగాలి ప్రీతిబాయి 9వ వర్ధంతిని పురస్కరించుకుని కర్నూలు నుంచి విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆఫీసు వరకు ఈ నెల 19న వీల్‌చైర్ యాత్ర చేపడతానని పార్వతీబాయి గతంలోనే ప్రకటించారు. ఆమె యాత్రకు అనుమతి లేదంటూ ఎస్పీ విక్రాంత్‌పాటిల్ మంగళవారం చెప్పారు. ఇందుకు సంబంధించిన నోటీసులను పోలీసులు ఆమె ఇంటికి అతికించారు. పార్వతీబాయి బుధవారం ఉ.8 గంటలకే సుంకేశుల రోడ్డులోని క్రిస్టియన్ శ్మశానవాటికలో ప్రీతిబాయి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మ«.ఒంటిగంట వరకు ప్రీతిభాయి సంస్మరణ సభను నిర్వహించి, వీల్‌చైర్ యాత్ర మొదలుపెట్టారు. ఉదయం నుంచే అక్కడ కాపేసిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కుటుంబసభ్యులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతల ప్రోద్బలంతో దాదాపు 80 మీటర్ల వరకు వీల్‌చైర్ యాత్ర అతికష్టం మీద పోలీసుల తోపులాటల మధ్య కొనసాగింది. చివరికి పోలీసులు రోప్‌ల సాయంతో యాత్రను అడ్డుకున్నారు. తన కుమార్తెను హత్యచేసిన వారిని శిక్షించాలని తొమ్మిదేళ్లుగా కోరుతున్నానని, వీల్‌చైర్ యాత్ర చేసుకుంటానని ఆమె ఆవేదనతో అర్థించినా పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె యాత్రను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి ప్రభుత్వం అడ్డుకుని ఉంటే లోకేశ్, పవన్ యాత్రలు చేసేవారా? అనంతరం పార్వతీబాయి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం నిందితులను కాపాడటానికి ప్రయత్నిస్తోం దని, అందుకే తన యాత్రను అడ్డుకుందని విమర్శించారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్యచేసిన సమయంలో టీడీపీ ప్రభుత్వమే ఉందని చెప్పారు. తరువాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పరిగణనలోకి తీసుకుని ఇల్లు, పొలం, ఉద్యోగం, డబ్బులు ఇచ్చి ఆదుకుందన్నారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రీతిబాయికి న్యాయం చేసేందుకు తనపక్షాన ఉంటానని ప్రకటించారని గుర్తుచేశారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక 11 సార్లు కలవడానికి ప్రయత్నిస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. తన కుమార్తె కేసును ఆయన ఎన్నికల కోసమే వాడుకున్నారని అర్థమైందన్నారు. ఎన్నికలకు ముందు పవన్‌కళ్యాణ్, లోకేశ్ చేసిన వారాహి, యువగళం యాత్రలకు అప్పటి ప్రభుత్వం అనుమతిచ్చి రక్షణ కల్పించిందని గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వం అడ్డుకుని ఉంటే వారు యాత్రలు చేసేవారా.. అని ప్రశ్నించారు. విజయకుమార్, రజని, పలువురు నేతల మద్దతు సుగాలి పార్వతీబాయి వీల్‌చైర్ యాత్రకు లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయకుమార్, జనసేన మాజీ నేత రజని, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల నుంచి వచ్చిన పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక అసలు రంగు బయటపడిందని విమర్శించారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాలన్నీ స్వార్థం కోసమే చేశారని తేలిందని చెప్పారు. జనసేన మాజీ నేత రజని మాట్లాడుతూ కేవలం పవన్‌కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం కోసమే అప్పట్లో ప్రీతి కేసు గురించి మాట్లాడారని విమర్శించారు. ఇవిగో ఆధారాలు తమ కుమార్తెపై అత్యాచారం, హత్య జరిగినట్లు నిరూపించేందుకు అనేక ఆధారాలున్నాయని చెప్పారు. పోస్టుమార్టం ఎగ్జామినేషన్, పెథాలజీ, సైటాలజీ, సీడీఎఫ్‌డీ సెంట్రల్ ల్యాబ్ (హైదరాబాద్) రిపోర్టులు, కర్నూలు జిల్లా కలెక్టర్ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదిక, ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ సిఫారసు మేరకు కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక ఉన్నాయని తెలిపారు. వీటన్నింటితో నిందితులెవరో చెప్పవచ్చన్నారు. కేసును సీబీఐ విచారిస్తే పెద్ద తలకాయలు బయటకు వస్తాయని చెప్పారు. నిందితులు ఎవరో తేలేవరకు తన పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. -
విద్యార్థుల గొంతు నులిమి..
మహబూబాబాద్: విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను అడ్డుకునే క్రమంలో పోలీసులు ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి స్కీం’లో విలీనం చేసే అంశాన్ని వెన క్కి తీసుకోవాలని, జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థి నాయకులు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 97ద్వారా డిప్లామా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల పాలిటెక్నిక్ డిప్లామా విద్యకు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత తగ్గుతుందన్నారు. కాగా, విద్యార్థులను అడ్డుకునే క్రమంలో ఇద్దరు విద్యార్థుల గొంతును సీఐతోపాటు పోలీసులు పట్టుకోవడం, ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ కార్యక్రమంలో డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయికుమార్, కోశాధికారి గుగులోత్ సూర్యప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు రోడ్డెక్కితే గొంతు పిసికి చంపేస్తారా : హరీశ్‌రావు ‘విద్యార్థులు రోడ్డెక్కితే గొంతు పిసికి చంపేస్తారా అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదేనా మీరు పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు అంటూ బుధవారం ఒక ప్రకటనలో నిలదీశారు. విద్యార్థులపై ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా, ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే లాఠీలు.. హక్కుల కోసం రోడ్డెక్కితే అణచివేతలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పెద్ద ప్లాన్ వేసి..చిన్న తప్పుతో దొరికేశారు.. SP సంచలన ప్రెస్ మీట్
-
రూపా రెడ్డి హత్య కేసు.. అనుమానం ఎలా వచ్చిందంటే..! SP సంచలనం
-
మీరట్‌లో ఉద్రిక్తత.. హిందూ యువతితో ఇమామ్ కుమారుడు పరార్!
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హిందూ యువతి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ యువతి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం గాలించగా, కచేరీ మసీదు ఇమామ్ (మౌలానా) మన్సూర్ కుమారుడు ఫైజ్ ఆమెను మభ్యపెట్టి తన వెంట తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలిసింది. యువతి స్నేహితురాలి ద్వారా ఈ సమాచారం బయటకు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు.అనంతరం అఖిల భారత హిందూ సురక్షా సంఘటన్ కార్యకర్తలతో కలిసి బాధిత కుటుంబీకులు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. తమ కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేసే అవకాశం ఉందని, ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇది కూడా చదవండి: జాబిల్లిపై రాకెట్ క్రాష్.. భారీ గుంతను గుర్తించిన నాసా! -
మార్గాని భరత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
సుగాలి పార్వతిని అడ్డుకున్న పోలీసులు
-
సుగాలి పార్వతి అడ్డగింత.. కర్నూలులో ఉద్రిక్తత
సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసుకు తొమ్మిదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఆమె తల్లి పార్వతి చేపట్టిన యాత్రను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. యాత్ర చేపట్టకుండా అడ్డుకోవడంతో పాటు బంధువులతోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో కర్నూలులో ఉద్రిక్తత నెలకొంది.సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరగాలనే డిమాండ్‌తో ఆమె తల్లి పార్వతి చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు నుంచి అమరావతి వరకు వీల్‌చైర్ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. తన గోడును ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు అమరావతికి వెళ్లాలని భావించారు.అయితే యాత్రకు అనుమతి లేదని పోలీసులు ఆమెకు తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ ముందుగానే ఆమె నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. యాత్రకు సిద్ధమైన సమయంలోనూ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నేటితో తొమ్మిదేళ్లు..సుగాలి ప్రీతి కేసుకు నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2017లో కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. అప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు తమ కుమార్తెకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు. కేసులో దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని వారు పలుమార్లు ప్రభుత్వాలను కోరారు. సంవత్సరాలు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని ప్రీతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పవన్ మోసంపై పార్వతి ఆవేదనజనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పార్వతి గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ తన కుమార్తె కేసులో న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘న్యాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు’’ అంటూ ఆమె వాపోయారు.జగన్ హయాంలో న్యాయంవైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. సుగాలి ప్రీతి కేసులో న్యాయం అందించేందుకు ప్రయత్నించారు. కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించే ప్రయత్నం చేయడంతో పాటు ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత కూడా అందించారు. అయితే తిరిగి కూటమి అధికారంలోకి వచ్చాక కేసును పక్కన పడేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.పోరాటం కొనసాగిస్తాతన కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని పార్వతి చెబుతున్నారు. వీల్‌చైర్ యాత్రను పోలీసులు అడ్డుకోవడంపై ఆమె, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనుమతి లేకుండా యాత్ర చేపట్టేందుకు వీలు లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సుగాలి ప్రీతి కేసుకు తొమ్మిదేళ్లు పూర్తయిన రోజే.. న్యాయం కోసం ఆమె తల్లి చేపట్టిన యాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించడం మరోసారి ఈ కేసును చర్చలోకి తెచ్చింది. -
భారీ ‘కల్తీ ముఠా’ గుట్టురట్టు (ఫోటోలు)
-
ఎస్సైల ఎస్కేప్.. టీడీపీ నేత కారులోనే!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోలీసుల కారులో గంజాయి, మద్యం బాటిళ్లు దొరికిన ఘటనలో తవ్వుతున్న కొద్దీ విస్మయం కలిగించే వాస్తవాలు బయటపడుతున్నాయి. గ్రానైట్ మాఫియా, పోలీసుల మధ్య గల సంబంధాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. మద్యం మత్తులో ఆటోను ఢీకొన్న కారులోంచి బయటపడిన ఇద్దరు ఎస్సైలను ఎవరు తప్పించారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారు డిక్కీలో ఏముందో అద్దంకి సీఐకు ముందే సమాచారం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారు ప్రమాదానికి కారణమైన ఎస్సైలను సేఫ్‌గా తప్పించడం వెనుక ఉన్న పెద్దలు ఎవరన్న దానిపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. టీడీపీ నేత కారులోనే తప్పించుకున్న ఎస్సైలు ఈర్ల గంగమ్మ గుడి వెనుక కొత్తగా నిర్మించిన ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భారీ పార్టీ జరిగింది. బల్లికురవ నుంచి దాచేపల్లి, గురజాల వరకు ఉన్న పోలీసు స్టేషన్ల ఎస్సైలతో పాటు ఒక సీఐ, ఓ మంత్రి పీఏ, అతడి అనుచరులు, గ్రానైట్ వ్యాపారులు హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. గ్రానైట్ డీల్‌లో భాగంగానే ఈ పార్టీ జరిగిందని, పార్టీ ముగిసిన తరువాత డీల్‌లో చేతులు మారిన నగదును తీసుకుని బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు కారులో బయలుదేరినట్లు ఆరోపణలున్నాయి.కారులో కూడా ఎస్సైలు మద్యం తాగుతూనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద కారు అదుపుతప్పి మొదట ఒక బైక్ మీదకు పోయిందని, దాన్ని తప్పించబోయే క్రమంలో వెనుక వస్తున్న ఆటోను ఢీకొట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో కారు ప్రమాదానికి గురికాగా.. వెంటనే అద్దంకి సీఐ సుబ్బరాజు అప్రమత్తమయ్యారు. ఆగమేఘాల మీద ఘటనా స్థలానికి చేరుకుని ఎస్సైలను కాపాడే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. గ్రామస్తుల కళ్లుగప్పి ఒక టీడీపీ నేత కారులో ఎస్సైలను తప్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ టీడీపీ నేతకు ఎవరు సమాచారం ఇచ్చారనే దానిపై చర్చ నడుస్తోంది. అద్దంకి పోలీసులే ఆ టీడీపీ నాయకుడిని పురమాయించినట్లు ప్రచారం జరుగుతోంది. డిక్కీలో ఏముందో సీఐకి ముందే తెలుసా? కారులో మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తులను చూసిన గ్రామస్తులు కారు డిక్కీ తెరవాలని పట్టుబట్టారు. అయితే కారు డిక్కీని తెరవకుండా సీఐ సుబ్బరాజు తీవ్రంగా ప్రయతి్నంచారు. ఒకదశలో గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. కారు డిక్కీలో ఏమీ లేకపోతే సీఐ సుబ్బరాజు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారని, గ్రామస్తులపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారన్న చర్చ సాగుతోంది. కారు డిక్కీలో గంజాయి, మద్యంతో పాటు పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు సీఐ సుబ్బరాజుకు ముందే సమాచారం ఉందని, అందుకే ఆయన గ్రామస్తులు దాన్ని తెరవకుండా అడ్డుకునేందుకు ప్రయతి్నంచాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. కారు డిక్కీ తెరవకుండా చూడడంలో విఫలం చెందారని ప్రభుత్వ పెద్దలు సీఐని తలంటినట్లు ప్రచారం జరుగుతోంది. పొట్టేళ్లు కోశాం.. వంట చేశాంకారు ప్రమాదం వెనుక ఈర్ల గంగమ్మ గుడి వద్ద పార్టీ జరిగిన విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు దాస్తున్నారో అర్థం కావడం లేదని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గంగమ్మ తల్లిని దర్శించుకుని వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ వివరణ ఇచ్చారు. ఆదివారం అద్దంకి పోలీసు స్టేషన్లో మాట్లాడిన ఎస్పీ మాత్రం ఈ విషయాన్ని అసలు ప్రస్తావించలేదు. కానీ.. బల్లికురవ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వారు తామే పొట్టేళ్లు కోశామని చెబితే, తామే వంట చేశామని మరికొందరు చెప్పుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కొందరు మహిళలు మాట్లాడుకుంటున్న ఆడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఆడియోలో గంగమ్మ తల్లి గుడి వెనుక ఉన్న ఫంక్షన్ హాల్లో పోలీసుల పార్టీ జరిగిందని, ఇక్కడ తాగి వెళ్లిన పోలీసులు అక్కడ యాక్సిడెంట్ చేశారని చెప్పుకోవడం వినిపించింది. పోలీసు పార్టీలో బల్లికురవ, అద్దంకి, సంతమాగులూరు ఎస్సైతోపాటుగా అనేకమంది పోలీసులు పాల్గొన్నట్లు చెప్పుకోవడం వినిపిస్తోంది. ఈ పార్టీకి ఎల్లో మీడియాకు చెందిన ప్రతినిధులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. పార్టీ జరిగిన విషయం బహిర్గతమైతే గ్రానైట్ డీల్ విషయం బయట పడుతుందని, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసు అధికారులు ఈ విషయాన్ని దాటవేస్తున్నారని చెప్పుకుంటున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు ఎందుకు చేయలేదు? కారు ప్రమాదానికి కారణమైన పోలీసులు మద్యం మత్తులో ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తుండగా.. ఎస్సైలు ఆస్పత్రిలో ఉన్నట్లు పోలీసు అధికారే చెప్పారని, అయితే మద్యం తాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైలకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.ఆస్పత్రిలో రాజీ యత్నాలు పోలీసుల కారు ఢీకొన్న ఘటనలో గాయపడిన కొందరు అద్దంకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాలని బాధితులపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ యాక్సిడెంట్ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టాలని, ఎంత ఖర్చయినా పెట్టుకుంటామని బలవంతం చేస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. బాధితులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్టేట్మెంట్ మీద పోలీసులు సంతకాలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. పోలీసు అధికారులెవరూ ఘటనా స్థలాన్ని పరిశీలించలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కేసులను ఎత్తేయాల్సిందే
న్యూఢిల్లీ: చలో సంసద్ ర్యాలీ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తత వేళ విద్యార్థులపై పోలీసులు మోపిన కేసులను రద్దుచేసేందుకు సుప్రీంకోర్టు సానుకూలత వ్యక్తంచేసినా అందుకు మోదీ ప్రభుత్వం సముఖంగా లేదని కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘జూలై 25న సీజేపీకి మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి. ఈ దిశలో ఆలోచనచేసిన సుప్రీంకోర్టు ఎదుట ప్రభుత్వం మోకాలడ్డొద్దు. అలా చేస్తే సీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ రెండ్రోజుల్లో సమావేశమై మళ్లీ జాతీయస్థాయి ఉద్యమానికి రంగం సిద్ధంచేస్తుంది’’అని ఆయన హెచ్చరించారు. ‘‘విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల జాబితా ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరితే ప్రభుత్వం ఆ జాబితాను ఉద్దేశపూర్వకంగా అందజేయలేదు. జాబితా ఇస్తే ఆ కేసులన్నింటినీ 142వ అధికరణం ద్వారా దఖలుపడిన అధికారం ద్వారా రద్దుచేస్తామని కోర్టు మంగళవారం మూడు సార్లు గుర్తుచేసి, జాబితా అడిగినా ప్రభుత్వం సమర్పించలేదు. ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయాలకు తగ్గట్లే దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇద్దరు కేంద్ర మంత్రులు మాట ఇచ్చి తప్పారు. యావత్ భారత దేశ యువత నమ్మకంతో ఆటలాడతామంటే మేం చూస్తూ ఊరుకోం. ఇకనైనా కోర్టు నియమించిన హైపవర్ కమిటీలో సీజేపీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. పోలీసుల దారుణాలను వివరించే అవకాశం ఇవ్వాలి’’అని దాస్ కోరారు. -
‘గంజాయి’ వెనుక ‘గ్రానైట్’ పార్టీ!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పోలీసుల కారులో గంజాయి, మద్యం బాటిళ్లు దొరకిన ఘటన వెనుక అత్యంత కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనకు ముందు అధికార కూటమి గ్రానైట్ మాఫియాకు అండదండలందిస్తున్న పోలీసులు అందరికీ మాఫియా పెద్దలు పెద్ద పార్టీ ఇచ్చారని, అందులో పాల్గొని వస్తుండగా పోలీసుల వాహనం ఆటోను ఢీకొనడం, ఆ కారులో గంజాయి, మద్యం బాటిళ్లు బయటపడి.. మొత్తం గుట్టు రట్టయిందని సమాచారం. ఇదే కారులో ఓ నీలం రంగు బ్యాగు కూడా లభ్యమైందని, దానిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన తర్వాత పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు, భిన్నమైన ప్రకటనలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కరకట్ట ప్యాలెస్ డైరెక్షన్లో ఈ కేసును నీరుగార్చేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావును కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.పోలీసులు మద్యం తాగారా?ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద ఆదివారం సాయంత్రం ఆటోను పోలీసుల కారు ఢీకొట్టిన సమయంలో కారు డ్రైవర్ చేతిలో మద్యం బాటిల్ ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. కారులో మిగిలిన వారు కూడా మద్యం తగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు సివిల్ డ్రెస్సులో ఉండటంతో వారిని గ్రామస్తులు గుర్తించలేదు. దాంతో కారు డిక్కీలో ఏముందో చూడాలని పట్టుబట్టారు. డిక్కీ తెరవగా అందులో గంజాయి, మద్యం బాటిళ్లు, పోలీసు యూనిఫాంలు బయటపడ్డాయి. అక్కడకొచ్చిన అద్దంకి సీఐ సుబ్బరాజు గ్రామస్తులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులకు, సీఐకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది జరుగుతుండగానే కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు చల్లగా జారుకున్నట్లు చెబుతున్నారు. పోలీసు అధికారులు చెప్పినట్లు గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని ఛేజ్ చేస్తూ వచ్చి ఉంటే గ్రామస్తులకు ఆ విషయం ఎందుకు చెప్పలేదని, అక్కడి నుంచి ఇద్దరు ఎస్సైలు ఎందుకు జారుకున్నారన్న ప్రశ్నలకు అధికారుల నుంచి జవాబు లేదు.బ్లూ బ్యాగులో భారీ మొత్తంలో నగదు?పోలీసుల కారు డిక్కీలో ఒక బ్లూ కలర్ బ్యాగు కూడా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ బ్యాగులో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే గ్రామస్తులు డిక్కీ తెరవాలని ఒత్తిడి చేసినప్పుడు సీఐ సుబ్బరాజు అడ్డుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బ్యాగులో డబ్బులున్నది నిజమైతే అంత భారీ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.గ్రానైట్ డీల్‌లో భాగంగానే పార్టీ జరిగిందా?చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘పచ్చ గ్రానైట్ మాఫియా’ రెచ్చిపోతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల కనుసన్నల్లో గ్రానైట్ అక్రమ రవాణా భారీ ఎత్తున జరుగుతోంది. పైగా, గ్రానైట్ మాఫియా మూడు గ్రూపులుగా విడిపోయింది. వారి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు సమాచారం. బల్లికురవ నుంచి తరలిస్తున్న గ్రానైట్ తమ నియోజకవర్గం మీద నుంచి తరలిస్తున్నారని, తమకు కూడా కప్పం చెల్లించాలని పల్నాడుజిల్లా గురజాల నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వివాదాన్ని ఇటీవల సీఐగా పదోన్నతి పొందిన ఒక ఎస్సై, మరో ఎస్సై రాజీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో బల్లికురవ నుంచి దాచేపల్లి, గురజాల వరకు ఉన్న పోలీసు స్టేషన్ల ఎస్సైలకు, కొందరు పెద్ద అధికారులకు మాఫియా పెద్దలు ఈర్లకొండలో భారీ మందు పార్టీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ పార్టీ ఏర్పాటులో ఒక మంత్రి పీఏ ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈర్ల గంగమ్మ గుడి వద్ద నాలుగు పొట్టేళ్లను కోసి పార్టీ ఇచ్చినట్లు స్థానిక ప్రజలు అంటున్నారు. దర్శి సబ్ డివిజన్‌కు సంబందించి ఒక కీలక పోలీసు అధికారి కూడా ఈ విందుకు వచ్చినట్లు చెబుతున్నారు. దర్శి డివిజన్లో ఎస్సైగా పనిచేసి ఇటీవల సీఐగా పదోన్నతి పొందిన అధికారి ఈ పార్టీ ఏర్పాటు, గ్రానైట్ డీల్‌లో కీలక పాత్ర పోషించినట్లు పోలీసు శాఖలో చర్చసాగుతోంది.ఇద్దరు అధికారులు.. రెండు కథనాలుఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రమాదం జరిగి, పోలీసుల గంజాయి గుట్టు బయటపడింది. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పాకిపోయింది. దీనిపై అర్ధరాత్రి 11.45 గంటలకు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఒక వీడియో విడుదల చేశారు. ఇటీవల బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లో జరిగిన అనేక చోరీలను పోలీసులు ఛేదించారని, ఈ నేపథ్యంలో ఎస్సైలు ఈర్ల గంగమ్మ తల్లిని దర్శించుకుని వస్తుండగా ధర్మవరం వద్ద ఒక అనుమానితుడు కనిపించాడని, పోలీసులను చూసి భయంతో అతని వద్ద ఉన్న గంజాయి, మద్యం బాటిళ్లను పడేసి పరారయ్యాడని డీఎస్పీ ఆ వీడియోలో చెప్పారు.నిందితుడిని వెంబడించే క్రమంలో పోలీసుల కారు ఆటోను ఢీకొట్టినట్లు చెప్పుకొచ్చారు. దర్శి డీఎస్పీ వివరణకు పూర్తి భిన్నంగా మరో అధికారి చెప్పడం గమనార్హం. కొమ్మాలపాడు గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లారని, పోలీసులను చూసి నిందితుడు తన వద్ద ఉన్న గంజాయి, మద్యం బాటిళ్లను పారేసి పరారైనట్లు ఆ అధికారి చెప్పారు. అతడిని వెంబడించే క్రమంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ రెండు వివరణల్లో ఏది నిజమో పోలీసు అధికారులే చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.పోలీసులు పారిపోలేదు.. మద్యం తాగలేదు శంఖవరప్పాడు ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్థనరాజు వివరణఅద్దంకి: ‘యాక్సిడెంట్ జరిగింది. అక్కడే ఉన్న మా ఎస్ఐలు గ్రామస్తులతో తాము బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు అని చెప్పారు’ అని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్లో ఆయన సోమవారం అద్దంకి మండలం శంఖవరప్పాడులో జరిగిన ఘటనపై మాట్లాడారు. ‘‘పోలీసులు పారిపోయారంటున్నారు. వారు ఎక్కడికీ పారిపోలేదు. తాగిన మత్తులో ఉన్నారని చెప్పడం అవాస్తవం. యాక్సిడెంట్ కావడం సహజం. ఓ నిందితుని వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్న క్రమంలో శంఖవరప్పాడు వద్దకు రాగానే, ఎదురుగా రాంగ్ రూట్లో ఆటో, బైక్ వస్తున్నాయి. బైక్‌ను తప్పించబోయి ఆటోను కారు ఢీ కొట్టింది. ఎస్ఐలు వైద్యశాలలో ఉన్న ఆధారాలు ఉన్నాయి. గంజాయి దొరికిన దాని గురించి విచారణ చేసి ప్రెస్‌మీట్ పెడతాం. పోలీసులు రకరకాల ఆపరేషన్లు చేస్తారు. ఆ క్రమంలో వారు ప్రైవేటు వెహికల్లో వచ్చారనడం నేరం కాదు. ఓ వాహనాన్ని తప్పించబోయి యాక్సిడెంట్ జరిగింది. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తోంది’ అని చెప్పారు. -
హే రామ్!.. పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం బాటిళ్లా?
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద పోలీసు వాహనంలో గంజాయి, మద్యం బాటిళ్లు దొరకటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తేం రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? అంటూ ఎత్తిచూపారు. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే.. వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? అంటూ ప్రశ్నించారు. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోందంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు.రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వేధించడంపై చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టాలంటూ చురకలంటించారు. ఈ ఘటనను కూడా మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి.. డైవర్ట్ చేయకండి.. నిష్పక్షపాత విచారణ జరిపించి, తప్పుచేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తూ ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే...ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?‘‘హే రామ్! గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? చంద్రబాబు గారూ.. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని ఏదో ఒక్క ఘటనగా కొట్టిపారేయలేం.రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజలకోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, మీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి, వాడుకున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోంది.నిజాన్ని బయటపెట్టడమే నేరమా?ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు, తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ ఒక ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్నవాళ్లు తీవ్రంగా గాయపడ్డం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును చుట్టుముట్టడం, ఆ కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కార్ డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫాం దొరకడం, చివరకు అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారి, జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే, ‘‘వీడియోలు తీయొద్దు, కేసులు పెడతాం’’ అని అక్కడకు చేరుకున్న మరో సీఐ, బెదిరిస్తున్నారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. నిజాన్ని బయటపెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్పా?నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా?ఈ ఇద్దరు పోలీసు అధికారులు ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, మద్యం, గంజాయి అక్కడ వాడారని, ఆ పార్టీలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారన్న సమాచారం మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న ఆ ఇద్దరు పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు తప్పించారన్న ఆరోపణలు కూడా అత్యంత తీవ్రమైనవి. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థతో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు ఎంత లోతుకు వెళ్లిందో ఈ ఘటన బయటపెడుతోంది. అలాంటప్పుడు రాష్ట్రంలో పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు గారూం.. రోజూ గంటలకొద్దీ పైకి నీతి కబుర్లు చెబుతూ, లోపల రాజకీయ కుట్రలు, కక్షసాధింపులతో వ్యవస్థలను విషపూరితం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం మీద చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలపై, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టండి. ఈ ఘటనను కూడా మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి. డైవర్ట్ చేయకండి. నిష్పక్షపాత విచారణ జరిపించి, తప్పుచేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోండి. ఘటనను నిలదీసిన ప్రజలపై మళ్లీ రెడ్‌బుక్ ప్రయోగించకుండా, వీడియోలు తీసిన వారిని వేధించకుండా నిజాయితీగా వ్యవహరించండి’’. -
పోలీసులే కొట్టి నా కుమారుడిని చంపేశారు!
రామభద్రపురం/పార్వతీపురం రూరల్: తన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అనురాధ ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొండకెంగువకి చెందిన తన కుమారుడు బండారు మణికంఠ(22)ను ఈ నెల 7న సాలూరు పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. తాను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కొడుకును చూపించాలని ప్రాథేయపడినా చూపించలేదని, విచారణలో మణికంఠపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో అతడి ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు.అస్వస్థతకు గురైన అతడిని సాలూరు సీహెచ్‌సీకి తరలించి తమకు పోలీసులు సమాచారమిచ్చారని, తాము వెళ్లి చూడగా మణికంఠ స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో మంచం మీద పడి ఉన్నాడని వివరించారు. మెరుగైన వైద్యం కోసం సాలూరులో ఉన్న ఓ ప్రైవేటు అస్పత్రికి తరలించగా ఆరోగ్యం క్షీణించిందని, దీంతో విజయనగరం మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మణికంఠ మృతి చెందాడని చెప్పారు. కాగా, పోలీసుల చిత్రహంసల వల్లే తన మణికంఠ మృతి చెందాడని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అతడి తల్లి, బంధువులు కొండకెంగువ రోడ్డుపై మృతదేహంతో నిరసన తెలిపారుఅనారోగ్యంతోనే మృతి: ఎస్పీకాగా, పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే మణికంఠ మృతి చెందాడన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి స్పష్టం చేశారు. మణికంఠకు జడ్జి రిమాండ్ విధించారని, దానికి తరలించే క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించగా..అప్పటికే అతడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని, దీంతో వైద్యుల సూచన మేరకు అతడు ‘రిమాండ్‌కు అనర్హుడు’అని నిర్థారించి, 41ఏ కింద నోటీసు జారీ చేసి అతడిని ఆయన సోదరుడికి అప్పగించామని చెప్పారు. జ్వరం తీవ్రం కావడంతో అదే రోజు అర్ధరాత్రి విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.మలేరియా, పచ్చకామెర్లు, మెదడువాపు లాంటి ఆరోగ్య సమస్యలతో ప్లేట్లెట్లు పడిపోయి, అవయవాలు విఫలమవడం వల్లే మణికంఠ మరణించాడని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. -
మోదీ కోసం పోలీస్ ఉద్యోగానికి రాజీనామా..2029 వరకు చెప్పులు వేసుకోనని శపథం!
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విధానాలకు మద్దతుగా గుజరాత్లో ఓ పోలీసు ఉద్యోగి తన పదవికి రాజీనామా చేశారు. తూర్పు కచ్‌లోని అడేసార్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రామ్‌గర్ మోహన్‌గర్ గోసాయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టడానికి, ప్రధాని మోదీ దేశంలోని యువత కోసం చేపడుతున్న విధానాలకు మద్దతుగా నిలవడమే తన నైతిక బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో ఈ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి నేను ఎంతో కష్టపడ్డాను. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా.. నేరుగా రంగంలోకి దిగి మోదీ ప్రభుత్వానికి, ఆర్ఎస్ఎస్కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. ఎలాంటి లాభాపేక్ష లేకుండా దేశ సేవకు అంకితమైన ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ఇకపై పూర్తిగా భాగస్వామి అవుతాను’ అని వెల్లడించారు. అంతేకాకుండా, 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిచి, ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు తాను ఎలాంటి చెప్పులు ధరించనని శపథం చేయడం గమనార్హం. કચ્છમાં પોલીસ કોન્સ્ટેબલનું રાજીનામું!આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રામગર ગુસાઈએ 2019થી પોલીસ સેવામાં રહ્યા બાદ રાજીનામું આપ્યું. RSSમાં સેવા આપવા માટે નોકરી છોડ્યાનો દાવો.રામગર ગુસાઈનું નિવેદન: “2029માં મોદી સરકાર અને સંઘ સરકાર નહીં બને ત્યાં સુધી પગમાં પગરખાં… pic.twitter.com/kIrk6Kezgq— Benefit News 24 (@BenefitNews24) August 15, 2026 -
ఆటోడ్రైవర్ ఇంట్లో నోట్ల కట్టలు.. 4 బ్యాగుల్లో రూ.3 కోట్లు
భోపాల్: ఒక చిన్న ఇల్లు అది.. పోలీసులు తలుపులు తెరిచారు అంతే.. బయటికి కనిపించని ఓ భారీ రహస్యం ఒక్కసారిగా బయటపడింది. సాధారణంగా కనిపించే ఆ ఇంట్లో దాచిన డబ్బును చూసి అక్కడికి వెళ్లిన వారే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో పోలీసులకు రూ.3 కోట్లకు పైగా నగదు దొరికింది. అయితే పోలీసులు అక్కడికి వెళ్లింది డబ్బు కోసం కాదు.. సోషల్ మీడియాలో ఆ డ్రైవర్ చేతిలో కనిపించిన పిస్టల్ ఫొటోపై విచారణ కోసం.గోపాల్‌గంజ్ పోలీస్‌లు ఆటో డ్రైవర్ సౌరభ్ అహిర్వార్ ఇంట్లో సోదాలు చేశారు. ఆ సమయంలో ఓ లాక్ చేసిన అల్మారా కనిపించింది. దాని తాళం కుటుంబ సభ్యుల వద్ద లేకపోవడంతో పోలీసులు నిబంధనల ప్రకారం దాన్ని తెరిచారు. అందులో 4 బ్యాగుల్లో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి.ఒక్క బ్యాగులోనే సుమారు రూ.1.33 కోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నాలుగు బ్యాగుల్లో కలిపి మొత్తం రూ.3 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు తేలింది. డబ్బును లెక్కించేందుకు కరెన్సీ కౌంటింగ్ మెషీన్ ఉపయోగించారు. సోదాలు, నగదు లెక్కింపు ప్రక్రియను వీడియోలో రికార్డు చేశారు.ఈ డబ్బు తమది కాదని కుటుంబ సభ్యులు చెప్పారు. రమేశ్ అహిర్వార్ అనే బంధువు డబ్బును 8-9 నెలల క్రితం అక్కడ ఉంచి వెళ్లారని వారు తెలిపారు. రమేశ్ అహిర్వార్ భోపాల్‌లోని చునాభట్టి ప్రాంతంలో ఉంటారని, పీడబ్ల్యూడీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారని కుటుంబం చెబుతోంది.అయితే రూ.3 కోట్ల నగదును ఎందుకు ఇంట్లో ఉంచారు? డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి చట్టబద్ధమైన ఆధారాలు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదాయపు పన్ను, రెవెన్యూ తదితర సంబంధిత విభాగాలకు కూడా సమాచారం ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రస్తుతం ఆ డబ్బు పీడబ్ల్యూడీ ఇంజినీర్‌దేనని పోలీసులు నిర్ధారించలేదు. అది రమేశ్ అహిర్వార్దేనని కుటుంబ సభ్యులు చేసిన వాదన మాత్రమే. పోలీసులు నగదు మూలాన్ని విచారిస్తున్నారు. -
పోలీస్తో నడిరోడ్డుపై కలబడిన ఆ పార్టీ నేత
బెంగళూరు: విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్‌పై జేడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజునాథ్ అలియాస్ గొట్టిగెరె మంజన్న దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో కర్ణాటకలోని హుళిమావు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. కానిస్టేబుల్ అరుణ్ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాలు వెళ్లేందుకు వీలుగా మంజన్న వాహనాన్ని చేతి సైగతో ఆపారు.తన వాహనాన్ని ఆపడంపై మంజన్న అభ్యంతరం వ్యక్తం చేసి కానిస్టేబుల్‌ను ప్రశ్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో మంజన్న అరుణ్ చొక్కా కాలర్ పట్టుకుని, మరో వ్యక్తి సహాయంతో అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ప్రకారం.. మంజన్న ఫోన్లో ఓ ఉన్నత స్థాయి పోలీసు అధికారితో మాట్లాడుతున్నట్లు, కానిస్టేబుల్‌ను కాలితో తన్నేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాగ్వాదం తర్వాత మంజన్న ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసి తన వాహనాన్ని కానిస్టేబుల్ ఆపిన విషయంపై ఫిర్యాదు చేశారు. అనంతరం కానిస్టేబుల్‌ను మంజన్నకు క్షమాపణ చెప్పేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్య దిగువ స్థాయి పోలీసు సిబ్బందికి ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.ప్రజలు, హుళిమావు ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానిస్టేబుల్ ఇంటికి వెళ్లిన తర్వాతే ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని ఓ సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. అనంతరం విచారణ కోసం అతడిని తిరిగి పిలిపించారు.ఈస్ట్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ బనోత్ గతంలో మాట్లాడుతూ.. హుళిమావు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకునే ఉద్దేశంతో దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగానికి పాల్పడటానికి సంబంధించిన నిబంధనలతో పాటు వర్తించే ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మంజన్నను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.Janata Dal (Secular) leader Manjunath C., popularly known as Gottigere Manjanna, 65, was arrested for allegedly assaulting an on-duty traffic police constable at Gottigere Junction in Bengaluru.According to police, the incident occurred around 3 p.m. on Sunday, August 16,… https://t.co/Pbm8jwfMLZ pic.twitter.com/xCGTtAQxFg— Hate Detector 🔍 (@HateDetectors) August 17, 2026 -
పోలీసు కారులో గంజాయి.. టీడీపీ కారులో పరారైన పోలీసులు..
-
పోలీసుల కారులో గంజాయి కలకలం
-
పోలీసుల కారులో గంజాయి, మద్యం
సాక్షి టాస్క్‌ఫోర్స్: చంద్రబాబు ఏలుబడిలో రాష్ట్రంలో గంజాయి, మద్యం రవాణా, వినియోగం ఏ స్థాయికి చేరుకున్నాయో.. పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పేందుకు ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని శంఖవరప్పాడు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. పోలీసులు ప్రయాణిస్తున్న కారులో మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు, పోలీసు యూనిఫాంలు ఉండడం కలకలం రేపుతోంది. అంతేకాక, మద్యం మత్తులో ఉన్న పోలీసు కారు డ్రైవర్ ఓ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలోని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్సై నాగరాజు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటన గురించిన సమాచారం అందుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు అక్కడకు చేరుకుని వీడియో తీస్తున్న గ్రామస్తులను బెదిరించడం గమనార్హం..ఎస్సై ప్రైవేటు పార్టీ..బల్లికురవ ఈర్లకొండ వద్ద ఎస్సై నాగరాజు ప్రైవేటు పార్టీ నిర్వహించినట్లు చెబుతున్నారు. అక్కడ ఆయన పలువురు ప్రముఖులకు మద్యం పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో మిగిలిన మద్యాన్ని, గంజాయిని తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు అర్ధమవుతోందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్సై నాగరాజు ప్రమాద ఘటన తరువాత ధర్మవరంకు చెందిన ఓ టీడీపీ నాయకుడి కారులో పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు.మద్యం మత్తులో యాక్సిడెంట్..ఈర్లకొండలో పార్టీ అయిపోయిన తర్వాత ఏపీ 27 సీబీ 4789 నంబరు గల కారులో పోలీసులు బల్లికురవ వైపు నుంచి అద్దంకి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో ధర్మవరం నుంచి వస్తున్న ఆటోను కారు డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టాడు. ఆటో డ్రైవర్ శ్రీనివాసరెడ్డితో పాటు ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు కారును చుట్టుముట్టారు. 108కు ఫోన్ చేసి స్థానికులు క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.గ్రామస్తులకు సీఐ బెదిరింపులు..ఘటనా స్థలి వద్దకు గ్రామంలోని వారు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రమాదానికి కారణమై దెబ్బతిన్న కారు డిక్కీని స్థానికులు తెరిచి చూడగా అందులో మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు, బల్లికురవ, సంతమాగులూరు ఎస్సైల పోలీసు యూనిఫాంలు ఉన్నాయి. అదేవిధంగా కారు లోపల సంతమాగులూరు, బల్లికురవ ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, నాగరాజులున్నట్లు గుర్తించారు. కారును నడుపుతున్న డ్రైవరు సైతం మద్యం సేవించి ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులే గంజాయి, మద్యం రవాణా చేస్తుండడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. సమాచారం అందుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకున్నారు. కారు వద్ద ఉన్న గ్రామస్తులను అక్కడి నుంచి పంపించివేశారు. వీడియో తీస్తే మీ మీద కేసులు పెట్టి లోపలేస్తానని గ్రామస్తులను బెదిరించడం గమనార్హం. పోలీసుల కారులో గంజాయి, మద్యం రవాణానా?గంజాయి లేని ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత ఈ ఘటనకు ఏం సమాధానం చెబుతారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ప్రశ్నించారు. పోలీసులే మద్యం మత్తులో ఆటోను ఢీకొట్టడం, పోలీసుల వాహనంలోనే మద్యం, గంజాయి రవాణా చేయడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు. మద్యం, గంజాయి రవాణా చేస్తూ ఎస్సైలు దొరికిపోయినా సీఐ వచ్చి వీడియోలు తీస్తే లోపలేస్తానంటూ గ్రామస్తులను బెదిరించడమేమిటని అశోక్‌కుమార్ ప్రశ్నించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మద్యం, గంజాయితో దొరికిపోయిన ఎస్సైల మీద, గ్రామస్తులను బెదిరించిన సీఐ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాను బొంబాయికి రాను పాటకి యూనిఫామ్ లోనే పోలీసులు చిందులు
-
శవపేటిక: షాప్‌లో కెమెరా ఆఫ్.. శ్మశానంలో కెమెరా ఆన్!
నగర శివార్లలో శవపేటికలు తయారు చేసే డేవిడ్, తన తమ్ముడు జోసెఫ్ కనిపించడం లేదని ఆందోళనగా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ‘సార్, జోసెఫ్ రోజూలాగే షాప్‌కు వచ్చాడు, కానీ రాత్రికి ఇంటికి రాలేదు. నేను షాప్ మూసేసి వెళ్లాను కానీ, అనుమానం వచ్చి తిరిగి చూస్తే జోసెఫ్ లేడు.’ అని ఫిర్యాదు చేశాడు. అన్నదమ్ములు ఇద్దరూ నగర శివార్లలో శవపేటికలు తయారు చేసే వృత్తిలో ఉన్నారు. ‘రాత్రి నా ఒంట్లో నలతగా ఉంటే పెందరాళే ఇంటికి వెళ్ళాను.’ అని డేవిడ్ చెప్పాడు ఆందోళన నిండిన స్వరంతో...క్రైమ్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ అభిమన్యు డేవిడ్ వైపు పరిశీలనగా చూశాడు. నిజం బయటపడే వరకు, సరైన సాక్ష్యం దొరికేవరకు అందరూ అనుమానితులే అని బలంగా నమ్ముతాడు అభిమన్యు.ఇన్ స్పెక్టర్ అభిమన్యు నేరుగా శవపేటికల తయారీ షాప్‌కు చేరుకున్నాడు. షాప్ మొత్తం వెతికిన అభిమన్యుకు ఒక కీలక విషయం తెలిసింది. ఆ రోజు రెండు శవపేటికలకు ఆర్డర్ వచ్చింది. అయితే, దర్యాప్తులో తేలిందేంటంటే, ఆర్డర్ తీసుకున్న వ్యక్తి రెండు శవపేటికలు తీసుకువెళ్లలేదు, కేవలం ఒకటే తీసుకువెళ్లాడు. మరి రెండో శవపేటిక ఏమైంది? అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అదే రోజు పని చేయకపోవడం అనుమానానికి తావిచ్చింది. ఎవరో కావాలనే వాటిని నిలిపివేశారని అభిమన్యు గ్రహించాడు.అభిమన్యు తన పరిశోధనను మరింత లోతుగా పెంచాడు. అతను కేవలం ఫిర్యాదుపై ఆధారపడకుండా, ఆ ప్రాంతంలోని ఇతర వ్యాపారులను విచారించాడు. జోసెఫ్ చివరిగా ఎవరితో మాట్లాడాడో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. శవపేటికల ఆర్డర్ ఇచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించినప్పుడు, అతనికి ఒక విషయం స్పష్టమైంది.వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, నగరం శివార్లలోని శ్మశానవాటిక ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించాడు. దూరంగా ఉన్న ఒక కెమెరాలో అతనికి ఒక దృశ్యం కనిపించింది. అర్ధరాత్రి, ముఖానికి మాస్క్ వేసుకున్న వ్యక్తి ఒక శవపేటికను తీసుకువచ్చి అక్కడ పాతిపెడుతున్నాడు. ఆ వ్యక్తి నడక, అభిమన్యులో అనుమానాన్ని పెంచింది. నేర పరిశోధనలో అతని మెదడు చురుగ్గా పని చేస్తుంది. వెంటనే తన బృందంతో శ్మశానానికి చేరుకున్న అభిమన్యు, ఆ కొత్తగా పాతిపెట్టిన శవపేటికను బయటకు తీయించాడు. లోపల విగతజీవిగా పడి ఉన్న జోసెఫ్‌ను చూసి అందరూ షాకయ్యారు. తమ్ముడిని డేవిడే చంపాడని అభిమన్యుకు పూర్తి స్పష్టత వచ్చింది.∙∙తలుపుల మీద బాదుతున్న శబ్దం విని తాగుతున్న విస్కీ గ్లాస్ తీసి టీపాయ్ కింద దాచేసి తలుపులు తెరిచాడు డేవిడ్. ఎదురుగా ఇన్స్పెక్టర్ అభిమన్యును చూసి కంగారు పడ్డాడు. ‘మీరా... మా తమ్ముడు దొరికాడా?’ అని తడబడుతూ అడిగాడు. ‘దొరికాడు.. నువ్వు చంపి దాచిపెట్టిన శవపేటికలో... నువ్వు పాతిపెట్టిన శ్మశానంలో...’ అని అభిమన్యు డేవిడ్ వైపే చూస్తూ చెప్పాడు. డేవిడ్ ముఖంలో రంగులు మారాయి. అప్పటికే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.‘నేనా... నేను నా తమ్ముడిని చంపుకుంటానా?’ డేవిడ్ కోపాన్ని నటిస్తూ అన్నాడు.‘చంపుకుంటావు... ఎందుకంటే నీ తమ్ముడి ఆస్తిని కాజేయాలని... ఆర్డర్ చేసినవాళ్లు ఒక శవపేటిక మాత్రమే తీసుకువెళ్లారు. మరో శవపేటికలో నీ తమ్ముడిని చంపి శవపేటికలో పెట్టి, ఖాళీ శవపేటిక తీసుకువెళ్తున్నట్టు నమ్మించావు. నీ షాప్‌లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశావు. కానీ, శ్మశానంలో వున్న కెమెరాలు పనిచేయకుండా చేయలేకపోయావు. అక్కడి సమాధులు సాక్ష్యం చెప్పకపోవచ్చు. కానీ ఆ కెమెరాలు సాక్ష్యం చెప్పాయి.ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపేసి, అనుమానం రాకుండా తనే తయారు చేసిన శవపేటికలోనే శవాన్ని దాచి, ఆన్ లైన్ ఆర్డర్ పేరుతో దాన్ని బయటకు పంపి శ్మశానంలో పాతిపెట్టాలని డేవిడ్ ప్లాన్ చేశాడు. డేవిడ్ తన స్వార్థం కోసం చేసిన ఘాతుకాన్ని ఆధారాలతో సహా అభిమన్యు బయటపెట్టాడు. ‘ఆస్తి కోసం తమ్ముడిని శవపేటికలో పంపి, నువ్వు కటకటాల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యావు. నీ గురించి తెలియని నీ తమ్ముడు తన కోసం తానే శవపేటికను తయారు చేసుకున్నాడు. కానీ ఒక్క విషయం మర్చిపోయావు డేవిడ్... నువ్వు కూడా ఏదో ఒకరోజు శవపేటికలోకి వెళ్లవలసిన వాడివే!’ అభిమన్యు హెచ్చరికగా అన్నాడు.పోలీసులు డేవిడ్‌ను చుట్టుముట్టారు. కటకటాల్లోకి నెట్టారు.‘చేసిన తప్పుకు శిక్షగా ఉరిశిక్షతో తమ్ముడిని చేరుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా వుండు’ చెప్పి బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.- శ్రీసుధామయి -
మహతో, పోలీసుల మధ్య తోపులాట
రాంచీ: జార్ఖండ్‌లో ప్రభుత్వ నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ ఉద్యమిస్తూ నిరాహార దీక్షకు దిగిన ఉద్యమనేత దేవేంద్రనాథ్ మహతో శనివారం రాంచీలోని సదర్ ఆస్పత్రి అత్యవసర చికిత్స విభాగంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా రాంచీ స్టేడియంలో తిరంగా ర్యాలీకి పాల్గొనేందుకు ఆయన సిద్ధంకాగా ఆస్పత్రి ఐసీయూ విభాగం ఆవరణలో విధుల్లో ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. మహతోనూ వెంట తీసుకెళ్లేందుకు అప్పటికే అక్కడికి చేరుకున్న జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా(జేకేఎల్ఎం) సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. త్రివర్ణపతాకం పట్టుకుని మహతో ఎలాగైనా ఆస్పత్రి గది నుంచి బయటపడేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఛాతికి గాయమైనట్లు మహతో ఆరోపించారు. ‘‘80 ఏళ్లు పూర్తయినా ఇంకా నామమాత్రంగానే స్వాతంత్య్రం వచ్చినట్లుంది. తిరంగా ర్యాలీలో పాల్గొనే హక్కు నాకు లేదా?. రాజ్యాంగంలోని ఏ చట్టం ప్రకారం నన్ను అడ్డుకుంటున్నారు? చికిత్సలో ఉండగా ఆస్పత్రి నుంచి వెళ్లిపోవద్దని ఏ వైద్యుడైనా సూచించారా? ఆ సూచనా పత్రం చూపించండి?’’అని పోలీసులతో మహతో వాగ్వాదానికి దిగినా ఫలితంలేకుండా పోయింది. 14 రోజులుగా మహతో నిరాహార దీక్షచేస్తున్న విషయం తెల్సిందే. -
ఏపీకి 27 పోలీసు పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ : 2026 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్రస్థాయి భద్రతా బలగాలకు అందించే ప్రతిష్టాత్మక సేవా, శౌర్య పతకాలను ప్రకటించింది. పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్స్, కరెక్షనల్ సర్వీసెస్ (జైళ్లు) శాఖల నుంచి మొత్తం 1,057 మంది అధికారులకు పతకాలను ఖరారు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 27 మంది ఎంపికయ్యారు. వీరిలో ఏఆర్ విభాగానికి చెందిన ఏడుగురికి శౌర్య పతకాలు లభించాయి. ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు కొర్లాన మల్లేష్, పైడి శ్రీరామమూర్తి, ఏఆర్ కానిస్టేబుళ్లు అడారి హేమ సుందరరావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేష్, ఆబోతుల అప్పలనాయుడు, రుత్తల కన్నబాబు వీరిలో ఉన్నారు. పోలీసు విభాగంలో ఐజీలు విజయకుమార్ గుడి, వెంకటరావిురెడ్డి బలంకరి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. రాష్ట్రానికి మరో 18 ప్రతిభా సేవా పతకాలు కూడా దక్కాయి. ఇందులో పోలీసు విభాగం నుంచి 14 మంది, అగ్నిమాపక శాఖ నుంచి ఇద్దరు, జైళ్ల శాఖ నుంచి ఇద్దరు ఉన్నారు. పోలీసు విభాగం నుంచి ఎస్పీ గీతాదేవి వెలగ, ఏఎస్పీ ఐ. రామకృష్ణ, డీఎస్పీలు సుబ్బారావు తుమ్మల, జగ్గు నాయుడు పెంట, చంద్రమోహన్ సాదెపల్లి, కంజక్షన్ పసుపులేటి, అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్ బాషా సయ్యద్, ఆర్మ్డ్ పోలీస్ ఎస్ఐలు ఎం. రాంప్రసాద్, శేషపాణి పగడాల, బసవయ్య పొదిలి, ఏఎస్ఐలు మోహనరావు యలపు, చెంచురామయ్య నడిపినేని, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసరాజు మంతెన, రాజారావు రోలుపల్లి ఎంఎస్ఎం పతకాలను సాధించారు. ఇక అగ్నిమాపక శాఖ నుంచి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ ఆఫీసర్ కాపు సత్యనారాయణ, ఫైర్‌మ్యాన్ జకరియా పెనుమాక ఎంపికయ్యారు. జైళ్ల శాఖ నుంచి సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ, హెడ్ వార్డర్ అద్దంకి సూర్యప్రకాశరావు ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. -
‘నన్నే ఆపుతావా?’.. పోలీసు అధికారిణిపై ఎమ్మెల్యే కుమార్తె దాడి
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే బి. సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య, శ్రీరంగపట్టణంలోని ప్రసిద్ధ ఆరతి ఉక్కడ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిణిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. భీమన అమావాస్య సందర్భంగా చోటుచేసుకుంది.ఆగస్టు 12న భీమన అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరంగపట్టణంలోని ఆరతి ఉక్కడ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో తీవ్రమైన రద్దీ నెలకొన్న తరుణంలో గర్భాలయంలోకి ప్రవేశించడానికి అందరూ నిబంధనల ప్రకారం కొంత సమయం వేచి ఉండాలని అధికారులు సూచించారు.ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్యను నిబంధనల ప్రకారం వేచి ఉండాలని అక్కడ విధి నిర్వహణలో ఉన్న మహిళా పీఎస్ఐ సవిత కోరారు. ఒక్కసారిగా అందరినీ లోపలికి అనుమతిస్తే భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని ఆమె వివరించడానికి ప్రయత్నించారు.అయితే, దీనిపై ఐశ్వర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే కుమార్తెనని చెబుతూ పోలీస్ అధికారిణితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అనుచిత పదజాలం ఉపయోగించినట్లు పీఎస్ఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విధులు నిర్వర్తిస్తున్న తనను అడ్డుకుంటున్నారనే కోపంతో ఐశ్వర్య పీఎస్ఐ సవితను చెంపదెబ్బ కొట్టారని, అంతేకాకుండా ఆమె కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించారని సమాచారం.పోలీసుల కేసు నమోదు ఈ ఘటనపై బాధితురాలైన పీఎస్ఐ సవిత మాండ్య మహిళా పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా యాతనహళ్ళి పోలీస్ స్టేషన్లో ఐశ్వర్యపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రతిస్పందించిన ఐశ్వర్య కూడా పోలీస్ అధికారిణి తనతో అసభ్యంగా,దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులకు తిరుగు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యురాలు పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలు రావడంతో ఈ ఉదంతం కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. -
లిప్త పాటులో సుఖ్బీర్ ప్రాణాలను కాపాడింది ఈయనే : సర్వత్రా ప్రశంసలు
మహారాష్ట్రలోని నాందేడ్‌లోని మాతా సాహిబ్ గురుద్వారాను సందర్శించి బయటకు వస్తున్న శిరోమణి అకాలీదళ్ (SAD) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై గురువారం మధ్యాహ్నం జరిగిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్న బాదల్ సర్జరీ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.మహారాష్ట్ర పోలీసు భద్రతా బృందానికి చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ సంతోష్ వైజ్నాథ్ కేంద్రే సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే బాదల్ ఈ పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోగలిగారు. దీంతో పోలీసు అధికారి నెట్టింట విశేషంగా నిలుస్తున్నారు. సమయానికి స్పందించి పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్న ఇన్స్పెక్టర్ కేంద్రే , మహారాష్ట్ర పోలీసు బృందంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.ఎలా కాపాడారు? గురుద్వారాలో పనిచేసే జస్పాల్ సింగ్ అనే నిహంగ్ సిఖ్, తన శాలువా కింద కిర్పాన్ (కత్తి) దాచుకుని సుఖ్బీర్ సింగ్ బాదల్ పొట్టలో పొడవడానికి యత్నించాడు. అయితే అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఇన్స్పెక్టర్ కేంద్రే క్షణాల వ్యవధిలో స్పందించి దుండగుణ్ని అడ్డుకుని కిందకు పడేసారు. ఈ క్రమంలో బాదల్ చేతికి స్వల్ప గాయమైంది. అలాగే ఇన్స్పెక్టర్ కేంద్రే చేతికి కూడా గాయమైంది. పోలీసులు వెంటనే నిందితుడు జస్పాల్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.హరి సిమ్రత్ కౌర్ కృతజ్ఞతలుఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్స్పెక్టర్ కేంద్రేను సుఖ్బీర్ సింగ్ బాదల్ భార్య హరి సిమ్రత్ కౌర్ సందర్శించి కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త ప్రాణాలు కాపాడినందుకు ప్రత్యుపకారంగా ఏదైనా చేయగలనా అని ఆమె ప్రశ్నించినపుడు "ఇది నా బాధ్యత. ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికే మాకు శిక్షణ ఇస్తారు. స్పందించడానికి నాకు క్షణకాలం మాత్రమే సమయం లభించింది, నా విధిని నేను నిర్వహించాను" అని కేంద్రే వినమ్రంగా బదులిచ్చారు.ఎవరీ కేంద్రే 2001లో మహారాష్ట్ర పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన సంతోష్ కేంద్రే, ఆ తర్వాత ప్రమోషన్లు పొంది ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు.ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్‌స్టా, నెటిజన్ల స్పందన వైరల్మరోవైపు పంజాబ్‌ను స్వాధీనం చేసుకోవాలని, రాష్ట్రంలో శాంతిని భంగం చేయాలని చూస్తున్నారని, కానీ అకాలీదళ్ నేతగా ఆ పరిస్థితి రానివ్వబోనని సుఖ్బీర్ సింగ్ వెల్లడించారు. రెండు సార్లు పవిత్రమైన ప్రదేశాల్లో తనపై అటాక్ జరిగిందని, అయినా తానెప్పుడూ భయపడలేదని, ఇప్పుడూ భయపడలేదన్నారు. పంజాబీల సంక్షేమానికి శిరోమణి అకాలీదళ్ కట్టుబడి ఉందన్నారు. కాగా 2024 డిసెంబర్లో కూడా సుఖ్బీర్ బాదల్‌పై గోల్డెన్ టెంపుల్లో కూడా హత్యాయత్నం జరిగింది. ఈ రెండు ఘటనలనుంచి ఆయనపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్ -
టాప్ 100 పోలీస్ చీఫ్‌లలో ఇద్దరు తెలుగు అధికారులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ నాయకత్వాన్ని గుర్తిస్తూ ఫేమ్ ఇండియా, ఏషియా పోస్ట్ సంయుక్తంగా 100 మంది ఉత్తమ పోలీస్ చీఫ్‌ల జాబితాను విడుదల చేశాయి. వీరిలో వి.వి.రాకేష్ రెడ్డి పి.(ఎస్.పి.గోల్పారా).. అసోం, గుండాలరెడ్డి రాఘవేంద్ర (ఎస్పీ ఝార్సుగూడ), ఒడిషా ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు చోటు దక్కించుకున్నారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు అనుకూలమైన పోలీసింగ్, సాంకేతికత వినియోగం, పారదర్శక పరిపాలన, సంక్షోభ సమయాల్లో వేగవంతమైన నిర్ణయాలు, ప్రజలతో విశ్వాసపూర్వక సంబంధాలు వంటి అంశాల్లో విశేషంగా పనిచేసిన అధికారులను ఈ జాబితాకు ఎంపిక చేశారు.ఒక సమాజం నిజమైన అభివృద్ధి సాధించాలంటే ప్రజలు సురక్షితంగా ఉన్నామనే భావన కలిగి ఉండాలని, ఆ భద్రతే విద్య, వ్యాపారం, పరిశ్రమలు, సామాజిక జీవితం సజావుగా ముందుకు సాగేందుకు పునాదిగా నిలుస్తుందని ఫేమ్ ఇండియా పేర్కొంది. చట్టవ్యవస్థను కాపాడటం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన వెన్నుముకగా పనిచేస్తుందని తెలిపింది. జిల్లా పోలీస్ చీఫ్‌లు, ప్రధాన పోలీస్ విభాగాల అధిపతులు ఎస్పీ, ఎస్ఎస్పీ, డీసీపీ, కమిషనర్ వంటి హోదాల్లో ఉన్నప్పటికీ వారి బాధ్యతలు అత్యంత విస్తృతంగా ఉంటాయంది. నేరాలను నియంత్రించడం, మహిళలు-పిల్లలకు రక్షణ కల్పించడం, సైబర్ నేరాలు-సంఘటిత నేరాలను అరికట్టడం, ట్రాఫిక్‌ను నిర్వహించడం, సంక్షోభ పరిస్థితుల్లో వేగంగా స్పందించడం వంటి బాధ్యతలతో పాటు ప్రజల విశ్వాసాన్ని కూడా వారు సంపాదించాల్సి ఉంటుందని పేర్కొంది.ఫేమ్ ఇండియా ఎడిటర్ ధీరజ్ కుమార్ మాట్లాడుతూ, నిర్మాణాత్మక జర్నలిజాన్ని ప్రోత్సహించడం తమ సంస్థ లక్ష్యాల్లో భాగమని, సమాజంపై సానుకూల ప్రభావం చూపుతున్న పరిపాలకులు, ప్రజాసేవకుల పనితీరును వెలుగులోకి తీసుకురావడంలో ఫేమ్ ఇండియా చాలాకాలంగా కృషి చేస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా చట్టవ్యవస్థను పర్యవేక్షిస్తున్న అనేక మంది జిల్లా పోలీస్ చీఫ్‌లు, యూనిట్ అధిపతుల నుంచి 100 మందిని ఎంపిక చేయడం కష్టమైన ప్రక్రియని పేర్కొన్నారు.ఫేమ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింగ్ మాట్లాడుతూ, ఈ సర్వే నిరంతర ప్రక్రియ అని, అధికారుల పనితీరు, ప్రజాసేవా రికార్డును భవిష్యత్తులోనూ పరిశీలిస్తామని చెప్పారు. తదుపరి దశలో ఈ 100 మంది నుంచి భారత్‌లోని టాప్ 25 పోలీస్ చీఫ్‌లను ఎంపిక చేసి, ఫేమ్ ఇండియా రాబోయే సంచికలో ప్రచురించనుంది. ఎంపికయ్యే ఆ 25 మంది అధికారులకు ప్రత్యేక సన్మానాలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.కాగా ఈ గౌరవంపై గుండాలరెడ్డి రాఘవేంద్ర స్పందించారు. “ఇది మొత్తం జార్సుగూడ పోలీసు కుటుంబం సాధించిన సమిష్టి విజయం. వృత్తి నైపుణ్యం, సున్నితత్వం, సాంకేతికత, వినూత్న ఆలోచనలతో ప్రజలకు సేవ చేయడంతో పాటు నేరాలపై ఏమాత్రం సహనం లేకుండా పనిచేయడమే మా లక్ష్యం” అని రాఘవేంద్ర తెలిపారు.గుండాల రెడ్డి రాఘవేంద్ర నేపథ్యంజార్సుగూడ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న , ఐపీఎస్ దేశవ్యాప్తంగా అత్యుత్తమంగా పనిచేస్తున్న టాప్ 100 ఐపీఎస్ అధికారులలో గుర్తింపు పొందారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సాంకేతికత ఆధారిత దర్యాప్తు, ముందస్తు నేర నియంత్రణ, మాదకద్రవ్యాల కట్టడి, సైబర్ నేరాల ఛేదన, కేసుల వేగవంతమైన దర్యాప్తు, బలహీన వర్గాల రక్షణతో పాటు పోలీసులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంపై రాఘవేంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన నాయకత్వంలో జార్సుగూడ పోలీసులు రాష్ట్రంలోని జిల్లా వారీ ప్రగతి డ్యాష్‌బోర్డ్‌లో మొదటి స్థానం, తప్పిపోయిన చిన్నారులను గుర్తించడంలో 95.7 శాతం ట్రేసింగ్ రేటు సాధించడంతో పాటు హత్యలు, దోపిడీలు, ఏటీఎం కేసులను విజయవంతంగా ఛేదించారు. అలాగే భారీగా మాదకద్రవ్యాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పోక్సో, ఇతర కీలక క్రిమినల్ కేసుల్లో దోషులకు శిక్షలు పడేలా చేశారు. -
300 మందిపై కేసులు నమోదు
రాంచీ: జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక ప్రక్రియలో అక్రమాలకు స్వస్తి పలకాలంటూ ఉద్యమిస్తున్న విద్యార్థులు, పరీక్షార్థులు పదో తేదీన రాంచీలో అసెంబ్లీ ముట్టడి వేళ లాఠీచార్జ్, పలువురికి గాయాలైన ఘటనలో పోలీసులు కేసుల నమోదు మొదలెట్టారు. శాసనసభ సమీపంలోని విధాన్ సభా పోలీస్‌స్టేషన్‌లో గుర్తు తెలియని 300 మందిపై కేసులు నమోదుచేశారు. ‘‘పదో తేదీన అసెంబ్లీ సమీపంలో పోలీసులపై రాళ్లు రువ్వి, ఉద్రిక్తతలకు కారణమైన గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదుచేశాం. విద్యార్థుల శాంతియుత ర్యాలీ వెంటనే ఉద్రిక్తంగా తయారైంది. రాళ్ల దాడిలో 14 మంది పోలీసులు గాయపడ్డారు. సీసీటీవీ కెమెరాలు, వీడియోలో ఫుటేజీలను పరిశీలించి ఆయా వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేస్తాం’’అని రాంచీ ఎస్పీ పరాస్ రాణా గురువారం చెప్పారు. మరోవైపు రాంచీలోని జైపాల్‌సింగ్ ముండా స్టేడియంలో పరీక్షార్థుల ఉద్యమం గురువారం 20వ రోజుకు చేరుకుంది. ‘‘ఉద్యమనేతల నిరాహార దీక్షలు కొనసాగించారు. పరీక్షల విధానంలో సంస్కరణలు, పాత పరీక్షలను రద్దుచేయడం, నియామక ప్రక్రియలో అక్రమాలపై ఇతర రాష్ట్రాల మాజీ జడ్జీలతో దర్యాప్తు జరిగేదాకా ఉద్యమం కొనసాగుతుంది. డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’అని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. 12 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఆస్పత్రిపాలైన ఉద్యమనేత దేవేంద్రనాథ్ మహతో తాజా ఆరోగ్యస్థితిని ప్రభుత్వం బహిర్గతంచేయట్లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
దొంగతనం చేసిన ఇంట్లోనే కునుకు తీశాడు.. తెల్లారే సరికి
సాక్షి,హైదరాబాద్: నగరంలో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఇంట్లోకి చొరబడి బంగారం తస్కరించిన ఓ దొంగ, అక్కడే గాఢ నిద్రలోకి జారుకున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి దొంగతనం చేసేందుకు పక్కా ప్రణాళికతో ఒక ఇంటిలోకి ప్రవేశించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి, ఇంట్లోని బీరువాను తెరిచి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. అపై అక్కడి నుంచి పలాయనం చిత్తగించాల్సింది పోయి అలసట, మత్తు కారణంగా అక్కడే నేలపై నిద్రపోయాడు.ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన యజమానులు ఇల్లంతా గందరగోళంగా ఉండటాన్ని, ఒక వ్యక్తి నేలపై గాఢ నిద్రలో ఉండటాన్ని చూసి ఖంగుతిన్నారు. వారు వెంటనే ఆ వ్యక్తిని పరిశీలించగా, తాము పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అతని జేబులోనే దర్శనమిచ్చాయి.దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాఢ నిద్రలో ఉన్న దొంగను లేపి అదుపులోకి తీసుకున్నారు. అతని జేబులో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
రిపీట్... రిపీట్.. రిపీట్ పోలీసులకు జగన్ మాస్ కౌంటర్
-
బైరెడ్డి నే ఆపుదాం అని చూశారు.. దెబ్బకి ఇచ్చిపడేసాడు
-
మీకే మంచిది చెపున్నా.. జగన్ పర్యటనపై ఆంక్షలు.. పోలీసులకు కాటసాని వార్నింగ్
-
పోలీసుల అత్యుత్సాహం.. రోడ్డుపై YSRCP నేతలను అడ్డుకుని
-
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే కుట్ర
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు, జనం రాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం మళ్లీ పోలీసుల ద్వారా ఆంక్షలు విధించింది. ఈ పరిణామంపై పార్టీ శ్రేణులు, అభిమానులు మండిపడుతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం కర్నూలు జిల్లాకు రానున్నారు. జైలులో ములాఖత్ ద్వారా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ పర్యటనకు వైఎస్సార్సీపీ శ్రేణులు దూరంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.కఠిన చర్యలు ఉంటాయ్: ఎస్పీజిల్లాలో ఇప్పటికే 30 యాక్ట్ అమల్లో ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎలాంటి ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్‌షోలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఆంక్షలపై వైఎస్సార్సీపీ మండిపాటుములాఖత్ను త్వరగా ముగించాలంటూ పోలీసులు సమయం ఇవ్వడం, అలాగే జగన్ కాన్వాయ్‌ను కిలోమీటర్ దూరమే ఆపేయాలని పోలీసులు చెప్పడంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజలను జగన్‌కు దూరంగా ఉంచేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్ జగన్ పర్యటనల సమయంలో ఇదే విధంగా ఆంక్షలు, బారికేడ్లు, కేసుల భయంతో ప్రజలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. అయితే.. అభిమానాన్ని ఆపలేరుజగన్ పర్యటనలకు వచ్చిన నేతలపై, కార్యకర్తలపై కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా జగన్‌ను కలిసేందుకు, ఆయనకు మద్దతు తెలిపేందుకు కర్నూలు ప్రజలు తరలివస్తారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఈ పర్యటన కూడా విజయవంతమవుతుందని అంటున్నారు. జగన్ భద్రతపై ఆందోళనమాజీ సీఎం హోదాలో ఉన్న జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ, ఆయన పర్యటనలకు అవసరమైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. ఇటీవలే వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో వైఎస్ జగన్ పర్యటనల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలను వివరించారు. భద్రతా అంశాలు, పోలీసుల ఆంక్షలపై తమ ఆందోళనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. -
ఐపీఎస్ రూ.500 పిట్ట కథ.. రంగంలోకి సీబీఐ!
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ మాక్ ఇంటర్వ్యూలో అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి, రూ. 500 లంచం ఇవ్వడానికే తీవ్రంగా బాధపడ్డానని చెప్పిన ఓ ఐపీఎస్ అధికారి..ఇప్పుడు ఏకంగా రూ.1 కోటి లంచం తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాహుల్ బన్సాల్‌కు సంబంధించిన పాత ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.సివిల్స్ పరీక్షల ప్రిపరేషన్ సమయంలో ఇచ్చిన మాక్ ఇంటర్వ్యూలో రాహుల్ బన్సాల్ అవినీతి, పరిపాలనా సంస్కరణలపై మాట్లాడారు. ఆ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ.. ‘నా సోదరుడు ఐఐటీ కాన్పూర్‌లో చదువుతున్నప్పుడు ఒక రీసెర్చ్ పేపర్ ప్రజంటేషన్ కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. వీసా కోసం ఆయన బర్త్ సర్టిఫికెట్ అత్యవసరమైంది. అయితే, ఆ సర్టిఫికెట్ త్వరగా జారీ చేయడానికి ఒక పంచాయతీ అధికారి రూ. 500 లంచం డిమాండ్ చేశారు. ఆ రూ. 500 లంచం ఇవ్వడానికి నేను ఎంతో బాధపడ్డాను’ అని పేర్కొన్నారు. వ్యవస్థలో కొందరు అవినీతిపరులు ఉన్నప్పటికీ, మొత్తం వ్యవస్థను నిందించలేమని, పోలీసు శాఖలో సంస్కరణలు రావాలని ఆయన ఆ ఇంటర్వ్యూలో వివరించారు.రూ. 1 కోటి లంచం ఆరోపణల నేపథ్యంకాలం గడిచాక ఐపీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ బన్సాల్‌పై ప్రస్తుతం ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో రూ. 1 కోటి లంచం కేసు నమోదైంది. ఒక సైబర్ ఫ్రాడ్ కేసును సెటిల్ చేయడానికి బన్సాల్‌తో పాటు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రాథోడ్, కానిస్టేబుల్ అంశుల్ శర్మ కలిసి రూ. 1 కోటి డిమాండ్ చేసి తీసుకున్నట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు.ఫిర్యాదు ప్రకారం.. ఈ రూ. 1 కోటి మొత్తాన్ని ఒకేసారి కాకుండా, మే 2026లో హవాలా మార్గాల ద్వారా చెరో రూ. 50 లక్షల చొప్పున రెండు విడతల్లో చెల్లించినట్లు పేర్కొన్నారు. ఈ లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డింగ్‌లు వంటి డిజిటల్ ఆధారాలను కూడా ఫిర్యాదుదారుడు కోర్టుకు సమర్పించారు.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రత్యేక న్యాయస్థానం.. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలని ఛత్తీస్‌గఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్తో పాటు సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఐపీఎస్ అధికారి కాకముందు రాహుల్ బన్సాల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఐపీఎస్ అయ్యాక ఆయన మొదటి ఫీల్డ్ పోస్టింగ్ ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా లభించింది. ఆ సమయంలోనే ఈ సైబర్ మోసం కేసు సెటిల్మెంట్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.రూ. 500 లంచం ఇవ్వడానికే అసౌకర్యంగా భావించిన వ్యక్తి, అధికారంలోకి వచ్చాక రూ. కోటి లంచం ఆరోపణల్లో చిక్కుకోవడం విధి వైపరీత్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణల నిగ్గు తేలాలంటే విచారణ పూర్తవ్వాల్సి ఉంది.This is a mock interview of Rahul Bansal, IPS trainee. Look at how he was concerned about corruption in the bureaucracy, how he himself had been a victim of it, and how he expressed anguish at it.He is now under scanner for allegedly demanding and receiving ₹1 crore to settle… pic.twitter.com/H7LIGYK3kS— THE SKIN DOCTOR (@theskindoctor13) August 12, 2026 -
జవాన్లు మీరు తోప్ అంతే
-
అంబటిపై మరో కేసు..!
-
డాక్టర్ ప్రియాంక మృతి కేసులో FIR సెక్షన్ లో మార్పులు.. ఎందుకు అలా..?
-
మానవ అక్రమ రవాణా కేసులో మహిళ అరెస్ట్
-
చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిపై దాడి
-
నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...
-
జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి యత్నం
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో రణరంగంగా మారిన విద్యార్థుల ఉద్యమంలో పరీక్షార్థులపై పోలీసులు విచక్షణారహిత లాఠీచార్జ్ ఘటనను తీవ్రంగా నిరసిస్తూ విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో, బీజేపీ అనుబంధ అఖిలభారత విద్యార్థి పరిషత్ అసెంబ్లీ బయట తీవ్రస్థాయిలో తమ నిరసనను వ్యక్తంచేశాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ(జేఎస్ఎస్సీ)ల ఉద్యోగ నియామక ప్రక్రియలు, పరీక్షల్లో సంస్కరణల సాధన కోసం పరీక్షార్థులు సోమవారం రాంచీలో చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడం తెల్సిందే. మంగళవారం వందలాది మంది ఏబీవీపీ కార్యకర్తలు పాత విధానసభ నుంచి కొత్త శాననసభకు నడుచుకుంటూ, బస్సులో ర్యాలీగా రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తోపులాట ఎక్కువవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు 110 మంది కార్యకర్తలను అరెస్ట్‌చేశారు. వీరిలో మహిళా కార్యకర్తలూ ఉన్నారు. తోపులాటలో ఒక అమ్మాయి, అబ్బాయి స్పృహతప్పి పడిపోయారు. ‘‘నియామక ప్రక్రియలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తుంటే కారణంలేకుండా చాలా మందిని పోలీస్ వ్యాన్లలోకి పడేశారు. పలువురికి గాయాలయ్యాయి’’అని ఏబీవీపీ కార్యకర్త కుమార్ దివ్యాన్షు చెప్పారు. లాఠీచార్జ్‌ను ఖండిస్తూ బీజేపీ ఇచి్చన బంద్ పిలుపుమేరకు జార్ఖండ్ రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, కళాశాలలు, పాఠశాలలు మూసేశారు. వ్యాపారసముదాయాలు మూసేయడం, ప్రజారవాణా వ్యవస్థలు స్తంభించడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అసెంబ్లీలో నిరసనలుఉద్యమిస్తున్న పరీక్షార్థులపై పోలీసులు లాఠీలకు పనిజెప్పడమేంటంటూ సోరెన్ సర్కార్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో నిలదీశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను స్తంభింపజేశారు. దీంతో ఉదయం సభ మొదలైన కొన్ని నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడింది. 12 గంటలకు మొదలైనా నినాదాలు ఆగకపోవడంతో 2 గంటలవరకు వాయిదావేశారు. 2 గంటలకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు పోటాపోటీగా వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరీక్షల రద్దు, సంస్కరణల విషయంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందని సభలో సీఎం హేమంత్ ప్రకటించారు. ‘‘ఉద్యమకారులను బీజేపీ తమ రాజకీయ పనిముట్లుగా వాడుకోవాలని చూస్తోంది. మా ప్రభుత్వం ఇప్పటికే ఉద్యమకారుల చాలా డిమాండ్లను అంగీకరించింది. నియామక పరీక్షల విధానంలో సంస్కరణలకూ ఓకే చెప్పా. బీజేపీ ఒక పరాన్నజీవి. స్వప్రయోజనాల కోసం పరీక్షార్థులను వాడుకోవాలని చూస్తోంది. బీజేపీ విషయంలో ఉద్యమకారులు జాగ్రత్తగా ఉండాలి’’అని అన్నారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ నినాదాల హోరు పెంచారు. దీంతో షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే సభను స్పీకర్ నిరవధికంగా వాయిదావేశారు. రాంచీలో విద్యార్థుల మౌన ప్రదర్శననియామక పరీక్షల్లో అక్రమాలను ఎత్తిచూపుతూ జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ సంస్కరణ ల మంచ్ విద్యార్థులు, పరీక్షార్థులు మంగళవారం సాయంత్రం రాంచీలో మౌన ప్రదర్శన చేశారు. నిరాహార దీక్ష జరుగుతున్న జైపాల్‌సింగ్ స్టేడియం నుంచి ఆల్బర్ట్ ఎక్కా చౌక వరకు వందలాది మంది విద్యార్థులు మౌన ప్రదర్శనగా వెళ్లారు. ఉద్యమం, నిరాహార దీక్షలు మొదలై 17 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ మౌన ప్రదర్శన చేపట్టారు. జూలై 25వ తేదీన విద్యార్థుల ఉద్యమం ఆరంభమైన విషయం విదితమే. ఆరుగురు ఉద్యమనేతలు నిరాహార దీక్షకు కూర్చోగా వీరిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రుల్లో చేరి్పంచారు. -
చెవిరెడ్డి హర్షిత్రెడ్డిపై పోలీసుల దాడి
తిరుపతి రూరల్: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డిపై తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీస్‌స్టేషన్ ముందు మంగళవారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆయన్ని స్టేషన్లోకి లాక్కెళ్లారు. స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దించి చేతులు, కాళ్లు పట్టి లాగుతూ, గోళ్లతో రక్కుతూ, కాళ్లతో తొక్కుకుంటూ బలవంతంగా తీసుకెళ్లారు. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి చొక్కా చిరిగిపోవడమే కాకుండా కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా మరికొందరు వైఎస్సార్సీపీ నాయకులకు కూడా గాయాలయ్యాయి. ప్రైవేట్ సెక్యూరిటీపై ఎఫ్ఐఆర్ డీఎస్సీలో అక్రమాలపై చంద్రగిరిలో ఈ నెల10వ తేదీన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి వేలాదిమంది జనం తరలిరావడంతో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలో భాగంగా ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సెక్యూరిటీలో ఒకరిద్దరు ఖాకీ చొక్కాలు వేసుకున్నారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అర్ధరాత్రి వారిని అరెస్టుచేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న హర్షిత్‌రెడ్డి చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ప్రైవేటు సెక్యూరిటీపై కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఖాకీ దుస్తులు ధరించడం తప్పే అయితే ఉదయం నుంచి అక్కడే నిలబడి చూస్తున్న సీఐ సురేష్ కుమార్ వారికి ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ర్యాలీ విజయవంతంగా ముగిసిన తరువాత అర్ధరాత్రి వేళ ఫోన్ వస్తే వెళ్లి ప్రైవేటు సెక్యూరిటీ వారిని తీసుకొచ్చి కేసు పెడతారా అని అడిగారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని బయటకు పంపాలని ఆయన, పార్టీ నేతలు శాంతియుతంగా పోలీస్‌స్టేషన్ ముందు నిరసనకు దిగారు. ఒక్కసారిగా విరుచుకుపడిన పోలీసులు నిరసన తెలుపుతున్నవారి చొక్కాలు చించి, రక్తం వచ్చేలా గోళ్లతో రక్కుతూ లాగేశారు. హర్షిత్‌రెడ్డి చొక్కా చించడమే కాకుండా కుడిచేతికి, కుడికాలికి గాయాలయ్యేలా ఈడ్చుకెళ్లారు. -
క్రితం వరకు వేరు.. ఒక్క వర్షంతో ఒక్కటయ్యారు. వాటే సీన్!
కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతుంటాయి.. కాసేపటి క్రితం వరకు ఒకరినొకరు ఎదుర్కొన్నవారే.. ఆ తర్వాత ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. రాంచీలో నిరసనల సందర్భంలో వర్షం కారణంగా కనిపించిన ఈ దృశ్యం కూడా అలాంటి ఆసక్తికర ఘటనే..!రాంచీలో జేపీఎస్సీ అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జీ, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు.అయితే, అదే సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పరిస్థితి అంతా మారిపోయింది. వర్షం నుంచి రక్షించుకునేందుకు విద్యార్థులు గొడుగులు తెరవగా.. వారిని అడ్డుకుంటున్న కొందరు పోలీసు సిబ్బంది కూడా అదే గొడుగుల కిందకు చేరారు.కాసేపటి క్రితం వరకు లాఠీలు, వాటర్ క్యానన్లతో విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు.. ఇప్పుడు అదే విద్యార్థుల గొడుగుల కిందకు చేరి వర్షం నుంచి తలదాచుకోవడం ఆసక్తికరంగా మారింది. పోలీసు, నిరసనకారుల మధ్య కనిపించిన ఈ మానవీయ దృశ్యాలు అక్కడున్న వారిని ఆశ్చర్యంతోపాటు ఎంతో ఆకట్టుకున్నాయి.ప్రకృతి ముందు అందరూ సమానమేనని చాటిచెప్పిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి. వ్యవస్థపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను వ్యక్తిగత శత్రువులుగా చూడలేదనే విషయాన్ని ఈ దృశ్యాలు చాటిచెప్పాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
పోలీస్ అయ్యుండి... ఇదేం పని సామీ
-
అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం..!
అనంతపురం సెంట్రల్: అనంతలో హైటెక్ వ్యభిచారం గుట్టు బయట పడింది. గుంటూరు, అమలాపురం, రాజమండ్రి ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నగరానికి చెందిన విటులను రప్పించి ఎవరికి నచ్చిన వారు.. వారితో గడిపే విధంగా సెటప్ చేశారు. నగరానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనతో మరికొందరు చోటా నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధర్ధరాత్రి వన్‌టౌన్ పోలీసులు సదరు వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. మొత్తం 10 మంది వేశ్యలు, 10 విటులను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళలను విచారణ నిమిత్తం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడస్తున్న ఓ హోంకు తరలించారు. ఈ వ్యభిచార కేంద్రం వెనుక పెద్ద రాకెట్ ఉండడంతో కూపీ లాగేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. త్వరలో దీనిపై వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి. -
ఎస్ఐ ప్రవళ్లిక కేసు.. ఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు!
శ్రీకాకుళం క్రైమ్ : టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్ జగన్ జిల్లా పర్యటన నాడు ఘటనా స్థలిలో లేని వ్యక్తిపై హత్యాయత్నం, ఇతర నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు ఆపాదించిన పోలీసులు.. ఇప్పుడు తూచ్ తూచ్ అంటున్నారు. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో వైఎస్సార్సీపీ ఆమదాలవలస ఇన్చార్జి చింతాడ రవికుమార్‌తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసులు కట్టి రిమాండ్‌కు పంపిన విషయం విదితమే. వీరిలో ఓ ప్రైవేటు ఉద్యోగి గురుగుబెల్లి తేజేశ్వరరావు పంజాబ్ యూనివర్సిటీలో అదే రోజు తన కుమార్తెతో ఉన్నట్లు ఆధారాలు నిర్ధారణ కావడంతో కేసు నుంచి ఆయనని తొలగిస్తున్నట్లు కోర్టుకు మెమో సమరి్పంచామని డీఎస్పీ వివేకానంద స్పష్టం చేయడం విశేషం. ఇప్పటికే ఈ అక్రమ కేసుకు సంబంధించి జిల్లా పీడీఎం కోర్టు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి హత్యాయత్నం, ఉద్దేశపూర్వకంగా నేరం చేయు సెక్షన్లైన 109, 111 సెక్షన్లు వర్తించవని ఆదివారం రిమాండ్ రిపోర్టులో రాసిన విషయం పాఠకులకు విదితమే. ప్రజల్లో అబాసుపాలు.. టీడీపీ అధిష్టానం, స్థానిక నాయకత్వం ఒత్తిడి మేరకు పోలీసు ఉన్నతాధికారులు తమ పోలీసులతో ఇలాంటి నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు వేయించడం, అదనంగా కేసులో మరో ఏడుగురిని కేసులో చేర్చడం, రి మాండ్‌కు తరలించే సమయంలో చింతాడ రవిని రెండు చోట్ల హైకోర్టు నిబంధనలు కాలరాసి నడిపించుకుని తీసుకువెళ్లడం వంటి అంశాలతో ప్రజల్లో అబాసుపాలయ్యారు. ఈ కేసులో 14 మంది రిమాండ్‌కు వెళ్లడం తెలిసిందే. మరికొంతమంది మంగళవారం ఆమదాలవలస స్టేషన్లో లొంగిపోతున్నట్లు సమాచారం. మరోసారి అప్పలరాజును కస్టడీ కోరిన పోలీసులు.. అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు మరోసారి కస్టడీ విచారణ కోరుతూ సోమవారం పలాస కోర్టులో పిటిషన్ వేసినట్లు సమాచారం. -
అంగన్వాడీ, ఆశా వర్కర్లపై ఖాకీల క్రౌర్యం
విజయనగరం గంటస్తంభం: కనీస వేతనం నెలకు రూ.26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 12 గంటల పనిదినాలను ఉపసంహరించుకుని లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ వెంటనే చేపట్టి ఆశా, అంగన్వాడీ, స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో కలెక్టరేట్ రణరంగంగా మారింది. వేలాదిమంది కార్మికులు ర్యాలీగా విజయనగరం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సమస్యలు, డిమాండ్ల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంపై నినదించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు సీఐటీయూ నేతలను పోలీసులు ఈడ్చుకుపోయి, బలవంతంగా అరెస్టుచేశారు. ఆందోళనలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎం.శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, కార్యదర్ములు కె.సురేష్, టి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఛార్జ్‌షీట్‌లో జాప్యం.. 18 మంది పోలీస్ అధికారులకు శిక్ష
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఎస్పీ కీలక నిర్ణయం తీసుకున్నారు. విధులలో నిర్లక్షం వహించినందుకు 18 మంది స్టేషన్ ఇంఛార్జ్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. నిర్ణీత 60, 90 రోజుల గడువులో ఛార్జ్షీట్లను కోర్టులో దాఖలు చేయకపోవడం, ఈ-సాక్ష్యాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, ఎఫ్ఐఆర్, ఛార్జ్‌షీట్ వివరాలను సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేయడంలో నిర్లక్ష్యం చేసిన 18 మంది పోలీస్ స్టేషన్ఇంఛార్జ్లకు "విధుల్లో నిర్లక్ష్యం చేశారు. దీనినిఅధికారికంగా పరిగణిస్తున్నాం ఇకపై మళ్లీ ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరికలు జారీ చేశారు.పోలీసింగ్ అంటే కేవలం కేసు నమోదు చేయడం, నిందితులను అరెస్ట్ చేయడం మాత్రమే కాదని.. దర్యాప్తులో సాక్ష్యాల నాణ్యత, సాంకేతిక ప్రక్రియలు, నిర్ణీత గడువులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం కూడా కీలకమని ఎస్ఎస్పీ స్పష్టం చేశారు. ఈ-సాక్ష్యాల తయారీలో నిర్లక్ష్యంపై పలువురు అధికారులను మరోసారి హెచ్చరించారు. ఇకపై పోలీసు అధికారుల పనితీరును కేవలం అరెస్టులు, కేసుల సంఖ్య ఆధారంగా కాకుండా.. దర్యాప్తు నాణ్యత, సాక్ష్యాల నిర్వహణ, ఈ-సాక్ష్యాల నమోదు, కోర్టులో కేసుల పురోగతి వంటి అంశాల ఆధారంగా కూడా అంచనా వేస్తామని ఎస్ఎస్పీ తెలిపారు.మరోవైపు మెరుగైన పనితీరు కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని కూడా ఎస్ఎస్పీ ప్రోత్సహించారు. నిర్ణీత గడువులో ఛార్జ్షీట్లు దాఖలు చేయడం, ఈ-సాక్ష్యాలను సమర్థంగా సిద్ధం చేయడం వంటి పనుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన పలువురి పేర్లను వారి సర్వీస్ రికార్డుల్లో ప్రశంసగా నమోదు చేశారు. ఈ-సాక్ష్యాలు, ఎస్ఐజీడీ జనరేషన్, వాటిని కేసులతో అనుసంధానం చేయడంలో మెరుగైన పనితీరు కనబరిచిన 10 మంది పోలీసు సిబ్బందికి నగదు బహుమతి అందించారు. నిర్లక్ష్యంపై హెచ్చరికలు.. మంచి పనికి ప్రశంసలు, నగదు బహుమతులు ఇవ్వడం ద్వారా పోలీసు దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. -
కొడాలి నానికి నోటీసులు
-
అడ్డుకున్న పోలీసులు.. ఇచ్చిపడేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి
-
అసంతపురం, గుడివాడలో టెన్షన్ టెన్నన్.. అర్థరాత్రి పోలీసుల నోటీసులు
-
పస్తులున్నా పోస్టుల్లేకపాయె!
పోస్టులే కేటాయించలేదు ఈ ఫొటోలో కనిపిస్తున్నది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన గుడ్ల శ్రీకాంత్. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రెండున్నర ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే ఒక దఫా కోచింగ్ పూర్తి చేసిన శ్రీకాంత్ మరో ఆరు నెలలు రెండో విడత కోచింగ్‌కు కూడా వెళ్లాడు. తాజాగా వెలువడిన నోటిఫికేషన్లో రంగారెడ్డి జిల్లాకు కానిస్టేబుల్ పోస్టులే కేటాయించలేదు. దాదాపు మూడేళ్లుగా చేసిన సన్నద్ధత వృథా కావడంతో శ్రీకాంత్ తీవ్ర గందరగోళంలో పడిపోయాడు. పరిమిత సంఖ్యలో పోస్టులు ఉన్నా కష్టపడి ఉద్యోగం కొట్టేందుకు ప్రయతి్నస్తుండేవాడినంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.సాక్షి, హైదరాబాద్: వేల సంఖ్యలో నిరుద్యోగులున్నా అందుకు తగ్గ ఖాళీలే లేవు..మరోవైపు ఖాళీలు ఎక్కువగా ఉన్నా ..సగం పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు..తెలంగాణ పోలీసు నియామకాల బోర్డు(టీజీపీఆర్బీ) తీరుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ మెజార్టీ జిల్లాల నిరుద్యోగులను నిరుత్సాహపరిచింది. తాజా నోటిఫికేషన్లో కేవలం 26 జిల్లాలకు మాత్రమే పోస్టులను నిర్దేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఒక్క పోస్టును కూడా ప్రకటించలేదు. ‘క్యూర్’పరిధిలో కానిస్టేబుల్ పోస్టులు లేనేలేవు. మరోవైపు పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల తదితర జిల్లాల్లోనూ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అసలే లేవు. జిల్లాలు, జోన్ల వారీగా సమన్యాయం పాటించలేదని, దీంతో చాలా జిల్లాలు, జోన్ల పరిధిలోని అభ్యర్థులకు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే పరిస్థితే లేకుండా పోయిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఆధారంగా నిర్దేశించిన క్యూర్ ప్రాంతంలో కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి లేకపోవడం గమనార్హం. అత్యధిక జనసాంద్రత ఉన్న ఈ ప్రాంతంలో కనీసం ఒక్క కానిస్టేబుల్ పోస్టును కూడా నోటిఫికేషన్లో చూపకపోవడంతో ఇక్కడ్నుంచి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు పోలీసు నియామకాల బోర్డు ఈసారి రిక్తహస్తమే చూపడంతో వారంతా లబోదిబోమంటున్నారు. మరోవైపు సరైన తిండి, నిద్రలేకుండా తాము ఎన్నో కష్టాలు ఎదుర్కున్నామని, ప్రభుత్వం అందించే ఐదు రూపాయాల భోజనం చేశామని, పలు దేవాలయాల వద్ద చేసే అన్నదానంతో కడుపునింపుకున్నామని, పస్తులుండి నీళ్లుతాగుతూ సరిపెట్టుకున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 వేల పోస్టులున్నా.. పరిమితంగానే నియామకం. రాష్ట్ర పోలీసు విభాగంలో పోలీస్, స్పెషల్ పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖలోని వివిధ కేటగిరీల్లో 7,437 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గతనెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచి్చంది. మొత్తంగా ఈ పోస్టుల సంఖ్య పెద్దమొత్తంలో కనిపించినప్పటికీ జిల్లాలు, జోన్ల వారీగా ఉద్యోగాల విభజన పరంగా చూస్తే చాలా జిల్లాలు, జోన్లలో సింగిల్ డిజిట్ పోస్టులే ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం గతేడాది ఫిబ్రవరి గణాంకాల ప్రకారం 13,333 పోలీసు కానిస్టేబుల్ ఖాళీలున్నట్లు సమాచార హక్కు చట్టం కింద వెల్లడించింది. ఇందులో 9,875 సివిల్, 3,548 ఐఆర్ కానిస్టేబుల్ పోస్టులున్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మరో 6 వేల మంది పదవీ విరమణ చేసినట్లు అంచనా. దీంతో పోస్టుల సంఖ్య 20 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరిధిలోకి వస్తాయి. అయితే వీటిలో సగం పోస్టులకు మాత్రమే బోర్డు నోటిఫికేషన్ ఇచి్చంది. నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళన కానిస్టేబుల్ పోస్టులు జిల్లా కేడర్ కాగా తాజా నోటిఫికేషన్లో కేవలం 26 జిల్లాలకు మాత్రమే ఈ పోస్టులను నిర్దేశించారు. ఏడు జిల్లాల్లో సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ కోలువులే లేవు. ప్రధానంగా అత్యధిక జనసాంద్రత ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఒక్క పోస్టును కూడా బోర్డు ప్రకటించలేదు. ఔటర్రింగురోడ్డు(ఓఆర్ఆర్) పరిధిని క్యూర్ ప్రాంతంగా పేర్కొన్న ప్రభుత్వం ఈ పరిధిలోకి వచ్చే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ పోస్టులు ప్రకటించకపోవడంతో ఇక్కడ పోలీసు కొలువుల కోసం ప్రయతి్నస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల తదితర జిల్లాల్లోనూ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు లేవు. సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీల్లో 14 శాతమే... పోలీసు శాఖలో జోనల్ కేటగిరీ పరిధిలోకి వచ్చే సబ్ ఇన్స్పెక్టర్ కొలువు కేటాయింపులోనూ అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు మండిపడుతున్నారు. గతేడాది ఫిబ్రవరి నాటికి పోలీసు శాఖలో 717 సివిల్, ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది. అప్పట్నుంచి ఈ ఏడాది జూలై నాటికి దాదాపు 350 మంది పదవీ విరమణ పొందినట్లు అంచనా. కానీ తాజా ప్రకటనలో కేవలం 162 పోస్టులను మాత్రమే భర్తీకి చూపారు. అత్యంత పెద్ద ప్రాంతంగా ఉన్న జోగుళాంబ గద్వాల జోన్లో కేవలం 4 పోస్టులు మాత్రమే చూపించారు.అదేవిధంగా క్యూర్ పరిధిలో కేవలం 13 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మాత్రమే ప్రకటించారు. దీంతో అక్కడి నిరుద్యోగులు తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఆర్) పోస్టులు జోన్–3, జోన్–5, 6, 7 పరిధిలో ఒక్కటి కూడా లేకపోవడం తీవ్ర నిరాశ కల్పించే అంశం. నాలుగేళ్ల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అత్యంత పరిమితంగా పోస్టులు చూపడం, మరోవైపు కొత్త నోటిఫికేషన్ వచ్చేందుకు మరో నాలుగేళ్లు పడుతుందనే అంచనా నిరుద్యోగులను తీవ్రంగా కలవర పెడుతోంది. అప్పటికల్లా వయోపరిమితి ముగియడంతో అనర్హులమవుతామనే ఆందోళన నిరుద్యోగ అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అంతా అయోమయం ప్రస్తుతం విడుదల చేసిన ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్లో రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లాలకు పోస్టులు అసలే ఇవ్వలేదు. ఈ జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. క్యూర్ పరిధిలోని జిల్లాలకు కొత్తగా పోస్టులు నోటిఫికేషన్లో చూపిస్తారా? అనే సందేహం అభ్యర్థుల్లో ఉంది. ఈ రెండు జిల్లాల అభ్యర్థుల్లో అయోమయం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నోటిఫికేషన్ గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. – శంకర్ నాయక్ నిరుద్యోగ జేఏసీ నేతనాలుగు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా! గత 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా. కానీ ఈ నోటిఫికేషన్లో మా జిల్లాలో పోస్టులు కేటాయించకుండా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? కొత్త కమిషనరేట్ ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆమోదానికి ఫైల్ పంపించామని అంటున్నారు. ఆమోదం వచ్చాక ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు.ఆమోదం అయ్యేది ఎప్పుడు? నోటిఫికేషన్ వచ్చేది ఎప్పుడు? అంతా గందరగోళంగా ఉంది. – నరేష్ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థి -
2 వేల మందితో పటిష్ఠ బందోబస్తు.. సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: లాల్ దర్వాజా సింహవాహిని బోనాల సందర్భంగా 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు.ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. బోనాల సందర్భంగా ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డ్రోన్ కెమెరాలతో లైవ్ ఫీడ్ తీసుకుంటున్నామన్నారు.ఈ సారి అమ్మవారిని 60 వేల నుంచి 70 వేల మంది వరకు భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని దీనికోసం రెండు షిప్టులలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ సంవత్సరం బోనాల సందర్భంగా ప్రజలు సహకరిస్తున్నారని హైదరాబాద్ పోలీసు తరపున ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఆషాడమాస బోనాలలో చివరిఘట్టమైన లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వ్రస్తాలు సమర్పించారు. నగరంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పుదరువులతో దద్దరిలిల్లుతున్నాయి.పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయం, మీరాలం మండి మహంకాళి, బేలా ముత్యాలమ్మ, ఉప్పుగూడ మహంకాళి ఆలయాలతో పాటు అన్ని దేవాలయాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం జరుపనున్నారు. ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గోల్కొండలో 8వ బోనం పూజ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. -
మూడు రోజుల మౌనం వెనుక..
సాక్షి, రాజమహేంద్రవరం: మత్తోన్మాదంతో వైద్య విద్యార్థిని కనికే ప్రియాంకను కారుతో ఢీకొన్న కిరాతకులను కాపాడేందుకు ఓ అదృశ్య శక్తి తెర వెనుక ప్రయత్నించిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ దారుణానికి సంబంధించి వరుసగా జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరు రాజమహేంద్రవరం నగరంలో నివసిస్తున్న కూటమి ప్రజాప్రతినిధులు మౌనవ్రతం పాటించడం.. ఇవన్నీ ప్రజల అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఈ దుర్మార్గం జరిగిన ప్రసాదిత్య మాల్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజీల్లో నిందితుల అమానుషం స్పష్టంగా కనిపిస్తున్నా, వారిని అరెస్ట్ చేసేందుకు 72 గంటల సమయం తీసుకోవడం వెనుక ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. హిట్ అండ్ రన్.. అంటూ తప్పుడు వాదన సహజంగా రహదారిపై వెళ్తున్న వారిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోతే హిట్ అండ్ రన్ అని పోలీసు పరిభాషలో చెబుతారు. అయితే రాజమహేంద్రవరంలో ఉద్దేశ పూర్వకంగానే వైద్య విద్యార్థిని స్కూటీని కిరాతకులు వెంట వెంటనే మూడుసార్లు ఢీకొట్టి.. కింద పడిపోయిన ప్రియాంక తల పైనుంచి కారు పోనిచ్చారు. ఇదంతా సీసీ కెమెరాల ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ మద్యం మత్తులో ఢీకొట్టారని, హిట్ అండ్ రన్ అని పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతుండడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారని... హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రియాంక తల్లిదండ్రులు, మాల్ వద్ద దుర్ఘటనను చూసిన స్థానికులు డిమాండ్ చేస్తున్నా.. ఆ దిశగా పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రియాంక కుటుంబీకులు స్థానికులు కాకపోవడంతో మద్యం మత్తులో జరిగిన ఘటన అని చెప్పేసి కేసును నీరుగార్చేందుకు ప్రయతి్నస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మూడు రోజులూ ఎక్కడున్నారో... ఈ నెల 3న రాత్రి 9 గంటల సమయంలో ప్రియాంక స్కూటీని ఢీకొట్టిన సూరారపు ధస్వంత్, ఆండ్రూ జోషెఫ్ కారులో వేగంగా వెళ్లిపోయారు. చిన్న చిన్న విషయాలకే ప్రెస్మీట్లు పెట్టి ఫొటోలు తీసుకుని మీడియాకు పంపించే పోలీసులు.. బహిరంగంగా ఇంత పెద్ద అమానుష ఘటన జరిగినా మూడో రోజు వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ గట్టిగా నిలదీయడంతో పోలీసులు ఈ నెల 6న హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి మద్యం మత్తులో ప్రమాదం జరిగిందని తేల్చేశారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరిని అరెస్ట్ చూపించి, మరుసటి రోజు రిమాండ్‌కు తరలించారు. మరి అప్పటివరకు నిందితులు ఎక్కడున్నారనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా నిందితులు మత్తులో ప్రసాదిత్య మాల్‌లోకి వెళ్లినప్పుడు, వైద్య విద్యారి్థని ప్రియాంకను ఢీకొట్టినప్పుడు కారుకు వెనుక, ముందు నంబర్ ప్లేట్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం నిందితుల నుంచి కారు స్వా«దీనం చేసుకున్న తర్వాత నంబర్ ప్లేట్లు మాయమయ్యాయి. నిందితులను రక్షించేందుకు ఓ ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకే నంబర్ ప్లేట్లు మాయమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. -
సాంకేతిక సవాళ్లకు ధీటుగా ఆధునిక పోలీసింగ్
హైదరాబాద్: ‘లక్ష్యం చారిటబుల్ సొసైటీ’ ఆధ్వర్యంలో "పోలీస్ వ్యవస్థ ఆధునీకీకరణ, శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిర్వహణ, ఎదురవుతున్న నూతన సవాళ్లు" అనే అంశంపై జాతీయ స్థాయి పోలీస్ సెమినార్ శనివారం జరిగింది. టీజీఐసీసీసీ భవన పరిధిలోని మిని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ సదస్సు విజయవంతంగా ముగింది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అధ్యక్షత వహించి సెమినార్‌ను ప్రారంభించారు. లక్ష్యం చారిటబుల్ సొసైటీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఈ జాతీయ సెమినార్ కన్వీనర్‌గా వ్యవహరించారు.సాంప్రదాయక నేర విచారణ, శాంతిభద్రతల పరిరక్షణ పద్ధతులు ప్రస్తుత కాలపు అవసరాలకు మాత్రమే సరిపోవని, నేరాలు భౌగోళిక సరిహద్దులను దాటి సాంకేతికత ఆధారంగా సంక్లిష్టంగా మారాయని వక్తలు స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, ఆర్థిక మోసాలు, కృత్రిమ మేధ (AI) ఆధారిత నేరాలు, డ్రోన్ల దుర్వినియోగం, డీప్‌ఫేక్స్ మరియు క్లిష్టమైన మౌలిక సదుపాయాలపై సైబర్ దాడులు ప్రధాన సవాళ్లుగా పరిణమించాయని పేర్కొన్నారు.సైబర్ నేరాలు భౌగోళిక పరిమితులు లేకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కొద్ది నిమిషాల్లోనే జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు, యూపీఐ (UPI) స్కామ్‌లు, ఫిషింగ్ దాడులు, డిజిటల్ అరెస్ట్‌లు, ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్లైన్ పెట్టుబడి మోసాలు తీవ్రంగా పెరుగుతున్నాయని.. వీటి నిరోధానికి ప్రత్యేక సైబర్ పరిజ్ఞానం, డిజిటల్ ఫోరెన్సిక్ సామర్థ్యాలు, అంతర్జాతీయ, జాతీయ స్థాయి సమన్వయం అత్యంత అవసరమని చర్చించారు.ఫేషియల్ రికగ్నిషన్, నేరాల ముందస్తు అంచనా (Predictive Analytics), స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు వేగవంతమైన అత్యవసర స్పందనకు AI ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే నేరస్థులు AIని ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, ఆటోమేటెడ్ ఫిషింగ్ దాడులు, నకిలీ గుర్తింపులను సృష్టిస్తున్నారని, కాబట్టి AI వినియోగంలో నైతిక ప్రమాణాలు, పారదర్శకత మరియు జవాబుదారీతనం పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.డ్రోన్లు నిఘా, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ పర్యవేక్షణ మరియు శోధన-రక్షణ చర్యలకు సమర్థవంతంగా తోడ్పడతాయని, అదే సమయంలో సరిహద్దుల గుండా మత్తుపదార్థాలు, ఆయుధాల అక్రమ రవాణా మరియు అనధికారిక నిఘా వంటి నేరాలకు ఇవి దుర్వినియోగం అవుతున్నాయని వివరించారు. దీనికోసం యాంటీ-డ్రోన్ (Anti-drone) సామర్థ్యాలను మరియు నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.క్రిప్టోకరెన్సీ, షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ మరియు ఆన్లైన్ పెట్టుబడి మోసాలు పెరిగినందున ఫోరెన్సిక్ అకౌంటెంట్లు, బ్యాంకులు మరియు సైబర్ నిపుణుల సమన్వయం అవసరమని తెలిపారు. నేర విచారణలో మొబైల్ ఫోన్లు, సీసీటీవీ, క్లౌడ్ స్టోరేజ్ వంటి డిజిటల్ ఆధారాల సేకరణ, భద్రత, ఫోరెన్సిక్ పరిశోధన అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.ఎంతటి ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ, ప్రజల విశ్వాసం, సహకారం మరియు భాగస్వామ్యమే పటిష్టమైన చట్ట అమలుకు ప్రధాన పునాది అని స్పష్టం చేశారు. మహిళలు, పిల్లల భద్రత, పారదర్శకత, మరియు బాధితుల పట్ల సున్నితమైన స్పందన పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచుతాయన్నారు. పోలీస్ సిబ్బందికి సైబర్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్స్, AI, లీడర్షిప్ మరియు ఒత్తిడి నిర్వహణలో నిరంతర శిక్షణ ఇవ్వాలని, భవిష్యత్తు పోలీసింగ్ నేరం జరిగిన తర్వాత స్పందించేలా కాకుండా నేరాన్ని ముందే ఊహించి నిరోధించే విధానంలో ఉండాలని తీర్మానించారు. ఈ సెమినార్లో పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, చట్ట సభల ప్రతినిధులు, న్యాయ కోవిదులు పాల్గొన్నారు. -
విడదల రజినిని లాక్కెళ్లిన పోలీసులు
-
నా ఇంట్లో మీ పెత్తనం ఏంటి?.. అభిజిత్ దీప్కే ఫైర్!
భద్రత కోసం వచ్చిన పోలీసు అధికారి తనపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అబిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. తన నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలుజ్ ఎంఐడీసీ ప్రాంతంలోని దీప్కే నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బెదిరింపుల నేపథ్యంలో, అలాగే ఆయనను కలిసేందుకు భారీగా ప్రజలు వస్తుండటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ను అక్కడ నియమించారు. అయితే ఆ అధికారి తన ఇంటికి వచ్చే వారిని నియంత్రిస్తున్నారని దీప్కే ఆరోపించారు.‘ఎవరిని కలవాలో మీరు నిర్ణయిస్తారా?’వైరల్‌గా మారిన ఓ వీడియోలో.. సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారితో దీప్కే వాగ్వాదం చేస్తూ కనిపించారు. తన ఇంటికి ఎవరు రావాలి.. ఎవరిని కలవాలి అనే విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. “నా ఇంట్లో మీ పెత్తన ఏంటి?. నేను ఎవరినైనా ఇంట్లోకి రావాలని చెబుతున్నప్పుడు.. వారిని ఎందుకు ఆపుతున్నారు? ఢిల్లీ పోలీసుల్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పటివరకు ఎలాంటి సమస్య జరగలేదు. ఎవరిని కలవాలి.. ఎవరిని కలవకూడదో పోలీసులు నాకు చెప్పలేరు” అంటూ దీప్కే ప్రశ్నించారు.అంతేకాకుండా.. “మీరు బయటకు వెళ్లండి. నాకు మీ అవసరం లేదు” అంటూ ఆ పోలీసు అధికారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.Chhatrapati Sambhajinagar - Abhijit Dipke has made strong allegations against CID officers, accusing them of arrogant and rude behaviour towards people who come to meet him.Dipke, who flared up against the police officers, claimed that visitors arriving for meetings with him are… pic.twitter.com/5hCF6s7p8Y— NextMinute News (@nextminutenews7) August 7, 2026ఉన్నతాధికారికి ఫోన్లో ఫిర్యాదుమరో వీడియోలో దీప్కే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడారు. సురేశ్ అనే పీఎస్ఐ తనను కలిసేందుకు వచ్చే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వారిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని, అలాంటి అధికారి తనకు వద్దని పేర్కొన్నారు. వెంటనే అతడిని అక్కడి నుంచి తొలగించాలని కోరారు. “నా ఇంటికి వచ్చే వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది కావాలనే చేస్తున్నారా?” అంటూ ఆయన ప్రశ్నించినట్లు వీడియోలో వినిపిస్తోంది.నిఘా ఆరోపణలుతన నివాసం సమీపంలో సీఐడీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో నిఘా పెట్టారని కూడా దీప్కే ఆరోపించారు. ఓ రిపోర్టర్ తనకు ఈ విషయం తెలిపారని చెప్పారు. ఓ సీఐడీ సిబ్బంది ఫోన్లో ‘హిట్ స్ప్రే’ పేరుతో వాట్సాప్ గ్రూప్ కనిపించిందని, అక్కడి నుంచి నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. అయితే దీప్కే చేసిన ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక స్పందన వెంటనే రాలేదు. వాలుజ్ ఎంఐడీసీ పరిధి డీసీపీ పంకజ్ అతుల్కర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదు. మరోవైపు.. అభిజిత్ యాటిట్యూడ్పైనా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల నిరసనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన అబిజీత్ దీప్కే.. తాజాగా తన ఇంటి వద్ద భద్రతా సిబ్బందితో జరిగిన ఈ వివాదంతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. భద్రత పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించకూడదన్నది దీప్కే వాదన కాగా.. భద్రతా ఏర్పాట్లలో భాగంగానే పోలీసులు వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. -
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత
సాక్షి, అమరావతి: పచ్చ ముఠాల దౌర్జన్యం.. విధి నిర్వహణలో పోలీసుల ఉదాసీనతపై భారతీ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా హైకోర్టు స్పందించింది. భారతీ సిమెంట్స్ మైనింగ్ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాంట్‌తో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న టీడీపీ మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు! భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. క్రమశిక్షణరాహిత్యంలో భాగంగా కాంట్రాక్టర్ తొలగించిన కొంత మంది, ఇతరులతో కలిసి భారతీ సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకుని ఉత్పత్తి నిలిపేయాలన్న కుట్రతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్లాంట్‌లోకి వెళ్లే దారులను మూసివేసి రాకపోకలకు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని నివేదించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అల్లరి మూకల దౌర్జన్యం వల్ల గని నుంచి లైమ్‌స్టోన్, ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గతంలో రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదని మోహన్‌రెడ్డి వివరించారు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందన్నారు. అంతేకాక ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సైతం నష్టం కలుగుతోందని తెలిపారు. కొందరి రాజకీయాలతో ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం... ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి వేల మంది ఉద్యోగులు బతుకుతున్నారని, కొందరి రాజకీయాల వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం నెలకొందని మోహన్‌రెడ్డి తెలిపారు. దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తూ, ఖజానాకు పన్నుల రూపంలో భారీ మొత్తాలు చెల్లిస్తున్న కంపెనీ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. గతంలో ఇదే రీతిలో కొందరు ఇండియా సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకున్నారని, దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చిందని నివేదించారు. ఈ రోజు కూడా ప్లాంట్‌కు వెళ్లకుండా దారిలో టెంట్ వేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. 10 మందిపై చర్యలు తీసుకునేలా పరిస్థితిలో కూడా పోలీసులు లేరంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్లాంట్‌లో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కంపెనీపై ఆధారపడి బతుకుతున్న కారి్మకులను దృష్టిలో పెట్టుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. కాగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యం తొలిసారి విచారణకు వస్తోందని, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
మాదేపల్లిలో హైటెన్షన్.. అబ్బయ్య చౌదరిని అడ్డుకున్న పోలీసులు
-
ఊడిగమంతా హుష్‘ఖాకీ’ పోలీస్ నెత్తిపైనా ‘సర్దుబాటు’ పిడుగు..
‘‘డీఏ బకాయిలు చెల్లించలేదు.. ఐఆర్ ప్రకటించలేదు.. పీఆర్సీ ఇవ్వలేదు.. వీటన్నింటితోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఊసేలేదు.. వెరసి చంద్రబాబు ప్రభుత్వంపై రెండేళ్లకే ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకింది. ఉద్యోగులు ఉద్యమ బాట పడుతుండటంతో వారిని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా రాçష్టపతి ఉత్తర్వుల (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) అమలును తెరమీదకు తెచ్చింది.’’ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ అమలు భారాన్ని భుజానికి ఎత్తుకుని ఊడిగం చేస్తున్న పోలీసులకే కీలెరిగి వాత పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నింది. రక్షక భటుల నెత్తిన సర్దుబాటు పిడుగువేసింది. హామీల అమలు, వేతనాల పెంపు, డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి అనేక కీలక అంశాలపై తోటివారితో కలిసి ఖాకీలు నోరెత్తకుండా ఉండేందుకే చంద్రబాబు సర్కారు ఆగమేఘాలపై ఉద్యోగుల విభజన ప్రక్రియ కిటుకును వాడుకుంటోంది. ప్రభుత్వ తీరు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఇప్పటికే ఏపీ పోలీస్, అగ్నిమాపక శాఖలకు చెందిన సుమారు 300 మంది పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. సమయం, సందర్భం లేకుండా సరైన మార్గదర్శకాలు లేకుండా చేపట్టిన ఉద్యోగుల విభజన ప్రక్రియపై రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులూ తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖలకు చెందిన ఉద్యోగులు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 27 నెలలు గడువున్నా.. ఇప్పుడెందుకు హడావుడి.. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన(సర్దుబాటు) ప్రక్రియకు రాష్ట్రపతి ఉత్తర్వులు(ప్రెసిడెన్షియల్ ఆర్డర్)–2025 అమలుకు కేంద్ర ప్రభుత్వం 27 నెలల గడువు ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ నెలాఖరులోపు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని మెడమీద కత్తిపెట్టి మరీ ఉద్యోగులను మానసిక వత్తిడికి గురిచేస్తోంది. తగిన సమయం ఇవ్వకుండా, సరైన ప్రణాళిక లేకుండా చేపట్టిన ఉద్యోగుల విభజన తీవ్ర గందరగోళంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371–డి, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల(ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1975) ముఖ్య ఉద్దేశం ‘స్థానిక అభ్యర్థుల సొంత ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను, ఉద్యోగ రక్షణను కల్పించడం’. ఆర్టికల్ 371–డీ కింద ఇచ్చే రాష్ట్రపతి ఉత్తర్వులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది. ఉద్యోగుల విభజన పేరుతో అన్యాయం.. వాస్తవానికి రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు సంబంధించి పదోన్నతులను పూర్తిగా నిలిపివేయాలని ఎక్కడా నిబంధనలేదు. అయినప్పటికీ ఉద్యోగుల విభజన సాకుతో జూలై 13 నుంచి సాధారణ బదిలీలు, పదోన్నతులను, జాబ్ క్యాలెండర్‌ను నిలిపివేయడం చట్ట విరుద్ధం. అనేక శాఖల్లో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, కేడర్, సీనియారిటీ వంటి సమస్యలు పరిష్కారం కాకుండానే ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల ఉద్యోగుల సేవా హక్కులు దెబ్బతింటాయి. ఉద్యోగ నియామకాలపై బ్యాన్ పేరుతో కారుణ్య నియామకాలనూ నిలిపివేయడం బాధాకరం. కారుణ్య నియామకం అనేది మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ చర్య అనే బాధ్యతను విస్మరించడం దారుణం. ఉద్యోగుల విభజనలో డిమాండ్లు ఇవి.. ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన ఉద్యోగుల విభజనపై ఉద్యోగ వర్గాల నుంచి పలు డిమాండ్లు వస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. ఉద్యోగుల అభిప్రాయాలను ముందుగా సేకరించాలి. పారదర్శక కేటాయింపు విధానాన్ని అమలు చేయాలి. సీనియారిటీని పూర్తిగా రక్షించాలి. కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో కార్యాలయాలను ప్రారంభించాలి. ఉద్యోగులకు బదిలీ భత్యం, గృహ వసతి సహాయం అందించాలి. ఉద్యోగుల సంఘాలతో నిరంతరం చర్చలు జరపాలి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిపాలనను సులభతరం చేయాలి. హడావుడిగా సర్దుబాటుతో ఉద్యోగుల హక్కులకు భంగం..ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండు మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపును హడావుడిగా చేపట్టడంతో తమ హక్కులకు భంగం కలుగుతోందని ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో హడావిడిగా ప్రభుత్వం ముందుకు వెళితే వేలాది మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదంతోపాటు న్యాయపరమైన సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బలవంతపు బదిలీలు, సీనియారిటీ, పదోన్నతులపై ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి, కార్యాలయ మౌలిక సదుపాయాల కొరత, పరిపాలనా అయోమయం, సిబ్బంది కొరత, న్యాయపరమైన వివాదాలు, స్థానికత సమస్య, మహిళా ఉద్యోగుల ఇబ్బందులు, వైద్యం, విద్య సౌకర్యాల ఇబ్బందులు వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. రాష్ట్రంలోని రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, ఫైర్, మున్సిపల్, విద్య శాఖల్లో ఉద్యోగుల విభజన చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో సీనియర్లలో పురుషులు, జూనియర్లలో మహిళలు అధికంగా ఉన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారిని విభజిస్తే కొత్త జిల్లాలకు అత్యధికంగా మహిళా కానిస్టేబుళ్లను కేటాయించడం వల్ల క్షేత్రస్థాయిలో నేరాలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఉద్యోగుల హక్కులను కాపాడుతూ.. పరిపాలనా సామర్థ్యాన్ని పెంచే విధంగా వారి విభజన చేపట్టాల్సిన అవసరం ఉంది. -
చట్టం, న్యాయస్థానాల తీర్పులు.. వాస్తవాలు
దేశంలో స్థిరాస్తుల హక్కులు, సరిహద్దుల తగాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు బాధితులు తరచూ పోలీసులను ఆశ్రయించడం లేదా కొన్ని సందర్భాల్లో పోలీసులు నేరుగా జోక్యం చేసుకుని నోటీసులు జారీ చేయడం, ఒక పక్షాన నిలవడం వంటి పరిణామాలు చూస్తుంటాం. అయితే, కేవలం సివిల్ స్వభావం కలిగిన ఆస్తి వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవచ్చా? ఈ అంశంపై భారత రాజ్యాంగం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టుల స్పష్టమైన తీర్పులు ఏమి చెబుతున్నాయో చూద్దాం.కోర్టులకే పూర్తి అధికారంఆస్తి యాజమాన్య హక్కులు (Title Dispute), స్వాధీనం (Possession), హద్దులు లేదా వారసత్వ వివాదాలు పూర్తిగా సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయి. భారత రాజ్యాంగం ప్రకారం పౌరుల మధ్య ఉండే పౌర హక్కుల వివాదాలను విచారించి పరిష్కరించే అధికారం కేవలం న్యాయవ్యవస్థకు మాత్రమే ఉంది. సివిల్ కోర్టుల్లో విచారణలో ఉన్న అంశాలపై పోలీసులు స్వయంగా పంచాయితీలు చేయడం, ఒక పక్షాన్ని ఖాళీ చేయించడం లేదా భూమి విషయంలో నిర్ణయాలు తీసుకోవడం చట్టవిరుద్ధం.పోలీసులు ఎప్పుడు జోక్యం చేసుకోవచ్చు? (మినహాయింపు)సివిల్ వివాదాల్లో పోలీసుల పాత్ర అత్యంత పరిమితం. కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే పోలీసులు చట్టబద్ధంగా ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది.ఆస్తి వివాదం నెపంతో అక్రమ ప్రవేశం, బెదిరింపులు, దాడి లేదా ఆస్తి ధ్వంసం వంటి క్రిమినల్ నేరాలు జరిగినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు.వివాదం తీవ్రరూపం దాల్చి భౌతిక దాడులు లేదా శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు శాంతి పరిరక్షణ కోసం నిరోధక చర్యలు తీసుకోవచ్చు.సివిల్ కోర్టు లేదా హైకోర్టు నిర్దిష్టంగా పోలీస్ ప్రొటెక్షన్ కల్పిస్తూ ఆర్డర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ ఆదేశాలను అమలు చేయడానికి పోలీసు బలగాలు సహకరించాలి.న్యాయస్థానాల హెచ్చరికలుఇటీవల అల్లాహాబాద్ హైకోర్టుతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు తమ తీర్పుల్లో ‘సివిల్ వివాదాల్లో పోలీసులు జడ్జిలుగా వ్యవహరించకూడదు’ అని స్పష్టం చేశాయి. చట్టపరిధి దాటి సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలతో పాటు కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకుంటామని కోర్టులు హెచ్చరించాయి.బాధితులు ఏమి చేయాలి?ఆస్తి వివాదం ఎదురైనప్పుడు పోలీసులపైనే ఆధారపడకుండా తగిన ఆధారాలతో సివిల్ కోర్టును ఆశ్రయించి ‘ఇంజెక్షన్ ఆర్డర్’ లేదా 'స్టే' పొందడమే చట్టబద్ధమైన పరిష్కారం. ఒకవేళ పోలీసులు అక్రమంగా జోక్యం చేసుకుని వేధిస్తుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందవచ్చు.ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే.. -
నా స్థలంలో నేను ధర్నా చేస్తే తప్పేంటి..? అర్ధరాత్రి మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లి VS పోలీస్
-
పోలీసులు తీసుకెళ్లారు.. చంపేస్తారేమో!
శ్రీకాకుళం క్రైమ్/ఆమదాలవలస : ‘ఆమదాలవలస పోలీసులమని చెప్పి గాజువాకలో నా కుమార్తె ఇంటికెళ్లి అర్ధరాత్రి నా కొడుకుని తీసుకెళ్లారు. ఒక్కగానొక్క పిల్లాడిని ఇప్పటికీ పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు. టీవీల్లో చూపినట్లు పోలీసులు చంపేస్తారేమోనని భయంగా ఉంది. నా పిల్లాడు ఎక్కడ?’.. అంటూ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ ఐజే నాయుడు కాలనీలో ఉంటున్న అన్నెపు రాజు అనే మహిళ ఆమదాలవలస పోలీస్‌స్టేషన్ ఎదుట బుధవారం కన్నీరుమున్నీరైంది. తమకేమీ తెలీదని అక్కడి పోలీసు సిబ్బంది చెప్పడంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన రోజు కొత్తరోడ్డులో విధులు నిర్వర్తిస్తున్న బూర్జ మహిళా ఎస్ఐ ఎం. ప్రవల్లికను చుట్టుముట్టి ఆమెపై హత్యాయత్నానికి ఒడిగట్టారని ఆమదాలవలస మున్సిపాలిటీ ఐజే నాయుడు కాలనీకి చెందిన అన్నెపు సంజయ్‌పై పోలీసులు అక్రమ కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు ఆమదాలవలస పోలీసులమంటూ విశాఖ గాజువాక పోలీస్‌స్టేషన్ పరిధి కుంచుమాంబ కాలనీలో ఉంటున్న కూన దీపిక (సంజయ్ సోదరి) ఇంటికెళ్లారు. అక్కడే ఉన్న సంజయ్‌ను ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో నీపై కేసు ఉన్నందున తీసుకెళ్తున్నామని చెప్పి అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వారిలో గార ఎస్ఐ ఉన్నట్లు సమాచారం. ఇక అక్కడ నుంచి రాత్రి 3 దాటాక పైడిభీమవరం సిస్కో స్టేషన్లో విచారణ నిమిత్తం ఉంచారు. ఉ.10 గంటల తర్వాత సంజయ్‌ను పోలీసులు ఎక్కడికి తరలించారన్నది ఎవ్వరికీ అంతుచిక్కడంలేదు. పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన.. కొడుకుని పోలీసులు పట్టుకుపోయిన విషయాన్ని బుధవారం ఉదయాన్నే కుమార్తె దీపిక ఫోన్ ద్వారా తల్లికి తెలపడంతో ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌కు బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి సంజయ్ తల్లి వెళ్లి అక్కడి సిబ్బందిని ప్రశ్నించింది. అప్పటికే వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగాయి. తమకేమీ తెలీదని పోలీసులు చెప్పడంతో స్టేషన్ ఆవరణలోనే కన్నీరుమున్నీరయ్యారు. ‘భర్తలేని తనకు కొడుకే దిక్కని.. నా పరిస్థితి ఏం కావాలి’ అంటూ కన్నీరుమున్నీరైంది. -
పోలీస్, ఫైర్, అంబులెన్స్.. ఇకపై అన్నింటికీ ఒకే నంబర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పౌరులకు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన, స్మార్ట్ మరియు సమన్వయంతో కూడిన సహాయాన్ని అందించడానికి తెలంగాణ పోలీసు శాఖ 'నెక్స్ట్-జనరేషన్ TG-ERSS డయల్ 112' వేదికను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC)లో జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ సీ.వీఆనంద్ ఈ ఆధునిక వ్యవస్థను ప్రారంభించారు.ఈ సందర్భంగా డీజీపీ సీ.వీ. ఆనంద్ మాట్లాడుతూ "సాంకేతిక ఆధారిత పోలీసింగ్ మరియు పౌర కేంద్రిక అత్యవసర సేవల దిశగా తెలంగాణ వేస్తున్న అడుగుల్లో ఈ నెక్స్ట్-జనరేషన్ డయల్ 112 ప్లాట్‌ఫామ్ ఒక ప్రధాన మైలురాయి. అత్యవసర సమయాల్లో బాధితులకు డయల్ 112 మొదటి రక్షణ కవచంగా పనిచేస్తుంది. అందువల్ల ప్రతి కాల్‌ను ఎంత వేగంగా, వృత్తిపరంగా నిర్వహిస్తామనే దానిపైనే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది" అని పేర్కొన్నారు.వ్యవస్థ ప్రాముఖ్యతఆధునిక వ్యవస్థ ప్రత్యేకతలు & AI సాంకేతికత•ఏకీకృత సేవలు: పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, శిశు సంక్షేమం, విపత్తు నిర్వహణ సేవలను 112 అనే ఒకే జాతీయ నంబర్‌కు అనుసంధానించారు.•AI ఆధారిత కాల్ ఫిల్టరింగ్: అనవసరమైన, స్ప్యామ్, సైలెంట్ మరియు చైల్డ్ కాల్స్‌ను ప్రాథమిక స్థాయిలోనే ఫిల్టర్ చేసి, అసలైన అత్యవసర కాల్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది.•కాల్ రౌటింగ్ & డిస్పాచ్: కాల్ స్వభావాన్ని బట్టి సంబంధిత రెస్పాన్స్ టీమ్‌కు AI సాంకేతికత ద్వారా దారి మళ్ళిస్తుంది.•వాయిస్-టు-టెక్స్ట్: మాట్లాడే సంభాషణను ఆటోమేటిక్‌గా పాఠ్య రూపంలోకి (Text) మారుస్తుంది.•ఖచ్చితమైన లొకేషన్ గుర్తింపు. ప్రస్తుతం 94% కాలర్ల లొకేషన్‌ను ఖచ్చితంగా గుర్తిస్తున్నారు.•డ్రోన్ సాంకేతికత.. రాబోయే రోజుల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మరియు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో డ్రోన్లను "ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లుగా" ఉపయోగించనున్నారు.మౌలిక సదుపాయాలు & వాహనాల అనుసంధానం• ఈ సెంటర్ 24x7 ప్రాతిపదికన 164 మంది శిక్షణ పొందిన సిబ్బంది, 900 SIP ఆధారిత ఛానళ్లతో పనిచేస్తుంది.• రోజువారీగా దాదాపు 14 లక్షల కాల్స్ IVR ను చేరుతుండగా, 18,000 ఎమర్జెన్సీ కాల్స్‌ను సిబ్బంది స్వీకరిస్తున్నారు. రోజుకు సుమారు 7,500 సంఘటనలకు ఫీల్డ్ యూనిట్లను పంపుతున్నారు.• రాష్ట్రంలోని 31 పోలీసు యూనిట్ల పరిధిలో ఉన్న 1,860 పెట్రోలింగ్ వాహనాలను (788 నాలుగు చక్రాల వాహనాలు, 1,072 ద్విచక్ర వాహనాలు) డిజిటల్‌గా అనుసంధానించారు. సంఘటన స్థలానికి అత్యంత సమీపంలో ఉన్న వాహనాన్ని సిస్టమ్ ఆటోమేటిక్‌గా గుర్తించి పంపుతుంది.ప్రజలందరూ పోలీసు, ఫైర్, అంబులెన్స్ ఇతర సేవలకు ఒకే ఎమర్జెన్సీ నంబర్ 112 ను గుర్తుంచుకోవాలని డీజిపి గారు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో నంబర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు.కార్యక్రమంలో భాగంగా AI వేదిక పనిచేసే తీరు, లొకేషన్ గుర్తింపు, వాహనాల కేటాయింపు మరియు లైవ్ డాష్‌బోర్డ్‌ల పనితీరుపై ప్రత్యక్ష డెమో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, TGCSB & FSL డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్, ఐపీఎస్; డీజీపీ (సాంకేతిక సేవలు) శ్రీ వి.వి. శ్రీనివాసరావు,హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ TGiCCC డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి, ఐపీఎస్ (రిటైర్డ్); సైబరాబాద్ సీపీ డా. ఎమ్. రమేష్, ఐపీఎస్ మల్కాజిగిరి సీపీ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్; తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీ శ్రీ విక్రమ్ సింగ్ మాన్, సీఐడీ డీజీ చారూ సిన్హా, ఐజీపి గజరావ్ భూపాల్, TGTS మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ రెడ్డి మల్టీ జోన్-I ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ లతో పాటు ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ బైక్‌పై రాపిడో బిజినెస్ వరంగల్‌లో వైరల్
హనుమకొండ: పోలీసుల వేగవంతమైన విధుల నిర్వహణ కోసం ప్రభుత్వం అందించిన అధికారిక ద్విచక్ర వాహనం.. రోడ్లపై ర్యాపిడో బైక్‌గా కనిపిస్తే ఎలా ఉంటుంది? వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసు శాఖకు కేటాయించిన అధికారిక బైక్‌ను ర్యాపిడో సేవల కోసం వినియోగిస్తున్నట్లు ఓ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు.వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో బిజినెస్ pic.twitter.com/uvWb20Nx1E— Telugu Scribe (@TeluguScribe) August 4, 2026 సమాచారం ప్రకారం.. హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి సుబేదారి జంక్షన్‌కు వెళ్లేందుకు ఓ వ్యక్తి ర్యాపిడో బైక్‌ను బుక్ చేసుకున్నాడు. కొద్దిసేపటికే వచ్చిన బైక్‌పై పోలీసు శాఖ అధికారిక గుర్తులు ఉండటాన్ని గమనించి ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. బైక్ గురించి రైడర్‌ను ప్రశ్నించగా, ఆ బైక్ తన పోలీసు స్నేహితుడిదని, తాను ర్యాపిడో సేవల కోసం ఉపయోగిస్తున్నానని చెప్పినట్లు సమాచారం. ఈ సంభాషణను ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.వైరల్ అయిన వీడియోలో కనిపించిన TS 09 PC 2795 నంబర్ గల బ్లూ కోట్స్ పోలీసు ద్విచక్ర వాహనం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎనుమాముల పోలీస్ స్టేషన్‌కు కేటాయించినదిగా గుర్తించారు. -
పోలీసుల ఓవరాక్షన్! దేవరపల్లిలో హైటెన్షన్...
-
పోలీసు కస్టడీకి సీదిరి అప్పలరాజు..
-
Kakani : వెనక్కి తగ్గేదేలే
-
అభిజీత్ దీప్కే అరెస్ట్‌కు రంగం సిద్ధం?
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై ఢిల్లీ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. పూణె, ఔరంగాబాద్‌లలో తనపై జరిగిన దాడి వెనుక అభిజీత్ దీప్కే మనుషుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించి, దీప్కేను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఫైజాన్ అన్సారీ మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు. అభిజీత్ దీప్కే తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఎవరూ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో సోనమ్ వాంగ్చుక్ను అదుపులోకి తీసుకుని, ఢిల్లీలో ఉద్రిక్తతలు తలెత్తకుండా అడ్డుకున్న ఢిల్లీ సీఎం, పోలీసుల చొరవను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.మరోవైపు, అభిజీత్ దీప్కే ఈ ఆరోపణలను ఖండించారు. తమ సంస్థ ఏ ఒక్క ప్రత్యేక రాజకీయ పార్టీని విమర్శించడానికి లేదా సమర్థించడానికి మాత్రమే పనిచేయదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ తమ సంస్థ విద్యార్థుల గొంతుకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖ మంత్రి ఏ పార్టీకి చెందినవారైనా విద్యార్థుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.ఇది కూడా చదవండి: గేదె లేదని పులులకు మేక మాంసం.. షాకిచ్చిన ఖర్చు! -
బంగ్లాదేశ్ ముఠా అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: బంగ్లాదేశ్ దొంగల ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. తొమ్మిదేళ్లుగా నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాను ఎట్టకేలకు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఆ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా ఇళ్లలో, ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడింది. ఇటీవల ఆదిలాబాద్ సమీపంలోని మావల మండలం కైలాస్‌నగర్‌లో గల ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో చోరీకి పాల్పడింది. వీరి నుంచి రూ.8 లక్షల విలువైన 73.5 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, ఐఫోన్లు, ఐప్యాడ్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.బంగ్లాదేశ్‌లోని దీనజ్‌పూర్ జిల్లా పర్బత్పూర్కు చెందిన మహ్మద్ జాని అలీ, మహ్మద్ రుమాన్ ప్రస్తుతం రాజస్తాన్‌లోని జైపూర్‌లో గల ఔట్‌సైడ్ చార్ దర్వాజాలో ఉంటున్నారు. వీరితోపాటు మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌లో గల బోగ్మోలియకు చెందిన తరుణ్ సింగ్ 2015 నుంచి రాజస్తాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా జూలై 11న బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సహచరులతో కలిసి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది.వీరు పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్టు నటిస్తూ రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్టు విచారణలో వెల్లడైంది. మహ్మద్ జాని అలీ కొన్నేళ్లుగా 12సార్లు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ప్రవేశించినట్టు తెలిపారు. భారత్‌లో నివసించేందుకు సహకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు సమకూర్చిన వారి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీలు, వివిధ రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, మావల సీఐ ప్రేమ్‌కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీపీ ఇంట్లో దొంగలు పడ్డారు.. ఒక్కసారి కాదు..
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని రాజాజీపురంలో ఓ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) నివసిస్తున్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఏసీపీ పై అంతస్తులో ఉంటుండగా, కింది అంతస్తులోని ఇంట్లోకి చొరబడి నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.పోలీస్ ఔట్‌పోస్ట్‌కు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. గత 5 నెలల్లో అదే ఇంట్లో జరిగిన రెండో చోరీ ఇది. ఆదివారం విధులు ముగించుకుని ఏసీపీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.టాకటోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజినీర్ సుధాంశు ఇల్లు ఉంటుంది. ఆయన సోదరుడు ఓ ఐఏఎస్ అధికారి. బజార్ఖాలా ఏసీపీ రంజిత్ కుమార్ సుమారు 20 రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి ఆ ఇంటి మొదటి అంతస్తులోకి మారారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏసీపీ కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం తమ స్వగ్రామానికి వెళ్లారు. దీంతో ఇంటికి తాళం వేసి ఉంది. ఆదివారం విధులు ముగించుకుని తిరిగి వచ్చిన రంజిత్ కుమార్ ప్రధాన గది తెరిచి ఉండటం గమనించారు. పరిశీలించగా, దొంగలు కింది అంతస్తులోకి చొరబడి అల్మారా లాకర్‌ను బలవంతంగా తెరిచి నగదు, విలువైన వస్తువులతో పారిపోయినట్లు గుర్తించారు. చోరీకి గురైన వస్తువుల విలువ ఇంకా నిర్ధారణ కాలేదు.ఈ చోరీపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు ముందు ఆ ప్రాంతంలో కొందరు అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లు సమాచారం.బజార్ఖాలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కుల్దీప్ దుబే మాట్లాడుతూ, చోరీ విషయం ఇంజినీర్ కుటుంబ సభ్యుల నుంచి తమకు తెలిసిందని చెప్పారు. అయితే ఆదివారం సాయంత్రం వరకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని తెలిపారు.తాజా ఘటనతో ఇదే ఇంట్లో గతంలో జరిగిన చోరీ మరోసారి చర్చనీయాంశమైంది. మార్చి 25న దొంగలు ఇంట్లో నుంచి నగలు రూ.50,000 నగదు, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు ఇప్పటికీ ఛేదించలేదు. నిందితులను పోలీసులు ఇంకా గుర్తించలేదు. -
అడ్వకేట్ ను కాలుతో తన్నిన పోలీస్.. న్యాయవాదుల చట్టం కోసం డిమాండ్
-
విశ్వేశ్వర్ రెడ్డిని బలవంతంగా ఎత్తుకెళ్లిన పోలీసులు
-
ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు
ముంబై: మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టీఈటీ) 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై సమీపంలోని థానే నగర పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో పెద్దఎత్తున కుట్ర భగ్నమైంది. టీఈటీ పరీక్షకు కేవలం రెండు రోజుల ముందు పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బ్రిజేంద్ర గుప్తాతో పాటు మరో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ముఠా ఒక్క టీఈటీ పేపర్ లీకేజీతో ఆగకుండా, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే ‘సెట్’ పరీక్షా పత్రాన్ని కూడా లీక్ చేయడానికి ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆగ్రాలోని ఓ ముద్రణాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ శర్మ ద్వారా ఈ పత్రాలను రహస్యంగా సేకరిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.ఆఫ్‌లైన్, ఆన్లైన్ విధానాల ద్వారా ఈ ముఠాలు ఏవిధంగా ప్రశ్నపత్రాలను తస్కరిస్తున్నాయనే విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ప్రింటింగ్ ప్రెస్‌లలో నిఘా ఉంచి, కిందిస్థాయి సిబ్బందిని ఆకర్షించి పత్రాలను బయటికి పంపడం, అలాగే ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను దక్కించుకుని వేరే వ్యక్తులతో పరీక్ష రాయించడం వంటి పద్ధతులను ఈ నెట్వర్క్ వాడుతున్నట్లు తేలింది.టీఈటీ పరీక్షా పత్రాన్ని రూ. 8,000 పెట్టి కొనుగోలు చేసిన ఈ ముఠా, మహారాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు రూ. 80,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. భివాండి నగరంలో ఈ పేపర్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో థానే పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి హరియాణా, బిహార్‌కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో ఈ భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది.ఇది కూడా చదవండి: కూలిన పైకప్పు.. నిద్రలోనే కన్నుమూసిన దంపతులు -
సార్.. మీ హెల్మెట్ ఏది?
సాక్షి, విశాఖపట్నం: ట్రాఫి క్ రూల్స్.. సామాన్యులకేనా? పోలీసులకు వర్తించవా? ఫైన్లు వేసేటప్పుడు ఉండే శ్రద్ధ.. వారు రూల్స్ పాటించడంలో ఎందుకు ఉండదు? ఇది రోడ్లమీద తరచూ వినిపించే సామాన్యుల ఆవేదన. కానీ.. ఓ యువకుడు ఏకంగా రోడ్డుపై వెళ్తున్న పోలీసులనే ‘మీ హెల్మెట్ ఏది సార్? అంటూ ధైర్యంగా నిలదీశాడు. అయితే.. ఆ తర్వాత జరిగిన పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా.. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నగరంలోని శ్రీహరిపురం సమీపంలో జరిగిన సంఘటన ఇది. అసలేం జరిగిందంటే..! శ్రీహరిపురం అన్నమ్మ కాలనీ దాటుతూ.. హెచ్‌పీసీఎల్ వైపుగా రాత్రి సమయంలో ఇద్దరు పోలీసులు ఓ స్కూటర్‌పై వెళ్తున్నారు. బండి నడుపుతున్న పోలీసుతో పాటు, వెనుక కూర్చున్న పోలీసుకి కూడా హెల్మెట్ లేదు. అదే సమయంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఓ యువకుడు వారి పక్కకు వచ్చి.. ‘సార్.. మీ హెల్మెట్ ఏది సార్?’ అని ప్రశ్నించాడు. ఇంతలో డ్రైవ్ చేస్తున్న పోలీస్.. ‘మేము నైట్ బీట్‌లో ఉన్నాం’ అని బదులివ్వగా.. ఆ యువకుడు ఏమాత్రం తగ్గలేదు. ‘మాకు మాత్రం హెల్మెట్ లేకపోతే.. రూ.10వేలు ఫైన్ వేసేస్తారు. మీరు మాత్రం హెల్మెట్ పెట్టుకోరా?’ అంటూ నిలదీశాడు. ఇంకోసారి ఇలా జరగదు..!: సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సామాన్యులు ప్రశ్నిస్తే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడం.. లేదా అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతుంటారు. కానీ.. ఇక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. యువకుడి ప్రశ్నతో బండి వెనుక కూర్చున్న పోలీసు వెంటనే బండి ఆపమన్నారు. కిందకు దిగి.. ఆ యువకుడు అడిగిన దాంట్లో న్యాయం ఉందని మనస్ఫూర్తిగా అంగీకరించారు. ‘నువ్వు అన్నది వాస్తవమే.. కరెక్టే.. మేం హెల్మెట్ పెట్టుకుని వెళ్లాలి. మాది తప్పే కాదనడం లేదు. క్వశ్చన్ చేయడం నీ తప్పు కాదు.. అది నీ రైట్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పోలీసుతో సమానమే’ అంటూ తన తప్పును అంగీకరించారు. ‘సేఫ్టీ రూల్ అనేది అందరికీ ఒకటే కదా’ అంటూ ఆ యువకుడు చెప్పిన మాటకు ఆ అధికారి సానుకూలంగా స్పందించి.. రైట్..ఈసారి అలా జరగదు అంటూ బదులిచ్చిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చట్టం, ట్రాఫిక్ నిబంధనలు ఎవరికైనా ఒకటేనని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. తప్పు చేసినప్పుడు సాక్షాత్తూ పోలీసులైనా సరే భయపడకుండా ప్రశ్నించిన యువకుడి ధైర్యానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అదే సమయంలో.. ఎదురుగా ఉన్నది సామాన్యుడే కదా అని బెదిరింపులకు దిగకుండా.. చట్టం ముందు అందరూ సమానులే అని అంగీకరించి తప్పు ఒప్పుకున్న పోలీసుల తీరును కూడా ప్రశంసిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. -
అర్ధరాత్రి ‘ఆపరేషన్ విరూపాక్షి’!
ఆదోని: ఆదివారం అర్ధరాత్రి.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్వగ్రామం, మండల కేంద్రమైన చిప్పగిరిలో తన భార్య, బిడ్డలతో మంచి నిద్రలో ఉన్నారు. ఐతే ఇంటి ప్రధాన ద్వారం తలుపులు బద్దలు కొడుతున్న శబ్దంతో ఉలిక్కిపడి లేచారు భార్యాభర్తలు. ఇంట్లో నుంచి తొంగి చూస్తే దాదాపు 40 మందికి పైగా పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ పక్కకు తిప్పేశారు. గునపాలు, కొడవళ్లతో తలుపులను పగలగొడుతూ తెరిచే ప్రయత్నం చేశారు. విధిలేక ఆ భయానక వాతావరణంలోనే ఎమ్మెల్యే విరూపాక్షి భార్య రామాంజనమ్మ తలుపులు తెరిచారు. ఒక్కసారిగా పోలీసులందరూ ఇంట్లోకి దౌర్యన్యంగా చొరబడ్డారు. నీ భర్త ఎక్కడ అంటూ ఆమె మీద చేతులు వేస్తూ పక్కకు నెట్టారు. ఎమ్మెల్యే ఉన్న బెడ్ రూం ద్వారాన్ని కూడా గునపంతో బద్దలు కొడుతూ తెరిచే ప్రయత్నం చేస్తుంటే ఆయన తలుపు తెరిచి బయటకు వచ్చారు. ఆరేడుగురు సీఐలు, దాదాపు నలభై మంది పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని చుట్టుముట్టి చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు బలవంతంగా తరలించారు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో తమ ఇంట్లో పోలీసులు జరిపిన దమనకాండ గురించి ఆలూరు ఎంఎల్ఏ విరూపాక్షి భార్య రామాంజనమ్మ నిలువెల్లా వణికిపోతూ చెప్పిన వివరాలివి. ఘటన పూర్వాపరాలను ఓమారు పరికిస్తే..టీడీపీ మూకల దాడి నుంచి కార్యకర్తను కాపాడుకునేందుకు..చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన గిరి అనే వ్యక్తి శనివారం రాత్రి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి తనపై నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ మూకలు దాడులు చేస్తున్నాయని, తనను కాపాడాల్సిందిగా వేడుకున్నాడు. వెంటనే ఎమ్మెల్యే సీఐకి ఫోన్ చేశారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్లడానికి తాత్సారం చేస్తున్న విషయాన్ని గ్రహించి వెంటనే తన కార్యకర్త కోసం తన సోదరుడు శ్రీరాములు, కొందరు కార్యకర్తలను తీసుకుని రాత్రికి రాత్రే నేమకల్లు గ్రామానికి వెళ్లారు. అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీకి చెందిన ఇరుపక్షాలకు నచ్చచెప్పి ఇంటికి తిరుగు ముఖం పట్టారు. అయితే ముందస్తు పథకంలో భాగంగా గ్రామంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు గూండాలు ఎమ్మెల్యేను చుట్టుముట్టి మా గ్రామానికి ఎందుకు వచ్చావంటూ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ దౌర్జన్యంగా దాడికి దిగారు. వారి దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములుకు చేయి విరిగింది. వెంటనే తన సోదరుడిని వెంట తీసుకుని చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఫిర్యాదు ఇస్తే పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసులు టీడీపీ వర్గీయులకు వత్తాసు పలుకుతున్నారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్ ఎదుట కొద్దిసేపు బైఠాయించారు. అర్ధరాత్రి తన ఇంటికి తిరిగివెళ్లారు.పక్కా పథకం ప్రకారమే ఎమ్మెల్యే నివాసంపై దాడిముందు రచించుకున్న పథకం మేరకు ఇక పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చుట్టు పక్కల ప్రాంతాలైన ఆదోని, పత్తికొండ, గుంతకల్లు, ఆస్పరి స్టేషన్లకు చెందిన సీఐలను, పోలీసులను పిలిపించుకున్నారు. పక్కా పథకం మేరకు 2.45 గంటల సమయంలో నక్సల్స్‌ను పోలీసులు చుట్టిముట్టినట్లు సీఐలు, భారీ ఎత్తున పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి బయట ఉన్న ఎమ్మెల్యే అనుచరులను ముందే స్టేషన్‌కు తరలించారు. ఇక ఇంట్లో కేవలం ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి, మరో మహిళా బంధువు మాత్రమే మిగిలారు. తర్వాత పోలీసులు గుండాల్లా రెచ్చిపోయారు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. గునపాలతో తలుపులను పగలగొడుతూ తెరిచే ప్రయత్నం చేశారు. చివరకు ఎమ్మెల్యే భార్య తలుపులు తెరిచారు. ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేసి ఎమ్మెల్యే ఉన్న బెడ్ రూంను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన బయటకు వచ్చారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. చిప్పగిరిలో ఆదివారం ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి గడియ ధ్వంసం చేసిన పోలీసులు స్టేషన్ వద్ద కార్యకర్తల ఆందోళన..ఎమ్మెల్యే నివాసంపై దాడిచేసి అత్యంత దుర్మార్గంగా నిర్బంధించిన విషయం తెల్లవారుజామునే సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రమంతా వ్యాపించింది. దీంతో కర్నూలు, నంద్యాల, అనంతపురం, తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వందలాది మంది కార్యకర్తలు, నాయకులు , మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు తరలివచ్చారు. భారీగా చేరుకున్న కార్యకర్తలు పోలీసు స్టేషన్‌ను ముట్టడించే ప్రయత్నం చేస్తుండటంతో స్టేషన్ గేట్లను మూసివేశారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆగ్రహించిన నాయకులు, కార్యకర్తలు గుంతకల్లు–ఆలూరు ప్రధాన రోడ్డు మీద బైఠాయించారు. రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఎమ్మెల్యే విరూపాక్షిని వెంటనే విడిచిపెట్టాలని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. కార్యకర్తకు అండగా నిలవడం తప్పా?టీడీపీ మూకలు దౌర్జన్యం చేస్తున్నాయని పార్టీ కార్యకర్త గిరి బాధపడుతుంటే కాపాడుకోవాలని ఎమ్మెల్యే వెళ్లడం, కార్యకర్తకు అండగా ఉండడం తప్పెలా అవుతుందని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన విలేకరులకు సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పెద్దల సూచనల మేరకు పోలీసులు పన్నిన పన్నాగమిది అని వ్యాఖ్యానించారు. కేసులకు బెదరబోమన్నారు. అంతకుముందు సాయిప్రసాద్ రెడ్డి సీనియర్ న్యాయవాది జీవన్‌సింగ్‌తో పాటు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి శైలజనాథ్, ఎంఎల్సీ డా.మధుసూదన్‌లను స్టేషన్లోకి తీసుకువెళ్లి డీఎస్పీ వెంకటరామయ్య, తదితర పోలీసు అధికారులతో మాట్లాడారు.హత్యాయత్నం కేసు.. 14 రోజులు రిమాండ్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై చిప్పగిరి పోలీసులు హత్యాయత్నం కేసు (ఎఫ్ఐఆర్ నంబరు: 37/2026) నమోదు చేశారు. ఈ కేసులో ఆయనతో పాటు మరో 16 మందికి ఆలూరు జేఎఫ్‌సీఎం కోర్టు 14 రోజుల జ్యుడీషీయల్ రిమాండ్ విధించింది. వీరిని కర్నూలు జైలుకు తరలించారు. కాగా ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసులో మాత్రమే కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఎమ్మెల్యే తరఫు న్యాయవాది జీవన్‌సింగ్ ఆదివారం రాత్రి కీలక పిటిషన్ దాఖలు చేశారు. అట్రాసిటీ కేసులో కూడా రిమాండ్ అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.ఈ పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ జరపనుంది. ఇదే సమయంలో ఘటనకు సంబంధించి కీలక ఆధారాలను భద్రపరచాలని కోరుతూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఘటన అనంతరం ఎమ్మెల్యేను తీసుకువచ్చిన చిప్పగిరి పోలీసు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను కోర్టు ముందుంచాలని న్యాయవాది జీవన్‌సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సంబంధిత పోలీసు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచి రెండు రోజుల్లోగా కోర్టు ముందుంచాలని పోలీసు అధికారులను ఆదేశించింది. కేసు విచారణలో ఆ ఫుటేజీ కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీమంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిమంత్రాలయం రూరల్: ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరూపాక్షిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. ఈ ఘటనను సామాజిక మాధ్యమాల ద్వారా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలువుతోందన్నారు. ఆలూరు ఎమ్మెల్యేతో పాటు మరో 15 మందిని నిర్బంధించిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజా ప్రతినిధులకు సైతం స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని రకాల దాడులు, దౌర్జన్యాలు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదన్నారు. వైఎస్సార్సీపీ పైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ఏపీలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ఆలూరు సీఐ రవిశంకర్ ఎమ్మెల్యేను ఏకవచనంతో మాట్లాడడం అత్యంత హేయమని అని అన్నారు. -
ఏం బెదిరిస్తున్నావా..? పోలీసులు Vs ఎమ్మెల్యే విరుపాక్షి
-
రాడ్లు, కత్తులతో టీడీపీ నేతల దాడి.. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్..
-
AP: ఆలూరు నియోజకవర్గంలో టెన్షన్.. టెన్షన్..
సాక్షి, కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గంలో పోలీసులు భారీగా మోహరించారు. అన్ని ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎవరిని రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే వీరుపాక్షిపై అట్రాసిటీ కేసు బనాయించేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.చిప్పగిరి పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళనవిరూపాక్షిని చిప్పగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. విరూపాక్షి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పీఎస్‌కు వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే అన్నిదారులు మూసివేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులు రాకుండా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా..కాగా, వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో శనివారం అర్ధరాత్రి.. వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి రాత్రి 2.45 గంటలకు భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరినీ చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌లను పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఇది జరిగింది..టీడీపీ నాయకుడు నాగరాజు.. వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే వీరుపాక్షి పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ విరుపాక్షిపై సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. అనంతరం, ఎమ్మెల్యే నివాసానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు.. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన విరూపాక్షి, చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. -
19 నుంచి పోలీస్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగార్థులకు శుభవార్త. ఇటీవల నోటిఫికేషన్లు విడుదలైన పోలీస్, స్పెషల్ పోలీస్, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖల్లోని 7,437 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు తేదీలను, ఫీజులను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) వెల్లడించింది. ఈ మేరకు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని స్పష్టం చేశారు. ప్రకటనలో ముఖ్యాంశాలు..: ⇒ అభ్యర్థులు అన్ని దశల్లో పరీక్షలకు కలిపి ఒకేసారి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ⇒ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష ఉంటుంది. సాంకేతిక పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష ఉండదు. ⇒ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), శారీరక సామర్థ్య పరీక్ష (పీఈటీ) నిర్వహిస్తారు. ⇒మెకానిక్/డ్రైవర్ పోస్టులకు శారీరక కొలతల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించే ట్రేడ్ టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్ ఉంటాయి. ⇒ శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), శారీరక సామర్థ్య పరీక్ష (పీఈటీ)ల్లో అర్హత పొందిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష ఉంటుంది. కానిస్టేబుల్ అభ్యర్థులకు మూడు గంటల పరీక్ష, ఎస్ఐ అభ్యర్థులకు రెండు డిస్క్రిప్టివ్ పేపర్లతో కలిపి మొత్తం నాలుగు పరీక్షలు ఉంటాయి. ⇒ నియామక ప్రక్రియలో బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి. ⇒ పార్ట్–1 ఆన్లైన్ దరఖాస్తు నింపే ముందు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కోసం అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్లో ఆధార్ యాప్‌ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి. ⇒ ఆన్లైన్ దరఖాస్తు నింపే సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే వెబ్సైట్లో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి. ⇒ దరఖాస్తును విజయవంతంగా సమర్పించిన అనంతరం, దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. దరఖాస్తు ఫీజు ఇలా..: ⇒ ఎస్సై(సివిల్), ఆర్ఎస్సై (ఏఆర్), ఆర్ ఎస్సై (టీజీఎస్పీ), ఆర్ఎస్పై (ఎస్ఏఆర్ సీపీఎల్), ఎస్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్, స్టేష న్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750, ఇతరులు రూ.1,500 ఫీజు చెల్లించాలి. ⇒ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్సై పోస్టులకు ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు రూ.750, మిగిలిన వారు రూ.1,500 ఫీజు చెల్లించాలి. ⇒ కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్సీపీఎల్, ఎస్పీఎఫ్), ఫైర్ ఫైటర్, జైలు వార్డర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు రూ. 600, ఇతరులు రూ.1,200 ఫీజు చెల్లించాలి. ⇒ డ్రైవర్ పోస్టుకు పోటీపడే అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.1,200 ఫీజు చెల్లించాలి. ⇒ పోలీస్‌శాఖలో మెకానిక్ పోస్టులకు పోటీపడే అభ్యర్థుల్లో ఎస్పీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.1,200 ఫీజు చెల్లించాలి. -
TSLPRB పోలీసు నోటిఫికేషన్.. దరఖాస్తు తేదీలు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో TSLPRB 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఆ పరీక్షల దరఖాస్తు తేదీలను ప్రకటించింది. ఈ నెల (ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9) వరకూ దరఖాస్తులకు గడువుగా ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉండనున్నట్లు పేర్కొంది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించి 4 నోటిఫికేషన్లు ఇచ్చింది.TSLPRB నోటిఫికేషన్ వివరాలువిభాగాలవారీగా ఖాళీల వివరాలుపోలీస్ శాఖ (Police Department)• పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 • పోలీస్ కానిస్టేబుల్ (AR): 1,052 • సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్): 148 • అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (FPB): 23 • రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (AR): 14 • రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (TGSP): 12 • పోలీస్ కానిస్టేబుల్ (SARCPL): 24 • పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్ - PTO): 20 • రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (SARCPL): 3 • పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్ - PTO): 7స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)• కానిస్టేబుల్: 1,380• సబ్ ఇన్స్పెక్టర్: 44అగ్నిమాపక, విపత్తు నిర్వహణ & సివిల్ డిఫెన్స్ శాఖ• ఫైర్ ఫైటర్: 751• స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 394. జైళ్లు & సరిదిద్దే సేవల శాఖ (Prisons & Correctional Services)• వార్డర్ (పురుషులు): 196• డిప్యూటీ జైలర్ (పురుషులు): 14• వార్డర్ (మహిళలు): 12• డిప్యూటీ జైలర్ (మహిళలు): 1ముఖ్యమైన సమాచారం & దరఖాస్తు విధానం• అధికారిక వెబ్సైట్: అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tgprb.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.• వైద్య పరీక్షల సూచన: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందే, తమ శారీరక, వైద్య ప్రమాణాలు (Physical and Medical Standards) సరిగ్గా సరిపోతున్నాయో లేదో సివిల్ సర్జన్ తో పరీక్షించుకోవాలని బోర్డు సూచించింది.సిద్ధంగా ఉంచుకోవాల్సిన ధ్రువపత్రాలు:ఆన్లైన్ దరఖాస్తు సమయంలో, నియామక ప్రక్రియలో భాగంగా క్రింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది:• ఎస్సీ కుల ధ్రువపత్రం: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్-I, ఎస్సీ గ్రూప్-II, ఎస్సీ గ్రూప్-III సబ్-క్లాసిఫికేషన్‌తో కూడిన లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.• ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికేట్: తెలంగాణ ప్రభుత్వంచే ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ చేయబడిన EWS సర్టిఫికేట్.• నాన్-క్రీమీలేయర్ సర్టిఫికేట్: బీసీ అభ్యర్థుల కోసం ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ చేసిన సర్టిఫికేట్.• స్థానికత ధ్రువపత్రాలు: 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు బోనఫైడ్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్లు.• ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాలు (వర్తించే అభ్యర్థులకు). -
డబ్బు కోసం పామర్రు పోలీసులు వేధిస్తున్నారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: హత్య కేసులో సాక్షినైన తనను డబ్బు కోసం పోలీసులు వేధిస్తున్నాడంటూ ఓ వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేయడం పోలీసు శాఖలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా పామర్రు సీఐ, ఎస్సై తనను లక్షా యాభై వేల రూపాయలు లంచం ఇవ్వాలని, లేదంటే ఒక హత్య కేసులో ఇరికిస్తామంటూ వేధిస్తున్నారని కొలుసు అయ్యప్ప శుక్రవారం మీడియా ఎదుట వాపోయాడు. కొలుసు అయ్యప్ప తన అత్తను మామ కొట్టి చంపిన కేసులో సాక్షిగా ఉన్నాడు. డబ్బు కోసం తనను సీఐ కొట్టాడని, కానిస్టేబుల్‌ను పలుమార్లు ఇంటికి, పనిచేసే చోటకి పంపించి వేధిస్తున్నారని తెలిపాడు. తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని, లేదంటే లక్షన్నర రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ సీఐ, ఎస్ఐ తనను వేధిస్తున్నారని ఆరోపించాడు. ఈ విషయంపై తాను సీఐ, ఎస్ఐతో మాట్లాడిన ఆడియో రికార్డులను కృష్ణా జిల్లా ఎస్పీకి అందచేసి ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల వేధింపులపై కోర్టును ఆశ్రయించానని చెప్పాడు. పోలీసులు లంచం డిమాండ్ చేసిన ఆడియో రికార్డులను అయ్యప్ప తరపు న్యాయవాది కోర్డుకు సమర్పించాడు. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణలో అయ్యప్ప దొంగతనం చేశాడని పోలీసులు ఆరోపించారు. అయితే మూడు నెలలు అయినా ఇప్పటివరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను న్యాయమూర్తి నిలదీసినట్లు సమాచారం. -
టియర్ గ్యాస్ అంటే ఏమిటి?
పోలీసులు గుంపులను చెదరగొట్టడానికి వాడే ‘టియర్ గ్యాస్’ నిజానికి గ్యాస్ కాదు. అది ఒక రకమైన రసాయన పొడి. దీనిని చిన్న చిన్న గ్రెనేడ్లు లేదా షెల్స్ రూపంలో గాల్లోకి కాలుస్తారు. అలా కాల్చినప్పుడు అది గాల్లో కలిసిపోయి దట్టమైన పొగలాగా మారుతుంది. ఇందులో ఎక్కువగా ’సీఎస్’ అనే కెమికల్‌ను ఉపయోగిస్తారు. ఈ పొగ మన ముఖానికి తగలగానే, అందులోని రసాయనాలు మన కళ్లు, ముక్కు, నోరు, ఊపిరితిత్తులలో ఉండే తేమ తో చర్య జరుపుతాయి. ముఖ్యంగా మన కళ్లల్లో ఉండే నరాలను ఇది తీవ్రంగా ఉత్తేజపరుస్తుంది. దాంతో కళ్లు విపరీతంగా మంటలు పుట్టి, ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఆ మంట నుంచి కళ్లను కాపాడుకోవడానికి మన మెదడు వెంటనే స్పందించి, కళ్లల్లోంచి కన్నీళ్లను వరదలా పారేలా చేస్తుంది. అందుకే దీనికి ‘బాష్పవాయువు’ అని పేరు వచ్చింది. దీనివల్ల కళ్లు తాత్కాలికం గా మూతపడతాయి, ముక్కు కారుతుంది, విపరీతంగా దగ్గు వస్తుంది. అయితే ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. ఆ పొగ నుంచి దూరంగా జరిగి, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ, కళ్లను మంచి చల్లటి నీటితో కడుక్కుంటే ఓ 15 నుంచి 20 నిమిషాల్లో దీని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. శాంతిభద్రతలను కాపాడటానికి, ఎవరికీ పెద్దగా గాయాలు అవ్వకుండా గుంపులను కంట్రోల్ చేయడానికి పోలీసులు వాడే ఒక సైన్స్ ట్రిక్ ఇది! -
మేం మీలా కాదు.. అంగళ్లు ఘటన మరిచిపోయారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధిస్తోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. పోలీసులు ఏర్పాటు చేస్తున్న నిబంధనలు భద్రతా చర్యల పేరుతో రాజకీయ నిర్బంధంగా మారుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.జగన్ శ్రీకాకుళం పర్యటనకు సంబంధించి కాన్వాయ్‌ను పరిమితం చేయడం, రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయడం, నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడం.. రాజకీయ నిర్బంధం కిందకే వస్తుందని, అది ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమేనని వైఎస్సార్సీపీ అంటోంది. "జగన్ ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది" అని పార్టీ నేతలు చెబుతున్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని, ఆ జనాదరణ చూసే ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ఇటు.. సీదిరి అప్పలరాజు వ్యవహారంలో కూడా ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ అంటోంది. అలాగే ఒక ప్రజా ప్రతినిధితో ములాఖత్ కోసం వెళ్లే కార్యక్రమాన్ని కూడా రాజకీయ అంశంగా మార్చి ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొంది. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కార్యక్రమాలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగాయని, ఎక్కడా హింసాత్మక ఘటనలకు తమ పార్టీ కారణం కాలేదని నేతలు స్పష్టం చేశారు.అదే సమయంలో అధికార పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ వైఎస్సార్సీపీ విమర్శలు గుప్పించింది. అంగళ్లు తరహా ఘటనల్లో పోలీసులపై దాడులు, వాహనాల ధ్వంసం వంటి ఘటనలు జరిగాయని గుర్తు చేసింది. తమ కార్యక్రమాలపై మాత్రమే ఆంక్షలు విధించడం వివక్షపూరిత వైఖరి అని ఆరోపించింది. "ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పటికీ.. అధికార యంత్రాంగం అనవసర ఆంక్షలతో వ్యవహరిస్తోంది. ప్రజల మధ్యకు వెళ్లే హక్కును ఎవరూ అడ్డుకోలేరు" అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు.చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా.. అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో రాజకీయ ఘర్షణలు చోటుచేసుకుని రాళ్ల దాడులు జరిగాయి. టీడీపీ శ్రేణులు జరిపిన దాడుల్లో.. పలువురు పోలీసులు గాయపడగా, ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్ ఒక కన్ను చూపు శాశ్వతంగా కోల్పోయారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై అప్పట్లో కేసు కూడా నమోదు అయ్యింది. -
రోడ్డెక్కిన పోలీసులు.. జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఆంక్షలు...
-
TSLPRB Recruitment 2026: తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి TSLPRB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించి 4 నోటిఫికేషన్లు ఇచ్చింది.విభాగాలవారీగా ఖాళీల వివరాలుపోలీస్ శాఖ (Police Department)• పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 • పోలీస్ కానిస్టేబుల్ (AR): 1,052 • సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్): 148 • అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (FPB): 23 • రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (AR): 14 • రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (TGSP): 12 • పోలీస్ కానిస్టేబుల్ (SARCPL): 24 • పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్ - PTO): 20 • రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (SARCPL): 3 • పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్ - PTO): 7 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)• కానిస్టేబుల్: 1,380• సబ్ ఇన్స్పెక్టర్: 44అగ్నిమాపక, విపత్తు నిర్వహణ & సివిల్ డిఫెన్స్ శాఖ• ఫైర్ ఫైటర్: 751• స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 394. జైళ్లు & సరిదిద్దే సేవల శాఖ (Prisons & Correctional Services)• వార్డర్ (పురుషులు): 196• డిప్యూటీ జైలర్ (పురుషులు): 14• వార్డర్ (మహిళలు): 12• డిప్యూటీ జైలర్ (మహిళలు): 1ముఖ్యమైన సమాచారం & దరఖాస్తు విధానం• ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించే ఖచ్చితమైన తేదీలను త్వరలో మరో ప్రకటన ద్వారా వెల్లడించనున్నారు.• అధికారిక వెబ్సైట్: అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tgprb.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.• వైద్య పరీక్షల సూచన: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందే, తమ శారీరక, వైద్య ప్రమాణాలు (Physical and Medical Standards) సరిగ్గా సరిపోతున్నాయో లేదో సివిల్ సర్జన్ తో పరీక్షించుకోవాలని బోర్డు సూచించింది.సిద్ధంగా ఉంచుకోవాల్సిన ధ్రువపత్రాలు:ఆన్లైన్ దరఖాస్తు సమయంలో, నియామక ప్రక్రియలో భాగంగా క్రింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది:• ఎస్సీ కుల ధ్రువపత్రం: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్-I, ఎస్సీ గ్రూప్-II, ఎస్సీ గ్రూప్-III సబ్-క్లాసిఫికేషన్‌తో కూడిన లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.• ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికేట్: తెలంగాణ ప్రభుత్వంచే ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ చేయబడిన EWS సర్టిఫికేట్.• నాన్-క్రీమీలేయర్ సర్టిఫికేట్: బీసీ అభ్యర్థుల కోసం ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ చేసిన సర్టిఫికేట్.• స్థానికత ధ్రువపత్రాలు: 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు బోనఫైడ్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్లు.• ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాలు (వర్తించే అభ్యర్థులకు). -
1971 నాటి కేసు మళ్లీ తెరపైకి.. పోలీసుల వేట!
మార్కాపురం: 1971లో నమోదైన ఓ కేసుకు సంబంధించి 55 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని అరెస్టు చేసేందుకు మహారాష్ట్ర పోలీసులు మంగళవారం మార్కాపురం చేరుకోవడం ఆసక్తి రేకెత్తించింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హద్గావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 55 ఏళ్ల క్రితం నేరం చేసిన రామయ్య కుమారుడు నారాయణ మార్కాపురంలో ఉంటున్నాడన్న సమాచారంతో హెడ్‌కానిస్టేబుల్ యువరాజ్ కీర్తిపాల్ రాథోడ్ ఇక్కడికి వచ్చారు. స్థానిక పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు నెల రోజుల్లోపు హద్గావ్లోని జేఎంఎఫ్‌సీ కోర్టు2 న్యాయమూర్తి ఎస్.ఎస్.లోహకరే జాదవ్ ఎదుట లొంగిపోవాలని జారీ చేసిన నోటీసులను ఆయన వెంట తీసుకొచ్చారు. కాగా, కేసు నమోదైన 1971 నాటికి మార్కాపురం కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉండటం గమనార్హం. నిందితుడి ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


