మున్సిపల్‌ కార్మికులపై విరిగిన లాఠీ | Police lathi charge on municipal workers | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కార్మికులపై విరిగిన లాఠీ

Dec 19 2025 4:34 AM | Updated on Dec 19 2025 4:34 AM

Police lathi charge on municipal workers

మహిళలపైనా విరుచుకుపడిన పోలీసులు

స్త్రీలను తాకరాని చోట తాకిన ఖాకీలు

నెల్లూరులో దారుణం

నెల్లూరు (బారకాసు): సమస్యల పరిష్కారం కోరు­తూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాల­యం ఎ­దుట ధర్నా చేపట్టేందుకు వెళ్తున్న మున్సి­పల్‌ కార్మి­కులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. మహి­ళలని కూడా చూడకుండా తోసేశారు. దీంతో తోపు­లాట చోటుచేసుకుంది. కిందపడి­పోయిన కొంద­రు.. లాఠీచార్జ్‌లో మరికొందరు గాయపడ్డారు. క్షత­గా­త్రుల్లో కొందర్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వ­జన ఆస్పత్రికి తరలించారు. 

సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు 45 రోజులు­గా సమ్మె చేస్తు­న్నా పాలకు­లు, అధికారులు పట్టించుకో­లేదు. దీంతో వారంతా గురువారం నగరపా­లక సంస్థ కార్యాలయం ముట్ట­డించేందుకు కార్యా­ల­య సమీపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చేందుకు యత్నించారు. మరోవైపు మే­యర్‌ స్రవంతి రాజీనామా ఆమోదం కోసం కౌన్సిల్‌ అత్యవసర సమావేశం జరుగుతోంది. 

తమ సమ­స్యలపై వినతిపత్రాన్ని అధికారులకు అందజే­యాలనే ఉద్దేశంతో కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు కార్మికుల్ని అడ్డుకు­న్నారు. దీంతో తోపులాట జరిగింది. పోలీసు­లు ఒక్కసారి­గా లాఠీలు ఝుళిపించడంతో కార్మికులు కిందపడి­పోయారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు తాకరాని చోట తాకుతూ గందరగోళం సృష్టించారు. కార్మికులను ఇష్టానుసారం లాఠీల­తో కొట్టారు. సీఐటీ­యూ నేతలు, కార్యకర్త­లతో­పాటు అనేకమంది మహిళా కార్మికు­లకు గాయాల­య్యాయి. 

రక్తగాయా­లైన మహి­ళల్ని ప్రభుత్వాస్ప­త్రికి తరలించారు. అనంతరం 63 మంది కార్మికు­లు, యూనియన్‌ నేతలను అరెస్ట్‌ చేసి పోలీస్‌ వ్యాన్లలో ఎక్కించి ముత్తుకూరు పోలీస్‌­స్టేషన్‌కు తరలించారు. కౌన్సిల్‌ సమావేశం ముగి­సిన అనంతరం రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, కమిషనర్‌ నందన్, ఇన్‌చార్జి మేయర్‌ రూప్‌కుమార్‌­యాదవ్‌ వచ్చి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడు­తామని చెప్పగా కార్మికులు అంగీకరించలేదు. మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వం డౌన్‌ డౌన్‌ అంటూ పెద్దపెట్టున నినాదా­లు చేశారు. చివరికి అరెస్ట్‌ చేసిన వారిని తీసుకొచ్చి కార్పొ­రేషన్‌ కార్యాల­యం వద్ద విడిచి పెట్టడంతో నిరసనను తాత్కాలికంగా విరమించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement