breaking news
protest
-
‘అవును భాయ్.. నేను సాహెబ్ కాదు.. నేతాజీనే’
రాంచీ: జార్ఖండ్‌లోని మధ్యతరగతి కుటుంబాల పిల్లల కలల్లో ప్రభుత్వ ఉద్యోగం ప్రధాన లక్ష్యం. జేపీఎస్సీ , జేఎస్సీఎస్సీ వంటి నియామక పరీక్షల్లో విజయం సాధించి అధికారి కావాలని వేలాది మంది యువత కష్టపడుతున్నారు. అయితే ప్రశ్నాపత్రాల లీకులు, అక్రమాలు, పరీక్షల రద్దు, నియామకాలలో జాప్యం వంటి ఆరోపణలు వారి కలలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలాంటి వారిలో పాకూర్ జిల్లా ఇల్మీ గ్రామానికి చెందిన షహ్బాజ్ హుస్సేన్ ఒకరు. చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడైన షహ్బాజ్ పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. అనంతరం ఎంఎస్సీ, ఎంఎడ్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయంలో రెండో ర్యాంకు సాధించాడు. అధికారి కావాలనే లక్ష్యంతో రాంచీకి వెళ్లి చిన్న లాడ్జిలో ఉంటూ జేపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. కానీ నియామక పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు, ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దు వంటి పరిణామాలు తన జీవితాన్ని మార్చేశాయని షహ్బాజ్ చెబుతున్నాడు.నియామకాల్లో పారదర్శకత కోసం జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న షహ్బాద్ తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు అందరూ తనను ‘సాహెబ్’ అని కాకుండా ‘నేతాజీ వచ్చారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని వాపోతున్నారు. అయినప్పటికీ నిజం కోసం గొంతెత్తడంలో తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. నిజం మాట్లాడితే నాయకుడని అంటారంటే..‘అవును భాయ్ నేను నేతాజీనే’ అని షహ్బాజ్ వ్యాఖ్యానించారు.ఆర్థిక, మానసిక ఒత్తిడిరాంచీలోని లాడ్జీల్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అద్దె, భోజనం, పుస్తకాలు, ఇతర ఖర్చులను భరించడం కష్టంగా మారిందని షహ్బాజ్ తెలిపారు. గ్రామానికి వెళ్లిన ప్రతిసారీ ఇంకెంతకాలం? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని, వాటికి సమాధానం చెప్పడం బాధాకరంగా ఉంటుందని అన్నారు. అనిశ్చితి, ఒత్తిడి కారణంగా తనతో పాటు సిద్ధమవుతున్న పలువురు స్నేహితులు చదువును మధ్యలోనే వదిలి గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తానూ అన్నీ వదిలేసి ఇంటికి వెళ్లిపోవాలనిపించినా, తల్లిదండ్రుల నమ్మకం, చిన్ననాటి కలలు గుర్తుకొచ్చి మళ్లీ ముందుకు సాగుతున్నానని చెప్పారు.పారదర్శక నియామకాలకే డిమాండ్తాము వీధుల్లోకి రావడం అల్లర్లు సృష్టించడానికి కాదని, కష్టపడి చదివిన అభ్యర్థులకు న్యాయం జరగాలని మాత్రమే కోరుతున్నామని షహ్బాజ్ అన్నారు.నియామక పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు సకాలంలో న్యాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అక్రమాలపై విచారణ విశ్వసనీయంగా జరగాలని, వాస్తవాలు వెలుగులోకి రావాలని విద్యార్థులు ఆశిస్తున్నారని షహ్బాజ్ తెలిపారు. -
YSRCP శిబిరాన్ని తొలగించిన కూటమి
-
"జవాబ్ దేవో అమిత్‌షా" వర్షంలో ఎంపీల నిరసన
సాక్షి,ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో విద్యార్థులపై జరిగిన దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విపక్ష ఎంపీలు పార్లమెంటు ఎదుట ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. అమిత్‌షా కనపడడం లేదని పార్లమెంటు సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని ఎంపీలు ప్రశ్నించారు. "అమిత్ షా జవాబ్ దేవ్" అని ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. అయితే ఎంపీల నిరసన సమయంలో భారీగా వర్షం పడుతున్నా వెనక్కి తగ్గలేదు. వానకు తడుస్తూనే నిరసన చేపట్టారు.కాగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరుకాకపోవడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. జూలై 20న ఢిల్లీలో 'నీట్ యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లను ఉపయోగించాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హోంశాఖ పరిధిలోని పోలీసుల చర్యలపై అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నాయి.అయితే అమిత్ షా పార్లమెంట్‌కు దూరంగా లేరని, ఆయన రోజంతా పార్లమెంట్ హౌస్‌లోని తన ఛాంబర్ లోనే ఉంటూ అధికారిక విధులు నిర్వహిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గందరగోళమే కారణమని ప్రతిపక్షాలు నిరంతర నిరసనలతో సభను సజావుగా సాగనివ్వడం లేదని, సభను నడవనిస్తే అమిత్ షా వచ్చి ఖచ్చితంగా సమాధానం ఇస్తారని తెలిపారు. -
యువత ఆందోళనలో న్యాయం ఉంది
ముంబై: ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక చట్టబద్ధమైన సంభాషణ రూపమని, దాని లక్ష్యం విభేదాలు సృష్టించడం కాకుండా ఏకాభిప్రాయం సాధించడం కావాలని ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ చెప్పారు. భారతదేశ విద్యా వ్యవస్థపై యువతరంలో వ్యక్తమవుతున్న ఆందోళనలు ముమ్మాటికీ వాస్తవమైనవేనని పేర్కొన్నారు. వారి ఆందోళనలో న్యాయం ఉందన్నారు. విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో 6 శాతానికి పెంచాలని స్పష్టంచేశారు. విద్య అనేది వ్యాపారం కాదని, అది అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించాలని తెలిపారు. విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో సమాజం కూడా తనవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ముంబైలో ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్(ఐఐఎంయూన్)15వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 2,000 మంది జెన్–జెడ్, జెన్–ఆల్ఫా సభ్యులు పాల్గొన్నారు. వారితో మోహన్ భాగవత్ సంభాíÙంచారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన అనేది ఏకాభిప్రాయాన్ని సాధించే ఒక చక్కటి మార్గమని వివరించారు. విభిన్న అభిప్రాయాలు ఏకమై, చర్చల అనంతరం ఏకాభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం లెక్కచేయకపోతే వారు ఆందోళనకు దిగవచ్చని అన్నారు. నేడు జెన్ జెడ్ తరం చేస్తున్న ఫిర్యాదులు నిజమైనవని, వారి నిజాయితీని విశ్వసిస్తున్నానని అన్నారు.చర్చలే మొదటి అడుగు..ప్రజలు ఆందోళనకు దిగినప్పుడు చర్చలు ఎల్లప్పుడూ మొదటి అడుగుగా ఉండాలని మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ చర్చలు ఫలించకపోతే ఏం చేయాలనేది త ర్వాత ఆలోచించవచ్చని సూచించారు. పెద్దలు చెప్పినదాన్ని ప్రశ్నించకుండా అంగీకరించే మునుపటి తరాలకు భిన్నంగా నేటి జెన్ జెడ్ యువత తమ ప్రశ్నలకు గౌరవంతోపాటు తార్కిక సమాధానాలను కోరుకుంటోందని గుర్తుచేశారు. పాకిస్తాన్, చైనా వంటి దేశాలతో ఘర్షణలు జరిగినప్పుడు పౌరులు మన ప్రభుత్వానికి, సాయుధ దళాలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు. అయితే, అటు వంటి పరిస్థితులు ప్రజల మధ్య సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీయకూడదని వెల్లడించారు. చట్టాలు సమాజాన్ని శాసించవు స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్ల సమస్యలు, స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై ఆర్ఎస్ఎస్ అధినేత స్పందించారు. ఆ వర్గానికి చెందిన ప్రజలు భారతీయ సమాజంలో అంతర్భాగమని, వారిని ఆదరించే సంప్రదాయం ఎప్పటినుంచో ఉందని చెప్పారు. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి ఒక వెసులుబాటు మాత్రమే కాదన్నారు. కుటుంబం అంటే సమాజంలో ఒక యూనిట్ అని తెలిపారు. కొత్త వ్యవస్థను సృష్టించకుండా ఇప్పుడున్న వ్యవస్థనే భంగపరిస్తే అది సంఘర్షణకు దారితీయవచ్చని హెచ్చరించారు. చట్టాలు ప్రజలను నిర్దేశించేవిగా కాకుండా సామాజిక ఆమోదాన్ని అనుసరించేవిగా ఉండాలని అన్నారు.స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి సోషల్ మీడియాను నిషేధించడం దాని దుష్ప్రభావాలకు పరిష్కారం కాదని, సమాజం స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలని, ఆన్లైన్లో దేనినైనా నమ్మే ముందు ప్రామాణిక మూలాల నుంచి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలని భాగవత్ సూచించారు. ప్రజల వైఖరి మారకపోతే నియమ నిబంధనలు పని చేయవని అన్నారు. నియమాలు, క్రమశిక్షణ అవసరమే గానీ ప్రజల దృక్పథాలు మారినప్పుడే అవి సఫలమవుతాయని చెప్పారు. ప్రజల ఆలోచనా విధానాన్ని మా ర్చడమే ముఖ్యం అని తేల్చిచెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం దురి్వనియోగం అవు తుండడంపై ఆందోళన వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలోని సమాచారాన్ని ధ్రువీకరించుకోకుండా నమ్మకూడదని హితవు పలికారు. -
డీఎస్సీ అక్రమాలపై పోరాటం కొనసాగింపు
సాక్షి,అమరావతి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, వాటికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. దీనిలో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్ర, శనివారాల్లో (7, 8 తేదీల్లో) అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులకు కేంద్ర కార్యాలయం పిలుపునిచి్చంది. అలాగే ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటు ప్రజలు ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది. ఈ నెల 10న నిర్వహించే ర్యాలీలు ముగిసిన అనంతరం ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేలా మలిదశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. -
జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయ వేదిక?!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిరసనల వేదికగా పేరొందిన జంతర్ మంతర్‌పై సుప్రీం కోర్టు కీలక విచారణ చేపట్టింది. జంతర్ మంతర్ స్థానంలో నిరసనలకు మరో ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన ధర్మాసనం.. సోమవారం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.జంతర్ మంతర్ వద్ద తరచూ జరిగే ధర్నాలు, ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీలో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని పిటిషనర్ సతీశ్ చంద్ర కౌశిక్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిత్యావసర వస్తువులు, వైద్య అవసరాల సరఫరాపైనా ప్రభావం పడుతోందని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ పిటిషన్‌ను ఇవాళ పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇందులో ప్రజల రాకపోకలు, ప్రాంతంలో అందుబాటు వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ అంశంపై కేంద్రం నుంచి వివరాలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.జంతర్ మంతర్ ఇకపై నిరసనలకు అనువైన ప్రదేశం కాదని, ట్రాఫిక్ సమస్యలు, స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. ముఖ్యంగా వైద్య సేవలకు సంబంధించిన సరఫరాలు, అత్యవసర రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఇటీవలి కొన్ని రాజకీయ నిరసనలను ప్రస్తావించినప్పటికీ.. ప్రతిపాదిత కార్యక్రమాలపై వ్యాఖ్యానించేందుకు ధర్మాసనం నిరాకరించింది. చట్ట ప్రకారం అధికారులు పరిస్థితులను నిర్వహిస్తారని పేర్కొంది.ప్రజాస్వామ్యంలో నిరసనలకు హక్కు ఉన్నప్పటికీ.. అదే సమయంలో సాధారణ ప్రజల రాకపోకలు, అత్యవసర సేవలకు ఇబ్బంది కలగకుండా సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని ఈ పిటిషన్ తెరపైకి తెచ్చింది. ఇప్పుడు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చే సమాధానంపై తదుపరి పరిణామాలు ఆధారపడనున్నాయి. -
దళితులపై దాడులకు నిరసనగా వైఎస్సార్సీపీ ధర్నా
సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. దళితులపై దాడులుకు నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. పీఎస్ ఎదుట భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ నేతలు బైఠాయించారు. అవిలాల మాజీ సర్పంచ్‌పై దాడి చేసిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని భూమన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీకి దళిత సంఘాలు మద్దతు తెలిపాయి.తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 145లో ఉన్న మఠం భూములను కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. పంచాయతీవాసుల దాహార్తిని తీర్చేందుకు గతంలో ఏర్పాటుచేసుకున్న బోరునూ ఆక్రమించారు. నీటి సరఫరా నిలిపివేయడంతో అవిలాల మాజీ సర్పంచ్ వెంకటరమణతో పాటు దళితవాడ వాసులు, అంబేడ్కరిస్టులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు.అయినా ఆక్రమణదారులు పనులు ఆపకపోవడంతో శనివారం అంబేడ్కర్ ఫొటోతో కూడిన బ్యానర్‌ను ముద్రించుకుని బోరు వద్దకు దళితవాడ వాసులు చేరుకుని భూ ఆక్రమణదారుల నుంచి పంచాయతీ బోరును కాపాడాలని నినదించారు. అదే సమయానికి భూ ఆక్రమణకు పాల్పడిన వారంతా అక్కడకు చేరుకుని దళితులపై రెచ్చిపోయారు. బూతు పంచాంగం లంకించుకున్నారు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అంబేడ్కర్ చిత్రపటంతో కూడిన బ్యానర్‌ను చింపేసి పరుష పదజాలంతో దళిత జాతిని అవమానించేలా తిడుతూ దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ప్రాణ భయంతో కేకలు పెడుతూ మహిళలు పరుగులు తీయగా వెంటాడి కొట్టారు. ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగినా వారు కిమ్మనలేదు. చోద్యం చూస్తుండిపోయారు.టీడీపీ గూండాల దాడిలో గాయపడిన అవిలాల పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటరమణ, కౌసల్య, విజయ నిర్మల, ప్రసాద్, యాదగిరిలను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి పరామర్శించారు. దళితులపై దాడి హేయమైన చర్యలని మండిపడ్డారు. -
ఏపీలో దగా డీఎస్సీపై దండయాత్ర... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు విజయవంతం
-
దగా డీఎస్సీపై దండయాత్ర
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, అన్యాయానికి గురైన అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు ప్రారంభించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు కలెక్టరేట్లకు తరలివెళ్లి నిరసన వ్యక్తంచేశారు. అనంతరం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలకు వినతిపత్రాలు అందజేశారు. డీఎస్సీ నియామకాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, అడ్డగోలుగా స్పోర్ట్స్ కోటా నియామకాలు, నిబంధనల మార్పు, జీవోల మార్పులతో సహా వైఎస్సార్సీపీ నాయకులు, బాధిత అభ్యర్థులు ఆధారాలతో సహా వెల్లడిస్తున్న అక్రమాలపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీతోపాటు విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను కూడా వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమంలో భాగంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆగస్టు 3, 4 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో టౌన్‌హాల్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. -
మోదీపై అభ్యంతకర పోస్టులు.. మెటా హెడ్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలలో ప్రధాని మోదీకి అభ్యంకతరంగా పోస్టులు చేశారంటూ మోటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఇద్దరు బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీకి సంబంధించినటువంటి అభ్యంతరకరమైన, తప్పుడు కంటెంట్‌ను తమ ఫ్లాట్పారమ్లపై (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రసారం కావడానికి అనుమతించారని,అటువంటి పోస్టులను తొలగించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రిని అసభ్యకరంగా, అవమానకరంగా మరియు తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ చేయబడిన, డిజిటల్‌గా తారుమారు చేయబడిన అనేక వీడియోలు ,చిత్రాలు అందులో కనిపించాయని తెలిపారు.కాగా నీట్లీకేజ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. దీంతో మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని డిమాండ్లను సైతం కేంద్రం ముందుంచింది. -
ఎవరీ మిరాండా గిబ్సన్? ఏకంగా 449 రోజులు..
ఒంటరిగా నిరసన చేయడానికి ఎంతో గుండె నిబ్బరం కావాలి. అది ప్రజల మనసును కదిలించి..అందుకు అందరూ చేయి చేయి కలిపి ముందు వచ్చేలా చేయగలగాలి. సమస్య పరిష్కారం దిశగా నడిపించగలగాలి. అందుకు నిరసనలో ప్రత్యేకత తప్పనిసరి. ముఖ్యంగా యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసేలా ప్రేరేపించాలి. అచ్చం అలాంటి నిరసననే చేపట్టి మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. పైగా ఆ సమస్యపై ప్రతి పౌరుడు బాధ్యత వహించేలా చేసి ప్రభుత్వాన్నే చైతన్యపరిచింది.ఆ అమ్మాయే మిరాండా గిబ్సన్. ఆమె ఏమి మొదటి నుంచి పర్యావరణ కర్త కాదు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఇప్స్విచ్లో పెరిగిన ఆమెకు అడవులు గురించి అంతగా తెలియదు, వాటితో పరిచయం కూడా లేదు. సరిగ్గా టీనేజ్ వయసులో విశ్వవిద్యాలయ చదువుల సమయంలో అటవీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంది. టాస్మానియా అడవులు ఎలా అంతరించిపోతున్నాయో తెలుసుకుంది. అలా ఆ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాల గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆ అడవులు ఉండే రాష్ట్రాన్ని సందర్శించి ఆ సమస్యను కళ్లారా చూసి.. చలించిపోయింది. అక్కడ అప్పర్ ఫ్లోరెంటైన్ లోయకు ఒక పర్యటనలో అప్పటికే మొద్దుగా మారిపోయిన ఒక భారీ చెట్టు ఆమెకు ఎదురైంది. ఆ దృశ్యం రానున్న రోజుల్లో ఎంతటి నష్టాన్ని దారితీయనున్నదో తెలియజేసిందామెకు. దాంతో సెలవుల్లో నిరసనలలో చేరేందుకు టాస్మానియాకు తిరిగి రావడం ప్రారంభించింది. ఆ తర్వాత ప్రచార కార్యకర్తలతో పనిచేయడం మొదలుపెట్టడమే కాకుండా అక్కడే స్థిరపడింది. అలా ఆమె అప్పర్ ఫ్లోరెంటైన్ లోయ దిగ్బంధంలో సంవత్సరాలు గడిపింది. కానీ అడువులు కనుమరుగవుతూ ఉండటాన్ని సాంప్రదాయ నిరసనలు తగినంత ప్రభావాన్ని చూపించడం లేదని గుర్తించింది. టాస్మానియా అడవులను దాటి ఈ విధ్వంసాన్ని ప్రపంచానికి కనిపించేలా చేయడానికి ఒక మార్గం కోసం వెతికి మరి.. 'ట్రీ సిట్ నిరసన'ను ఎంచుకుందామె. అదీగాక కలప నరికివేత ఉన్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉందని తెలుసుకుందామె. ఆ కనెక్షన్ ద్వారా, ఆమె అడవిలోని చిత్రాలను నేరుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రసారం చేయగలిగితే తన పని సులువవుతుందని అనుకుంది. అలా గిబ్సన్ డిసెంబర్ 14, 2011న అడవిలోని ఒక చెట్టుని ఎంచుకుని, దానిపై సుమారు 60 కిలోమీటర్ల ఎత్తులో ఒక చిన్న వేదికపై కూర్చొని నిరసన ప్రారంభించింది. అంతేగాదు అడవికి రక్షణ లభించేంత వరకు 'ట్రీ సిట్' నిరసన కొనసాగిస్తానని ప్రకటించింది. ఆమె చెట్టుపై ఏర్పాటు చేసుకున్న ఆవాసం చాలా సాధారణమైనది. కేవలం 1.5 మీటర్ల వెడల్పుతో పరిమిత స్థలాన్ని మాత్రమే అందించింది. అలా ఆమె ఏకంగా 449 రోజులు ఒంటరిగా ఆ చెట్టుపైనే గడిపింది. టాస్మానియా అనూహ్య వాతావరణం మార్పులన్నింటిని తట్టుకుంది. తాజా సమాచారాన్ని పంచుకునేందుకు సౌరశక్తితో నడిచే కంప్యూటర్ని వినియోగించింది. చురుకుగా ఉండటానికి ఒక చిన్న వాకింగ్ మెషీన్, యోగ సాధన వంటి దినచర్యతో ఒంటరిగా ఆ చెట్టుపైనే నిరసన చేసింది. ఈ నిరసన ఫలితంగా ఆమె కనీస అవసరాలను తీర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఆ చెట్టుపైనే ఉంటూ.. పచ్చి ఆహారమే తింటూ నిరసన కొనసాగించింది. ముఖ్యంగా ఒంటరితనం, నిత్యావసరాలను సర్దుకుని మరి కొనసాగించక తప్పని స్థితి అయినా అధైర్యపడలేదు. అనుకున్నట్లుగానే నెలలు గడిచేకొద్దీ, గిబ్సన్ చెట్టుపై కూర్చోవడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు ప్రజల నుంచి అమితమైన స్పందన మద్దతు లభించాయి. అలా 2013 ప్రారంభంలో టాస్మానియా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడమే గాక అడవుల విస్తరణకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే అదంతా అధికారికంగా గుర్తింపు లభించేంత వరకు ఆ చెట్టుపైనే ఉండి నిరసన చేద్దాం అనుకుంటే ప్రకృతి కార్చిచ్చు రూపంలో వ్యతిరేకించడంతో నిరసనను విరమించక తప్పలేదు గిబ్సన్కి. ఎలాగైతేనేం ఆమె పోరాటం ఫలించింది. గిబ్సన్ గడిపిన చెట్టుతో సహా అటవీ ప్రాంతాలకు అదనపు రక్షణను ప్రపంచ వారసత్వ కమిటీ ఆమోదించింది. గిబ్సన్ 449 రోజులు గడిపిన ఆ నివాస చెట్టుకి అధికారిక గుర్తింపు లభించింది. అయితే గిబ్సన్ ఆ తర్వాత పూర్తికాల కార్యకర్తగా తన వృత్తిని విడిచిపెట్టి, మెల్బోర్న్లో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ప్రారంభించింది. టాస్మానియా అడవులపై జరుగుతున్న విస్తృత పోరాటంలో ఆ చెట్టుపై ఆమె గడిపిన సమయం ఒక కీలక అధ్యాయంగా నిలిచింది.(చదవండి: సీతగా అలరించనున్న సాయిపల్లవి జపమాల ఎందుకు ధరిస్తుందంటే..!) -
నారా లోకేష్ కు బిగ్ షాక్.. ప్లాన్ రెడీ చేసిన DSC అభ్యర్థులు
-
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ కుంభకోణంపై జెన్‌జీ వార్...
-
పొగాకు ధర లేక.. రైతన్నల పోరుబాట
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు పోరు బాటపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన గళం విప్పారు. ఒంగోలు నగరంలోని త్రోవగుంట వద్ద 16వ జాతీయ రహదారిని, టంగుటూరు మండలం టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిని బుధవారం దిగ్బంధించారు. హైవేపై బైఠాయించి టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీంతో దాదాపు గంటకు పైగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీఎం చంద్రబాబు పొగాకు సీ–గ్రేడ్‌కు కిలో రూ.110గా ప్రకటించటాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు రైతులకు భిక్షం వేస్తున్నారో, లేక రైతులను భిక్షగాళ్లుగా చూస్తున్నారో, మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే రూ.1,000 కోట్లు కేటాయించి, మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాల్లో సంయుక్త కిసాన్ మోర్చా ప్రకాశం జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు వి.కృష్ణయ్య, భారీ సంఖ్యలో పొగాకు రైతులు, రైతు సంఘాల నేతలు జజ్జూరి జయంత్ బాబు, కిలారు పెద్దబ్బాయి, టి.శ్రీకాంత్, వడ్డే హనుమారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, కాలం సుబ్బారావు, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ధర్నా చేస్తున్న పొగాకు రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.పొగాకు రైతులపై సర్కారు నిరంకుశత్వంహైవేల దిగ్బంధం నేపథ్యంలో రైతుల అక్రమ నిర్బంధంఆత్మకూరు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో బుధవారం చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని చేపట్టకుండా సర్కారు నిరంకుశత్వానికి తెగించింది. ఐదు రోజులుగా రైతు సంఘం నేతలు, వామపక్షాల నాయకులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నేపథ్యంలో బుధవారం జాతీయ రహదారిని నిర్బంధించాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వీరిని ముందుగానే అదుపులోకి తీసుకోవడం, వారి ఇళ్ల వద్దకు వెళ్లి నోటీసులు ఇవ్వడం వంటి చర్యలకు చంద్రబాబు సర్కారు దిగింది. ఈ క్రమంలో పలువురు రైతు నాయకులు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డీసీపల్లిలోని పొగాకు బోర్డు వద్దకు వెళ్లేందుకు బుధవారం ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకొని బైండోవర్ చేసేందుకు ఆత్మకూరులోని ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. ఆర్డీవో లేకపోవడంతో వారిని పోలీస్ సర్కిల్ కార్యాలయానికి తీసుకెళ్లిపోయారు. ఆ నాయకులు పోలీస్‌స్టేషన్ వద్ద మాట్లాడుతూ..ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్న తమను అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. అదుపులోకి తీసుకున్న రైతు సంఘాల నాయకుల్లో నాగయ్య ,మూలి వెంగయ్య, లక్కు కృష్ణప్రసాద్, డేవిడ్‌రాజు, లక్ష్మీపతి తదితరులున్నారు. సిండికేట్ అయ్యామని వ్యాపారులే చెప్పారు పొగాకు కొనుగోళ్లు అస్సలు జరగడం లేదు. దీనిపై వ్యాపారులను ప్రశ్నిస్తుంటే మేమంతా సిండికేట్ అయ్యామని నేరుగా చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. పంట వేయమంటారు.. తీరా కొనుగోలు దగ్గరకు వచ్చేసరికి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే ఏ విధంగా సాగు చేయాలి? – గాలి వెంకటేశ్వర్లు, పొగాకు రైతు, శంకరాపురం, ముండ్లమూరు మండలం, ప్రకాశం జిల్లా నో–బిడ్ పేరుతో వేధింపులు పొగాకు బోర్డుకు పొగాకును తీసుకెళ్తే నో–బిడ్ పేరుతో వెనక్కు పంపుతున్నారు. ఒక్కో పొగాకు మొక్కకు 25 వరకు ఆకులు వస్తాయి. అన్నీ ఒకే నాణ్యతతో ఉండవు. చెట్టు మధ్య ఆకులు మాత్రమే బాగుంటాయి. నాణ్యమైన ఎఫ్–1, ఎఫ్–2 పొగాకు మాత్రమే తెమ్మంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది. క్వాలిటీ బాగున్నా రోజూ దాదాపు 50 శాతం పొగాకు బేళ్లు వెనక్కు పంపుతున్నారు. – జల్లి చిన వెంకటేశ్వర్లు, పొగాకు రైతు, మైనంపాడు, సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లాచంద్రబాబు ప్రభుత్వంలో పొగాకు రైతులకు సంక్షోభంఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ధ్వజంసాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పొగాకు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే రాష్ట్రంలో పొగాకు రైతులు ప్రతిరోజూ ఆందోళనలకు దిగుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగాల్సిన పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమన్నారు. -
‘దమ్ముంటే ఒంటరిగా రా’.. కంగనాపై రాఖీ తిరుగుబాటు
జంతర్‌మంతర్ వద్ద జరిగిన జెన్ జెడ్ విద్యార్థుల నిరసనలపై ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నటి రాఖీ సావంత్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులకు, దేశ యువతకు మద్దతుగా నిలిచిన ఆమె, కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కంగనా రనౌత్ జెన్ జెడ్ వారిని ‘జనరేషన్ గట్టర్’ అని అభివర్ణించడంతో పాటు, నిరసనల్లో పాల్గొన్న యువతులపై వివాదాస్పద కామెంట్లు చేశారు.దీనిపై రాఖీ సావంత్ తీవ్రంగా స్పందిస్తూ, దేశంలోని యువతులు, విద్యార్థినుల గురించి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసిన రాఖీ సావంత్, కంగనా రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీగా ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ‘మీకు ధైర్యం ఉంటే సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా బయటకు తిరగండి. అప్పుడే దేశంలోని యువత శక్తి ఏంటో మీకు తెలుస్తుంది’ అని సవాలు విసిరారు.పార్లమెంట్లో కూర్చుని ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బాలీవుడ్లో కంగనా గత వివాదాలను గుర్తుచేస్తూ, ఆమె భాషపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. మరోవైపు, కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో జెన్ జెడ్ నిరసనల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిరసనల్లోని రీల్స్ చూసి తాను దిగ్భ్రాంతి చెందానని, కొద్దిరోజులు డిజిటల్ డిటాక్స్లోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. సాంప్రదాయ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరిపై ఆమె మండిపడ్డారు. ఈ పరిణామాలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
ప్రకాష్ రాజ్‌ను చేపలకు ఆహారంగా వేస్తా: బీజేపీ ఎమ్మెల్యే
ఉడుపి: ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్‌కు కర్ణాటకలోని ఉడుపికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్పాల్ సువర్ణ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. కళాకారుల మదిలో విషబీజాలు నాటడం మానుకోవాలని, లేనిపక్షంలో అరేబియా సముద్రంలో చేపలకు ఆహారంగా మారుస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి నిరసనలో ప్రకాశ్ రాజ్ పాల్గొని, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో యశ్పాల్ సువర్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన నీట్ నిరసనలో పాల్గొన్నవారు అసలైన విద్యార్థులు కారనీ, వారి నేపథ్యాన్ని పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.ఇలాంటి రాజకీయాలు కొనసాగితే బీజేపీ కార్యకర్తలు తగిన రీతిలో స్పందిస్తారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన వీ. సునీల్ కుమార్‌తో సహా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు 'ఇండియా' కూటమి నేతలైన రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ తదితరుల ముఖాలతో ఉన్న బొద్దింకల ప్లకార్డులపై క్రిమిసంహారక మందు పిచికారీ చేయడం గమనార్హం.ఇది కూడా చదవండి: కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్! -
ఏపీలో డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే...
-
YSRCP నిరసన ర్యాలీ సక్సెస్ పై వైఎస్ జగన్ హర్షం
-
వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీల విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం
తాడేపల్లి : డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలపై వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీల విజయవంతంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లోనూ బారీగా జరిగిన నిరసన ప్రదర్శనపై వీడియోను పోస్టు చేశారు వైఎస్ జగన్.‘చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసిందన్నారు. విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు విజయవంతమయ్యాయని, డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపైన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే. టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వ.. డీఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తా ఉన్నా సీఎం చంద్రబాబు కానీ, విద్యాశాఖమంత్రి లోకేష్ కానీ ఇప్పటివరకూ వాటిమీద నోరుమెదపలేదు. డైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన… pic.twitter.com/C0ZpLL2hC3— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2026ఇదీ చదవండి: ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలుదగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం (ఫొటోలు) -
రాజమండ్రిలో హైటెన్షన్.. YSRCP ర్యాలీ అడ్డుకోవడంతో ఉద్రిక్తత
-
పీవోకేలో ఎన్నికలు రక్తసిక్తం.. ఆందోళనకారులపై కాల్పులు
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన మెుదటి విడత ఎన్నికలు రక్తసిక్తంగా మారాయి. ఎన్నికల వేళ ఆందోళనకారులపై జరిపిన పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 19 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పీవోకేలో గత కొద్ది రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం శాసనసభకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మెుదటి దశ ఎన్నికల్లో మారణహోమం జరిగింది.పీవోకేలో గత కొంతకాలంగా నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పీవోకే శాసనసభలో పాకిస్థాన్‌లో నివసించే శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్డ్ సీట్లను రద్దుతో పాటు భారీగా పెరిగిన విద్యుత్ ధరలు, ద్రవ్యోల్బణంతో పాటు అక్కడి ఆర్మీ అరాచకాలగకు విసిగిపోయిన ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు.దశాబ్దాలుగా పాకిస్థాన్ తమ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో పూర్తిగా విస్మరిస్తోందని, స్థానిక వనరులను దోచుకుంటూ ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.ఈ నేపథ్యంలోనే జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. అయితే ఈ ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోని అక్కడి ప్రభుత్వం అక్కడి అసెంబ్లీ స్థానాలకు ముడు దశలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలిదశ ఎన్నికలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఎన్నికలు వద్దంటూ నిరసన చేస్తున్న ఆందోళనకారులపై పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 19 మంది మరణించారు. అలాగే పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. అయితే గాయపడ్డవారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కాగా నిరనలు తారాస్థాయికి చేరినప్పటికీ పోలింగ్ సిబ్బందిని బంధీలుగా ఉంచి... ఆయుధాల బెదిరింపులతో బోగస్ ఓటింగ్, రిగ్గింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి సమాహ్ని ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ నుండి సాయుధ వ్యక్తులు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది.జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) పిలుపు మేరకు ముజఫరాబాద్‌కు ర్యాలీ నిర్వహిస్తుండగా... రావాలాకోట్‌లో నిరసనకారులపై పాకిస్థాన్ బలగాలు కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ముజఫరాబాద్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో నిరసనకారులు సిద్ధమవుతుండగా, రావాలాకోట్‌లో భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయని స్థానికులు ఆరోపించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అకీల్ భాయ్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను, అక్కడి పరిస్థితులు, జరిగిన పరిణామాలను వివరించారు. #PoJK This is a military-dominated state where civilian governance is merely a facade and real power lies with the army. Calling this system “constitutional” is misleading.An entire establishment, intoxicated by power, has trampled upon law, constitution, and ethics… pic.twitter.com/R4LhZyZnq6— KashmirFact (@Kashmir_Fact) July 28, 2026 -
శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు
సాక్షి, న్యూఢిల్లీ: శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసన తెలపడం దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆందోళన జరుగుతోందనే ఒకే కారణంతో పోలీసులు, ఇతర భద్రతాధికారులు లాఠీచార్జ్‌కు పాల్పడటం సరికాదని సీజేఐతోపాటు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్లతో జంతర్‌మంతర్‌లో జరిగిన ఆందోళనలపై పోలీసులు లాఠీఛార్జ్ తదితర బల ప్రయోగానికి పాల్పడటంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లు అన్నింటినీ కలిపి మంగళవారం విచారించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.అది రాజ్యాంగ హక్కువిచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ‘‘జంతర్ మంతర్ ఆందోళనల్లో పోలీసులు అతిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉంటే వాటిపై స్వతంత్ర విచారణ జరగాలి. ఇది కేవలం ఢిల్లీకి పరిమితమైన సమస్య కాదు. నిరసనలను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన పోలీసు ప్రోటోకాల్ అవసరం. ప్రజాస్వామ్యంలో క్రమశిక్షణ అంతర్భాగం’ అని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తి ప్రాణం చాలా విలువైందని స్పష్టం చేశారు. జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ మాట్లాడుతూ ‘‘పోలీసులు, విద్యార్థుల్లో ఎవరు గాయపడ్డా సమానంగానే చూడాలి. నిరసన ప్రదర్శనలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసులకు తగిన రక్షణ ఏర్పాట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి రావచ్చు’’ అని అన్నారు. నిరసనల సందర్భంగా గాయపడ్డ పోలీసు సిబ్బంది కుటుంబాలు తమ వాదన కూడా వినిపించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కేంద్రం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ న్యాయస్థానానికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. -
అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలి
సాక్షి, అమరావతి : వేతనాల పెంపుతోపాటు అంగన్వాడీలకు సంబంధించిన అన్ని డిమాండ్లను పరిష్కరించాలని మూడు యూనియన్లకు చెందిన నేతలు మరోసారి స్పష్టం చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూలకు చెందిన అంగన్వాడీ అనుబంధ సంఘాల నేతలతో ఐసీడీఎస్ అధికారులు సోమవారం జాయింట్ మీటింగ్ నిర్వహించారు. దాదాపు 3 గంటల సేపు జరిగిన చర్చల్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు వెంటనే వేతనాలు పెంచాలని, నవచేతనా యాప్‌ను రద్దు చేయాలని, పెండింగ్ ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్ల ప్రమోషన్ గైడ్ లైన్స్ రద్దు చేయాలని కోరారు. ప్రతిరోజు ఉదయం 9గంటల నుంచి సా.4 గంటల వరకు ఎప్పుడు ఏ పని చేయాలనే జాబ్ చార్టు తయారుచేయాలని తదితర డిమాండ్లను అధికారుల దృష్టికి తెచ్చారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. సమావేశంలో ఐసీడీఎస్ జాయింట్ డైరెక్టర్లు ప్రవీణ, శివకుమారి, మూడు యూనియన్ల రాష్ట్ర కీలక నాయకులు కె.సుబ్బరావమ్మ, ఎ.బేబిరాణి, ఎంసీహెచ్ సుప్రజ, బి.లక్ష్మీదేవి, జె.లలితమ్మ, శారమ్మ, ప్రభావతి రాధా, మల్లేశ్వరి, జులేక, ఆర్.జ్యోతి, భారతి తదితరులు పాల్గొన్నారు. -
జంతర్‌మంతర్ .. ఢిల్లీలో మునిగితే ముస్సోరిలో తేలాడు
సాక్షి, ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు ఆహరం పంపిణీ చేసిన వ్యక్తిని పోలీసులు విచారించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జునైద్ అనే వ్యక్తి అక్కడి నిరసన కారులకు ఆహరం సరఫరా చేశారు. దీనిని గమనించిన పోలీసులు అతనిని భిన్న విధాలుగా ప్రశ్నించి చివరికి కళ్లకు గంతలు కట్టి ముస్సోరిలో వదిలేశారు. ఈ వివరాలను ఆ బాధితుడు సోషల్ మీడియావేదికగా పంచుకున్నారు.వివరాల్లోకి వెళితే గత శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులకు జునైద్ ఆహరం సరఫరా చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు అతని వద్దకు వచ్చి ప్రశ్నించడం మెుదలు పెట్టారు. నువ్వు ఈ ఆహరం ఎందుకు పంపిణీ చేస్తున్నావు. దీనికోసం నీకు ఎవరు సహాయం చేస్తున్నారు. రాత్రంతా పోలీసుల అదుపులో ఉంచుకొని ఆ బాధితుడు కళ్లకు గంతలు కట్టి క్యాబ్‌లో తీసుకెళ్లి ముస్సోరిలో వదిలివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ వివరాలు తెలుసుకున్న విద్యార్థుల న్యాయ సహాయ బృందం తనను సంప్రదించిందన జునైద్ తెలిపారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ధర్నా చేయగా ఎట్టకేలకు మంత్రి రాజీనామా చేశారు. దీంతో సీజేపీ నిరసన ముగిసింది.Mohammad Junaid Used and Thrown by CJP Founders!!Mohammad Junaid who played the biggest part in CJP Protest by supplying Non Stop Bread Pakodas, Samosas, Biryani and various other dishes for 40 days is now feeling cheated by CJP Founders!!During an Interview the reporter… pic.twitter.com/L9j8qiwyaa— Rohit (@Iam_Rohit_G) July 26, 2026 -
భారత విద్యార్థులకు థన్‌బర్గ్ ఎందుకు మద్దతు పలికారు?
లండన్: భారతదేశంలో విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో సంఘీభావం తెలుపుతూ, లండన్‌లోని భారత హైకమిషన్ ఎదుట ఎస్ఎఫ్ఐ-యూకే ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో ప్రముఖ వాతావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. పరీక్షల్లో అక్రమాలు, నీట్ పేపర్ లీక్ వివాదాలపై భారత విద్యార్థులు చేపట్టిన న్యాయమైన పోరాటం తనను ఆకట్టుకున్నదని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులకు ప్రజాశక్తిపై నూతన ఆశలను రేకెత్తించిందని ఆమె వ్యాఖ్యానించారు. Famous Social and Environment Activist Greta Thunberg showed up in solidarity with the Indian student movement at London protest organised by SFI-UK today. The student movement has given global activists hope about the power of the people.Thank You For your Solidarity… pic.twitter.com/VATlX9wvZo— Adarsh.M.Saji (@Adarshmsaji) July 26, 2026భారతదేశంలో నెలకొన్న విద్యా వ్యవస్థ వైఫల్యాలు, పోటీ పరీక్షల లోపాలు, వేలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం కావడం వంటి పరిణామాలు గ్రెటా థన్‌బర్గ్ దృష్టిని ఆకర్షించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రారంభమై, పార్లమెంట్ ముట్టడి వరకు వెళ్లిన ఈ ఉద్యమంపై పోలీసులు జరిపిన అణచివేత చర్యలపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష, విద్యార్థులపై జరిగిన దాడులు అంతర్జాతీయ మీడియాను ఆకర్షించడంతో, గ్రెటా థన్‌బర్గ్ స్వయంగా రంగంలోకి దిగి, లండన్‌లోని ప్రదర్శనలో ప్లకార్డులతో నిరసన తెలిపారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో 36 రోజుల పాటు సాగిన ఈ చారిత్రాత్మక ఉద్యమానికి గ్రెటా థన్‌బర్గ్ మద్దతు తెలపడం ద్వారా, భారతీయ విద్యార్థుల గళం సరిహద్దులు దాటి ప్రపంచ వేదికపై మార్మోగింది. పారదర్శకమైన పరీక్షా విధానాలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం సాగుతున్న ఈ పోరాటానికి అంతర్జాతీయ ప్రముఖుల మద్దతు లభించడం గమనార్హం.ఇది కూడా చదవండి: నందన్ నీలేకని ఎవరు?..‘పరీక్షల భద్రత’కు ఎందుకు ఎంపిక చేశారు? -
లోకేష్ రాజీనామా చేయకుంటే AP దద్దరిల్లిపోద్ది..
-
పోలీసుల అణచివేతపై హోంమంత్రికి రాహుల్ లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనపై పోలీసులు జరిపిన హింసాత్మక చర్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన ఒక లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, కిరాతక దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జూలై 20న ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జ్, వాటర్ క్యానన్లుతో పాటు పెల్లెట్ గన్లను ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా 19 ఏళ్ల సాహిల్ లోచబ్ అనే విద్యార్థి పెల్లెట్ గాయాల కారణంగా తన కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా విద్యార్థులపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు.ఈ లేఖలో రాహుల్ హోంమంత్రి అమిత్ షాకు ప్రధానంగా రెండు ప్రశ్నలు సంధించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్ల వంటి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతిచ్చింది ఎవరు? పోలీసులతో కలిసి సాధారణ దుస్తుల్లో వచ్చి విద్యార్థులను కొట్టిన వ్యక్తులు పోలీసులా లేదా వాలంటీర్లా? వారిని ఎవరి ఆదేశాల మేరకు రంగంలోకి దించారు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తి: ప్రధాని మోదీ -
AP బొద్దింకలు సిద్ధం! నెక్స్ట్ వేసేది నిన్నే.. Gen-Z గుప్పిట్లో బాబు, లోకేష్
-
యువతకు సమాధానం ఇవ్వాల్సిందే: మోహన్ భగవత్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో యువత, కొత్త తరంతో వ్యవహరించే విధానంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘విశ్వ మంగళ్య సభ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులను, యువత ఆలోచనా విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.తాము యువకులుగా ఉన్న కాలం పూర్తిగా విధేయతతో కూడుకున్నదని, కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ప్రస్తుత కొత్త తరం ప్రతి అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని, వారికి కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా తగిన కారణాలు వివరించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. నేటి కుటుంబాల్లోనూ పరస్పర సంభాషణలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలతో మరింత ఆప్యాయంగా మెలగాలని, వారి కోసం సమయం కేటాయించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.ఇదేసమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పష్టం చేశారు. నూతన సాంకేతికతలను అందిపుచ్చుకుని, వాటిపై పట్టు సాధించి, మానవాళి అభ్యున్నతికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. భౌతికవాద ఆలోచనల కారణంగా సృజనకు పరిమితంగా ఉన్న వనరులు, అపరిమిత ఆకాంక్షల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోటీ కారణంగానే సమాజంలో సంఘర్షణలు తలెత్తుతున్నాయని మోహన్ భగవత్ విశ్లేషించారు.ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ ఎఫెక్ట్: మందుబాబులకు షాక్! -
మీ 20మంది విద్యార్థులు చనిపోయారు..! ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి
-
సీజేపీ నిరసనలు.. మద్యం షాపులపై కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ :ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుతుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (శని, ఆదివారాలు) నుంచి ఆదివారం వరకూ రాజధాని నగరంలోని మద్యం షాపులన్నింటినీ రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.సాధారణంగా ఢిల్లీలో మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకూ వైన్ షాపులు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలు శాంతిభద్రతల దృష్ట్యా, నగరంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన ఢిల్లీ పోలీసులు మద్యం షాపుల వేళలను కుదించాలని ప్రభుత్వానికి సూచించారు.కాగా ఇటీవలే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గురువారం రాత్రి కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే మద్యం షాపులను త్వరగా మూసివేయడంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రభుత్వం రాత్రి ఎనిమిది గంటలకే మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
రైల్వేపాసులు పునరుద్దరించాలని జర్నలిస్టుల ధర్నా
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల రైల్వే పాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్దరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకై శుక్రవారం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట టీడబ్లూజేఎఫ్ ఆద్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సారి పూర్తిగా వందశాతం రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కరోనా కాలంలో రైల్వే పాసులను రద్దుచేయడంతో పాత్రికేయుల విధులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని తెలియజేసింది.ఈసందర్భంగా జర్నలిస్టులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ కె. కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. దాదాపు రెండు గంటలపాటు నిరసన నిర్వహించారు. నినాదాలు చేశారు. రైల్ నిలయం ప్రధాన ద్వారం ఎదుట జరిగిన నిరసనలో రాప్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మాట్లాడుతూ గత ఐదేండ్లుగా జర్నలిస్టులు రైల్వే పాసులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.విధుల నిర్వహణలో స్థానిక ప్రయాణాలతోపాటు దేశీయంగా కూడా సమస్యలు తప్పడం లేదని వివరించారు. కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీ ఇచ్చే కేంద్ర ప్రభుత్వం, జర్నలిస్టుల రైల్వే పాసులను పునరుద్దరించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. కనీస వేతనాల చట్టం అమలుకాకపోవడంతో వేతనాలు సక్రమంగా అందడం లేదన్నారు. నిత్యావసర ధరలు పెరిగాయని చెప్పారు. కనీసం పాసులను సైతం ప్రభుత్వం పునురుద్దరించపోవడం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు.కేంద్ర ప్రభుత్వంఅమలుచేసే ఒకే ఒక్క పథకాన్ని రద్దుచేసి చేతులు ఎత్తేసిందన్నారు. గత పదేండ్ల నుంచి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిచడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. కేంద్ర సమాచార, రైల్వే మంత్రిత్వ శాఖలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కేంద్ర మంత్రులు అశ్వినీకుమార్ వైష్ణవ్, జి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రైల్వే బోర్డు చైర్మెన్లను కలిసి పదే పదే చెప్పడం, వినతిపత్రాలు ఇచ్చినా రైల్వే పాసుల సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.లోక్‌సభ, రాజ్యసభల్లో పలుమార్లు రైల్వే పాసుల చర్చ జరిగినా ప్రధాని నరేంద్రమోడీకి కనీసం చీమకుట్టినట్టయినా లేకపోవడం బాధాకరమని చెప్పారు. వేజ్‌బోర్డు సిఫారసులను అమలుచేయడంలో వెనుకబడ్డ కేంద్రానికి రైల్వే పాసులను సైతం పునరుద్దరించడానికి మనసు రావడం లేదని అన్నారు. వెంటనే యుద్ధప్రాతిపదిక రైల్వే పాసులు పూర్తిగా వంద శాతం రాయితీతో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రైల్వే పాసుల విషయంలో ప్రధాని నరేంద్రమోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్వనీకుమార్ వైష్ణవ్‌కు లేఖ రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు గుడిగ రఘు, బి. రాజశేఖర్, కార్యదర్శి ఈ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల కృష్ణ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నీట్ నిరసనల్లో బిగ్‌ట్విస్ట్.. 400 మంది క్రిమినల్స్ ?
సాక్షి, ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలపై ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జూలై 20 నుండి జూలై 24 మధ్య జంతర్ మంతర్ దాని పరిసర ప్రాంతాలలో నేర చరిత్ర ఉన్న సుమారు 400 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసుల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ గుర్తించినట్లు తెలిపారు. వీరిలో కొందరికి జూలై 20న జరిగిన హింసాత్మక ఘటనలు, విధ్వంసంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.నీట్ లీకేజ్‌పై నిరసనలతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జులై 20 న భారీగా హింస చేలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు దానిపై విచారణను ముమ్మరం చేశారు. ఆ రోజున జరిగిన హింసాత్మక ఘటనల్లో నేరస్థులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గుర్తించిన నేర చరిత్ర కలిగిన వ్యక్తులలో సాహిల్, మనోజ్ కుమార్, రూబల్ సాహిల్ సైఫీ ఉన్నారు. నిరసన సమయంలో వీరు ఏవైనా వ్యవస్థీకృత ముఠాలలో భాగస్వాములుగా ఉన్నారా లేదా అనే అంశాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున, 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన 'చలో సన్సద్' మార్చ్‌లో వేలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. విద్యా సంస్కరణలు చేపట్టాలని మరియు పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. హై-సెక్యూరిటీ జోన్‌లోని బారికేడ్లను బద్దలు కొట్టడానికి నిరసనకారులు ప్రయత్నించడంతో జూలై 20న హింస చెలరేగింది. తాజాగా దీనిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. -
మీ పోరాటానికి నా సెల్యూట్: డైరెక్టర్ శేఖర్ కమ్ముల
నీట్ పేపర్ లీకేజీపై జెన్ జీ చేస్తోన్న పోరాటంపై టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించారు. మీ పోరాటానికి నా సెల్యూట్ అంటూ కొనియాడారు. నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా.. నీట్ పేపర్ లీక్ వలన ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఏ ప్రభుత్వమైనా ఇవన్నీ అడక్కుండా చేయాల్సిన పనులని అన్నారు. ఈ చిన్న డిమాండ్లు సాధించుకోడానికా లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తమోడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిండీతిప్పలు మాని దెబ్బలకి ఓర్చుకుని, రాత్రనకా పగలనకా ఉద్యమిస్తున్నారని ప్రశంసించారు. పిల్లలు అకౌంటబిలిటీ అడుగుతున్నారు.. వారి ఆవేదనలో న్యాయం ఉందని తెలిపారు. ప్రభుత్వం వాళ్ల మాట వినాలి.. వాళ్లకి భరోసా ఇవ్వాలి. వాళ్ల స్ఫూర్తిని గెలిపించాలని శేఖర్ కమ్ముల కోరారు. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టు...మన పిల్లలు గెలిస్తే మనం బ్రతికినట్టు.. ప్రజలు గెలిస్తే ప్రభుత్వాలు గెలిచినట్టు.. అని సందేశమిచ్చారు. డియర్ జెన్ జీ.. మీరు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దణ్ణం పెడుతున్నా.. మీకు సెల్యూట్ చేస్తున్నా అంటూ ఫేస్ బుక్‌లో శేఖర్ కమ్ముల పోస్ట్ చేశారు. -
విద్యార్థులకు యూనివర్శీటీల బెదిరింపు : రాహుల్ గాంధీ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన విద్యార్థి లోకం, శాంతియుతంగా పోరాడుతోంది. అయిత్ తమ విద్యార్థులు జంతర్‌మంతర్ నిరసనలో పాల్గొనవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఢిల్లీ యూనివర్సిటీ (DU), JNU హెచ్చరికలు జారీ చేయడంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.How dare you threaten students for exercising their democratic rights?Please note, you are the ones that will be held accountable when the time comes. https://t.co/Mx6D19SP5h— Rahul Gandhi (@RahulGandhi) July 24, 2026 > సోషల్ మీడియాలో ఆయా విద్యాసంస్థల ట్వీట్స్‌పై స్పందించిన రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యహక్కులను వినియోగించు కుంటున్న విద్యార్థులను బెదిరించడానికి ఎంత ధైర్యం? అంటూ ఘాటుగా స్పందించారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు.విద్యార్థులపై అప్రజాస్వామికంగా బెదిరింపులకు పాల్పడిన యూనివర్శిటీల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చట్ట విరుద్ధమని ఏ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని DU పూర్వ విద్యార్థి, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ప్రశ్నించారు. విద్యార్థులకు అబద్ధాలు చెప్తున్న DU తీరు సిగ్గుచేటని హుడా విమర్శించారు. మరోవైపు విద్యార్థుల గొంతు నొక్కితేనే వారి భవిష్యత్తుకు ఎక్కువ ప్రమాదం. వారి హక్కులకు మనం మద్దతుగా నిలవాలని నటిచదర్శకురాలు పూజా భట్ హితవు పలికారు.The students safety is more in jeopardy if their voices are suppressed. If we are truly invested in their future, we must support their right to speak out rather than maintain a conspiracy of silence. 🙏 https://t.co/SB9IcHiRvb— Pooja Bhatt (@PoojaB1972) July 23, 2026 ఇదీ చదవండి: నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనంకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు 'చట్టవిరుద్ధమైన కూడళ్ళు' (unlawful assemblies) అని, వాటిలో పాల్గొంటే విద్యార్థుల భవిష్యత్తు, అకడమిక్ అవకాశాలు దెబ్బతింటాయని DU, JNU యాజమాన్యాలు హెచ్చరించాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించాయి.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీ -
విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తారా?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘సంసద్ చలో’ర్యాలీలో హింస జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను ప్రతికూలంగా చిత్రీకరించడాన్ని చూడటం తీవ్ర వేదన కలిగించే విషయమని సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోవడం కంటే వారి ఉద్దేశాలను ప్రశ్నించడం ఎందుకు సులభంగా అనిపిస్తుందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆమె గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనను ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలతో ఎటువంటి ఆధారాలు లేకుండా ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తొందరపాటు వద్దని సూచించారు. విద్యార్థుల ఉద్యమం శాంతియుతంగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిష్టను మీడియాలో మసకబార్చేలా చూపడం ఒక విద్యావేత్తగా తనకు ఎంతో బాధ కలిగిస్తోందని వెల్లడించారు. ఆందోళనకారులు అసాధారణమైన సహనం, క్రమశిక్షణ, సంయమనం ప్రదర్శించారని అంగ్మో కొనియాడారు. అలాగే సమస్యలను ప్రభుత్వం ఆలకించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. సొంత విద్యార్థులనే అంత త్వరగా అపనమ్మకంతో చూసే వ్యవస్థ ఎలాంటిదని తాను తరచుగా ఆలోచిస్తుంటానని ఉద్ఘాటించారు. మన పిల్లలు రక్షణకు అర్హులు అని తేల్చిచెప్పారు. వారిని ప్రతినాయకులుగా చిత్రీకరించవద్దని కోరారు. వారు చెప్పేది అందరూ వినాలని వెల్లడించారు. కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చే కుట్రలతో విద్యార్థులను అణచివేస్తామంటే సహించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. -
బ్రో ఇక చాలు సోనమ్‌కు.. సల్మాన్ ఖాన్ విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: పేపర్ లీకేజీల నిరసనలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన మరుసటి రోజే, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ను తన నిరాహార దీక్షను విరమించాలని కోరారు. వాంగ్చుక్కు తన ఇంటి నుంచి వండిన భోజనాన్ని పంపుతానని.. పేపర్ లీకేజీలపై ప్రధానమంత్రి ఇప్పటికే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినందున నిరసన తెలుపుతున్న విద్యార్థులను కూడా తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.సల్మాన్ మాటల్లో "సోనమ్, ఇంకా చాలు బ్రో. దీన్ని ఇంకా పొడిగించవద్దు. అత్యవసరమైతే ఆ పట్టుదలను మరొక దాని కోసం ఉంచుకోండి—అయినా ఇప్పుడు దానికి అవసరం లేదనే భావిస్తున్నాను. ఏదైనా తినండి. నీకు కావాలంటే మా ఇంటి నుంచే భోజనం పంపిస్తాను" అని సల్మాన్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.చదువు పరంగా, భద్రత పరంగా విద్యార్థులే దేశానికి మొదటి ప్రాధాన్యత అని, ప్రధాని నుంచి ఇప్పటికే హామీ లభించినందున వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సల్మాన్ నొక్కి చెప్పారు. "విద్యాపరంగా, భద్రత పరంగా విద్యార్థులే అత్యున్నత ప్రాధాన్యత. కాబట్టి వారు భయపడాల్సిన పనిలేదు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదు. గౌరవనీయ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. ఈ లీకేజీకి బాధ్యులైన వారందరిపై ఆయన కఠిన చర్యలు తీసుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి విద్యార్థులారా, దయచేసి మీ ఇళ్లకు, మీ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లండి" అని సల్మాన్ తెలిపారు.రాజకీయ హైజాక్బాలీవుడ్ స్టార్ అంతకుముందు కూడా విద్యార్థుల నిరసనకు మద్దతు తెలపడమే కాకుండా, వారి ఉద్యమాన్ని ఎవరూ 'హైజాక్' చేయకూడదని హెచ్చరించారు. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయన విద్యార్థులు చేపట్టిన "శాంతియుత" నిరసనను ప్రశంసించడమే కాకుండా, వారిని "ధైర్యవంతులు, సాహసవంతులు" అని కొనియాడారు. "ఈ సమస్య విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మధ్య ఉన్నది. దీనిని రాజకీయంగా హైజాక్ చేయకూడదు. దీని శ్రేయస్సు అంతా మన దేశ విద్యార్థులకే దక్కాలి. ప్రభుత్వం కూడా వారికి పూర్తి మద్దతు ఇచ్చి, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది అందరికీ మంచి జరిగే పరిస్థితి. అనుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. చదువుకోవాలనుకునే మీ అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక" అని ఆయన అంతకుముందు రాసుకొచ్చారు.కాగా పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ తన నిరాహార దీక్షను విరమింపజేశారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా అతనికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. -
సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ
సాక్షి, ఢిల్లీ: పర్యావరణ వేత్త సోనమ్‌వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమింపచేశారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో పండ్ల రసం తాగి దీక్షను విరమించారు. నీట్ లీకేజ్‌లపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 26 రోజులుగా సోనమ్ వాంగ్ చుక్ నిరహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య గీతాంజలి అంగ్మో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నా దీక్షను విరమించినందుకు సంతోషంగా ఉంది. ఈ పోరాటంలో సహకరించిన అందరికీ, నా వెన్నంటి ఉన్న భార్య గీతాంజలికి నా ధన్యవాదాలు" అని తెలిపారు. దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని మరియు ప్రశ్నాపత్రాల లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న ఆయన ఈ నిరాహార దీక్షను ప్రారంభించారు.కాగా కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో పేపర్ లీకేజ్‌లు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు సోమవారం కేబినేట్ భేటీలో కీలక బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో విడుదల చేశారు.మరోవైపు ఆయనకు మద్దతుగా కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలై పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారిన సంగతి తెలిసిందే. -
కాక్రోచ్ ఆందోళన .. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: సీజేపీ నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఉన్నత విద్యాశాఖ నూతన కార్యదర్శిగా నరేశ్ పాల్ గంగ్వార్ని నియమించింది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.ప్రస్తుత కార్యదర్శి వినిత్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసింది.అదే విధంగా ప్రధాని ఆదేశాలతో నీట్ లీకేజ్‌పై ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ పరిధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సేవలు జరగనున్నాయి. స్పెషల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ని నియమించింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను విచారణ చేపట్టడం కొరకే స్పెషల్ కోర్టున ఏర్పాటు చేసినట్లు తెలిపింది. -
విజయవాడలో హైటెన్షన్.. విద్యార్థులు అరెస్ట్
-
గుజరాత్‌లోనూ నిరసనలు.. అహ్మదాబాద్‌లో ఆందోళనలు ఉధృతం
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు గుజరాత్‌కూ విస్తరించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత, సామాజిక కార్యకర్తలు అహ్మదాబాద్‌లో నిరసనలకు దిగారు. పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకులు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, నిరుద్యోగ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.నిరసనకారులు ప్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీలు నిర్వహిస్తూ తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. భద్రతా దృష్ట్యా అహ్మదాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. సీజేపీ నేతలు మాట్లాడుతూ.. తమ డిమాండ్లు నెరవేరే వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, నిరసనలు చేపట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.MUMBAI ❌️ DELHI ❌️ Now, visuals emerge from Ahmedabad, Gujarat — home of Modi and Shah. Students are protesting against a failed education system. 👇 pic.twitter.com/zxQaQC3QcP— Priya Purohit (@Priyaa_Purohit) July 23, 2026 ఇదిలా ఉండగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సీజేపీ నిరసనలు కొనసాగడం గమనార్హం. బీహార్, ఒడిషా, మహారాష్ట్ర, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో సైతం సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. The protest at Gujarat University in Ahmedabad remains ongoing, with students persisting in their demonstration despite considerable police mobilisation and the arrest of demonstrators.#StudentProtest #GujaratUniversity #NEETProtest #PoliceDetention #StudentVoice pic.twitter.com/BQTyKTp6au— Kumar R Talukdar🇮🇳 (@Kumarjyoti49291) July 22, 2026Ahmedabad, Gujarat 📍मोदी जी के गढ़ गुजरात में भी छात्र अब सड़को पर उत्तर आए हैं 🔥🔥 pic.twitter.com/KxbDWcd93L— Amit Mishra (@Amitjanhit) July 23, 2026 -
విజయవాడలో ఉద్రిక్తత..
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలు లోక్‌భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. దీంతో, పోలీసులు.. విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
సీజేపీ నిరసనకు స్పాన్సర్ ఎవరు?.. అసలు కథ ఇదే
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. జంతర్‌మంతర్ వద్ద మరో ఆసక్తికర అంశం చర్చకు దారితీస్తోంది. నిరసనకారుల వెనుక ఎవరున్నారు?. అసలు వాళ్లకు మద్దతుగా వస్తున్న ఆహారం, నీరు, ఇతర సహాయ సామగ్రి ఎవరు పంపిస్తున్నారు? నిజంగానే ఆ ఆర్డర్లు ముంబై, హైదరాబాద్‌లాంటి నగరాల నుంచి ఆర్డర్ చేస్తున్నవేనా?.. ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.సీజేపీ ఆందోళనలు దేశానికి ప్రమాదకరమని.. ఈ ఉద్యమంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడుతున్నాయంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. విదేశీ నిధులు, ముఖ్యంగా పాక్ నుంచి ఫండింగ్ వస్తోందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. అదే సమయంలో నిరసన ప్రాంగణంలో కనిపిస్తున్న పరిణామాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి.జంతర్‌మంతర్‌కు వరుసగా.. నిరసన ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఫుడ్ డెలివరీలు వస్తూనే ఉన్నాయి. దాల్ చావల్, రాజ్మా చావల్, టీ, శాండ్విచ్లు, బర్గర్లు, తాగునీటి బాటిళ్లు పెద్ద సంఖ్యలో చేరుతున్నాయి. కొందరు డెలివరీ రైడర్లు వరుసగా రావడం అక్కడ కనిపిస్తోంది. అయితే ఈ ఆహారాన్ని ఎవరు పంపిస్తున్నారో తమకు తెలియదని వాలంటీర్లు చెబుతున్నారు. ఆర్డర్ వచ్చిన ప్రాంతం మాత్రమే తెలుస్తుందని.. పంపించిన వ్యక్తుల వివరాలు తమకు తెలియవని అంటున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సహాయం?నిరసనకారుల ప్రకారం.. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, నాగ్‌పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి కూడా సహాయం అందుతోందని వారు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు నేరుగా ఉద్యమంలో పాల్గొనలేకపోయినా.. తమ మద్దతును ఆహారం, నీరు వంటి రూపాల్లో తెలియజేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో తాము మద్దతుగా ఆర్డర్లు పెడుతున్నామంటూ కొందరు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. జూలై 20 తర్వాతే పెరిగిన మద్దతుజూలై 20న చలో సంసద్‌కు సీజేపీ ప్రయత్నించింది. అయితే ఘర్షణల నేపథ్యం, అలాగే నిరసనకారులకు గాయాలు అయిన నేపథ్యంలో.. శాంతియుతంగా జంతర్ మంతర్ వద్దే ఆ మరుసటి రోజు నుంచి ఆందోళన కొనసాగిస్తోంది. ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని అంటోంది. అయితే లాఠీ చార్జి పరిణామాల తర్వాత నిరసనకు ప్రజల నుంచి మద్దతు పెరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. అంతకుముందు వరకు పరిమితంగా ఉన్న సహాయం.. ఆ తర్వాత భారీగా పెరిగిందని వాలంటీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆహార కొరత లేదని, రోజంతా పలు పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయని వారు తెలిపారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఇతరులకు కూడా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఒకానొక దశలో.. ఫుడ్ ఆర్డర్లు భారీగా చేరడంతో ఇక భోజనాలు పంపొద్దంటూ CJP తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేసింది.ఫండింగ్పై రాజకీయ ఆరోపణలు.. సోషల్ మీడియాలో చర్చఅయితే ఉద్యమానికి వస్తున్న మద్దతుపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. నిరసనల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందన్న అంశంపై అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కొన్ని వర్గాలు నిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని ఆరోపిస్తుండగా.. మరికొందరు మాత్రం విద్యార్థుల సమస్యపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని వాదిస్తున్నారు.సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫుడ్ సపోర్ట్‌ను ప్రజల స్వచ్ఛంద మద్దతుగా చూస్తుంటే.. మరికొందరు ఉద్యమానికి నిధుల మూలాలపై స్పష్టత అవసరమని ప్రశ్నిస్తున్నారు.పేర్లు తెలియని దాతలు.. కనిపిస్తున్న మద్దతుప్రస్తుతం జంతర్‌మంతర్ వద్ద కనిపిస్తున్న దృశ్యం ఏమిటంటే.. పేర్లు వెల్లడించని వ్యక్తుల నుంచి ఆహారం, నీరు వంటి సహాయం నిరసనకారులకు చేరుతోంది. అయితే ఈ సహాయం వెనుక ఎవరు ఉన్నారు? ఇది కేవలం వ్యక్తిగత మద్దతేనా? లేదంటే మరేదైనా వ్యవస్థీకృత సహకారం ఉందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలు ఒకవైపు.. ఆధారాలతో నిరూపితమైన వాస్తవాలు మరోవైపు. సీజేపీ నిరసనల చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చల మధ్య.. జంతర్‌మంతర్ ఫుడ్ ప్యాకెట్ల కథ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. -
పిడికిలెత్తిన ఆగ్రహాంధ్ర
చంద్రబాబు పాలనలో దగాపడిన అన్నివర్గాల ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. పిడికిలెత్తి ఆందోళన బాట పడుతున్నారు. సమస్యలపై తాత్సారం చేస్తున్న సర్కారుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సహకారబ్యాంక్ అధికారులతోపాటు, గిరిజన ఉపాధ్యాయులు, రైతులు, ఆదివాసీలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే బాబు సర్కారును గద్దె దింపుతామని ప్రతినబూనారు. సహకార బ్యాంకులో వేతన సవరణ నినాదంసాక్షి, అమరావతి: వేతన సవరణ అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఏపీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (ఏపీసీసీబీ) అధికారుల సంఘం హెచ్చరించింది. బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఎదుట అధికారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నన్నపనేని రంగబాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల సీఈఓలు, జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ల వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ అధికారుల వేతన సవరణను పెండింగ్‌లో పెట్టడం దారుణమన్నారు. ఉద్యోగుల న్యాయమైన వేతన హక్కులను కోర్టు కేసులతో ముడిపెట్టడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనను దశలవారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 27న సామూహిక సెలవు పెట్టి నిరసన తెలియజేయబోతున్నామని, 31న విజయవాడలో మహాధర్నాకు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. బుధవారం నాటి ఆందోళనలో బ్యాంక్ డీజీఎంలు పి.వరాలమ్మ, కాగిత శ్రీనివాసులు బ్యాంకు ఉద్యోగ సంఘ ప్రధాన కార్యదర్శి ఎస్ గోపీనాథ్, బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకులు వై.గీతాభారతి, ఎం.మౌలేశ్వరరావు, రేష్మ, బ్యాంకు ఉద్యోగులు సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.రగిలిన గిరిజన గురువులబ్బీపేట(విజయవాడతూర్పు): ‘‘రాష్ట్రంలోని గిరిజన గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లలో పదిహేనేళ్లు పాటు పనిచేశాం. ఇప్పుడు డీఎస్సీలో పోస్టులు భర్తీ చేశామంటూ, మా ఉద్యోగాలు తొలగిస్తే ఎలా?’’ అంటూ గిరిజన ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. తమ అందరికీ రెన్యువల్ చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చేపట్టిన ఆందోళన సాయంత్రం 6 గంటలు దాటేవరకు కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలల్లో అవుట్సోర్సింగ్ పద్దతిలో దాదాపు 1450 మంది ఉపాధ్యాయులం పనిచేసేవారమని, అయితే ఇటీవల డీఎస్సీలో గిరిజన పాఠశాలల పోస్టులు భర్తీచేశామని సాకుగా చెప్పి దాదాపు 700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో గిరిజన మంత్రిని నిలదీయగా, ఎవరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చి ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కదంతొక్కిన కర్షకులుతిరుపతి అర్బన్: ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పించాలని కర్షకులు కదంతొక్కారు. రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం తిరుపతి జిల్లా కార్యదర్శి పి.హేమలత మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని విమర్శించారు. రాయితీ విత్తనాలు ఇవ్వకపోవడంతో రైతులు విత్తు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు పాలనలో ఎరువుల సమస్య కూడా వేధిస్తోందని ధ్వజమెత్తారు.ఎన్నికల ముందు రైతులకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన సర్కారు ఇప్పుడు వారిని వంచించిందని దుయ్యబట్టారు. రైతులు చూస్తూ ఊరుకోబోరని, ఆందోళనను తీవ్రతరం చేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మణి, చెంగల్రాయుల రెడ్డి, సంజీవరెడ్డి, సందీప్ రెడ్డి, త్యాగరాజుల రెడ్డి, మునిరామయ్య, సుబ్రమణ్యం, శంకరయ్య, భారతి తదితరులు పాల్గొన్నారు.మైనింగ్‌పై ఆదివాసీల ఆందోళనరావికమతం (అనకాపల్లి జిల్లా): మండలంలో చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవను నో మైనింగ్ గా ప్రకటించాలని బుధవారం ఆదివాసీలు సోంపురం వంద నుంచి కళ్యాణపులోవ వరకు పాదయాత్ర నిర్వíహించి ఆందోళన చేపట్టారు. మండలంలో చీమలపాడు పంచాయతీలో కళ్యాణపులోవ రిజర్వాయరు గర్భం 258 ఎకరాలు. కాగా రిజర్వాయరుపై ఆధారపడి 9 గ్రామాల ప్రజలు సుమారుగా 4,484 ఎకరాలను వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రానైట్ క్వారీలు నడిపేవారు. అప్పటిలో ఆదివాసీలు, ప్రజా సంఘాలు, సీపీఐ, సీపీఎం నాయకులు పలుమార్లు నిరసనలు, ధర్నాలు, పాదయాత్రలు నిర్వహించడంతో క్వారీలు నిలుపుదల చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత భూ మాఫియా, మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్నాయని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణపులోవను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కళ్యాణపులోవ పోతురాజుబాబు ఆలయం ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం అని, ఇంతంటి ప్రాశస్త్యం ఉన్న క్షేత్రాన్ని మైనింగ్ మాఫియా నుంచి కాపాడాలని విన్నవించారు. ఆదివాసీలు నిర్వహించిన పాదయాత్రకు సీపీఎం నాయకులు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నేత మోసూరు రాజు, సీపీఎం నాయకుడు కె.జనార్దన్, ఆదివాసీలు, ప్రజా సంఘ నాయుకులు పాల్గొన్నారు. -
పోరాటాన్ని హైజాక్ చేయకండి.. నీట్ నిరసనలపై సల్మాన్ ఖాన్ పోస్ట్!
సాక్షి, ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పేపర్ లీక్ ఆందోళనలపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. నీట్ పేపర్ లీక్ నిరసనలకు తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థుల పోరాటం స్ఫూర్తిధాయకం అని అభినందించారు. అదే సమయంలో ఈ వివాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ఈ ఉద్యమాన్ని "హైజాక్" చేయవద్దని పరోక్షంగా విపక్షాలకు చురకలంటించారు.ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజ్‌పై సీజేపీ నేతృత్వంలో నిరసనలు జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. ఈ నేపథ్యంలో సీజేపీ నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తాజాగా సినీస్టార్ సల్మాన్ ఖాన్ సైతం విద్యార్థులకు తన మద్ధతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.సల్మాన్ తన పోస్ట్‌లో " ఈ సమస్య విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మధ్య ఉన్నది, దీనిని రాజకీయంగా హైజాక్ చేయకూడదు, దీని ఘనత మన దేశ విద్యార్థులకే దక్కాలి, ప్రభుత్వం కూడా వారికి పూర్తి మద్దతు ఇచ్చి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇది ఇరుపక్షాలకూ లాభదాయకమైన పరిస్థితి. సానుకూల నిర్ణయం కోసం ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. చదువుకోవాలనుకునే మీ అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక," అని ఆయన రాశారు.ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దేశంలో విద్య ఒక 'ఫ్యాషన్ ట్రెండ్'గా మారితే, విదేశాల నుంచి విద్యార్థులు భారత్‌కు చదువుకోవడానికి వస్తారని తెలిపారు. కాగా నీట్ నిరసనలకు ఇదివరకే బాలీవుడ్ ప్రముఖులు ఓమీ వైద్య, జీనత్ అమన్, నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, అభయ్ డియోల్, సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ వంటి ప్రముఖులు మద్దతు ప్రకటించారు. -
విజయవాడలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల కొట్లాట
సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ కౌంటర్ ఆందోళన చేపట్టింది. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాల కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విజయవాడలో మ్యూజియం రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు "డౌన్ డౌన్ రాహుల్ గాంధీ", "డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ" అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తోందని వారు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఒకేచోట చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.అనంతరం, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ..‘మోదీ ఇంటి ముట్టడి వెనుక అసలు శక్తులు బయటపడ్డాయి. దాడి వెనుక కాంగ్రెస్ అగ్రనేతల హస్తం ఉంది. జంతర్ మంతర్ నిరసనలకు కాంగ్రెసే సూత్రధారి. సోనమ్ వాంగ్చుక్ను వెనుక ఉండి నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీనే. నిరసనల్లో ఒక్క నీట్ విద్యార్థి కూడా లేరు, కేవలం లెఫ్ట్ యూనియన్ నాయకులే ఉన్నారు. నిరసనల్లో అర్బన్ నక్సల్స్, 370 రద్దును వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి. నీట్ లీకేజీకి సంబంధించి 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు. నేపాల్, బంగ్లాదేశ్ తరహా అలజడులు సృష్టిస్తే ఉపేక్షించం. విద్యార్థులకు భరోసా, నిజమైన నీట్ బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
నల్ల దుస్తుల్లో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
-
రాహుల్ కి ముక్కు నుంచి రక్తస్రావం
-
ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించిన ప్రతిపక్షాలు..
-
నిరసన స్వరాలు వింటారా?
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం ఢిల్లీ ఆకాశంలో నిరసన మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. రాజవీధులన్నీ వేలాది యువగళాలతో హోరెత్తాయి. పన్నెండేళ్ల బాలిక మొదలుకొని అనేకమంది యువతీయువకులు పోలీసుల లాఠీచార్జిలో గాయపడి నెత్తురోడుతున్న, విలపిస్తూ నిలదీస్తున్న దృశ్యాలు చానెళ్లలో వీక్షించటం చాలామందికి కష్టంగా తోచింది. ఈ దశాబ్ద కాలంలో దేశ రాజధాని ఎన్నడూ చూడని దృశ్యాలివి. నీట్ ప్రశ్నపత్రాల లీక్‌పై గత నెల జూన్ 6 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేస్తున్న ఆందోళననూ, మూడు వారాలుగా కొనసాగుతున్న నిరశనలనూ మౌనంగా వీక్షిస్తూ ఉండిపోయిన ప్రభుత్వానికి సోమవారం నాటి ‘చలో సంసద్’ కళ్లు తెరిపించి ఉండాలి. అందుకే కావొచ్చు... కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఉద్యమ కార్యకర్తలను చర్చలకు పిలిచారు. అక్కడేమైంది, చివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందన్న సంగతలా ఉంచితే ముందు వినడం పాలకులు చేయాల్సిన పని. పదిహేనేళ్ల క్రితం అన్నా హజారే నిరశన మొదలెట్టినప్పుడు ఆనాటి యూపీఏ ప్రభుత్వం మొదట్లో పట్టించుకోకున్నా, ఆ తర్వాత కేంద్ర మంత్రులతో ప్రతినిధి బృందాన్ని పంపింది. దాన్ని సంపూర్ణంగా సమర్థించి, క్రియాశీలంగా పాల్గొని దేశవ్యాప్తంగా ఆ ఉద్యమానికి ఊపూ ఉత్సాహాన్నీ తీసుకొచ్చింది బీజేపీయే. అందుమూలంగా ఇతోధికంగా లాభపడింది కూడా. కానీ అదే పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు నిర్లిప్తంగా ఉండి పోవటం, సమస్యను ఇంత సంక్లిష్టం చేసుకోవటం దిగ్భ్రాంతికరం. ఈ ఆందోళనలో గాయపడిన వారిలో వందమంది వరకూ రాంమనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్సకు చేరగా వారిలో తలలు పగిలినవారూ, కాళ్లూ చేతులూ విరిగినవారూ అనేకులున్నారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అటు 118 మంది పోలీసులు గాయాలతో ఆస్పత్రుల్లో చేరారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పాలకులుగా ఎవరుండాలో ఎన్నికలు చెబితే... వారి పాలన ఎలావుందో నిరసనలు చెబుతాయి. అసమ్మతి అనేది దేశభక్తికి అత్యున్నత రూపం అంటాడు అమెరికా రాజనీతి శాస్త్ర ఆచార్యుడు హోవార్డ్ జిన్. ప్రజాస్వామ్యంలో విభేదించేందుకూ, అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకూ చోటివ్వడం ప్రభుత్వాల బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం విపక్షాల బాధ్యత కూడా. కానీ విషాదమేమంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ కర్తవ్య నిర్వహణలో విఫలమైంది. జూన్ 17న రాజస్థాన్‌లోని కోటలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకరోజు ధర్నా చేయటం మినహా చేసిందేమీ లేదు. అన్నా హజారే ఉద్యమ సమయంలో జరిగిందేమిటో గుర్తున్నా తాను చేయాల్సిందేమిటో ఆ పార్టీకి తెలిసేది. ఆ సంగతి ఆలస్యంగా గ్రహించి మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో రాహుల్, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. ఈ ఉద్యమానికి చెప్పుకోదగ్గ నాయకులంటూ ఎవరూ లేకపోవడం గమనించదగ్గది. నిరశనలో ఉన్న సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు అరెస్టుచేసి ఆస్పత్రిలో చేర్చారు. సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కేను ప్రదర్శన ప్రారంభంలోనే పోలీసులు అరెస్టు చేశారని వార్తలొచ్చాయి. కానీ దాదాపు 50,000 మంది వరకూ ఉన్న ఆందోళనకారులు గుంపులుగా విడిపోయి పార్లమెంటువైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయటం, చాలావరకూ సఫలీకృతం కావటం చిన్న విషయం కాదు. పటేల్ చౌక్, జన్‌పథ్ గేటు మెట్రో స్టేషన్ల వద్ద, అశోకా రోడ్, కన్నాట్‌ప్లేస్ సర్కిల్ వద్ద బైఠాయింపులు, మరో అయిదుచోట్ల వారిపై బాష్ప వాయు గోళాలు ప్రయోగించటం సమస్య తీవ్రతను వెల్లడిస్తుంది. హింసకూ, దౌర్జన్యానికీ దిగినవారిని నియంత్రించటాన్ని ఎవరూ ప్రశ్నించరు. కానీ ఒక్కరిని చేసి ఏడెనమండుగురు పోలీసులు లాఠీలతో మోదటం, ఆడపిల్లలని కూడా చూడకుండా హింసించటం సబబేనా? ‘మీ ఇంట్లో పిల్లలు లేరా? ఇంత దారుణంగా కొడతారా?’ అని ఒక బాలిక ప్రశ్నించటం, తన దుస్తులు చించారని మరొకామె ఆరో పించటం ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచదు. పరీక్షపత్రాలు లీకవటం, కష్టపడి చదివేవారు దగాపడటం తొలిసారి కాదు. ఏళ్లతరబడి ఇలా జరగటంవల్లే పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. ఇకనైనా విద్యార్థుల అభీష్టాన్ని వినటం, సానుకూలంగా స్పందించటం ప్రభుత్వ బాధ్యత. లేకుంటే సమస్య మరింత జటిలమవుతుంది. -
చలో సంసద్.. షాక్‌లో కాక్రోచ్ జనతా పార్టీ!
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియాను పార్టీ పదవి నుంచి తొలగించారు. దీంతో సీజేపీ నేతలకు షాక్ తగిలినట్లైంది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ మంగళవారం ‘చలో సంసద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ పిలుపుతో విద్యార్థులు, తల్లిదండ్రులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్‌మంతర్, పార్లమెంట్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. భారీగా జనసమూహం రావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి, నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సమయంలో పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియా ఢిల్లీలోని ఓ బర్గర్ అవుట్‌లెట్‌లో బర్గర్ కొనుగోలు చేసి కారులో కూర్చొని తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు నిరసనలో పాల్గొంటున్న వేళ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకులు ఇలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరికొన్ని వీడియోల్లో అతన్ని కొందరు నిలదీస్తూ, నిరసనకు మద్దతుగా నిలవకుండా బర్గర్ ఎందుకు తింటున్నారని ప్రశ్నించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.ఈ ఘటనపై స్పందించిన అభిజిత్ దీప్కే, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకే విజేత దహియాను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. जंतर मंतर पर कल छात्र लाठियां खा रहे थे, उसी वक्त CJP प्रवक्ता विजेता दहिया मॉल में जाकर बर्गर खा रहा था !! pic.twitter.com/D75L0hJlZL— Sachin Gupta (@Sachingupta) July 21, 2026 విమర్శలపై స్పందించిన విజేత దహియా మాత్రం తాను నిరసన కార్యక్రమంలో పూర్తిగా పాల్గొన్నానని, అది ముగిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లానని తెలిపారు. రెండు రోజులుగా ఉద్యమ కార్యక్రమాలతో నిద్ర లేకుండా పనిచేశానని, ఇంటికి వెళ్లే మార్గంలో ఆకలి వేయడంతో ఆహారం తీసుకున్నానని చెప్పారు. బర్గర్ తినడంలో తప్పేముంది? ఆకలి వేసింది కాబట్టి తిన్నాను. దేశం కోసం ఉద్యమం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదు’అని ఆమె పేర్కొన్నారు.కాగా, ట్రాన్స్జెండర్లపై చేసిన వ్యాఖ్యలు, మహిళల రాజకీయ అవగాహనపై చేసిన వ్యాఖ్యల కారణంగా విజేత దహియా గతంలోనూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నిరసన కార్యక్రమం సందర్భంగా వైరల్ అయిన వీడియోలతో దహియా వివాదం మరింత ముదిరి, చివరకు పార్టీ అతన్ని పదవి నుంచి తొలగించింది. -
ఐసీయూలో 21 ఏళ్ల యువతి.... దేశ ప్రజలకు CJP అభిజిత్ క్షమాపణలు
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ చేపట్టిన ‘చలో సంసద్’ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. వారిలో 21 ఏళ్ల యువతి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఢిల్లీలోని ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స పొందుతోంది. ఈ ఘటన అనంతరం గాయపడిన మద్దతుదారులను పరామర్శించిన దీప్కే.. వారిని రక్షించడంలో విఫలమైనందుకు దేశ ప్రజలకు, ముఖ్యంగా తమ పార్టీ మద్దతుదారులకు క్షమాపణలు తెలిపారు. గాయపడిన విద్యార్థులను పరామర్శించేందుకు ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లిన అభిజీత్ దీప్కే, నిరసనలో గాయపడిన మద్దతుదారులకు, ముఖ్యంగా మహిళా నిరసనకారులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. మా మద్దతుదారులందరికీ.. ముఖ్యంగా పురుష పోలీసుల చేతిలో దాడికి గురైన యువతులకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మిమ్మల్ని రక్షించడంలో మేము ఇంకా మెరుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. ఢిల్లీ పోలీసుల చర్యల నుంచి మిమ్మల్ని కాపాడలేకపోయాం. దీనికి నేను బాధ్యత వహిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.అలాగే, 20 మందికి పైగా విద్యార్థుల మరణాలకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడేందుకే ప్రభుత్వం మరికొంత మంది యువ విద్యార్థుల రక్తాన్ని చిందించడానికి కూడా సిద్ధపడింది అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాయపడిన వారు ఎవరైనా ఉంటే తనను వ్యక్తిగతంగా సంప్రదించాలని కూడా ఆయన కోరారు.సోమవారం జరిగిన నిరసనకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, సీజేపీ పిలుపుతో విద్యార్థులు, తల్లిదండ్రులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పార్లమెంట్ పరిసరాలకు చేరుకున్నారు. పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి, మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా గాయపడిన విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుండగా, నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
ఢిల్లీలో కశ్మీర్ సీఎం నిరసన
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు తక్షణమే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అధికార నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు సోమవారం ఢిల్లీలో నిరసన చేపట్టారు. రాష్ట్రహోదా పునరుద్ధరణకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే వారు ఈ నిరసన చేపట్టినప్పటికీ కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళన కారణంగా మరుగునపడి పోయింది. జమ్మూ నుంచి సీఎం ఒమర్ సోమవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నప్పటికీ జంతర్‌మంతర్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు కారణంగా నిరసన వేదిక వద్దకు చేరుకోలేకపోయారు. సాయంత్రం కాన్స్టిట్యూషన్ క్లబ్లో తలపెట్టిన రాష్ట్ర హోదాపై సదస్సును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ‘రిస్టోర్ స్టేహుడ్’అని ఉన్న జాకెట్‌తో అశోకా రోడ్లో పేమెంట్‌పై బైటాయించిన సీఎం ఒమర్ అబ్దుల్లాకు సీజేపీ నిరసనకారులు కొందరు జతకలిశారు. అక్కడ గుంపు పెద్దదవడంతో పోలీసులు టియర్ గ్యాస్‌తో వారందరినీ చెదరగొట్టారు. -
సీజేపీ నిరసన పునః ప్రారంభం
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిన్న సోమవారం రాత్రి 10:30 గంటలకు తిరిగి ప్రారంభించింది. యాథావిధిగా తమ వేదికను ఏర్పాటు చేసుకొని నిరసన కొనసాగిస్తుంది. కాగా నిన్న (సోమవారం) సీజేపీ పార్లమెంటుకు నిర్వహించిన మార్చ్ సందర్భంగా, నిరసనకారులకు, పోలీసులకు మధ్య పెద్దఎత్తున ఘర్షణలు చెలరేగాయి. దీంతో పోలీసులు సాయంత్రం 5 గంటలకు జంతర్ మంతర్‌ను ఖాళీ చేయించారు.సీజేపీ ఆందోళన హింసాత్మకంకాగా నిన్న (సోమవారం) సీజేపీ పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారింది. నిరసన కారుల దాడుల్లో ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లిందని పోలీసులు పేర్కొన్నారు. ఘర్షణల్లో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయని 20కి వాహనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. అదే విధంగా 60 మంది నిరసనకారులకు గాయాలయ్యాయని తెలిపారు.నిరసనలు ఎందుకు? దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ప్రవేశ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేశారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందనే నెపంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీన్ని ప్రభుత్వం చేసిన "అపహరణ"గా భావించిన యువత, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని నిరసనను ఉధృతం చేశారు. -
చలో సంసద్.. రణరంగం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో సంసద్ ర్యాలీ’రణరంగాన్ని తలపించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభల సాక్షిగా ఎంపీలను నిలదీసి విద్యార్థుల సమస్యలకు పరిష్కారం తేల్చుకుంటామంటూ వేలాది మంది కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు, పరీక్షార్థుల తల్లిదండ్రులు సోమవారం పార్లమెంట్ దిశగా మొదలెట్టిన ర్యాలీ చివరకు ఉద్రిక్తంగా ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నాటికే జంతర్‌మంతర్‌లోని దీక్షా స్థలికి వేలాదిగా మద్దతుదారులు, విద్యార్థులు చేరుకుని సోమవారం ఉదయం పార్లమెంట్ దిశగా ర్యాలీ మొదలుపెట్టగా పోలీసులు మొదట్లోనే అడ్డుకున్నారు. పార్లమెంట్, సెంట్రల్ విస్టా, కన్నాట్ ప్లేస్, సమీప ప్రాంతాల్లో 163వ సెక్షన్‌ను విధించారు. ర్యాలీకి అనుమతిలేనందున ఐదుగురికి మించి గుమికూడవద్దని హెచ్చరించారు. వదంతలు వ్యాపించకుండా ఉండేందుకు సెంట్రల్ ఢిల్లీ పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను కొన్ని గంటలపాటు పోలీసులు నిలిపేశారు. ఉద్యమకారులున్న చోట్ల జామర్లను ఏర్పాటుచేశారు. అయినాసరే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మరింత మంది విద్యార్థులు, కార్యకర్తలు, మద్దతుదారులు బస్సులు, ఆటోలు, బైక్‌లలో వేర్వేరు దారుల్లో పార్లమెంట్ సమీపానికి చేరుకున్నారు. స్కూల్ యూనిఫామ్‌లో పాఠశాల విద్యార్థులు మొదలు కాలేజీ స్టూడెంట్స్, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, వృద్ధులు, యోగేంద్ర యాదవ్ వంటి సామాజికవేత్తలు పెద్దసంఖ్యలో పార్లమెంట్ సమీప రోడ్లమీదకొచ్చారు. జాతీయజెండాలు చేతపట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. భారత్ మాతాకీ జై, జై భీం, వందేమాతరం, ధర్మేంద్ర ప్రధాన్ దిగిపో నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. వీళ్లు ముందుకెళ్లకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచారు. వాటినీ ఆందోళనకారులు తొలగించారు. దీంతో వీళ్లను అదుపుచేయడం కోసం పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురు తీవ్రస్థాయిలో గాయపడ్డారు. పార్లమెంట్ స్ట్రీట్, పటేల్ చౌక్, కాన్స్టిట్యూషన్ క్లబ్, శాస్త్రీ భవన్, రైల్ భవన్ సమీప ప్రాంతాల్లో జనాన్ని చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలు సైతం ప్రయోగించారు. పోలీసులు ఇష్టమొచ్చినట్లు చితకబాదుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తోటి కార్యకర్తలను కొడుతున్నాసరే ఇంకొందరు అలాగే రోడ్డు మీద బైఠాయించి ‘కొట్టండి సార్ కొట్టండి’అని తమ తీవ్రస్థాయి నిరసన తెలపడం ఒక వీడియోలో కన్పించింది. ‘‘పోలీసులు కొందరి తల పగలగొట్టారు. కిందపడ్డ విద్యార్థులనూ వదల్లేదు’’అని 55 ఏళ్ల హెలెన్ అనే మహిళ తెలిపారు. గాయపడిన వారిని తోటి విద్యార్థులు హుటాహుటిన సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు. అయితే విద్యార్థుల నుంచి సైతం పోలీసులు తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదుర్కొన్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. ఈ తోపులాటలో 118 మంది పోలీసులు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. తమపై జనం రాళ్లు రువ్వడంతోనే లాఠీచార్జ్ చేయాల్సివచ్చిందని పోలీసులు తమ చర్యను సమరి్థంచుకున్నారు. ఈ ఘటనలో 100కుపైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత అందర్నీ విడిచిపెట్టే ఆస్కారముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే సమీప రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65 మెడికో లీగల్ కేసులు నమోదయ్యాయి. ర్యాలీలో లద్దాఖ్ సామాజికవేత్త, నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలిని పోలీసులు జుట్టు పట్టుకుని లాగి కొట్టారని వచ్చిన వార్త అవాస్తవమని ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ స్పష్టం చేశారు.మా డిమాండ్లు నెరవేర్చండి నడ్డాతో సీజేపీ ప్రతినిధుల చర్చలు విన్నపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి న్యూఢిల్లీ: దాదాపు మూడు వారాలుగా దీక్షపర్వంలో మునిగిపోయిన సీజేపీ కార్యకర్తలకు తొలిసారిగా ప్రభుత్వం నుంచి పిలుపొచ్చింది. దీంతో సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు సోమవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రధాన డిమాండ్లను మంత్రికి వెల్లడించారు. ‘‘ఎలాంటి షరతుల్లేకుండా ఆస్పత్రి నుంచి సోనమ్ వాంగ్చుక్ను విడుదలచేయాలి. ఆయన ఒక వీడియో సందేశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు అనుమతించాలి. ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ పదవి నుంచి తప్పించాలి లేదా ఆయనతో రాజీనామా చేయించాలి. నీట్–యూజీ,2026 ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో తీవ్ర నిరాశతో బలవన్మరణాలకు పాల్పడిన పరీక్షార్థులకు తలో రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం తక్షణం ప్రకటించాలి. దీక్షాస్థలిని నాశనంచేసిన పోలీసులు ఇకపై కార్యకర్తల జోలికి వెళ్లకూడదు. శాంతియుత నిరసనను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేసేందుకు యత్నించకూడదు’’అని నడ్డాకు అందజేసిన లేఖలో సీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు. సీజేపీ డిమాండ్లపై ప్రభుత్వ నాయకత్వం అంతర్గతంగా చర్చించేలా చేస్తానని ప్రతినిధులకు నడ్డా హామీ ఇచ్చారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని తర్వాత నడ్డా మీడియాతో చెప్పారు. ‘‘మా షరతులను నడ్డాకు తెలిపాం. వీటిని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన మాకు హామీ ఇచ్చారు’’అని తర్వాత అశుతోష్ రంకా తెలిపారు. సోమవారం ఉదయం 11.50 గంటలకు సీజేపీ ప్రతినిధులతో ఫోన్లో మంతనాలు జరిపామని, సాయంత్రం వాళ్లు స్వయంగా వచ్చి మెమోరాండం సమర్పించారని నడ్డా చెప్పారు. ఇప్పటికే ఈ మూడు డిమాండ్లపై ప్రభుత్వ పెద్దలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీక్ష కొనసాగిస్తా వాంగ్‌చుక్ సంసద్ ర్యాలీలో పాల్గొనేందుకు తనను డిశ్చార్జ్ చేయాలని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు సోనమ్ వాంగ్‌చుక్ ఒక లేఖ రాశారు. ఆస్పత్రిలో తన ఆరోగ్యం బాగానే ఉందని, నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు పంపించాలని కోరారు. తాను నిరాహార దీక్షను విరమించాలంటే ప్రభుత్వం మూడు షరతుల్ని ఒప్పుకోవాలని చెప్పారు. ‘‘పేపర్ లీకేజీ ఉదంతాలకు తమదే బాధ్యత అని ప్రభుత్వం తన తప్పు ఒప్పుకోవాలి. లేదంటే ర్యాలీగా పార్లమెంట్‌కు వచ్చిన సీజేపీ నాయకులతో ఉభయసభల ఎంపీలు మాట్లాడి ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తామని వెంటనే హామీ ఇవ్వాలి. లేదంటే అధికార కూటమి ఎంపీలు ఆస్పత్రికి వచ్చి ఇదే అంశంపై నాకు స్వయంగా హామీ ఇవ్వాలి’’అని వాంగ్‌చుక్ ఒక టిష్యూపేపర్ మీద షరతులు రాసి ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. కానీ ర్యాలీలో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన కారణంగా తన దీక్షను ఇకమీదటా కొనసాగించాలని ఆయన ఆ తర్వాత నిర్ణయించుకున్నారు.దీప్కేను నిర్బంధించిన పోలీసులు! దీక్షా స్థలి నుంచి సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ ఆరోపించారు. సోమవారం సాయంత్రంకల్లా దీక్షా స్థలిలోని టెంట్లు, మైకులు, కార్పెట్లు, బ్యానర్లు, జెండాలను పోలీసులు తొలగించారు. అటువైపు ఎవరూ రాకుండా జంతర్‌మంతర్ వద్ద రోడ్డుకు రెండు వైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. దీంతో దాదాపు 1,000 మంది ఉద్యమకారులు కొంతదూరంలోనే నిలిచిపోయారు. సమీపంలోని కేరళ హౌస్ సమీపంలో భైఠాయించి ఇక్కడి నుంచే ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. అయితే దీప్కేను అరెస్ట్చేశామన్న వార్తల్లో నిజంలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. -
‘మైక్ ఆగిపోతే అది..’.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!
సహారన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో జరిగిన బహిరంగ సభలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై, విపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో మైక్ తరచూ ఆగిపోవడంతో, సౌండ్ ఆపరేటర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.సౌండ్ సిస్టమ్ నిర్వహించే వ్యక్తి బీజేపీకి ‘బీ’ టీమ్ అని, సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుదారుడని ఆయన చమత్కరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, గొంతు నొక్కాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఒవైసీ అన్నారు. సంభల్ వివాదం, అయోధ్య వ్యవహారాలు, మసీదులు, రాంపూర్ జోహార్ విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం ఓటు బ్యాంకుగా ముస్లింలను వాడుకుంటున్నారే తప్ప, వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో విపక్షాలు విఫలమయ్యాయని ఆరోపించారు.రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, పేపర్ లీక్ ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. భాగస్వామ్య రాజకీయాల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్న ఆయన, బీజేపీని ఓడించేందుకు ఎన్నికలకు ముందే పొత్తులకు సిద్ధమని ప్రకటించారు. ముస్లింలు తమ స్వంత రాజకీయ నాయకత్వాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. -
కాక్రోచ్ Vs పోలీస్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ కట్..
-
సోనమ్ వాంగ్చుక్కు కొండంత అండగా..
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా.. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో నిన్న (శనివారం) ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.. ఆయన నిరసనలో గీతాంజలి జె ఆంగ్మో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూడు వారాలుగా నిరాహార దీక్ష చేసిన వాంగ్చుక్కు ఆమె నిరంతరం అండగా నిలిచారు. వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన ఆశయాల కోసం ఆమె ముందుండి పోరాడుతున్నారు.గీతాంజలి జె ఆంగ్మో ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. సోనమ్ వాంగ్‌చుక్ గతంలో రెబెక్కా నార్మన్ అనే అమెరికన్ మహిళను వివాహం చేసుకోగా.. గీతాంజలి ఆయనకు రెండవ భార్య. ఆమె సామాజిక పారిశ్రామికవేత్త, విద్యావేత్త. సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి ఆమె స్థాపించిన 'హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లడఖ్' కో-ఫౌండర్‌గా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె హెచ్ఐఏఎల్ సంస్థకు వ్యవస్థాపక సీఈఓ, డీన్‌గా వ్యవహరిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, పర్యావరణ అనుకూల క్యాంపస్‌ల నిర్మాణం, సోలార్ హీటెడ్ భవనాల రూపకల్పన వంటి వాటిపై ఈ సంస్థ పనిచేస్తుంది. 2021లో భారత సైన్యం కోసం ప్రత్యేకంగా సోలార్ హీటెడ్ టెంట్లను కూడా ఈ సంస్థ అభివృద్ధి చేసింది.ఒడిశాలోని బాలాసోర్‌లోని ఓ పంజాబీ కుటుంబంలో జన్మించిన గీతాంజలి.. ఫకీర్ మోహన్ యూనివర్సిటీ నుండి ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్, భువనేశ్వర్‌లోని ప్రముఖ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. డెన్మార్క్‌తో పాటు విదేశాల్లో దాదాపు 15 ఏళ్ల పాటు కార్పొరేట్ రంగంలో పనిచేసిన ఆమె.. ఆ తర్వాత భారత్‌కి తిరిగి వచ్చి పారిశ్రామికవేత్తగా మారారు. పూషన్, షాంఘై పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హెలియోస్ బుక్స్ వంటి పలు సంస్థలను స్థాపించారు.గీతాంజలి కేవలం విద్యావేత్త మాత్రమే కాదు.. వేదాంతం, భగవద్గీత బోధించే ఆధ్యాత్మిక అన్వేషకురాలు. ప్రతిష్టాత్మక 'చెవెనింగ్ ఫెలో' అయిన ఆమె, భారత ప్రభుత్వం నుండి 'వుమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా' జాతీయ అవార్డును అందుకున్నారు. వీటితో పాటు ఆమె కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఒడిస్సీ, రష్యన్ బ్యాలెట్ నృత్యాలలో ప్రవేశం ఉంది. నాకంటూ ఒక స్వార్థ జీవితం కాకుండా.. సమాజం కోసం ఒక గొప్ప ఆశయంతో బతకాలని అనుకున్నాను. ఒక విద్యా సదస్సులో సోనమ్ వాంగ్చుక్ను కలిసినప్పుడు నా ఆలోచనలకు తగ్గ తోడు దొరికిందనిపించిందంటూ ఆమె గతంలో ఇంటర్వ్యూలో తెలిపారు. సాధారణంగా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసే గీతాంజలి.. భర్తకు కష్టం వచ్చిన ప్రతిసారీ కొండంత అండగా నిలబడ్డారు. గత ఏడాది లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్‌తో జరిగిన నిరసనల సమయంలో నలుగురు మరణించగా.. వాంగ్చుక్ను ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధించిన సంగతి తెలిసిందే.ఆ కష్టకాలంలో గీతాంజలి సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాష్ట్రపతి జోక్యాన్ని కోరుతూ లేఖ రాశారు. దాదాపు 170 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత వాంగ్‌చుక్ విడుదలయ్యారు. ఐదు నెలల పాటు వారానికి రెండు సార్లు కేవలం 60 నిమిషాల ములాఖత్ కోసం ఆమె పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీ నిరసనల్లో కూడా ఆమె భర్త ఆశయాన్ని భుజానకెత్తుకున్నారు.ఆసుపత్రిలో ఉన్నప్పటికీ తన భర్త దీక్షను విరమించలేదని.. కేవలం ఉప్పు, నీరు మినహా మరేమీ తీసుకోవడం లేదని గీతాంజలి స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు లేదా ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్యుల అనుమతి లేకుండా ఆయనకు ఎలాంటి ద్రవాలను ఇవ్వకూడదని ఆమె నొక్కి చెప్పారు. అంతేకాకుండా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం చేపట్టే పార్లమెంట్ మార్చ్‌కు తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఒకవేళ సోనమ్ వాంగ్‌చుక్ ఈ మార్చ్‌లో పాల్గొనలేకపోతే.. ఆయనకు ప్రతినిధిగా నేనే ముందుండి దీనిని నడిపిస్తానంటూ ఆమె తేల్చి చెప్పారు. -
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఆస్పత్రికి తరలించిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్షకు దిగాడు. “మా ఉద్యమం ఆగదు.. పోరాటం కొనసాగుతుంది” అంటూ ఆయన ప్రకటించారు.నీట్ పరీక్షలో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జూన్ 20వ తేదీ నుంచి నిరసనలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్‌చుక్ జంతర్ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శనివారం నాటికి 21వ రోజుకు చేరుకుంది.దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకే ఈ చర్య తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ చర్యపై CJP నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాంగ్‌చుక్ శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు బలవంతంగా తరలించారని ఆరోపించారు.‘ఉద్యమం ఆగదు’.. దీక్షకు దిగిన అభిజిత్వాంగ్చుక్ తరలింపును వ్యతిరేకిస్తూ CJP చీఫ్ అభిజిత్ దీప్కే స్వయంగా నిరాహార దీక్ష ప్రారంభించాడు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘మా ఉద్యమం ఆగదు. ఈ పోరాటం కొనసాగుతుంది. ఎల్లుండి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించి తీరతాం. మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేదాకా ఇక్కడి నుంచి కదలం’’ అని అభిజిత్ దీప్కే ప్రకటించాడు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచాలని, నీట్ వివాదంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశాడు.పోలీసులపై ఆరోపణలుఇంతకుముందు కూడా అభిజిత్ దీప్కే పోలీసులపై ఆరోపణలు చేశారు. జంతర్ మంతర్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో తనపై పోలీసులు దాడి చేశారని, తనను కొట్టి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. “నన్ను కొట్టారు.. సోనం సర్‌ను బలవంతంగా తీసుకెళ్లారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ధ్రువీకరించలేదు.పోలీసుల వివరణమరోవైపు ఢిల్లీ పోలీసులు మాత్రం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఆస్పత్రికి తరలించామని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడమే తమ ఉద్దేశమని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం వాంగ్‌చుక్ ప్రస్తుతం స్పృహలో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.జంతర్ మంతర్ వద్ద..వాంగ్‌చుక్ ఆస్పత్రికి తరలింపు అనంతరం నిరసనకారులను జంతర్ మంతర్ నుంచి ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. దీంతో కొంతసేపు అక్కడ వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.నీట్ పరీక్షలో అవకతవకలు, పరీక్షల నిర్వహణలో లోపాలపై న్యాయ విచారణ జరపాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని CJP డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. సోనం వాంగ్‌చుక్ దీక్ష, పోలీసుల చర్య, అభిజిత్ దీప్కే తాజా నిరసనతో జంతర్ మంతర్ పరిణామాలు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. -
గురుకులంలో వసతుల కోసం బాలికల ధర్నా
కొత్తగూడ: ‘అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయి. నెల రోజులుగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏదైనా రిపేర్లు చేయాల్సి వస్తే మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. దీంతో గత్యంతరం లేక రోడ్డెక్కాం’అంటూ మహబూ బాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని గాందీనగర్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులు వాపోయారు. గురుకులంలో వసతులు కల్పించాలని గురువారం నాడు గురుకులం గేటు ముందు ధర్నాకు దిగారు.బాలికల ఆవేదన: గురుకులంలో కనీస వసతులు కూడా లేవని, నలుగురు విద్యార్థులు దుప్పట్లను తెరలాగ అడ్డు పట్టుకుంటే వాటి చాటున మిగతా విద్యార్థులు దుస్తులు మార్చుకుంటున్నామని చెబుతూ బాలికలు కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రూప్సింగ్ బాలికలకు ధైర్యం చెప్పి రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో మాట్లాడించారు. వారి బాధలను విన్న సీతక్క ‘ఇంత వరకు ఈ విషయం తెలియదని, యుద్ధ ప్రాతిపదికన వసతులు కల్పిస్తామ’ని హమీ ఇచ్చారు. సీతక్క హమీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. మంత్రి ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాఠశాల మరమ్మతులు మొదలుపెట్టారు. పనులు పూర్తయ్యే వరకు విద్యార్థులకు ఐదు రోజుల హోమ్‌సిక్ సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిని్పపాల్ కల్పన, తనిఖీలు చేయనందున గిరిజన సంక్షేమశాఖ జిల్లా కో ఆర్డినేటర్ అశోక్ పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
POK.. ఆజాద్ కాదు.. ఆక్రమిత కశ్మీర్.. భగ్గుమన్న పాకిస్థాన్
ఇస్లామాబాద్: తాను తీసిన గొయ్యిలో తానే పడుతాడు అని సొమెత మన వాడుక భాషలో బాగ వాడుతుంటాం.. ఈ పదం ఇప్పుడు పాకిస్థాన్‌కు సరిగ్గా సరిపోతుంది. భారత్‌పై దురాక్రమణ చేసి భూమిని స్వాధీనం చేసుకొని దానిని ఆజాద్ కశ్మీర్ అంటూ తప్పుడు ప్రచారాలు చేసిన పాక్ ఇప్పుడు ఆప్రాంత ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తోంది. పీవోకేలో జరుగుతున్న నిరసనలను నియంత్రించడం ఇప్పుడు ఆ దేశానికి తలకు మించిన పనిగా మారింది. దీంతో వారిని కంట్రోల్ చేయలేక ఆ దేశం తలపట్టుకుంటుంది."పాక్ ఆక్రమిత కశ్మీర్" ఈ పేరు వింటే చాలు ప్రతి భారతీయుని గుండె రగులుతుంది. మన దేశానికి ఏ విధంగా సరితూగని దాయాది పాకిస్థాన్... అక్రమణ జరిపి తన దేశ నియంత్రణలో ఉంచుకున్న ప్రాంతం ఇది.. ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్‌కు అంత కష్టమైన పని కాకపోయినా అంతర్జాతీయ ఒత్తిడి దృష్ట్యా మౌనంగా ఉండాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం ప్రజలే ఆ దేశానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఇటీవల జరిగిన నిరసనలు తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకతతో నిరసనలు చేస్తున్న ప్రజలపై అధికారులు ఇష్టారీతిన కాల్పులు జరిపారు. ఈ ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల తిరుగుబాటును అణిచివేయడం ఇప్పుడు ఆ దేశానికి పెద్దసమస్యగా మారింది. గత 78 ఏళ్లుగా ఇది ఆజాద్ కశ్మీర్ అని పాకిస్థాన్ చెబుతోందని కానీ ఇది ఆజాద్ కశ్మీర్ కాదని ఆక్రమిత కశ్మీర్ అని అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారత చెప్పింది అదే..!PoKలో జరిగిన నిరసనలకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అందుకు సంబంధించిన ఒక వీడియోలో JAAC నాయకుడు మాట్లాడుతూ "గత 78 సంవత్సరాలుగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌ను 'ఆజాద్ కాశ్మీర్' అని పిలుస్తోంది. కానీ ఇప్పుడు 80,000 మందికి పైగా హాజరైన ఒక ర్యాలీలో PoK ప్రజలు ఈ వాదనను సవాలు చేశారు. కశ్మీర్ వివాదాస్పద భూభాగం కాదు. అది ఆక్రమిత భూభాగం. దానికి ఎన్నడూ స్వాతంత్ర్యం లేదు. గత 78 ఏళ్లుగా భారత్ ఇదే చెబుతుండగా, పాకిస్థాన్ దానిని ప్రచారం అని కొట్టిపారేస్తోంది. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలే తమ ర్యాలీలలో అదే విషయాన్ని చెబుతున్నారు. అని వీడియోలో మాట్లాడుతున్నారు.ప్రస్తుతం జరుగుతున్న రావల్ కోట్ ర్యాలీలో 80 వేల మందికి పైగా పాల్గొన్నారు. మరి ఈ విషయంపై పాక్ ఏం చేస్తోంది. ఈ ఎనబై వేల మందిని సైతం భారత్ పంపిందని ప్రచారం చేస్తోందా అని అక్కడి నాయకులు నిలదీశారు. ఈ నిరసనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. PoKలోని ప్రజల ఆగ్రహం ఆకస్మికంగా తలెత్తినది కాదని, ఇది పాకిస్తాన్ సంవత్సరాలుగా సాగిస్తున్న దోపిడీ, హక్కుల ఉల్లంఘనలు, అక్రమ ఆక్రమణల ఫలితమేనని తెలిపింది.Pakistan has spent 78 years calling PoJK "Azad Kashmir." 🇮🇳The people of PoJK just corrected that in front of 80,000 people.JAAC leader Sardar Aman Khan said it straight."Kashmir is not disputed territory. It is occupied territory. And it was never truly Azad."India has… pic.twitter.com/jb50aHVSQE— Aviator Anil Chopra (@Chopsyturvey) July 15, 2026 -
చంద్రన్న బోడిగుండు పథకం!
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ ఉద్యోగుల కోసం చంద్రన్న బోడిగుండు పథకాన్ని అమలు చేస్తున్నారు’ అని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కే వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారికి రెగ్యులర్‌గా రావాల్సిన డీఏలు, ఐఆర్, పీఆర్సీ వంటివి కూడా ఇవ్వకుండా ఉద్యోగులు అందరికీ నున్నగా క్షవరం చేసే కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు బోడిగుండు పథకం అమలు చేస్తున్నారంటూ వెంకట్రామిరెడ్డి సహా మరో ఇద్దరు నేతలు అందరిముందర గుండ్లు చేయించుకున్నారు. ఉద్యోగులు కోల్పోయింది రూ. 37 వేల కోట్లకు పైమాటే..ప్రతినెలా ఉద్యోగులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్న క్షవరం విలువ అక్షరాలా రూ.1500 కోట్లని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో ఉద్యోగులకు చేసిన మొత్తం క్షవరం విలువ సుమారు రూ.37 వేల కోట్లని చెప్పారు. ఇవి తాను ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం చెప్పడంలేదని, పూర్తి లెక్కలు ఇస్తున్నానని చెప్పి ఆ వివరాలు విడుదల చేశారు. ఈ రూ.37 వేల కోట్లు కేవలం కూటమి రెండు సంవత్సరాల పాలనకు సంబంధించిన బకాయిలు, ఎగవేతలు మాత్రమేనన్నారు. ఉద్యోగులను ఈ స్థాయిలో ముంచిన ఘనత గతంలో ఎవరికీ లేదన్నారు. అమరావతికి సోకులు.. తుగ్లక్ పాలనకు నిదర్శనం..ఉద్యోగులకు రూ.37 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా అమరావతిలోని భవనాల సోకులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుడుతున్నారని తెలిపారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల ముందు పక్క బిగించే అద్దాల కోసం రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోందని, చదరపు అడుగుకు అద్దాల కోసం రూ.5 వేలు ఖర్చు పెడుతోందన్నారు. ఈ భవనాల నిర్మాణం సోకులు, అన్నీ కలిపి చదరపు అడుగుకి రూ.20 వేల ఖర్చు పెడుతున్నారని తెలిపారు. ఒక పక్క ఉద్యోగులకు వేల కోట్ల రూపాయిలు బకాయిలు పెట్టి, అమరావతిలో సోకులకు రూ.వేల కోట్లు ఖర్చు బెట్టడం తుగ్లక్ పాలన కాదా అని ప్రశ్నించారు. ఆర్థికేతర అంశాల్లో ప్రభుత్వం ఉద్యోగులపై సానుకూలంగా లేదన్నారు. ఆత్మహత్యలే మేలనుకుంటున్నారు..ప్రభుత్వం పెట్టే టార్చర్ భరించలేక గత జూన్ నెలలో 10 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు, గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. మరో ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేయలేమంటూ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వారు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు.ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి రాజరికపు కాలం నాటి బానిసల కంటే హీనంగా ఉందని, వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేవని అయినా అడిగే దిక్కు లేదన్నారు. గత ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు పెట్టి ఉద్యోగుల సమస్యలు వినేదని, ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు వినే వారు కూడా లేరన్నారు. ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు సరిగా స్పందించడం లేదన్నారు. -
ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నిరసన మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే అసంతృప్తితో.. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. సోమవారం నగరంలో ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.రెండేళ్లు దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఫెడరేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి గుండు చేయించుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు కూడా ఇదే తరహాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా.. బాబు సర్కార్‌పై వాళ్లు ఆగ్రహం వ్యకక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని ఫెడరేషన్ ఆరోపించింది. పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఐఆర్ విషయంలోనూ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసిందని నేతలు విమర్శించారు. సరెండర్ లీవ్‌లకు సంబంధించిన చెల్లింపులు కూడా నిలిచిపోయాయని ఆరోపించారు.నెలకు రూ.1500 కోట్లు క్షవరం.. ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఫెడరేషన్ నేతలు మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1500 కోట్ల మేర ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలు ఉద్యోగులకు కూడా పూర్తిగా తెలియకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని(క్షవరం చేస్తోందని) విమర్శించారు.వలంటీర్ల హామీలపైనా ప్రశ్నలుఉద్యోగులతో పాటు వలంటీర్లకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఫెడరేషన్ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో నిర్వహించిన ఈ నిరసన రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
నేపాల్ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్
ఖాట్మండు: నేపాల్ మరోసారి అట్టుడుకుతుంది. ప్రధానమంత్రి బాలేంద్ర షా రాజీనామా చేయాలని డిమాండ్లతో యువత పెద్దఎత్తున రోడ్లెక్కారు. దేశంలో నిరుద్యోగం పెద్దఎత్తున పెరిగిపోయిందని నిరసనలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో గత మూడు రోజుల్లో ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యకు యత్నించగా వారిలో ఇద్దరు మరణించారు.నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ఎన్నిక కావడానికి ప్రధాన కారణం అక్కడి జెన్‌జీ ఉద్యమం.. సెప్టెంబర్ 2025లో నాటి కె.పి. శర్మ ఓలి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడం, అవినీతికి పాల్పడటంపై నేపాల్ యువత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసింది. ఈ ప్రజాస్వామ్య ఉద్యమానికి బాలేంద్ర షా వెన్నుదన్నుగా నిలిచారు. ఆ నిరసనల వేడి పాత ప్రభుత్వాన్ని కూల్చేయడమే కాకుండా, యువత అంతా ఆయన వెనుక సమీకృతమమయ్యారు. దీంతో బాలేంద్రషా నేతృత్వంలోని నేపాల్ పార్లమెంట్లో ఉన్న మొత్తం 275 స్థానాల్లో ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఏకంగా 182 సీట్లు గెలుచుకుంది. ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు.అయితే ప్రధానిగా బాలేంద్ర ఆరు నెలలైనా కాకముందే నేపాల్‌లో యువత ఆయనపై పెద్దఎత్తున తిరుగుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ పెద్దఎత్తున యువత రోడ్లెక్కారు. ఆయన రాజీమామా చేయాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకోని ఆత్మహత్య యత్నం చేయగా అందులో ఇద్దరు మరణించారు.దీంతో ప్రధానమంత్రి ప్రజావ్యతిరేకంగా, నిరంకుశంగా పరిపాలిస్తున్నారని జెన్-జి నేపాల్ సంస్థ ఆరోపించింది. యువత ఉపాధి, ఆదాయాన్ని పెంచేందుకు బడ్జెట్, విధానాలు పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని యువతలో ఆశ, విశ్వాసం నింపడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ఆరోపించింది. -
నిలబెట్టుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?.... ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
-
డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు కనీసవేతనం రూ. 26 వేలతో పాటు పెన్షన్, వైద్యసదుపాయం కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. ఈ రోజు (శుక్రవారం) జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టారు. విశాఖ జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేపట్టారు.రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలుకర్నూలు కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రకటించిన విధంగా జీతాన్ని వెంటనే పెంచి కార్యకర్తలపై రాజకీయ వేధింపులను ఆపాలని కోరారు. ప్రస్తుతం వాడుతున్న నవచేతన యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.తిరుపతిలో జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరసన చేపట్టారు.సీ.ఐ.టీ.యు నేత కందారపు మురళి నేతృత్వంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వేలాది మంది అంగన్వాడి వర్కర్లు తో రిలే నిరాహారదీక్ష చేపట్టారు.అంగన్వాడి వర్కర్ లకు ఈ.ఎస్. ఐ, పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాలు అంగన్వాడి వర్కర్ లకు అందించాలన్నారు.కాగా ప్రభుత్వం అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలతో పాటు పెన్షన్, PF, ESI సౌకర్యాలు కల్పించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టారు. పేద గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు సేవలంధిస్తున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనలకు పిలుపిచ్చారు.ప్రస్తుతం రాష్ట్రంలో 55,607 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 48,770 మినీ కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన డిమాండ్లు ● సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అంగన్వాడీలకు రూ.26 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ సౌకర్యాలు కల్పించాలి.● అంగన్వాడీల వేతనాలను పీఆర్సీకి అనుసంధానం చేయడంతో పాటు, గుజరాత్ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా జీతాలు పెంచాలి.● మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. హెల్పర్ల ప్రమోషన్‌కు 5 ఏళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలి.● అంగన్వాడీలకు ‘తల్లికి వందనం’ సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి.● సిగ్నల్ సమస్యలతో తీవ్ర ఇబ్బంది పెడుతున్న ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) ఫేస్ యాప్‌ను, పనిభారం పెంచే నవచేతన యాప్‌ను తక్షణమే రద్దు చేయాలి. పెండింగ్‌లో ఉన్న టీఏ, మెయింటినెన్స్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. -
పొగాకు రైతుల పొట్టకొడుతున్నా పట్టదా?
జంగారెడ్డిగూడెం: వ్యాపారులు సిండికేట్‌గా మారి పొగాకు ధరను తగ్గించేసి రైతుల పొట్టకొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులు నిరసన మహాదీక్ష చేపట్టారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల రైతు సంఘాలు, వైఎస్సార్సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు నాయకత్వంలో రైతులు సుమారు 800 ట్రాక్టర్లు, కార్లు, బైకులతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతులు రోడ్డుపై పొగాకును దహనం చేశారు. అనంతరం బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ... కేజీ పొగాకు ఈ ఏడాది రూ.260కి పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వర్జీనియా పొగాకుకు కనీస మద్దతు ధర కేజీకి రూ.300 ప్రకటించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతులకు కేంద్రం రూ.1,000 కోట్ల నిధులు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
డీఎస్సీ పోస్టులు అక్రమార్కులకు కట్టబెట్టారు
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం డీఎస్సీ–2025లో టీచర్ పోస్టులను అక్రమార్కులకు కట్టబెట్టి అర్హులకు తీవ్ర అన్యాయం చేసిందని అర్హత ఉన్నా ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడితే అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రశ్నిస్తే జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. డీఎస్సీలో అర్హత సాధించినప్పటికీ, ఉద్యోగాలు రాని బాధిత అభ్యర్థులు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన దివ్యాంగుడు గెరివి అంజినప్ప, అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఉడదల ప్రభావతి సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.వీరికి ఇతర డీఎస్సీ అభ్యర్థులు, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మద్దతు పలికారు. తమకు న్యాయం చేసి, ఉద్యోగాలు ఇవ్వాలని బాధిత డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. పేదలకు, అర్హులకు న్యాయం చేయలేనప్పుడు మంత్రి పదవి ఎందుకు అని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నించారు.డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని, ఉద్యోగాలను పప్పు బెల్లాల్లా అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో అర్హులైన ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, న్యాయం కోసం నిలబడితే జైళ్లకు పంపడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభావతి సోదరుడు, టీడీపీ కార్యకర్త ఉడదల శివ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు హెచ్.వసంత్ కుమార్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, దివ్యాంగ విభాగం అనంతపురం జిల్లా కార్యదర్శి బోయ రాజేష్ తదితరులు ప్రసంగించారు.నేను ఫేక్ కాదు.. నిరూపిస్తా పది నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయా. నా ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చా. దివ్యాంగుడినైన నాకు విద్యాశాఖ మంత్రి లోకేశ్, అధికారులు చాలా అన్యాయం చేశారు. ఐఏఎస్ అధికారులంతా నేను ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. నా దగ్గర ఉన్న ఆధారాలతో ఎక్కడికి రమ్మన్నా వచ్చి నిరూపిస్తా. మరి అసలు అర్హతే లేని కురువ శ్రీనివాసులుకు ఉద్యోగం ఎలా ఇచ్చారు? మంత్రి లోకేశ్‌ను కలిసినా న్యాయం జరగలేదు. కొందరు అధికారులు కోర్టులకు కూడా తప్పుడు సమాచారం పంపుతున్నారు. – గెరివి అంజినప్ప, దివ్యాంగుడు, డీఎస్సీ బాధితుడు, సత్యసాయి జిల్లాడీఎస్సీలో 130వ ర్యాంకు వచ్చినా... నాకు డీఎస్సీలో 130వ ర్యాంకు వచ్చింది. గెరివి అంజినప్పది పీహెచ్ కోటాలో ఉద్యోగం పోయినందువల్ల హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల నా ఉద్యోగం పోయిందని చెప్పారు. కానీ అది బీసీ–ఏ కోటా. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల కాదు అధికారుల మోసం వల్లే పోయిందని సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం. మా కుటుంబమంతా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశాం. మంత్రి లోకేశ్‌ను మూడుసార్లు కలిశాం. భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డిని కలిస్తే నాలుగు రోజులు ఆగండి జాబ్స్ ఇప్పిస్తామన్నారు. మాకు అర్హత ఉందని అందరికీ తెలిసినా, మేము ఫేక్ అని మాట్లాడుతున్నారు. – ఉడదల ప్రభావతి, డీఎస్సీ అభ్యర్థని, గుంతకల్లు -
ఏపీవ్యాప్తంగా ఆక్వా రైతుల బంద్
సాక్షి, ఏలూరు జిల్లా: ఏపీవ్యాప్తంగా ఆక్వా రైతుల బంద్ కొనసాగుతోంది. ఆక్వా కార్యకలాపాలను రైతులు నిలిపివేశారు. ఆక్వా ఫీడ్ డీలర్లు, షాపుల యాజమానులు రైతులకు మద్దతు ఇచ్చారు. రైతులతో పాటు బంద్‌లో ఆక్వా డీలర్లు పాల్గొన్నారు. ఆక్వా ఫీడ్ ధరలు భారీగా పెంచడంపై రైతులు నిరసనలు. ఆచంట, ఉండి, పాలకొల్లు, నరసాపురంలో ఆక్వాఫీడ్ షాపులను మూసివేశారు.కూటమి సర్కార్.. ఆక్వా రైతుల సమస్యలను పట్టించుకోకపోవడ, ఆక్వా సిండికెట్ ఫీడ్ ధరలు భారీగా పెంచడంపై నిరసిస్తూ ఏపీ ఆక్వా రైతు సంఘం బంద్‌కు పిలుపునిచ్చింది. టన్ను మేతకు అదనంగా రూ.10 వేల నుండి రూ.12 వేలు పెంచడంపై ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్య ధర కూడా తగ్గించేయడంతో ధరల స్థిరీకరణ చేయాలంటూ రైతుల డిమాండ్ చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ దీక్ష.. జేసీ కుట్ర.. తాడిపత్రిలో హైటెన్షన్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి హింసాత్మక రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తాడిపత్రికి తరలిరావాలని ఆయన కోరారు.ఈ నేపథ్యంలో.. అనంతపురం అర్బన్, శింగనమల, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తాడిపత్రికి బయలుదేరారు. భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చెబుతున్నారు. అయితే వైఎస్సార్సీపీ మాత్రం పోలీసుల తీరుపై మండిపడుతోంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యాలకు పోలీసులు సహకరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. తమ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అయినప్పటికీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దీక్షను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. -
బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ఆందోళన.. జై శ్రీరామ్ నినాదాలు
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వేలాది మంది హిందువులు, విద్యార్థులు, సామాజిక సంస్థల ప్రతినిధులు భారీ నిరసనకు దిగారు. ఉత్తర బంగ్లాదేశ్‌లోని గైబాంధా జిల్లాలో శ్రీరాముడి చిత్రాన్ని అవమానించారన్న ఆరోపణలు, అలాగే నిర్మాణంలో ఉన్న భారీ శ్రీరామ విగ్రహ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆందోళనలు చేపట్టారు. నిరసనల సందర్భంగా ఢాకా వీధులు "జై శ్రీరామ్" నినాదాలతో మార్మోగాయి.అసలు వివాదం ఏమిటి?గైబాంధా జిల్లాలోని పలాష్‌బారి ప్రాంతంలో సుమారు 81 అడుగుల ఎత్తుతో శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దీనిని బంగ్లాదేశ్‌లోనే అతిపెద్ద శ్రీరామ విగ్రహంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టును కొందరు ఇస్లామిక్ సంస్థలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఒక ప్రదర్శనలో శ్రీరాముడి చిత్రాన్ని చెప్పులతో కొట్టినట్లు, అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.Massive protests in Dhaka yesterday saw Bangladeshi Hindus call for justice over the desecration of Bhagwan Shri Ram's image by Islamists and seek the continuation of the halted 81-foot Ram murti project in Gaibandha. pic.twitter.com/za4vFu6c2y— Megh Updates 🚨™ (@MeghUpdates) June 20, 2026వీధుల్లోకి వేలాది మందిఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు తొలుత టార్చ్‌లైట్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హిందూ విద్యార్థి సంఘాలు, మైనారిటీ హక్కుల సంస్థలు, సామాజిక సంఘాల పిలుపుతో షాహ్‌బాగ్ ప్రాంతంలో భారీ నిరసన జరిగింది. నిరసనకారులు దోషులను వెంటనే అరెస్టు చేయాలని, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వర్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.72 గంటల అల్టిమేటంనిరసనలకు నాయకత్వం వహించిన హిందూ విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి 72 గంటల గడువు విధించాయి. శ్రీరాముడి చిత్రాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా మరింత పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గైబాంధాలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ విగ్రహ పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. తీవ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛ, మత సామరస్యంపై మరోసారి చర్చ మొదలైంది. హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్య పరిషత్ సహా పలు సంస్థలు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మత విద్వేష ఘటనలను అరికట్టాలని కోరాయి. -
ఢిల్లీలో సీజేపీ నిరసనలు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ధర్నాకి దిగింది. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహించాలని, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరసనల్లో పాల్గొంటూ, కేంద్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీక్, సీబీఎస్సీ మూల్యాంకన వివాదాలు, నియామక పరీక్షల్లో అవకతవకలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీజేపీ నిరసనల సందర్భంగా భారీ ఎత్తున నిరుద్యోగులు అక్కడికి చేరుకున్నారు. 20 जून को कॉकरोचो के सरदार ने जंतर मंतर के रंगारंग कार्यक्रम के लिए चम्मच और थाली लाने के लिए कहा है ताकि आते जाते राहगीर अपने घर का बासी खाना इनके थाली में डाल जाए और यह चम्मच चाट कर खाएं pic.twitter.com/GFTHnG1xVo— Kikki Singh (@singh_kikki) June 19, 2026ఇదిలా ఉండగా.. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందిన కాక్రోచ్ జనతా పార్టీ, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా మారింది. జూన్ 6న ఢిల్లీలో నిర్వహించిన తొలి భారీ నిరసనకు వందలాది మంది విద్యార్థులు, యువత హాజరయ్యారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. సీజేపీ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసి, పరీక్షల అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న విద్య, ఉద్యోగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకున్న సీజేపీ ఉద్యమం రాబోయే రోజుల్లో మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
మా ఆకలి కేకలు చెవికెక్కవా?
సాక్షి, అమరావతి : ‘కోవిడ్‌లో ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలు అందించిన మేమంటే ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు? నాలుగు నెలలుగా వేతనాల్లేక మా కుటుంబాల్లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. వేతనాలు ఇవ్వమని ఎంతగా ప్రాథేయపడుతున్నా పట్టించుకోవడంలేదు. మా ఆకలి కేకలు ప్రభుత్వం చెవికెక్కవా?’.. అంటూ స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్ సిబ్బంది చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంటి అద్దెలు, కుటుంబ అవసరాలతో పాటు పిల్లల స్కూలు ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ కొనుగోలుకు చేతిలో చిల్లిగవ్వలేక నానాపాట్లు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్ వేతనాల మంజూరుతో పాటు, ఇతర సమస్యల పరిష్కారం కోసం వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది విజయవాడ ధర్నాచౌక్‌లో బుధవారం భారీ నిరసనకు దిగారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది చిరుద్యోగులు ఈ నిరసనలో పాల్గొన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ మొండివైఖరిని నిరసించారు.కడుపు మాడుస్తున్నారు..ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలిస్తామని మేనిఫెస్టోలో హామీలిచ్చి ఇప్పుడు గద్దెనెక్కాక తమ కడుపు మాడుస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పుల పాలవుతున్నామని మహిళా ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. కొత్తగా అప్పు కూడా పుట్టట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులకు వంద శాతం గ్రాస్ వేతనం చెల్లింపు ఉత్తర్వుల అమలులోను ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. ఈ ధర్నాకు ప్రభుత్వ వైద్యులు, ఎన్హెచ్ఎం, వైద్య శాఖలోని ఇతర ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.పిల్లల చదువులు కష్టమవుతున్నాయిప్రభుత్వం నాలుగు నెలలుగా వేతనాలు ఆపేసింది. ఇలా అయితే మా కుటుంబాలు ఎలా బతకాలి? ఇప్పుడు పిల్లల ఫీజులు, యూనిఫాం, పుస్తకాల కొనుగోలుకు రూ.వేలల్లో ఖర్చు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నెలలకొద్దీ జీతాలు ఇవ్వకపోతే ఎలా? కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తే మమ్మల్ని దేవుళ్లుగా కీర్తించారు. ఇప్పుడు జీతాల కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది.– జె. విజయ, స్టాఫ్ నర్సు, పల్నాడు జిల్లాసమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి..కాంట్రాక్టు ఉద్యోగులపట్ల ప్రభుత్వం ఎంతో వివక్ష చూపుతోంది. శాశ్వత ఉద్యోగులతో సమానంగా మేం పనిచేస్తున్నాం. కానీ, వేతనాల చెల్లింపులో మాత్రం మాపట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. – మంగ, స్టాఫ్ నర్సు, ఏలూరు జిల్లాఎంతో వేడుకున్నాం.. అయినా ఫలితంలేదు..వేతనాలు అందక చిరుద్యోగులందరూ ఎంతో ఇబ్బందిపడుతున్నారని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. అధికారుల చుట్టూ తిరిగి నా ఫలితంలేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో రోడ్డెక్కాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించాలి . – అజయ్, రాష్ట్ర కన్వీనర్, ఏపీ కాంట్రాక్టు స్టాఫ్ నర్సెస్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ యూనియన్ ప్రధాన డిమాండ్లు..» కాంట్రాక్టు నర్సులు, అలైడ్ హెల్త్ కేర్ సిబ్బంది అందర్నీ క్రమబద్ధీకరించాలి. అప్పటివరకూ 100 శాతం గ్రాస్ వేతనం వెంటనే అమలుచేయాలి.» విధుల్లో మరణించిన కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం అందించాలి. అలాగే, ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలి. » పరస్పర, స్పౌజ్ కోటా బదిలీలకు అవకాశం కల్పించాలి.» శాశ్వత ఉద్యోగులకు ఇచ్చినట్లే కాంట్రాక్టు ఉద్యోగులకు పెయిడ్ సిక్ లీవ్స్, ఈహెచ్ఎస్ కార్డులు మంజూరుచేయాలి. -
అంగన్వాడీలు ఉద్యమానికి సిద్ధం కండి
సాక్షి, అమరావతి: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు ఉద్యమానికి సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. జూలై 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలను విజయవంతం చేయాలని కోరారు. విజయవాడలో ఆదివారం యూనియన్ అధ్యక్షురాలు జి.బేబీరాణి అధ్యక్షతన అంగన్వాడీల రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. అనంతరం సుబ్బరావమ్మ మీడియాతో మాట్లాడుతూ..అంగన్వాడీలకు కనీస వేతనమివ్వాలని, పెన్షన్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఐసీడీఎస్‌కు నిధులు తగ్గించి లబ్ధిదారులకు ఫీడింగ్ సక్రమంగా అందకుండా చేస్తోందన్నారు. అనేక రకాల యాప్‌లు తీసుకొచ్చి అంగన్వాడీలపై పనిభారం పెంచి ప్రీసూ్కల్ జరగనివ్వకుండా చేస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు ఏడాదికి 10 శాతానికి పైగా పెరుగుతున్నాయని, ప్రభుత్వం మాత్రం అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. బాబు ప్రభుత్వం పెట్టుబడిదారులకు రూ.లక్షల కోట్లు రాయితీలు ఇస్తోందని, పారిశ్రామికవేత్తలకు 99పైసలకే భూములను ధారాదత్తం చేస్తోందని, అంగన్వాడీల సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. -
కడప కార్పొరేషన్ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన
-
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)
-
కాక్రోచ్ పార్టీ ధర్నాలో ప్రకాష్ రాజ్ సంచలన ఎంట్రీ
బెంగళూరు: నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా కార్చిచ్చులా రగులుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు న్యాయం జరగాలంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ఆందోళనకు ప్రముఖ బహుభాషా నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ మద్దతు తెలపడమే కాకుండా స్వయంగా హాజరుకావడం సంచలనంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.‘ఎక్స్’ వేదికగా ప్రకాష్ రాజ్ పిలుపుగతంలో ఢిల్లీలో జరిగిన నిరసనకు కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన నటుడు ప్రకాష్ రాజ్, ఈసారి బెంగళూరు ధర్నాలో పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ప్రభుత్వం తన వైఫల్యాలకు బాధ్యత వహించేలా మనమంతా గొంతు ఎత్తాలని, ఈ శాంతియుత నిరసనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ విధానాలను నిరంతరం విమర్శించే ప్రకాష్ రాజ్ ఈ ఉద్యమంలో చేరడంతో జెన్ జెడ్ నేతృత్వంలోని ఈ విద్యార్థి ఉద్యమానికి మరింత బలం చేకూరినట్లయింది.దేశవ్యాప్తంగా ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలుగత వారం రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోని పలు నగరాల్లో వరుస ఆందోళనలతో హోరెత్తిస్తోంది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శనతో ప్రారంభమైన ఈ ఉద్యమం.. ఆ తర్వాత పుణె, లక్నో, అమృత్సర్ నగరాలకు పాకింది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగే నిరసనలో ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థ కుప్పకూలిందని, కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటలాడుతోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జూన్ 20న 'ఢిల్లీ చలో'.. ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపబోమని, జూన్ 20న దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు అక్కడే తిష్ట వేస్తామని సీజేపీ ప్రతినిధి దిప్కే స్పష్టం చేశారు. పుణె నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీకి దేశంలోని ఒక కోటి మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా, లేక ఒక అసమర్థ మంత్రి ముఖ్యమా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కాక్రోచ్ ముసుగులు ధరించి, చేతుల్లో పూలు పట్టుకుని వినూత్న రీతిలో చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
పోలీసు ఉద్యోగం కోసం వచ్చి పోలీసులపైనే రాళ్లదాడి!
పట్నా: బీహార్ రాజధాని పట్నాలోని పాట్లీపుత్ర రైల్వే స్టేషన్ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థుల ఆందోళన ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ప్రయాణ వసతులు సరిపోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అభ్యర్థులు రైళ్లను అడ్డుకుని, రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ రాళ్ల దాడికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు, బాష్పవాయువు ప్రయోగించి, గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపారు.రణరంగంగా మారిన స్టేషన్బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ పరీక్ష కోసం వేలాది మంది విద్యార్థులు పాటలీపుత్ర స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే పరిమిత సంఖ్యలో ఉన్న రైళ్లు, విపరీతమైన రద్దీ కారణంగా చాలా మంది అభ్యర్థులు రైళ్లు ఎక్కలేకపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు నిరసనకారులు రైళ్ల ఎమర్జెన్సీ చైన్లు లాగి, రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆపై రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ స్టేషన్‌ను రణరంగంగా మార్చారు. ప్రత్యక్ష సాక్షి సంజయ్ కుమార్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, అభ్యర్థులు వేలాదిగా ఉండటం, రైళ్లు తక్కువగా ఉండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. Patna, Bihar: A clash broke out at Patliputra Railway Station in Patna during the Bihar Police Prohibition Department exam, as candidates protested against inadequate train arrangements. The unrest escalated into vandalism of an exam special train, prompting police to intervene… pic.twitter.com/e85cGOibrp— IANS (@ians_india) June 13, 2026పోలీసుల లాఠీఛార్జ్, కాల్పులుపరిస్థితి తీవ్రతరం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులపైకి భారీగా రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో ఐజీ జితేంద్ర రాణాతో పాటు పలువురు పోలీసు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప బలప్రయోగానికి దిగాల్సి వచ్చింది. బాష్పవాయువు గోళాలు ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపి గుంపును విచ్ఛిన్నం చేశారు.పరిపాలనాధికారుల వివరణఈ ఘటనపై పట్నా జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) డాక్టర్ త్యాగరాజన్ స్పందిస్తూ, అభ్యర్థుల సౌకర్యార్థం ఇప్పటికే రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అర్ధరాత్రి వేళ కొందరు అసాంఘిక శక్తులు ఉద్దేశపూర్వకంగా గొడవ సృష్టించి, పరీక్షకు వెళ్లే ఇతర విద్యార్థులను కూడా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. శాంతిభద్రతలను కాపాడేందుకే స్వల్ప బలప్రయోగం చేశామని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, పరీక్షల రైళ్లు సురక్షితంగా బయలుదేరాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఇది కూడా చదవండి: 6 నెలలకే రూ. 4 లక్షలైతే.. రేపు చదువుల సంగతి ఏంటి? -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. ప్రొఫెసర్ నాగేశ్వర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో గత కొన్ని నెలలుగా పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం నడుస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యత వహించి రాజీనామా చేయమని కోరితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయట్లేదన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గతంలో రైల్ యాక్సిడెంట్ అయితే రైల్వేశాఖ మంత్రైన లాల్ బహుదూర్ శాస్త్రి రాజీనామా చేశారని మరి అలాంటప్పుడు పేపర్ లీకేజ్ వ్యవహారం నడుస్తున్నప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయట్లేదని ప్రశ్నించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుంది. ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ స్పోక్ పర్సన్ విజేత దాయ్ అతిథిగా హాజరయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ( ఆదివారం) హైదరాబాద్‌లో ఆందోళనకు పిలుపునిచ్చింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుంది. ఇటీవలే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ మాస్కులు ధరించి, చేతుల్లో పుస్తకాలు, జాతీయ జెండాలతో యువత భారీ ఎత్తున నిరసన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం పుణేలోని సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీ క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతుంది. -
ఏపీలో చంద్రబాబు దగా పాలనపై ప్రజా ఉద్యమం... ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీల్లో ఉప్పొంగిన జనహోరు
-
ఏపీ మొత్తం దద్దరిల్లేలా YSRCP గర్జన..!
-
ఏపీ వ్యాప్తంగా YSRCP భారీగా ర్యాలీలు
-
రెండేళ్ల వెన్నుపోటు పాలనపై రాష్ట్రవ్యాప్త నిరసనలు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాయి. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ఈ ర్యాలీలు చేపట్టినట్లు తెలిపారు. దగాపడ్డ రైతులు, మహిళలు, పిల్లలు ఇలా ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొన్నారు.అలాగే, చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించారు. -
రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు
సాక్షి, అమరావతి: ‘మేనిఫెస్టోను డెస్ట్బిన్లో వేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా దగా పడ్డారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాం. ఈ ర్యాలీల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు వివరిస్తాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై దుమ్మెత్తి పోశారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆందోళనల్లో డీఎస్సీ అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నామని, పరీక్ష నిర్వహణలో అక్రమాల వల్ల జరిగిన నష్టాన్ని ప్లకార్డులతో ఎత్తి చూపుతామన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని గుర్తు చేశారు. ‘నిరుద్యోగ యువతకు నెల నెలా రూ.3 వేలు ఇస్తామన్నారు. రూ.3 వేల మాట దేవుడెరుగు.. వాళ్లకు హక్కు(రైట్పుల్)గా రావాల్సిన ఉద్యోగాలను సైతం ఇవ్వకుండా లాక్కొని స్కామ్‌లు చేశారు.అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలన్నీ పక్కన పడేశారు. బాబు పాలనలో రైతులు అన్ని విధాలుగా అధోగతి పాలయ్యారు. మహిళలు నాశనమైపోయారు. యువత ఆశలను నిర్దాక్షిణ్యంగా చిదిమేశారు. దగా పడ్డ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’ అని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలతో, ఎన్నికల్లో వారిచ్చిన బాండ్లతో పాటు డీఎస్సీలో జరిగిన మోసాలు, అన్యాయాలు, దగా స్కామ్‌లను ప్రదర్శిస్తూ ప్రజలకు సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలో తలపెట్టిన ఈ నిరసన ర్యాలీలు గట్టిగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చామన్నారు. చంద్రబాబు పాలనలో దగాపడిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ర్యాలీలు నిర్వహిస్తారన్నారు. దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. -
తాలిబన్ల అరాచకం : నిరసనకారులపై బుల్లెట్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత
ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్ కాల్పుల మోతతో అట్టుడికింది. బుధవారం ఉదయం హెరాత్‌లోని జిబ్రిల్ ప్రాంతంలో, సరైన బురఖా ధరించలేదనే ఆరోపణలతో మహిళలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన నిరసనకారులపై తాలిబాన్లు విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, దాదాపు ముప్పై మంది గాయపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హెరాత్‌లోని జిబ్రిల్ వాసులు మహిళల అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. వీరిని అణచి వేసేందుకు తాలిబాన్ ఫైటర్లు తూపాకీలను నేరుగా ఛాతీపై గురిపెట్టి కాల్పులు జరిపారని, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన మానవ హక్కుల సంఘాలు, తాలిబాన్ వ్యతిరేక రాజకీయ నేతలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నగరంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మహిళల రాకపోకలపై ఆంక్షలు, నిర్బంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమ మహిళలను బయటకు వెళ్లనివ్వవద్దని, ఒకవేళ వారిని బంధిస్తే విడిపించడానికి తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేమని హెరాత్‌లోని కొందరు మసీదు ఇమామ్‌లు నిన్న ప్రజలను హెచ్చరించారు.తాలిబాన్లు నిరసనకారుల ఛాతీపై కూడా కాల్పులు జరిపారనీ, కొందరు యువకులు కిందపడి రక్తం ఓడుతుండటం చూశానని స్థానికులు ఒకరు తెలిపారు. మహిళలు నినాదాలు చేస్తుండగా, తాలిబాన్లు కాల్పులు జరుపుతున్నారు. తాలిబాన్ల నిబంధనల ప్రకారం బురఖా/హిజాబ్ ధరించని మహిళలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో అరెస్ట్ చేస్తున్నారు. అయితే వారు భారీగా కాల్పులు జరుపుతున్నప్పటికీ, ప్రజలు "విద్య, ఉపాధి, స్వేచ్ఛ" అంటూ నినాదాలు చేస్తున్నట్లు వీడియోలలో కనిపిస్తోంది.మరోవైపు తాలిబాన్ల అరెస్టులు, అణచివేతకు భయపడి చాలా మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు కాకుండా ఇళ్లకే తరలించారని నిరసనకారులు చెబుతున్నారు. దీనివల్ల గాయపడిన వారికి ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా అందలేదు. తాలిబాన్లు ఆసుపత్రుల్లో కూడా నిఘా ఉంచి, గాయపడిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తున్నారని కొందరు ధృవీకరించారు.🇦🇫 Taliban opens fire on civilians protesting morality police in Herat, Afghanistan, residents hit streets demanding end to burqa and chador rules @visegrad24 pic.twitter.com/34ik8JLDAq— U.S.A.I. 🇺🇸 (@researchUSAI) June 9, 2026 జిబ్రిల్కు అదనపు బలగాల తరలింపుజిబ్రిల్లో ప్రజా నిరసనలను అణచివేసిన తర్వాత, తాలిబాన్లు వందలాది మంది కొత్త ఫైటర్లను ఆ ప్రాంతానికి పంపారు. నగరంలోని అన్ని కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విడుదలైన వీడియోల ప్రకారం, హెరాత్ నగరం పూర్తిగా సైనిక జోన్లా మారిపోయింది. రోడ్లపై, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫైటర్లను మోహరించారు. సాధారణ దుస్తుల్లో ఉన్న తాలిబాన్లు కూడా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం.అయితే షల్ మీడియాలో ఈ నిరసనల గురించి సోషల్ మీడియా ద్వారా ఉప్పందడంతో ఉదయం నుంచే వారు సాధారణ దుస్తుల్లో భారీగా మోహరించారు. ప్రజలు గుమిగూడటం ప్రారంభించగానే అన్ని వైపుల నుండి ఆయుధాలతో దాడి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి కూడా నిఘాపెట్టి క్షతగాత్రులకు చికిత్స అందకుండా అడ్డుకున్నారు.మానవ హక్కుల సంఘాల స్పందనదీనిపై అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హెరాత్‌లో ప్రజా నిరసనల అణచివేతపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాలిబాన్ల ఆంక్షలు అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై కాల్పులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. శాంతియుతంగా నిరసన తెలిపే నిరసనకారులపై చట్టవిరుద్ధంగా బలాన్ని ఉపయోగించడాన్ని వెంటనే నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని విడుదల చేయాలని కోరింది. మహిళలు, బాలికల హక్కులైన స్వేచ్ఛగా తిరిగే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేసింది,హెరాత్‌లో ప్రజా నిరసనలపై తాలిబాన్ల అణచివేతకు ప్రతిస్పందిస్తూ, మాజీ ఆఫ్ఘన్ ప్రభుత్వ విదేశాంగ సలహాదారు రంగిన్ దాద్ఫర్ స్పాంటా ఎక్స్‌లో స్పందించారు. "ఈ అణచివేత, చరిత్రలో సాగుతున్న ఈ పాలనను ప్రజలే స్వయంగా ముగించాలి" అని పిలుపునిచ్చారు.మరోవైపు, హ్యూమన్ రైట్స్ వాచ్‌కి చెందిన ఆఫ్ఘనిస్తాన్ పరిశోధకురాలు ఫెరెష్తే అబ్బాసి స్పందిస్తూ, హెరాత్ ప్రావిన్స్ నుండి తమకు "ఆందోళన కరమైన నివేదికలు" అందాయని చెప్పారు. తాలిబాన్లు నిరసనకారులపై ఎలాంటి బలాన్ని ప్రయోగించకుండా వెంటనే వైదొలగాలని, శాంతియుత నిరసనల కోసం నిర్బంధించిన వారిని విడుదల చేయాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. హింస లేదా బెదిరింపులు లేకుండా శాంతియుత నిరసనలు జరుపుకోవడానికి నిరసనకారులను అనుమతించాలని ఆమె పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్పై ఐక్యరాజ్యసమితి (UN) ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్, ఈ అణచివేతను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. నిరసనకారులపై జరిగిన హింసకు పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా 2021లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, తాలిబన్లు మహిళలు, బాలికలపై విస్తృతమైన ఆంక్షలు విధించారు. వీటిలో సెకండరీ, విశ్వవిద్యాలయ విద్యపై నిషేధం, ఉపాధిపై పరిమితులు, దుస్తులు, కదలికలకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి.Today, Afghan human rights defenders protested outside the UN office in Tehran in solidarity with the women of Herat and across Afghanistan. They called on the UN and the international community to end their silence and take action for Afghan women’s rights.#HeratAfghanProtest pic.twitter.com/DJcjvDNBUi— Jahanzib Wesa (@jahanzibwesa) June 11, 2026 -
వెన్నుపోటుకు రెండేళ్లు.. రేపు వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: రేపు(శుక్రవారం) ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడిన ప్రతీ వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.అలాగే, చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతామన్నారు. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించారు. -
చంద్రబాబు వెన్నుపోటుపై నిరసనాగ్రహం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాలను మోసం చేసిన వైనంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’లో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో టౌన్‌హాల్ సదస్సులు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సదస్సులను విజయవంతం చేశారు. చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సదస్సుల్లో యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు విశేషంగా పాల్గొని చంద్రబాబు వెన్నుపోటుపై విరుచుకుపడ్డారు. సదస్సులు, రౌండ్‌టేబుల్ సమావేశాల ప్రాంగణాల్లో ఫొటో ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేశారు. సదస్సుల అనంతరం నల్లబెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. » ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శిలో ఒంగోలుపార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. నల్లబెలూన్లు ఎగరేసి నిరసన తెలిపారు. గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, అద్దంకిలో నియోజకవర్గ ఇన్చార్జి చింతలపూడి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. » పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, పాలకొల్లులో నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఇన్చార్జి వడ్డి రఘురామ్‌నాయుడు, ఉండి పెదఅమిరంలో జిల్లా ఉపాధ్యక్షుడు పెన్మత్స ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు. » తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలో కో–ఆర్డినేటర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. » డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వైఎసాŠస్‌ర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పాల్గొన్నారు.మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో అమలాపురంలో సదస్సు నిర్వహించారు. పార్టీ నేతలు పినిపే శ్రీకాంత్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు, మాజీ ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో సమావేశం నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గం పల్లిపాలెంలో వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. » కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో కూటమి మోసాలపై ర్యాలీ, సదస్సు నిర్వహించారు. పెద్దాపురంలో నియోజకవర్గ కో– ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి సదస్సులో పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో, కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. » శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, శ్రీకాకుళం, పాతపట్నంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’సదస్సులు నిర్వహించారు. » విజయనగరం జిల్లా బొబ్బిలిలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు. పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. » విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విశాఖ తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు, యలమంచిలిలో మాజీ ఎమ్మెల్యే, కరణం ధర్మశ్రీ నిర్వహించిన సదస్సులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. » అనంతపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, కళ్యాణదుర్గం రోడ్డులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య, హిందూపురంలో సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించారు. » కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్, బనగానపల్లె, ఆళ్లగడ్డ, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర, పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.» తిరుపతిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, మాజీ మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు నల్లదుస్తులు ధరించి రోడ్డుపై బైఠాయించారు. » శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలులో ర్యాలీని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. » కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నేతలు నల్ల బెలూన్లు వదిలి వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. » పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాచర్లలో నల్ల బెలూన్లు ఎగుర వేసి నిరసన తెలిపారు. నరసరావుపేటలో వైఎస్సార్సీపీ ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఈయం.స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. టీడీపీ గూండాలు నిర్వహించిన దాడులపై గుంటూరులో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఇందులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు తదితరులు పాల్గొని నల్ల రిబ్బన్లు ఎగురవేశారు. గుంటూరు నగర శివారు గోరంట్లలో వైఎస్సార్సీపీ విజయవాడ, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బి.కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను ఎగురవేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తదితరులు -
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
-
ఎంపీని ఉరికించి కారును నుజ్జు నుజ్జు చేసిన గ్రామస్తులు
-
కేంద్రంపై గళం ఎత్తిన కాక్రోచ్ జనతా పార్టీ..!
-
ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ధర్నా.. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
-
నిరసనల వేదిక ‘జంతర్ మంతర్’ అసలు కథ!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్.. నేడు దేశంలో ఏ చిన్న అన్యాయం జరిగినా, హక్కుల కోసం పోరాడాలన్నా గుర్తుకువచ్చే ఏకైక చిరునామా. తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై చేపట్టిన భారీ నిరసనతో ఈ ప్రాంతం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఒకప్పుడు గ్రహాల గమనాన్ని లెక్కించే వైజ్ఞానిక కేంద్రంగా వెలిసిన ఈ కట్టడం, దేశ రాజకీయాలను శాసించే నిరసనల హబ్‌గా ఎలా మారింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏంటి?ఖగోళ కేంద్రంగా జంతర్ మంతర్ ఆవిర్భావంనిజానికి జంతర్ మంతర్ అనేది రాజకీయాలకు సంబంధించిన స్థలం కాదు. 18వ శతాబ్దంలో అంబర్ మహారాజు సవాయ్ జైసింగ్ II దీనిని నిర్మించారు. సంస్కృతంలోని 'జంత్ర' (ఖగోళ పరికరం) అనే పదం నుండి దీనికి 'జంతర్ మంతర్' అనే పేరు వచ్చింది. ఆ కాలంలో సమయాన్ని, నక్షత్రాలు, గ్రహాల గమనాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి ఒక వైజ్ఞానిక ప్రయోగశాలగా దీనిని ఏర్పాటు చేశారు. దీని చుట్టూ ఉన్న భారీ నిర్మాణాలు శాస్త్రీయ పరికరాలుగా పనిచేసేవి.బోట్ క్లబ్ నుండి జంతర్ మంతర్ రోడ్డుకు మారిన వేదిక1993 కంటే ముందు ఢిల్లీలో నిరసనలు, ధర్నాలకు ప్రధాన వేదిక ఇండియా గేట్ సమీపంలోని 'బోట్ క్లబ్ లాన్స్'గా ఉండేది. అయితే, 1988లో జరిగిన ఒక భారీ రైతు ధర్నా కారణంగా దేశ రాజధానిలో సాధారణ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలో తీవ్ర ఆటంకాలు కలగడంతో, అధికారులు బోట్ క్లబ్ వద్ద నిరసనలపై ఆంక్షలు విధించారు. దానికి ప్రత్యామ్నాయంగా, పార్లమెంట్‌కు సమీపంలో ఉంటూ.. ప్రజాస్వామ్య యుతంగా నిరసనలు తెలుపుకోవడానికి వీలుగా ఉండే ‘జంతర్ మంతర్ రోడ్డు’ను అధికారిక నిరసన స్థలంగా ప్రకటించారు. అలా 1993 నుండి ఇది ఉద్యమాల వేదికగా రూపాంతరం చెందింది.దేశాన్ని కదిలించిన చారిత్రక ఉద్యమాలుగడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎన్నో చారిత్రక మరియు సామాజిక మార్పులకు జంతర్ మంతర్ సాక్ష్యంగా నిలిచింది.అన్నా హజారే ఉద్యమం (2011): అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నేతృత్వంలో సాగిన జన లోక్‌పాల్ ఉద్యమం ఇక్కడి నుంచే దేశాన్ని కదిలించింది. ఈ ఉద్యమ ఫలితంగానే తదనంతరం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ఆవిర్భవించింది.నిర్భయ ఆందోళనలు (2012): దేశవ్యాప్తంగా ప్రజాగ్రహాన్ని రగిల్చిన నిర్భయ హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున యువత, పౌరులు ఇక్కడే చేరి న్యాయం కోసం పోరాడారు.ఇతర ప్రముఖ నిరసనలు: రోహిత్ వేముల మరణం తర్వాత జరిగిన విద్యార్థి ఆందోళనలు, ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ కోసం మాజీ సైనికులు చేసిన సుదీర్ఘ పోరాటాలు ఇక్కడే సాగాయి.నిషేధం.. ఆపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు2017లో పర్యావరణ కారణాలు, స్థానికులకు కలిగే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’జంతర్ మంతర్ వద్ద నిరసనలపై నిషేధం విధించింది. అయితే శాంతియుతంగా నిరసన తెలపడం అనేది పౌరుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేస్తూ 2018లో గౌరవ సుప్రీంకోర్టు ఇక్కడ ధర్నాలు చేసుకునే ప్రజాస్వామ్య హక్కును పునరుద్ధరించింది.ఇది కూడా చదవండి: ‘బొద్దింకలు’ భయపడవు, చావవు: అభిజీత్ దిప్కే -
ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
-
రెండేళ్ల రాక్షస పాలనపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ
-
‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ కీలక ప్రకటన
ఢిల్లీ: సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు (సీజేపీ) అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. ఇటీవల విద్యావ్యవస్థలో చోటు చేసుకున్న పలు వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తూ జూన్ 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతి చేపట్టే నిరసనలో పాల్గొనేందుకు అందరూ కలిసి కట్టుగా రావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల విదేశాల్లో ఉన్న సీజేపీ వ్యవస్థాపకుడు జూన్ 6న ఢిల్లీకి చేరుకోనున్నారు. ‘విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసేందుకు భారత్‌కు తిరిగి వస్తున్నాను. జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ శాంతియుత నిరసనలో పాల్గొని, ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరే మన రాజ్యాంగ హక్కును వినియోగించుకోవాలని భారత యువతను నేను కోరుతున్నాను’ అని వ్యాఖ్యానించారు.అయితే, అభిజీత్ దీప్కే పిలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ విద్యా వ్యవస్థలో పదేపదే తలెత్తుతున్న సమస్యలతో విసిగిపోయిన ప్రజలు, దీప్కే తిరిగి వచ్చి ముందుండి నడిపించాలనే నిర్ణయం సాహోసోపేతమని కొనియాడుతున్నారు. Important announcement:CJP Founder @abhijeet_dipke will return to India on June 6 for a peaceful protest at Jantar Mantar, Delhi, demanding the resignation of the Education Minister. pic.twitter.com/x9M1v38Pwu— Cockroach is Back (@Cockroachisback) June 1, 2026 -
మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన!
-
మెగా డీఎస్సీ అక్రమాలపై YSRCP పోరుబాట..
-
కూటమి రాక్షస పాలనపై YSRCP పోరుబాట
-
నేలపై కూర్చుని వైఎస్సార్సీపీ నేతల నిరసన
సాక్షి, అమరావతి: మంగళగిరి విద్యాశాఖ కార్యాలయం దగ్గర వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. నేలపై కూర్చుని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు చెప్పని అధికారులు.. అంతా సక్రమంగా ఉన్నట్టు బుకాయించారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘‘అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంకు వచ్చింది నిజామా? కాదా?. మెరిట్ లిస్ట్‌లు ఎందుకు బయటపెట్టడం లేదు? అంటూ నిలదీసిన వైఎస్సార్సీపీ నేతలు.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం
సాక్షి గుంటూరు: వైఎస్సార్సీపీ నేతల పోరాటంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. మామిళ్లపల్లిలో సీజ్ చేసిన గోడౌన్‌ను అధికారులు తెరిచారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రోద్భలంతో అధికారులు గోడౌన్ సీజ్ చేశారు. దీంతో దానిని తెరవాలంటూ అక్కడి రైతులు ఆందోళనకు దిగారు. రైతుల పోరాటానికి వైఎస్సార్సీపీ నేతలు అండగా నిలిచారు. ఎన్ని దాడులు చేసినా, అట్రాసిటీ కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేశారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి గోడౌన్ తెరిచింది. గోడౌన్ మెుక్కజోన్న రైతులదేనని అధికారులు తేల్చారు. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన రైతులకు అండగా ఉండేందుకు చలో చలో మామిళ్లపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎన్నో అడ్డంకులు సృష్టించింది కూటమి ప్రభుత్వం. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మరీ దౌర్జన్య కాండకు దిగింది. అయినప్పటికీ వైఎస్సార్సీపీ వెనక్కి తగ్గకపోవడంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి సీజ్ చేసిన గోడౌన్‌ను తెరిచింది. -
టీడీపీకి రాం రాం.. తిరగబడుతున్న దళిత ఎమ్మెల్యేలు
-
ప్రేమించి పెళ్లి చేసుకుని రోడ్డుపై వదిలేసిన భర్త..
-
పెట్రోల్ పై YSRCP పోరుబాట.. ఆటోకి తాడు కట్టి వినూత్న నిరసన..
-
పెట్రో బాదుడుపై YSRCP పోరుబాట
-
పెట్రో, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆటో కార్మీకులు ధ్వజమెత్తారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా మునగపాకలో ఆటో కార్మీకులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు.మెయిన్ రోడ్డు నుంచి రిక్షా స్టాండ్ వరకు ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోశారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇంధన ధరల ప్రభావం రవాణా రంగంపై పడి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలియం ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై.. నేడు వైఎస్సార్సీపీ నిరసనాగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం తీవ్ర ఆందోళనకర విషయమని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచి్చనప్పటికీ.. అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సజ్జల పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించి.. తక్షణమే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, తహశీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేయాలని ఆయన సూచించారు. వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆదివారం సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. బాబు, లోకేశ్ హామీని అమలు చేయాలి.. ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించకపోగా మరింతగా పెంచి సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతోంది. ఈ ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవన వ్యయం మరింతగా భారమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.ఆ హామీని ఇప్పుడు అమలు చేయాలి. వైఎస్సార్సీపీతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, అనుబంధ సంఘాలను కూడా కలుపుకుని పార్టీ నేతలు భారీ ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి. వైఎస్సార్సీపీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేలా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మీడియా క్యాంపెయిన్, సోషల్ మీడియా ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలి. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండండి.. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. బూత్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని మైక్రో లెవల్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ప్రతి బూత్‌లో సమర్థవంతమైన బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) నియామకం అత్యంత కీలకం. వీలైనంత త్వరగా వీరి నియామక ప్రక్రియను పూర్తి చేయాలి. ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో ప్రతీ ఓటు విలువైనది. ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. -
రేపు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
సాక్షి,తాడేపల్లి: పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే డీజిల్, పెట్రోలు ధరలు అధికంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించకపోగా భారీగా పెంచడం దుర్మార్గం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ధరలు అధికంగా ఉన్నాయి. ఈ పెంపుతో సాధారణ ప్రజలపై భారీ భారం మోపారు’అని అన్నారు.పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడిందని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవితం మరింత భారంగా మారిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రేపు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టి, అనంతరం అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. -
బాబుది పా‘శవ’క పాలన
బీచ్‌రోడ్డు (విశాఖ): మాయమాటలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. అవ్వతాతలకు, వితంతువులకు, దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు శవపేటికలలో వృద్ధుల మృతదేహాల నమూనాలతో వినూత్న నిరసన చేపట్టారు. ‘చనిపోయిన వృద్ధుల పింఛన్లయినా కొత్త వారికి ఇప్పించండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భారీగా హాజరైన కార్యకర్తలు, నాయకుల నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది.పేదల పొట్ట కొడుతున్నారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 66 లక్షల పైచిలుకు పెన్షన్లు అందజేశారని గుర్తు చేశారు. కానీ, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా, కుంటిసాకులతో ఆరు లక్షల మందికిపైగా అవ్వతాతల పెన్షన్లు తొలగించి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు.సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా, తండ్రీకొడుకులు తెలంగాణలో పండగలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. గత రెండేళ్లలో సహజంగా చనిపోయిన వృద్ధుల స్థానంలోనూ కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపూ ఆనంద్, దక్షిణ నియోజకవర్గ పరిశీలకులు వీసాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చలో లోకేష్ ఇంటికి.. రోడ్డుపై ఉద్యోగుల ధర్నా
-
సీఎం ఆఫీస్ ముట్టడికి పిలుపు
-
నోయిడా హింస.. విదేశాల నుండి డబ్బు
యూపీ: నోయిడాలో గత నెలలో జరిగిన కార్మికుల నిరసన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిరసనలకు కారణమైన వ్యక్తికి విదేశాల నుంచి పెద్దమెుత్తంలో నిధులు జమయినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశంపై మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.నోయిడాలో గత నెల ఏప్రిల్ 13న పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. వివిధ రంగాలకు చెందిన సుమారు 40 నుండి 50 వేల మంది కార్మికులు నగర వ్యాప్తంగా గూమిగూడి హింసాత్మక ప్రదర్శనలు చేపట్టారు. సెక్టార్ 63 మరియు మదర్సన్ కంపెనీ ప్రాంగణ సమీపంలో కొంతమంది అల్లరి మూకలు హింసకు పాల్పడటమే కాకుండా పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ రోజు సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. కాగా ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ కేసులో నిందితుడైన సత్యం వర్మ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి విదేశాల నుండి రూ. కోటికి పైగా నగదు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ఖాతాలోకి డాలర్లు, పౌండ్లు, యూరోల రూపంలో ఈ భారీ మొత్తం వచ్చిందని తెలిపారు. వాటిని సత్యం అనే వ్యక్తి ఇతర వ్యక్తుల ఖాతాలోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.కాగా ఈ నిరసనల్లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆదిత్య ఆనంద్ అనే వ్యక్తిని పోలీసులు అంతకుముందే అరెస్టు చేయగా ఏప్రిల్ 19న లక్నోలో సత్యం వర్మ, హిమాన్షు ఠాకూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు బిగుల్ మజ్దూర్ దస్తా అనే లెఫ్ట్ వింగ్ (వామపక్ష) కార్మిక హక్కుల సంఘంలో నాయకులని తెలిపారు.అయితే, ఆ నిధులు ఏ దేశాల నుండి వచ్చాయి లేదా ఏయే సంస్థలపై విచారణ జరుగుతోంది అనే వివరాలను పోలీసులు ఇంకా బహిర్గతం చేయలేదు. ప్రస్తుతం బ్యాంక్ లావాదేవీలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. -
కరుప్పు మూవీ వాయిదా.. ఆందోళనకు దిగిన ఫ్యాన్స్
తమ అభిమాన హీరో సినిమా కోసం ఫ్యాన్స్ అంతా సిద్ధమయ్యారు. ఈ రిలీజ్ అనగానే ఉదయం 9 గంటలకే థియేటర్లకు చేరుకున్నారు. తీరా అక్కడికెళ్లాక అభిమానులు షాక్ తిన్నారు. ఈ రోజు సినిమా విడుదల లేదని థియేటర్ యాజమాన్యాల చెతులేత్తేశాయి. దీంతో తమ హీరో మూవీని చూడాలని వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇదంతా సూర్య హీరోగా వచ్చిన కరుప్పు మూవీ గురించే. ఇవాళ రిలీజ్ కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది.దీంతో ఒక్కసారిగా సూర్య అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. మొదటి షోలు రద్దు కావడంతో పుదుచ్చేరిలోని సూర్య అభిమానులు థియేటర్ల బయట నిరసనలు చేపట్టారు. తమ అభిమాన నటుడి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన టీ-షర్టులు,, టపాసులు, డోలు వాయిద్యాలు, పూల దండలు, పాలతో సిద్ధమైన ఫ్యాన్స్ సినిమా హాళ్ల బయట వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు. నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఫైనాన్స్ సమస్యలతో ఈ సినిమాను అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌కు చెల్లించాల్సిన రూ. 50 కోట్లకు పైగా బకాయిలు సమస్యల కారణంగా విడుదల కాలేదు. దీంతో ఈ చిత్రం మే 15న థియేటర్లలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. కరుప్పు చిత్రంలో యోగి బాబు, జాఫర్ సాదిక్, మన్సూర్ అలీ ఖాన్, ఇంద్రన్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సాయి అభ్యంక్కర్ సంగీతం అందించారు. View this post on Instagram A post shared by MUBARAK🇮🇳 (@mubaraksvlog) -
చంపేస్తా.. జాతి తక్కువ నా కొడకల్లారా.. మంత్రి బినామీ బూతులు!
-
లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. డీఎంకే మద్దతు!
-
వట్టిమాటలు కట్టి‘పెట్రో’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం తీవ్రమైంది. వారం రోజులుగా ఈ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. సంక్షోభాన్ని నివారించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. పైగా కృత్రిమ కొరతకు కారణమైంది. పర్యవసానంగా రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే దర్శమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంఓ చంద్రబాబు సర్కార్‌ను మొద్దు నిద్ర నుంచి మేల్కొపేందుకు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నిరసనలకు పిలుపు నిచి్చంది. మంగళవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలతో పాటు ప్రజలు భాగస్వాములు కావటం విశేషం. దీంతో నిరసన కార్యక్రమం దిగి్వజయమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని నేతలు ఎండగట్టారు. ‘ఏపీలో మద్యం పుల్ .. డీజిల్ పెట్రోల్ నిల్, పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలి, దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా సంక్షోభం లేదు.. ఇక్కడే ఎందుకు? ఇది పూర్తిగా ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వం, ఇంధనం అవసరమైనంత అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి’ అంటూ రాసిన ప్లకార్డులు వైఎస్సార్సీపీ నాయకులు చేతపట్టుకొని బంకుల వద్ద నిరసన తెలిపారు.పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం మాటలతో కాలయాపన చేస్తోందని వారు విమర్శించారు. వారం రోజులుగా తీవ్ర సమస్య ఉన్నా.. బాబు సర్కారు పబ్లిసిటీ డ్రామాలు ఆడడం ఏమిటని నిలదీశారు. మొన్న యూరియా .. నిన్న గ్యాస్ .. నేడు ఇంధన కొరత! ఇలా ఈ ప్రభుత్వంలో ప్రజలకు నిత్యం నరకం కనపడుతోందని దుయ్యబట్టారు. ఈ ఇంధన సంక్షోభం బాబు సృష్టించిందేనని విమర్శించారు. విజయవాడ కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతలు ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. బాబు పబ్లిసిటీ స్టంట్లు ఆపి.. వట్టిమాటలు కట్టిపెట్టి ఇంధన సంక్షోభాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా..⇒ ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ⇒ గుంటూరులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు సైకిల్ తొక్కుతూ నిరసన తెలిపారు. ⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నాయకులు నిరసన తెలిపారు. ⇒ కోనసీమజిల్లా కొత్తపేటలో డీజిలు లేక ఆగిపోయిన రైతు ట్రాక్టరుకు పగ్గం కట్టి బంకు వద్దకు తీసుకువచ్చి వినూత్న నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలు నిరసన గళమెత్తారు. కొన్ని ప్రాంతాల్లో మోటార్‌సైకిళ్లతో నిరసన తెలిపారు. రాజోలులో ట్రక్కు ఆటోను తాళ్లతో లాగి నిరసన తెలిపారు. ⇒ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు సర్కారు తీరుపై నిరసన తెలిపారు. రాజమండ్రిలో పెట్రోల్ బంక్ వద్ద ఖాళీ డీజిల్ డబ్బాలతో నిరసన తెలిపారు. కాకినాడ జిల్లాలోనూ బంకుల వద్ద ఆందోళన కార్యక్రమాలు సాగాయి. ⇒ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకులు పెట్రోల్ బంకులను సందర్శించి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ విశాఖ జగదాంబ జంక్షన్లో ఆటోలకు తాడు కట్టి లాగుతూ తమ నిరసన తెలియజేసి, క్యూలో ఉన్న వినియోగదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు గళమెత్తారు.⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీ డీజిల్ డ్రమ్ములతో నిరసన తెలిపారు. ⇒ తిరుపతిలో ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించి ర్యాలీ నిర్వహించి వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. -
సమాధి తవ్వి.. భుజంపై అక్క అస్థిపంజరంతో..!
న్యాయం కోసం హీరోలు సినిమాల్లో పోరాడడం చూస్తుంటాం. భావోద్వేగంతో విజిల్స్ వేస్తుంటాం.. కన్నీళ్లు పెట్టుకుంటాం. ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది. అయితే ఈ కథలో బాధితుడే ఓ హీరో. ఆ వ్యక్తి సహనానికి అధికారులు పరీక్ష పెట్టారు. ఓపిక నశించిన ఆ పెద్దాయన చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.50 ఏళ్ల జీతు ముండాది ఒడిషా కియోంజర్ జిల్లా డియానాలి గ్రామం. అతని అక్క కల్రా ముండా(56) ఈ జనవరిలో అనారోగ్యంతో చనిపోయింది. మరణించే ముందు ఆమె తన పశువుల్ని అమ్మింది. అలా వచ్చిన సొమ్ము రూ.20 వేలను ఒడిశా గ్రామీణ బ్యాంక్‌లో జమ చేసింది. అయితే ఆ సొమ్ము కోసం జీతు ఒజీవీ బ్యాంక్ మలిపోసి బ్రాంచ్‌కు వెళ్లాడు.కల్రా తన సోదరి అని, ఆమె మరణించిందని.. ఎవరూ లేకపోవడంతో ఆ సొమ్ము తనకు ఇవ్వమంటూ బ్యాంక్ అధికారుల్ని కోరాడు. అయితే సిబ్బంది అది వినిపించుకోలేదు. అకౌంట్ హోల్డర్‌ను తీసుకురావాల్సిందేనని పట్టుబట్టారు. అలా పదులసార్లు బ్యాంకుకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు మేనేజర్ కూడా చేతులెత్తయడంతో జీతూకి మండిపోయింది.సరాసరి అక్క సమాధి దగ్గరికి వెళ్లి.. ఆ అస్తిపంజరాన్ని ఓ సంచిలో మూటగట్టకున్నాడు. ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా ఆ సంచి మోసుకుంటూ బ్యాంకుకు వచ్చాడు. దారిన స్థానికులు కొందరు ఆ చర్యను చూసి షాక్‌కు గురయ్యారు. తమ మొబైల్స్‌లో ఆ దృశ్యాన్ని రికార్డు చేశారు. అస్థిపంజరాన్ని చూపించి.. తన సోదరి చనిపోయిందని ఆధారాలు చూపించాడు. జీతూ చేసిన పనితో బ్యాంకు అధికారులు హడలి పోయారు. పోలీసులకు సమాచారం అందించారు.A man in Odisha dug up his deceased sister’s grave and brought her skeleton to the bank Just to prove she had died.He had been trying to withdraw ₹20,000 from her account, but bank officials kept insisting he bring the account holder in person. Despite repeatedly telling them… pic.twitter.com/hICEqwvPFu— Woke Eminent (@WokePandemic) April 28, 2026అనుమతి లేకుండా పాతిన శవాన్ని బయటకు తీయడం నేరమని.. జీతూ మీద కేసు పెట్టమని బ్యాంకు అధికారులు పోలీసుల మీద ఒత్తిడి చేశారు. కానీ, పోలీసులు మాత్రం ఆ పెద్దాయనకే సపోర్ట్‌గా నిలిచారు. వాళ్ల జోక్యంతో బ్యాంకు అధికారులు దిగి వచ్చారు. జీతు ముండాకి ఇవ్వాల్సిన సొమ్మును ఇచ్చే ఏర్పాటు చేశారు. ‘‘జీతు ముండా, కల్రా ముండాలు నిరక్షరాస్యులు. నామినీ, లీగల్ హెయిర్ అనే విషయాల గురించి తెలియదు. అకౌంట్లు ఇచ్చే సమయంలో అత్యుత్సాహం చూపించే సిబ్బంది కూడా సరైన విధంగా వివరించలేదు’’ అని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. తనకు తెలియకుండానే చేసిన ఈ నిరసన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భలే పని చేశాడని.. బ్యాంకు వాళ్లకు తగిన బుద్ధి చెప్పాడని ప్రశంసలు గుప్పిస్తున్నారు. మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల బ్యాంకుల్లో కోట్లాది డబ్బులు మూలుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, బ్యాంకుల్లో క్లైమ్ చేయని డిపాజిట్లు, టీడీఎస్ రీఫండ్లు కలిపి సుమారు లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు చెందిన డబ్బు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి.బ్యాంకుల్లో క్లయిమ్ చేయని డిపాజిట్లుజనవరి 2026 నాటికి మొత్తం రూ.72,454 కోట్లుపబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో: రూ.60,571 కోట్లుప్రైవేట్ బ్యాంకుల్లో: రూ.9,608 కోట్లువిదేశీ బ్యాంకుల్లో: రూ.2,275 కోట్లు.. ఈ మొత్తాన్ని RBI నిర్వహించే Depositor Education and Awareness (DEA) Fundకి బదిలీ చేశారు.టీడీఎస్ రీఫండ్లుక్లైమ్ చేయని TDS రీఫండ్లు: సుమారు రూ3,000 కోట్లు. ఇవి ప్రభుత్వ ఖజానాలో ఉంటాయి, కానీ పన్ను చెల్లించిన వ్యక్తులు ITR ఫైలింగ్ ద్వారా తిరిగి పొందవచ్చు.ఎందుకు క్లయిమ్ చేయబడటం లేదు?అకౌంట్ హోల్డర్ మరణం, నామినీ లేకపోవడంప్రజల్లో అవగాహన లోపంక్లిష్టమైన పేపర్‌వర్క్, ప్రక్రియలు -
కలకలం.. మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. నల్గొండలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్రమత్తమైన తోటి కార్మికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని సమాచారం. -
నేతన్నల నిరసనాగ్రహం
మంగళగిరి టౌన్: చేనేత కార్మికులు నిరసన గళమెత్తారు. తమ సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పోరుబాట పట్టారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని వై జంక్షన్‌లోని నేతన్న సర్కిల్ వేదికగా బుధవారం చేనేత సంఘాల నాయకులు 48 గంటల నిరాహార దీక్షకు దిగారు. దీక్షను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ కె. వియన్నారావు ప్రారంభించి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికుల సామాజిక భద్రత కోసం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో కూడిన ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో కనీసం రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలకు రావాల్సిన రూ.203 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న ‘నేతన్న నేస్తం’ నిధులు విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు మంగళగిరిలో 20 వేల ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే ‘చలో అమరావతి’ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కో–కన్వినర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ , బండారు ఆనంద్ ప్రసాద్, సీపీఎం నేత రమాదేవి, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
గీతం యూనివర్శిటీ ఎదుట వైఎస్సార్సీపీ నిరసన
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో గీతం యూనివర్సిటీకి పిలుపునిచ్చింది. రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గీతం యూనివర్సిటీ ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ర్యాలీలో వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, మోల్లి అప్పారావు, దేవన్ రెడ్డి, మళ్ల విజయప్రసాద్ పాల్గొన్నారు.గీతం యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గీతం యూనివర్శిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నిరసన నేపథ్యంలో గీతం యూనివర్సిటీ ముందు పోలీసులు భారీగా మోహరించారు. -
పుట్టినరోజు సంబరాలే కాదు.. కూలీల సంగతీ పట్టించుకోండి
సాక్షి, అమరావతి: పుట్టిన రోజు వేడుక సంబరాల్లో మునిగితేలుతున్న సీఎం చంద్రబాబు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీల అతీగతీ కూడా పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్ఘాటించింది. గత నాలుగున్నర నెలలుగా ఉపాధి హామీ పథకం పనులకు హాజరైన కూలీలకు రూ. 1,027 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసింది. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట కూలీలు ధర్నా నిర్వహించారు. మండుటెండలోనూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యాలయం ప్రధాన గేటు ముందు ఆందోళన నిర్వహించారు. పనిచేసిన 14 రోజులకు ఉపాధి వేతనాలు చెల్లింపులు పూర్తవ్వాలని చట్టం చెబుతున్నా, చేసిన పనికి నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా పేదలను వేధిస్తున్నారంటూ నిరసనలో పాల్గొన్న కార్మిక సంఘ నేతలు, కూలీలు దుయ్యబట్టారు. కూలీ కోసం, కూటి కోసం పేదలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వాధినేతలు అసలు పట్టించుకోకపోవడం విచారకరమని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కుదించేందుకు చేసే కుట్రలను ఆపాలని స్పష్టం చేశారు.ఫేస్‌యాప్ ద్వారా హాజరు పడితేనే వేతనం వస్తుందన్న షరతును ప్రస్తావిస్తూ, దీనివల్ల క్షేత్రస్థాయిలో ఫేస్‌యాప్ సరిగా పనిచేయక కూలీలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఫేస్‌యాప్‌ను తొలగించి, మ్యాన్యువల్‌గానే కూలీల హాజరు మస్టరు వేయాలని సూచించారు. డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో మే 1న కార్మిక దినోత్సవాన రాష్ట్రమంతటా ఉపాధి హామీ పథకం పని ప్రదేశాల్లో పేదలు నిరసనలు తెలపనున్నట్టు వివరించారు.సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు ఈమని అప్పారావు తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నేతలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉపాధి హామీ పథకం అమలు డైరెక్టర్ షణ్ముఖ్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిరసన చేస్తున్న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి హామీ కూలీలు -
చంద్రబాబు, పవన్‌లను ఏకిపారేసిన కార్యకర్త
నెల్లూరు : ‘ పవన్ సార్.. మేం అధికారంలోకి వస్తే రోడ్లు వేయిస్తామని అప్పుడు హామీ ఇచ్చారు కదా.. ఇవేనా రోడ్లు’ అంటూ పశ్నించాడు కూటమి కార్యకర్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం కలిచేడు రోడ్డు అధ్వాన్నంగా ఉందని నడిరోడ్డుపైనే మంచం వేసుకుని నిరసన తెలిపాడు కూటమికి చెందిన కార్యకర్త. నెల్లూరు-గూడూరులను కలిపే ఈ రోడ్లపై వెళుతుంటే తమ ప్రాణాలు పోతున్నాయని, ఎటు చూసినా గుంతలు, గోతులతో చాలా అథ్వాన్నంగా ఉందని ఫైర్ అయ్యాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లు వేయిస్తామన్నారు కదా.. ఇవే నా మీరు వేసిన రోడ్లు అంటూ నడిరోడ్డుపై మంచంపై కూర్చొని మరీ నిరసన తెలిపాడు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంలోని పెద్దలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ఏకిపారేశాడు.‘అధికారంలోకి వస్తే రోడ్లు వేయిస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇప్పటివరకూ వేయలేదు. నేను ఆరు నెలల క్రితం చెప్పాను. అయినా పట్టించుకోలేదు. మళ్లీ ఈ విషయాన్ని ఇలా చెబుతున్నా. మా కడుపులు మండిపోతున్నాయ్. గతంలో టెంట్లు వేసుకుని రోడ్లు వేయమని అడిగాం. ఇప్పుడు ఇలా నులక మంచం వేసుకుని నిరసన తెలపాల్సి వచ్చింది.పుట్టిన రోజు వేడుకల్లో బిజిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. ఇక్కడ(ఈ రోడ్లపై) పుట్టినరోజు చేసుకుని చూడండి. మా బాధ ఏంటో అర్ధమవుతుంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానండి.. కడుపు మండిపోతుంది. నేను అడిగేది ఒక్కటే అబ్బా.. మీరు వారం రోజుల్లో రోడ్లు వేయిస్తారా.. లేక నిధులు పోగు చేసుకుని మేమే రోడ్డు వేసుకోవాలా? చెప్పండి’ అంటూ సూటిగా ప్రశ్నించాడు. -
డీలిమిటేషన్.. ఢిల్లీలో బీసీ సంఘాల మెరుపు ధర్నా
సాక్షి, ఢిల్లీ: కులగణన తర్వాతనే డీలిమిటేషన్ చేపట్టాలని ఢిల్లీలో బీసీ సంఘాలు మెరుపు ధర్నా నిర్వహించాయి. డీలిమిటేషన్ పత్రాలను చింపివేసి బీసీ నేతలు నిరసనలు తెలిపారు. డీలిమిటేషన్ వల్ల బీసీలకు ఎలాంటి ప్రయోజనం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి అన్నారు. పెంచిన అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు మహిళల పేరుతో మళ్లీ అగ్రకులాలకు దక్కుతాయన్నారు.దేశవ్యాప్తంగా బీసీ కులగణన పూర్తి చేసి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి. మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోట కల్పించాలి. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తాo’’ అని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.బీసీలు బీజేపీని క్షమించరు: మాజీ ఎంపీ వీహెచ్బీసీ ప్రధాని అయి ఉండి బీసీలకే మోదీ ద్రోహం చేస్తున్నారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోట కల్పించకపోతే బీసీలు బీజేపీని క్షమించరు. బీజేపీ బీసీలకు చేస్తున్న మోసంపై ఊరూరా తిరిగి చెప్తాo పోరాడతాం: బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్మహిళా బిల్లు పేరుతో బీసీలను రాజకీయంగా తొక్కి పెట్టాలని చూస్తున్నారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల అక్రందనను కేంద్రం పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థలలో లాగానే చట్టసభల్లో కూడా బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచకుండా డీలిమిటేషన్ చట్టం చేస్తే ఉపయోగం లేదు. బీసీ హక్కుల కోసం బీసీ సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా పోరాడతాంబీసీలంటే పార్టీలకు చిన్న చూపు: శంకర్రావుదేశంలో బీసీలను పట్టించుకునే నాధుడే లేడు. బీసీలు అంటే అన్ని పార్టీలకు చిన్న చూపు. బీసీల ఓట్ల మీద ఉన్న ప్రేమ సీట్ల మీద లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలను చేర్చకపోతే కేంద్రంపై తిరగబడతాం -
అధికారులకు దిమ్మతిరిగే షాక్.. వైరల్ వీడియో
సాక్షి, మహబూబాబాద్: పట్టణంలోని 21వ వార్డుకు రెండు వారాలుగా మున్సిపల్ వాహనం రావడం లేదని దాంతో వార్డులో దుర్వాసన వెదజల్లుతుందని కౌన్సిలర్ జరీనా బేగం పేర్కొన్నారు. 21వ వార్డులోకి వాహనం రాకపోవడంతో స్థానికులు బుధవారం చెత్తతో వార్డు కౌన్సిలర్ ఇంటికి వెళ్లారు. దాంతో కౌన్సిలర్ జరీనాబేగం చేసేది ఏమీ లేక వారిని, వారు తీసుకొచ్చిన చెత్తతో మున్సిపాలిటీ కార్యాలయం వెళ్లారు.ఆ సంచులను కార్యాలయంలో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ జరీనా బేగం మాట్లాడుతూ.. డ్రైవర్ లేరని, వాహనాలు మరమ్మతులు ఉన్నాయని 45 రోజులుగా అధికారులు చెబుతున్నారన్నారు. రెండు వారాలుగా వాహనం రావడం లేదని అంతకుముందు కూడా వార్డు మొత్తం కాకుండా వార్డులో సగం మాత్రమే చెత్త సేకరించేవారని తెలిపారు.HOW TO TEACH LAZY AUTHORITIES A LESSON???Mahabubabad Municipality 21st ward decided not cleaning garbage for a few days is okay!Citizens requested, complained and then decided to teach the officials a lesson. They collected the trash and dumped the garbage in every section… pic.twitter.com/sqhyVFwdmc— Revathi (@revathitweets) April 15, 2026ఆ సమస్యను వార్డు వాసులతో కలిసి కమిషనర్ రాజేశ్వర్, చైర్మన్ గుగులోత్ జ్యోతికి వివరించారు. దీంతో వాహనాలు మరమ్మతులో ఉన్నాయని.. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మరో వార్డుకు కేటాయించిన ట్రాక్టర్‌ను 21వ వార్డుకు పంపించారు. కార్యక్రమంలో వార్డు వాసులు రవి, వీరన్న, ముక్తియార్, ఈసూఫ్, అస్లాం, జిలాని, జాకీర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నోయిడాలో కార్మిక రణరంగం: ఎవరీ మేధా రూపమ్?
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ నోయిడా ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారింది. గత కొద్ది రోజులుగా వేతనాల పెంపుదల కోసం కార్మికులు చేస్తున్న ఆందోళన సోమవారం నాడు హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అందరి కళ్లు ఇప్పుడు గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపమ్ పైనే నిలిచాయి. పరిస్థితిని చక్కదిద్దడంలో యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్న వేళ, అసలు ఎవరీ మేధా రూపమ్? ఆమె నేపథ్యం ఏంటి? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.సివిల్స్‌లో టాప్ 10 ర్యాంకర్మేధా రూపమ్ కేవలం ఒక ఉన్నతాధికారిణి మాత్రమే కాదు, అత్యంత ప్రతిభావంతురాలైన విద్యార్థిని కూడా. ఆమె నేపథ్యం పరిశీలిస్తే.. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. 2013 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆల్ ఇండియా 10వ ర్యాంకు సాధించి, సంచలనం సృష్టించారు. 2014 బ్యాచ్‌కు చెందిన యూపీ కేడర్ ఐఏఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. ఆమె తండ్రి జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.వివాదాలు.. వరుస సవాళ్లు2025 జూలై 29న గౌతమ్ బుద్ధ్ నగర్ డీఎంగా బాధ్యతలు చేపట్టిన మేధా రూపమ్నకు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో ఒక ఇంజనీర్ వర్షపు నీటి గుంతలో పడి మరణించిన ఘటనలో ఆమె విమర్శలు ఎదుర్కోగా, ఇప్పుడు కార్మిక లోకం భగ్గుమనడం ఆమె సమర్థతకు పెద్ద పరీక్షగా మారింది. కాగా కార్మికుల ఆందోళన తీవ్రం కావడంతో మేధా రూపమ్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కార్మికుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని పారిశ్రామిక వర్గాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.అదనపు పని గంటలు (ఓటీ), ఆదివారాలు పనిచేసే వారికి రెట్టింపు జీతం ఇవ్వాలి. ప్రతి నెలా 10వ తేదీలోపు శాలరీ స్లిప్పులతో పాటు పూర్తి జీతం ఖాతాల్లో జమ కావాలి. నవంబర్ 30 లోపు బోనస్ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేయాలని మేధా రూపమ్ ఆదేశించారు. ప్రతి ఫ్యాక్టరీలో మహిళా నేతృత్వంలో ‘లైంగిక వేధింపుల నివారణ కమిటీ’లను ఏర్పాటు చేయడంతో పాటు ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం నోయిడా వీధుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: సీనియర్ జర్నలిస్ట్ సంచలన నిర్ణయం.. పోస్ట్‌మ్యాన్‌గా మారి.. -
నోయిడా కార్మికుల నిరసనల్లో బిగ్ ట్విస్ట్..!
లక్నో: వేతనాలు పెంచాలంటూ నిన్న ( సోమవారం) గ్రేటర్ నోయిడా (యూపీ)లో కార్మికులు ఆందోళన చేపట్టిన హింసాత్మకంగా మారింది. అయితే నిరసనలపై యూపీ కార్మిక శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆందోళనల వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై లోతైన విచారణ చేపడుతున్నామని తెలిపారు.గ్రేటర్ నోయిడాలో కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫేజ్ 2 పారిశ్రామిక ప్రాంతంలో వరుసగా నాలుగో రోజు జరుగుతున్న ఈ నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ఆగ్రహంతో రగిలిపోయిన కార్మికులు పోలీసుల వాహనాలను బోల్తా కొట్టించి, రాళ్ల దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అదుపు తప్పుతున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు ఆందోళనకారులు పలు కంపెనీల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు, ఒక వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై యూపీ మంత్రి స్పందించారు.ఆయన మాట్లాడుతూ "నోయిడాలో జరిగిన నిరసనలు రాష్ట్ర అభివృద్ధికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశ్యంతోనే జరిగినట్లు కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం, మీరట్ నోయిడాలలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు కుట్ర జరిగిందనే అవకాశాలు బలపడుతున్నాయి. ఏజెన్సీలు ఈ మొత్తం విషయంపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాయి," అని రాజ్‌భర్ అన్నారు.కాగా నిన్న జరిగిన నిరసనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనల్లో హింసను సృష్టించిన దాదాపు 300 మందిని ఇప్పటివరకూ అరెస్టు చేసినట్లు తెలిపింది. మరో వందమందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముజఫర్ నగర్లో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో దానికి ఇబ్బందులు కలిగించడానికి ఈ ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ కార్మికులందరూ సంయమనం పాటించాలని ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు ప్రభావితం కాకూడదని విజ్ఞప్తి చేశారు. -
దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన..
దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో భాగంగా నిరసనకారులు ఫేజ్-2, సెక్టార్-60 పరిసరాల్లో వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కరించలేని కార్మికుల డిమాండ్లు ఈ నిరసనలకు ప్రధాన కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కార్మికులు డిమాండ్లు కింద తెలియజేశాం.వేతనాల పెంపుప్రస్తుతం నోయిడాలోని పారిశ్రామిక కార్మికులు నెలకు రూ.13,000 నుంచి రూ.15,000 మధ్య చెల్లిస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని వారు వాపోతున్నారు. కనీస వేతనాన్ని రూ.20,000కు పెంచాలని పట్టుబడుతున్నారు. ‘పదేళ్లుగా ధరలు పెరిగాయి కానీ, మా శ్రమకు దక్కే ఫలితం మాత్రం దక్కడం లేదు’ అని ఒక కార్మిక నేత ఆవేదన వ్యక్తం చేశారు.హరియాణాతో పోలికఈ నిరసనలకు ప్రధాన ప్రేరణ పొరుగు రాష్ట్రమైన హరియాణా తీసుకున్న నిర్ణయం. అక్కడి ప్రభుత్వం కనీస వేతనాన్ని రూ.14,000 నుంచి రూ.19,000కు (సుమారు 35 శాతం) పెంచింది. ఒకే పని చేస్తున్నా ఉత్తరప్రదేశ్ (నోయిడా) కార్మికులు హరియాణా కార్మికుల కంటే దాదాపు రూ.6,000 తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ వ్యత్యాసమే అశాంతికి ఆజ్యం పోసింది.12 గంటల షిఫ్టులకు స్వస్తి పలకాలిహోసియరీ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో కార్మిక చట్టాలను తుంగలో తొక్కి బలవంతంగా 12 గంటల పాటు పని చేయిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పని గంటలను చట్టబద్ధమైన 8 గంటలకే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదనపు పనిని 'నిబంధన'గా కాకుండా, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.ఓవర్ టైం, బోనస్ బకాయిలుకార్మిక చట్టాల ప్రకారం, అదనపు గంటలు పనిచేసినప్పుడు సాధారణ వేతనం కంటే రెట్టింపు చెల్లించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. వార్షిక బోనస్‌ల విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతున్నారు.పని ప్రదేశంలో భద్రత - గౌరవంఫ్యాక్టరీ లోపల కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని, మహిళా కార్మికులపై వేధింపులు అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన యంత్రాంగం దీనికి స్పందిస్తూ, మహిళా అధికారిణి నేతృత్వంలో ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే, ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కచ్చితంగా అమలు కావాలని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపుఅనేక కంపెనీలు నెలల తరబడి వేతన బకాయిలను, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన సెటిల్మెంట్లను నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ కష్టార్జితం తమకు దక్కకుండా యాజమాన్యాలు తాత్సారం చేస్తున్నాయని, ఈ బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! -
భార్యకు, చెల్లికి తేడా తెలియని ABN.. RKకు వత్తాసు..
-
సింహాల్లా పోరాడిన తండ్రి కూతురు
-
ABN రాధాకృష్ణ వ్యాఖ్యలపై YSRCP నిరసన
-
abn ఆఫీస్ వద్ద టెన్షన్ .. టెన్షన్ (ఫోటోలు)
-
గజ్వేల్ లో టెన్షన్ టెన్షన్..
-
11, 12 తేదీల్లో సచివాలయ ఉద్యోగుల ‘ఛలో విజయవాడ’
సాక్షి, అమరావతి: న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే మంజూరు చేయాలని, ఉద్యోగుల నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేసే ప్రక్రియకు స్వస్తి పలకాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది.సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11, 12 తేదీల్లో ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘సచివాలయ ఉద్యోగుల ఆవేదన’ పేరిట జేఏసీ చైర్మన్ బూరాడ మధుబాబు రెండు రోజుల నిరాహార దీక్ష చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. -
BR నాయుడు రాజీనామా చేయడం లేదా..? చంద్రబాబు చెప్పడం లేదా..
-
ఎమ్మిగనూరులో టెన్షన్.. టెన్షన్
సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడంపై ఆందోళన చేపట్టారు. కోఆపరేటివ్ సొసైటీ ఎదుట చేనేతలు నిరసనకు దిగారు. చేనేత కార్మికులకు మద్దతుగా వైఎస్సార్సీపీ, వామపక్ష నేతలు ధర్నాకు దిగారు. సొసైటీని అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై చేనేత కార్మికులు, వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించారు.ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విలీనం పేరుతో చేనేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. సర్వసభ్య సమావేశంలో విలీన అంశం తొలగించాలంటూ డిమాండ్ చేశారు. -
వేతనాలు పెంచకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన
సాక్షి, అమరావతి: అంగన్వాడీల వేతనాలు తక్షణమే పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను అసోసియేషన్ అధ్యక్షురాలు జి.బేబీరాణి, ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా అంగన్వాడీల వేతనాలు పెంపు కోసం ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. గ్రాట్యూటీ జీవో ఇచ్చినా నేటికీ గైడ్‌లైన్స్ రూపొందించలేదన్నారు. మట్టిఖర్చుల జీవో కూడా అమలుకు నోచుకోవడంలేదన్నారు.మార్చి 2న వేలాది మంది అంగన్వాడీలు విజయవాడలో చేపట్టిన నిరసనను పోలీసుల ప్రోద్భలంతో అణిచివేశారని, లైట్లు ఆపేసి, టెంట్లు పీకేసి వందలాది మంది మహిళలను ఈడ్చుకుంటూ జీపుల్లో తీసుకెళ్లారన్నారు. ఈ నిరసన సమయంలో కూడా మంత్రులు అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారని, ఇప్పటికైనా ఇచి్చన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
ఇరాన్‌కి మద్దుతుగా జేకేఎన్సీ ఎమ్మెల్యేల ఆందోళన
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఇరాన్‌కి మద్దుతుగా నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు నిరసనగా జేఎన్ఎన్కే ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ లోపల, బయట కూడా నిరసనలు చేపట్టారు.జేకేఎన్సీ ఎమ్మెల్యే తన్వీర్ సాదిక్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఇరాన్‌కు అండగా నిలుస్తుందని,.. ఈ దాడులను ఖండించాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గతంలోనే అయతొల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించారు. ఇరాన్‌కు మేమంతా అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. ఖమేనీ హత్య అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన.. ఒక సార్వభౌమ దేశంపై మరో దేశం ఇలాంటి చర్యలకు పాల్పడకూడదంటూ సాదిక్ నొక్కి చెప్పారు.‘‘అంతకుముందు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణను ఖండించారు. సైనిక బలంతో పాలన మార్పును సాధించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి.. బాహ్య జోక్యం ఉండకూడదు. ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల హత్యను నేను ఖండిస్తున్నాను. ఇలా చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఏ చట్టం అధికారం ఇచ్చింది’’ అంటూ ఆయన ప్రశ్నించారు.J-K: National Conference MLAs protest in assembly, express solidarity with Iran over killing of Ayatollah Ali KhameneiRead @ANI Story |https://t.co/RphI1lVvvm#JammuKashmirAssembly #Khamenei #protest #NationalConference #JKNC pic.twitter.com/FTZOaZy5ML— ANI Digital (@ani_digital) March 27, 2026 -
జిన్నా పాఠం తొలగించండి.. జమ్మూలో ఆందోళన
జమ్మూ వర్సిటీ ఎదుట ఈ రోజు ( ఆదివారం) ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. పీజీ పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో పాకిస్థాన్ నాయకుడు మహ్మాద్ ఆలీ జిన్నా పాఠ్యాంశాన్ని చేర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చాఫ్టర్‌ని వెంటనే తొలిగించాలని లేనిచో ఆందోళన మరింతగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు.జమ్మూ విశ్వవిద్యాలయంలోని రాజనీతి శాస్త్ర విభాగం 2026-2028 విద్యా సంవత్సరానికి గాను విడుదల చేసన సిలబస్‌లో 'ఆధునిక భారత రాజకీయ ఆలోచన' అనే శీర్షిక కింద, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ అలీ జిన్నాలతో సహా కొంతమంది వ్యక్తులను మైనారిటీ వర్గాల ప్రతినిధులుగా చిత్రీకరిస్తున్నారు. దేశ విభజనలో పాత్ర పోషించి, ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు వీరే. వీరి గురించి బోధించడం ఆందోళన కలిగిస్తోంది'. అని ఏబీవీపీ నాయకులు తెలిపారు.పాఠ్యప్రణాళికలో మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలంటే, దేశ విభజనతో సంబంధం ఉన్నవారిని కాకుండా, మైనారిటీల కోసం వ్యక్తులను చేర్చాలని వారినే చేర్చితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. అంతేగాని దేశ విభజనకు కారణమైన వారి గురించి చదవాల్సిన అవసరం లేదన్నారు. పాఠ్యాంశాన్ని తక్షణమే తొలగించకపోతే నిరసనలు మరింత ఉద్రిక్తం చేస్తామని తెలిపారు.అయితే దీనిపై పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి బల్జిత్ సింగ్ మాన్ స్పందించారు" జిన్నా మరియు ఇతర మేధావులను చేర్చడం పూర్తిగా విద్యాపరమైనదేనని, ఇది దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్న పాఠ్యప్రణాళికలకు, అలాగే యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే ఉందని" తెలిపారు. విశ్వవిద్యాలయం ఏ భావజాలాన్నీ ప్రోత్సహించదని, కానీ విమర్శనాత్మకతకు వీలు కల్పించేందుకు భిన్నమైన దృక్కోణాలను విద్యార్థులకు అందిస్తుందన్నారు. మంచి చెడులను అంచనా వేసి, ఏది సరైనదో ఏది తప్పో విచక్షణ కలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. -
పోలీసులతో మహిళలను, YSRCP నేతలను కొట్టిస్తున్న BR నాయుడు
-
నిందితులకు మూడు రోజుల కస్టడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్ సందర్భంగా నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీలోని కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ముగ్గురి కస్టడీని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అడ్డుకోగా, 24 గంటలపాటు చోటుచేసుకున్న నాటకీయ పరిణామా ల మధ్య వారిని ఢిల్లీ పోలీసులు దేశరాజధానికి తరలించారు. కోర్టు ట్రాన్సిట్ రిమాండ్‌కు అనుమతించినప్పటికీ హిమాచల్ పోలీసులు ఢిల్లీ పోలీసులను దాదాపు ఐదు గంటలపాటు దిగ్బంధించారు. ఎట్టకేలకు నిందితులతోపాటు వారు ఢిల్లీకి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య గురువారం పోలీసులు ముగ్గురినీ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మృదుల్ గుప్తా ఎదుట హాజరు పరిచారు. విచారణ కోసం ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని కోరారు. నిందితుల్లో యూపీ వాసులైన సౌరభ్, అర్బాజ్ ఖాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన సిద్ధార్థ అవధూత్లు అరెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ రిసార్టులో దాక్కున్నారని పోలీసుల తరఫు లాయర్ తెలిపారు. బుధవారం ఉదయం 6.40 గంటల వేళ వారిని అదుపులోకి తీసుకుని, అదే రోజు మధ్యా హ్నం 1.40కి సిమ్లాలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి, ట్రాన్సిట్ రిమాండ్‌కు కోరామన్నారు. అనుమతించిన కోర్టు.. వారిని 18 గంటల్లోగా సంబంధిత కోర్టులో హాజరుపర్చాలని షరతు పెట్టిందని వివరించారు. ఇంపాక్ట్ సమిట్ వద్ద నిరసన తెలిపేందుకు వాడిన టీషర్ట్‌ను సిద్ధార్థ్ డిజైన్ చేయగా, సౌరభ్ నిరసనకు పిలుపునిచ్చే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడని, సౌరభ్, అర్భాజ్లు నిరసనలో పాల్గొన్నారని లాయర్ పేర్కొన్నారు. నిరసన కోసం లక్షకు పైగా టీషర్టులను ప్రింట్ చేశారని, వీటిని ఎక్కడ ప్రింట్ చేశారు? దీని వెనుక ఎవరెవరున్నారో తెల్సుకునే ప్రయత్నా ల్లో ఉన్నామన్నారు. అయితే, నిరసన తెలిపారనే సాకుతో ఢిల్లీ పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారని, ఇదంతా రాజకీయ పేర్రేపితమని నిందితుల తరఫు లాయర్ వాదించారు. వాదనలు విన్న మేజి్రస్టేట్ నిందితుల ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. మార్చి ఒకటో తేదీన తిరిగి వారిని తమ ఎదుట హాజరుపర్చాలని కోరారు. వీరితోపాటు ఈ కేసులో అంతకుముందే అరెస్ట్ చేసిన అజయ్ కుమార్, రాజా గుజార్ అనే వారి రిమాండ్ గడువు ముగియడంతో వారిని కూడా పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. దీంతో, వారి రిమాండ్‌ను మరో మూడు రోజులకు పొడిగిస్తున్నట్లు మేజి్రస్టేట్ తెలిపారు. -
అధికారమదంపై ‘ధర్నా’గ్రహం
అధికారపార్టీ అడ్డగోలు వేధింపులు, అక్రమ తొలగింపులపై చిరుద్యోగులు నిరసన గళమెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచీ తరలివచ్చి బెజవాడలో కదంతొక్కారు. రాష్ట్రస్థాయి ధర్నాలో చంద్రబాబు సర్కారు దుర్నీతిపై ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని దిక్కులుపిక్కటిల్లేలా నినదించారు. సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : క్షేత్రస్థాయిలో పొదుపు సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షించే గ్రామ సమాఖ్య సహాయకులు (వెలుగు వీవోఏ – డ్వాక్రా యానిమేటర్లు), మెప్మా రిసోర్స్ పర్సన్లు (ఆర్పీ)లు బుధవారం విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా చేపట్టారు. అధికార పార్టీ నేతల పెత్తనం పెరగడంతో పాటు నిబంధనలకు విరుద్ధ కార్యక్రమాల పేరిట వేధింపులు, అక్రమ తొలగింపులను నిరసించారు. తొలుత రాష్ట్ర నలుమూలల నుంచీ తరలివచ్చిన ఉద్యోగులు విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. బాబు సర్కారుకు వ్యతిరేకంగా వారు చేసిన నినాదాలతో ధర్నాచౌక్ దద్దరిల్లింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు కనీస వేతనాలు వర్తింపజేయాలని, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వీవోఏ–యానిమేటర్లతో పాటు ఆర్పీలకు ఇచ్చే నెలవారీ వేతనం రూ.8వేలు, రూ.పదివేలు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు రూ.26 వేల చొప్పున చెల్లించాలని.. హెచ్ఆర్ పాలసీ అమలు, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, అర్హులైన వారికి పదోన్నతులు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వీవోఏ – యానిమేటర్లకు స్త్రీనిధి ప్రోత్సాహకాలు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, ఒక్కొక్కరికీ రూ. 30 వేల నుంచి రూ.లక్ష వరకు రావాల్సి ఉందని వివరించారు. ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని నినదించారు. 60 ఏళ్లు నిండిన వీఓఏలకు నిలుపుదల చేసిన వేతనాలు చెల్లించాలని, మెప్మా ఆర్పీలకు గ్రేడింగ్ విధానం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచి్చన మేరకు మహిళలు పొదుపు సంఘాల ద్వారా తీసుకునే రుణాలపై రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీలు చెల్లించాలని, మహిళా మార్టులు, స్వావలంబన, అభయహస్తం నగదును పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరారు. చిరుద్యోగుల ధర్నాకు సీపీఎం నేత వి. శ్రీనివాసరావు సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు మద్దతుగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్ర స్థాయి ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధులు సెర్ప్ సీఈవో వాకాటి కరుణ, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్‌లను కలిసి వినతిపత్రాలను అందజేశారు.అంగన్వాడీల వినూత్న నిరసనఏలూరు (టూటౌన్): ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులు భర్తీ చేయాలని, అంగన్వాడీల వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద తలపెట్టిన నిరాహార దీక్షలు రెండోరోజు బుధవారం కొనసాగాయి. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది అంగన్వాడీలు తరలివచ్చారు. కనీస వేతనం రూ.26,000, సంక్షేమ పథకాల అమలు, యాప్స్ అన్నీ కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, మెనూ చార్జీలు పెంచాలని పెద్దపెట్టున నినదించారు. మోకాళ్లపై నిలిచి నిరసన గళం వినిపించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ , ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.భారతి పాల్గొన్నారు. -
శిశువు మృతిపై పెల్లుబికిన ఆగ్రహం..
సాక్షి, నాగర్‌కర్నూల్: రెండు రోజుల క్రితం ఆలయంలో దర్శనం కోసం వచ్చిన భక్తులపై నిర్వాహకులు దాడి చేయగా తోపులాటలో రెండు నెలల శిశువు కిందపడగా, ఆదివారం మృతిచెందింది. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులతోపాటు ప్రతిపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతోపాటు బీసీ, ఎస్సీ, కులసంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రోజంతా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈనెల 18న ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ‘కుమ్మెర ఆలయంలో దాడి ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న వారంతా నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి బంధువులు కావడంతో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు. బాధితులు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. వారిని కాపాడేందుకు బాధితులపైనే వేధింపులకు పాల్పడ్డారు’ అని మర్రి ఆరోపించారు. -
శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ రత్నాబాయి, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మృతికి శానమండలి సంతాపం తెలిపింది రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. భోలేబాబా, హెరిటేజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాసనమండలికి వైఎస్సార్సీపీ సభ్యులు ర్యాలీగా వెళ్లారు. ఇందాపూర్ డెయిరీ అంశంపై రెండో రోజు వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. వాయిదా తీర్మానంపై వైఎస్సార్సీపీ చర్చకు పట్టుపట్టింది.వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనతో ఐదు నిముషాల పాటు మండలి వాయిదా పడింది. ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు.మంత్రి నారా లోకేష్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ వాళ్ళిద్దరు వాయిదా తీర్మానం ఇవ్వడంలో వింత లేదు. వాళ్ళిద్దరు ఎప్పుడో చంద్రబాబు కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అని మంత్రి నారా లోకేష్ అనడం హాస్యస్పదం. వాళ్ళిద్దరితో వాయిదా తీర్మానం ఇప్పించి మా పార్టీ వాళ్ళు అనడం కేవలం చర్చను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం. ఇందాపూర్ డెయిరీపై మేము చర్చకు పట్టుపడుతున్నాం. మీకు దేవుడి పట్ల చిత్తశుద్ధి ఉంటే టీటీడీ సహా ఇతర ఆరోపణలపై చర్చకు సిద్ధం’’ అంటూ అప్పిరెడ్డి సవాల్ విసిరారు. -
టీచర్ల గర్జనతో దద్దరిల్లిన బెజవాడ
-
శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన
సాక్షి, అమరావతి: అసెంబ్లీ చరిత్రలోనే అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని రీతిలో గంట ఆలస్యంగా అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 9 గంటలకు బదులు 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గంట ఆలస్యంగా మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అవ్వగానే వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. 10 గంటలకు ప్రారంభిస్తామని డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. ఆలస్యానికి కారణాలపై ప్రభుత్వం స్పష్టత నివ్వలేదు.శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చకు డిమాండ్ చేశారు. గోవిందా గోవిందా అంటూ వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఛైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో వైఎస్సార్సీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనలతో మండలి వాయిదా పడింది. ఆడబిడ్డ నిధి పేరుతో కూటమి మోసం: వరుదు కల్యాణివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ... ఆడబిడ్డ నిధిపై మండలిలో తాము ప్రశ్నించామన్నారు. జిల్లా వారీగా ఖర్చుల వివరాలు చెప్పమని అడిగామని తెలిపారు. ప్రభుత్వం మూడు బడ్జెట్లు పెట్టింది. ఇంకా ఆడబిడ్డ నిధి పరిశీలనలో ఉందనే సమాధానం చెబుతోంది. మహానాడులో చంద్రబాబు ఇచ్చిన హామీ ఆడబిడ్డ నిధి. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చి మరీ పబ్లిసిటీ చేశారు. ఇంటింటికీ వెళ్లి బాండ్లు పంచారు. కూటమి నేతల మాటలు విని ప్రజలు మోసపోయారు. ఏ మొహం పెట్టుకుని ఈరోజు ఆడబిడ్డల ముందుకు వెళ్తారు’’ అంటూ వరుదు కల్యాని నిలదీశారు.‘‘ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆడబిడ్డ నిధిపై క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలి. ప్రభుత్వానికి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలనే ఆలోచన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి’’ అని వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. -
యూరియా కోసం రైతులు ఆందోళన
శ్రీకాకుళం: యూరియా కోసం సచివాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగిన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామానికి వచ్చిన యూరియా టీడీపీ నేతలు తీసుకుని అక్రమంగా తరలిస్తున్నారంటూ గార మండలం వమరవల్లి పంచాయతిలోని రైతులు ఆందోళన బాట పట్టారు. యూరియాను అందరికి సమానంగా అందజేయాలని కోరుతూ గ్రామ సచివాలయం ఎదుట రైతులు బైఠాయించార. యూరియాను అక్రమంగా తరలిస్తూ తమకు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.‘రైతులు కాని వారికి యూరియా ఇస్తున్నారు. టీడీపీ నాయకురాలు భవాని చెప్పిన వారికి మాత్రమే యూరియా ఇస్తున్నారు. అధికారులు కూడా టిడిపి నాయకులు చెప్పిన వారికే యూరియా ఇవ్వడం దారుణం. పాస్ బుక్ ప్రకారం యూరియా ఇమ్మని అడిగితే ఇవ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు సర్కార్ బడ్జెట్ ‘దృశ్యం’ సినిమాను తలపిస్తోంది: సీపీఎం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలిపిస్తోందంటూ సీపీఎం ఎద్దేవా చేసింది. కూటమి బడ్జెట్‌ను నిరసిస్తూ.. విజయవాడలో సీపీఎం ఆందోళనకు దిగింది. నిరసనలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు , పరిశ్రమలు వచ్చినట్లు, యువతకు ఉపాధి కల్పించేసినట్లు చెబుతున్నారు. దేశం మొత్తంలో 25 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చేశాయని చెబుతున్నారు ..కానీ బడ్జెట్ అందుకు విరుద్ధంగా ఉందంటూ మండిపడ్డారు.‘‘కోతల మీద వాతలు పెట్టినట్లే ఉంది ఈ బడ్జెట్. రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది. అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. గత రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని తేలిపోయింది. బడ్జెట్ అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదు. కౌలు రైతుల గురించి కనీసం ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ..ఊసే లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు.. అదీ లేదు...సూపర్ సిక్స్‌లో భాగమైనవి ఇవ్వకుండా అన్నీ ఇచ్చేశామంటున్నారు. అమృత్ నిధులు, స్మార్ట్ సిటీ నిధులు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదు. బెజవాడలో ఎటు చూసినా మురికి వీధులు, దోమల మయం. విజయవాడే ఇలా ఉంటి మిగిలిన పట్టణాల సంగతి చెప్పనక్కర్లేదు. రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి ప్రజల తిరోగమనానికి కారణమైన బడ్జెట్ ఇది’’ అంటూ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శాంతిభద్రతలను కాపాడండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎదుట నినదించింది. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలూ సంతోషంగా లేరని నిప్పులు చెరిగింది. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉదయం ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. ప్రజల గొంతు వినిపించనివ్వరు.. ప్రతిపక్ష హోదా ఇవ్వరు.. రైతు సమస్యలు వినిపించనివ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే నినాదంతో కూడిన బ్యానర్లతో పాటు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ నాలుగో నంబర్ గేటు ద్వారా సభ్యులు సభలోకి వచ్చారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే ప్లకార్డును వైఎస్ జగన్ స్వయంగా పట్టుకుని లోపలకు ప్రవేశించారు. వైఎస్ జగన్ తన స్థానంలో ఆశీనులవ్వగానే సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి.. హామీలిచ్చారు.. అమలు మరిచారు.. అర్హులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం..’ అని నినదిస్తూ ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లారు. వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నప్పటికీ, గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఈ నేపథ్యంలో మార్షల్స్ పోడియం వద్దకు చేరుకుని వైఎస్సార్సీపీ సభ్యులు ముందుకు వెళ్లకుండా వలయంగా నిలబడ్డారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. -
ప్రతిపక్ష హోదా ఇవ్వాలని YSRCP నినాదాలు
-
Hyderabad: డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. బారికేడ్లను తోసుకొని కార్యాలయం ముందుకు దూసుకువచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో.. వారి మధ్య వాగ్వాదం జరిగింది. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై బీజేపీ నిరసనలకు దిగింది. మంత్రి శ్రీహరి వేధింపులే కారణమని బీజేపీ ఆరోపిస్తుంది.మక్తల్ బీజేపీ అభ్యర్థి సూసైడ్ చేసుకున్నట్లు ఫిర్యాదు వచ్చిందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని... మహాదేవప్ప సూసైడ్ లెటర్ రాయలేదని.. విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. కాగా, మక్తల్ పట్టణ కేంద్రంలో 6 వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి చెందడంతో తాత్కాలింగా ఆ వార్డు ఎన్నిక మాత్రమే రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎంపీగా సిగ్గుతో తలదించుకుంటున్నా
సాక్షి, హైదరాబాద్ / కంటోన్మెంట్: ప్రజల కు మాటి చ్చి.. ఏడాది న్నరగా చేయలేకపో యినందుకు ఎంపీగా సిగ్గుతో తలదించు కుంటున్నా.. అంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మారేడు పల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వా లంటూ స్థానిక కార్పొ రేటర్ కొంతం దీపిక చేపట్టిన దీక్షకు ఆయన హాజరై మాట్లాడారు. మారేడు పల్లిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో ఎనిమిదేళ్ల క్రితం ఇళ్లు కూల్చేసి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చేపట్టారన్నారు. 2022లో సుమారు 250 మందికి ఇళ్లు కేటాయించినా, మరో 150 మందికి ఇప్పటికీ ఇళ్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు.డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరి జాగీరు కాద ని, ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించిన కాంగ్రెస్ నేతలు, వారు అధికారంలోకి వచ్చి ఒరగబెట్టిందేంటని నిలదీశారు. ఈ అంశంపై ఏడాదిన్నరగా తాను ప్రయ త్నాలు చేస్తున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేద న్నారు. అధికారులకు సైతం ఎంపీ అన్నా లెక్కలేకుండా పోయిందన్నారు. గత డిసెంబర్లో కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో తాను స్వయంగా పాల్గొన్నానని గుర్తు చేశారు. జనవరి ఒకటో వారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారు లకు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినా, నేటికీ పని పూర్తికాలేదన్నారు. ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేశ్‌లతో పదేపదే మాట్లాడినా ఎలాంటి స్పందన లేదన్నారు.


