వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి ప్రాణాల్ని అన్యాయంగా తీసుకుంటుంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. నిరసనకారులపై బలప్రయోగం చేయొద్దు. వారిని చంపితే ఇరాన్‌పై యుద్ధం చేస్తామంటూ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు.
ఇరాన్‌లో జెన్‌జీ (Gen Z) ఉద్యమం తారాస్థాయికి చేరింది. అక్కడి యువత ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రియాల్ కరెన్సీ పతనం కారణంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు గత వారం టెహ్రాన్‌లో ప్రారంభమై కొన్ని గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ క్రమంలో ఆందోళన కారుల్ని అరికట్టేందుకు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ క్రమంలో ఇరాన్ తీరుపై ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇరాన్ ప్రజలపై దాడులు కొనసాగితే, అమెరికా మౌనంగా ఉండదు. మేం సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్ అన్నారు. అంతేకాదు నిరసన కారులను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
2022 తర్వాత తొలిసారి ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుండడం, రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడం, అనైతిక చట్టాల అమలుతో పాటు పలు అంశాలపై ఇరాన్‌లోని టెహ్రాన్‌తో పాటు పలు ప్రోవిన్స్ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసన కారుల్ని అణిచి వేసేందుకు కాల్పులకు తెగబడుతోంది. ఫలితంగా ఐదురోజుల వ్యవధిలో సుమారు ఏడుగురికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
If Iran shots and violently kills peaceful protesters, which is their custom, the United States of America will come to their rescue. We are locked and loaded and ready to go. Thank you for your attention to this matter! President DONALD J.TRUMP
(TS: 02 Jan 02:58 ET)…— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) January 2, 2026


