లేడీ వేశంలో ఉగ్రవాది.. అయినా వదిలేదిలే..! | Terrorist disguised as a woman roams in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

లేడీ వేశంలో ఉగ్రవాది.. అయినా వదిలేదిలే..!

Feb 16 2026 7:52 PM | Updated on Feb 16 2026 8:55 PM

Terrorist disguised as a woman roams in Jammu and Kashmir

ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ తన సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసింది. ఉగ్రవాదులు స్థావరాలను నిర్వీర్యం చేస్తూ వారికి ఎటువంటి సహాయం అందకుండా అష్ట దిగ్భందనం చేస్తుంది. ఈ నేపథ్యంలో జైషే-ఏ- మహ్మద్ తీవ్రవాది సైపుల్లా ఖాన్ భద్రతా బలగాల కళ్లుగప్పుతూ మారు వేశంలో తిరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.

జైష్‌-ఏ-మహమ్మద్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖాన్ ప్రస్తుతం భద్రతా బలగాల కంటపడకుండా ఉండడానికి నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ గుర్తించకుండా ఉండడానికి గడ్డం తీసి ఆడవారిలా బుర్ఖాలు ధరించి తిరుగుతున్నట్లు దోడా సూపరిండెంట్ సందీప్ మెహతా అన్నారు. అంతే కాకుంగా కొన్నికొన్ని సార్లు ఎవరికి అనుమానం రాకుండా స్థానికుల మద్ధతు పొందేందుకు ఆద్యాత్మిక గురువు వేశం వేసి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గత రెండు నెలలుగా అతని కోసం కిష్వారా, దోడా ప్రాంతాలలో గాలింపులు చేపడుతున్నామని ఈ నేపథ్యంలోనే జనవరి 19న అతని రహస్య స్థావరాన్ని కనుగొని దానిని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ స్థావరం 12 వేల అడుగుల ఎత్తులో బంకర్ల మాదిరిగా నిర్మించారని తెలిపారు. ఈ స్థావరం ధ్వంసం అయిన తర్వాత అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అతని ఉనికిని గుర్తించకుండా ఉండడానికి పలుమార్లు తన వేశాలు మారుస్తున్నాడని తెలిపారు. 

భద్రతా బలగాలు అతని సహచరుడు ఆదిల్‌ను హత్య చేశాయన్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీకి చిక్కకుండా ఉండేందుకు అతను మరింత జాగ్రత్త పడుతున్నట్లు సూపరిండెంట్ సందీప్ మెహతా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement