ఇజ్రాయెల్‌కు మోదీ.. షెడ్యూల్‌ ఫిక్స్..! | Prime Minister Modi to visit Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌కు మోదీ.. షెడ్యూల్‌ ఫిక్స్..!

Feb 16 2026 7:20 PM | Updated on Feb 16 2026 7:58 PM

Prime Minister Modi to visit Israel

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. ఆయన పర్యటన వివరాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ స్వయంగా వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.

ఇజ్రాయెల్ ప్రధాని ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. "భారత ప్రధాని వచ్చేవారం ఇజ్రాయెల్ పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం అద్భుతమైన సంబంధాలున్నాయి. ఇప్పుడు మరిన్ని అంశాలపై చర్చించబోతున్నాం. మనందరికి తెలుసు ఇండియా చిన్న దేశం కాదు. 140 కోట్ల జనాభా ఉన్న దేశం. చాలా శక్తివంతమైనది. చాలా పాపులరైంది" అని అన్నారు.

ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో రెండు దేశాల సిద్ధాంతం ప్రతిపాదిస్తూనే టెల్‌ అవీవ్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తుందని తెలిపారు. అయితే దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.. "నా మిత్రుడు ప్రధాని నెతన్యూహుతో ఇదివరకే ఫోన్‌లో సంభాషించాను. ఇజ్రాయెల్-ఇండియా వ్యూహాత్మక సంబంధాలపై చర్చించాము. రెండుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం దిశగా చర్చలు జరుపుతున్నాము. అదేవిధంగా టెర్రరిజాన్ని మాత్రం ఎట్టిపరిస్థితిలో సహించేది లేదు. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధించేందుకు భారత్ తన పూర్తి సహాకారాన్ని అందిస్తుంది." అని మోదీ అన్నారు. భారత ప్రధాని ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని భారత్‌లో పర్యటించాల్సి ఉండగా పలు కారణాలతో ఆయన పర్యటన రద్దైంది.

Advertisement
 
Advertisement
Advertisement