‘మా పార్టీ బేస్ పెరిగింది.. ఓటింగ్‌ శాతం పెరిగింది’ | BJP Telangana chief Ramchander Rao On Municipal Elections | Sakshi
Sakshi News home page

‘మా పార్టీ బేస్ పెరిగింది.. ఓటింగ్‌ శాతం పెరిగింది’

Feb 16 2026 6:39 PM | Updated on Feb 16 2026 6:45 PM

BJP Telangana chief Ramchander Rao On Municipal Elections

హైదరాబాద్: కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు బైంసా, నారాయణపేట్‌లలో బీజేపీ జెండా ఎగురువేయడంపై  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. బైంసాలో తమ కార్యకర్తలను వేధించి,  వందలు కేసులు పెట్టి జైలుకు పంపారని, అయినా ఇక్కడ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. దీనిలో భాగంగా బైంసా ప్రజలకు రాంచందర్‌రావు ధన్యవాదాలు తెలియజేశారు. 

‘ మా ఓటు శాతం భారీగా పెరిగింది. 25 మునిసిపాలిటీలలో డిసైడింగ్ పార్టీ గా ఉన్నాం. చాలా ప్రాంతాల్లో వైస్ చైర్మన్‌గా గెలుస్తున్నాం. చాలా మున్సిపాలిటీల్లో సింగిల్ లార్టెస్ట్ పార్టీగా ఉన్నాం. ప్రతి చోటా మా ప్రాతినిధ్యం పెరిగింది మా పార్టీ బేస్ పెరిగింది. బీఆర్ఎస్‌ 43 నుంచి 27కు పడిపోయింది. 14 శాతం తగ్గింది. 550 వార్డులు నష్టపోయింది బీఆర్ఎస్. 70 గెలిచినా 2003తో పోలిస్తే కాంగ్రెస్‌కు చాలా తక్కువ స్థానాలు వచ్చాయి. రూలింగ్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. తెలంగాణ హిస్టరీలో మొదటి సారి మునిసిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ గెలుచుకుంది. తెలంగాణ ప్రజలకు, బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలిపుతున్న. ఎలాంటి పొత్తు లేకుండా మా సొంతంగా కరీంనగర్ మేయర్ స్థానాన్ని గెలిచాం. నిజామాబాద్‌లో మాది సింగిల్ లార్జెస్ట్ పార్టీ

అరవింద్, రాకేష్, ధన్పాల్ సూర్యనారాయణ కష్టపడి పని చేశారు. మజ్లిస్ పార్టీ ఓట్లు ఎలా పెరుగుతున్నాయి. బీజేపీ ఎక్కడ వస్తుందో అక్కడ ఈ రెండు పార్టీలు ఎంఐఎం తో కలిసి మేయర్, చైర్మన్ రాకుండా చేశాయి. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న దానికి ఏం పేరు ఇవ్వాలి. ప్రజలే వీరి మధ్య సంబంధం ఏంటో చూడాలి. కమ్యునిస్టు పార్టీలు కనుమరుగు అవుతున్నాయి.  వాటికి రేవంత్ రెడ్డి ప్రాణం పోసేలా చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఆలోచన చేయాలి. ఏప్రిల్‌లో ఎస్ఐఆర్ రాబోతుంది. అధికారులు అప్రమత్తంగా దొంగ ఓట్లు తొలగించాలి. ఓటర్లకు తెలియకుండానే వారి ఇళ్లలో ఓట్లను చేరుస్తున్నారు. బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా విప్ జారీ చేశాం’ అని రాంచందర్‌రావు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement