తొర్రూర్‌లో హైటెన్షన్‌.. ఎంపీ కడియం కావ్యపై ఎర్రబెల్లి ఆగ్రహం | Former Minister Errabelli Dayakar Rao lashed out at Kadiyam Kavya | Sakshi
Sakshi News home page

తొర్రూర్‌లో హైటెన్షన్‌.. ఎంపీ కడియం కావ్యపై ఎర్రబెల్లి ఆగ్రహం

Feb 16 2026 11:46 AM | Updated on Feb 16 2026 11:54 AM

Former Minister Errabelli Dayakar Rao lashed out at Kadiyam Kavya

సాక్షి,వరంగల్‌: తొర్రూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. తొర్రూర్ మున్సిపల్ ఆఫీసుకు తొమ్మిది మంది బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు బయలు దేరడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓట్లను వినియోగించి ఆధిక్యం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఎంపీ కడియం కావ్య 2025లో ఎక్స్ అఫిషియో ఓటును వరంగల్‌లో నమోదు చేసుకున్నారు. తొర్రూర్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో ఎంపీ కావ్య ఎక్స్‌ అఫిషియో ఓటును వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఆమె ఓటును పరిగణలోకి తీసుకుంటే హైకోర్టుకు వెళ్తాం. రాజ్యాంగ బద్ధంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు బీఆర్‌ఎస్‌వే’నని వ్యాఖ్యానించారు. ఈ వరుస పరిణామాలతో తొర్రూర్‌లో హైటెన్షన్‌ నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement