పెన్సిల్ మొనపై శివలింగం
హసన్‌పర్తి: శివలింగం ప్రతిమను పెన్సిల్ మొనపై చెక్కి ఓ యువకుడు తన భక్తిని చాటుకున్నాడు. గోపాలపురం అరుణోదయ కాలనీకి చెందిన కళాకారుడు తాటికొండ శ్రీజిత్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెన్సిల్ మొనపై 2.5 మిల్లీమీటర్ల ఎత్తులో శివలింగం, 2 మిల్లీమీటర్ల ఎత్తులో మరో శివలింగాన్ని రూపొందించాడు. ఒక్కో శివలింగం ప్రతిమను చెక్కడానికి అరగంట సమయం పట్టిందని ఆయన తెలిపాడు. గతంలో శ్రీజిత్ వివిధ కళాఖండాలు చెక్కి అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సాధించాడు. మిల్లీమీటర్ల సైజులో కళాఖండాలు రూపొందిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. శ్రీజిత్ ఎస్సార్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు.
పెన్సిల్ మొనపై శివలింగం


