భంభం భోలే.. | - | Sakshi
Sakshi News home page

భంభం భోలే..

Feb 16 2026 7:09 AM | Updated on Feb 16 2026 7:09 AM

భంభం

భంభం భోలే..

– మరిన్ని ఫొటోలు 8,9లోu

వరంగల్‌

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

భంభం భోలే శంఖం మోగెలే.. అంటూ శివనాస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో శైవక్షేత్రాల్లో ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. అర్చకులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగెం మండలంలోని సంఘమేశ్వరాలయంలో ఏర్పాటు చేసిన మంచు లింగంను భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. చెన్నారావుపేట మండలంలోని సిద్ధేశ్వరాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నర్సంపేట పట్టణంలోని శివాంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి, ద్వారకపేటలోని వేణుగోపాల వేంకటేశ్వరస్వామి, శిర్డీ సాయిబాబా ఆలయం, అయ్యప్పస్వామి దేవాలయాలతో పాటు వరంగల్‌లోని కాశీవిశ్వేశ్వరాలయం, శంభు లింగేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో ఆదివారం రాత్రి శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిపించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాగారాలు ఉండే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. – సాక్షి నెట్‌వర్క్‌

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

ఆలయాల్లో శివపార్వతుల కల్యాణం

భంభం భోలే.. 1
1/2

భంభం భోలే..

భంభం భోలే.. 2
2/2

భంభం భోలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement