కేయూలో నేటినుంచి జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్: కేయూ పోలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘భారతదేశంలో సరళీకరణ అనంతరం జనరంజక విధానాలు’ అనే అంశంపై ఈనెల 16, 17 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు డైరెక్టర్, కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. ఈనెల 16న ఉదయం 10 గంటలకు కేయూలోని సెనేట్ హాల్‌లో జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి పాల్గొననుండగా ప్రముఖ సామాజికవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యులు కంచ అయిలయ్య కీలకపోన్యాసం చేస్తారని తెలిపారు. వివిద చోట్ల నుంచి ప్రతినిధులు హాజరై పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు. పొలిటికల్ సైన్స్ విభాగాఽ దిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య తెలిపారు.
పీజీ కోర్సుల సిలబస్‌లో ఇక మార్పులు
కేయూ క్యాంపస్: యూజీసీ మార్గదర్శకాల ప్రకారం.. జాతీయ పీజీ ప్రోగ్రామ్స్ ఫ్రేమ్‌వర్క్స్‌కు అనుగుణంగా కేయూలోని నాన్‌ప్రొఫెషనల్ పీజీ కోర్సుల్లో సిలబస్‌ను మార్పులు చేయబోతున్నారు. ఈమేరకు యూనివర్సిటీ అధికారులు నిర్ణయించి అన్ని విభాగాల అధితపతులను, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లను ఇటీవల వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఆదేశించారు. పీజీ కోర్సుల్లో మూడో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్లలో రీసెర్చ్ మెథడాలజీ, రీసెర్చ్ ప్రాజెక్టు పాఠ్యాంశాలు తప్పనిసరిగా చేర్చాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఈవిషయంపై ఇటీవల నిర్వహించిన కేయూ అకాడమిక్ స్టాండింగ్ కమిటీలో కూడా నిర్ణయించినట్లు రిజిస్ట్రార్ రామచంద్రం ఈనెల 14న ఉత్తర్వులు వెలువరించారు. కాగా, నాన్ ప్రొఫెషనల్ పీజీ కోర్సులన్నింటిలో 2026–27లో పీజీ రీసెర్చ్ ప్రాజెక్ట్ గైడ్‌షిప్ పూర్తి పనిభారం (వా రానికి 16 పీరియడ్‌లు కలిగిన) కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, పార్ట్‌టైం అధ్యాపకులకు కూడా కేటాయించేందుకు నిర్ణయించినట్లు రిజి స్ట్రార్ ఈనెల14న ఉత్తర్వులు వెలువరించారు.
పెన్సిల్ మొనపై శివలింగం
హసన్‌పర్తి: శివలింగం ప్రతిమను పెన్సిల్ మొ నపై చెక్కి ఓ యువకుడు తన భక్తిని చాటుకున్నా డు. గోపాలపురం అరుణోదయ కాలనీకి చెందిన కళాకారుడు తాటికొండ శ్రీజిత్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెన్సిల్ మొనపై 2.5 మిల్లీమీటర్ల ఎత్తులో శివలింగం, 2 మిల్లీమీటర్ల ఎత్తులో మరో శివలింగాన్ని రూ పొందించాడు. ఒక్కో శివలింగం ప్రతిమను చెక్కడానికి అరగంట సమయం పట్టిందన్నారు. గతంలో శ్రీజిత్ వివిధ కళాఖండాలు చెక్కి అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సాధించాడు. మిల్లీమీటర్ల సైజులో కళాఖండాలు రూపొందిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. శ్రీజిత్ ఎస్సార్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు.
ఒకరిపై కేసు
నర్సంపేట రూరల్: దాడి చేసిన కేసులో ఒకరిపై కేసు నమోదు చేసినట్లు చెన్నారావుపేట ఎస్సై రాజేష్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని ముగ్ధుంపురం గ్రామానికి చెందిన రాజన్ననాయక్ అనే వ్యక్తి ఇస్లావత్ రాజును ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు వేయలేదని రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టి ఆ రోడ్డుగుండా వెళ్లనివ్వడం లేదు. పైగా రాజుపై దాడి చేయడంతో చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రాజన్ననాయక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కేయూలో నేటినుంచి జాతీయ సదస్సు


