breaking news
Warangal District Latest News
-
ఒకే ఒక్కడు..
హన్మకొండ చౌరస్తా: ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు దక్కించుకోవడానికి కాంట్రాక్టర్లు పోటీపడుతుంటారు. అవసరమైతే సిండికేట్‌గా ఏర్పడి ఒక్కరే దక్కించుకుంటారు. అయినా కుదరకపోతే రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తారు. అందుకు పూర్తి విరుద్ధంగా మత్స్యశాఖ ఆహ్వానించిన టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావట్లేదు. మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం హనుమకొండ జిల్లా మత్స్యశాఖ అధికారులు టెండర్లు ఆహ్వానించగా ఒక్కరే దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రతీ ఏటా ఉచిత చేప పిల్లల పంపిణీకి తీవ్ర పోటీ ఉండగా, గతేడాది నుంచి టెండర్లు వేసేందుకు ఒకరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ రావడం లేదని మత్స్యశాఖ అధికారిక లెక్కలే చెబుతున్నాయి. హనుమకొండ జిల్లాలో మొత్తం 813 చెరువులు హనుమకొండ జిల్లాలో మొత్తం 813 చెరువులు ఉండగా గత సంవత్సరం 763 చెరువుల్లో రూ.82.82 లక్షల విలువైన 111.21 లక్షల ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసినట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కట్ల, రోహు, బంగారుతీగ, మెరిగ జాతి చేపపిల్లలను చెరువుల్లో వదిలారు. అదే మాదిరి ఈ సంవత్సరం సైతం చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ టెండర్లను ఆహ్వానించింది. టెండర్లకు ఈ నెల 12 చివరి తేదీగా పేర్కొంది. ఒక్కరే టెండర్ దాఖలు.. ఈ సంవత్సరం జెశ్వంత్ ఆక్వాఫామ్స్ ప్రైవేట్ సంస్థ, భీమారం పేరుతో ఒక్కరే టెండర్ వేసినట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే సదరు సంస్థ ఎన్ని చెరువులకు, ఎంతకు కోట్ చేస్తారనే విషయం బిడ్ తెరిస్తే కానీ తెలియదు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ దాఖలైతే తిరిగి మరోసారి ఆహ్వానించాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. ● ఇప్పటికే సెప్టెంబర్ నెల సైతం గడిచిపోతోంది. టెండర్లు పూర్తయి చేపపిల్లలు చెరువులకు ఎప్పుడు చేరుతాయనేది మత్స్యకారుల ప్రశ్న. బకాయిలే కారణమా? ● గతేడాది జిల్లాలోని 813 చెరువుల్లో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసేందుకు రెండు సంస్థలు టెండర్లను దక్కించుకున్నాయి. అందులో ఓబులాపూర్, జఫర్‌గఢ్, జనగామకు చెందిన బైరీ పట్టాభి, సాయినాథ్ ఫిష్ సీడ్ ఫామ్ 571 చెరువుల్లో 84,79,477 చేప పిల్లలను పంపిణీ చేసేందుకు రూ.6,53,170 లక్షలకు కాంట్రాక్టును దక్కించుకుని ఆయా చెరువుల్లో వదిలింది. ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన ప్రభుత్వం సదరు కాంట్రాక్టర్‌కు రూ.24,11,1846 లక్షలు మాత్రమే చెల్లించింది. ఇప్పటికీ బైరీ పట్టాభి, సాయినాథ్ ఫిష్ సీడ్ ఫామ్‌కు రూ.41,19,861 లక్షలు చెల్లించాల్సి ఉంది. ● మరో 179 చెరువులకు పంపిణీ చేసేందుకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన ముల్కనూరు ఫిష్ హాచరీస్ సంస్థ రూ.17,50,321 లక్షలతో 23,85,067 చేప పిల్లల పంపిణీకి టెండర్లను దక్కించుకుని అందజేసింది. ఆ సంస్థకు రూ.5,47,967 మాత్రమే చెల్లించిన ప్రభుత్వం, రూ.12,02,354 బకాయి ఉంది. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి.. హనుమకొండ జిల్లా పరిధి చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి ఒక్కరు టెండరు దాఖలు చేశారు. టెండర్ వేసిన సంస్థకు సీడ్ సరఫరా చేసే సమర్థత ఉందా? లేదా? అనేది ఫీల్డ్ ఎంకై ్వరీ చేయాల్సి ఉంది. ఆ తర్వాత బిడ్ తెరవాల్సి ఉంటుంది. గత సంవత్సరం సరఫరా చేసిన సంస్థలకు బకాయి అంశం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. – నాగమణి, ఇన్చార్జ్ జిల్లా మత్స్యశాఖ అధికారి, హనుమకొండచేప పిల్లల పంపిణీకి ముందుకురాని కాంట్రాక్టర్లు జిల్లాకు టెండర్ వేసింది ఒక్కరే గతేడాది బకాయిలే కారణమా? ఆ ఒక్క బిడ్‌ను తెరిచేదెన్నడో? -
నాలుగేళ్లుగా అదే కుర్చీ.. మహిళా సిబ్బందిపై వేధింపులు
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్ (ఐడీఓసీ) భవనంలోని ఓ కీలక ప్రభుత్వ శాఖలో ‘సీనియర్’ ఉద్యోగి లైంగిక వేధింపులు పరాకాష్టకు చేరాయి. నాలుగేళ్లుగా కుర్చీ వదలకుండా పాతుకుపోయిన సదరు ఉద్యోగి తన చాంబర్‌ను ప్రత్యేక పార్టిషన్‌తో పకడ్బందీగా ఏర్పాటుచేసుకుని కిందిస్థాయి ఉద్యోగినులను వేధిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కారుణ్య నియామకాలు, డిప్యుటేషన్ల ద్వారా తన కార్యాలయానికి వచ్చిన జూనియర్లను అందులోనూ ముఖ్యంగా మహిళలను బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేస్తూ తన అవసరాలను తీర్చుకుంటున్నాడని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతని బారిన పడిన ఉద్యోగినుల్లో ఒకరు ధైర్యం తెచ్చుకుని నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ సెక్షన్ సీక్రెట్.. సదరు ఉద్యోగి ఒకప్పుడు కారుణ్యంకింద నియమితులయ్యారు. పరిపాలన భవనంలోని ఓ హాల్లో పార్టిషన్ చేసి ఉన్న ఆ సెక్షన్ లోపల ఏం జరిగేది బయటికి కనిపించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నాడు. అతని హోదాకు అంత సీక్రెట్ పార్టిషన్ ఎందుకు అని కొందరు అభ్యంతరం చెప్పినా తన పంతం నెగ్గించుకున్నాడని ఆరోపణలున్నాయి. అయితే ఈ పకడ్బందీ పార్టిషన్లోపల అతను చేసేవి కామకలాపాలుగా గమనించిన కొందరు ఉద్యోగులు తమకెందుకులే అనుకొని మిన్నకుండిపోతున్నారు. ఇటీవల సదరు ఉద్యోగి అరాచకాలు శృతిమించడం.. కామకలాపాల విషయం బయటికి రావడం, ఐడీఓసీలో తీవ్ర చర్చకు తెరలేపింది. అధికారులకు ఫిర్యాదు... అనంతరం పనిదినం రోజు ఓ జిల్లాస్థాయి అధికారి వద్దకు కొందరు కిందిస్థాయి మహిళా ఉద్యోగులు, బాధితురాలి కుటుంబ సభ్యులు వెళ్లి జరిగిందంతా చెప్పి న్యాయం చేయాలని కోరారు. ఈక్రమంలో సద రు అధికారి చెప్పిన తీర్పు కామాంధుడికి సరైన శిక్ష కా దని భావించిన ఉద్యోగులు నేరుగా జిల్లా ఉన్నతాధికారికి కలిసి పరిస్థితి వివరించారని సమాచారం. సదరు కామాంధుడు చేష్టలు విన్న ఉన్నతాధికారి అవాకై ్క లిఖి తపూర్వకంగా ఇవ్వాలని చెప్పి ఆమెను నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు తెలిసింది. ఇన్నిరోజులు అతనికి భయపడిన మహిళా ఉద్యోగులు ప్రస్తుతం ఒకరిద్దరు నిర్భయంగా ముందుకు వచ్చి కామాంధుడి వేధింపులు, తాము అనుభవించిన నరకయాతన తోటి ఉద్యోగులతో చెప్పుకోవడం కలెక్టరేట్లో హాట్‌టాపిక్ అయ్యింది. కొసమెరుపు.. ఓవైపు మహిళా ఉద్యోగులు ఈ వ్యవహారంపై అగ్గిమీ ద గుగ్గిలమవుతుంటే అదే శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి మధ్యవర్తిగా వ్యవహారం కప్పి పుచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో బాధితులపై అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై జిల్లాకు బాస్‌గా ఉన్న మహిళా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారని బాధిత మహిళా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కొంతకాలంగా తన క్యాబిన్నే అడ్డాగా మార్చుకుని చేసిన అక్రమాలు, వేధింపులపై సమగ్ర విచారణచేస్తే ఇతగాడి లీలలు మరిన్ని బయటపడే అకాశం ఉందని చెబుతున్నారు. టర్మ్ డ్యూటీలో ఏం జరిగింది..?కొద్ది రోజుల క్రితం టర్మ్ డ్యూటీ పేరుతో తను కన్నేసిన ఓ మహిళా ఉద్యోగికి విధులు కేటాయించారు. సహజంగా సెలవు దినం కావడంతో సదరు ఉద్యోగి కార్యాలయ ఆవరణలో ఉంది. ఆ సమయంలో వక్రబుద్ధితో కార్యాలయానికి వచ్చిన సదరు కామాంధుడు బయట ఉన్న ఉద్యోగిని లోనికి రమ్మని, తన టేబుల్ క్లీన్ చేయమని ఆదేశించాడు. బిక్కుబిక్కుమంటూ లోనికి వెళ్లిన ఉద్యోగి టేబుల్ క్లీన్ చేస్తుండగా క్యాబిన్ డోర్ క్లోజ్‌చేసి సదరు ఉద్యోగిని లైంగికంగా లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ఆమె మెదట తనను ఏమీ చేయొద్దని ప్రాధేయపడినా వినకపోవడంతో తీవ్రంగా ప్రతిఘటించింది. అటుగా జనం అలికిడి రావడంతో అక్కడినుంచి కామాంధుడు మెల్లగా జారుకున్నట్లు సమాచారం. వ్యూహాత్మకంగా తన వలలోకి.. సదరు సీనియర్ ఉద్యోగి కన్ను పడిన వారిని వ్యూహాత్మకంగా తన వలలోకి దింపుకునే వాడని తెలుస్తోంది. ఒంటరిగా సదరు ఉద్యోగి చాంబర్లోకి వెళ్లాలంటే మహిళలు హడలి పోతున్నారన్నది ప్రస్తుతం ఆ శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మాటవినని ఉద్యోగులను వేధించడం, కష్టమైన విధులు కేటాయించడం, ఉన్నతాధికారుల పేరుతో బెదిరించడం, డిప్యుటేషన్ క్యాన్సిల్ చేస్తానని, బదిలీ చేస్తానంటూ ఆగ్రహించడం వంటి వేధింపులు ఇక్కడ చాలా మంది కిందిస్థాయి ఉద్యోగులకు నిత్యకృత్యంగా మారింది. కొందరికి మాత్రం సెలవులో వెళ్లినా అది రికార్డుల్లో నమోదు చేయకుండా మేనేజ్ చేయడం సదరు ఉద్యోగి లీలల్లో ఒకటిగా చెబుతుంటారు. కలెక్టరేట్లోని ’సీక్రెట్‘ క్యాబిన్లో ఇతను చేయని అడ్డమైన పని లేదని, సరససల్లాపాలకు అడ్డాగా తయారు చేసుకున్నాడని తీవ్రస్థాయిలో ఆరోపణలున్నాయి. లోపల ఏం చేసినా కనిపించకుండా పకడ్బందీగా సెక్షన్ పార్టిషన్ సెలవు రోజుల్లో టర్మ్ డ్యూటీ పేరుతో లైంగిక దాడులు.. జిల్లా ఉన్నతాధికారులకు ఓ ఉద్యోగిని ఫిర్యాదు.. అతని లీలలు విని అవాక్కయిన జిల్లా ఉన్నతాధికారి హనుమకొండ ఐడీఓసీలో కలకలం రేపుతున్న సీనియర్ ఉద్యోగి తీరు -
కనీస ప్రమాణాలు పాటించాలి
అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి హన్మకొండ అర్బన్: జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు కనీస ప్రమాణాలు పాటించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరెట్లో జిల్లా సంక్షేమ అధికారి జయంతి అధ్యక్షతన జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాల బాలికలకు నిర్వాహకులు వసతి, భోజనం, విద్యా, వైద్యంతో పాటు సరైన వసతులు కల్పించాలన్నారు. ఈనెల 20 నుంచి 26 వరకు జిల్లాలోని ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను అదనపు కలెక్టర్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ బృందం ఆధ్వర్యంలో తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ.. సీజన్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, బాల రక్షా భవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్ అవంతి, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జ్ అధికారి ప్రవీణ్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్, పరికి సుధాకర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
కలెక్టర్ స్నేహ శబరీష్ పరకాల: విద్యార్థినుల్లో అభ్యసన, పఠన సామర్థ్యాలను పెంచాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. పరకాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలతోపాటు గిరిజన వసతి గృహాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. వంట, తరగతి గదులు, డార్మెటరీ, భోజనాన్ని పరిశీలించడంతోపాటు పలు రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ విద్యార్థినులతో తరగతి గదిలోని బోర్డులపై రాయించి చదివించారు. చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు అవుతామని సమాధానమిచ్చారు. అయితే అందుకు కావాల్సిన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థినులకు కలెక్టర్ సూచనలు చేశారు. పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ ఆంజనేయులు పాల్గొన్నారు. -
డివిజన్లలో సమస్యలు పరిష్కరించాలి
● సమీక్షలో గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్వరంగల్ అర్బన్: డివిజన్లలోని సమస్యల పరిష్కారానికి వార్డు ఆఫీసర్లు కృషిచేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ హెచ్చరించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో 27 మంది వార్డు ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు పంపిణీ చేశారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, పన్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఆర్ఓలు శ్రీనివాస్, షహాజాదీ బేగం, ఆర్ఐలు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. శానిటేషన్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎస్డబ్ల్యూఎం), జీఐఎస్, ఈ–ఇంటిగ్రేషన్ మొబైల్ అప్లికేషన్ (యాప్) సంబంధిత అంశాలపై శానిటేషన్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాయంలోని ఐసీసీసీలో జరిగిన సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. ఐసీసీసీ ఇన్చార్జ్ తేజస్వి, సిబ్బంది నరసింహ, నరేశ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నుంచి చెత్త సేకరించాలి.. ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ అన్నారు. 31వ డివిజన్ న్యూ శాయంపేటలో గురువారం ఉదయం కమిషనర్ శానిటేషన్, నీటి సరఫరా పర్యావేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇళ్ల నుంచి చెత్తను సేకరించాలన్నారు. ఈఈ రవికుమార్, ఏ ఈ సౌజన్య, శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు తీస్తున్న అర్హతలేని వైద్యం
సాక్షి, వరంగల్: ఆర్ఎంపీలు, పీఎంపీలు అత్యవసర సమయంలో రోగులకు ప్రథమ చికిత్స అందిస్తూ వైద్యసలహాలు మాత్రమే ఇవ్వాలి.. కానీ అర్హత లేని వైద్యం చేస్తూ ప్రాణాలమీదకు తెస్తున్నారు. కొందరు .. ఏశాస్త్రం చదవకున్నా, ఏ అర్హత, అనుమతి లేకున్నా వైద్య నిపుణుల్లా చలామణి అవుతుండడంత గమనార్హం. చాలామంది ఆస్పత్రులు తెరిచి ఇంజక్షన్లు ఇస్తూ, సైలెన్లు ఎక్కిస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. వైద్యం వికటిస్తే ప్రైవేట్ కా ర్పొరేట్ ఆస్పత్రులకు తరలించి చేతులు దులుపుకొంటున్నారు. మరికొందరు తమకు తెలిసిన ప్రైవే ట్ ఆస్పత్రులకు రోగులను రిఫర్ చేసి కమీషన్లు దండుకుంటున్నారు. పట్టించుకోని జిల్లా అధికారులు ఇటీవల బొడ్డు రాము అనే బీటెక్ విద్యార్థి.. నకిలీ డాక్టర్ అందించిన వైద్యం వికటించి మృతిచెందా డు. నిబంధనలు ధిక్కరించినా.. ప్రాణాలు పోతు న్నా.. ఆ శాఖ జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదు. దీనిపై రాష్ట్ర వైద్య మండలి స్పందించి నకిలీ వైద్యుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. ఇటీవల జి ల్లా వ్యాప్తంగా నకిలీ వైద్యులపై కేసులు నమోదు అవుతున్నా తీరు మారడంలేదు. వీరిపై హైదరాబా ద్‌లోని వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదులు అందడంతో దాడులు చేసి పోలీసులతో కేసులు నమోదు చేయిస్తే రాజకీయ అండదండలతో తిరిగి వైద్యం చేస్తున్నట్లు తెలుస్తుంది. 18 మందిపై కేసు నమోదు.. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమా ర్ ఆదేశాలతో చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం కౌన్సిల్ సభ్యుల బృందాలు జిల్లాలోని 12 ప్రాంతాల్లోని అనాధికార (పీఎంపీ, ఆర్ఎంపీ) వైద్యులపై ఏక కాలంలో దాడులు నిర్వహించి, 18 మంది నకిలీలను గుర్తించాయి. శివనగర్‌కు చెందిన బండి రమేష్, రాములు, పెరుకవాడకు చెందిన రుద్ర భాస్కర్, ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన టి.రాజమౌళి, శివనగర్‌కు చెందిన బి.లక్ష్మీనారాయణ, చింతల్‌కు చెందిన డి.సురేష్, మహమ్మద్, శుంభునిపేట దూపకుంట రోడ్డులో కిరణ్, రామన్నపేటకు చెందిన రాజేంద్రప్రసాద్, గోకులనగర్కు చెందిన డి.రవీందర్, రాజానర్సయ్య, వై.రమేష్, కుమారస్వామి, శ్రీనివాస్, ఆర్.వీరనారాయణ, దుగ్గొండి గ్రామానికి చెందిన శ్రీధర్, కిరణ్, సాంబయ్య, భిక్షపతి, లేబర్‌కాలనీకి చెందిన శేఖర్ ను గుర్తించి ఆయా ఏరియాల్లో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఆర్ఎంపీలు, పీఎంపీ క్లినిక్‌లపై వైద్యమండలి దాడులు నకిలీ వైద్యులపై ఫిర్యాదు ఆర్ఎంపీలు, పీఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు -
జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపిక
గీసుకొండ: మండలంలోని మరియపురంలోని సెంట్‌జాన్స్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు హైదరాబాద్‌లో నిర్వహించే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం సిస్టర్ సౌజన్య, కరస్పాండెంట్ సిస్టర్ ఫ్లెవియాలు గురువారం తెలిపారు. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో 8వ తరగతికి చెందిన బొజ్జం శ్రీవర్ష ద్వితీయ స్థానం, కోల పూజ తృతీయ స్థానం, 9వ తరగతికి చెందిన పుంజాల సహస్ర నాల్గవ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. ముగ్గురు దొంగల అరెస్టు గీసుకొండ: వరుస దొంతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని గీసుకొండ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని కాశిబుగ్గకు చెందిన పల్లకొండ ఉపేందర్, కటకం ప్రణయ్, శివనగర్‌కు చెందిన పులిచేరు చంద్రశేఖర్ అనే ముగ్గురు పలు ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మూడు నెలల వ్యవధిలో.. కట్టమల్లన్న దేవాలయంలోని హుండీని పగుల గొట్టారు. మచ్చాపూర్‌లోని పాన్‌షాపు, ఆత్మకూరులోని పాన్, కిరాణా షాపుల తాళాలను పగులగొట్టి నగదు, సిగరెట్లు, ఇతర వస్తువులను దొంగిలించారు. ఈక్రమంలో మండలంలోని కోటగండి వద్ద గురువారం సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్సై అనిల్‌కుమార్‌కు అనుమానంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు కనిపించగా వారిని పట్టుకుని విచారించారు. దీంతో వారు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి కొంత నగదు, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ‘గ్రీన్‌ఫీల్డ్ హైవే’ రైతులతో కలెక్టర్ సమావేశం న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే– 163 నిర్మాణంలో భూములు కోల్పోయిన నెక్కొండ మండలంలోని తోపనపల్లి, అలంఖానిపేట రైతులతో గురువారం కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన సమావేశం (ఆర్బిట్రేషన్) నిర్వహించారు. రైతులకు అవార్డ్ పాస్ చేసేందుకు ఈ ఆర్బిట్రేషన్ సమావేశం నిర్వహించినట్లు సమాచారం. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్ రాజ్‌కుమార్, రైతులు ఉన్నారు. మూగజీవి ఇకలేదని.. రాయపర్తి: ఎంతో ఆప్యాయంగా పెంచుకున్న కుర్ర(దుడ్డె) ఇకలేదన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఓ మహిళారైతు రోదనలు మిన్నంటాయి. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పానీష్తండా గ్రామ పరిధిలోని కొత్తతండాకు చెందిన బానోతు కమలమ్మ తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. కొంతకాలం కిందట ఓ పాడిగేదెను కొనుగోలు చేయగా అది ఓ కుర్ర(దుడ్డె)కు జన్మనిచ్చింది. ఈ క్రమంలో గురువారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద గడ్డి మేస్తుండగా.. షాక్ తగిలి దుడ్డె మృత్యువాత పడింది. దీంతో కమలమ్మ దుడ్డైపె పడి రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. క్రీడలతో దేహదారుఢ్యం వరంగల్ అర్బన్: క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందుతుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇండోర్ స్టేడియం స్టేడియంలో ట్రాన్స్‌కో స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ చెస్, బాడ్మింటన్ పోటీలను సీఎండీ వరుణ్‌రెడ్డి గురువారం ప్రారంభించా రు. కార్యక్రమంలో సీఈ శ్రీరాంకుమార్, ఎస్ ఈలు నారాయణరెడ్డి, గౌతంరెడ్డి, స్పోర్ట్స్ ఆఫీస ర్ నీలం జగన్నాథ్, ప్రతినిధులు వెంకటేశ్వర్లు, చంద్రప్రకాశ్, రాజిరెడ్డి, మోహన్ పాల్గొన్నారు. -
బతుకమ్మ చీరలు సిద్ధం
● మహిళా సంఘాల ద్వారా పంపిణీ ● జిల్లాలో 435 గ్రామైక్య సంఘాలు ● 11,257 స్వయం సహాయక సంఘాలునర్సంపేట: తెలంగాణ ఆడపడుచులు ఇష్టంగా నిర్వహించుకునే వేడుక బతుకమ్మ. ఎంతో చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగకు కానుకగా మహిళలకు ప్రభుత్వం కానుకగా చీరలు అందించేందుకు సిద్ధమైంది. గతంలో రేషన్ కార్డుల ఆధారంగా చీరలు పంపిణీ చేయగా.. ఈసారి కేవలం స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే ఈ చీరలను అందించనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళా సంఘాల సభ్యుల సంఖ్యను లెక్కించారు. వీరందరికీ చీరలు పంపిణీ చేయనున్నారు. చీరల పంపిణీ బాధ్యతలను మెప్మా సిబ్బందికి అప్పగించారు. జిల్లా, మండల స్థాయిలో నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ నుంచి గ్రామాలకు తరలించి సభ్యులకు అందజేస్తారు. రెండు రకాల సైజుల్లో 6.5మీటర్లు, 9మీటర్ల చీరలు అందుబాటులో ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు చీరలు ఇవ్వడం ఇదే మొదటిసారి. చీరల పంపిణీతో మహిళల గౌరవాన్ని పెంచడంతోపాటు చేనేత రంగానికి చేయూతనిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. మహిళా సంఘాల్లోని వారికే.. గత ప్రభుత్వ హయాంలో 18 సంవత్సరాలు నిండిన తెల్ల రేషన్‌కార్డు కలిగిన యువతులు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని గ్రామైక్య సంఘాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా పంపిణీ చేస్తూ సంఘంలో ఉన్న సభ్యులకు అందజేసే విధంగా మండల స్థాయి అధికారులకు బాధ్యత అప్పగించనుంది. వరంగల్ జిల్లాలో 435 గ్రామైక్య సంఘాలు, 11,257 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో సుమారుగా లక్షా 22వేల 389మంది సభ్యులు ఉండగా వీరందరికీ బతుకమ్మ కానుకగా చీరలు అందించనున్నారు. నాణ్యత విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చీరలను జిల్లాలకు పంపిస్తున్నట్లు తెలిసింది. రెండు కాదు.. ఒకటే..! గత ప్రభుత్వ హయాంలో చీరల నాణ్యతపరంగా కొంత మంది మహిళలు అసంతృప్తిని వ్యక్తం చేసి నిరసన తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్వాలిటీ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ డ్రెస్ కోడ్‌లో భాగంగా అన్ని ఒకే రంగుతో ఒకే విధంగా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మొదట రెండు చీరలు ఇవ్వాలని భావించినప్పటికీ ప్రస్తుతం ఒక చీర అందించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా 6.30మీటర్ల చీరలు, తొమ్మిది మీటర్ల చీరలు సిద్ధం చేశారు. మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం..బతుకమ్మ పండుగ సమీపిస్తుండడంతో చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. మండలాలకు పంపిణీ చేసే ప్రక్రియపై ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు అందిస్తాం. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం. – రాంరెడ్డి, ఇన్చార్జ్ డీఆర్డీఓ -
సమగ్ర సస్యరక్షణతో అధిక దిగుబడి
● డాక్టర్ విజయభాస్కర్ సంగెం: పంటలపై వచ్చే చీడపీడలు, తెగుళ్ల నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి పొందవచ్చని రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ విజయభాస్కర్ అన్నారు. మండలంలోని గవిచర్ల, ఆశాలపల్లి, గ్రామాల్లోని పత్తి, వరి, కూరగాయలు, ఆకుకూరలు, పూల పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పస్తుత పరిస్థితుల్లో వడలు తెగులు నివారణకు కాపర్‌ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క మొదలు తడిసేలా పిచికారీ చేసుకోవాలని సూచించారు. కాయకుళ్లు నివారణకు గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ పదిలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని చెప్పారు. రసం పీల్చే పురుగుల నివారణకు 1500 పీపీఎం వేపనూనె ఎకరాకు లీటరు, లేదా 300 గ్రాముల అసిపేట్ లేదా ప్లునికామైడ్ 50మీ.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. వరిలో కాండం తొలుచుపురుగు నివారణకు క్లోరాంట్రనిలిప్రోలు 0.3 మిర్లీ లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలని తెలిపారు. కాకరలో పండు ఈగ నివారణకు లింగాకర్షణ బుట్టలను ఎకరాకు 2–4 చొప్పున ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త వెంకటరాజ్‌కుమార్, ఏఓ జ్యోత్స్న భవాని, ఏఈఓ సాగర్, రైతులు పాల్గొన్నారు. -
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
● కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం కేయూ క్యాంపస్: తెలంగాణా ప్రజల సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ విభాగం, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్ విభాగాల వద్ద విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చి ముందుస్తు బతుకమ్మ సంబురాలు నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం పాల్గొని మాట్లాడారు. ప్రకృతిని, పూలనే దైవంగా పూజించే వేడుక బతుకమ్మ అని ఆయన అభివర్ణించారు. విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు ఉత్సాహంగా వేడకల్లో పాల్గొని పాటలు పాడారు. ఆయా విభాగాల మహిళా అధ్యాపకులు డాక్టర్ రమ, మేఘనరావు, అమరవేణి, వరలక్ష్మి, మమత, సవితాజ్యోత్స్న, దీపాజ్యోతి, డాక్టర్ సౌజన్య, నీలిమ, ప్రగతి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, ఆచార్య నర్సింహాచారి అధ్యాపకులు పాల్గొన్నారు. -
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఖిలా వరంగల్: పాఠశాలల బలోపేతం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి ఉర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్లో ట్రస్మా వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను సన్మానించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ట్రస్మా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చల్లా నాగార్జున్‌రెడ్డి, బాశెట్టి వెంకటేశ్వర్లు, బాధ్యులు దండపంతుల రామ్మూర్తి, నాసం సూర్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందే..
దుగ్గొండి: ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందేనని, సకాలంలో విధులకు హాజరు కాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. బయోమెట్రిక్ హాజరు ప్రకా రం నిర్ధిష్ట సమయానికి చేరుకోవాలన్నారు. మండ ల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇంటి ని ఆమె గురువారం తనిఖీ చేసి, నాణ్యతను పరిశీ లించారు. ఎంత విస్తీర్ణంలో నిర్మించారు. మెటీరియ ల్, క్యూరింగ్ వివరాలపై ఆరా తీశారు. పనులను నాణ్యతగా చేపట్టి త్వరగా చేపట్టాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల తనిఖీ.. తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరును కలెక్టర్ తనిఖీ చేశారు. అయితే డీటీ ఉమారాణి సకాలంలో విధులకు హాజరు కాలేదని గుర్తించి.. ఎందుకు ఆలస్యం అయిందని ప్రశ్నించారు. సమాధానం సరిగా చెప్పకపోవడంతో అగ్రహం వ్యక్తం చేశారు. బస్సు సమయం చెప్పబోతుండగా ‘నేను డ్రైవ్ చేసి డ్రాప్ చేయాలా..’ అని కలెక్టర్ ఆగ్రహించారు. తక్షణమే డీటీ, ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. భూభారతిలో అందిన దరఖాస్తులు, అర్జీల పరిష్కారం పురోగతిని సమీక్షించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎన్నికల మెటిరియల్ వివరాలు, ఎన్నికల సామగ్రి భద్రపరిచే గదులను పరిశీలించారు. కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ పీడీ గణపతి, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, ఎంపీడీఓ అరుంధతి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి న్యూశాయంపేట: వానాకాలం ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, పౌరసరఫరాలు, సహకార, గ్రామీణాభివృద్ధి శాఖ, తూనికలు కొలతల శాఖాధికారులతో గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025–26 వానాకాలం ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరంలో 2లక్షల50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సుమారు 260 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, డ్రైయ్యర్లు, తాగునీరు, టార్పాలిన్లు, గన్నీబ్యాగులు, తేమ సాంద్రత కొలిచే యంత్రాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ అధికారులు ఆయా మండలాల వారీగా ధాన్యం పండించిన రైతుల వివరాల నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ సీజన్‌ల్లో ఏ గ్రేడ్ రకం క్వింటాకు రూ.2,389, కామన్ రకానికి రూ.2,369గా ప్రభుత్వం ధర నిర్ణయించిందని తెలిపారు. సన్నరకం ధాన్యం నాణ్యత గుర్తింపునుకు గ్రేయిన్ కాలిఫర్(డయల్ మైక్రోమీటర్) అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎం సివిల్ సప్లయీస్ సంధ్యారాణి, డీఎస్ఓ కిష్టయ్య, డీఎం సురేఖ, డీఆర్డీఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్ సత్యశారద ఇందిరమ్మ మోడల్ ఇల్లు తనిఖీ డీటీ ఉమారాణికి నోటీసులు -
క్రీడాపోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నెక్కొండ: 69వ ఎస్జీఎఫ్ జోనల్ మీట్లో తమ విద్యార్థులు ప్రతిభచాటారని నెక్కొండ టీజీ గురుకుల పాఠశాల/కళాశాల (బాలికల) ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను గురువారం పాఠశాలలో ఆమె అభినందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... ఈ నెల 16, 17 తేదీల్లో చెన్నారావుపేట సిద్ధార్థ గురుకుల విద్యాలయంలో ఎస్జీఎప్ జోనల్ మీట్లో భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారని తెలిపారు. ఈ పోటీల్లో అండర్ 17, 14 విభాగాల్లో అత్యంతం ప్రతిభచాటి ప్రథమ స్థానంలో విజేతలుగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. ఆయా జట్ల కెప్టెన్లు సాత్విక, నందు తోపాటు క్రీడాకారులను పీఈటీ కమలకుమారి, ఉపాధ్యాయులు అభినందించారు. -
మహిళ ఆరోగ్యంతోనే కుటుంబం ఆరోగ్యం
● వరంగల్ ఎంపీ కడియం కావ్య హన్మకొండ: మహిళ ఆరోగ్యంతోనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియా న్లో భాగంగా బుధవారం హనుమకొండ సమ్మయ్యనగర్‌లోని లష్కర్‌సింగారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయస్థాయిలో ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన తర్వాత ఈ మెగా వైద్యశిబిరాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళలకు అవసరమైన వైద్యసేవలందించాలని డాక్టర్లు, సిబ్బందికి సూచించా రు. టీబీ ముక్త్ అభియాన్‌లో భాగంగా దాతలు అందించిన పోషకాహార కిట్లను టీబీ వ్యాధిగ్రస్తులకు అందించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, డాక్టర్లు అజిత్ మహమ్మద్, సుదీప్, ప్రశాంత, హారిక, హిమబిందు ఉన్నారు. -
పూర్వ విద్యార్థులు సహకారం అందించాలి
● కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో చదువుకొని వివిధ దేశాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల కృషిని అభినందిస్తూ, వర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. అమెరికాలోని అట్లాంటాలో ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించగా వీసీ ప్రతాప్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సెలబ్రెట్ అండ్ కంట్రిబ్యూట్ అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సమూహాలు యూనివర్సిటీ గ్లోబల్ భాగస్వామ్యా నికి రావాలని కోరారు. అల్యుమ్ని గోల్డెన్‌జూబ్లీ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమెరికా సంయుక్తరాష్ట్రాల విశ్వవిద్యాలయ ఫార్మసీ చాప్టర్, కేయూ ఫార్మసీ విభాగం పూర్వవిద్యార్థి డాక్టర్ సాంబారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పరుచూరితో పాటుగా పూర్వవిద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
క్వాంటం సైన్స్‌పై అవగాహన ఉండాలి
రామన్నపేట : విద్యార్థులకు క్వాంటం సైన్స్‌పై అవగాహన ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి రంగ య్య నాయకుడు అన్నారు. నగరంలోని మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘క్వాంటం యుగం ప్రా రంభం– అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ ముగింపు సమావేశంలో డీఈఓ మాట్లాడారు. సాంకేతికంగా ప్రపంచం దూసుకెళ్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న సూపర్ కంప్యూటర్లు 1,000 సంవత్సరాలు తీసుకొని చేయగలిగే పనిని రానున్న క్వాంటం కంప్యూట ర్లు కొన్ని సెకండ్ల వ్యవధిలో చేయగలగుతాయని అన్నారు. సాంకేతిక విస్పోటనం జరుగుతున్న తరుణంలో విద్యార్థులు క్వాంటం సైన్స్‌పై, శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న పలు మార్పులపై అవగాహ న కలిగి పెంచుకోవాలని తెలిపారు. ఈ సెమినార్లో చెన్నారావుపేట మండలం లింగాపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని బూర మానస మొదటి స్థానం నిలిచి ఎస్సీఈఆర్టీలో జరగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌కు అర్హత సాధించింది. శ్రీ సరస్వతి విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థి సహస్రాక్ష్ ద్వితీ య స్థానం, నర్సంపేట అక్షర హైస్కూల్ విద్యార్థిని హరిప్రియ తృతీయ స్థానం కై వసం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం విజేతలకు, పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. న్యాయ నిర్ణేతలు పింగిళి కళాశాల కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభ, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పెట్లోజు సురేష్, దేవులపల్లి కిరణ్ వ్యవహరించగా, మట్టెవాడ ఉన్నత పాఠశాల హెచ్ఎం అరుణ ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, వారి గైడ్ టీచర్లు పాల్గొన్నారు. డీఈఓ రంగయ్య నాయుడు -
బైక్ అదుపు తప్పి ఉపాధ్యాయుడి మృతి
హసన్‌పర్తి: బైక్ అదుపు తప్పి ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. ఈసంఘటన కేయూ–వడ్డేపల్లి రోడ్డులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా అన్నంపల్లికి చెందిన పోరిక రమేశ్‌నాయక్ (42) జవహర్కాలనీలో నివాసం ఉంటున్నాడు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి మోడల్ స్కూల్లో ఆయన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి బైక్‌పై ఇంటి నుంచి కేయూ జంక్షన్ వైపు పని నిమిత్తం ఆయన బయల్దేరాడు. మార్గమధ్యలో తులసి బార్ సమీపంలో చీకటిగా ఉండడంతో ఎదురుగా వెళ్తున్న ఆవు కనిపించలేదు. దీంతో సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి ఆవును ఢీకొని కిందపడిపోయాడు. ఈసంఘటనలో తలకు బలమైన గాయమై రమేశ్‌నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
సమరయోధుల త్యాగాలువెలకట్టలేనివి
వరంగల్ అర్బన్: తెలంగాణ సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కొనియాడారు. తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవంలో భాగంగా బుధవారం వరంగల్ ఓ సిటీకి ఎదురుగా ఉన్న ఐడీఓసీ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసి, వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. తెలంగాణ పోరాట యోధులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజున ‘తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం’గా నిర్వహించడం శుభసూచకమన్నారు. స్వాతంత్య్రం పొందిన సమయంలో దేశంలో రెండు రకాల పరిపాలన ఉండేదన్నారు. స్వాతంత్ర సమరయోధులు, మేధావుల దూరదృష్టి, ప్రభావవంతమైన చర్యల వల్ల భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించిందని చెప్పారు.తెలంగాణలో దశాబ్దకాలం తర్వాత 2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ఇందిరమ్మ ప్రజారాజ్యంలో మొదటగా స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య, పునరుద్ధరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఆరు గ్యారంటీలతోపాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆర్థిక క్రమశిక్షణతో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యరాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధిపై మంత్రి సమీక్ష
హన్మకొండ అర్బన్: ప్రజా పాలన వేడుకల అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో సుమారు గంటసేపు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, మేయర్, గ్రేటర్ కమిషనర్, జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, కాంగ్రెస్ అంతర్గత విషయాలపై చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. అంతకుముందు ప్రజాపాలన వేడుకల కోసం నగరానికి వచ్చిన మంత్రి పొంగులేటికి నిట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అమరవీరులకు నివాళి.. హనుమకొండ అదాలత్ కూడలిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. -
పంటల నమోదు వేగవంతం చేయాలి
గీసుకొండ: వానాకాలం పంటల నమోదును ఏఈ ఓలు వేగవంతం చేయాలని, నమోదుతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా వ్యవసా య అధికారి అనురాధ అన్నారు. మండలంలోని ప లు గ్రామాల్లో పంట చేలు, యూరియా పంపిణీ, పంటల నమోదు తీరును బుధవారం ఆమె పరిశీ లించి మాట్లాడారు. ఎలుకుర్తి హవేలిలో పీఏసీఎస్ రికార్డులు, గోదాంను పరిశీలించారు. ఎరువుల అ మ్మకం రిజిష్టర్లను సరిగా నిర్వహించాలన్నారు. దు మాల రాజు అనే రైతు పత్తి చేనులో నానో యూరి యాతోపాటు సాగరిక గోల్డ్(పోటాష్–14శాతం)ను కలిపి పిచికారీ చేయించారు. పూత కాత దశలో ఉన్న పత్తి చేలకు గుళికల రూపంలో ఉన్న యూరియాకు బదులుగా నానో యూరియాను స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. నానో యూరియాతోపా టు నానో పొటాష్/సాగరిక గోల్డ్ కలిపి పిచికారీ చేస్తే మంచిదన్నారు. ఈ సమయంలో వరి పొలాలు ఉన్న రైతులు మాత్రమే గుళికల యూరియాను వేయాలన్నారు. గుళికలను నీళ్లు తీసిన పొలంలో వేస్తే మేలని రైతులకు చెప్పారు. ఏఓ హరిప్రసాద్‌బాబు, ఏఈఓలు స్మిత, రజిని, ఎలుకుర్తి పీఏసీఎస్ చైర్మన్ మోహన్‌రెడ్డి, సీఈఓ సాంబశివుడు ఉన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ -
దళిత కాలనీలను సుందరీకరిస్తాం
● నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి దుగ్గొండి: నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దళిత కాలనీలను సుందరీకరిస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.53 లక్షలతో మండలంలోని తొగర్రాయి, మందపల్లి, మధిర, అడవిరంగాపురం గ్రామాల్లో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన బుధవారం ప్రారంభించి, మాట్లాడారు. దళితులకు ఇళ్లు, దళిత కాలనీల్లో రోడ్లు, మంచినీటి వసతి కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే అందాయని గుర్తు చేశా రు. అన్ని దళిత కాలనీల్లో సీసీ రోడ్డుతోపాటు డ్రె యినేజీలు నిర్మిస్తామన్నారు. ఇళ్లులేని వారికి ప్రాధాన్యతా క్రమంలో రాజకీయాలకు అతీతంగా ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. బతుకమ్మ సంబరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌తోనే గ్రామాల సమగ్రాభివృద్ధి నర్సంపేట: కాంగ్రెస్‌తోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండలం లింగాపురం, కోనాపురం, ఉప్పరపల్లి, అక్కల్చెడ, అమీనబాద్, బోజెర్వు, లింగగిరి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి, మహిళా సంఘాల భవనాలకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద సుమారు రూ.2కోట్ల 30లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మార్కె ట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్, ఎర్రల్ల బాబు, కిరణ్‌రెడ్డి, నర్సింగరావు, రాజేశ్వర్‌రావు, ఎడెల్లి శ్రీనివాసరెడ్డి, దంజ్యా, రామారావు, బండి రాజమల్లు, అమ్మరోహిత్, నర్సింహారెడ్డి, తిరుపతి, రాజేశ్వరాచారి, సుమలత, బుర్రి సునిత, కూనమల్ల శ్రీనివాస్, పుప్పాల శ్రీనివాస్, నగేష్, ఎంపీడీఓ శ్రీవాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన వాహన రిజిస్ట్రేషన్లు
సాక్షి, వరంగల్: జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. జూలైలో 1,182 వాహనాలు రిజిస్ట్రేషన్లు అయితే ఆగస్టులో ఆ సంఖ్య పెరిగి 1,297కు చేరుకుంది. కానీ, సెప్టెంబర్‌లో మాత్రం 552 వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. కార్లు, బైక్‌లపై కేంద్రం విధించే జీఎస్టీని తగ్గిస్తున్నామని, ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆగస్టు నెలాఖరులో కేంద్రం ప్రకటించడంతో వాహనప్రియులు తమ వాహనాల బుకింగ్‌లను వాయిదా వేసుకున్నారు. దీంతోపాటు దసరా పండుగ వస్తుండడంతో ఈ నెల 22 తర్వాత వాహన రిజిస్ట్రేషన్లు జోరందుకుంటాయని రవాణా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కార్లపై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గుతుండడం వాహనదారులకు రూ.వేలల్లో నుంచి రూ.లక్షల్లో ఉపశమనం కలిగించే అంశమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాహన రిజిస్ట్రేషన్లు తగ్గినా దసరాలోపు భారీగానే పెరిగే అవకాశం లేకపోలేదు. దీంతో రవాణా శాఖకు వచ్చే ఆదాయానికి ఏమాత్రం ఢోకా ఉండకపోవచ్చు. జిల్లాలో ఇప్పటికే 2.30 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. తగ్గనున్న ధరలు.. నగర పరిధిలో బైకులు, కార్ల షోరూంలు సుమారు 30కి పైగా ఉన్నాయి. ఈ నెల 22 నుంచి జీఎస్టీ తగ్గనుంది. భారీ ఎంటీ లెవల్ హ్యాచ్ బైక్ నుంచి లగ్జరీ ఎస్.యూవీ కార్ల వరకు ధరలు తగ్గనున్నాయి. దీంతో వాహనాలు కొనాలనుకునేవారు ఇప్పటికే ధరలు ఏమేర తగ్గుతాయని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. బైక్ కొనాలనుకునేవారికి రూ.20 వేల నుంచి రూ.35 వేలు, కారు కొనుగోలు చేస్తే కనిష్టంగా రూ.65 వేల నుంచి గరిష్టంగా రూ.లక్షన్నర వరకు తగ్గొచ్చొని విక్రయదారులు చెబుతున్నారు. ప్రతి ఏటా దసరా, దీపావళికి 240 నుంచి 350 వరకు కార్ల అమ్మకాలు జరుగుతుండేవని, ఈసారి ఆ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చంటున్నారు. పలు కంపెనీ లు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈనెల 22లోగా ముందుస్తు బుకింగ్ చేసుకునే వారికి చిన్న కారుపై రూ.80 వేలు తగ్గింపుతోపాటు కారు డెలివరీ సమయంలో జీఎస్టీ తగ్గింపు అమలు చేస్తామని ఆఫర్ చేస్తుండడంతో కొందరు ఇప్పటికే బుకింగ్ చేసుకుంటున్నారు. కొనుగోళ్లపై మారనున్న జీఎస్టీ శాతం ఆగస్టుతో పోల్చుకుంటే సెప్టెంబర్‌లో సగం కంటే తక్కువే.. భారీగా పడిపోయిన కారు, బైక్‌ల విక్రయాలు ఈ నెల 22 తర్వాత రిజిస్ట్రేషన్లు పుంజు కుంటాయంటున్న ఆర్టీఏ అధికారులు -
ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి
హన్మకొండ అర్బన్: ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. పదేళ్ల కాలంలో ఈ ప్రాంత అభివృద్ధి హామీలు, కాగితాలకే పరిమితమైందని, తమ ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తోందన్నారు. హైదరాబాద్–సికింద్రాబాద్ నగరాల మాదిరిగానే హనుమకొండ–వరంగల్ నగరాలు కూడా కలిసి ఉన్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభం.. 2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూ.4,100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 2040 అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్‌ను తీసుకువచ్చినట్లు వివరించారు. భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, అలాగే, హనుమకొండ కలెక్టరేట్ బంగ్లాను ఆధునికీకరించినట్లు చెప్పారు. హైవేల విస్తరణలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్–ఐనవోలు (వయా) కూనూర్, గర్నేపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు, ఓగ్లాపూర్–ధర్మారం వరకు 13 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావొస్తున్నాయని తెలిపారు. జిల్లాలో రెండు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు.. భీమదేవరపల్లి మండలం వంగరలో రూ.7 కోట్లతో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విజ్ఞాన వేదిక అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. పరకాలలో రూ.35 కోట్లతో చేపట్టిన 100 పడకల ఆస్పత్రి పనులు సాగుతున్నాయని చెప్పారు. జిల్లాలో రెండు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. క్రీడా పాఠశాల, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించిందని, తాత్కాలికంగా జేఎన్ఎస్లో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించడానికి సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. ఆరోగ్యశ్రీతో పేదలకు ఉచిత వైద్యసేవలు.. గత ప్రభుత్వం నగరంలో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మంది పేదలు ఉచిత వైద్యసేవలు పొందుతున్నారని, జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచిత బస్సు సౌకర్యం, గృహలక్ష్మి పథకం ద్వారా వేలాది రాయితీ సిలిండర్లు, గృహజ్యోతి పథకం కింద లక్ష మందికి పైగా కుటుంబాలు ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. 435 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు.. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా జిల్లాలో 435 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని, వేలాది మందికి కొత్త రేషన్‌కార్డులు జారీ చేయడంతో పాటు వేలాది మంది కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా రేషన్ కార్డుల్లో చేర్చినట్లు చెప్పారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మత్స్య సంపద పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 771 చెరువుల్లో కోటికి పైగా చేపపిల్లలను వంద శాతం రాయితీతో పంపిణీ చేసినట్లు వివరించారు. వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఐదు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు.. విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామని, నకిలీ విత్తన, ఎరువుల కొరత అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాదాబైనామాతో భూసమస్యలు పరిష్కారమవుతాయని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో భూ భారతి చట్టం తీసుకువచ్చినట్లు తెలిపారు. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. తొలి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించినట్లు తెలిపారు. 60 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ పాలసీ –2024 ద్వారా రానున్న ఐదేళ్లలో సుమారు 4 వేల కోట్లు ఖర్చుచేసి పరిశ్రమలను స్థాపించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రైవేట్ రంగంలో యువతకు మరింత ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వివరించారు. విదేశాల నుంచి పెట్టుబడులు.. రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించామన్నారు. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టుబడులు సాధించామని వివరించారు. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించామని ఏఐ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. మేయర్ సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, ఎంపీ కడియం కావ్య, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, స్నేహ శబరీష్, సత్యశారద, గ్రేటర్ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాదాబైనామాతో భూసమస్యలు పరిష్కారం ముందు చూపుతో గ్రేటర్ వరంగల్ అభివృద్ధి ప్రజాపాలన వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి
హసన్‌పర్తి: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషి చేయాలని కేయూ పాలక మండలి సభ్యురాలు, నార్కొటిక్స్ విభాగం యాంటీ డ్రగ్స్ కమిటీ సభ్యురాలు డాక్టర్ అనితారెడ్డి సూచించారు. కిట్స్ కళాశాలలో యాంటీ డ్రగ్స్‌పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయించినా, కొనుగోలు చేసినా నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ బారినపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. విద్యార్థులను డ్రగ్స్ విక్రయదారులు పావులా వాడుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్స్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సదస్సులో కిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌రెడ్డి, కేయూసీ ఇన్స్పెక్టర్ రవికుమార్, ప్రొఫెసర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ వ్యవస్థను నిర్వీర్యం చేసిందే కేసీఆర్
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హన్మకొండ చౌరస్తా: రాజకీయ వ్యవస్థను నిర్వీర్యం చేసిందే కేసీఆర్ అని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకొని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను ఎందుకు తొలగించారో జవాబు చెప్పాలని అన్నారు. కవిత వ్యాఖ్యలపై స్పందించి తాము ఏ అక్రమాలకు పాల్పడలేదని ముక్కునేలకు రాయాలని హరీశ్‌రావు, కేటీఆర్‌కు సవాల్ విసిరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటున్న హరీశ్‌రావు, కేటీఆర్.. దమ్ముంటే మీరందరూ రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్న నమ్మకం లేదన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, పింగిళి వెంకట్‌రెడ్డి, నాయిని లక్ష్మారెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, మార్క విజయ్ పాల్గొన్నారు. -
నాబార్డ్ అధికారుల పర్యటన
ఎల్కతుర్తి : భీమదేవరపల్లి మండలంలో నాబార్డ్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ జాంబ్రే పర్యటించారు. బుధవారం మండలంలోని ముస్తఫాపూర్ గ్రామంలో ఏకే విశ్వనాథరెడ్డి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ షెడ్ కార్యక్రమంలో భాగంగా సోలార్ కంచె, సోలార్ పశుగ్రాసం, బయోగ్యాస్, మొబైల్ స్టార్టర్, మొక్కల పెంపకాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ, భూసార యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. అనంతరం మత్స్య సహకార సంఘానికి చేపపిల్లల కొనుగోలుకు చెక్కు అందజేశారు. నాబార్డ్ వరంగల్ క్లస్టర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ చంద్రశేఖర్, ఏజీఎం చైతన్య రవితంగ, దేవేందర్, సభ్యులు పాల్గొన్నారు. -
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలి
మామునూరు: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని ఎంఈఓ ఎస్.వెంకటేశ్వర్రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, నిస్సా జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జేఎస్ పరంజ్యోతి, ట్రస్మా కార్యదర్శి ఎన్.వెంకటేశ్వరరావు సూచించారు. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ హైస్కూల్ ప్రాంగణంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఆడెపు శ్యాం అధ్యక్షతన బుధవారం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి సన్మానించారు. టస్మా, వడుప్సా జిల్లా ప్రతినిధులు బిల్లా రవి, జ్ఞానేశ్వర్‌సింగ్, కోడెం శ్రీధర్, బుచ్చిబాబు, సంతోష్‌రెడ్డి, జనార్దన్, అడెపు వెంకటేశ్వర్లు, ముక్కెర రవీందర్, కూచన క్రాంతికుమార్, కూచన కవిత, సబిత, సురేఖ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ది ప్రజాకంఠక పాలన
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ హన్మకొండ: కాంగ్రెస్‌ది ప్రజాకంఠక పాలన అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ దుయ్యబట్టారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించామన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను వంచిస్తోందని ధ్వజమెత్తారు. హక్కుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టడం, మైనారిటీలను ఎమ్మెల్యేగా, మంత్రిని చేయకపోవడం ప్రజాపాలన అని ప్రశ్నించారు. ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. అన్నదాతలను ఆగం చేయడం, యూరియా అందించకపోవడం, రైతు రుణమాఫీ అమలు చేయకపోవడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయేలా చేయడం, జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడం ప్రజాపాలన అని నిలదీశారు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. అమాయకులను హతమారుస్తున్న బూటకపు ఎన్కౌంటర్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్, పులి రజనీకాంత్, జోరిక రమేశ్, తండమల్ల వేణు, కుసుమ లక్ష్మీనారాయణ, నయీముద్దీన్, బండి రజనీకుమార్, దూలం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిపై మంత్రి సమీక్ష
హన్మకొండ అర్బన్: ప్రజా పాలన వేడుకల అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో సుమారు గంటసేపు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, మేయర్, గ్రేటర్ కమిషనర్, జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, కాంగ్రెస్ అంతర్గత విషయాలపై చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. అంతకుముందు ప్రజాపాలన వేడుకల కోసం నగరానికి వచ్చిన మంత్రి పొంగులేటికి నిట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అమరవీరులకు నివాళి.. హనుమకొండ అదాలత్ కూడలిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. -
మహిళ ఆరోగ్యంతోనే కుటుంబ ఆరోగ్యం
హన్మకొండ: మహిళ ఆరోగ్యంతోనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్వస్త్ నారి.. సశక్తి పరివార్ అభియాన్‌లో భాగంగా బుధవారం హనుమకొండ సమ్మయ్యనగర్‌లోని లష్కర్‌సింగారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయస్థాయిలో ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన తర్వాత ఈ మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళలకు అవసరమైన వైద్యసేవలందించాలని డాక్టర్లు, సిబ్బందికి సూచించారు. టీబీ ముక్త్ అభియాన్‌లో భాగంగా దాతలు అందించిన పోషకాహార కిట్లను టీబీ వ్యాధిగ్రస్తులకు అందించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, డాక్టర్లు అజిత్ మహమ్మద్, సుదీప్, ప్రశాంత, హారిక, హిమబిందు, ఇత్తదార్ అహ్మద్, సనత్ చందర్, భానుచందర్, హైదర్, డెమో అశోక్ రెడ్డి, ఎన్హెచ్ఎం డీపీఎం రుక్ముద్దీన్ పాల్గొన్నారు.పూర్వ విద్యార్థులు సహకారం అందించాలికేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో చదువుకొని వివిధ దేశాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల కృషిని అభినందిస్తూ, వర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. అమెరికాలోని అట్లాంటాలో ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించగా వీసీ ప్రతాప్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సెలబ్రెట్ అండ్ కాంట్రిబ్యూట్ అనే థీంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సమూహాలు యూనివర్సిటీ గ్లోబల్ భాగస్వామ్యానికి రావాలని కోరారు. అలుమ్ని గోల్డెన్‌జూబ్లీ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమెరికా సంయుక్తరాష్ట్రాల విశ్వవిద్యాలయ ఫార్మసీ చాప్టర్, కేయూ ఫార్మసీ విభాగం పూర్వవిద్యార్థి సాంబారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పరుచూరితో పాటు పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.వైద్య విద్యార్థుల స్టైఫండ్ వెంటనే విడుదల చేయాలిఎంజీఎం : రాష్ట్రంలోని వైద్య విద్యార్థుల పెండింగ్ స్టైఫండ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ (టీ–జుడా) బాధ్యులు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ (డీఎంఈ) పరిధిలోని సంస్థల అధిపతులు స్టైఫండ్ బిల్లులను సమయానికి సమర్పించినా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదానికి నిలిచిపోతున్నాయని తెలిపారు. స్టైఫండ్ విడుదల కాకపోవడంతో జూనియర్ డాక్ట ర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు, డెంటల్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు, హౌ స్ సర్జన్లు, నర్సింగ్ విద్యార్థులు ఆర్థికంగా సతమతవుతున్నారని పేర్కొన్నారు. సకాలంలో స్టైఫండ్ విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు అందించామని చెప్పారు.కృత్రిమమేధ.. కీలక పాత్రవిద్యారణ్యపురి : వ్యవసాయం, ఫార్మా, వ్యాపార, వాణిజ్య తదితర రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) కీలక పాత్ర పోషిస్తోందని కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీఅండ్ పీజీ కళాశాలలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీ షేపింగ్ ది లాండ్స్కేప్ ఆఫ్ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో రాజేందర్ పాల్గొని మాట్లాడారు.ఈ సదస్సులో హైదరాబాద్ ఎంజెల్స్ సీఈఓ, ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ రత్నాకర్ సామవేదం కీలక ఉపన్యాసం చేశారు. అనంతరం అతిథులు సావనీర్‌ను ఆవిష్కరించారు. పలువురు పరిశోధన పత్రాలు సమర్పించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, సదస్సు కన్వీనర్ డాక్టర్ రాజిరెడ్డి, కేయూ ప్రొఫెసర్ పి.అమరవేణి, కామర్స్ విభాగం అధిపతి డాక్టర్ సారంగపాణి, హుస్నాబాద్ కాలేజీ ప్రిన్సిపాల్ భిక్షపతి పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శం
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ప్రజాప్రభుత్వం స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. 20 నెలల్లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దూసుకుపోతోందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. నగర పరిధిలో 7 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, 50 వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రేటర్ పరిధిలో 76,378 మందికి చేయూత పెన్షన్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాప్‌రెడ్డి, ప్రజాకవి కాళోజీ, దాశరథి కృష్ణమాచార్యులు, సుద్దాల హనుమంతు, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి వంటి సాహితీమూర్తులకు నివాళులర్పించారు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఈఈ రవికుమార్ పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలిబతుకమ్మ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రేటర్ ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తొలిరోజు వేయిస్తంభాల ఆలయంలో పెద్ద ఎత్తున నిర్వహించే బతుకమ్మ వేడుకకు లైటింగ్, పారిశుద్ధ్య పనులు, తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. హనుమకొండ పరిధి 26 ప్రాంతాల్లో, వరంగల్ పరిధి 20 ప్రాంతాల్లో అవసరమైన మేరకు లైటింగ్, డస్ట్‌తో పాటు రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. డీఈలు సారంగం, రవికిరణ్, టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు పరిహారం అందిస్తాం..
భూ నిర్వాసితుల సమావేశంలో ఆర్డీఓ వేలేరు : కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తరఫున పరిహారం అందిస్తామని హనుమకొండ ఆర్డీఓ రమేశ్ రాథోడ్ తెలిపారు. బుధవారం గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి మండలంలోని ఎర్రబెల్లి గ్రామానికి వచ్చే కాల్వ కింద భూములు కోల్పోతున్న రైతులతో తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరువు ప్రాంతమైన ఎర్రబెల్లిలో కెనాల్ ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 2వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అన్నారు. భూ సేకరణకు రైతులందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ హెచ్.కోమి, ఆర్ఐ సురేందర్, సీనియర్ అసిస్టెంట్ హేమ నాయక్, సిబ్బంది ఉన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
● పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ కేయూ క్యాంపస్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో సైబర్‌నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అమాయకులను సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ.. మనకు తెలిసిన ముఖాలు తగిలించుకుని నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో డబ్బులు కొల్లగొడుతున్నారని తెలిపారు. అనంతరం సన్‌ప్రీత్‌సింగ్‌ను రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి శాలువా కప్పి సన్మానించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, సైబర్ క్రైం ఏసీపీ కె.గిరికుమార్, వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, నార్కొటిక్స్ ఇన్స్పెక్టర్ సతీశ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
● జెడ్పీ సీఈఓ రవినాయక్ ఎల్కతుర్తి: హాస్టళ్ల నిర్వహణలో వార్డెన్లు నిర్లక్ష్యం వహించకూడదని జెడ్పీ సీఈఓ రవినాయక్ అన్నారు. భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు బాలికల, ఎస్సీ వసతి గృహాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, ఆహార పదార్థాలు, దినసరి మెనూ, మరుగుదొడ్లు, పడుక గదులను పరిశీలించారు. విద్యార్థులు తినే ఆహారం నాణ్యంగా ఉండాలని వార్డెన్లకు సూచించారు. వసతి గృహాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముల్కనూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ వీరేశం, పంచాయతీ కార్యదర్శి పూర్ణచందర్ తదితరులు ఉన్నారు. -
వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
న్యూశాయంపేట: ప్రజాపాలన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ ఆజంజాహి మిల్లు మైదానంలోని కొత్త కలెక్టరేట్ పక్కన నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు. రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం ఉదయం పది గంటలకు హాజరై జాతీయ పతా కాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. సీటింగ్ ఏర్పాట్లు, షామియానా, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బీ ఈఈ రాజేందర్‌రెడ్డి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గోపాల్‌రెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. పత్తి కనీస మద్దతు ధర రూ.8,110జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అన్నారు. కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై అధికారులు, ట్రేడర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తికి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 1,81,547 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు వివరించారు. 11,85,470 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. జిల్లాలోని నాలుగు వ్యవసాయ మార్కెట్లలో ఉన్న 27 జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో పత్తి కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా తూనికలు, కొలతల అధికారి మనోహర్ పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
విద్యార్థుల్లో అభ్యసన స్థాయి పెంపొందించాలి
● కలెక్టర్ స్నేహ శబరీశ్ కమలాపూర్: విద్యార్థుల్లో అభ్యసన స్థాయి పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆదేశించారు. గూడూరు శివారులోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌ను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఏడు, ఎనిమిది, పదో తరగతులను సందర్శించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. పదో తరగతి విద్యార్థులను గణిత సబ్జెక్టుకు సంబంధించిన పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని ప్రీ మిడ్లైన్ టెస్ట్ పరిశీలించారు. విద్యార్థుల ప్రవర్తనా తీరు ఎలా ఉందని, పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని సబ్జెక్టులు, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మెరుగ్గా ఉండేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని, విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని, పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ వాసంతి, ఎంఈఓ శ్రీధర్, తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఎంపీడీఓ గుండె బాబు, ప్రిన్సిపాల్ అనిత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపరకాల: కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి పరకాల ఇందిరా మహిళా డెయిరీ స్థాపించనున్నట్లు తెలిపారు. ఆడబిడ్డల రుణం తీర్చుకోవడం కోసమే డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దామెర, ఆత్మకూరు, నడికూడ, పరకాల మండలాల గ్రామస్థాయి, ప్రాదేశిక స్థాయి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు అవగాహన, సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డెయిరీ ఆవశ్యకత, నిర్మాణం, యజమాని బాధ్యతలు, పాలఉత్పత్తి, పాల మార్కెటింగ్‌పై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వ సహకారం, అధికారుల కృషితో రాజకీయాలకతీతంగా పరకాల డెయిరీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక ఆర్థికపరమైన వ్యాపారం మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే మహాయజ్ఞంగా భావించాలని కోరారు. సమాజానికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడమే పరకాల మహిళా డెయిరీ ఒక ముఖ్య కారణమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి మహిళను ఒక పారిశ్రామిక వేత్తగా చేయాలనే సంకల్పంతో ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. సదస్సులో డీఆర్డీఓ శ్రీను, ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, అధికా రులు, మహిళాసమాఖ్య నాయకులు ఉన్నారు -
ఆరోగ్య భాగ్యం
మహిళల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలుగీసుకొండ: ఇంటింటా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ ఆరోగ్యం బాగుంటుందనే సంకల్ప ంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆరోగ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అతివలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు ‘స్వస్థ్ నారీ.. సశక్తి పరివార్ అభియాన్’ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధమైంది. బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు గ్రామస్థాయి నుంచి నగరాల వరకు పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ప్రభుత్వ వైద్యశాలల్లో మహిళలు, పిల్లల కోసం ముమ్మరంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 15 రోజులపాటు స్పెషల్ డ్రైవ్ కింద వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు, గర్భిణులు, బాలింతల్లోని ఆరోగ్య సమస్యలు, పిల్లల్లో వయస్సుకు తగిన బరువు, ఎత్తులేని వారిని గుర్తించి వైద్య శిబిరాలకు తీసుకుని వస్తే వారికి పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. జిల్లాలోని పల్లె దవాఖానలు (ఆయష్మాన్ ఆరోగ్య మందిర్లు), పీహెచ్‌సీలు, జిల్లా, ఏరియా, బోధన ఆస్పత్రుల పరిధిలో మహిళలకు వైద్య పరీక్షలు చేయాలన్నదే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రతి మంగళవారం పీహెచ్‌సీల్లో ఆరోగ్య మహిళా క్లినిక్‌లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అభియాన్ కార్యక్రమంతో మహిళల ఆరోగ్య సమస్యలు తెలిసే అవకాఽశం ఉంది. పలు రకాల పరీక్షలు.. అధిక రక్తపోటు, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణకు పరీక్షలు నిర్వహిస్తారు. రక్తహీనతకు గురి కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులు, యువతులకు అవగాహన కలిగిస్తారు. రక్తహీనత నిర్ధారణ పరీక్షలు చేస్తారు. టీబీ పరీక్షలు, గిరిజన ప్రాంతాల్లో సికెల్ సెల్ ఎనీమియా (కొడవలి కణ రక్తహీనత) పరీక్షలు చేసి డిసీజ్ కార్డులను అందించి కౌన్సెలింగ్ ఇస్తారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా పరీక్షలు నిర్వహించి గైనకాలజీ, నేత్ర, ఈఎన్టీ, డెర్మటాలజీ, సైక్రియాట్రీ, డెంటల్ సర్జరీ తదితర వైద్యులు శిబిరాల్లో మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారని కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. ప్రణాళిక రూపొందించాం.. జిల్లాలో 15 రోజుల పాటు నిర్వహించే స్వస్థ్ నారీ..సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రణాళిక రూపొందించాం. ఏఏ ఆరోగ్య కేంద్రాల్లో, ఏ తేదీల్లో ఎలాంటి వైద్య నిపుణులు అందుబాటులో ఉండి పరీక్షలు నిర్వహిస్తారనే విషయాలను అందులో పొందుపరిచాం. అన్ని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, యూపీహెచ్‌సీల్లో పరీక్షలు నిర్వహించడానికి స్పెషలిస్టు వైద్యులు ఉంటారు. రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ దేశాయిపేటలోని యూపీహెచ్‌సీలో ఈ అభియాన్‌ను నేడు లాంఛనంగా ప్రారంభిస్తారు. – డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్ఓ నేటి నుంచి అక్టోబర్ 2 వరకు స్క్రీనింగ్ టెస్టులు ‘స్వస్థ్ నారీ.. సశక్తి పరివార్’ అభియాన్ కింద పరీక్షలు నేడు దేశాయిపేట యూపీహెచ్‌సీలో ప్రారంభించనున్న మంత్రి సురేఖ -
నాగేంద్రస్వామికి పూజలు
గీసుకొండ: మండలంలోని ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దంపతులు మంగళవారం పూజలు చేసి మొక్కులు సమర్పించారు. వారికి అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీహర్ష ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మండల దీక్షలు చేపట్టిన స్వాముల కోసం అర్చకులు జ్యోతి పూజ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు రడం భరత్, శ్రావ్య దంపతులు స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు.పారిశుద్ధ్య పనులు చేపట్టాలిగీసుకొండ: వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డీపీఓ కటకం కల్పన అన్నారు. మండలంలోని శాయంపేటహవేలి గ్రామంలో ప్రత్యేక యాప్‌లో వివరాల నమోదును మంగళవారం పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. నర్సరీ, పల్లె ప్రకృతివననం, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నిధులతో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్, కారోబార్ కనకాచారి పాల్గొన్నారు.నేడు దసరా ఉత్సవాలపై సమీక్షఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద నేతృత్వంలో సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలపై బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాగపూరి సంజయ్‌బాబు, మేడిది మధుసూదన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వివిధశాఖల అధికారులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరుకావాలని వారు కోరారు.కాల్వ ఒడ్డుపై మొసలిఖానాపురం: కాల్వ ఒడ్డుపై మొసలి చేరడంతో రైతులు మంగళవారం భయాందోళనకు గురయ్యారు. మండలంలోని బండమీదిమామిడితండా శివారు సంగెం కాల్వలో నుంచి ఒడ్డుపైకి చేరింది. దీంతో అటువైపు వెళ్లిన రైతులు మొసలిని చూసి భయపడ్డారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి మొసళ్లను పట్టుకుని పాకాల సరస్సులో వదిలేయాని రైతులు కోరుతున్నారు. -
ఓరుగల్లులో రణనినాదం
భూస్వామ్య వ్యవస్థ రద్దు కోసం ఆనాడు ప్రజలు చేసిన ఉద్యమమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. దొరలు, దేశ్‌ముఖ్‌లను గడగడలాడించి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో నిజాం పాలనకు చరమగీతం పాడారు. రజాకార్ల అరాచకాలను ఎండగట్టారు. పంటను పాలకులు లాక్కుంటే మహిళలు వేటకొడవళ్లతో తరిమికొట్టారు. ఈ నేల నుంచి చాకలి ఐలమ్మ పోరాటం, దొడ్డి కొమురయ్యతోపాటు అనేక మంది అమరులయ్యారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఉద్యమాలు, వీరోచిత పోరాటంపై (సెప్టెంబర్ 17 సందర్భంగా) ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.మరో జలియన్ వాలాబాగ్ పరకాలపరకాల: పరకాల పోరాట పటిమ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సాయుధ పోరాటంలో భాగంగా అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల పిలుపు మేరకు 1947 సెప్టెంబర్ 2న అనేక గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు పరకాలకు తరలివచ్చారు. అప్పటికే ఇక్కడ నిజాం పోలీసులు మకాం వేశారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 15మంది అమరులయ్యారు. రజాకారులు వెంటాడి 180 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురంలో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చిచంపారు. చంద్రగిరి గు ట్టలను కేంద్రంగా చేసుకుని సా యుధ పోరాటం జరిపారు. మరో జలియన్‌వాలాబాగ్ ఘటనను కళ్లకు కట్టినట్లు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వందలాది విగ్రహాలనుతయారు చేయించారు. పరకాల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రెండేళ్లు శ్రమించి 2003 సెప్టెంబర్ 17న ఆ విగ్రహాలతో ఏర్పాటు చేసిన అమరధామాన్ని ఆయన ప్రారంభించారు.చరిత్రకు సాక్ష్యం జనగామ రైల్వేస్టేషన్జనగామ: దొరల ఆగడాలకు చరమగీతం పాడింది జనగామ రైల్వేస్టేషన్. విస్నూరు దొర లష్కర్ (సికింద్రాబాద్)కు పారిపోయే ప్రయత్నంలో సాయుధ పోరాట యోధులు మట్టుబెట్టి తమ వీరత్వాన్ని చాటుకున్నారు. విస్నూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి కొడుకు బాబు దొర అరాచకాలు మితిమీరిపోయాయి. 1947లో సవారు కచ్చురంలో నలుగురు విప్లవకారుల కాళ్లు, చేతులను కట్టేసి తన గూండాలతో గడ్డివాములో తలదాచుకుని తెల్లవారు జామున 4 గంటల వరకు లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చేరుకున్నాడు. ఊరి శివారున ఉన్న ఈత చెట్ల సమీపంలో ముగ్గురిని చంపేశాడు. ఇందులో ఓ ఉద్యమకారుడు చాకచక్యంగా తప్పించుకుని, కుందారం గ్రామానికి చేరుకుని జరిగిన ఘటనను స్థానికులకు వివరించాడు. దీంతో పదివేల మందికిపైగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దొర పోలీస్ స్టేషన్లో తలదాచుకుని రైల్వేస్టేషన్ సమీపంలోని పాత ఎస్బీహెచ్ ఆవరణలో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విప్లవ యోధుడు గబ్బెట తిరుమల్‌రెడ్డి నాయకత్వంలో జాటోత్ దరాగ్యనాయక్, మరికొందరు విప్లవకారులు నాటి రైల్వే వ్యాగన్ ఏరియాలో దొర రాకకోసం ఎదురు చూశారు. పట్టాలపై ఆగిఉన్న గూడ్స్ రైలు కింది నుంచి దాటుకుంటూ వ్యాగన్ పాయింట్ మర్రిచెట్టు కిందకు రాగానే దరాగ్యనాయక్.. దొర మెడపై మొదటి వేటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. విప్లవకారులు దొరను చిత్రహింసలు పెట్టి చంపేశారు. అనంతరం ప్రజలు సంబురాలు చేసుకున్నారు. దొరకు చరమగీతం పలికిన రైల్వేస్టేషన్ నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.పోలీసు ఉద్యోగం వదిలి..మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన రేగూరి చంద్రారెడ్డి నాడు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేశారు. పోలీసు ఉద్యోగం మానేసి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పరకాల కేంద్రంగా సాయుధ పోరాటం చేసిన యోధుల్లో చివరగా మిగిలిన.. ఆయన ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ కేయూ క్యాంపస్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో సైబర్‌నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అమాయకులను సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ.. మనకు తెలిసిన ముఖాలు తగిలించుకుని నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం సన్‌ప్రీత్‌సింగ్‌ను రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి శాలువా కప్పి సన్మానించారు. సమావేశంలో ఆకాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, సైబర్ క్రైమ్ ఏసీపీ కె.గిరికుమార్, వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, నార్కొటిక్స్ ఇన్స్పెక్టర్ సతీశ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
● ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ గీసుకొండ: పోలీసులు సైబర్ నేరాల నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ అన్నారు. గీసుకొండ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేసి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, గంజాయి, గుట్కా, గుడుంబా, జూదం లాంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దొంగతనాల కేసులను త్వరగా ఛేదించాలని, గ్రామ పోలీసు అధికారులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, గొడవలు సృష్టించే వారిౖపై నిఘా పెట్టాలన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో పనిచేసే కార్మికులపై పర్యవేక్షణ ఉండాలని, అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నేరాల నివారణకు సాంకేతికతను ఉపయోగించాలని పేర్కొన్నారు. తొలుత డీసీపీకి సిబ్బంది గౌరవ వందనం చేయగా అనంతరం ఆయన పరేడ్‌ను స్వీకరించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పలు రికార్డులు పరిశీలించారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్వర్లు, గీసుకొండ సీఐ ఎ.మహేందర్, ఎస్ఐలు కుమార్, అనిల్, రోహిత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
దిగుమతి సుంకం రద్దు చేయొద్దు
దుగ్గొండి: కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయొద్దని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విదేశాలకు లాభం చేకూర్చి, దేశీయ పత్తి రైతులకు అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. ఈనెల 22న వరంగల్‌లో జరగనున్న పత్తి రైతుల సదస్సును విజయవంతం చేయాలని ముద్రించిన పోస్టర్లను సంఘం నాయకులు మంగళవారం గిర్నిబావిలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆగస్టు 19న పత్తి దిగుమతిపై ఇతర దేశాలకు విధించే సుంకం 11 శాతం రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందన్నారు. వ్యవసాయ రంగాన్ని దివాళా తీసే విధంగా కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దిగుమతి సుంకం రద్దు చేయడంతో దేశీ పత్తి రైతులకు ధర తగ్గే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంపై పోరాటానికి రైతులు సిద్ధం కావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు పుచ్చకాయల బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి లడె మోహన్‌రావు, జిల్లా కమిటీ సభ్యులు బరుపటి రవీందర్, రెముడాల దామోదర్‌రెడ్డి, గుండెకారి రాజేశ్వర్‌రావు, జంగా జనార్దన్‌రెడ్డి, నల్ల విజేందర్, నర్సిరెడ్డి, కర్ణాకర్, బాపురావు, రాజన్న, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
కేయూలో విద్యార్థి సంఘాల నిరాహార దీక్షలు
కేయూ క్యాంపస్: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కేయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కేయూలోని ఎస్డీఎల్సీఈ ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈశిబిరంలో ఐక్య విద్యార్థి సంఘాల బాధ్యులు బి.తిరుపతి మాదిగ, అరెగంటి నాగరాజు, డి.తిరుపతి, మర్ర మహేశ్ రీసెర్చ్ స్కాలర్స్ కేతపాక ప్రసాద్, కందికొండ తిరుపతి, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు బొట్ల మనోహర్, ఎల్తూరి సాయికుమార్, ఉప్పుల శివ, కమ్మరి శ్రీనాఽథ్, ఎండెల రాకేశ్, బొక్క ప్రవర్ధన్, చింతం ఆంజనేయులు, శ్రీదేవి, స్రవంతి, శేఖర్, ఓర్సు చిరంజీవి విద్యార్థులు పాల్గొన్నారు.వరంగల్ స్పోర్ట్స్: మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ క్రీడా సదస్సుకు హాజరుకానున్న హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్‌కుమార్‌ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీఅండ్ ఎండీ సోనీబాలాదేవి, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సాట్ కార్యాలయంలో అశోక్ సాట్ వీసీఎండీ, చైర్మన్లను వారి ఆఫీసుల్లో మర్యాద పూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో సాట్ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యారణ్యపురి: డిజిటల్ లెర్నింగ్‌పై హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూల్స్, కేజీబీవీల, మోడల్ స్కూల్స్, టీఎస్ఆర్ఐఈఎస్లలోని గణిత, ఫిజికల్ సైన్స్ టీచర్లకు ఈనెల 17 నుంచి 19 వరకు మూడు రోజులు జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ‘ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ అనే మోడ్యూల్పై ఈశిక్షణ ఇవ్వనున్నారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండుచోట్ల ఆయా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. 6వతరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి డిజిటల్ లెర్నింగ్ పాఠ్యప్రణాళిక అంశాలపై రిసోర్స్పర్సన్లతో శిక్షణ ఇవ్వబోతున్నారు.నాగేంద్రస్వామికి పూజలుగీసుకొండ: మండలంలోని ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దంపతులు మంగళవారం పూజలు చేసి మొక్కులు సమర్పించారు. వారికి అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీహర్ష ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మండల దీక్షలు చేపట్టిన స్వాముల కోసం అర్చకులు జ్యోతి పూజ నిర్వహించారు. -
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిగీసుకొండ: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గీసుకొండ మండలం కొనాయమాకులలోని ఓ గార్డెన్లో గీసుకొండ, సంగెం మండలాల ఇందిరా మహిళా ప్రాథమిక సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాల వారికి ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతీ మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పమన్నారు. జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, డీసీఓ నీరజ, పశుసంవర్ధకశాఖ జేడీ బాలకృష్ణ, అదనపు డీఆర్డీఓ రేణుకాదేవి, కాకతీయ కోఆపరేటివ్ సంస్థ ప్రిన్సిపాల్ యాకోబ్నాయక్, మండల సమాఖ్య అధ్యక్షురాలు రాధిక, సంగెం మండల అధ్యక్షురాలు ఉమాదేవి, అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాల వైఫల్యంతోనే యూరియా కొరత
● ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి రమేశ్నర్సంపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతోనే యూరియా కొరత ఉందని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక మతోన్మాద పాలకుల పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్లో సోమవారం సింగతి మల్లికార్జున్ అధ్యక్షతన డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యలపై గ్రామాల్లో సర్వేలు నిర్వహించి పరిష్కరించే విధంగా పోరాటాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. డివిజన్ పార్టీ పూర్వ వైభవానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి డివిజన్ కమిటీ సభ్యుడు ముందుకు కదలి పని చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుసుంబ బాబురావు, వంగల రాగసుధ, కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహ్మద్ రాజాసాహెబ్, గటికె జమున, తడుక కౌసల్య, గీసపాక కొమురయ్య, దామ సాంబయ్య, కలకోట్ల యాదగిరి, గాజుల వెంకటయ్య, అల్లి సాహెబ్, కర్నె సాంబయ్య, బత్తిని కుమారస్వామి, బడిమె సురేందర్, సీతారాములు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి మహిళా ఆరోగ్య కార్యక్రమాలు
గీసుకొండ: జిల్లాలో ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ.. స్వశక్తి పరివార్ అభియాన్‌లో భాగంగా మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు జిల్లా ఇ మ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ ప్రకాశ్ అ న్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పరివార్ అభియాన్‌లో భాగంగా వైద్య అ ధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ ుతూ మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడానికి ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తామన్నారు. విద్యాలయాల్లో రక్తహీనత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రోగ్రాం అధికారులు ఆచార్య, విజయ్‌కుమార్, అనిల్‌కుమార్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
సమన్వయంతో బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లు
హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ హన్మకొండ అర్బన్ : బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను జిల్లా అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, వేద పండితులతో బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. ఈనెల 21న వేయిస్తంభాల ఆలయం వద్ద ఘనంగా బతుకమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. మహిళా పోలీసులను బందోబస్తుకు కేటాయించాలన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తామన్నారు. -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 166 ఫిర్యాదులు వచ్చాయి. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా బిల్లులు రావట్లేదని, రెండు నెలల నుంచి తిరుగుతున్నా టెక్నికల్ సమస్య ఉందని చెబుతున్నారని 41వ డివిజన్‌కు చెందిన అందె ఝాన్సీ వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. -
వినతులకు పరిష్కారం చూపాలి
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో ప్రజలనుంచి స్వీకరించిన వినతులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతులు స్వీకరించారు. మొత్తం 178 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. డీఆర్ఓ వై.వి గణేష్, డీఎంహెచ్ఓ అప్పయ్య, జెడ్పీ సీఈఓ రవి, డీఈఓ వాసంతి, మెప్మా పీడీ జోనా తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి పోషణ మాసోత్సవం ఈనెల 17వ తేదీ (బుధవారం) నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. పోషణ మాసం కార్యక్రమంలో అమలు చేసే వివరాలను డీడబ్ల్యూఓ జయంతి వివరించారు. కొడుకులు ఆస్తి రాయించుకున్నారు భర్త ద్వారా రావాల్సిన ఆస్తిని కొడుకులు నా పేరు మీదికి మా ర్చుతామని చెప్పి మోసం చేసి వాళ్ల పేరుతో మార్చుకున్నారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ ఎవరూ లేరని సర్టిఫికెట్ తీసుకున్నారు. మోసం చేసి ఆస్తిని రాయించుకున్న ఐదుగురు కొడుకులపై చర్యలు తీసుకోవాలి. – జుబేదా బేగం, పరకాల ఇంట్లో నుంచి కొడుకు వెళ్లగొడుతున్నాడు మాది హనుమకొండ హౌసింగ్ బోర్డ్ కాలనీ. నా రెండో కొడుకు, కోడలు అక్రమంగా ఇంట్లోకి వచ్చి నన్నే వేధించి వెళ్లగొడుతున్నారు. నా భర్త 40ఏళ్ల క్రితం చనిపోగా ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లను పెంచి పెద్ద చేసి ఒక ఇంటివారిని చేసిన. నా కొడుకు, కోడలు బయటికి గెంటేస్తే బతికే పరిస్థితి లేదు. వారిపై చర్యలు తీసుకోని, నా ఇంట్లో నేను ఉండే విధంగా చర్యలు తీసుకోండి. – జేరిపోతుల రామసుందరమ్మ -
ఐసీసీసీ పనితీరుపై అధ్యయనం
వరంగల్ అర్బన్ : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు వందశాతం అమలు చేస్తున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరాన్ని సోమవారం వరంగల్ బల్దియా పాలక వర్గం, అధికారుల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. స్టడీటూర్‌లో తొలి రోజు ఇండోర్‌లోని చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్, డంపింగ్ యార్డు, ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సిస్టం (ఐసీసీసీ) తీరును పరిశీలించారు. నగరంలోని ఆయా కాలనీల నుంచి ప్రతీ రోజు ఆరు రకాలుగా చెత్తను విభజించి సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 311 యాప్‌ద్వారా అందుతున్న వివిధ రకాల సేవలను వివరించారు. ఇందులో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎస్ఈ మహేందర్, సీపీ రవీందర్ రాడేకర్, కార్పొరేటర్లు, ఎంహెచ్ఓ రాజేశ్, హెచ్ఓ రమేశ్ తదితరులు ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ బల్దియా పాలకవర్గం, అధికారుల స్టడీ టూర్‌పై ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజాధనంతో చేస్తోంది అధ్యయన యాత్రనా లేక ఆధ్యాత్మిక, విహార యాత్రనా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
మంత్రి కొండా సురేఖ ఇల్లు ముట్టడి
హన్మకొండ : మంత్రి కొండా సురేఖ ఇల్లును సోమవారం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ముట్టడించారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లు నెలకు రూ.18 వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడి ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. హనుమకొండ రాంనగర్‌లోని సీపీఎం కార్యాలయం నుంచి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ర్యాలీగా బయల్దేరి మంత్రి ఇంటి వరకు చేరుకున్నారు. మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకుని బారికేడ్లు అడ్డుగా పెట్టారు. పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో పోలీసులు, సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ టీచర్ల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మంత్రి ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ టీచర్లు, అసోసియేషన్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీపీఎం కార్యాలయానికి చేరుకుంటున్న వారిని కూడా మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకుని హనుమకొండ, కేయూసీ, సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్, సీపీఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్ రెడ్డి అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య, నాయకులు సుంచు విజేందర్, బొట్ల చక్రపాణి, అంగన్వాడీ యూనియన్ నాయకులు వీరగోని నిర్మల, శోభారాణి, రాజేశ్వరి, రమాదేవి, కే.జమున, హైమావతి, రజిత, అనిత, ఉమాదేవి, ఎండీ మైముద, అంజుమ్, శారద, వందలాదిమంది అంగన్వాడీలు పాల్గొన్నారు. పోలీసులు, అంగన్వాడీల మధ్య తోపులాట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు -
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్‌సింగ్ దామెర: యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సరిపడా యూరియా ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రవీందర్‌సింగ్ అన్నారు. మండలంలోని ఊరుగొండ(పెద్దాపూర్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా పంపిణీని పరిశీలించారు. ఈసందర్భంగా రికార్డుల పరిశీలన అనంతరం మాట్లాడుతూ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయనవెంట మండల వ్యవసాయ శాఖ అధికారులు అల్లె రాకేశ్, కమలాకర్, ఏఈఓలు జగదీశ్, రామకృష్ణ, అరుణ్, సీఈఓ శ్రీనివాస్ ఉన్నారు. రైతులకు ఇబ్బంది కలుగొద్దు శాయంపేట: యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ అధికారులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఫర్టిలైజర్ డీలర్లు, వ్యవసాయ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖలో చేపడుతున్న వివిధ పథకాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్.శ్రీనివాస్, టెక్నికల్ ఏఓ కమలాకర్, ఏఓ గంగాజమున, సిబ్బంది పాల్గొన్నారు. ఎల్కతుర్తి : ముల్కనూరు ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) విద్యార్థి గొల్లెన శ్రీనిధి కిక్ బాక్సింగ్‌లో రాష్ట్ర స్థాయిలో రాణించి గోల్డ్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపాల్ రెహమాన్ తెలిపారు. సోమవారం తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీలను వరంగల్‌లో నిర్వహించారు. అండర్–15 కేటగిరిలో నిర్వహించిన పోటీలో గోల్డ్ మెడల్ సాధించి, సౌత్ ఇండియా కిక్ బాక్సింగ్ లీగ్ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. శ్రీనిధిని ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. -
నిర్మాణం..కళాత్మకం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుత కట్టడాలుకాజీపేట అర్బన్: దక్షిణాదిలోనే అతి పెద్ద హాస్టల్ భవనంతో నిట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిట్‌లోని సివిల్ ఇంజనీర్లు 2009లో హాస్టల్ భవనానికి శ్రీకారం చుట్టారు. 10 అంతస్తుల్లో 1,800 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఎటుచూసినా వీ ఆకారంలో కనిపించేలా భవనం నిర్మించారు. నాటి కాకతీయ కళాకారుల కీర్తి ప్రతిష్టను పెంపొందించేందుకు హాస్టల్ భవనానికి రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్సీగా నామకరణం చేయగా.. విద్యార్థులు ఆల్ట్రా మెగా హాస్టల్ 1.8కేగా పిలుచుకుంటున్నారు. చక్కటి గాలి, వెలుతురు వస్తుంది. నిట్ వరంగల్‌లో ప్రవేశం పొందిన బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ భవనంలో వసతి కల్పిస్తారు. ఒక గదిలో నలుగురు విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. జిమ్, కాఫీ షాపు, టీవీ రూంలు, బ్యాడ్మింటన్ కోర్టులతోపాటు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంజనీర్లు బహుళ అంతస్తు నిర్మాణంలో నిట్‌ను రోల్‌మెడల్‌గా తీసుకుంటున్నారు. కల్లెడ గడి ముఖద్వారంవసతులు ఘనం.. అతి పెద్ద భవనం చెక్కు చెదరని వందల ఏళ్ల నాటి గడీలు పర్యాటకులను ఆకర్షిస్తున్న శిల్పకళా సంపద కాకతీయుల కాలం నాటి ఇంజనీర్ల అపార మేథశతాబ్దికి సమీపం.. నేటికీ పదిలం -
ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుపాక ఎల్లయ్య, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఏనుట్ల రవీందర్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సంఘం ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను ప్రజాసంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటలకు అన్ని గ్రామాల్లో, ఉదయం 9 గంటలకు మండల కేంద్రాల్లో సంఘం పతాకాన్ని ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం హనుమకొండకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఉత్తమ సేవలు అందించిన సభ్యులకు పురస్కారాలు అందించి సన్మానించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేశ్‌కుమార్, ఆయా సంఘాల నాయకులు వనపాకల రాజయ్య, సత్తూరి చంద్రమౌళి, కామెర లక్ష్మణ్, కలకోట్ల ప్రతాప్, మేకల ప్రవీణ్, వల్లందాస్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలి
కేయూ క్యాంపస్: సమాజంలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని కాకతీయ యూనివర్సిటీ యూజీసీ కో–ఆర్డినేటర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ లా కాలేజీలో జనవిజ్ఞాన వేదిక హనుమకొండ జిల్లా కమిటీ ఐదో వార్షిక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సహజ వనరుల శాసీ్త్రయ వినియోగంతోనే సమగ్రాభివృద్ధి జరుగనుందని అభిప్రాయపడ్డారు. ఏ ప్రాంతంలోనైనా నీటికొరతను అధిగమించేందుకు ఇంకుడుగుంతలు, చెక్‌డ్యాంల నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. చెరువుల మధ్య అనుసంధాన వ్యవస్థను ఏర్పరిస్తే భూగర్భజలాల స్థాయిని పెంచి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడవచ్చని తెలిపారు. ఎకనామిక్స్ విభాగం ఆచార్యులు అందె సత్యం మాట్లాడుతూ.. పారిశ్రామిక విప్లవం ద్వారానే ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీ ఉత్పాదకత గణనీయంగా పెరిగిందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన రిటైర్డ్ డీఎఫ్ఓ కాజీపేట పురుషోత్తం, వక్తలు మర్రి యాదవరెడ్డి, డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, కృష్ణానంద్, లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఏడాది కాలంగా చేపట్టిన కార్యకలాపాల నివేదికను జనవిజ్ఞాన వేదిక జిల్లాప్రధాన కార్యదర్శి భిక్షపతి, ఆర్థిక నివేదికను బాధ్యులు పరికిపండ్ల వేణు ప్రవేశపెట్టారు. అనంతరం సదస్సులో పలు తీర్మానాలు చేశారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు శ్రీనాఽథ్, ఆచార్య ఆంజనేయులు, డాక్టర్ రాములు, ఉమామహేశ్వర్రావు, శ్రవణ్‌కుమార్, ధర్మప్రకాశ్, ప్రభాకర్‌చారి, శ్రీనివాస్, సుమలత, వందన అశోక్ ఉన్నారు. కేయూ యూజీసీ కో–ఆర్డినేటర్ మల్లికార్జున్‌రెడ్డి -
కిక్ బాక్సింగ్ సిటీ లీగ్ చాంపియన్‌షిప్
వరంగల్ అర్బన్ : వరంగల్ బల్దియా ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ సిటీ లీగ్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు 20 జిల్లాల నుంచి 350 విద్యార్థినీవిద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటిసారి సిటీ లీగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్ డీవైఎస్ఓ సత్యవాణి, సెక్రటరీ కైలాశ్యాదవ్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రతినిధులు శ్రీలక్ష్మి, మహిపాల్, బండారి సంతోశ్, తిరుపతి, మణికంఠ, వెంకటేశ్, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లింగారెడ్డి విద్యారణ్యపురి: విద్యారంగం, టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని డీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీని అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన టీచర్ల పదోన్నతుల్లో మిగిలిపోయిన పోస్టుల్లో అర్హులైన ఉపాధ్యాయులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, టీచర్ల శిక్షణ కార్యక్రమాలు వేసవి సెలవుల్లోనే ఇవ్వాలని, విద్యేతర ఆన్లైన్ కార్యక్రమాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం. గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం కామన్ సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఉపాధ్యాయులకు డైట్ లెక్చరర్లుగా, ఎంఈఓలుగా, డిప్యూటీ డీఈఓ లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. సమావేశంలో డీటీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీని వాస్, బాధ్యులు బి.అంజనీదేవి, ఎస్.సుమ, డాక్టర్ కిషన్, ఎ.మల్లయ్య, డి.రమేశ్, టీచర్లు పాల్గొన్నారు. -
కడియం శ్రీహరికి డిపాజిట్ రాదు
వేలేరు: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరికి డిపాజిట్ కూడా రాకుండా ప్రజలు ఓడిస్తారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం మండలంలోని బండతండా, చింతలతండా, కమ్మరిపేట, లోక్యాతండా, సోడాషపల్లి, మల్లికుదుర్లలో ఊరూరికీ బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికీ కేసీఆర్ పథకాలు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని విమర్శించారు. కడియం శ్రీహరి వెంట అవకాశవాద కార్యకర్తలే ఉన్నారని, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిర వెంట ఉన్నారన్నారు. కడియం శ్రీహరికి నియోజకవర్గంలోని సాగునీరు, యూరియా సమస్యలు కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేవరకు పోరాటం చేస్తానన్నారు. కడియం శ్రీహరి తోత్తులు నా శవయాత్ర చేసినా, ఎం చేసినా నియోజకవర్గ ప్రజల తరఫున పోరాటం చేస్తానన్నారు. నాయకులు కీర్తి వెంకటేశ్వర్లు, భూపతిరాజు, సంపత్, గోవింద సురేశ్, మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్ నాయక్ తదితరులు ఉన్నారు. దేవాదులకు కాంగ్రెస్ రూపాయి ఇవ్వలేదు ప్రాజెక్టు పూర్తి కోసం పోరాటం చేస్తాం.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
యూరియా లారీని అడ్డుకున్న రైతులు
శాయంపేట: యూరియా బస్తాల లారీని రైతులు అడ్డుకున్నారు. ప్రగతిసింగారం గ్రామంలోని ఆగ్రోస్ రైతు కేంద్రానికి ఆదివారం 450 బస్తాల యూరియా లోడ్ లారీ వచ్చింది. 225 యూరియా బస్తాలు వసంతాపూర్, 225 బస్తాలు శాయంపేటకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, వసంతాపూర్ గ్రామ రైతులు తమకు 225 యూరియా బస్తాలు సరిపోవని, 450 బస్తాలు కావాలని పట్టుబట్టారు. లారీని శాయంపేటకు పోనివ్వకుండా రైతులు అడ్డుకున్నారు. యూరియా బస్తాలో గడ్డిని నింపి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రెండు రోజుల్లో 225 యూరియా బస్తాలు వసంతాపూర్ రైతులకు మాత్రమే పంపిణీ చేయిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి లారీని శాయంపేటకు తరలించారు. వసంతాపూర్ గ్రామానికి 225 యూరియా బస్తాలు సరిపోదు. 450 బస్తాలు యూరియా ఉంటే సరిపోతుందని లారీని అడ్డుకున్నాం. 450 మంది రైతులు ఉన్నాం. ఒక్కో రైతుకు కనీసం ఒక్క యూరియా బస్తా ఇవ్వాలి. – రవీందర్‌రెడ్డి, రైతు, వసంతాపూర్ -
సామాజిక చైతన్యం కలిగి ఉండాలి
● ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణినర్సంపేట: విద్యార్థులు సామాజిక చైతన్యం కలిగి ఉండాలని నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ చల్ల పల్లి స్వరూపారాణి అన్నారు. ఆదివారం పట్టణంలోని విజ్డమ్ పాఠశాలలో లీడ్ లైబ్రరీ, పాకాల కవులు సంయుక్తంగా నిర్వహించిన అల్లిక పుస్తక పరిచయ సభ ప్రముఖ కవి కాసుల రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ సాహిత్యం ప్రజలకు వైపు ఉండాలని, విద్యార్థులు చిన్నతనం నుంచే సామాజిక చైతన్యం కలిగి ఉండాలన్నారు. చైతన్యవంతమైన సమాజాన్ని రూపుదిద్దడంలో ప్రతి వ్యక్తి తనవంతు భాగస్వామ్యం కలిగి ఉండాలన్నారు. పుస్తక పరిచయ సభను నర్సంపేటలో నిర్వహించినందుకు లీడ్ లైబ్రరీ, పాకాల కవులకు ధన్యవాదాలు తెలిపారు. విజ్డమ్ హైస్కూల్ డైరెక్టర్ సయ్యద్ జావేద్ మాట్లాడుతూ సమాజంలో కవుల పాత్ర ప్రశ్నించే తత్వాన్ని తెలియజేశారు. తంగిరాల సోని మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, వివిధ సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కవులు బండారి రాజ్‌కుమార్, డాక్టర్ తండా హరీష్‌గౌడ్, కుంజ కల్యాణి, పుచ్చ కుమారస్వామి, శిల్ప జగదీష్, ప్రేమ్‌కుమార్, ఉపాధ్యాయులు నరసింహ, రాములు, సుభాని, రాపాక శ్రీనివాస్, విద్యార్థులు, సాహితీ మిత్రులు పాల్గొన్నారు. -
సాయుధ పోరాటం మరుపురాని ఘట్టం
● ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ దుగ్గొండి: తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో మరుపురాని ఘట్టమని ఎంసీపీఐ(యూ) పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ అన్నారు. మండలంలోని గిర్నిబావిలోని ఓ పంక్షన్ హాల్లో పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సా యుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం డివిజన్ కార్యదర్శి మహ్మద్ రాజాసాహెబ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొదట తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివా ళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక మంది వీరులు అమరులయ్యారన్నారు. సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నిరంకుశ పాలననుండి విముక్తి లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు, వంగాల రాగసుధ, కన్నం వెంకన్న, సింగతి మల్లి కార్జున్, దామ సాంబయ్య, కలకోట్ల యాదగిరి, గాజుల వెంకటయ్య, డివిజన్ కమిటీ సభ్యులు గటి కె జమున, తడుక కౌసల్య, గీసపాక కొంరయ్య, బుడిమె సురేందర్, బత్తిని కుమారస్వామి, అనుముల రమేష్, సీతారాములు పాల్గొన్నారు. -
నిర్మాణం..కళాత్మకం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుత కట్టడాలుకాజీపేట అర్బన్: దక్షిణాదిలోనే అతి పెద్ద హాస్టల్ భవనంతో నిట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిట్‌లోని సివిల్ ఇంజనీర్లు 2009లో హాస్టల్ భవనానికి శ్రీకారం చుట్టారు. 10 అంతస్తుల్లో 1,800 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఎటుచూసినా వీ ఆకారంలో కనిపించేలా భవనం నిర్మించారు. నాటి కాకతీయ కళాకారుల కీర్తి ప్రతిష్టను పెంపొందించేందుకు హాస్టల్ భవనానికి రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్సీగా నామకరణం చేయగా.. విద్యార్థులు ఆల్ట్రా మెగా హాస్టల్ 1.8కేగా పిలుచుకుంటున్నారు. చక్కటి గాలి, వెలుతురు వస్తుంది. నిట్ వరంగల్‌లో ప్రవేశం పొందిన బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ భవనంలో వసతి కల్పిస్తారు. ఒక గదిలో నలుగురు విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. జిమ్, కాఫీ షాపు, టీవీ రూంలు, బ్యాడ్మింటన్ కోర్టులతోపాటు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంజనీర్లు బహుళ అంతస్తు నిర్మాణంలో నిట్‌ను రోల్‌మెడల్‌గా తీసుకుంటున్నారు. కల్లెడ గడి ముఖద్వారంవసతులు ఘనం.. అతి పెద్ద భవనం చెక్కు చెదరని వందల ఏళ్ల నాటి గడీలు పర్యాటకులను ఆకర్షిస్తున్న శిల్పకళా సంపద కాకతీయుల కాలం నాటి ఇంజనీర్ల అపార మేథశతాబ్దికి సమీపం.. నేటికీ పదిలం -
కొలువుదీరిన జీపీఓలు
● జిల్లాలో 174 క్లస్టర్లు, 191 మంది ఎంపిక ● ఇకపై గ్రామాల్లో మెరుగైన సేవలునర్సంపేట: గ్రామపంచాయతీల్లో గతంలో మాది రిగా మెరుగైన సేవలు అందించేందుకు జీపీఓల నియామకం పూర్తయింది. జిల్లాలోని 14 మండలా ల్లో 174 క్లస్టర్లలో 191 మంది జీపీఓ (గ్రామ పాలన అధికారి)లను అటాచ్ చేశారు. పూర్వ వీఆర్ఓ, వీఆ ర్ఏలను తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష యం విదితమే. ఈ మేరకు ఆసక్తి ఉన్న గత వీఆర్ఓ లు, వీఆర్ఏలకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించి జీపీఓలను కేటాయించారు. ఇక మీదట గ్రామాల్లో మెరుగైన రెవెన్యూ సేవలు అందనున్నాయి. జిల్లాలో 14 మండలాలు.. జిల్లాలో 14 మండలాలు, 174 క్లస్టర్లు ఉన్నాయి. 19 1 మంది జీపీఓలను ఎంపిక చేసి నియామక పత్రాలు అందించారు. ఈ మేరకు ఈనెల 5న హైదరాబా ద్లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పత్రాలు అందజేశారు. ఎంపికై న జీపీఓలకు క్లస్టర్లను కేటా యిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో జీపీఓలు కొలువుదీరుతున్నారు. తీరనున్న సమస్యలు గ్రామాల్లో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసి న నాటి నుంచి సమస్యలు పేరుకుపోయాయి. వి ద్యార్థులకు కులం, ఆదాయంతో పాటు ఇతర సర్టిఫి కెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు సమస్యలు తప్పలేదు. ప్రతీ చిన్న పనికి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. సకాలంలో పనులు కాకపోవడంతో పడరాని పాట్లు పడ్డారు. ప్రస్తుతం జీపీఓల కేటాయింపుతో సమస్యలు తీరనున్నాయి భూ భారతి చట్టంలో వేగం.. గత ప్రభుత్వంలో పేరుకుపోయిన భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చింది. ధరణిని రద్దు చేస్తూ ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు భూ సమస్యలపై గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం సాదాబైనామాలో దరఖాస్తు చేసుకున్న భూ సమస్యలను పరిష్కారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జీపీఓలు ప్రధాన భూమి పోషించనున్నారు. సర్వేయర్లతో పాటు రెవెన్యూ అధికారులకు వీరు సహకరిస్తారు. రెండు విడతల్లో పరీక్షలు.. జీపీఓ పోస్టుకు గతంలో వీఆర్ఓగా పని చేసిన వారికి అవకాశం కల్పించింది. వీఆర్ఓలు డిగ్రీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించి 191 మందిని జీపీఓలుగా ఎంపిక చేశారు. -
విధులకు హాజరు కాకపోతే చర్యలు
● ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ● వర్ధన్నపేట సీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీవర్ధన్నపేట: వైద్యులు, సిబ్బంది విధులకు హాజరుకాక పోతే కఠిన చర్యలు ఉంటాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణ కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఆస్పత్రి అంతా కలియ తిరుగుతూ రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు సరిగా అందుతున్నాయో లేదో వారిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు అవసరముంటే లిఖిత పూర్వకంగా తనదృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. డ్యూటీ ఉండాల్సిన వైద్యులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు కోనారెడ్డి చెరువుకు నీటిని అందించే ఫీడర్ చానల్ పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. -
వెంటాడుతున్న వీధికుక్కలు
ఖిలా వరంగల్: వరంగల్ 39వ డివిజన్ విద్యానగర్ కాలనీలో వీధి కుక్కలు పెట్రేగిపోతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒంటరిగా కనిపిస్తే చాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడుతున్నాయి. కుక్కల దాడిలో ఇప్పటికే కొందరు పిల్లలు గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కాగా.. వరంగల్ ఫోర్ట్ రోడ్డుకు ఇరువైపులా చికెన్, మటన్ విక్రయ షాపులు ఉన్నాయి. రహదారులపై మాంసం వ్యర్థాలు, చెత్త వేస్తుండడంతో వీధి శునకాలు ఎక్కువగా వాటి కోసం గుంపులుగా తిరుగుతున్నాయి. వీధి కుక్కలను సంరక్షణ కేంద్రానికి తరలించాలని బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా బేఖాతర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. -
పక్కాగా పంటల లెక్క
హన్మకొండ: వానా కాలం పంటల సాగు లెక్కలు కచ్చితంగా తేల్చేందుకు ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేను చేపట్టింది. వ్వవసాయ విస్తరణాధికారులు మొబైల్ ఫోన్లోని ప్రత్యేక యాప్‌లో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్నారు. సాగు చేసిన పంటల ఫొటోలు కూడా యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇంతకు ముందు అంచనాల ఆధారంగా పంటలు నమోదు చేసే వారు. అయితే, కచ్చితత్వం కోసం పంటలను భౌతికంగా చూడడం ద్వారా పంటల సాగు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తద్వారా ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు, ఇతరత్రా ఏర్పాట్లు, నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. జిల్లాలో 14 మండలాల్లోని 125 గ్రామాల్లో 55 క్లస్టర్లున్నాయి. 55 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ)లు సర్వేలో మునిగిపోయారు. జిల్లాలో 2,21,163 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. వరి 1,38,803 ఎకరాలు, పత్తి 74,849 ఎకరాలు, మొక్కజొన్న 7080, పప్పు దినుసులు 395, నూనె గింజల పంటలు 32 ఎకరాలతో పాటు ఇతర పంటలు సాగు చేశారు. పురుష ఏఈఓలు 2 వేల ఎకరాల్లో, మహిళా ఏఈఓలు 1800 ఎకరాల్లో డిజి టల్ క్రాప్ సర్వే చేస్తారు. ఈ మేరకు సర్వే నంబర్ల వారీగా ఏఈఓలకు పంటల సర్వే విస్తీర్ణాన్ని కేటా యించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో పంట బుకింగ్ పూర్తి చేయడానికి వీలుగా ఈ యాప్ ఆఫ్‌లైన్ ఫీచర్‌తో రూపొందించారు. వరి సాగు ఏ పద్దతిలో చేశారో కూడా నమోదు చేసేలా యాప్‌ను రూపొందించారు. అదే విధంగా విత్తనోత్పత్తి పంటల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. వరి పంట సాగును సన్న, ముతక రకాల వారీగా నమోదు చేయాలని సూచించారు. పంట విత్తిన వివరాలు నమోదు ద్వారా ఆ పంట ఎప్పుడు కోతకు వస్తుందో అంచనా వేయడం ద్వారా పంట కొనుగోలు/సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకునే అవకాశముంటుంది. ఉద్యాన సాగులో అంతర్ పంటలను కూడా సర్వేలో నమోదు చేస్తారు. రైతుపేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ల్యాండ్ మార్క్, క్షేత్రంపేరు, సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పంట బుకింగ్ 90 శాతం బుకింగ్ చేయగానే రైతు మొబైల్‌కు ఆరు సందేశాలు వెళ్తాయి. పంటల సాగులో తేడాలుంటే ఏఈఓను కలిసి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. అక్టోబర్ 25 వరకు పూర్తిచేయాలి.. జిల్లాలో అక్టోబర్ 25 వరకు పంటల బుకింగ్ పూర్తి చేయాలి. అదే నెల 27న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో డిజికల్ క్రాప్ సర్వే వివరాలు ప్రదర్శిస్తారు. నవంబర్ 1న రైతుల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారు. ఇదేనెల 3న అభ్యర్థనలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. నవంబర్ 5న తుది డిజిటల్ క్రాప్ సర్వేను ప్రదర్శిస్తారు. రైతులు స్వచ్చందంగా పంట లు నమోదు చేయించుకోవా లి. అక్టోబర్ 25లోపు డిజిటల్ క్రాప్ సర్వేలో పంటల సాగు వివరాలు నమోదు చేసుకోవాలి. ఏఈఓలు క్షేత్ర స్థాయికి చేరుకుని డిజిటల్ క్రాప్ సర్వే చేస్తారు. రైతులు సర్వే నంబర్, పంటల వారీగా వివరాలు నమోదు చేయించుకోవాలి. – రవీందర్‌సింగ్, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో 125 గ్రామాలు, 55 క్లస్టర్లు 2,21,163 ఎకరాల్లో పంటల సాగురైతులు సాగు చేసుకుంటున్న పంటల వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేసుకోకుంటే పంట ఉత్పత్తుల విక్రయాల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన తర్వాత ఆన్లైన్లో ఉన్న సాగు విస్తీర్ణం మేరకు వచ్చే పంట దిగుబడి అంచనాకు సరితూగాలి. తేడాలుంటే పంట ఉత్పత్తుల విక్రయ చెల్లింపులు ఆలస్యమవుతాయి. ప్రభుత్వ పథకాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం పొందడం, బీమా వర్తింపు వంటి సాయం అందించడానికి ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉంటుంది. -
జాతీయ లోక్ అదాలత్‌ల తీర్పు అంతిమం
పరకాల: జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారించుకోవడం వల్ల అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, పరకాల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి.సాయిశరత్ స్పష్టం చేశారు. జాతీయ లోక్ అదాలత్ తీర్పును అంతిమంగా భావించాలని సూచించారు. శనివారం పరకాల కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈలోక్ అదాలత్‌లో పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్, అదనపు న్యాయమూర్తి శ్రీవల్లి శైలజ, రెండవ తరగతి మెజిస్ట్రేట్ కొప్పుల ఈశ్వర్ 3 సివిల్ కేసులు, 1,119 క్రిమినల్ కేసులు, 6 బ్యాంకు కేసులు మొత్తం 1,128 కేసుల్ని పరిష్కరించారు. ఈసందర్భంగా పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్ మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించడం వల్ల ఫిర్యాదుదారులతో పాటు ప్రతివాదులకు సమాన న్యాయం లభిస్తుందన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లతో పాటు చట్టాలపై ప్రజలకు అవగాహన చాలా అవసరమని సూచించారు. కక్షిదారులు క్షణికావేశంలో చేసిన నేరాలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాతీయ లోక్ అదాలత్ సభ్యులు ఓంటేరు రాజమౌళి, రవికుమార్, పరకాల డివిజనల్‌లోని పోలీసులు పాల్గొన్నారు. పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్ లోక్ అదాలత్‌లో 1,128 కేసులు పరిష్కారం హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ డీసీసీబీ భవన్లో న్యాయ విజ్ఞాన సదస్సు -
నగదు ఎలా రికవరీ చేస్తారు?
శాయంపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం అవినీతి ఆరోపణలు, ఇన్ బ్యాలెన్స్ తగ్గింపులో విఫలమవడం వల్ల పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసినట్లు డీసీఓ సంజీవరెడ్డి తెలిపారు. పాలకవర్గాన్ని రద్దు చేసినప్పటికీ అక్రమాలకు పాల్పడిన రూ.15లక్షలు ఎలా రికవరీ చేస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది. శాయంపేట పీఏసీఎస్‌లో రూ.15 లక్షలు అక్రమాలకు పాల్పడ్డారని, రూ.10.54 కోట్లు ఇన్ బ్యాలెన్స్‌గా ఉండడంతో జూలై నెల 3న డీసీఓ సంజీవరెడ్డి పీఏసీఎస్ పాలకవర్గానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం పీఏసీఎస్ పాలకవర్గాన్ని రద్దు చేశారు. రికవరీ మరింత జాప్యం జరిగే పరిస్థితి కనబడుతోంది. రికవరీ ఎలా చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. -
నగరాభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ
వరంగల్ అర్బన్: వరంగల్ నగరాభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కేరళ ప్రభుత్వం తొలిసారిగా కేరళ అర్బన్ కాన్క్లేవ్–25 మేయర్ల ఫోరం సదస్సు శనివారం ముగిసింది. స దస్సులో సుధారాణి మాట్లాడుతూ.. నూతన మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.4,170 కోట్లు, విమానాశ్రయం కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి 6 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి, ఎఫ్ ఎస్టీపీలు, ఎస్టీపీలు, బయోమైనింగ్, బయో, విండో కంపోస్ట్ల యూనిట్ల ఏర్పాటు, కూరగాయల వ్యర్థాలతో బయో గ్యాస్ ప్లాంట్లతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల క్యూ ఆర్ కోడ్, బిల్డ్ నౌ ద్వారా భవనాల అనుమతులు తదితర విధానాలను అవలంబిస్తున్న తీరును వివరించారు.కేరళ అర్బన్ కాన్క్లేవ్–25 సదస్సులో మేయర్ గుండు సుధారాణి -
ధర్మకర్తలను నియమించే స్వేచ్ఛ లేదా?
వరంగల్ చౌరస్తా: శ్రీరాష్ట్ర మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను నియమించే స్వేచ్ఛ నాకు లేదా? అధిష్టానం సూచించిన వారికే కేటాయించాశ్రీ అని దేవాదాయ ధర్మదాయ, పర్యవరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. శనివారం వరంగల్ ఓ సిటీలో విలేకరులతో మంత్రి సురేఖ మాట్లాడారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలిచాడని, ఆయనపై తాను కామెంట్ చేయాలనుకోవట్లేని పేర్కొన్నారు. తనపై నాయిని చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. రూ.3కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన తూర్పు నియోజక వర్గంలో మూడు డివిజన్లలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. కాశిబుగ్గలో రూ1.50 కోట్లతో నిర్మించే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి, రూ.50 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులు, 26వ డివిజన్ గిర్మాజీపేటలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు, 21వ డివిజన్ ఎల్ బీ నగర్లో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులు ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని, వినతి పత్రాలు స్వీకరించారు. ఈఅభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాయిని అదృష్టం కొద్ది గెలిచాడు మంత్రి కొండా సురేఖ -
అథ్లెటిక్స్ మీట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిద్దాం
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వచ్చే నెల (అక్టోబర్) 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలపై వివిధ క్రీడా సంఘాలతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొననున్నట్లు క్రీడా సంఘాల బాధ్యులు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి వివరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. పోటీల వివరాల్ని సీఎం రేవంత్‌రెడ్డికి వివరించేందుకు ఈనెల 15 లేదా 16 తేదీల్లో స్వయంగా కలవనున్నట్లు తెలిపారు. డీవైఎస్ఓకు ఎమ్మెల్యే అభినందనలు ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ క్రీడా సదస్సుకు హాజరుకానున్న డీవైఎస్ఓ గుగులోతు అశోక్‌కుమార్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అభినందించారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రజాభవన్‌లో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి శనివారం డీవైఎస్ఓ అశోక్‌కుమార్‌ను శాలువాతో సత్కరించారు. మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగిన అశోక్‌కుమార్ క్రీడాకారులకు ఆదర్శమన్నారు. అంతకుముందు క్రీడా సంఘాలు, డీఎస్ఏ కోచ్‌ల ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అశోక్‌కుమార్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు అజీజ్‌ఖాన్, అథ్లెటిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు వరదరాజేశ్వర్‌రావు, బాడ్మింటన్ సంఘం జిల్లా కార్యదర్శి రమేశ్‌రెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మామిండ్ల రాజు తదితరులున్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
వ్యాపారిపై చర్య తీసుకోవాలి
● నల్లబెల్లిలో రైతుల రాస్తారోకో నల్లబెల్లి: నకిలీ గడ్డిమందు విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలో వారు ఆందోళన చేసి మాట్లాడారు. మండల కేంద్రంలోని ఖాజామైనొద్దీన్ షాపులో విన్ సూపర్ పురుగుల మందును నందిగామకు చెందిన రైతు ఇస్లావత్ రాజ్‌కుమార్ రూ.1,700కు కొనుగోలు చేసి పిచికారీ చేయగా మూడెకరాల్లోని వరిపంట ఎండిపోయిందని తెలిపారు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోయాడని వారు పేర్కొన్నారు. దళిత సంఘాల నాయకులు బొట్ల నరేశ్, భట్టు సాంబయ్య రాస్తారోకోలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న షాపు యజమానికి హైమద్ పాషా బాధిత రైతుకు పరిహారం అందిస్తానని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని వేడుకున్నాడు. నకిలీ గడ్డిమందు అంటగట్టిన షాపు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, షాపును సీజ్ చేయాలని వ్యవసాయాధికారులు కోరారు. నందిగామ, నల్లబెల్లి తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
యూరియా కోసం బారులుదీరిన రైతులు
ఖానాపురం : మండల కేంద్రంలో రైతులు యూ రియా కోసం బారులుదీరారు. గ్రోమోర్‌కు 266 బస్తాలు వస్తున్నాయని తెలియడంతో రైతులు రైతువేదిక వద్ద భారీగా బారులుదీరారు. ఖానాపురంతో పాటు కొత్తూరు, రంగాపురం, మనుబోతులగడ్డ, అశోక్‌నగర్ గ్రామాలకు చెందిన రైతులు క్యూలో నిల్చున్నారు. ఏఈఓ ఆశాదీప్ ఆధ్వర్యంలో క్యూలో ఉన్న వారికి టోకెన్లు పంపిణీ చేశారు. బస్తాలు ఎన్ని వస్తున్నాయో వాటికి అనుగుణంగానే టోకెన్లు ఇచ్చారు. మిగతా వారు వెనుదిరిగిపోయారు. రైతువేదిక వద్ద బారులుదీరిన రైతులు -
ఫోర్టిఫైడ్‌తో ఆరోగ్యం
ఖిలా వరంగల్: రేషన్ బియ్యాన్ని నల్ల బజారులో విక్రయిస్తున్నారా.. అయితే డబ్బు ఖర్చు చేయకుండా వచ్చిన పోషకాలను కోల్పోయినట్లే. కిలోకు రూ.10 లేదా రూ.15 కోసం ఆ బియ్యాన్ని విక్రయిస్తే.. తర్వాత ఆస్పత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. అవగాహన లేక కొందరు లబ్ధిదారులు ఫోర్టిఫైడ్ రేషన్ సన్న బియ్యాన్ని నల్లబజారులో విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. పౌరసరఫరాల శాఖ రెండేళ్లుగా ఫోర్టిఫైడ్ రైస్‌ను జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జిల్లాలోని 509 షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. జిల్లాలో పాతకార్డులు 2,66,429 కాగా.. నూతనంగా జారీచేసిన 16,251 కార్డులతో 282,680 కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులకు 53,82,518 టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే ఇందులో ప్రతి నెలా 5 నుంచి 10 శాతం రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులు ఫోర్టిఫైడ్ రైస్‌పై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అపోహలు వద్దు.. చిన్నారులు, యువకులు, గర్భిణుల్లో 35 నుంచి 50 శాతం రక్తహీనత ఉన్నట్లు జాతీయ కుటుంబ సర్వే నివేదిక పేర్కొంది. ఎలాంటి అపోహలు లేకుండా ఫోర్టిఫైడ్ రైస్‌ను ఆహారంగా తీసుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పురుషులు తీసుకునే మొత్తం ఆహారంలో ఐరన్ వరుసగా 13 మిల్లీగ్రాముల నుంచి 15.19 మిల్లీగ్రాములు ఉన్నట్లు నివేదిక తేల్చింది. పోషకాలు ఎంత మేర కలుపుతారంటే.. ఒక బ్యాగుకు 28 నుంచి 42.5 మిల్లీగ్రాముల వరకు ఐరన్ (ఫెర్రిక్ ఫైరోపాస్ఫేట్) కలుపుతారు. దీనికి బదులు సోడియం ఐరన్ 14 నుంచి 25.25 మిల్లీగ్రాములు కలుపుతారు. ఒక బ్యాగుకు 75 నుంచి 125 మిల్లీగ్రాముల వరకు ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ–12 కోసం హైడ్రాకై ్స కో బలమైన పోషకాలు, జింక్ , విటమిన్ ఏ, థయమిన్, రైబోప్లావిన్, నియాసిన్, విటమిన్ బీ6, పోషకాలు కలుపుతారు. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళల్లో రక్త హీనత సమస్య ఉండదు. చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందుకోసమే బియ్యాన్ని హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకాల్లో వినియోగిస్తున్నారు. బియ్యాన్ని వినియోగించాలి రేషన్ దుకాణాల్లో పంపిణీ జరుగుతున్న ఫోర్టిఫైడ్ కెర్నెల్స్ బియ్యాన్ని లబ్ధిదారులు ఆహారంగా తీసుకోవాలి. దుకాణాల్లో తీసుకున్న బియ్యాన్ని ఇతరులకు విక్రయించకుండా ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారు. రక్తహీనతను అధిగమించవచ్చు. చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రేషన్ బియ్యాన్ని వినియోగించాలి. – డాక్టర్ నరేశ్‌కుమార్, వైద్యమండలి ఉమ్మడి జిల్లా సభ్యుడు -
నగరాభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ
వరంగల్ అర్బన్: వరంగల్ నగరాభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కేరళ ప్రభుత్వం తొలిసారిగా కేరళ అర్బన్ కాన్క్లేవ్–25 మేయర్ల ఫోరం సదస్సు శనివారం ముగిసింది. స దస్సులో సుధారాణి మాట్లాడుతూ.. నూతన మా స్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.4,170 కోట్లు, విమానాశ్రయం కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థా ల నుంచి 6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, ఎఫ్ ఎస్టీపీలు, ఎస్టీపీలు, బయోమైనింగ్, కూరగాయల వ్యర్థాలతో బయో గ్యాస్ ప్లాంట్లతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల క్యూఆర్ కోడ్, బిల్డ్ నౌ ద్వారా భవనాల అనుమతులు తదితర విధానాలను అవలంబిస్తున్న తీరును వివరించారు. కేరళ అర్బన్ కాన్క్లేవ్–25 సదస్సులో మేయర్ గుండు సుధారాణి -
మంత్రి పొన్నంను కలిసిన ఎమ్మెల్యే దొంతి
నర్సంపేట: హైదరాబాద్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను శనివారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట బస్టాండ్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. నెక్కొండ బస్టాండ్ ఆవరణలో సీసీ ప్లాట్ఫారం నిర్మించాలని కోరినట్లు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్‌రావు, పర్వతగిరి మాజీ జెడ్పీటీసీ సింగ్‌లాల్ ఉన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీఖానాపురం: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మండలంలోని బుధరావుపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధరావుపేట గ్రామానికి చెందిన సుధగాని సాంబయ్య ఈనెల 7న తన కుమారుడు రాజేశ్‌కు జ్వరం రావడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఇంటిముందు గేటుతోపాటు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకోగా తాళం తొలగించి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా నాలుగు గ్రాముల బంగారు రింగు, తులం వెండి రింగు, 14 తులాల మూడు వెండి బ్రాస్లెట్స్, 10 తులాల పట్టీలు, రూ.10వేల నగదు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి రూరల్ సీఐ సాయిరమణ, ఎస్సై రఘుపతి చేరుకుని వివరాలు సేకరించారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కూస్ల్టీం సభ్యులు వేలిముద్రలు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ బదిలీవర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ సుధీర్‌బాబు బదిలీ అయ్యారు. పదోన్నతి రావడంతో ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు స్థానచలనం అయినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల వరంగల్ మహానగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సమ్మయ్యను వర్ధన్నపేట ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్‌గా నియమించినట్లు సమాచారం. దాతలు ముందుకు రావాలి నర్సంపేట : యాత్రాదానం మహోన్నత కార్యక్రమంలో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని నర్సంపేట డిపో మేనేజ ర్ ప్రసూనలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ యాత్రాదానం కార్యక్రమం ద్వారా అనాథలు, నిరాశ్రయ వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులు ప్రసిద్ధి దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, విహార యాత్రలకు వెళ్లే అవకాశం పొందుతారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్జీఓలు ఈ యాత్రాదానం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించడంతో పాటు సామాజిక బాధ్యత సంస్థగా ముందుకు వచ్చి యాత్రాదానం కార్యక్రమాన్ని ఆర్టీసీ ప్రారంభించిందన్నారు. బస్సుల బుకింగ్ కోసం నర్సంపేట డిపో 9959226052, 9866314253 నంబర్లలో సంప్రదించాలని డీఎం పేర్కొన్నారు. -
స్విమ్మింగ్ పోటీల్లో కాట్రపల్లి విద్యార్థుల ప్రతిభ
రాయపర్తి: రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో కాట్రపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ కనబరిచినట్లు ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీలక్ష్మి శనివారం తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈనెల 12న వరంగల్ జిల్లా కేంద్రంలో బిర్లా ఓపెన్‌మైండ్స్ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ట్రాయల్థన్ పోటీల్లో పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎల్.చరణ్, తొమ్మిదో తరగతి విద్యార్థి ఎండీ అబ్దుల్థాహెర్ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ అంబర్‌పేటలోని అంతర్జాతీయ స్విమ్మింగ్‌పూల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పీడీ సమ్మయ్య, విద్యార్థులు చరణ్, ఎండీ అబుల్థాహెర్ను హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించినట్లు ఆమె తెలిపారు. -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి కృషి
● జాతీయ లోక్ అదాలత్ ప్రారంభంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్వరంగల్ లీగల్: మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, కక్షిదారులు కృషిచేయాలని హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా అడ్మినిష్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులోని 10 కోర్టుల భవనంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. న్యాయమూర్తులు పాత సివిల్ కేసులపై దృష్టి సారించాలని, వాటి పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ బిల్డింగ్ ముందు మధ్యవర్తిత్వం ద్వారా జరిగే లాభాలు అనే బ్యానర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్లు వీబీ నిర్మలా గీతాంబ, పట్టాభిరామారావు, కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్‌పాండే, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ మెంబర్లు, ఉమ్మడి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాదులు, వివిధ బ్యాంకుల అధికారులు, ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు. -
కలానికి సంకెళ్లేసి సత్యాన్ని నిర్బంధించలేరు!
నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు పత్రికా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు అక్షర రూపమిచ్చినందుకు సాక్షి జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలానికి సంకెళ్లు వేసి సత్యాన్ని నిర్బంధించగలరా? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి..
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఖానాపురం: రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని గొల్లగూడెంతండాకు చెందిన రైతు తేజావత్ శ్రీనుకు చెందిన మొక్కజొన్నకు యూరియా లభించకపోవడంతో గొర్రెలు మేయడంతో శుక్రవారం సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. డీఏఓ అనురాధతో మాట్లాడి ఏఓ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయాలని తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూరియా కోసం బారులుదీరుతున్న రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నష్టపోయిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పశువులతో పంటలను మేపొద్దని, అధికారులు వచ్చి చూసే వరకు ఆగాలని సూచించారు. యూరియా కొరతకు కారణమైన ఏఓ శ్రీనివాస్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని, తప్పుడు నివేదికలు ఇస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. యూరియాను కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్‌కు విక్రయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటనర్సయ్య, బంధారపు శ్రీనివాస్‌గౌడ్, ఆబోతు అశోక్, వెంకన్న, బాలకిషన్, గొంది నాగేశ్వర్రావు, మౌలానా, మురళి, తోట రవి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల గొంతు నొక్కడమే..
హన్మకొండ అర్బన్: ప్రతిపక్షాల గొంతు నొక్కడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న ఏకై క గొంతుక పత్రికలు. వాటిని కూడా అణచివేయడం, అక్రమ కేసులతో తొక్కివేయడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకర పరిణామాలుగా చెప్పాలి. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పత్రికలే ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులను కేసుల పేరుతో నిర్బంధించడం. వేధించడం అమానుషం. ఇది మంచి పరిణామం కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, నాయకులు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు. – ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజల స్వేచ్ఛను హరించడమే..హన్మకొండ అర్బన్: అధికార పక్షం విఫలమైనప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడేవి పత్రికలు, మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ స్వలాభం కోసం నిర్బంధాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే, కక్ష సాధించినట్లే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను కాలరాయడమన్నది ప్రజల స్వేచ్ఛను హరించడమే. ఇప్పటికై నా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక చర్యలను మానుకోవాలి. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త -
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
మహబూబాబాద్ అర్బన్: ప్రజాస్వామ్య మౌలిక సూత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను కాలరాయడం నియతృత్వ పాలనకు నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం నిరాకరించడం అంటే ప్రజస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని కూలగొట్టడమే. ప్రభుత్వ కాలపరిమితి పరిమితం. కానీ, ప్రజాస్వామ్యం అజేయమైంది. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి మీడియా గొంతును నొక్కయడం సరికా దు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదు. – డాక్టర్ డోలి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు, మానుకోట ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతికా స్వేచ్ఛను హరించడమంటే రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. ప్రతిక స్వేచ్ఛను కాపాడకుంటే ప్రజలు బుద్ధిచెబుతారు. – పిల్లి సుధాకర్, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -
సృజనాత్మకతను వెలికితీసేందుకే కళా ఉత్సవ్
డీఈఓ వాసంతి విద్యారణ్యపురి: పాఠశాలల స్థాయి విద్యార్థుల్లో సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు కళాఉత్సవ్ దోహదం చేస్తుందని హనుమకొండ డీఈఓ వాసంతి అన్నారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళాఉత్సవ్ను హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించారు. ఈకళా ఉత్సవ్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా స్థాయిలో 12 అంశాల్లో కళాఉత్సవ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. 14 మండలాల నుంచి 93 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు, వారిని రాష్ట్రస్థాయి కళాఉత్సవ్ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్‌స్వామి, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, సోషల్ స్టడీస్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజల గొంతు నొక్కడమే..
హన్మకొండ అర్బన్: ప్రతిపక్షాల గొంతు నొక్కడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న ఏకై క గొంతుక పత్రికలు. వాటిని కూడా అణచివేయడం, అక్రమ కేసులతో తొక్కివేయడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకర పరిణామాలుగా చెప్పాలి. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పత్రికలే ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులను కేసుల పేరుతో నిర్బంధించడం, వేధించడం అమానుషం. ఇది మంచి పరిణామం కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, నాయకులు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు. – ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజల స్వేచ్ఛను హరించడమే..హన్మకొండ అర్బన్: అధికార పక్షం విఫలమైనప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడేవి పత్రికలు, మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ స్వలాభం కోసం నిర్బంధాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే, కక్ష సాధించినట్లే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను కాలరాయడమన్నది ప్రజల స్వేచ్ఛను హరించడమే. ఇప్పటికై నా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక చర్యలను మానుకోవాలి. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త -
న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలి
టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు న్యూశాయంపేట: తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయ (టీజీఈ జాక్) ప్రభుత్వానికి సమర్పించిన న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ టీజీఓ భవన్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్య అతిథిగా జగన్మోహన్రావు పాల్గొని మాట్లాడుతూ.. ఇటీవల ముఖ్యమంత్రి ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లపై మాట్లాడిన మాటలు ఉద్యోగ లోకాన్ని బాధించినా టీజీఓ, టీఎన్జీఓతో పాటు వివిధ సంఘాలకు గుర్తింపునిస్తూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చలకు అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలను ఏకగీవ్రంగా ఆమోదించారు. కమిటీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష పదవుల్లో బి.రాజిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీప్రియను తీసుకున్నారు. సమావేశంలో టీజీఓ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి ఫణికుమార్, ఇతర కార్యవర్గ సభ్యులతో పాటు హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్, కోశాధికారి రాజేశ్‌కుమార్, శ్రీనివాస్, యాకయ్య, రాజు, రాజేశ్, సదానందం, మైదం రాజు, సతీశ్‌కుమార్ రవీందర్‌రెడ్డి, సుధీర్‌కుమార్, హేమలత, పవిత్ర తదితరులు పాల్గొన్నారు. -
వరిలో ఉల్లికోడు.. యాజమాన్య పద్ధతులు
హన్మకొండ: వరిపంటలో ఉల్లికో డు నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్స్ ఉమారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త ఎల్.కృష్ణ సూచించారు. వానా కాలంలో రాష్ట్రంలో దాదాపుగా 65.5 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉల్లికోడు ఆశించిదని వారు వివరించారు. ఉల్లికోడు లక్షణాలు.. ఉల్లికోడు తల్లి పురుగు ఆకు కొనల దగ్గర, మొవ్వు మట్టల మీద గుడ్లను విడివిడిగా, గుంపులుగా పెడుతుంది. వీటి నుంచి పిల్ల పురుగులు బయటకు వచ్చి అంకురం వద్ద చేరి నష్టం కలిగిస్తాయి. అందువల్ల అంకురం లేత ఆకుపచ్చ లేదా ఆకుపచ్చని పొడవాటి గొట్టంగా మార్పు చెంది బయటికి వస్తుంది. వీటినే రాగి గొట్టాలు లేదా ఉల్లి గొట్టాలుగా పి లుస్తారు. ఈ పురుగు ఆశించిన పి లక నుంచి ఎలాంటి కంకులు ఏ ర్పడవు. ఆశించిన దుబ్బులో పక్క పిలకలు ఎక్కువగా వస్తాయి. యాజమాన్య పద్ధతులు.. ● సిఫారసు చేసిన సమయం లోపల నాట్లు పూర్తిచేయాలి. ● డబ్ల్యూజీఎల్–119 లాంటి తట్టుకునే రకాలు సాగుచేయాలి. ● పొలంలో, గట్లపై కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి. ● లీటరు నీటికి పిఫ్రోనిల్ 5ఎస్సీ 2.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ● ముఖ్యంగా ఆగస్టు చివరి వారం తర్వాత నాట్లు వేసిన రైతులు తప్పనిసరిగా ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3 సీజీ గుళికలు చల్లాలి. తద్వారా ఉల్లికోడు బారినుంచి పంటను కాపాడుకోవచ్చు. -
ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జ్కి మెమో
ముక్కిన బియ్యాన్ని గుర్తించిన కలెక్టర్ న్యూశాయంపేట: వరంగల్ ఏనుమాముల మార్కెట్లోని మండల్ లెవల్ స్టాక్(బియ్యం) పాయింట్‌ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని నిల్వలు, బియ్యం నాణ్యత, నిల్వ విధానం, భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ముక్కిన బియ్యం, విద్యార్థులకు సరఫరా చేసే మధ్యాహ్న భోజన పథక బియ్యం ఒకే ప్రాంతంలో ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల డీఎం, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జ్కి మెమో జారీచేయాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. తనిఖీల్లో పట్టుబడిన బియ్యాన్ని వెంటనే వేలం వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, తదితర అధికారులు పాల్గొన్నారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలిగీసుకొండ: రోడ్లకు ఇరువైపులా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని డీఎఫ్ఓ అనుచ్ అగర్వాల్ అన్నారు. మండలంలోని మచ్చాపూర్ నుంచి దుగ్గొండి మండలం లక్ష్మీపురం వరకు ఆర్అండ్ బీ రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలను శుక్రవారం ఆయన పరిశీలించారు. నాటిన మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తవి నాటాలని చెప్పారు. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సృజనకుమారి, సెక్షన్ ఆఫీసర్ జగ్గయ్యనాయక్, బీట్ ఆఫీసర్ సమయనాయక్, వన సేవకులు రాజు, శ్రీకాంత్, యాకయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితులతో కలెక్టర్ సమీక్ష న్యూశాయంపేట: మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన గాడిపెల్లి గ్రామస్తులతో శుక్రవారం కలెక్టర్ సత్యశారద సమీక్షా సమావేశం నిర్వహించారు. 12 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించే తీరుపై సమీక్షించారు. సమీక్షలో నిర్వాసితుల సందేహాలను నివృత్తి చేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డిఓ సత్యపాల్‌రెడ్డి, ఖిలావరంగల్ తహాశీల్దార్ శ్రీకాంత్, ఏఓ విశ్వప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలి వరంగల్ లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లను వినియోగించుకోవాలని వరగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్‌ను పురస్కరించుకొని వరంగల్, హనుమకొండతోపాటు ఆయా జిల్లాల పరిధిలోని నర్సంపేట, పరకాల కోర్టుల్లో సైతం బెంచీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు లోక్‌అదాలత్‌లకు హాజరై రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని వారు సూచించారు. బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్ తెలంగాణ సంప్రదాయ పండుగల్లో ఒకటైన బొడ్డెమ్మ వేడుకలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహిళలు, యువతులు, చిన్నారులంతా కలిసి పుట్టమన్ను తెచ్చి బొడ్డెమ్మ గద్దెను రూపొందించారు. పూలు, ఒడి బియ్యంతోపాటు నైవేద్యం తయారు చేసి ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా.. కోలు బిడ్డాలెందరూ..’ అంటూ పాటలు పాడుతూ.. ఆడారు. చిన్నారులు ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు. బొడ్డెమ్మ అనంతరం పెద్దల అమావాస్యతో బతుకమ్మ పండుగ మొదలుకానుంది. – సాక్షి నెట్వర్క్ -
రైతులను గోస పెడుతున్న రేవంత్‌రెడ్డి
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ● యూరియా కోసం రాయపర్తిలో ధర్నా ● అరెస్టు చేసిన పోలీసులురాయపర్తి: బూటకపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజాపాలన చేతకావడంతోనే యూరి యా కొరత వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరి యా కొరతను నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సీ ఎం రేవంత్‌రెడ్డి రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎ క్కడా యూరియా కొరత రానివ్వలేదన్నారు. ఇప్పు డు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ధర్నా చేస్తామనడంతో వెంటనే కాల్వల్లో నీళ్లను విడిచినట్లు తెలిపారు. ఎస్సైలు ముత్యం రాజేందర్, రాజు ఆధ్వర్యంలో దయాకర్‌రావును అరెస్ట్ చేసి జీపులో తరలిస్తుండగా వందల సంఖ్యలో చేరుకున్న రైతులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అయినప్పటికి పోలీసులు దయాకర్‌రావును పోలీస్స్టేషన్వైపు తరలించారు. అనంతరం యూరియా కష్టాలు తీర్చాలని కార్యకర్తలు, రైతులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూ నావత్ నర్సింహానాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, ఐత రాంచందర్, రంగారెడ్డి, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, చిన్నాల రాజబాబు, బండి రాజబాబు, బొమ్మెర వీరస్వామి పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలి
టీఎస్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టి.ప్రభాకర్ హన్మకొండ: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరవరంగం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో హనుమకొండ యూనిట్ సమావేశం నిర్వహించారు. ఇందులో తిరువరంగం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగ జేఏసీలో 200 సంఘాలుండగా.. కేవలం 15 సంఘాలకు మాత్రమే స్టాండింగ్ కౌన్సిల్లో స్థానం కల్పించి మిగతా వాటిని విస్మరించడం.. విభజించి పాలించడం అన్నట్లుగా ఉందన్నారు. సర్వీస్ సంఘాలతో పాటు విశ్రాంత ఉద్యోగుల సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అవకాశం కల్పించాల్సి ఉండగా విస్మరించడం విచారకరమన్నారు. అనంతరం హనుమకొండ యూనిట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా సాంబయ్య వ్యవహరించగా.. రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా ఖాజామోహినుద్దీన్ వ్యవహరించారు. కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ందని వారు వివరించారు. అధ్యక్షుడిగా ఎం.మల్లారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా పి.సదానందచారి, కార్యదర్శిగా కె.సంజీవరెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీగా ఎం.భిక్షపతి, ఉపాధ్యక్షులుగా పి.శ్రీరాములు, వి.సుజాత తదితరులున్నారు. -
శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు!
వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నకిలీ వైద్య కేంద్రాలపై ఆగస్టు 20న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా మామిడి ఈశ్వరయ్య అనే వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ డాక్టర్ పోస్టర్ పెట్టుకుని రోగులను మోసం చేస్తున్నట్లు సభ్యులు గుర్తించారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్యకుమార్ ఆదేశాల మేరకు టీజీఎంసీ బృందం ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈతనిఖీల్లో మడికొండ మెయిన్ రోడ్డులో ’సాయిశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ పేరుతో అక్రమంగా ఒక క్లినిక్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షిప్రతినిధి, వరంగల్: ..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లు.. పొంతనలేని మందులు.. ఎమర్జెన్సీ వైద్యం చేస్తూ కొందరు ‘నకిలీ’లు నిర్వహిస్తున్న ఆస్పత్రులు పేదలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఖర్చు తక్కువ పేరిట వైద్యం ఎరవేస్తున్న కొందరు ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ల తీరు శాపంగా మారుతోంది. ఫేక్ డిగ్రీలు.. సర్టిఫికెట్లతో ‘డాక్టర్’ స్టిక్కర్లు వేసుకుంటున్న అనేక మంది నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్‌లో 3,250కు పైగా అర్హత లేని వైద్యులున్నట్లు సమాచారం. చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆయుర్వేద వైద్యం పేరిట ఎక్కడ పడితే అక్కడ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ వైద్య మండలి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక ఘటనలు వెలుగు చూడడం గమనార్హం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీలు గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నకిలీ పీఎంపీలు, ఆర్ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎక్కడి పడితే అక్కడ ఇష్టారాజ్యంగా క్లినిక్‌లు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సైతం జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా సమీపంలోని ఆర్ఎంపీల దగ్గరికే వెళ్తున్నారు. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపిస్తుండడంతో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఆగస్టులో 15 కేసులు.. కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్.. ఒక్క ఆగస్టు నెలలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 కేసులు నమోదు చేసింది. పలువురి నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో వరంగల్, హనుమకొండ, స్టేషన్‌ఘన్‌పూర్, గీసుకొండ, హసన్‌పర్తి, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీలు అని తేలిన వారిపై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎంసీ చట్టం 34, 54 (టీఎస్‌ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశారు. పరిధి దాటి వైద్యం చేసిన మరికొంత మంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎన్ఎంసీ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు టీఎంసీ అధికారులు ప్రకటించారు. కాగా.. ఆరు నెలల్లో 50 మందికి పైగా కేసులు నమోదైనప్పటికీ కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ తీరు మార్చుకోకుండా పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయక ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఘటనలు..● వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌పై ఇంతేజార్గంజ్ పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. నకిలీ వైద్యుడు ఆర్ఎంపీ, పీఎంపీ అయిన సదానందం అశాసీ్త్రయంగా హై డోస్ యాంటీ బయాటిక్స్, ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈమేరకు తనిఖీలు నిర్వహించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ● వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రైల్వే స్టేషన్ ఎదురుగా కొందరు అనధికారికంగా హాస్పిటల్ మాదిరిగా బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆదర్శ వైద్యులమని ప్రజలను మోసం చేసి రిజిస్టర్డ్ వైద్యుల్లా అలోపతి వైద్యం నిర్వహించారు. ముగ్గురు నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఎం.రమేశ్ (లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్), బి.రవి (రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్), డి.అశోక్ (అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్)పై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. ● గతేడాది అక్టోబర్‌లో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ 4 నెలల గర్భంతో మంగపేటకు చెందిన ఆర్ఎంపీని సంప్రదించింది. అతడు గర్భంవిచ్ఛిన్నం అయ్యే మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక మహిళలకు రక్తస్రావంతో పాటు కడుపునొప్పి రావడంతో మరిన్ని మాత్రలు ఇవ్వగా పరిస్థితి విషమించింది. దీంతో చివరకు వరంగల్ ఎంజీఎంలో ఆమెకు గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ● మహబూబాబాద్ జిల్లా హరిపిరాలలో ఓ బాలికకు జ్వరం, వాంతులు రావడంతో ఓ క్లినిక్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు సైలెన్ పెట్టి నాలుగు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా తరచూ అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. జాయింట్ తనిఖీలతో ఫలితాలు నకిలీ వైద్యులపై వైద్య, ఆరోగ్యశాఖాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీలపై దాడులు నిర్వహించేటప్పుడు వైద్య, ఆరోగ్యశాఖతో కలిసి చేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. అనధికారిక క్లినిక్‌లు సీజ్ చేసే అధికారం వైద్య ఆరోగ్యశాఖ అధికారికి మాత్రమే ఉంటుంది. క్వాలిఫైడ్ ఆర్ఎంపీలు బోర్డు పెట్టుకోకుండా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయవచ్చు. – డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హనుమకొండ పేదలకు శాపంగా మారిన నకిలీ వైద్యులు ఎక్కడపడితే అక్కడ క్లినిక్‌లు, ల్యాబ్‌లు యథేచ్ఛగా నిర్వహిస్తున్న అనర్హులు తక్కువ ఖర్చు పేరిట ఫేక్ ట్రీట్మెంట్ వైద్యం వికటించి పలువురికి అస్వస్థత పోలీసు కేసులకు వెరవని కొందరు -
కేయూలో లా కాలేజీ విద్యార్థుల ధర్నా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని మొదటి గేట్ నుంచి పరిపాలనాభవనం వరకు ర్యాలీ నిర్వహించారు. పరిపాలనాభవనం వద్ద బైటాయించి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీసులు, కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, వర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. చివరికి పోలీసులు వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. వరంగల్ లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్‌ను పురస్కరించుకుని వరంగల్, హనుమకొండతోపాటు ఆయా జిల్లాల పరిధి నర్సంపేట, పరకాల కోర్టుల్లో సైతం బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని వారు సూచించారు. కేయూ క్యాంపస్: ఐఐటీ జామ్–2026 ప్రవేశ పరీక్షకు గణిత శాస్త్రంలో ఉచిత శిక్షణ (ఆన్లైన్) అందించనున్నట్లు హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గణిత శాస్త్ర కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.నాగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్లుగా ఐఐటీ జామ్, పీజీ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి ఐఐటీ జామ్ పరీక్షకు తక్కువ మంది విద్యార్థులు నమోదవుతున్నారని ఆయా విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే ఐఐటీ ఆచార్యులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి ఐఐటీ జామ్ ప్రవేశ పరీక్ష ఉచిత శిక్షణకు ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వబోతున్నట్లు ఆసక్తి ఉన్న విద్యార్థులు 97012 75354లో సంప్రదించాలని సూచించారు. హసన్‌పర్తి: అపరిశుభ్రతతోనే వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. 55వ డివిజన్ సదానంద కాలనీలో డెంగీ నియంత్రణ చర్యలను శుక్రవారం పర్యవేక్షించారు. డెంగీ పాజిటివ్ కేసు నమోదైన బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. స్థానికంగా చేపడుతున్న ఫీవర్ సర్వే, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాల్ని పరిశీలించారు. కాలనీలోని పలు వీధుల్లో పర్యటించి దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు, స్థానిక వైద్యాఽధికారి భార్గవ్, మానస, జిల్లా మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, సబ్ యూనిట్ అధికారి ఖాదర్ అబ్బాస్, హెల్త్ సూపర్వైజర్ లచ్చు, కమలాకర్, సంతోశ్, ఏఎన్ఎంలు స్వరూప, రాణి, ప్రశాంత, ఆశవర్కర్లు పాల్గొన్నారు. కాజీపేట: యువత విరివిగా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేశ్ అన్నారు. కాజీపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థి పర్యవరణ పరిరక్షణ ఉద్యమకారుడు కె.ప్రకాశ్ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత అంపశయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, రిటైర్డ్ అటవీశాఖ అధికారి పురుషోత్తం, హెచ్ఎం ఎం.ఫ్రాన్సిస్, ఉద్యనవన శాఖ అధికారి రమేశ్, ఎంఈఓ మనోజ్‌కుమార్, సుంకరి జ్వాలా ప్రశాంత్, శ్రీను, అశ్విని, నాగరాజు, వెంకటరమణ, నర్సయ్య పాల్గొన్నారు. -
కలానికి సంకెళ్లేసి సత్యాన్ని నిర్బంధించలేరు!
నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు పత్రికా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు అక్షర రూపమిచ్చినందుకు సాక్షి జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. కలానికి సంకెళ్లు వేసి సత్యాన్ని నిర్బంధించగలరా? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
మహబూబాబాద్ అర్బన్: ప్రజాస్వామ్య మౌలిక సూత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను కాలరాయడం నియంతృత్వ పాలనకు నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం నిరాకరించడం అంటే ప్రజస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని కూలగొట్టడమే. ప్రభుత్వ కాలపరిమితి పరిమితం. కానీ, ప్రజాస్వామ్యం అజేయమైంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులు పెట్టి మీడియా గొంతును నొక్కడం సరికాదు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదు. – డాక్టర్ డోలి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు, మానుకోట ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. పత్రికా స్వేచ్ఛను కాపాడకుంటే ప్రజలు బుద్ధిచెబుతారు. – పిల్లి సుధాకర్, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -
ఈవీఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్
వరంగల్ చౌరస్తా/న్యూశాయంపేట: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని జిల్లా వేర్‌హౌజ్ గోదాముల్లో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషన్ల(ఈవీఎంల)ను కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలసి శుక్రవారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చిన ఈవీఎంలను కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను భద్రపర్చిన గోదాంను కూడా పరిశీలించి, జిల్లా వేర్ హౌజ్‌కు తరలించారు. ఈ తనిఖీలో ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, రమాదేవి, తహసీల్దార్ ఇక్బాల్, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ రంజిత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అనిల్, శ్యామ్, ఫైజోద్దీన్ పాల్గొన్నారు. -
బాలవికాస సేవలు విస్తరించాలి
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సంగెం: పరకాల నియోజకవర్గంలో బాలవికాస సంస్థ ప్రతినిధులు తమ సేవా కార్యక్రమాలను విస్తరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాపురం, కృష్ణానగర్ గ్రామాల్లో బాలవికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డితో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను చైతన్యవంతులను చేయడం, వారి ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పడే విషయంలో బాలవికాస ముందు నిలుస్తోందని అన్నారు. బాలవికాస సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి, ప్రోగ్రాం మేనేజర్ మధు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
ఎంబీబీఎస్‌లు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లు.. పొంతనలేని మందులు.. ఎమర్జెన్సీ వైద్యం చేస్తూ కొందరు ‘నకిలీ’లు నిర్వహిస్తున్న ఆస్పత్రులు పేదలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఖర్చు తక్కువ పేరిట వైద్యం ఎరవేస్తున్న కొందరు ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ల తీరు శాపంగా మారుతోంది. ఫేక్ డిగ్రీలు.. సర్టిఫికెట్లతో ‘డాక్టర్’ స్టిక్కర్లు వేసుకుంటున్న అనేక మంది నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్‌లో 3,250కు పైగా అర్హత లేని వైద్యులున్నట్లు సమాచారం. చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆయుర్వేద వైద్యం పేరిట ఎక్కడ పడితే అక్కడ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ వైద్య మండలి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక ఘటనలు వెలుగు చూడడం గమనార్హం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీలు గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నకిలీ పీఎంపీలు, ఆర్ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎక్కడి పడితే అక్కడ ఇష్టారాజ్యంగా క్లినిక్‌లు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సైతం జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా సమీపంలోని ఆర్ఎంపీల దగ్గరికే వెళ్తున్నారు. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపిస్తుండడంతో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఆగస్టులో 15 కేసులు.. కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్.. ఒక్క ఆగస్టు నెలలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 కేసులు నమోదు చేసింది. పలువురి నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో వరంగల్, హనుమకొండ, స్టేషన్‌ఘన్‌పూర్, గీసుకొండ, హసన్‌పర్తి, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీలు అని తేలిన వారిపై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎంసీ చట్టం 34, 54 (టీఎస్‌ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశారు. పరిధి దాటి వైద్యం చేసిన మరికొంత మంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎన్ఎంసీ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు టీఎంసీ అధికారులు ప్రకటించారు. కాగా.. ఆరు నెలల్లో 50 మందికి పైగా కేసులు నమోదైనప్పటికీ కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ తీరు మార్చుకోకుండా పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయక ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలకు శాపంగా మారిన నకిలీ వైద్యులు ఎక్కడపడితే అక్కడ క్లినిక్‌లు, ల్యాబ్‌లు యథేచ్ఛగా నిర్వహిస్తున్న అనర్హులు తక్కువ ఖర్చు పేరిట ఫేక్ ట్రీట్మెంట్ వైద్యం వికటించి పలువురికి అస్వస్థత పోలీసు కేసులకు వెరవని కొందరుమచ్చుకు కొన్ని ఘటనలు.. వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌పై ఇంతేజార్గంజ్ పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. నకిలీ వైద్యుడు ఆర్ఎంపీ, పీఎంపీ అయిన సదానందం అశాసీ్త్రయంగా హై డోస్ యాంటీ బయాటిక్స్, ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈమేరకు తనిఖీలు నిర్వహించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది అక్టోబర్‌లో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ 4 నెలల గర్భంతో మంగపేటకు చెందిన ఆర్ఎంపీని సంప్రదించింది. అతడు గర్భంవిచ్ఛిన్నం అయ్యే మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక మహిళలకు రక్తస్రావంతో పాటు కడుపునొప్పి రావడంతో మరిన్ని మాత్రలు ఇవ్వగా పరిస్థితి విషమించింది. దీంతో చివరకు వరంగల్ ఎంజీఎంలో ఆమెకు గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రైల్వే స్టేషన్ ఎదురుగా కొందరు అనధికారికంగా హాస్పిటల్ మాదిరిగా బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆదర్శ వైద్యులమని ప్రజలను మోసం చేసి రిజిస్టర్డ్ వైద్యుల్లా అలోపతి వైద్యం నిర్వహించారు. ముగ్గురు నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఎం.రమేశ్ (లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్), బి.రవి (రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్), డి.అశోక్ (అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్)పై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా హరిపిరాలలో ఓ బాలికకు జ్వరం, వాంతులు రావడంతో ఓ క్లినిక్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు సైలెన్ పెట్టి నాలుగు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా తరచూ అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. నకిలీ వైద్యులపై వైద్య, ఆరోగ్యశాఖాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీలపై దాడులు నిర్వహించేటప్పుడు వైద్య, ఆరోగ్యశాఖతో కలిసి చేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. అనధికారిక క్లినిక్‌లు సీజ్ చేసే అధికారం వైద్య ఆరోగ్యశాఖ అధికారికి మాత్రమే ఉంటుంది. క్వాలిఫైడ్ ఆర్ఎంపీలు బోర్డు పెట్టుకోకుండా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయవచ్చు. – డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హనుమకొండ -
కొండపర్తిలో రైతుల ఆగ్రహం
నానో యూరియాతో లింక్ పెట్టొద్దని నిరసన ఐనవోలు: యూరియా పంపిణీకి నానో యూరియాతో లింక్ పెట్టొద్దని మండలంలోని కొండపర్తి గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని కొండపర్తిలో దర్గా పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొండపర్తి, నర్సింహులగూడెం, ముల్కలగూడెం గ్రామాల రైతులకు యూరియా పంపిణీ చేస్తారనే సమాచారంతో రైతులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున బారులుదీరారు. మూడు గ్రామాల రైతులతో పాటు మరికొంత మంది అక్కడికి చేరుకున్నారు. 20 టన్నుల యూరియా 440 బస్తాలు కేంద్రంలో ఉండగా.. రైతులకు ఒక్కో బస్తా చొప్పున ఇవ్వడం మొదలుపెట్టారు. నిర్వాహకులు ఒక బస్తా యూరియాకు.. రూ.200 విలువైన అర లీటర్ లిక్విడ్ నానో యూరియా బాటిల్ తప్పనిసరిగా తీసుకోవాలని లింక్ పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నానో యూరియా బాటిల్ తీసుకోని వారికి యూరియా ఇవ్వమని చెప్పడంతో రైతులు నానోబాటిళ్లను ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. యూరియా పంపిణీని నిలిపేసి సొసైటీ నిర్వాహకులకు, ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఏడీఏ ఆదిరెడ్డి, సీఐ రాజగోపాల్, ఎస్సై పస్తం శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ మాదాసు బాబు యూరియా పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులతో మాట్లాడి చివరికి నానో యూరియా లిక్విడ్ బాటిల్ లేకుండా రైతులకు టోకెన్లు అందించి రాత్రి 8 గంటల వరకు యూరియాను పంపిణీ చేశారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్మోహన్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలోని టీజీఓ భవన్లో గురువారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీజీఓ, టీఎన్జీఓ, ఇతర సంఘాలకు గుర్తింపునిస్తూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లపై సీఎం చేసిన వ్యాఖ్యలు కొంత బాధించాయని గుర్తు చేశారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం విధి విధానాల్ని రూపొందించాలని, రెండేళ్లుగా పెండింగ్‌లో బిల్లుల చెల్లింపులకు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే జేఏసీ పక్షాన ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. టీజీఓ జిల్లా అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాసకుమార్, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాంరెడ్డి, ఫణికుమార్, కేంద్ర సంఘం కార్యదర్శులు కిరణ్‌కుమార్, కోలా రాజేశ్‌కుమార్, ఆస్నాల శ్రీనివాస్, కోశాధికారి రాజేశ్‌కుమార్, ఉపాధ్యక్షులు అన్వర్ హుస్సేన్, మాధవి, భాగ్యలక్ష్మి, కృష్ణ్ణవేణి, మాధవరెడ్డి, రఘుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.మత్తు కట్టడికి పటిష్ట చర్యలు రేపుహన్మకొండ అర్బన్: జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేశ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా పాఠశాల విద్యాశాఖ రూపొందించిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధించిన నినాదాల పట్టికను డీఆర్ఓ, డీసీపీ ఆవిష్కరించారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, హనుమకొండ, కాజీపేట, పరకాల ఏసీపీలు నరసింహారావు, ప్రశాంత్‌రెడ్డి, సతీశ్‌బాబు, టీజీఏఎన్‌బీ డీఎస్పీ రమేశ్‌కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఐఈఓ గోపాల్, డీడబ్ల్యూఓ జయంతి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డాక్టర్ అనితారెడ్డి, డాక్టర్ ప్రహసిత్, డాక్టర్ ఆచార్య రవికుమార్ పాల్గొన్నారు.సెమినార్ వరంగల్ లీగల్: ‘యాంటీ కరప్షన్ చట్టాలు–ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్’పై నగరంలోని డీసీసీబీ భవన్లో శనివారం సెమినార్ నిర్వహిస్తున్నట్లు న్యాయవాది పరిషత్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు చొల్లేటి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెమినార్‌కు ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్, గౌరవ అతిథులుగా ఉభయ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, కె.పట్టాభిరామారావు, న్యాయవాది పరిషత్ జోనల్ ఆయమ్ ప్రముఖ్ కరూర్ మోహన్, ఉభయ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, సత్యనారాయణ, న్యాయవాది కేవీకే గుప్తా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలికేయూ క్యాంపస్: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో శారీరక దారుఢ్యం మానసికోల్లాసం కలుగుతుందని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. గురువారం కేయూలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ కళాశాలల కాలేజీఝెట్ పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమని క్రీడాస్ఫూర్తితో క్రీడాపోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ మాట్లాడుతూ.. మొత్తం 22 టీంలు పాల్గొంటున్నాయని ఈనెల 12న కూడా కొనసాగుతాయని తెలిపారు. -
ఫిర్యాదుల పెట్టె.. ప్రక్షాళన ఇట్టే!
ఎంజీఎం ఆస్పత్రిలో సత్ఫలితాలిస్తున్న కంప్లెయింట్ బాక్స్లుఎంజీఎం: ఎంజీఎం ప్రక్షాళనకు వరంగల్ కలెక్టర్ సత్యశారద వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఆస్పత్రిలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వైద్యవిభాగాధిపతుల వరకు నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాటన్నింటినీ తెలుసుకునేందుకు కలెక్టర్ తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న కథనాలపై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా వివరణలు ఇస్తుండడం తెలిసిందే. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్ సత్యశారద ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలోని ఏఎంసీ, పిడియాట్రిక్, సర్జరీ, డైట్, సూపరింటెండెంట్ చాంబర్ వద్ద ఈ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. వాటి తాళాలు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది వద్ద ఉంచి కలెక్టర్ సూచించిన అధికారులు మాత్రమే ఈ బాక్స్‌ను తెరిచేలా ఆదేశించారు. వారు తరచూ ఫిర్యాదులు పరిశీలిస్తూ చర్యలకు ఉపక్రమించారు. వైద్యుల్లో, సిబ్బందిపై వేటు పడుతున్న క్రమంలో కిందిస్థాయిలో అవినీతి తగ్గి కొద్ది మేర మార్పు మొదలైంది. వినతులు బహిర్గతం చేయాలి.. ఎంజీఎం ఆస్పత్రిలోని ఫిర్యాదుల బాక్స్‌లో వస్తున్న ఫిర్యాదులను బహిర్గతం చేస్తే అవినీతి, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం తగ్గే అవకాశం ఉంది. ప్రచారం జరగడం వల్ల కిందిస్థాయి సిబ్బంది భయంతో పాటు బాధ్యతగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఫిర్యాదు బాక్స్‌ను పది రోజులకోసారి తెరుస్తూ కచ్చితమైన చర్యలు తీసుకుంటున్నారనే నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్‌లకు మరింత స్పందన లభిస్తుంది. చర్యలు తీసుకున్న సిబ్బంది వివరాలను బహిర్గతంగా పత్రిక ముఖంగా ప్రచురించడం వల్ల అవినీతికి పాల్పడే ఉద్యోగుల్లో భయం ఏర్పడి ఆస్పత్రిలో సేవలు మెరుగుపడుతాయని పలువురు పేర్కొంటున్నారు. వేటు.. మెమోలు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సీజనల్ వ్యాధులపై 15 రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పత్రికా ముఖంగా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది చేత ఫిర్యాదు బాక్స్‌లో వేసిన ఫిర్యాదులను తెరిచి చదివి వినిపించారు. ఈక్రమంలో ఓ సెక్యూరిటీ గార్డు వార్డులో రోగిని డబ్బులు అడిగిన విషయంతోపాటు సర్జరీ విభాగంపై ఫిర్యాదులు అందాయి. అలాగే నర్సింగ్ సిబ్బందిపై సైతం ఫిర్యాదులు రావడంతో వారిపై వేటు వేయాలని కలెక్టర్ సూపరింటెండెంట్ కిశోర్‌ను ఆదేశించారు. ఈక్రమంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి సెక్యూరిటీ, శానిటేషన్ విభాగంలో నలుగురు కార్మికులు, పలువురు నర్సింగ్ సిబ్బందిపై సైతం వేటు వేశారు. మరికొన్ని ఏర్పాటు చేయాలి.. ఎంజీఎం ఆస్పత్రి సుమారు 15 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉంటుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో నాలుగు ఫిర్యాదు బాక్స్‌లు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచి నిత్యం రద్దీగా ఉండే ఓపీ, క్యాజువాలిటీ, వంటి విభాగాల్లో ఏర్పాటు చేస్తే ఫిర్యాదుల సంఖ్య మరింత పెరుగుతుంది. సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. పది రోజులకోసారి ఫిర్యాదు బాక్స్ తెరిచి తీవ్రమైన విషయాలపై చర్యలు తీసుకుని వాటిని బహిర్గతం చేసి చర్యలు తీసుకుంటే మరిన్నీ సత్ఫలితాలు ఉంటాయని రోగులు వేడుకుంటున్నారు. నలుగురు సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందిపై వేటు నర్సింగ్ ఉద్యోగులకు మెమోలు జంకుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది ఓపీ విభాగంతోపాటు మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని వినతి ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవల కోసం కలెక్టర్ వినూత్న ప్రయత్నాలు -
పీవీ విజ్ఞాన కేంద్రం పనులు త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ ● జంక్షన్ల సుందరీకరణ పనుల పరిశీలన ఎల్కతుర్తి: పీవీ విజ్ఞాన కేంద్రం పనుల్ని త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం భీమదేవరపల్లి మండలం వంగరలో చేపట్టిన పీవీ విజ్ఞాన కేంద్రం పనులను ఆమె పరిశీలించారు. విజ్ఞాన కేంద్రంలోని ఆడిటోరియం, సైన్స్ మ్యూజియం, ఫొటో గ్యాలరీ, మెడిటేషన్ సెంటర్ ఉండగా.. వాటిని పరిశీలించారు. పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ముల్కనూరులోని జాతీయ రహదారి పనులు పరిశీలించారు. సెంట్రల్ లైటింగ్, డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్డు డివైడర్ పనుల్ని త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ముందుగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ‘కుడా’ ఆధ్వర్యంలో చేపట్టిన జంక్షన్ సుందరీకరణ పనులు పరిశీలించారు. కార్యక్రమంలో ఆమె వెంట తహసీల్దార్లు రాజేశ్, ప్రసాద్‌రావు, ఎంపీడీఓలు వీరేశం, విజయ్‌కుమార్, పర్యాటక శాఖ ఏటీఓ సూర్యకిరణ్, డి.ధన్‌రాజ్, తదితర శాఖల అధికారులు ఉన్నారు. -
రోబోటిక్స్ సైన్స్ వర్క్‌షాప్ రిపోర్ట్ అందజేత
న్యూశాయంపేట: నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఇటీవల నిర్వహించిన రోబోటిక్స్ సైన్స్ వర్క్‌షాప్ రిపోర్ట్‌ను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ గురువారం కలెక్టర్ సత్యశారదకు అందజేశారు. కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిసిన కలిసిన నవీన్.. కళాశాలలో తరగతి గదుల నిర్మాణం, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా సౌకర్యాల కల్పనకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో వర్క్‌షాప్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ బి.సత్యనారాయణ, డాక్టర్ కందాల సత్యనారాయణ, రుద్రాణి, డాక్టర్.వి.పూర్ణచందర్ పాల్గొన్నారు.కలెక్టర్‌ను కలిసిన జీపీఓలున్యూశాయంపేట: ఇటీవల నియమితులైన గ్రామపంచాయతీ ఆఫీసర్(జీపీఓ)లు గురువారం కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. జిల్లాలో జీపీఓ కౌన్సిలింగ్లో ఎటువంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చినందుకు కలెక్టర్, అదనపు కలెక్టర్, ఏఓ తదితర అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో బి.శ్రీనివాసులు, ఏ.శ్రీకాంత్, విజయజ్యోతి, జ్యోతి, రమేష్, శ్రావణ్, క్రాంతి, విశ్వేశ్వర్, సుభాష్ తదితరులు ఉన్నారు.గూడ్స్ షెడ్‌కు చేరిన యూరియాఖిలా వరంగల్: వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్‌కు గురువారం 2644.155 మెట్రిక్ టన్నుల సీఎఫ్ఎల్ యూరియా వచ్చింది. సీఎఫ్ఎల్ కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్‌రెడ్డి యూరియాను పరి శీలించారు. కలెక్టర్ సత్యశారద, వ్యవసాయ అ ధికారి అనురాధ ఆదేశాల ప్రకారం గూడ్స్ షెడ్ కు చేరిన యూరియాను ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్క్‌ఫెడ్‌కు 60 శాతం, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులకు 40శాతం కేటాయించారు. డిమాండ్ ఉన్న జిల్లాలు, మండలాల్లో పీఏసీఎస్ కేంద్రాలకు వేగంగా పంపించేందుకు చర్యలు చేపట్టామని మండల ఏఓ రవీందర్‌రెడ్డి తెలిపారు.ఎంపీఓకు డీఎల్పీఓగా పదోన్నతిసంగెం: సంగెం ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న కొమురయ్య డీఎల్పీఓగా పదోన్నతి పొందారు. గురువారం నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్‌లో భాగంగా కొమురయ్యకు పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్‌కు పోస్టింగ్ ఇచ్చారు. పదోన్నతిపై బదిలీ అయిన కొమురయ్యకు మండల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.రేపు సెమినార్వరంగల్ లీగల్: ‘యాంటీ కరప్షన్ చట్టాలు–ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్’పై నగరంలోని డీసీసీబీ భవన్లో శనివారం సెమినార్ నిర్వహిస్తున్నట్లు న్యాయవాది పరిషత్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు చొల్లేటి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్, గౌర వ అతిథులుగా ఉభయ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబి నిర్మలా గీతాంబ, కె.పట్టాభిరామారావు, న్యాయవాది పరిషత్ జోనల్ ఆయ మ్ ప్రముఖ్ కరూర్ మోహన్, ఉభయ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, న్యాయవాది కేవీకే గుప్తా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.మోస్తరు నుంచి భారీ వర్షంహన్మకొండ: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో గురువారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా ఐనవోలులో అత్యధికంగా 12.03 సెంటీమీటర్లు, దామెరంలో 11.5, హనుమకొండ పెద్దమ్మగడ్డలో 97.8 మిల్లీమీటర్లు, ధర్మసాగర్లో 68.5, వేలేరులో 56.8, కమలాపూర్‌లో 55.8, పెద్దపెండ్యాలలో 31.3, హసన్‌పర్తి చింతగట్టులో 29.8, శాయంపేటలో 28.5, ఐనవోలు మండలం కొండపర్తిలో 25.5, ఆత్మకూరులో 24.5, కాజీపేటలో 20, భీమదేవరపల్లిలో 18.3, వరంగల్ పైడిపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 96 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
ఫిర్యాదుల పెట్టె.. ప్రక్షాళన ఇట్టే!
ఎంజీఎం: ఎంజీఎం ప్రక్షాళనకు కలెక్టర్ సత్యశారద వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఆస్పత్రిలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వైద్యవిభాగాధిపతుల వరకు నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాటన్నింటినీ తెలుసుకునేందుకు కలెక్టర్ తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న కథనాలపై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా వివరణలు ఇస్తుండడం తెలిసిందే. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్ సత్యశారద ఫిర్యాదుల బాక్సుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలోని ఏఎంసీ, పిడియాట్రిక్, సర్జరీ, డైట్, సూపరింటెండెంట్ చాంబర్ వద్ద ఈ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. వాటి తాళాలు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది వద్ద ఉంచి కలెక్టర్ సూచించిన అధికారులు మాత్రమే ఈ బాక్స్‌ను తెరిచేలా ఆదేశించారు. వారు తరచూ ఫిర్యాదులు పరిశీలిస్తూ చర్యలకు ఉపక్రమించారు. వైద్యులు, సిబ్బందిపై వేటు పడుతున్న క్రమంలో కిందిస్థాయిలో అవినీతి తగ్గి కొద్ది మేర మార్పు మొదలైంది. వేటు.. మెమోలు కలెక్టర్ సత్యశారద సీజనల్ వ్యాధులపై 15 రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పత్రికా ముఖంగా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది చేత ఫిర్యాదు బాక్స్‌లో వేసిన ఫిర్యాదులను తెరిచి చదివి వినిపించారు. ఈక్రమంలో ఓ సెక్యూరిటీ గార్డు వార్డులో రోగిని డబ్బులు అడిగిన విషయంతోపాటు సర్జరీ విభాగంపై ఫిర్యాదులు అందాయి. అలాగే నర్సింగ్ సిబ్బందిపై సైతం ఫిర్యాదులు రావడంతో వారిపై వేటు వేయాలని సూపరింటెండెంట్ కిశోర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈక్రమంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి సెక్యూరిటీ, శానిటేషన్ విభాగంలో నలుగురు కార్మికులు, పలువురు నర్సింగ్ సిబ్బందిపై సైతం వేటు వేశారు. మరికొన్ని బాక్స్‌లు ఏర్పాటు చేయాలి.. ఎంజీఎం ఆస్పత్రి సుమారు 15 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉంటుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో నాలుగు ఫిర్యాదు బాక్స్‌లు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచి నిత్యం రద్దీగా ఉండే ఓపీ, క్యాజువాలిటీ, వంటి విభాగాల్లో ఏర్పాటు చేస్తే ఫిర్యాదుల సంఖ్య మరింత పెరుగుతుంది. సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. పది రోజులకోసారి ఫిర్యాదు బాక్స్ తెరిచి తీవ్రమైన విషయాలపై చర్యలు తీసుకుని వాటిని బహిర్గతం చేసి చర్యలు తీసుకుంటే మరిన్ని సత్ఫలితాలు ఉంటాయని రోగులు కోరుకుంటున్నారు. ఎంజీఎంలో సత్ఫలితాలిస్తున్న కంప్లెయింట్ బాక్సులు నలుగురు సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందిపై వేటు నర్సింగ్ ఉద్యోగులకు మెమోలు జంకుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలకు కలెక్టర్ వినూత్న ప్రయత్నాలువినతులు బహిర్గతం చేయాలి.. ఎంజీఎం ఆస్పత్రిలోని ఫిర్యాదుల బాక్స్‌లో వస్తున్న ఫిర్యాదులను బహిర్గతం చేస్తే అవినీతి, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం తగ్గే అవకాశం ఉంది. ప్రచారం జరగడం వల్ల కిందిస్థాయి సిబ్బంది భయంతోపాటు బాధ్యతగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఫిర్యాదు బాక్స్‌ను పది రోజులకోసారి తెరుస్తూ చర్యలు తీసుకుంటున్నారనే నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్‌లకు మరింత స్పందన లభిస్తుంది. చర్యలు తీసుకున్న సిబ్బంది వివరాలను బహిర్గతంగా పత్రిక ముఖంగా ప్రచురించడం వల్ల అవినీతికి పాల్పడే ఉద్యోగుల్లో భయం ఏర్పడి ఆస్పత్రిలో సేవలు మెరుగుపడుతాయని పలువురు పేర్కొంటున్నారు. -
మోస్తరు నుంచి భారీ వర్షం
హన్మకొండ: జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ మహానగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వరదనీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రాత్రి కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాత్రి 9 గంటల వరకు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాల మేరకు హనుమకొండ జిల్లా ఐనవోలులో అత్యధికంగా 12.03 సెంటీమీటర్లు, దామెరలో 11.5, హనుమకొండ పెద్దమ్మగడ్డలో 97.8 మిల్లీమీటర్లు, ధర్మసాగర్లో 68.5, వేలేరులో 56.8, కమలాపూర్‌లో 55.8, పెద్దపెండ్యాలలో 31.3, హసన్‌పర్తి చింతగట్టులో 29.8, శాయంపేటలో 28.5, ఐనవోలు మండలం కొండపర్తిలో 25.5, ఆత్మకూరులో 24.5, కాజీపేటలో 20, భీమదేవరపల్లిలో 18.3, మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి జలమయమైన హనుమకొండ బస్‌స్టేషన్ ప్రాంగణం -
కష్టం తీరేదెన్నడు..?
ఖానాపురం: రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడంలేదు.. రాత్రి, పగలు తేడా లేకుండా బారులుదీరినా.. బస్తా యూరియా దొరికే పరిస్థితిలేదు. కుటుంబమంతా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.58 లక్షల మంది రైతులు ఉండగా.. పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి, కూరగాయలతో పాటు ఇతర రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఈసీజన్లో జిల్లా వ్యాప్తంగా 3.10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతుండగా.. ఇందులో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. 1,80,000 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్నతోపాటు ఇతర పంటల సాగు చేస్తున్నారు రైతులు. ఈ పంటలకు అక్టోబర్ నాటికి 37,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంది. ఇందులో ఆగస్టు వరకు 28,500 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా 24,509 మె.ట యూరియా మాత్రమే వచ్చింది. దీంతో రైతులు తమపంటను ఎలా కాపాడుకోవాలని ఆందోళనలో ఉన్నారు. రైతులను నానో యూరియా వైపు మళ్లించేందుకు వ్యవసాయ అధికారులు ప్రయత్నించినా రైతులు ఆసక్తి చూపుడంలేదు. ఒక్కో బస్తా పంపిణీ.. వరి సాగు చేస్తున్న రైతులు రెండు నుంచి మూడు దఫాలుగా యూరియాను వినియోగిస్తుంటారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా మాత్రమే పంపిణీ చేస్తుండడంతో ఎన్నిరోజులు క్యూలో నిలబడాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళితే యూరియా బస్తాతోపాటు ఇతర మందులను అంటగడుతుండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలో యూరియా పంపిణీ చేసినా రైతులు అర్ధరాత్రి నుంచే బారులుదీరుతున్నారు. రోడ్డుపైన వంటావార్పు ఖానాపురం, అశోక్‌నగర్‌కు యూరియా వస్తుందని రైతులు సొసైటీల వద్ద బుధవారం రాత్రి నుంచి బారులుదీరారు. గురువారం యూరియా రావడంలేదని తెలుసుకోని ఖానాపురం, అశోక్‌నగర్‌లో రా స్తారోకోకు దిగారు. అశోక్‌నగర్‌లో మాజీ ఎంపీపీ ప్రకాశ్‌రావు, లింగమూర్తి, సీపీఎం నాయకులు సా యిలు, రాము రైతులతో కలిసి రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. ఎస్సై రఘుపతి యూరియా వస్తుందని హామీ ఇవ్వడంతో విరమించారు. తెల్లవారుజామునుంచే క్యూ.. నల్లబెల్లి: శనిగరం రైతు ఆగ్రోస్ కేంద్రం వద్ద రైతులు గురువారం తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయాధికారి రజిత టోకెన్లు పంపిణీ చేశారు. పొద్దున్నే వచ్చి.. నెక్కొండ: మండలంలోని సూరిపల్లి, బంజరుపల్లి గ్రామాలకు యూరియా వచ్చిందని తెలిసిన రైతులు గురువారం పొద్దున్నే బారులుదీరారు. సూరిపల్లికి 400 బస్తాలు రాగా 700 మంది, బంజరుపల్లికి 100 బస్తాలురాగా.. 250 మంది యూరియా కోసం ఎగబడ్డారు. గందరగోళం మధ్య రైతుకు ఒకటి చొప్పున యూరియా బస్తాలు అందించారు. అన్నదాతలకు తప్పని యూరియా తిప్పలు అరకొర సరఫరాతో ఆందోళనలో రైతులు అక్టోబర్ నాటికి 37 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఆగస్టు వరకు వచ్చింది 24,509 మెట్రిక్ టన్నులు మాత్రమే.. ఏడు బస్తాలే వచ్చాయి వేపచెట్టుతండాలో ఏడు ఎకరాల పోడు భూమి ఉంది. పట్టా లేదు. ఇందులో పత్తి, మొక్కజొన్న వేశాను. ఖానాపురం శివారులో 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఇందులో వరి సాగు చేశా. ఇప్పటి వరకు కేవలం ఏడు బస్తాల యూరియా మాత్రమే వచ్చింది. ఎప్పుడు క్యూలో నిల్చున్నా ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు క్యూలో నిల్చోని బస్తాలు తీసుకోవాలో తెలియడంలేదు. – గుగులోతు మమత, వేపచెట్టుతండాగతంకంటే ఎక్కువ ఇచ్చాంజిల్లాలో యూరియా ఎప్పటికప్పుడు అందజేస్తున్నం. గతంలో కంటే ప్రస్తుతం 4 వేల మెట్రిక్ టన్నులు అధికంగా ఇచ్చాం. ప్రస్తుతం ఇండెంట్లు కూడా పెట్టాం. ప్రస్తుతం మన జిల్లాకు యూరియా ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది. పత్తి పంటలకు రైతులు పైపాటుగా నానో యూరియాను వాడుకోవాలి. రైతులు క్యూలో ఉండాల్సిన అవసరం లేదు. – అనురాధ, జిల్లా వ్యవసాయాధికారి -
రూరల్ మార్ట్ సమర్థవంతంగా నిర్వహించాలి
● డీఆర్డీఓ రాంరెడ్డి రాయపర్తి: మండలంలో ఏర్పాటుచేసే రూరల్ మార్ట్ సమర్థవంతంగా నిర్వహించాలని డీఆర్డీఓ రాంరెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలకేంద్రంలోని ఐకేపీ సెర్ప్ కార్యక్రమాలను పరిశీలించారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేయబోయే పెట్రోల్‌బంక్ స్థలం, రూరల్మార్ట్, మొరిపిరాలలో సోలార్ ప్రాజెక్ట్‌కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలుసూచనలు చేశారు. రెండు గ్రామైఖ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే సోలార్ ప్రాజెక్ట్ ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఉంటుందని మండలంలోని గ్రామాలకు విద్యు త్ అందించనున్నట్లు వివరించారు. మండల సమాఖ్య ద్వారా బ్యాంక్ లింకేజీలు, శ్రీనిధి రుణాలు, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి, డీపీఎం దాసు, అనిల్, ఏపీఎం రవీందర్, సీసీలు స్వామి, యాదగిరి, సమ్మ య్య, పావని, ఎంఎస్ అధ్యక్షురాలు నీరజ, కార్యదర్శి రేష్మ, వీఓఏ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ వేధింపులపై అవగాహన ఉండాలి
సైబర్ క్రైం ఏసీపీ గిరి కుమార్ హన్మకొండ: సైబర్ నేరాలు, ఆన్లైన్ లైంగిక వేధింపులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం ఏసీపీ గిరికుమార్, యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ ఇన్స్పెక్టర్ జె.శ్యాంసుందర్ అన్నారు. గురువారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో వనం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిస్టర్ నిర్మల ఆధ్యక్షతన సైబర్ క్రైం, మానవ అక్రమ రవాణా అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో వారు మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉంటే వాటి బారిన పడకుండా ఉంటారన్నారు. మహిళలను, పిల్లలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీస్ 100, 1930 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బత్తుల కరుణ, వనం మహిళా సంఘం రీజియన్ ప్రెసిడెంట్ రుమాల్డిన, ట్రెజరర్ రిజి అబ్రహం, కౌన్సిలర్ అన్నమేరి, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ ఎర్ర శ్రీకాంత్, వనం మహిళా సంఘం అధ్యక్షురాలు మేరీ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య న్యూశాయంపేట: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగయ్య పాల్గొని, మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో 30 సెంటర్లలో పేదలు గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్నారని తెలిపా రు. ఇప్పటి వరకు వారికి పట్టాలు ఇవ్వలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు కిరాయి ఇళ్లలో ఉండలేక గుడిసెలు వేసుకుని జీవనం గడుపుతున్నారని తెలిపారు. జిల్లా కమిటీ నాయకులు బాబు, నలిగంటి రత్నమాల మాట్లాడుతూ.. హామీల అమలుకు కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని భవిష్యత్‌లో పేదలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నా అనంతరం సీపీఎం ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం, ప్రజల దరఖాస్తులను అందచేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ బషీర్, వలదాసు దుర్గయ్య, సాంబమూర్తి, ప్రశాంత్, రమేష్, దివ్య, వాణి, ఆలం, గాలయ్య, భవాని, విజయ తదితర నాయకులు పాల్గొన్నారు. -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతుకలను భౌతికదాడులతో పాటు పోలీసులను ఉపయోగిస్తూ తప్పుడు కేసులతో తీవ్ర అణచివేతకు గురిచేస్తుండడంపై పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని ఖండించారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – హన్మకొండ -
ఎఫ్పీఓలుగా పీఏసీఎస్‌లు
హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (రైతు ఉత్పాదక సంస్థ)లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతు ఉత్పత్తులకు లాభదాయక ధరలు అందించి ప్రస్తుత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడమే వీటి లక్ష్యం. రైతుల ప్రయోజనాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఎఫ్పీఓలు పనిచేస్తాయి. హనుమకొండ జిల్లాలో మొత్తం 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. మొదటి దశలో ఏడు సంఘాలు రైతు ఉత్పాదక సంస్థ (ఎఫ్డీఓ)లుగా ఎంపికయ్యాయి. మలిదశలో మిగతా సంఘాలు ఎంపిక చేస్తారు. కమలాపూర్, పెంచికలపేట, దామెర, పెద్దాపూర్, శాయంపేట, ధర్మసాగర్, దర్గా కాజీపేట పీఏసీఎస్‌లు ఎఫ్పీఓలుగా ఎంపికయ్యాయి. ఈ సంఘాలు రూ.2 వేల చొప్పున వాటాధనం తీసుకుని 750 మందిని సభ్యులుగా చేర్చుకోవాలి. ఈ మొత్తం రూ.15 లక్షలవుతుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీఎస్) ఒక్కో సభ్యుడికి మరో రూ.2 వేల చొప్పున వాటాధనం చెల్లించడం ద్వారా రూ.15 లక్షలు గ్రాంట్‌గా పీఏసీఎస్‌లకు అందిస్తుంది. పెంచికలపేట, దర్గాకాజీపేట పీఏసీఎస్‌ల వాటాధనం రూ.15 లక్షలు రైతుల నుంచి సమకూర్చుకున్నాయి. మిగతా సంఘాలు సగం వరకు వాటాధనం సమకూర్చుని లక్ష్యం వైపు ముందుకు పోతున్నాయి. ఎఫ్పీఓలుగా ఎంపికై న సంఘాలకు కేంద్రం ఏడాదికి రూ.6 లక్షల చొప్పున మూడు సంవత్సరాలకు రూ.18 లక్షల సహాయాన్ని అందిస్తుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక సౌకర్యాల కోసం రూ.2 కోట్ల రుణాన్ని నామ మాత్రపు రుణాన్ని అందిస్తుంది. శాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రూ.90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సొంత భవనం పూర్తి కావొచ్చింది. ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న పీఏసీఎస్‌లు.. రైతుల పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం, ప్రాసెసింగ్, బ్రాండింగ్ చేయడం ద్వారా రైతు ఉత్పత్తులకు లాభదాయం ధర సాధించడం, వ్యవస్థాపక సౌకర్యం కల్పించడం ఎఫ్పీఓల విధి. గోడౌన్, డ్రైయాడ్, డ్రైహెడ్స్ వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎఫ్పీఓలు రైతులు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తాయి. ఆరోగ్య రక్షణ కల్పించి రైతులను ప్రాణదాతలుగా తీర్చిదిద్దుతాయి. ఎఫ్పీఓల ద్వారా కామన్ సర్వీస్ సెంటర్ సేవలు, జన ఔషధి, కర్షక్ వికాస్ సెంటర్ల నిర్వహణ, ఎరువుల విక్రయాలు చేపడతాయి. తద్వారా ప్రజలకు సేవలు అందించడంతోపాటు ఆర్థికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. ఇప్పటి వరకు కేవలం రైతులకు రుణాలివ్వడం, వసూళ్లకు పరిమితమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. ప్రస్తుతం ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లతో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ఎఫ్పీఓలుగా పీఏసీఎస్‌లు బలోపేతం.. ఎఫ్పీఓల ఏర్పాటు ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరింత బలోపేతం అవుతాయి. వ్యాపారాల విస్తరణ, రైతు ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఆదాయం పెంచుకోవడం ద్వారా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తాయి. ఎఫ్పీఓల ద్వారా రైతులకు, ప్రజలకు సేవలు చేరువవడంతో పాటు సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తాయి. – బి.సంజీవరెడ్డి, జిల్లా సహకార అధికారి జిల్లాలో 7 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎంపిక రైతుల ఆదాయం పెంపే లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వం సాయం -
బాల్యవివాహాల నిర్మూలనకు కృషి
ఖానాపురం: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉమ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం బాలల సంరక్షణ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మికుల అక్రమ దత్తత, బిక్షాటన నిర్మూలనకు కృషి చేయాలన్నారు. బాలలపై జరుగుతున్న ఆకృత్యాలను అడ్డుకోవడంలో కమిటీలు ముందుండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీల్‌కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ సుజాత, ఏపీఓ సునీత, ఎంఈఓ శ్రీదేవి, హౌసింగ్ ఏఈ నవీన, డాక్టర్ సునీత, ఏపీఎం ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. ఇద్దరిపై కేసు నమోదు నర్సంపేట రూరల్ : ఒకరు మృతిచెందిన కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు నర్సంపేట రూరల్ ఎస్సై అరుణ్ బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లికి చెందిన కత్తి సారంగం దంపతులు ఈనెల 4న గొడవపడుతుండగా.. సారంగం తల్లి కత్తి సూరమ్మ (65) అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ, పక్కనే ఉన్న సారంగం బామ్మర్ధి బర్ల అశోక్ తన అక్క శ్రీమేథను తిడుతున్నారని సూరమ్మ ఛాతి, క డుపులో కొట్టడంతో పడిపోగా.. ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరిన సూరమ్మ బుధవారం ఉదయం ముఖం కడ్డుకొ ని లేచి నిలబడి కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అ ప్పటికే సూరమ్మ మృతిచెందినట్లు నిర్ధారించా రు. దీంతో శ్రీమేథ, అశోక్ ఇద్దరు కొట్టిన దెబ్బ లతోనే తనతల్లి చనిపోయిందని సూరమ్మ కూ తురు రమ ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇంటర్లో అడ్మిషన్లకు మరో అవకాశం విద్యారణ్యపురి: ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ ఇంటర్ అడ్మిషన్లకు రెండు రోజులుపాటు(11, 12 తేదీల్లో) అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ శ్రీధర్‌సుమన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌బోర్డు కార్యాలయం నుంచి జరిగిన జూమ్ మీటింగ్‌లో వివిధ అంశాలపై కీలక ఆదేశాలు జారీచేశారని ఆయన తెలిపా రు. అడ్మిషన్ల గడువు ఆగస్టు 31న ముగిసినప్పటికీ పలువురుల విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నందున మరోసారి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో మాత్రం అపరాధ రుసుంతో విద్యార్థులు అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలిఖానాపురం: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోఆర్డ్డినేటర్(జీఈసీఓ) ఫ్లోరెన్స్ అన్నారు. మండలంలోని అశోక్‌నగర్‌లో కేజీబీ వీని బుధవారం డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీటీడీఓ) సౌజన్యతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు రికా ర్డులు, స్టోర్‌రూం, విద్యార్థులకు అందజేసే మెనూ, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడు తూ.. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులకు ఉత్తమ బోధ న అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థినులపై నిర్లక్ష్యం చేస్తే ఇంటికి పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. మె నూ ప్రకారం భోజనం పెట్టాలని లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎస్ఓ మేనక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రుణాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలి నల్లబెల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు మహిళా సంఘాల్లో చేరాలని, సంఘాల్లో రుణా లు తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి అన్నారు. మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మహిళా సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందన్నారు. డీపీఎం దాసు, సుధాకర్, రాజు, సారయ్య, మమత, స్వప్న, మౌనిక, తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యం
● ఎస్ఈ గౌతమ్‌రెడ్డి సంగెం: ప్రజలకు నిరంతర విద్యుత్ అందించే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తోందని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ వరంగల్ ఎస్ఈ గౌతమ్‌రెడ్డి అన్నారు. నల్లబెల్లి 33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో నూతనంగా 11 కేవీ నార్లవాయి ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరాను ప్రారంభించిన సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. టెక్నికల్ డీఈ ఆనంద్ మాట్లాడుతూ.. ఫీల్డ్ సిబ్బంది తప్పనిసరిగా ఎర్త్ రీచార్జి రాడ్, సేఫ్టీ బెల్ట్, హెల్మెట్ ధరించి సేవలు అందించాలన్నారు. సోలార్ విద్యుత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాపులకనపర్తి ఏడీఈ రవికుమార్, సంగెం సెక్షన్ ఏఈ మధుసూదన్, సబ్ ఇంజనీర్ రాజేశ్‌కుమార్, ఎల్ఈ చంద్రమౌళి, ఎల్ఐ పాషా, ఎల్ఎం బాబూరావు, ఏఎల్ఎంలు రాజ్‌కుమార్, కాశీరాం, శ్రీను, కాంట్రాక్టర్ సంపత్‌రావు, ఆన్మెన్స్ కొంరెల్లి, సుదన్, సుమన్, భాస్కర్, సురేశ్, ఆపరేటర్లు భిక్షపతి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు ఇబ్బందిలేకుండా నీరందించాలి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వర్ధన్నపేట : కాల్వ పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టి గ్రామస్తులకు, రైతులకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరా కొనసాగించాలని వర్ధన్నపేట ఎమ్మె ల్యే నాగరాజు ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. మండలంలోని బండౌతాపురం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెగిపోయిన కట్టకాల్వను అధికారులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. కొనారెడ్డి చెరువును నింపి రైతుల ఇబ్బందులు తొలగిస్తామని, వర్ధన్నపేట – కొనారెడ్డి చెరువుకి వచ్చే కట్టకాల్వకు శాశ్వత మరమ్మతులు చేపిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చెరువులపై కమీషన్లు దండుకుందేతప్పా చెరువులను పునరుద్ధ రించలేదని ఆరోపించారు. కట్టకాల్వ తెగిన ప్రదేశాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో శాశ్వత మరమ్మతులు చేపించి బండౌతాపురం గ్రామ రైతులకు సైతం పొలాల వద్దకు వెళ్లేందుకు బ్రిడ్జి మార్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. యూరి యా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకపోవడంతో యూరియా కొరత ఏర్పడిందని, సీఎం రేవంత్‌రెడ్డి సరైన సమయంలో స్పందించి యూరియాను రైతులకు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. -
మద్యం టెండర్లకు కసరత్తు
సాక్షిప్రతినిధి, వరంగల్: వైన్స్ (ఏ4)లకు 2025–27 సంవత్సరాలకు సంబంధించి టెండర్లు నిర్వహించేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. వాస్తవానికి నవంబర్ నెలాఖరుతో గడువు ముగియనుండగా.. ఒక నెల ముందుగానే టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే వైన్స్‌ల టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి వస్తున్నప్పటికీ అక్టోబర్‌లో టెండర్లు నిర్వహించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్లతో ఇటీవల హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచే కొత్త దుకాణాలు ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా 2023–25 ఎకై ్సజ్ పాలసీనే అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈసారి కూడా ఆరు స్లాబుల విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలిసింది. గతంలో 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. 5 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల్లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల్లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ఈసారి కూడా అదే పాలసీ అమలు చేయనుండడంతో ఎప్పటిలాగే టెండర్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాగా, డిసెంబర్ ఒకటి నుంచి రాబోయే రెండేళ్లకు సంబంధించి కొత్త పాలసీ అమలుల్లోకి రానుండగా.. గతంలో మాదిరిగానే దుకాణాలకు సంబంధించి మూడు సామాజికవర్గాల (గౌడ, ఎస్సీ, ఎస్టీ) వ్యాపారులకు 30 శాతం వరకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈసారి మద్యం దుకాణాల టెండర్లు పోటాపోటీగా సాగనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ–జాతరతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్నాయన్న చర్చ ఇప్పటికే సాగుతోంది. రిజర్వేషన్లు యథాతథం.. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు యథాతథంగా అమలు కానున్నట్లు, ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. టెండర్లు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించేలా జిల్లాల వారీగా మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరినట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో 2021–23 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్‌లో 294 మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పాటించనున్నారు. ఈలెక్కన ఉమ్మడి వరంగల్‌లో 15 శాతం రిజర్వేషన్ల కింద గౌడ సామాజికవర్గానికి 39 నుంచి 44 దుకాణాలు రానున్నాయంటున్నారు. ఎస్సీలకు 27 లేదా 29, ఎస్టీలకు 13 నుంచి 15 దుకాణాలు కేటాయించనున్నారు. సుమారు 206 నుంచి 215 మద్యం దుకాణాలకు ఓపెన్ కేటగిరీ కింద కేటాయించే అవకాశం ఉండగా.. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలు పాల్గొనే వీలుంటుంది. కాగా, ఈసారి కూడా 2011 జనాభా ప్రకారమే షాపులు కేటాయించనుండగా, స్లాబ్‌ల విధానం కూడా గత పాలసీ ప్రకారమే కొనసాగించనున్నారు. అయితే గతంలో టెండర్ దరఖాస్తు ధర రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు. ఉమ్మడి వరంగల్‌లో 294 దుకాణాలు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంపు త్వరలో టెండర్ల తేదీల ప్రకటన డీసీ కార్యాలయాలకు అందిన మార్గదర్శకాలు -
బారులుదీరారు.. వెనుదిరిగారు..
ఖానాపురం: రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. రోజంతా క్యూలో నిలబడ్డా ఒక్క బస్తా దొరకని పరిస్థితులను చూశాం.. అయితే రాత్రంతా వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది మండలంలోని బుధరావుపేటలో.. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని బుధరావుపేట గ్రామానికి యూరియా వస్తుందని గ్రామంలోని రైతులకు సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి 1.30 గంటలకు రైతులు గ్రామ పంచాయతీ వద్దకు పరుగులు పెట్టారు.. ఆ నోటా.. ఈ నోటా.. ఈ విషయం రైతులందరికీ చేరడంతో భారీగా తరలివచ్చారు. ఆధార్, పంట ఆరోగ్య కార్డులను సీరియల్ ప్రకారం పెట్టి.. గ్రామపంచాయతీ వద్ద వేచిఉన్నారు. కానీ తెల్లవా రుజాము 2 అయినా అక్కడకు అధికారులు రాలే దు.. బస్తాలు పంపిణీ చేయలేదు. సమాధానం చెప్పేవారు కూడా లేకపోవడంతో ప్రభుత్వాన్ని నిందిస్తూ రైతులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. తెల్లవారుజాము నుంచే.. గీసుకొండ: మండలంలోని కొనాయమాకుల రైతు వేదిక వద్ద బుధవారం ఉదయం 5 గంటల నుంచే రైతులు యూరియా కోసం బారులుదీరారు. ఊకల్, మనుగొండ, మచ్చాపూర్ గ్రామాలకు కోటా కింద 444 బస్తాల యూరియా రాగా సుమారు వెయ్యి మంది రైతులు వచ్చారు. బస్తాల కోసం వేచి చూసినా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వం సరిపడా యూరియాను సరఫరా చేసి ఆదుకోవాలని రైతులు కోరారు. ఏఓ హరిప్రసాద్‌బాబు, ఏఈఓలు టోకెన్లు పంపిణీ చేయగా గొడవలు జరగకుండా ఎస్సైలు కుమార్, రోహిత్ బందోబస్త్ నిర్వహించారు. యూరియా కోసం రాత్రి రెండుగంటలకు రైతుల క్యూ -
చెరువులు.. నిండుకుండలు
నర్సంపేట: ధాన్యాగార కేంద్రంగా పేరొందిన వరంగల్ జిల్లాలో దాదాపు అన్ని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఈసీజన్లో రుతుపవనాలు ఆలస్యమైనప్పటికీ గత నెలలో కురిసిన భారీ వర్షాలకు చాలాచెరువులు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో ప్రధాన చెరువు పాకాలతోపాటు కుంటలు, పెద్ద చెరువులు మత్తళ్లు పోస్తుండగా 294 చెరువులు వంద శాతం నిండాయి. జిల్లాలో 816చెరువులు ఉండగా అన్ని చెరువుల్లో జలకళ నెలకొంది. జిల్లాలో ఈ సీజన్లో 3 లక్షల పైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తుండగా.. ఖరీఫ్ పంటలతోపాటు రబీ సీజల్లో సాగు చేసే పంటలకు సైతం సాగునీరు అందనుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాకాల పరవళ్లు జిల్లాలో సాగు నీటిపరంగా పాకాల సరస్సుకు ప్రాధాన్యం ఉంది. మూడు టీఎంసీల కెపాసిటీ కలిగిన పాకాల సరస్సు 30 ఫీట్లకు చేరుకొని 15రోజులుగా మత్తడి పోస్తోంది. జిల్లాలో వరి పంట లక్షా 27వేల 950ఎకరాల విస్తీర్ణంలో సాగు అవుతుండగా పాకాల సరస్సు కింద అధికారికంగా 30వేల ఎకరాలతోపాటు అనధికారికంగా మరో 20వేల ఎకరాలు సాగు అవుతోంది.మత్తడి పోస్తున్న పాకాల సరస్సుజిల్లాలో జలకళ సంతరించుకున్న చెరువుల వివరాలు..మండలం చెరువులు 0–25% 25–50 50–75 75–100 మత్తళ్లు గీసుగొండ 76 0 0 0 74 2 సంగెం 73 0 0 23 48 2 పర్వతగిరి 64 0 0 0 38 26 వర్ధన్నపేట 68 0 7 15 26 20 ఖిలా వరంగల్ 48 0 0 0 03 45 రాయపర్తి 96 0 3 42 51 0 దుగ్గొండి 71 0 0 9 52 10 నల్లబెల్లి 82 0 0 0 56 26 నర్సంపేట 70 0 0 0 50 26 ఖానాపురం 23 0 0 0 23 0 నెక్కొండ 80 0 0 11 20 49 చెన్నారావుపేట 45 0 0 0 25 20 వరంగల్ 20 3 0 0 11 6 జలకళ సంతరించుకున్న జలాశయాలు జిల్లాలో 816 చెరువులు రెండు పంటలకు ఢోకా లేదంటున్న అన్నదాతలు -
ధరలు తగ్గాయ్..
ఖిలా వరంగల్: రేషన్ దుకాణాల ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం అందించడంతో బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు దిగొస్తున్నాయి. దీంతో కార్డులేనివారికి ఊర ట లభిస్తోంది. జూన్‌లో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఒకేసారి మూడు నెలల కోటా సన్న బియ్యం పంపిణీ చేయడంతో అందరి ఇళ్లల్లో బియ్యం నిల్వలు పెరిగాయి. దీంతోపాటు సెప్టెంబర్ నెల కోటా సన్నబియ్యం సైతం లబ్ధిదారులు అందరూ తీసుకోవడంతో ఒక్కసారిగా బహిరంగ మార్కెట్లో అమ్మకాలు పడిపోతున్నాయి. కొనేందుకు వినియోగదారులు రాకపోవడంతో వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలోనే క్వింటా ధర రకాన్నిబట్టి దాదాపు రూ.200 నుంచి రూ.300 వరకు తగ్గడం గమనార్హం. అందుబాటు ధరల్లో.. ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వడంతో కార్డులులేని పేదలకు మార్కెట్లో సన్నబియ్యం ధరలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో 2,66,429 లబ్ధిదారులకు 50,14,531 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. పెరిగిన కార్డులకు అనుగుణంగా సెప్టెంబర్ నెలలో జిల్లాకు 53,82,518 టన్నుల బియ్యం రాగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రతిఇంటికీ సన్న బియ్యం చేరుతున్నాయి. జిల్లాలో ఇంకా రేషన్ కార్డులు లేని కుటుంబాలు 1.50లక్షల వరకు ఉన్నట్లు అంచనా.. వీరు మాత్రం మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వ్యాపారుల వద్ద డిమాండ్‌కు మించి సన్నబియ్యం నిల్వలు ఉండడంతో ధరలు తగ్గించి విక్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. నాణ్యతపై వ్యాపారుల దృష్టి .. మార్కెట్లో బియ్యం ధరలు తగ్గడంతో వ్యాపారులు నాణ్యతపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం పంపిణీ చేసిన చౌక బియ్యంలో 20 శాతం వరకు నూకలు, వ్యర్థాలు ఉంటున్నాయి. దీంతో వ్యాపారులు పూర్తిగా నూక, పొట్టు, దుమ్ము లేని బియ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలను ఆకర్శించేలా బియ్యం నిల్వలు ఉంచుతున్నారు. షాపుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు ధరలు తగ్గించడం వల్ల ఇటీవల కొంత మేరకు వ్యాపారం మెరుగుపడింది. మార్కెట్లో సన్నబియ్యం బస్తాలు 5,800 5,000 5,0004,400 5,200 4,9004,800 4,400రకం5,000 4,900 విజయమసూరిజైశ్రీరాంఆర్ఎన్ఆర్హెచ్ఎంటీ సోనా మసూరి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం నాణ్యతపై వ్యాపారుల దృష్టి -
భోజనం రుచికరంగా ఉండాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి గీసుకొండ: మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్‌ను బుధవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన వంటలను రుచిచూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత, రుచికరంగా ఉండేలా వంటలను తయారు చేయాలని ఆదేశించారు. వంటగది శుభ్రత పాటించాలన్నారు. తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఇన్చార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్, స్కూల్ ప్రిన్సిపాల్ సునీత తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల ధర్నా
పరకాల: యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే పీఏసీఎస్‌లు, రైతు వేదికల ఎదుట బారులుదీరుతున్నారు. క్యూలో నిల్చున్న వారందరికీ యూరియా దొరకడం లేదు. రెండు రోజుల క్రితం మాదారం పీఏసీఎస్‌కు 440 బస్తాల యూరియా వచ్చింది. కొంతమంది రైతులకు పంపిణీ చేసి మిగిలిన వారికి అధికారులు టోకెన్లు ఇచ్చారు. మరుసటి రోజు ఇస్తామని చెప్పడంతో బుధవారం రైతులు పరకాల వ్యవసాయ మార్కెట్‌కు చేరుకున్నారు. నాగారం, పైడిపల్లి రైతులకు పంపిణీ చేశారు. టోకెన్లు ఇచ్చిన నడికూడ మండల రైతులకు గురువారం యూరియా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేసి వ్యవసాయ మార్కెట్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. యూరియా కావాలని, ప్రభుత్వం నిరక్ష్యం వీడాలని నినాదాలు చేశారు. గంటపాటు రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వారిని బలవంతంగా తీసుకెళ్లి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళన రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాల రాకపోకలు -
ఆర్మీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తాం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జేఎన్ఎస్లో నవంబర్ 10 నుంచి 23 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్మీ అధికారులు, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ర్యాలీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశమై చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ఈ ఏడాది హనుమకొండ జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించే అవకాశం దక్కడంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం సికింద్రాబాద్ లోని ఆర్మీ రిక్రూట్మెంట్ కల్నల్ సునీల్‌యాదవ్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆన్లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన 9 వేల మంది అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రన్నింగ్ టెస్ట్‌తో పాటు శారీరక సామర్థ్య పరీక్షలు, మెడికల్ టెస్ట్, విద్యార్హతల ధ్రువ పత్రాలు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ర్యాలీ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ వైవీ గణేశ్, ఆర్మీ మేజర్ ప్రకాశ్ రాయ్, ఆర్మీ అధికారులు గురు దయాళ్‌సింగ్, సుభాష్, వీవీ నాయుడు, వినోద్‌కుమార్ శర్మ, మనీశ్‌కుమార్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, సీపీఓ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, డీవైఎస్ఓ అశోక్ కుమార్, ఏసీపీ నరసింహారావు, మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్‌రావు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ వేదికవ్వనున్న జేఎన్ఎస్ నవంబర్ 10 నుంచి నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతోసమావేశం -
ఆదర్శం ఐలమ్మ పోరాటం
కాజీపేట అర్బన్: చాకలి ఐలమ్మ పోరాటాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీశ్, సత్యశారద అన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా న్యూశాయంపేటలోని ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్ మామిండ్ల రాజు, కుల సంఘాల నాయకులు బస్వరాజు కుమార్, చీకటి శారద, ఆనంద్, మధుచందర్, చిట్యాల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: పరిశోధకులు, అధ్యాపకులకు డిజిటల్ శిక్షణ ఎంతో ఉపయోగమని కాకతీయ యూనివర్సిటీ కేంద్ర గ్రంథాలయం మెంబర్ ఇన్చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బి.రాధికారాణి అన్నారు. కేయూ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) ఆధ్వర్యంలో బుధవారం డేటాబేస్ ఉపయోగంపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఐఈఈఈ వెబ్సైట్లో ఉన్న దాదాపు ఆరు మిలియన్ల శాసీ్త్రయ పత్రాలు, జర్నల్స్, కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ వంటి విలువైన సమాచారం పరిశోధన అవసరాలకు లభిస్తుందని తెలిపారు. డేటాబేస్‌ను ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. ఆచార్యులు పి.మల్లారెడ్డి, జె.కృష్ణవేణి, కె.భిక్షాలు, ఆర్.భారవిశర్మ, ఎల్పీ రాజ్‌కుమార్, సుమలత, రాధిక, షాయోదా, ఇజాక్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: విద్యుత్ బస్సుల కేటాయింపు విధానంలో మార్పు చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి బి.ఉపేంద్రచారి అన్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని వరంగల్–1 డిపో వద్ద కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ బస్సుల కోసం ప్రైవేట్ యజమానులకు ఇస్తున్న సబ్సిడీలు, నిధులు, వయాబిలిటీ గ్యాప్ ఫండ్లను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నిధులు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఆర్టీసీ పరిరక్షణ దినం పాటించాలని పిలుపునిచ్చారు. విద్యారణ్యపురి: జిల్లాస్థాయికి ఎంపికై న పాఠశాలల విద్యార్థులకు ఈనెల 12న కళా ఉత్సవ్ నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి బుధవారం తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో నిర్వహించే కళా ఉత్సవ్‌కు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఓకల్ మ్యూజిక్, సోలో, క్లాసికల్, లైట్ మ్యూజిక్, గ్రూప్ ఇన్స్ట్రుమెంటల్, విండ్ మెలోడీ, క్లాసికల్ డ్యాన్స్, జానపద గిరిజన కాన్టెంపరరీ కొరియోగ్రఫీ, రోల్‌ప్లే, మిమిక్రీ, మైమ్, డ్రాయింగ్, పెయింటింగ్ తదితర పోటీల్లో ప్రథమ బహుమతులు పొందిన విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని డీఈఓ పేర్కొన్నారు. ఇంటర్లో ప్రవేశాలకు అవకాశం విద్యారణ్యపురి: ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ ఇంటర్ అడ్మిషన్లకు ఈనెల 11, 12 తేదీల్లో అవకాశం కల్పించినట్లు వరంగల్ జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి డాక్టర్ శ్రీధర్‌సుమన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌బోర్డు కార్యాలయం నుంచి జరిగిన జూమ్ మీటింగ్‌లో వివిధ అంశాలపై కీలక ఆదేశాలు జారీచేశారని ఆయన పేర్కొన్నారు. అడ్మిషన్ల గడువు ఆగస్టు 31న ముగిసినప్పటికీ పలువురు విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నందున మరోసారి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో మాత్రం అపరాధ రుసుంతో విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చని ఆయన సూచించారు. -
లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలి
వరంగల్ అర్బన్: ఎల్ఆర్ఎస్లో భాగంగా లబ్ధిదారులకు సకాలంలో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నగర మేయర్గుండు సుధారాణి టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ పురోగతిపై టౌన్‌ప్లానింగ్ అధికారులతో బుధవారం మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 31 వేల దరఖాస్తులు స్వీకరించగా.. అందులో 50 శాతం దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్లాట్‌ను శుభ్రం చేసుకోవాలని దరఖాస్తుదారుడికి టౌన్‌ప్లానింగ్ అధికారులు ఫోన్లో సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, సమ్మయ్య, ఏసీపీలు ఖలీల్, శ్రీనివాస్‌రెడ్డి, టీపీఎస్‌లు, టీపీ బీఓలు తదితరులు పాల్గొన్నారు. -
కొలిక్కిరాని టెండర్లు
హన్మకొండ చౌరస్తా: ప్రభుత్వ ఉచిత చేప పిల్లల పంపిణీపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. చెరువుల్లో జూన్, జూలై మాసాల్లో వదలాల్సిన చేపపిల్లలను ఇంతవరకూ అందించలేదు. సెప్టెంబర్ మొదటి వారం గడిచినా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవడం ఇందుకు నిదర్శనం. సరైన సమయానికి చేప పిల్లలను అందిస్తే నేటికీ చేప ఎదిగి కనీసం పావుకిలో ఉండేదని, ఇప్పుడు చెరువుల్లో వదిలితే అవి ఎప్పుడు ఎదుగుతాయని మత్స్యకారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 813 చెరువులు.. హనుమకొండ జిల్లాలో మొత్తం 813 చెరువులు ఉన్నాయి. గత సంవత్సరం 763 చెరువుల్లో రూ.82.82 లక్షల విలువైన 111.21 లక్షల ఉచిత చేపపిల్లల్ని పంపిణీ చేసినట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కట్ల, రోహు, బంగారుతీగ, మెరిగ జాతి చేపపిల్లలను చెరువుల్లో వదిలారు. జిల్లాలో పెద్ద చెరువులుగా గుర్తింపు గల ధర్మసాగర్, కమలాపూర్, నాగారం చెరువుల్లో 80 నుంచి 100 ఎంఎం సైజు గల చేపపిల్లలు, మిగిలిన చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం సైజు గల చేపసీడ్ వేయాలని అధికారికంగా నిర్ణయించారు. గతేడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులకు సుమారు రూ.367 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. 175 మత్స్య సొసైటీలు.. 15 వేల మంది సభ్యులు హనుమకొండ జిల్లాలో మొత్తం 175 సొసైటీలు ఉండగా అందులో 46 మహిళా సొసైటీలు ఉన్నట్లు మత్స్యశాఖ అధికారికంగా చెబుతోంది. సొసైటీల్లో సుమారు 15 వేల మంది సభ్యులుగా ఉన్నారు. సొంతంగా కొనుగోలు చేసి.. మత్స్యశాఖ అధికారులపై నమ్మకం లేని పలు మత్స్య సొసైటీలు ఇప్పటికే వారి పరిధిలోని కొన్ని చెరువుల్లో చేప పిల్లలను వదిలినట్లు సమాచారం. రెండు నెలల క్రితమే జిల్లాలోని పలువురు సొసైటీ సభ్యులు సొంత డబ్బులతో చేప పిల్లలను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా చెరువుల్లో 200 గ్రాముల మేర చేప ఎదిగిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉచిత చేప పిల్లల్లో నాణ్యత ఎంత? ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల్లో నాణ్యతపై మత్స్యకారులు ఏటా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చేప పిల్లల కనీస సైజు 35 నుంచి 40 ఎంఎం ఉండాలని అధికారులు చెబుతున్నప్పటికీ అమలులో ఎక్కడా కనిపించడం లేదని మత్స్యకారులు బహిరంగంగానే వాపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. టెండర్లను ఆహ్వానించాం.. జిల్లాలోని 813 చెరువుల్లో 220.55 లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లను ఆహ్వానించాం. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాకు ఇద్దరు, హనుమకొండ జిల్లా నుంచి ఒక్కరు టెండర్లు దాఖలు చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు టెండర్లు వేయడానికి అవకాశం ఉంది. – నాగమణి, ఇన్చార్జ్ జిల్లా మత్స్యశాఖ అధికారి, హనుమకొండఉచిత చేప పిల్లల పంపిణీలో అలసత్వం చెరువుల్లో ఇప్పుడు వదిలితే ఎదుగుదల అంతంతే అధికారుల తీరుపై మత్స్యకారుల అసహనం -
‘అబాస్’ హాజరు విధానాన్ని రద్దు చేయాలి
ఎంజీఎం: క్షేత్రస్థాయి ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బందికి అబాస్ (బయో మెట్రిక్ హాజరు) విధానాన్ని రద్దు చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బంది జిల్లా జేఏసీ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్యను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక్కో పీహెచ్సీ పరిధిలో 4 నుంచి 13 ఉపకేంద్రాలు ఉన్నాయని, వాటిలో పీహెచ్‌సీకి వెళ్లి బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకొని ఫీల్డ్‌కు వెళ్లాలంటే కనీసం 10 నుంచి 20 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. 24 గంటలు అత్యవసర సేవల్లో ఉండే క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందిని పీహెచ్సీ కార్యాలయంలోని సిబ్బంది, పర్యవేక్షణ సిబ్బందితో జతకట్టి చూడొద్దని కోరారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బంది అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు నిర్విరామంగా, నిరంతరాయంగా సమయపాలన లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయి సిబ్బందికి అబాస్ నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు నెహ్రూచంద్నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీరం మధుసూదన్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు తోకల మాధవరెడ్డి, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నాయకులు కత్తి రవీందర్, కె.రమేశ్, జ్యోతి, సులోచన, ప్రసన్నకుమారి, శ్రీకాంత్, రాజేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యాన’ సాగుకు రైతులను ప్రోత్సహించాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో పండ్లు, కూరగాయల సాగులో రైతులను ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లతో పండ్లు, కూరగాయల సాగు, వాటి అమ్మకాలు, పట్టుపరిశ్రమ, తదితర అంశాల పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ.. జిల్లాలో చాలా మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపిస్తున్నారన్నారు. పండ్లు, కూరగాయలకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుందని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోకుండా జిల్లాలోనే పండ్లు, కూరగాయలు సాగయ్యే విధంగా అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొంత భూమి లీజుకు తీసుకొని పట్టు సాగు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలుపైనే కాకుండా పండ్లు, కూరగాయల మార్కెటింగ్ చేయడంపై ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మహిళా సమాఖ్యలు లాభాల బాటలో సాగాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఉద్యానశాఖ అధికారి అనసూయ, మార్కెటింగ్ శాఖ అధికారి అనురాధ, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్‌సింగ్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్‌కుమార్, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎక్కడి చెత్త అక్కడే..
వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మూడువేలకు పైగా ఔట్సోర్సింగ్, తాత్కాలిక కార్మికులతో పనులు చేయించాల్సిన అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. చెత్త సేకరణకు బల్దియాకు చెందిన 250 స్వచ్ఛఆటోలు, 152 ఓనర్ కమ్ డ్రైవర్ ఆటోలు తిరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నారు. వాటికి రోజు డీజిల్ కేటాయిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే 150 ఆటోలు కూడా తిరగడం లేదనే ఫిర్యాదులున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకఎక్కడ చూసినా చెత్త కుప్పులే దర్శనమిస్తున్నాయి. చెత్త సేకరణలో చిత్తశుద్ధి కరువు రోజు చెత్త సేకరణకు రావాల్సిన స్వచ్ఛ ఆటోలు రావడం లేదని పలు కాలనీల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాహనం మరమ్మతు కొస్తే వారం, పది రోజుల వరకు చెత్త సేకరించే నాథుడే కనిపించరు. ఒకవేళ వస్తే సమయపాలన ఉండదు. స్వచ్ఛ ఆటో డ్రైవర్ అనారోగ్యానికి గురైతే ప్రత్యామ్నయంగా మరో ఆటో లేదా ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించాల్సి ఉంది. కానీ, అలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఇళ్లలోని చెత్తను నిల్వ చేయలేక ప్రజలు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. వరుసగా పండుగలు, వర్షాలు ఇలాంటి పరిస్థితుల్లో నెలకొన్న అపరిశుభ్రత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్యం అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, జవాన్లు నామమాత్రంగా పనిచేస్తున్నారు. కమిషనర్ రోజు డివిజన్లలో పర్యవేక్షిస్తూ హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అపరిశుభ్రంగా పలు కాలనీలు.. హనుమకొండలోని ఎన్జీఓస్ కాలనీ, ఇందిరానగర్, భవానీనగర్, టీచర్స్ కాలనీ–1,2, నక్కలగుట్ట, కేఎల్‌రెడ్డి కాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీ, బాలసముద్రం తదితర ప్రాంతాలు చెత్తతో దర్శనమిస్తున్నాయి. వరంగల్‌లోని రామన్నపేట, గంగపుత్ర వీధి, బీసీ కాలనీ, గాంధీ విగ్రహం, ఓఎస్ఆర్నగర్, రఘునాథ్ కాలనీ, పాత బీటుబజారు, రైల్వేగేట్, హంటర్ రోడ్డు, సంతోషిమాత కాలనీ, కొత్తవాడ, రంగంపేట, కాశీబుగ్గ, లేబర్‌కాలనీ, శివనగర్, విద్యానగర్, కరీమాబాద్, రంగశాయిపేట, శంభునిపేటలో చెత్తసేకరణ చేయడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో అపరిశుభ్రత నెలకొంది. విలీన గ్రామాల్లో ఇంటింటా చెత్తసేకరణ నామమాత్రంగా కొనసాగుతోంది. ఇప్పటికై నా గ్రేటర్ అధికారులు స్పందించి కాలనీల్లో రోజూ చెత్త సేకరించేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.స్వచ్ఛ ఆటోల కోసం ప్రజల ఎదురుచూపులు మరమ్మతులు, సెలవుల పేరుతో విధులకు డ్రైవర్ల డుమ్మా చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటో రాక పది రోజులవుతోంది. ఇళ్లల్లో చెత్త నిల్వ చేయలేకపోతున్నాం. కంపు వాసన భరించ లేకపోతున్నాం. స్వచ్ఛ ఆటో డ్రైవర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నాడు. హనుమకొండ టీచర్స్ కాలనీ–1కు చెందిన రజిత ఆవేదన ఇది. ఆదివారం, ఇతర సెలవులు, పండుగలు, స్వచ్ఛ ఆటో రిపేర్ ఉందని, చెత్త సేకరణకు కార్మికుడు తోడు లేడని డ్రైవర్ కారణాలు చెబుతున్నాడు. రెండుమూడు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నట్లు వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన సుజాత ఆందోళన వ్యక్తం చేశారు.. ఇలా ఏదో ఒకరి చెత్త బాధలు కావు ఇవి. నగర వ్యాప్తంగా 60 శాతం కాలనీల్లో ఇదే పరిస్థితి దాపురించింది. చెత్త సమస్యతో నగరవాసులు సతమతమవుతున్నారు. -
ప్రతీ మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాల: ప్రతీ మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పరకాల ఇందిరా మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఈసీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పశు పోషణపై ప్రత్యేక దృష్టిసారించాలని, పశువుల కొనుగోలుకు సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీను, పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మహిళా సమాఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్నిర్మాణంలో వేగం పెంచాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. మంగళవారం హనుమకొండ అదాలత్ కూడలిలోని రాచకొండ ప్రవీణ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల వివక్షకు గురికాగా, స్వరాష్ట్రంలో కల్వకుంట్ల పాలకుల కుటుంబ ప్రయోజనాల కోసం వరంగల్ జిల్లాను ముక్కలు చెక్కలు చేసి తీవ్ర విధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన మేరకు వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.6,000ల కోట్ల అభివృద్ధి నిధులను సమకూర్చి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్‌పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన అమలు చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక కోఆర్డినేటర్ సోమ రామమూర్తి, ఆయా సంఘాల నాయకులు రాచకొండ ప్రవీణ్, సోమిడి శ్రీనివాస్, చాపర్తి కుమార్ గాడ్గే, సోయం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ -
సమయపాలన పాటించాలి
ఎంజీఎం: సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. లష్కర్ సింగారం పీహెచ్సీ పరిధిలో టీబీ చికిత్స పొందుతున్న వారికి దాతల సహకారంతో పోషకాహార కిట్లను మంగళవారం డీఎంహెచ్ఓ అందించారు. ఈ సందర్భంగా పోషకాహార కిట్లను అందించిన దాతలను ఆయన అభినందించారు. అనంతరం పీహెచ్సీ పరిధి లో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. వాజ్‌పేయి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్‌ను సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహె చ్ఓ డాక్టర్ మదన్మోహన్రావు, జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు హైదర్, మౌనిక, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, సూపర్వైజర్ బాబు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి ఈనెల 12 నుంచి 20వ తేదీవరకు అమెరికా అధికార పర్యటన చేస్తారని రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం మంగళవారం తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీ అట్లాంటాలో నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫార్మసీ విభాగం చాప్టర్ సమ్మేళనంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, టెక్సాస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మకాలజీ అండ్ న్యూరో థెరిప్యూటిక్స్తో ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటారని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం విద్య, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరిశోధనల మార్పిడి మరింతగా సులభతరం అవుతుందని తెలిపారు. రామన్నపేట: నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్‌స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ మంగళవారం సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న సీపీకి మొక్క అందించి సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు. అనంతరం సీపీ స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రత, భద్రతా ఏర్పాట్లతోపాటు సిబ్బంది విధి నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరు, కేసుల నమోదు వివరాలను పరిశీలించారు. అదేవిధంగా స్టేషన్ పరిఽధిలో ముఖ్యమైన కేసులు, కాలనీల పరిస్థితులు, రౌడీషీటర్ల జాబితా తదితర వివరాలను స్టేషన్ ఇన్స్పెక్టర్ షుకూర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మరింత సమన్వయంతో వ్యవహరించి, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్‌సలీమా, ఏఎస్పీ శుభమ్, సిబ్బంది పాల్గొన్నారు. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదు నుంచి 9వ తరగతిలో ఉన్న ఖాళీలను ప్రవేశ పరీక్ష రాసిన మెరిట్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి సీట్లను భర్తీ చేస్తామని సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి పి.అపర్ణ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 12న వరంగల్ జిల్లా పరిధి రాయపర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో హాజరు కావాలన్నారు. అదే రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఎస్సీ కేటగిరీ వారికి ప్రాధాన్యం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. -
క్యూలో పాస్‌బుక్కులు!
మండలంలోని సిద్ధాపురం సొసైటీకి మంగళవారం రైతులు క్యూకట్టారు. రాత్రి యూరియా లారీ సొసైటీకి చేరుకోవడంతో బుధవారం ఉదయం యూరియా విక్రయిస్తారని భావించిన రైతులు అక్కడకు భారీగా చేరుకుని పట్టాదార్ పాస్‌పుస్తకాల జిరాక్స్ ప్రతులను క్యూలైన్లో పెట్టారు. ఇప్పటివరకు చెప్పులు లైన్లో పెట్టిన రైతులు ఈసారి పట్టాదార్ పాస్‌పుస్తకాలు పెట్టడం గమనార్హం. అయితే కొంతమంది రైతులు అర్ధరాత్రి వరకు అక్కడ నిరీక్షించి ఇంటి దారిపట్టగా, మరికొంత మంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద కునుకు తీసినట్లు స్థానికులు చెప్పారు. –హసన్‌పర్తి -
గ్రామ పాలనాధికారులకు పోస్టింగ్‌లో అధికారుల జాప్యం
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఎంపికై న గ్రామ పాలనాధికారుల (జీపీఓలు)కు కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం కలెక్టరేట్లో కౌన్సెలింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వనున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఒక్క హనుమకొండ జిల్లాలోని అధికారులు నియామక ప్రక్రియను ప్రహసనంగా మార్చారని ఆరోపణలు వచ్చాయి. ఒకవైపు ఆప్షన్లు తీసుకున్న అధికారులు అసలు జాబితా, అభ్యర్థుల వివరాలు వెల్లడించలేదని విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు సీనియారిటీ జాబితాలో నాన్ లోకల్ లోకల్ క్యాడర్లో వేరే విధంగా చూపెట్టినప్పటికీ.. లోకల్ క్యాడర్లో చూపెట్టిన కొందరు అభ్యర్థుల్లో నాన్‌లోకల్ వారు ఉన్నారని, వేరే జిల్లాల్లో పరీక్షలు రాసిన వారిని ఇక్కడి జిల్లా అభ్యర్థుల జాబితాలో చూపెట్టారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. కానీ, హనుమకొండ జిల్లాలో మాత్రం అధికారులు ఈ ప్రక్రియ సాగదీయడం అనుమానాలకు తావిస్తోంది.స్థానిక నియోజకవర్గం కాకుండా..ప్రస్తుతం జిల్లాకు కేటాయించిన 128 మందిని మొదట వారి నుంచి ఆప్షన్స్ స్వీకరించారు. ఇందులో ప్రాధాన్యతా క్రమంలో 14 మండలాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసుకున్న మండలాల్లో ఏ గ్రామానికి కేటాయించాలన్నది మాత్రం అధికారుల ఇష్టంగా చూపెట్టారు. మండలం మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో మండలంలో ఉన్న ఖాళీల ఆధారంగా వారికి ఇష్టం ఉన్న గ్రామాలు అధికారులు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గం కాకుండా ఇతను నియోజకవర్గానికి కేటాయించాలని నిబంధనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వారి సొంత నియోజకవర్గానికి కేటాయించాల్సి వస్తే.. ఆ నియోజకవర్గంలో వారి సొంత మండలం కాకుండా ఇతర మండలాలకు కేటాయిస్తామని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా అర్బన్ మండలాలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతోపాటు ఒక మండలంలో నాలుగు గ్రామాలు ఉంటే.. వాటిలో రెండు గ్రామాలు హెచ్ఆర్ఏ కింద ఉన్నాయి ఇలాంటి మండలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అభ్యర్థులు సైతం ఈ విషయంలోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు 128 మందిలో కొందరు స్థానికులు కారని, వేరే మండలాల్లో పరీక్షలు రాసి అక్కడ స్థానికత చూపెట్టుకున్నారని, వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అక్కడే పూర్తయిందని, జాబితాలో మాత్రం ఇక్కడి వారీగా చూపెడుతుండడంతో తాము సీనియార్టీ నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు సీనియారిటీ జాబితాలో కూడా పేర్లు, నంబర్లు మూడు రోజుల్లో మూడుసార్లు మారినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ నియామక ప్రక్రియ నిర్వహిస్తున్న సెక్షన్ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.జిల్లాలో 128 మంది..హనుమకొండ జిల్లాకు మొత్తం 128 మంది జీపీఓలను ప్రభుత్వం కేటాయించింది. కాగా, వీరిని జిల్లాలోని 164 రెవెన్యూ గ్రామాలకు కేటాయించాల్సి ఉంది. రెవెన్యూ గ్రామాల వారీగా కాకుండా జిల్లాలో 123 రెవెన్యూ క్లస్టర్లు ఏర్పాటు చేసి క్లస్టర్‌కు ఒకరు చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. జిల్లాకు వచ్చిన 128 మందిలో ఒకరు మెడికల్ గ్రౌండ్లో తిరిగి వెనక్కి వెళ్లారు. మిగిలిన వారిలో 121 మంది లోకల్ కేటగిరీలో చూపారు. ఆరుగురిని నాన్ లోకల్ కేటగిరీలో అంటే కరీంనగర్, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి వచ్చినట్లు చూపెట్టారు. పోస్టులు మొదట లోకల్ వారికి తర్వాత నాన్ లోకల్ వారికి ఇవ్వనున్నారు. అదేవిధంగా రెండోసారి జీపీఓ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన వారిలో మొదట లోకల్ వారికి తర్వాత నాన్‌లోకల్ వారికి పోస్టులు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా రిజర్వేషన్ రోస్టర్ అమలు చేసే పరిస్థితి లేనందున కేవలం వారి వివరాలు నమోదు చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. -
కాళోజీ నారాయణరావుకు ఘన నివాళి
హన్మకొండ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కవులు, కళాకారులు, పలు పార్టీల నాయకులు, సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ నారాయణరావు విగ్రహానికి హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ ఆర్డీఓ రమేశ్‌రాథోడ్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, పులి రజినీకాంత్, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, నాగిళ్ల రామశాస్త్రి, అంపశయ్య నవీన్, పందిళ్ల అశోక్‌కుమార్, బన్న అయిలయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
అంగన్వాడీల్లో ‘పోషణ్ వాటిక’
సాక్షి, వరంగల్: అంగన్వాడీల్లో పోషణ్ వాటిక అమలుకు జిల్లా సంక్షేమ విభాగాధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య బోధించడంతో పాటు పోషకాహారం అందిస్తున్నా... వారికి సంపూర్ణ పౌష్టికాహారం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. తొలుత జిల్లాలోని 54 కేంద్రాల్లో కూరగాయల తోటలు పెంచేందుకు ఉద్యానశాఖ అధికారుల మార్గదర్శనంలో ముందుకెళ్తుతున్నారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి సంబంధిత సీడీపీఓలతో పాటు ఉద్యానశాఖ అధికారులకు లేఖలు పంపిస్తున్నారు. తొందరగా ఇది అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కోకేంద్రానికి మంజూరైన రూ.పది వేలతో మైదానం చదును చేయడంతో పాటు సారవంతమైన మట్టి, ఎరువు కోసం ఖర్చు చేయనున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలు పండించి అదే కేంద్రాల్లో తయారు చేసే వంటకాల్లో వినియోగిస్తారు. తొలి విడతలో టమాటా, వంకాయ, బెండ, ముల్లంగి, బీరకాయ, గోంగూర, పాలకూర, తోటకూర, మెంతికూరలను పండించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటి విత్తనాలను జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీ చేయనుంది. జిల్లా ఉద్యానశాఖ అధికారులు ఆయా కేంద్రాలను సందర్శించి సాగుకు అవసరమైన సౌకర్యాలు కల్పించి మొక్కల పెంపకాన్ని పర్యవేక్షించనున్నారు. దీంతో అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందనుంది. జిల్లాలో 919 అంగన్వాడీలు జిల్లాలో 919 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో సొంత భవనాలు 165, అద్దె భవనాలు 426, ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నవి 328 కేంద్రాలున్నాయి. 0 నుంచి ఆరేళ్ల చిన్నారులు 47,625 మంది ఉంటే, బాలింతలు 3,714 మంది, గర్భిణులు 5,415 మంది ఉన్నారు. వీరికి ప్రస్తుతం కూరగాయలు కొనుగోలు చేసి వంట తయారుచేసి అందిస్తున్నారు. నగర పరిధిలో అక్షయపాత్ర వంటి సంస్థలు లబ్ధిదారులకు రాయితీపై భోజన సదపాయం కల్పిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు పెరిగిన సందర్భంలో ప్రభుత్వం కేటాయించే నిధులు సరిపోవడం లేదు. దీంతో కొన్ని సందర్భాల్లో ఆరోగ్యకరమైన ఆహారం అందక ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. వీటిని గుర్తించిన ప్రభుత్వం సేంద్రియ పద్ధతి సాగు ద్వారా ఆకుకూరలు వారే పండించుకొని వంటకాల్లో ఉపయోగించడం ద్వారా ఎక్కడా లోటుపాట్లు ఉండవని గుర్తించి ఆ దిశగా తొలుత జిల్లాలోని 54 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5,40,000లు మంజూరు చేసింది. దశల వారీగా అమలు చేస్తాం.. అంగన్వాడీల్లో తొలుత రూ.10 వేలతో పోషణ్ వాటికలను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు రూ.16 వేలతో ఇంకుడుగుంతలు, రూ.39 వేలతో చిన్నారులకు ఆట వస్తువులు, రూ.25 వేలతో ఎల్ఈడీ స్క్రీన్లు, రూ.10 వేలతో తాగునీటి యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపించాం. జిల్లాలో తొలుత 54 కేంద్రాల్లో పోషణ్వాటికను అమలు చేస్తున్నాం. ఆ తర్వాత దశల వారీగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బలోపేతం చేస్తాం. – రాజమణి, జిల్లా సంక్షేమ విభాగాధికారి జిల్లాలోని 54 కేంద్రాల్లో కూరగాయల సాగు ఉద్యానశాఖ అధికారుల సహకారంతో పనులు లబ్ధిదారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించే దిశగా అడుగులు తప్పనున్న కూరగాయల కొనుగోలు బాధ -
జాతీయ రహదారిపై ధర్నా
నర్సంపేట రూరల్/రాయపర్తి: ఖరీఫ్‌లో రైతుల పంటలకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలోని 365 జాతీయ రహదా రిపై మంగళవారం రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహారాములు, క్లస్టర్ ఇన్చార్జీ తాళ్లపెల్లి రాంప్రసాద్, మాజీ ఎంపీటీసీ భూక్య వీరన్న, పిట్టల శ్రీనివాస్, బుర్ర ఆనందం, రైతులు పాల్గొన్నారు. అలాగే రాయపర్తి మండల కేంద్రంతో పాటు పెర్కవేడు, తిర్మలాయపల్లి గ్రామాల్లో యూరియా కోసం టోకెన్లు ఇస్తున్నారని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. -
సమయపాలన పాటించాలి
ఎంజీఎం: సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. లష్కర్ సింగారం పీహెచ్సీ పరిధిలో టీబీ చికిత్స పొందుతున్న వారికి దాతల సహకారంతో పోషకాహార కిట్లను మంగళవారం డీఎంహెచ్ఓ అందించారు. ఈ సందర్భంగా పోషకాహార కిట్లను అందించిన దాతలను ఆయన అభినందించారు. అనంతరం పీహెచ్సీ పరిధిలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. వాజ్‌పేయి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్‌ను సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహె చ్ఓ డాక్టర్ మదన్మోహన్రావు, జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు హైదర్, మౌనిక, అశోక్‌రెడ్డి, బాబు పాల్గొన్నారు. -
నేడు రోబోటిక్స్ వర్క్‌షాప్
నర్సంపేట: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం హైదరాబాద్‌కు చెందిన సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ భాగస్వామ్యంతో నేడు (బుధవారం) రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మల్లం నవీన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రోబోటిక్ బ్రోచర్‌ను వర్క్‌షాప్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల నుంచి ఎంపిక చేసిన 40 మందికి 21 ప్రాక్టికల్ రోబోటిక్ ప్రయోగాల ద్వారా ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు భవిష్యత్ వర్క్‌షాప్‌లకు శిక్షకులుగా, మెంటార్లుగా ఉంటారన్నారు. బీఎస్సీ(ఫిజికల్ సైన్సెస్), బీఎస్సీ (లైఫ్ సైసెన్సెస్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు అర్హులన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎ) నర్సంపేట విద్యార్థులకు ఈ వర్క్‌షాప్ ఉచితమన్నారు. కార్యక్రమంలో వర్క్‌షాప్ కన్వీనర్ భౌతిక శాస్త్ర అధ్యాపకులు భైరి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కందాల సత్యనారాయణ, ఆర్.రుద్రాణి, డాక్టర్ పూర్ణచందర్, అడ్వైజరీ కమిటీ సభ్యులు ఎంఎంకె రహీముద్దీన్, ఎం.సోమయ్య, ఎస్.కమలాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇంతేజార్గంజ్ పోలీస్‌స్టేషన్ సందర్శించిన సీపీ
రామన్నపేట: నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్‌స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ మంగళవారం సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న సీపీకి మొక్క అందించి సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు. అనంతరం సీపీ స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రత, భద్రతా ఏర్పాట్లతోపాటు సిబ్బంది విధి నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరు, కేసుల నమోదు వివరాలను పరిశీలించారు. అదేవిధంగా స్టేషన్ పరిఽధిలో ముఖ్యమైన కేసులు, కాలనీల పరిస్థితులు, రౌడీషీటర్ల జాబితా తదితర వివరాలను స్టేషన్ ఇన్స్పెక్టర్ షుకూర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మరింత సమన్వయంతో వ్యవహరించి, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్‌సలీమా, ఏఎస్పీ శుభమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తాం
ఖిలా వరంగల్: జిల్లాలోని 509 రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం తరలింపునకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని, ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తరలింపుకు చర్యలు తీసుకుంటామని అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యరాణితోపాటు జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. ‘సాక్షి’లో దొడ్డు బియ్యం ఎలుకల పాలు అనే శీర్షికతో ఈనెల 6న ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 509 రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ ఉన్నాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం తరలింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నల్లా పన్ను బకాయిలు వసూలు చేయాలి
● అధికారుల సమీక్షలో నగర మేయర్ గుండు సుధారాణివరంగల్ అర్బన్: నల్లా పన్నుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఆర్ఓలు, ఆర్ఐలతో నల్లా పన్ను బకాయిల వసూళ్లపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నల్లా బకాయిల వసూళ్ల లక్ష్యం రూ.45 కోట్లు ఉందని తెలిపారు. ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి వసూలు చేయాలని పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి సుమారు 12 శాతం అధిక లక్ష్యాన్ని సాధించాలని సీడీఎంఏ నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 150 మంది జాబితా తయారు చేయాలని సూచించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఆర్ఓ లు షెహజాది బేగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాల అమ్మకాలు నిషేధం.. రోడ్ల పక్కన దేవతామూర్తుల విగ్రహాల అమ్మకాలు నిషేధమని అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నందున బల్దియా పరిధిలో రోడ్ల పక్కన దేవతామూర్తుల విగ్రహాలు అమ్మడం నిషేధమని పేర్కొన్నారు. వరంగల్ నగరానికి సంబంధించి ఉర్సు రంగలీల మైదానం, హయగ్రీవాచారి గ్రౌండ్ ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుకోవాలని తెలిపారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
● తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణహన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్నిర్మాణంలో వేగం పెంచాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. మంగళవారం హనుమకొండ అదాలత్ కూడలిలోని రాచకొండ ప్రవీణ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల వివక్షకు గురికాగా, స్వరాష్ట్రంలో కల్వకుంట్ల పాలకుల కుటుంబ ప్రయోజనాల కోసం వరంగల్ జిల్లాను ముక్కలు చెక్కలు చేసి తీవ్ర విధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన మేరకు వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.6,000ల కోట్ల అభివృద్ధి నిధులను సమకూర్చి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, మామునూరు ఎయిర్‌పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన అమలు చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక కోఆర్డినేటర్ సోమ రామమూర్తి, ఆయా సంఘాల నాయకులు రాచకొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
అభ్యంతరాలు ఉంటే తెలపాలి
కలెక్టర్ స్నేహశబరీష్హన్మకొండ అర్బన్ : జిల్లాలోని 12మండలాల్లో గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి ఈనెల 9న సవరించి 10వ తేదీన ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లలో 12 మండల పరిషత్, 12 జిల్లా పరిషత్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 3,70,871 మంది ఓటర్లు ఉండగా వారిలో మహిళలు 1,90,201, పురుషులు 1,80,666, ఇతరులు 4 ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలో 631 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రవి సమాధానమిచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ.వి శ్రీనివాసరావు, శ్యామ్‌సుందర్, ప్రభాకర్‌రెడ్డి, సయ్యద్ ఫైజుల్లా, నిశాంత్, రజనీకాంత్, ఎండీ నేహాల్, ఇండ్ల నాగేశ్వర్రావు, ప్రవీణ్‌కుమార్, జయంత్‌లాల్, తదితరులు పాల్గొన్నారు. 17నుంచి స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలు.. మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా ఈనెల 17వ తేదీనుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. ఆయా కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళలకు నిర్దేశించిన ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులచే అన్ని రకాల పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని పాఠశాలలు, గురుకులాలు, కళాశాలల్లో విద్యార్థినులకు అనీమియా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ రవి, డీపీఓ లక్ష్మీరమాకాంత్, డీఈఓ వాసంతి, డీడబ్ల్యూఓ జయంతి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్మల, గిరిజన, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, డాక్టర్ గౌతమ్ చౌహాన్, జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, గైనకాలజిస్టుల సంఘం అధ్యక్షులు డాక్టర్ శ్రీలక్ష్మి, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, విజయకుమార్, మహేందర్, హిమబిందు పాల్గొన్నారు. -
‘ఓరుగల్లు’కు బీజేపీ మొండిచెయ్యి
సాక్షిప్రతినిధి, వరంగల్: భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఉమ్మడి వరంగల్‌కు మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర కమిటీలో ఈసారి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సోమవారం ప్రకటించిన రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్లకు ఉద్వాసన పలికింది. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు, ఇద్దరు కోశాధికారులు, ఒక జాయింట్ ట్రెజరరీ, ఒక అధికార ప్రతినిధి కలిపి 22 మంది ని ప్రకటించారు. ఈ కమిటీలో ఉమ్మడి జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్లకు అవకాశం ఇవ్వకపోడంపై పెద్ద చర్చే జరుగుతోంది. మొండిచెయ్యి ఇదే మొదటి సారి.. ప్రతీసారి రాష్ట్ర కమిటీలో ఉమ్మడి వరంగల్‌కు తగిన ప్రాధాన్యత దక్కేది. సీనియర్లుగా ఉన్న ముగ్గురునుంచి ఐదుగురికి అవకాశం కల్పించిన సందర్భాలే ఉన్నాయి. బండి సంజయ్‌కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఆ తర్వాత వచ్చిన కిషన్ రెడ్డి కూడా సీనియర్లకు అవకాశం కల్పించారు. 2023, జూలై 4న బండి సంజయ్.. ఆ తర్వాత పగ్గాలు చేపట్టి జి.కిషన్ రెడ్డిలు పూర్తిస్థాయిలో రాష్ట్ర కమిటీ వేశారు. అందులో ఉమ్మడి జిల్లానుంచి డాక్టర్ గుండె విజయ రామారావు (ఉపాధ్యక్షుడు), గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (ప్రధాన కార్యదర్శి), ఏనుగుల రాకేష్ రెడ్డి (అధికార ప్రతినిధి, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు), చందుపట్ల కీర్తిరెడ్డి (అధికార ప్రతినిధి), జాటోత్ హుస్సేన్ నాయక్ (ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు), కొండేటి శ్రీధర్ (ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు)లకు అవకాశం కల్పించారు. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్‌కు రాష్ట్ర కమిటీలో సముచిత స్థానం దక్కుతుందని భావించినా.. ఒక్కరికీ కూడా అవకాశం కల్పించకపోవడంపై సీనియర్లు భగ్గుమంటున్నారు. 1980లో పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా సందర్భం లేదని, సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత బహుశా ఇది మొదటి సారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఓరుగల్లు నుంచి మహామహులు... బీజేపీ, జనసంఘ్.. పార్టీలకు ఉమ్మడి వరంగల్ పెద్దపీట వేసింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత ఈ జిల్లాలో ఉన్నంత బలం బలగం ఎక్కడా లేదన్న వ్యాఖ్యలు నాయకత్వం చేసిన సందర్భం. ఎంపీగా పోటీ చేసిన చందుపట్ల జంగారెడ్డి ఏకంగా పీవీ నర్సింహరావును ఓడించడం.. ఎమ్మెల్యేగా కూడా ఓసారి పార్టీ బ్యానర్ మీదే గెలిచారు. బీజేపీనుంచి ఎమ్మెల్యేలుగా టి.రాజేశ్వర్‌రావు, జయపాల్, వన్నాల శ్రీరాములు, మార్తినేని తదితరులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పార్టీ అధిష్టానం కూడా ప్రతీసారి సంస్థాగత పదవుల విషయంలో వరంగల్‌కు పెద్దపీట వేస్తూ వచ్చింది. ఈసారి కూడా రాంచందర్‌రావు టీములో సీనియర్లకు ఛాన్స్ ఉంటుందని భావిస్తే తీవ్ర నిరాశకు గురి కావాల్సి వచ్చింది. రాష్ట్ర కమిటీలో సీనియర్ల ఊసేది..? పూర్వ వరంగల్ జిల్లాలో వన్నాల శ్రీరాములు, మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, కొండేటి శ్రీధర్, మార్తినేని ధర్మారావు, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, రావు పద్మలలో ఎవరికీ ఈసారి కమిటీలో చోటు దక్కలేదు. అదేవిధంగా పార్టీలో సీనియర్లుగా ఉన్న ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, ఎడ్ల అశోక్‌రెడ్డి, చాడ శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, కోరబోయిన సాంబయ్య, గుజ్జ సత్యనారాయణరావు, గంట రవికుమార్, ముక్కెర తిరుపతిరెడ్డిలతో పాటు పలువురు కూడా రాష్ట్ర కమిటీలో పదవులు ఆశించగా.. అధిష్టానం సీనియర్లను విస్మరించిందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. రాష్ట్ర కమిటీలో ఎవరికీ చోటివ్వని హైకమాండ్ సీనియర్లను పట్టించుకోని పార్టీ అధిష్టానం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇదే మొదటిసారి ప్రతీసారి కమిటీలో ముగ్గురు నుంచి ఐదుగురు అధిష్టానం తీరుపై ‘కాషాయం’ నేతల కారాలు, మిరియాలు -
2.14 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
ఐనవోలు : అక్రమంగా తరలిస్తున్న 2.14 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఐనవోలు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఎన్. వెంకటేశ్ వివరాలు వెల్లడించారు. ఎస్సై పస్తం శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఆదివారం మధ్యాహ్నం తనిఖీలు చేపట్టగా ఖమ్మం నుంచి వరంగల్ వైపునకు మహారాష్ట్రకు చెందిన ఎంహెచ్ 19 ఏఎక్స్ 7887 నంబర్‌గల హోండా సిటీ కార్ వస్తుంది. తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించిన కారు నడుపుతున్న వ్యక్తి వెనకకు తిప్పుకుని వెళ్లడానికి ప్రయత్నించాడు. పోలీసులు అనుమానంతో కారును ఆపి తనిఖీలు చేశారు. కారు డిక్కీలో ఉన్న ప్యాకెట్లను వెలుపలికి తీసి చూడగా ఎండు గంజాయిగా నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులు కారు నడుపుతున్న మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా మోతాల మండలం ఏటీకుర్తా గ్రామానికి చెందిన రైతు శివ సింగ్ డొంగర్ సింగ్ గోటిని అదుపులోకి తీసుకున్నారు. 214 కిలోల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినున్నట్లు ఏసీపీ ఎన్.వెంకటేశ్ తెలిపారు. ఎస్సై శ్రీనివాస్, సిబ్బందితో పాటు పర్వతగిరి ఇన్స్పెక్టర్ రాజగోపాల్‌కు అభినందనలు తెలియజేశారు. -
యూరియా కోసం రైతుల ఆందోళన
పరకాల: యూరియా కోసం రైతులు ఆందోళన బాటపట్టారు. పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సోమవారం మాదారం పీఏసీఎస్‌కు యూరియా వచ్చిందన్న సమాచారంతో పరకాల, నడికూడ మండలాలకు చెందిన 14గ్రామాల నుంచి వందలాది మంది రైతులు తెల్లవారుజాము నుంచే మార్కెట్ వద్దకు చేరుకున్నారు. దీంతో రైతువేదిక వద్ద చంటిపిల్లలతో చేరుకున్న మహిళ రైతులు నానా అవస్థలు పడ్డారు. దిగుమతి అయిన 440బస్తాల యూరియాను అధికారులు పంపిణీ చేయడంతో మిగతా రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు నచ్చజెప్పి మరో 100మంది రైతులకు టోకెన్లు ఇప్పించారు. వారంతా నడికూడ మండల కేంద్రంలోని ఆగ్రోస్ ద్వారా తీసుకోవాలని సూచించారు. యూరియా కోసం క్యూలో చెప్పులు కమలాపూర్ : మండలంలోని మర్రిపల్లిగూడెం, శనిగరం పీఏసీఎస్‌తో పాటు ఇఫ్కో కేంద్రానికి సోమవారం యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు తెల్లవారుజామున 3 గంటల నుంచే బారులుదీరారు. గంటల తరబడి నిల్చోలేక రైతులు తమ చెప్పులు క్యూలో పెట్టారు. అయినా రైతులందరికి యూరియా దొరక్కపోవడంతో అన్నదాతలు నిరాశతో వెనుదిరిగారు. పనులన్నీ వదులుకుని గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. -
అమెరికాలో శిక్షణకు హనుమకొండ ఉపాధ్యాయుడు ఎంపిక
కమలాపూర్: మండలంలోని ఉప్పల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొక్కుల సంపత్‌కుమార్ ఈ నెల 10 నుంచి అక్టోబర్ 27 వరకు అమెరికాలో జరిగే ఫుల్బ్రైట్ టీచింగ్ ఎక్స్‌లెన్స్, అచీవ్మెంట్ శిక్షణకు ఎంపికయ్యారు. ఫుల్బ్రైట్ టీచింగ్ ఎక్స్‌లెన్స్, అచీవ్మెంట్ ప్రోగ్రాంను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఎడ్యుకేషనల్, కల్చరల్ అఫైర్స్ (ఈసీఏ) స్పాన్సర్ చేస్తుండగా ఐరెక్స్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి యూఎస్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గ్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, భారతదేశం నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. వారిలో తెలంగాణకు చెందిన ఇద్దరు ఉన్నారు. ఆరు వారాల ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధి శిక్షణలో పాల్గొంటారు. ఇందులో సాధారణ బోధనపై సెమినార్లు, తరగతి గదిలో సాంకేతికత వినియోగంపై నేర్చుకుంటారు. ఈ శిక్షణ కోర్సులను అమెరికా విశ్వవిద్యాలయం రూపొందించి నిర్వహిస్తుంది. ట్రైనింగ్ జరిగే విశ్వవిద్యాలయానికి సమీపంలోని సెకండరీ పాఠశాలలో అమెరికా భాగస్వామి ఉపాధ్యాయుడితో కలిసి సహ బోధన, ప్రజెంటేషన్లు, పరిశీలనను పూర్తి చేయాల్సి ఉంటుందని సంపత్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ముగిసిన చెస్పోటీలువరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–15 చదరంగ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ వేడుకలకు కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నిర్వహణ కార్యదర్శి పి.కన్నా మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. బాలుర విభాగంలో శ్రీసాయిప్రీతం కనకాల, సాయిజోషిత్ బొల్లం, మొగిలి అభినవ్‌రెడ్డి, రిత్విక్ గండు, బాలికల విభాగంలో డి.ఆరుషి, వి.దిలీషా, ఏ.ఆద్య, బి.శ్రీలాస్య విజేతలుగా నిలిచారు. ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కాళోజీ నన్ను అభినందించడం ఇప్పటికీ గుర్తు ఉంది
‘ప్రజాకవి కాళోజీ నారాయణరావుతో పరిచయం ఉంది. మొదటి సారి 1990 హనుమకొండలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో కాళోజీ నారాయణరావు ఇంట్లో మిత్రమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వెళ్లిన నేను మొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా చూశా. అప్పటికే ప్రజాకవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గొప్ప పేరుంది. ఆయన ముందు ధైర్యం చేసి నేను రాసిన ఒక కవితను చదివాను. దానికి కాళోజీ నన్ను అభినందించడం ఇప్పటికీ గుర్తు ఉంది.’ అని అన్నారు తెలుగు కవయిత్రి, కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవి. ఆమెను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళోజీ సాహితీ పురస్కారం–2025కు ఎంపిక చేసిన నేపథ్యంలో నేడు (మంగళవారం) కాళోజీ జయంతి సందర్భంగా సోమవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉద్యోగం చేస్తూనే ఆమె చేసిన రచనలు, రాసిన కథలు.. గీసిన కార్టూన్లు, కాళోజీతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే..– సాక్షిప్రతినిధి, వరంగల్/స్టేషన్‌ఘన్‌పూర్1980లో తొమ్మిదో తరగతిలో స్నేహ అనే నాటిక రాశాను. అనంతరం మొదటగా బుజ్జాయి అనే పిల్లల పత్రికలో నేను రాసిన కథను ప్రచురించారు. ఈ తరం అమ్మాయి అనే కథను ఒక మహిళా మ్యాగజైన్‌కు వాడుకున్నారు. నా చిన్నప్పటినుంచే మా అమ్మ శకుంతలాదేవి కథల పుస్తకాలు బాగా చదివేది. మాకు కథలు చెప్పేది. అలా కథల పుస్తకాలు చదువుతూ నేను కూడా కథలు రాయాలనుకున్నా. నన్ను మొదట ప్రోత్సహించింది మా అమ్మనే. అదేవిధంగా 1983లో వివాహం జరిగింది. భర్త దేవేందర్ జిల్లా కోఆపరేటిట్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసేవారు. ఆయన నన్ను బాగా ప్రోత్సహించేవారు. కథలు, రచనలకు, కార్టూన్లకు తన అభిప్రాయాలు, సూచనలు చేసేవారు. అయితే దురదృష్టవశాత్తు 2009లో ఆయన హఠాన్మరణం చెందడం బాధాకరం.ఆయన ధిక్కార స్వరం.. సమాజానికి దిక్సూచి..ఒక మనిషి, కవి, రచయిత ఎలా ఉండాలని సమాజానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా స్వయంగా పాటించిన గొప్పవ్యక్తి కాళోజీ. ఆయన రాసిన పలుకుబడుల భాష–బడిపలుకుల భాషతోపాటు పలు రచనలు చదివాను. ధిక్కార స్వరం అయిన కాళోజీ తెలంగాణకే కాదు మొత్తం సమాజానికి దిక్సూచి. ఆయన ఏదైనా పద్యం చెబితే వాస్తవికంగా, సరళంగా ఉండేది. రచనలు, మాటలు సూటిగా, చురుకుమనిపించేలా ఉంటాయి. ఆయన పోయెట్రీ తెలంగాణకు దిశానిర్దేశం. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటున్నామంటే ఆరోజుల్లోనే తెలంగాణ గురించి మాట్లాడి, కొట్లాడిన వ్యక్తి కాళోజీ ఒక ధీరోదత్తుడు.సీరియస్, హాస్యం.. రెండూ ఉంటాయికాళోజీ మంచి జోకులు వేసేవారు. ఒక సమావేశంలో ఆయనను కలిసినప్పుడు బ్యాంకు క్యాషియర్నైన నన్ను కేవలం పైసలు లెక్కపెడ్తున్నావా? రచనలు చేస్తున్నావా? అంటూ హాస్యంగా మాట్లాడారు. రచయితలు రచనలు చేయాలని, సమాజానికి దిశానిర్దేశం చేసేలా, ప్రజలను చైతన్యం చేసేలా రచనలు ఉండాలని చెప్పేవారు.కాళోజీ పురస్కారం... మొదటి మహిళగా సంతోషంగా ఉంది..గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కాళోజీ సాహితీ పురస్కారానికి ఈ ఏడాది మొదటి మహిళగా నేను ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. 2015లో అమ్మంగి వేణుగోపాల్ ఈ అవార్డుకు ఎంపిక కాగా, అనంతరం గోరటి వెంకన్న తదితర ప్రముఖులు అందుకున్నారు. గత ఏడాది నలిమెల భాస్కర్‌కు ఈ అవార్డు అందించారు. 11వ వ్యక్తిగా మొదటి మహిళగా, కాళోజీ పుట్టిన ఓరుగల్లు బిడ్డగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది.కాళోజీని చాలాసార్లు కలిసి మాట్లాడాను..నాతో కలిసి హనుమకొండలో బ్యాంకులో పనిచేసే రవికుమార్ కాళోజీ కుమారుడని తర్వాత తెలిసింది. రవికుమార్ పద్యాలు రాసేవారు. ఇద్దరం కవితలు, పద్యాలు ఒకరికొకరం చెప్పుకునేవాళ్లం. అతడితో కలిసి కాళోజీ ఇంటికి వెళ్లి ఆ మహానుభావుడితో చాలాసార్లు మాట్లాడాను. కాళోజీకి నేను రాసిన కథలు, రచనలు చూపించి సంతోషపడ్డాను. అనంతరం రెండు, మూడు సమావేశాల్లో కలుసుకున్నాం. కాళోజీ రచనలు చాలా చదివాను. ఆయన రచనలు సరళంగా, వ్యంగ్యంగా ఉంటాయి. సమాజాన్ని సూటిగా ప్రశ్నించే ఆయన రచనలు అంటే చాలా ఇష్టం.బహుముఖ ప్రజ్ఞాశాలి.. రమాదేవినెల్లుట్ల రమాదేవి... తెలుగు కవయిత్రి, కథకురాలు, ఉపన్యాసకురాలు, కార్టూనిస్టు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ రైతు కుటుంబానికి చెందిన రాంచందర్‌రావు, శకుంతలా దేవి దంపతులకు జన్మించారు. 1983లో దేవేందర్‌ను వివాహమాడిన ఆమె 1984లో గ్రామీణ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆంధ్రాబ్యాంకు సీనియర్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. కవి, రచయిత్రి, కార్టూనిస్టుగా రాణించిన రమాదేవి మొదటి కార్టూన్ 1978లో స్వాతిలో అచ్చయ్యింది. ఆ తర్వాత అనేక కథలు, కథానికలు ఆమెకు మంచి గుర్తింపు తేగా.. 2013 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తిపురస్కారం అందుకున్నారు. కథలు, కవిత్వమే కాకుండా కార్టూన్లు వేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా రమణీయమైన కావ్యాలతో అందరినీ ఆకట్టుకున్న రమాదేవి కాళోజీ సాహితి పురస్కారం –2025కు ఎంపికయ్యారు. -
ఫలితాలు శూన్యం!
ప్రయత్నాలు వినూత్నం.. ● ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ సత్యశారద ● ఆతర్వాతే అర్జీల స్వీకరణ ● సత్వరమే పరిష్కరించాలని ఆదేశంన్యూశాయంపేట: ప్రజావాణిలో గత రెండు, మూడు వారాలుగా ఉన్నతాధికారులు వినూత్న ఆలోచనతో ఫిర్యాదుదారుల సమస్యల్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక వారం అధికారులు కలెక్టర్ వెనుకాల కూర్చోగా.. ఎదురుగా ఫిర్యాదు దారులు కూర్చున్నారు. సమస్యల్ని అధికారులకు వివరించారు. ఈవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ముందుగా అర్జీదారులందరితో మాట్లాడించారు. సమస్యలను అక్కడున్న సంబంధిత అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల ఆలోచనలు బాగున్నప్పటికీ.. కింది స్థాయి అధికారులు ప్రజల వినతులను పరిష్కరించేందుకు శ్రద్ధ చూపడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఆలోచనలు సరే ఆచరణేది? అంటూ అర్జీదారులు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారంతా కోరుతున్నారు.. వినతులు సత్వరమే పరిష్కరించండి ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల్ని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో 136 ఫిర్యాదులు రాగా.. అధికంగా రెవెన్యూ సమస్యలు 60, జీడబ్ల్యూఎంసీ 21, విద్యాశాఖ 11, సహకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, వైద్య ఆరోగ్యశాఖ, ఉపాధికల్పన శాఖలకు 3 చొప్పున, ఇతర శాఖలకు సంబంధించి 22 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదుల్ని సకాలంలో చర్యలను తీసుకోవాలని, చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదుదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఏఓ అనురాధ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, గృహనిర్మాణ శాఖ పీడీ గణపతి, డీసీఓ రాజమణి, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, ఆర్సీఓ అపర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దారులు, విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు. -
పగలనకా.. రాత్రనక
● యూరియా కోసం బారులుదీరుతున్న రైతులు ● ఉద్రిక్తతల నడుమ టోకెన్ల పంపిణీ ● లైన్లో ఉండగా.. ఓ రైతుకు ఫిట్స్ఖానాపురం: పగలు, రాత్రి తేడా లేదు. ఆకలి దప్పిక అస్సలు ఎరుగరు. ఎక్కడ చూసినా బారులే. ఏ రైతును కదిలించినా యూరియా కష్టాలే. ఒక్క బస్తాకోసం రోజుల తరబడి ఎదురు చూపులు. పంటను కాపాడుకునేందుకు రైతన్నలు తమ ఆరోగ్యాల్ని ఫణంగా పెడుతున్నారు. ఎండా వాన తేడా లేకుండా ఎరువుల కోసం పీఏసీఎస్‌ల చుట్టూ తిరుగుతున్నారు. తప్పని తిప్పలు ఖానాపురం మండలంలోని రంగాపురం, కొత్తూరు, రాగంపేట, ఖానాపురం, మనుబోతులగడ్డ గ్రామాల్లో యూరియా కష్టాలు రైతులకు తప్పలేదు. ఆయా గ్రామాలకు యూరియా వస్తున్న విషయం తెలుసుకున్న రైతులు రాత్రి 2 గంటల నుంచే రైతువేదికలు, గ్రామ పంచాయతీల వద్ద బారులుదీరారు. రంగాపురం, కొత్తూరు, మనుబోతులగడ్డకు చెందిన రైతులు మొదట ఖానాపురానికి రాత్రి 1 గంటకు వచ్చి బారులుదీరారు. ఖానాపురంలో ఆయా గ్రామాలకు ఇవ్వడంలేదని, కొత్తూరు, మనుబోతులగడ్డ సొసైటీ గోదాంకు వస్తుందని తెలియడంతో అక్కడికి వెళ్లి లైన్లో నిల్చున్నారు. ఈక్రమంలో క్యూలో నిల్చున్న రైతు లావుడ్య యాకూబ్ ఫిట్స్‌తో కిందపడిపోయాడు. ఖానాపురం, రాగంపేట, మనుబోతులగడ్డలోనూ అధిక సంఖ్యలో బారులుదీరారు. టోకెన్ల కోసం మహిళల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి ఘటనా స్థలానికి చేరుకుని రైతులను లైన్లో నిల్చోబెట్టారు. టోకెన్లు లభించిన రైతులు బస్తాలను ఇంటికి తీసుకెళ్లారు. క్యూలో ఉన్న రైతులకు యూరియా లభించక నిరాశతో వెనుదిరిగారు. -
ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
నల్లబెల్లి: అధికారి వేధింపులు.. అధికార పార్టీ నాయకుడి ఫిర్యాదు వెరసి ఓ జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ కార్యాలయంలో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండలం బజ్జుతండాకు చెందిన కల్పన పదేళ్లుగా వీఆర్ఏ, జూనియర్ అసిస్టెంట్‌గా విధులు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో పలు సర్టిఫికెట్ల జారీ కోసం విచారణ నివేదికను తహసీల్దార్ ముప్పు కృష్ణకు అందించేవారు. ఈక్రమంలో పలువురు దరఖాస్తుదారులు తమకు అనుకూలంగా విచారణ రిపోర్ట్ రాలేదని కక్ష పెంచుకున్నట్లు బాధితురాలు తెలిపారు. ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు.. మండలంలొని బిల్‌నాయక్ తండాకు చెందిన అధికార పార్టీ నాయకుడు, కల్పన మేనమామ మాలోత్ చరణ్‌సింగ్.. ఆమైపె శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్ సత్యశారదకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు కాపీని కల్పన వాట్సాప్‌నకు మేడపల్లి మాజీ ఎంపీటీసీ భర్త మాలోత్ మోహన్ పంపించాడు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన చరణ్ సింగ్ గతంలో తనను లైంగికంగా వేధించాడని, అతడికి లొంగకపోవడంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నాడని కల్పన పేర్కొంది. గతంలో ఒక తప్పుడు సర్టిఫికెట్ కోసం పురుషోత్తం సురేశ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే మనిషిని అని బెదిరించారని కల్పన పేర్కొంది. కాగా.. కలెక్టర్‌కు అందిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కృష్ణ ఆమెతో చర్చించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తితో మాట్లాడుకుని రాజీ కుదుర్చుకోమని చెప్పినట్లుగా కల్పన పేర్కొంటున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తహసీల్దార్ వెంటనే ఆమెను తన కారులో నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. వేధించలేదు.. జూనియర్ అసిస్టెంట్ కల్పనను నేను వేధింపులకు గురి చేయలేదు. కల్పనపై పలు ఆరోపణలు చేస్తూ ఇటీవల ఓ వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కల్పనతో మాట్లాడాను. ఏం కాదు ధైర్యంగా డ్యూటీ చేసుకొమ్మని సూచించాను. కార్యాలయానికి వచ్చే వారిపై మర్యాదగా వ్యవహరించాలని సూచించాను. వేధింపులకు పాల్పడలేదు. – ముప్పు కృష్ణ, తహసీల్దార్, నల్లబెల్లి అధికారి వేధింపులు! అధికార పార్టీ నాయకుడి ఫిర్యాదు బలవన్మరణానికి యత్నించిన జూనియర్ అసిస్టెంట్ కల్పన -
డిజిటల్ ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలి
● డీఈఓ రంగయ్యనాయుడు ● విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ఖిలా వరంగల్: విద్యార్థులు డిజిటల్ ప్రపంచాన్ని ఉపయోగించుకుని పరిశోధనాత్మక విద్యను అందుకోవాలని వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు సూచించారు. సోమవారం వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఈఓ రంగయ్యనాయుడు, అడల్ట్ ఎడ్యుకేషన్ ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్ అధికారి రమేశ్‌రెడ్డి హాజరై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస, నినాదాల పోటీలు ప్రారంభించారు. ఉపన్యాస పోటీల్లో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి ఆకుల సాత్విక ప్రథమ స్థానంలో నిలవగా, పదో తరగతి విద్యార్థి కల్లెపు హరిప్రియ ద్వితీయ స్థానం సాధించింది. విద్యార్థులను డీఈఓ రంగయ్య నాయుడు అభినందించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బత్తుల ప్రసాద్, అధికారులున్నారు.