నత్తనడకన విచారణ | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన విచారణ

Feb 7 2026 3:13 PM | Updated on Feb 7 2026 3:13 PM

నత్తనడకన విచారణ

నత్తనడకన విచారణ

నత్తనడకన విచారణ

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ కామన్‌ మెస్‌లో అవకతవకలు జరిగాయని, అధికంగా మెస్‌ బిల్లులు వస్తున్నాయని కొందరు విద్యార్థులు గతంలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కామన్‌ మెస్‌లో మెస్‌ బిల్లులు అధికంగా వచ్చాయని విద్యార్థులు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం విచారణ కమిటీని నియమించారు. విచారణ కమిటీ చైర్మన్‌గా కేయూ ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్‌ ప్రసాద్‌ వ్యవహరిస్తుండగా పలువురు ప్రొఫెసర్లు సభ్యులుగా ఉండి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణ కమిటీ పలుమార్లు హాస్టళ్ల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజ్‌కుమార్‌ నుంచి వివరాలు రాబట్టినట్లు సమాచారం. అదేవిధంగా ఆయా జాయింట్‌ డైరెక్టర్లను కూడా కొద్దిరోజుల క్రితమే విచారించారు. ఈవిచారణ కమిటీవేసి నెలరోజులు గడిచిపోయింది అయినా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.

ఇష్టారీతిన అడ్వాన్స్‌లు..

వివిధ హాస్టళ్లు, మెస్‌ల నిర్వహణకు హాస్టళ్ల డైరెక్టర్‌ ఇష్టారీతిన నిధులు విడుదల చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అన్ని హాస్టళ్లు, మెస్‌లలోని 23 మంది జాయింట్‌ డైరెక్టర్లకు కూడా అడ్వాన్స్‌ల రూపంలో డబ్బులు విడుదల చేస్తూ వస్తున్నట్లు డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ చెబుతున్నారు. కొందరికి ఎక్కువ మొత్తంలో అడ్వాన్స్‌లు ఇవ్వడంతో వారుసక్రమంగా వెచ్చించా రా లేదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామన్‌మెస్‌తోపాటు హాస్టళ్ల డైరెక్టర్‌పరిధి అన్ని మెస్‌ల, హాస్టళ్ల జాయింట్‌ డైరెక్టర్లకు విడుదల చేసి న అడ్వాన్స్‌ల బిల్లులను విచారణ కమిటీ క్షణ్ణంగా పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement