‘పెద్ది’ వల్ల రూ.15కోట్లు నష్టపోయాం
● బోరు బండి కుటుంబ సభ్యుల నిరసన
నర్సంపేట: 2016 –17వ సంవత్సరంలో అప్పటి సివిల్ సప్లయీస్ చైర్మన్‌గా ఉన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి.. నర్సంపేట నియోజకవర్గంలో తమ బోరు బండితో విచ్చలవిడిగా బోర్లు వేయించి మోటార్లు బిగించి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తీరని అన్యాయం చేశారని నర్సంపేట పట్టణంలోని శ్రీలక్ష్మి బోర్‌వెల్స్ యజమానులు వీరమల్ల మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బోర్‌వెల్ షాపు ఎదుట టెంట్ వేసుకొని.. పెద్ది సుదర్శన్‌రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు మోసం చేశారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుటుంబాలతో సహా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బోర్‌వెల్ యజమానులు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్‌రెడ్డి వల్ల తమ కుటుంబాలు వీధిన పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బోరు వేసే క్రమంలో తాము చేసిన అప్పులు రూ.15కోట్లు అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పిచ్చిన వారికి సమాధానం చెప్పలేక ఎనిమిది నెలలుగా ఇళ్లకు తాళాలు వేసి రహస్యంగా జీవనం గడుపుతున్నామని వాపోయారు. కాగా, మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న వేళ నర్సంపేటలో వీరి ఆందోళన వైరల్‌గా మారింది.


