సమస్యల పరిష్కారానికే ప్రజాపాలన | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే ప్రజాపాలన

Apr 3 2026 8:08 AM | Updated on Apr 3 2026 8:08 AM

సమస్యల పరిష్కారానికే ప్రజాపాలన

మంత్రి కొండా సురేఖ

కాశిబుగ్గ: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా వరంగల్‌ దేశాయిపేటలో వార్డు సభ నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్‌ కావటి కవిత రాజుయాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరవేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు వారికి చేరవేయాలని పిలుపునిచ్చారు. కాశిబుగ్గలోని 19వ డివిజన్‌, 20వ డివిజన్‌, ఎల్‌బీ నగర్‌లోని 13వ డివిజన్‌, లేబర్‌కాలనీలోని 18వ డివిజన్లలో గ్రామ పాలన, ప్రగతి ప్రణళిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్‌ సుధారాణి, వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద, కార్పొరేటర్లు కావటి కవిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement