హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో గురువారం హనుమత్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, మహానివేదన మహాహారతి నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలకు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఉభయదాతగా వ్యవహరించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ సుందరాకాండలోని సర్గలను భక్తులకు వివరించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో అర్చకులు ప్రణవ్, కాశీలింగాచారి, భక్తులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: 108లో పనిచేసే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం జాతీయ ఈఎంటీ దినోత్సవం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ కేక్ కట్ చేసి ఈఎంటీలకు శుభాకాంక్షలు తెలిపా రు. కార్యక్రమంలో 108 ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, జిల్లా మేనేజర్ మంద శ్రీని వాస్, ఈఎంటీలు బాలాజీ నాయక్, బొక్క చైతన్య, వేణుకుమార్, రామచందర్, ఉపేందర్, వేణు, స్వామి, యుగంధర్, రాజు, ఇమ్రాన్ ఖాన్, సోమేశ్వర్, నాగేశ్వర్‌రావు, లవన్‌కుమార్, భాస్కర్‌రెడ్డి, యాదరెడ్డి పాల్గొన్నారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పోలీస్ జిమ్ సెంటర్‌ను సీపీ సన్‌ప్రీత్ సింగ్ గురువారం అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిమ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వ్యాయామ సామగ్రిని పరిశీలించారు. అలాగే, పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేయాల్సిన జిమ్ సామగ్రి గురించి అధికారులతో చర్చించారు. ఆయన వెంట అదనపు డీసీపీతో పాటు ఏసీపీ, ఆర్‌ఐలు ఉన్నారు.
హన్మకొండ కల్చరల్/ఖిలా వరంగల్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న సెంట్రల్ సెక్రటేరియెట్ సర్వీసెస్ సిబ్బంది గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాను సందర్శించారు. భారత దర్శన్ టూర్‌లో వేయిస్తంభాల దేవాలయం, వరంగల్ కోట, రామప్ప, లక్నవరంలో పర్యటించారు. కాకతీయుల చరిత్రను అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్ వివరించారు. హైదరాబాద్ ఎంసీహెచ్‌ఆర్‌డీ నుంచి కిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, గైడ్ రవియాదవ్ పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: దొడ్డి కొమురయ్య 99వ జయంతిని శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భవనంలో నిర్వహించనున్నట్లు బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ బొడిగ సతీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు పాల్గొంటా రని పేర్కొన్నారు. బోధన, బోధనేతర ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొనాలని కోరారు.
కాజీపేట అర్బన్: హంటర్‌రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం పరిశీలించారు. రీజినల్ సైన్స్ సెంటర్‌లో పనిచేయని పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని, భవనంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. పరికరాలు, మరమ్మతులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, సైన్స్ సెంటర్ అధికారులు పాల్గొన్నారు.


