ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
● ప్యానల్ ఇన్‌స్పెక్షన్ టీం నోడల్ ఆఫీసర్ గాయపు లింగారెడ్డి
దుగ్గొండి: ప్రభుత్వ పాఠశాలలో వసతులు, పరిశుభ్రత, బోధన విధానం అద్భుతంగా ఉందని, అందుకు ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ టీం జిల్లా నోడల్ ఆఫీసర్ గాయపు లింగారెడ్డి కొనియాడారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. మాథ్స్, సోషల్, సైన్స్, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టులను టీమ్ సభ్యులు ఆనంద్‌మోహన్, నాగార్జున్ రావు, ఎం.రాజు, సంతోష్‌కుమార్, రమేష్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని సైన్స్ ల్యాబ్, హాజరు రిజిస్టర్, మధ్యాహ్న భోజన నిర్వహణ, పారిశుద్ధ్యాన్ని పరిశీలించి వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎస్‌కే.అహ్మద్, సునీత, సంధ్యారాణి, జుమ్మిలాల్, రజినీ, కిరణ్, కరుణ, తదితరులు పాల్గొన్నారు.


