ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 3.35 లక్షల మందికి ఓటేసింది 2,58,930 | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 3.35 లక్షల మందికి ఓటేసింది 2,58,930

Feb 12 2026 11:32 AM | Updated on Feb 12 2026 11:32 AM

ముగిస

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 3.35 లక్షల మందికి ఓటేసింది 2,58,930 – 8లోu అంతర్జాతీయ సదస్సుకు డీవైఎస్‌ఓ అశోక్‌ అమ్మవారికి పూజలు నకిలీ ఎలక్ట్రికల్‌ వైర్ల పట్టివేత కలెక్టర్‌ స్నేహ శబరీష్‌కు ఆహ్వానం పవర్‌లిఫ్టింగ్‌లో జాఫర్‌కు గోల్డ్‌మెడల్‌ భారీ బందోబస్తు నడుమ బ్యాలెట్‌ బాక్స్‌ల తరలింపు

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్న ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ అంతర్జాతీయ సదస్సుకు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్‌కుమార్‌ ఎంపికయ్యారు. కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌, ఎన్‌ఐటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవికుమార్‌ వద్ద ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేస్తున్న అశోక్‌కుమార్‌ సదస్సులో ‘ది లైఫ్‌ అండ్‌ అచీవ్‌మెంట్‌ ఆఫ్‌ ఠాకూర్‌ దేవ్‌ సింగ్‌’ అంశంపై పేపర్‌ ప్రజెంటేషన్‌ చేయనున్నారు. ఈసందర్భంగా అశోక్‌కుమార్‌ను గైడ్‌ రవికుమార్‌, ఒలింపిక్స్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్‌ఖాన్‌, క్రీడా సంఘాల ప్రతినిధులు, పీడీలు, పీఈటీలు, కోచ్‌లు అభినందించారు.

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి అమ్మవారిని బుధవారం తెలంగాణ జ్యువెల్లరీ వెరిఫికేషన్‌ అధికారి, బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కట్టా అంజనీదేవి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు అలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. అదేవిధంగా మహాశిరాత్రిని పురస్కరించుకుని వరంగల్‌కు చెందిన న్యాయవాది చండ్రపాటి చిదంబరనాథ్‌శర్మ దంపతుల ఆధ్వర్యంలో ఐదురోజుల పాటు నిర్వహించే మహారుద్రయాగాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు.

వరంగల్‌ క్రైం: అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని భవన నిర్మాణ రంగంలో వాడే బ్రాండెడ్‌ కంపెనీ గోల్డ్‌మెడల్‌ను పోలిన నకిలీ వైర్లు విక్రయిస్తున్నాడో వ్యాపారి. పక్కా సమాచారంతో డబ్బాల సమీపంలోని అర్భుద ఎలక్ట్రికల్స్‌ అండ్‌ శానిటరీలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, హనుమకొండ పోలీసులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రూ.3.59 లక్షల నకిలీ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ తెలిపారు. షాప్‌ యజమాని కంతి లాల్‌ను అరెస్ట్‌ చేసి తదుపరి విచారణ నిమిత్తం హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈదాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాజు, ఎస్సై భానుప్రకాశ్‌ పాల్గొన్నారు.

హన్మకొండ కల్చరల్‌: ఈ నెల 14 నుంచి 5 రోజుల పాటు వేయిస్తంభాల ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని హనుమకొండ కలెక్టర్‌ స్నేహశబరీష్‌ను ఆలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్‌, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆహ్వానించారు. హనుమకొండలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ స్నేహశబరీష్‌ను బుధవారం కలిసి ఆహ్వానపత్రిక అందించి ఉత్సవాలకు హాజరవ్వాలని కోరారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించినట్లు తెలిపారు. అదేవిధంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు చలువ పందిళ్లు, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ వరంగల్‌ జోన్‌ డీసీ రామల సునీతను ఆదేశించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

కాజీపేట రూరల్‌: కాజీపేట మండలం కడిపికొండకు చెందిన నేషనల్‌ ఐరన్‌ క్లబ్‌ జిమ్‌ కోచ్‌ కమ్‌ చైర్మన్‌ ఎండీ.జాఫర్‌ మాస్టర్‌ పంజాబ్‌ హరిద్వార్‌లో ఇండియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రథమ స్థానం నిలిచి గోల్డ్‌ మెడల్‌ను కై వసం చేసుకున్నారు. 59 కేజీల విభాగంలో జరిగిన నేషనల్‌ పవర్‌లిఫ్టింగ్‌ కాంపిటీషన్‌లో 317 1/2 కిలోల టోటల్‌ చేసి తెలంగాణ నుంచి జాఫర్‌ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్‌ను సాధించి రికార్డును బ్రేక్‌ చేశారు.

పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల పరిధిలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలు

పరకాల: పరకాలలో పోలింగ్‌ ముగిసిన అనంతరం 5 రూట్లలోని 44 పోలింగ్‌ కేంద్రాల బ్యాలెట్‌ బాక్సులను అధికారుల సమక్షంలో సాయంత్రం 5.30 గంటలకు సీల్‌ వేసి భారీ బందోబస్తుతో తరలించారు. పోలీస్‌ ఎస్కార్ట్‌తో గణపతి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. కౌంటింగ్‌ కూడా ఇదే కళాశాలలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాత్రి 7గంటల వరకు అన్ని బ్యాలెట్‌ బాక్సులను తరలించారు.

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

పుర పోరులో ఉమ్మడి వరంగల్‌ పట్టణవాసులు ఓట్లెత్తారు. ఆరు జిల్లాల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌, డోర్నకల్‌, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి 1,073 మంది కౌన్సిలర్ల కోసం పోటీ పడ్డారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ 9.30 గంటల వరకు మందకొడిగా సాగింది. ఆ తర్వాత 10 గంటల నుంచి ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులుదీరారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు అప్పుడప్పుడు లాఠీలు ఊపారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా చెదురు ముదురు ఘటనలు మినహా ఎన్నికల ఘట్టానికి తెరపడడంతో జిల్లాల ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

గతంతో పోలిస్తే పెరిగిన 13.38 శాతం

ఉమ్మడి వరంగల్‌లో బుధవారం రాత్రి వరకు అధికారుల ప్రకటించిన ప్రకారం 80.09 శాతంగా పోలింగ్‌ నమోదైంది. ఉమ్మడి జిల్లా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జనవరిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 9 మున్సిపాలిటీల్లో 200 వార్డులుండగా.. ఏకగ్రీవమైన 18 మినహాయించి 182 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 2,32,763 మంది ఓటర్లకు ఆ ఎన్నికల్లో 1,77,508 (76.26 శాతం) మంది ఓట్లేశారు. 2020 ఎన్నికలకు ఈసారి ఎన్నికలతో పోలిస్తే కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీలు పెరిగాయి. పెరిగిన మున్సిపాలిటీలు, ఓటర్లు, పోలింగ్‌ శాతాన్ని పరిశీలిస్తే గతంకంటే 13.38 శాతం పెరిగింది.

స్ట్రాంగ్‌ రూముల్లో భవితవ్యం..

చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపాలిటీల వారిగా పోలింగ్‌ బాక్సులను ఒకేచోట చేర్చిన అధికారులు భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూములకు తరలించారు. మొత్తం బ్యాలెట్‌ పేపర్లతో కూడిన బాక్సులను మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూముల్లో భద్రపర్చారు. శుక్రవారం (13వ తేదీన) ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవిత్యం తేలనుంది. కాగా, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్‌, సత్యశారద రెండు జిల్లాలకు చెందిన స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటుకు ఆదేశించారు. కాగా, స్ట్రాంగ్‌ రూముల్లో బ్యాలెట్‌ బాక్సుల్లో భద్రంగా ఉన్న ఓటర్లు తీర్పు ఎక్కడెక్కడ ఎవరిని వరిస్తుందోనన్న టెన్షన్‌ అభ్యర్థులో నెలకొంది. కాగా, మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రజలు, నిర్వహించిన అధికారులకు కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు అభినందనలు తెలిపారు.

పరకాల మండలంలోని మోడల్‌ పోలింగ్‌ కేంద్రం, పరకాలలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, నర్సంపేటలో వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద, ఓటు వేసి వస్తున్న వృద్ధురాలు, పరకాలలో ర్యాంపు లేక ఇబ్బంది పడుతూ దిగుతున్న దివ్యాంగుడు

పోలింగ్‌ సరళిని పరిశీలించిన

కలెక్టర్లు, అధికారులు

పోలీసు బందోబస్తు మధ్య

బ్యాలెట్‌ బాక్సుల తరలింపు

స్ట్రాంగ్‌రూముల్లో భద్రం...

రేపు ఓట్ల లెక్కింపు.. ఫలితాలు

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 1
1/11

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 2
2/11

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 3
3/11

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 4
4/11

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 5
5/11

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 6
6/11

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 7
7/11

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 8
8/11

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 9
9/11

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 10
10/11

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 11
11/11

ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్‌ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement