కరుగుతున్న వెండి.. బంగారం | Silver Prices Slide for Second Day Amid Profit Booking | Sakshi
Sakshi News home page

కరుగుతున్న వెండి.. బంగారం

Feb 7 2026 7:28 AM | Updated on Feb 7 2026 8:26 AM

Silver Prices Slide for Second Day Amid Profit Booking

న్యూఢిల్లీ: వెండి, పసిడిలో లాభాల స్వీకరణ కొనసాగడంతో ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో వెండి కిలో రేటు రూ.13,000 (5 శాతం) తగ్గి రూ. 2,55,000కు దిగివచ్చింది. అటు 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర రూ. 3,400 (2 శాతం) క్షీణించి రూ. 1,57,200కి తగ్గింది.

అయితే అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) సిల్వర్‌ ధర 3.02 డాలర్లు పెరిగి 74 డాలర్లకు చేరింది.ఇంట్రాడేలో 10 శాతం పతనమై 64.08 డాలర్ల స్థాయిని కూడా తాకింది. అటు ఇంట్రాడేలో 4,654.86 డాలర్ల కనిష్టాన్ని తాకిన బంగారం తర్వాత 106.74 డాలర్లు పెరిగి 4,887.30 డాలర్లకు ఎగిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement