వచ్చే నెలలో ఆడి కొత్త స్పోర్ట్స్‌ కార్‌ | Audi to Launch New Sports Car in India Next Month | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో ఆడి కొత్త స్పోర్ట్స్‌ కార్‌

Feb 7 2026 7:46 AM | Updated on Feb 7 2026 8:29 AM

Audi to Launch New Sports Car in India Next Month

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వచ్చే నెలలో భారత్‌లో కొత్త స్పోర్ట్స్‌ కారును ప్రవేశపెట్టడం ద్వారా తమ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసుకోనున్నట్లు లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు. రూపాయి క్షీణత పరిణామాల నేపథ్యంలో కార్ల రేట్లను మరోసారి పెంచే అవకాశం ఉందన్నారు.

ప్రోగ్రెసివ్‌ షోరూమ్‌ కాన్సెప్ట్‌ కింద శుక్రవారమిక్కడ ఆడి హైదరాబాద్‌ సెంట్రల్‌ షోరూమ్‌ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. హైదరాబాద్‌లో ఇది తమకు రెండో షోరూమ్‌ అని,  జాతీయ సగటుకన్నా రెట్టింపుగా తెలంగాణలో తమకు 8–10% స్థాయిలో మార్కెట్‌ వాటా ఉంటోందని బల్బీర్‌ సింగ్‌ తెలిపారు.

నగరంలో లగ్జరీ కార్ల సెగ్మెంట్‌ గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కస్టమర్లకు సరీ్వసులు అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు డీలర్‌ ప్రిన్సిపల్‌ వికాస్‌ చౌదరి, వీవీసీ గ్రూప్‌ చైర్మన్‌ వీవీ రాజేంద్ర ప్రసాద్‌ చౌదరి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement