
ఆడి ఇండియా.. 2025 మొదటి తొమ్మిది నెలల్లో కేవలం 3,197 యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. భౌగోళిక రాజకీయ సవాళ్లు, కస్టమర్ సెంటిమెంట్ వంటివన్నీ అమ్మకాల మీద ప్రభావం చూపించింది. GST 2.0 అమలు తర్వాత.. పండుగ సమయంలో డిమాండ్ పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.
కంపెనీ అమ్మకాల గురించి.. ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం లగ్జరీ కార్ల విభాగం కొంత ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత.. కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నామని అన్నారు.
ఆడి కంపెనీ దేశ వ్యాప్తంగా తన నెట్‌వర్క్ విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే.. తన ఎలక్ట్రిక్ కార్ల కోసం ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం, డీలర్షిప్స్ విస్తరించడం వంటివి చేస్తోంది. అంతే కాకుండా బ్రాండ్ అమ్మకాలను పెంచడానికి కంపెనీ వారంటీలను పెంచడం, రోడ్‌సైడ్ అసిస్ట్ వంటి వాటిని కూడా అందిస్తోంది.