2026 పురుషుల అండర్ 19 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (నవంబర్ 19) విడదల చేసింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలోని తొలి మ్యాచ్‌లో గత ఎడిషన్ రన్నరప్ భారత్, యూఎస్ తలపడనున్నాయి. అదే రోజు జింబాబ్వే, స్కాట్లాండ్, టాంజానియా, వెస్టిండీస్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి.
జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది (2026) జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 మధ్యలో జరుగనుంది. మూడు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిబ్రవరి 6న హరారేలో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వారి తొలి మ్యాచ్‌ను జనవరి 16న ఐర్లాండ్‌తో ఆడుతుంది. ఈ టోర్నీలోని మ్యాచ్‌లు రెండు ఆతిథ్య దేశాల్లోని ఐదు మైదానాల్లో జరుగుతాయి. ఈ టోర్నీలో పాల్గొనే 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. అనంతరం సూపర్-6, సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. ఈ టోర్నీకి సంబంధించిన వార్మప్ మ్యాచ్‌లు జనవరి 9-14 మధ్యలో జరుగుతాయి.
గ్రూప్‌లు..
గ్రూప్-ఏ- భారత్, బంగ్లాదేశ్, యూఎస్‌ఏ, న్యూజిలాండ్
గ్రూప్-బి- జింబాబ్వే, పాకిస్తాన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్
గ్రూప్-సి- ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక
గ్రూప్-డి- వెస్టిండీస్, టాంజానియా, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా
చదవండి: టీమిండియాకు భంగపాటు


