Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌
‘రెడ్‌బుక్‌’తో అరాచకం.. అదే రాజ్యాంగం అనే రీతిలో పాలన: వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో నెలన్నర రోజులుగా డిఫ్యాక్టో రాజ్యాంగం.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. కూటమి ప్రభుత్వ అండదండలతో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసకాండ యథేచ్ఛగా కొనసాగుతోంది. రాజకీయ గూండాలు, మహిళలు–చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారి చెప్పుచేతల్లోకి ప్రభుత్వ వ్యవస్థ వెళ్లిపోయింది. తమకు ఓటు వేయలేదన్న కారణంతో టీడీపీ గూండాలు ఊరూరా ఇష్టారాజ్యంగా కక్ష సాధింపు చర్యలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. వేలాది కుటుంబాలు ఊళ్లొదిలాయి. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు మొదలు సామాన్యుల వరకు రక్షణ లేకుండా పోయింది. కళ్లెదుటే ఫొటో, వీడియో ఆధారాలున్నా పోలీసు యంత్రాంగం అరాచకాన్ని నిలువరించే సాహసం చేయలేకపోతోంది.– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం అరాచకాలు, ఆటవిక పాలన, హింసాకాండపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను కోరారు. ‘రాష్ట్రంలో రాజ్యాంగం, శాంతి–భద్రతలు, పోలీసు వ్యవస్థ మొత్తం నిస్తేజంగా మారిపోయాయి. 45 రోజులుగా రాష్ట్రంలో డిఫ్యాక్టో రాజ్యాంగం.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం లేదు. రాజకీయ గూండాలు, మహిళలు–చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారి చెప్పుచేతల్లోకి ప్రభుత్వ వ్యవస్థ వెళ్లిపోయింది’ అని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తో ఆదివారం ఆయన భేటీ అయ్యారు. దాదాపు 45 నిముషాలపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అండదండలతో సాగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసకాండ గురించి గవర్నర్‌కు వివరించారు. ‘వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు రక్షణ లేకుండాపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి రాష్ట్రంలో 36 హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలకు పాల్పడగా, వేధింపులు తట్టుకోలేక 35 మంది అత్మహత్యలు చేసుకున్నారు. 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దాడులతో భయకంపితులై 2,700 కుటుంబాలు తమ గ్రామాలను విడిచి పోయాయి. వాటితోపాటు 1,050 దాడులకు పాల్పడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలకులు శాంతి–భద్రతలను ఏమాత్రం పరిరక్షించలేరని ఈ దురాగతాలు వెల్లడిస్తున్నాయి’ అని గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ గూండాలు పాల్పడిన హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సహా పూర్తి ఆధారాలను గవర్నర్‌కు సమరి్పంచారు. గవర్నర్‌కు సమరి్పంచిన వినతిపత్రంలో విషయాలు ఇలా ఉన్నాయి. అదఃపాతాళానికి దిగజారిన శాంతి భద్రతలు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. రాజ్యాంగ వ్యవస్థలు విఫలమయ్యాయి. అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. సామాన్యుల ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దారుణంగా దాడులకు పాల్పడుతుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో తమ పార్టీలకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం దాడులకు తెగబడుతోంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని వారిని అవమానిస్తూ.. దాడులకు పాల్పడుతుండటమే కాకుండా హతమారుస్తున్నారు. వారి ఆస్తులు, వ్యాపారాలను ధ్వంసం చేస్తూ, ఇళ్లను నేలమట్టం చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌ భవనాలతోపాటు ఇతర ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. వాటిని గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే ఒకే ఒక్క విద్వేషంతోనే ఇలా విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను కూడా నేలమట్టం చేస్తున్నారు. ఎంపీల నుంచి సామాన్యుల వరకూ రక్షణ కరువు టీడీపీ నేతలు, కార్యకర్తల దాడులకు పరాకాష్టగా వినుకొండలో వైఎస్సార్‌సీపీ క్రియాశీల కార్యకర్త రషీద్‌ను ఈ నెల 17న కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు సమీపంలోనే ఉన్నాసరే నడి వీధిలో దాడి చేసి మరీ పాశవికంగా హత్య చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఇటీవల ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. ఈ నెల 18న చిత్తూరు జిల్లా పుంగనూరు ఎంపీ ఎన్‌.రెడ్డప్పను కలిసేందుకు వెళ్లిన లోక్‌సభ వైఎస్సార్‌సీపీ పక్ష నేత, ఎంపీ మిథున్‌ రెడ్డిపై టీడీపీ మూకలు దాడి చేసి హత్య చేసేందుకు యత్నించాయి. పోలీసుల సమక్షంలోనే ఈ దాడికి పాల్పడటం రాష్ట్రంలో సామాన్యులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల ఉదాసీనతకు ఈ దాడి అద్దం పడుతోంది. పోలీసుల ఈ నిర్లక్ష్య వైఖరితో అమానవీయంగా దాడులు చేసేందుకు తమకు అనుమతి లభించిందన్న రీతిలో టీడీపీ గూండాలు చెలరేగిపోయి యథేచ్ఛగా విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. రెడ్‌ బుక్‌.. రాజ్యాంగ అరాచకం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఏమాత్రం వ్యవహరించడం లేదు. రాజ్యాంగం, శాంతి–భద్రతలు, పోలీసు వ్యవస్థ మొత్తం అచేతనంగా మారిపోయాయి. 45 రోజులుగా రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగమే అమలవుతోంది. రాజకీయ గుండాలు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారి చెప్పుచేతల్లోకి ప్రభుత్వ వ్యవస్థ వెళ్లిపోయింది. గత ఐదేళ్లపాటు రాష్ట్రం అత్యుత్తమ విద్య, వైద్య–ఆరోగ్య విధానాలు, రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, పటిష్టమైన శాంతి–భద్రతలు, సమీకృత అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది. కానీ ప్రస్తుతం హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్ష సాధింపులు, విధ్వంసానికి మారుపేరుగా దిగజారిపోయింది. రాష్ట్రంలో అంతటా అరాచకమే రాజ్యమేలుతోంది. ప్రస్తుత పాలకులు శాంతి–భద్రతలను ఏమాత్రం పరిరక్షించలేరని ఈ దురాగతాలు వెల్లడిస్తున్నాయి.వైఎస్సార్‌సీపీని అణచివేసే కుట్ర వైఎస్సార్‌సీపీని అణచి వేయాలని, తమ పార్టీతో అనుబంధం ఉన్న వారిని రాజకీయాల్లో లేకుండా చేయాలనే ఏకైక కుట్రతోనే ఈ దాడులు, విధ్వంసానికి పాల్పడుతున్నారు. అందుకోసం అత్యున్నత స్థాయిలో ఉన్న ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయిలో అధికారుల వరకు ఈ మేరకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఓ రాష్ట్ర మంత్రి రెడ్‌బుక్‌ పేరుతో ఏకంగా హోర్డింగులు ఏర్పాటు చేసి మరీ దాడులు చేయమని తమ నేతలు, కార్యకర్తలను ఆదేశించారు. ఈ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసు అధికారులకు కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దాంతోనే టీడీపీ గుండాలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగాన్ని హత్యలు, దాడులు, దురాగతాలకు పాల్పడేందుకు దురి్వనియోగం చేస్తున్నారు. 27 మంది ఐఏఎస్‌ అధికారులు, 24 మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వివక్ష, కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో శాంతి–భద్రతలు అదఃపాతాళానికి దిగజారిపోయాయి. రాష్ట్రంగానీ ప్రజలుగానీ ఈ దుస్థితిని ఇక ఏమాత్రం భరించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాకాండపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతున్నాం.

Joe Biden dropped out of the US presidential election
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్‌

అమెరికా అధ్యక్ష‍్య ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. డెమోక్రటిక్‌ పార్టీ, దేశ ప్రజల ‍ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్‌ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్‌గా పూర్తికాలం కొనసాగుతానన్నారు. ఇటీవల ట్రంప్‌తో జరిగిన ముఖాముఖి చర్చలో బైడెన్‌ నిరాశపరిచారు. రానున్న ఎన్నికలకు తదుపరి డెమొక్రాట్ అభ్యర్థిగా కమలా హారిస్‌ను జో బైడెన్‌ ప్రతిపాదించారు.జో బైడెన్‌ సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సైతం బైడెన్‌ బాధపడుతున్నారు.

Sakshi Guest Column On Terrorist Attacks On Jammu and Kashmir
జమ్మూలో దాడుల వెనుక...

కొన్ని వారాలుగా జమ్ము తీవ్రవాదుల దాడులతో దద్దరిల్లుతోంది. కశ్మీర్‌ లోయ నుండి ఉగ్రదాడులు జమ్మూకి ఎందుకు మారినట్టు? ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించిన ప్రదేశాల్లో కశ్మీర్‌ ఒకటి. సైన్యానికి తెలియకుండా ఆకు కూడా కదలదు. కశ్మీర్‌తో పోల్చితే జమ్మూ తక్కువ సమస్యాత్మకం. జమ్ము–కశ్మీర్‌కు ఆర్టికల్‌ 370 రద్దు అయిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ పాలిత కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. సాధారణ స్థితికి సంబంధించిన ప్రభుత్వ వాదనలను జమ్మూలో కూడా తోసిపుచ్చడమే ఉగ్రవాదుల లక్ష్యం అయి వుండాలి. శాశ్వత శాంతిని కనుగొనడంలో ‘పాకిస్తానీ హస్తం’ ఇప్పటికీ తప్పనిసరని ఈ దాడులు గుర్తు చేస్తాయని వాళ్లు భావిస్తూవుండొచ్చు.ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ ప్రాంతంలోని రియాసీ నుంచి కాశ్మీర్‌లోని బారాముల్లా వరకు చీనాబ్‌ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన వంతెన మీదుగా ఈ నెలాఖరులో తొలి రైలు రన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కానీ ప్రశ్న ఏమిటంటే, పీర్‌ పంజాల్‌కు దక్షిణాన ఇటీవల జరిగిన ఉగ్రదాడుల కారణంగా ఈ ప్రాంత వాసుల్లో ఏర్పడుతున్న ఆందోళనకు ప్రధాన మంత్రి సమక్షంలో భరోసా లభిస్తుందా?గత కొన్ని వారాలు రక్తంతో తడిసిన భీకర శబ్దాన్ని గుర్తుచేస్తున్నాయి: జూలై 8న కఠువా జిల్లాలో ఐదుగురు సైనికులు హతమయ్యారు. జూలై 7న కుల్గామ్‌లో ఆరుగురు ఉగ్రవాదులతో సహా ఎనిమిది మంది హతమయ్యారు. జూన్‌ 26న డోడా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్‌ 9న ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున రియాసి జిల్లాలో తొమ్మిది మంది యాత్రికులు హత్యకు గురయ్యారు.మరో నెల రోజుల్లో, జమ్ము–కశ్మీర్‌కు ఆర్టికల్‌ 370 రద్దు అయిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ పాలిత కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ‘సబ్‌ చంగా సీ’ (అంతా బాగుంది) పిలుపునకు ఏమైంది? ముడుచుకుపోయిన పెదవులు, పిడచకట్టుకుపోయిన నాలుకలపై కదులుతున్న ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు మెజారిటీగా ఉన్న కశ్మీర్‌ లోయ నుండి ఉగ్రవాద దాడులు హిందూ మెజారిటీ జమ్మూకి ఎందుకు మారాయి?మొదట, వాస్తవాలు చూద్దాం. దాడులు చేస్తున్న ఉగ్రవాదులు విదేశీయులు. అంటే వారు పాకిస్తాన్‌కు చెందినవారు. అఫ్గాన్లు, చెచెన్లు మొదలైన ఇతర విదేశీ ఉగ్రవాదుల్ని ఇక్కడ గుర్తించలేదు. రెండవది, వారు అమెరికా తయారీ ఎమ్‌4 కార్బైన్‌ అసాల్ట్‌ రైఫిల్స్‌ వంటి అధునాతన ఆయుధాలను కలిగి ఉన్నారు. ఇవి తరచుగా జమ్ము–కశ్మీర్‌లో కంటే అఫ్గాన్‌ యుద్ధరంగంలో ఎక్కువగా కనిపిస్తాయి. మూడవది, వారు దాడులను నిర్వహించడానికి అత్యున్నత శిక్షణ పొందారు. నాల్గవది, ఈ ఉగ్రవాదులు అటవీ, అంతర్జాతీయ సరిహద్దు విభాగం నుండి జమ్మూ ప్రాంతంలోకి చొరబడ్డారు. వారు వేగవంతమైన ప్రవాహాల నుండి ఈదుకుంటూ వచ్చారు, అంతే తప్ప నిజంగా నియంత్రణ రేఖను దాటి కాదు.అంతర్జాతీయ సరిహద్దు నుంచి చొరబడవచ్చని చెబితే ఎక్కువగా ఆశ్చర్యపోవద్దు. రియాసీ, డోడా, కఠువా, సాంబాలో నేల మెత్తటిది. గతంలో ఉగ్రవాదులు సొరంగాల ద్వారా చొరబడ్డారు. ఇప్పుడైతే పాకిస్తానీ డ్రోన్లు వారికి సాయపడుతున్నాయి – 2021లో జమ్మూ వైమానిక క్షేత్రంపై దాడితో సహా!మరీ ముఖ్యంగా, పాకిస్తానీ వ్యూహంలో మార్పు – అంటే, లక్ష్య ప్రాంతాన్ని కశ్మీర్‌ నుండి జమ్మూకి మార్చడం అనేది కశ్మీరీ జనాభాకు ‘ఉపశమనం‘ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో స్పష్టంగా జరిగిన చర్య. కశ్మీర్‌ లోయ చాలా నిశితంగా పరిశీలించబడుతోంది. అక్కడ చెట్టు నుండి పడే ఆకు వేగం, కోణం, దూరం గురించి కూడా భద్రతా బలగాలకు తెలుసు. వారికి ముందుగా తెలియకుండా చిగురుటాకు కూడా రాలడం కష్టం. కశ్మీర్‌లోని పెద్ద భూభాగాలు ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించబడిన వాటిలో ఒకటిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. వ్యవస్థ గురించి మాట్లాడితే లేదా వ్యతిరేకంగా మాట్లాడితే దానికి చెల్లించే మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు తమ పనులు తాము చూసుకుంటారు.జమ్మూ ప్రాంతంలో అలా కాదు. పూంఛ్‌–రాజౌరీ సెక్టార్‌లో నిరంతరం దాడులు జరుగుతున్నప్పటికీ, ఈ భూభాగాల భద్రత చాలావరకు సడలించబడింది. హిందూ మెజారిటీతో కూడిన జమ్మూ మరింత జాతీయవాదంతో, తక్కువ సమస్యాత్మకంగా ఉంటుంది. వాస్తవానికి, 2020 వేసవిలో వాస్తవ నియంత్రణ రేఖ అంతటా చైనీయులు కాలిడినట్లు గుర్తించిన వెంటనే, రాష్ట్రీయ రైఫిల్స్‌ వారి బ్రిగేడ్‌ను తూర్పు లద్దాఖ్‌కు తరలించారు. భద్రత పలుచబడిపోవడం వల్ల జమ్మూకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మాత్రమే ఇక్కడి బ్రిగేడ్‌ కొంతమంది రిజర్వ్‌ బలగాలతో భర్తీ అయింది.ఇక్కడ మరొకటి కూడా జరుగుతోంది. ఇది భద్రతా పరిస్థితులతో నేరుగా సంబంధం కలిగి ఉండకపోయినా, మారుతున్న పరిస్థితుల గురించి మీకు కొంత ఆలోచన ఇస్తుంది. అదేమిటంటే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కూడా బీజేపీ బలహీనపడటం!ఇది ఇలా ఉండకూడదు. ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం వల్ల జమ్మూను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో మరింత అనుసంధానం చేయాలని భావించారు. దానికి బదులుగా, ఇప్పుడు స్థానిక నివాసితులు పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బయటి వ్యక్తులకు భూమి అమ్మకం, మద్యం వ్యాపారంలో పెరుగుదలతో పాటుగా, శ్రీనగర్‌ నుండి ఐదు లక్షల మందితో కూడిన బలమైన సైన్యం తరలింపును గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఇది స్థానిక వ్యాపారానికి ఊతమిచ్చేది.ఇటీవలి లోక్‌సభ ఎన్నికలు ఆ అసంతృప్తిని కొంతమేరకు ప్రదర్శించాయి. ఉధమ్‌పుర్‌ (40.11 శాతం ఓట్లు సాధించిన చౌధురీ లాల్‌ సింగ్‌ను 51.28 శాతంతో జితేంద్ర సింగ్‌ ఓడించారు), జమ్మూ (42.4 శాతం ఓట్లు సాధించిన రామన్‌ భల్లాను 52.8 శాతంతో జుగల్‌ కిషోర్‌ శర్మ ఓడించారు) స్థానాలను బీజేపీ గెలుచుకున్నప్పటికీ, వారి గెలుపు మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. రెండూ 1.5 లక్షల కంటే తక్కువ. ఇలా జరగడం పట్ల అధికార పార్టీ ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. బహుశా, పాకిస్తానీ ఉగ్రవాదులు చేయాలనుకుంటున్నది అదే కావచ్చు. ఆర్టికల్‌ 370 రద్దు అయిదో వార్షికోత్సవం సందర్భంగా, సాధారణ స్థితికి సంబంధించిన ప్రభుత్వ వాదనలను జమ్మూలో కూడా తోసిపుచ్చడమే. తీవ్రవాద దాడుల స్థాయి ఇంకా కొద్దో గొప్పో నియంత్రణలోనే ఉందనీ, వ్యూహాలు మారినప్పటికీ అది ఎక్కువ ప్రతీకార చర్యలకు పురిగొల్పదనీ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులు సైనిక శిబిరాలకు ఎక్కువ నష్టం కలిగించడానికి ఉద్దేశించబడ్డాయి. జమ్మూలో ఇవి సాయుధ గస్తీపై, పౌర వాహనాలపై మెరుపుదాడిగా మారాయి.బహుశా, మరొక కారణం ఉంది. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ బలం తగ్గినప్పటికీ, ఆయన ప్రపంచంలో పర్యటిస్తున్నారనీ, ఆయన గౌరవం పొందుతున్నారనీ పాకిస్తాన్‌ సర్వశక్తిమంతమైన సైనిక వ్యవస్థ గమనించకుండా ఉండదు. న్యూఢిల్లీని దాని ఆత్మసంతృప్తి దశ నుండి కదిలించి, ఒక పరిష్కారాన్ని, శాశ్వత శాంతిని కనుగొనడంలో ‘పాకిస్తానీ హస్తం’ ఇప్పటికీ తప్పనిసరని గుర్తించేలా ఈ దాడులు చేస్తాయని బహుశా రావల్పిండి భావిస్తూవుండొచ్చు.అయినప్పటికీ, అంతర్గత ఒత్తిడికి మోదీ చాలా ఎక్కువగా స్పందిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. 2019లో కర్తార్‌పూర్‌ సాహిబ్‌ కారిడార్‌ను బలవంతంగా ప్రారంభించిన పంజాబ్‌ మాదిరిగానే, మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కశ్మీర్‌కు అవకాశం వస్తుంది. కశ్మీర్‌ లేదా జమ్మూ నుండి ఎన్నికైన ప్రతినిధులను ఢిల్లీ గానీ, రావల్పిండి గానీ విస్మరించలేవు. చేతిలో ఒక క్షణం ఉంటుంది. ఇది త్వరలో మళ్లీ రాకపోవచ్చు. భారతదేశం, పాకిస్తాన్‌ రెండూ ప్రయత్నించాలి, దానికి సిద్ధం కావాలి.జ్యోతీ మల్హోత్రా వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Serious confusion in regular transfers of Telangana state employees
బదిలీలు బద్నామ్‌!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి వచ్చాక తొలిసారిగా తలపెట్టిన ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. సీనియారిటీ జాబితాల రూపకల్పన మొదలు గరిష్టంగా 40శాతం సిబ్బంది బదిలీ నిబంధన వరకు ఎన్నో సమస్యలు తలెత్తాయి. దీనితో చాలా శాఖల్లో ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం ఈనెలాఖరు వరకు బదిలీల గడువును పొడిగించాల్సి వచ్చింది. నిజానికి ప్రభుత్వ శాఖలు ప్రకటించిన సీనియారిటీ జాబితాలు శాస్త్రీయంగా లేవని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ జాబితాల ప్రకటన అనంతరం అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, తుది జాబితాల ప్రకటనకు ప్రభుత్వం పెద్దగా సమయం ఇవ్వలేదని.. దీంతో ఆయా శాఖల్లో బదిలీలు ముందుకు సాగలేదని అంటున్నారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతోపాటు వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, సంక్షేమ శాఖల్లో ట్రాన్స్‌ఫర్లకు ఆటంకాలు ఏర్పడ్డాయని వివరిస్తున్నారు. ఆయా ఉద్యోగుల సందేహాలను, సీనియారిటీ సమస్యలను నివృత్తి చేయలేక శాఖాధిపతులు తల పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. తేలని జీవో 317 లొల్లి.. రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 అమల్లో భాగంగా చేసిన ఉద్యోగుల కేటాయింపులపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. 32 శాఖల్లోని 53వేల మందికిపైగా ఉద్యోగులు ఆన్‌లైన్‌ విధానంలో ప్రభుత్వానికి తమ వినతులు సమర్పించారు. జీవో 317 సమస్యల పరి­ష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఈ సమస్యల వివరాలను కూడా సేకరించింది. వీటిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 18న ఉప సంఘం సమావేశమవాల్సి ఉన్నా జరగలేదు. దీంతో 53 వేల మంది ఉద్యోగుల వినతులు పెండింగ్‌లో పడిపోయాయి. అవన్నీ ఇంకా పెండింగ్‌లో ఉండగానే.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెరలేపింది. మంత్రివర్గ సమావేశం జరిగి ఉంటే సమస్యల పరిష్కారానికి సిఫార్సు లభించేదని, వాటిని పరిష్కరించకుండా బదిలీల ప్రక్రియ ఎలా పూర్తవుతుందన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం.గురుకులాల్లో ఆందోళన సాధారణ బదిలీల కంటే ముందే గురుకుల విద్యా సంస్థల్లో పదోన్నతులు, ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాదాపు నెలరోజులుగా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. జోనల్‌ కేటాయింపులు రోజుకోరకంగా మారుతుండటంతో ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో మల్టీజోన్‌–1కు చెందిన ఉద్యోగులను మల్టీజోన్‌–2కు కేటాయించారు. కొన్ని కేటగిరీల్లో మల్టీజోన్‌–2 పరిధిలోని ఉద్యోగులు మల్టీజోన్‌–1కు పంపారు. ప్రిన్సిపాల్స్, డిగ్రీ లెక్చరర్, జూనియర్‌ లెక్చరర్‌ కేటగిరీల్లో వందల మందికి ఇలా జోన్లు మారడంతో వారంతా న్యాయ పోరాటానికి దిగారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వారిని మినహాయించి బదిలీలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోనూ జోనల్‌ కేటాయింపుల్లో సమస్యలు నెలకొన్నాయి. వాటిని పరిష్కరించాకే బదిలీల ప్రక్రియ చేపట్టాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో బదిలీల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. విద్యా శాఖలో సింగిల్‌ టీచర్‌ సమస్య.. పాఠశాల విద్యా శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియ పదిరోజుల క్రితం ముగిసింది. దాదాపు 35వేల మంది టీచర్లు కొత్త స్కూళ్లకు బదిలీ అయ్యారు. సింగిల్‌ టీచర్‌ ఉన్న పాఠశాలల విషయంలో ఇబ్బంది ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆ పాఠశాలల్లో ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లు బదిలీ అవడం.. వాటికి ఇతర టీచర్లెవరూ రాకపోవడం సమస్యగా మారింది. అలాంటి చోట్ల టీచర్లను రిలీవ్‌ చేయకుండా నిలిపేశారు. బదిలీ అయినా ఆ టీచర్లు పాత స్కూళ్లలోనే కొనసాగాల్సి వస్తోంది. వైద్యారోగ్య శాఖలో సీనియర్లకు మొండిచేయి రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కూడా బదిలీల ప్రక్రియతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కీలక సమయంలో మంచి వైద్య సేవలు అందించిన అధికారులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, మాజీ డీఎంఈ సైతం ప్రాధాన్యత లేని చోటికి ట్రాన్స్‌ఫర్‌ కావడం గమనార్హం. కరోనా సమయంలో కీలకపాత్ర పోషించిన రాజారావు, నాగేందర్, రమేశ్‌రెడ్డి కూడా దూర ప్రాంతాలకు కేటాయించారు. దీంతో ఈ శాఖలో బదిలీల ప్రక్రియను ఇష్టానుసారం చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నర్సుల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని.. కొందరు అధికారులు ముడుపులు కూడా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఆర్థిక శాఖలో ‘క్లియర్‌ వేకెన్సీ’ వివాదం.. ఆర్థికశాఖలో జరిగిన బదిలీల్లో నిబంధనలు సరిగా పాటించలేదని ఆ శాఖ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. డైరెక్టర్‌ వర్క్స్, అకౌంట్స్‌ కార్యాలయంలో జరిగిన బదిలీల్లో నాలుగేళ్ల తప్పనిసరి బదిలీ నిబంధన పాటించలేదు. ఒకేచోట ఆరేడు ఏళ్ల సర్వీసు పూర్తయినా.. కొందరి వివరాలు సేకరించకుండా పక్కనబెట్టారని ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు తక్కువకాలం పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరి బదిలీ జాబితాలోకి తీసుకువచ్చారని మండిపడుతున్నారు. అంతేకాదు.. సీనియారిటీ ప్రకారం పూర్తి వేకెన్సీలను చూపకుండా అన్యాయం చేశారనే ఆరోపణలూ వస్తున్నాయి. హనుమకొండలోని మిషన్‌ భగీరథ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక డీఏఓ ఆరేళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తున్నా బదిలీ జాబితాలోకి తీసుకోలేదని సమాచారం. ములుగు కార్యాలయంలో ఉన్న క్లియర్‌ వేకెన్సీని సీనియర్‌ ఉద్యోగులకు చూపించకుండా.. మిషన్‌ భగీరథ వరంగల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న తక్కువ సర్వీస్‌ ఉన్న డీఏఓకు కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. పీసీబీలోనూ బది‘లీలలు’! తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ)లో సుదీర్ఘకాలంగా హెడ్డాఫీస్, జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తున్న పైస్థాయి అధికారులు, వివిధ కేడర్ల అధికారులు/ఉద్యోగులు నాలుగేళ్లకుపైబడి ఒకేచోట పనిచేస్తున్నా బదిలీ చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గడువు పెంచినా.. బదిలీల విషయంలో అధికారుల నుంచి అటెండర్ల వరకు అసంతృప్తిగా ఉన్నారని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇలా వివిధ శాఖల్లో జరుగుతున్న బదిలీలు గందరగోళంగా మారడంతో ప్రభుత్వ బదిలీల ప్రక్రియ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. దీంతో ఇప్పటికైనా అర్హులైన ఉద్యోగులకు బదిలీలు జరగాలని, అన్యాయంగా జరిగిన బదిలీలు ఆగిపోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. జోనల్‌ చిక్కులకు పరిష్కారం లభిస్తుందని, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖలో ఇంజనీర్లకు మినహాయింపు నీటి పారుదల శాఖలోని అన్ని కేడర్ల ఇంజనీర్లను సాధారణ బదిలీల నుంచి మినహాయిస్తూ ఆ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా శనివారం జారీచేశారు. శాఖలో ఇంజనీర్ల కొరత ఉందని, ప్రస్తుత వర్షాకాలంలో ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. సాధారణ బదిలీల నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. నిర్మాణంలోని ప్రాజెక్టులు పూర్తయ్యాక ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ అవసరాలు తీరాక శాఖ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని కేడర్లలోని ఇంజనీర్ల బదిలీలను చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి ఇంజనీర్ల బదిలీలు, పదోన్నతుల విషయంలో శాఖలోని వివిధ ఇంజనీర్ల సంఘాల మధ్య విభేదాలు తీవ్రం కావడంతో ప్రస్తుతానికి బదిలీలను పక్కనపెట్టినట్టు సమాచారం. 40% నిబంధనతో చిక్కు..ప్రస్తుత సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా నాలుగేళ్లు, ఆపై ఒకేచోట పనిచేస్తున్న అధికారి/ఉద్యోగి తప్పనిసరి బదిలీ కేటగిరీలోకి వస్తారు. అయితే గరిష్టంగా 40 శాతం మందికి మాత్రమే స్థానచలనం కలిగేలా ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఉదాహరణకు ఒక జోన్‌ పరిధిలో వంద మంది ఉద్యోగులు ఉండి, వారిలో 50 మంది నాలుగేళ్లకుపైగా ఒకేచోట ఉన్నారనుకుంటే.. ఈ 50 మందికి బదిలీ అర్హత ఉన్నట్టే. కానీ 40శాతం నిబంధన మేరకు 40 మంది మాత్రమే బదిలీ అయి, మిగతా పది మందికి చాన్స్‌ దొరకదు. ఇలా చాలా శాఖల్లో తప్పనిసరి జాబితాలోని ఉద్యోగులకు బదిలీ చాన్స్‌రాక తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కార్యాలయాలన్నీ ఒకే స్టేషన్‌ కిందకు వస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టత ఇచ్చింది. ఈ నిబంధనను అమలు చేయడంలో ప్రభుత్వ శాఖలు తడబాటుకు గురవడంతో.. కొందరు గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులు తిరిగి గ్రామీణ ప్రాంతాలకే బదిలీ కావాల్సి వచ్చింది.

Budget 2024: Expectations from Union Budget 2024
Budget 2024 : బడ్జెట్‌ ‘హల్వా’ మెప్పిస్తుందా?

ఒక పక్క ధరాభారం... మరోపక్క పన్నుల మోత! దేశంలో వేతన జీవుల నుండి సామాన్యుల వరకు ఈ సెగ గట్టిగానే తగులుతోంది. వికసిత భారతదేశమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న మోదీ 3.0 సర్కారుకు ఉపాధికల్పన ఇప్పుడు చాలా కీలకంగా మారింది. పారిశ్రామికంగా దేశాన్ని పరుగులు పెట్టిస్తూనే.. ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలి్పంచాల్సిన అవసరం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వైపు అన్ని వర్గాలూ ఆశగా ఎదురుచూస్తున్నాయి. మరి సీతమ్మ బడ్జెట్‌ ‘హల్వా’ అందరినీ మెప్పిస్తుందా? వివిధ రంగాలు, పరిశ్రమ వర్గాల అంచనాలు సాకారమవుతాయా? మధ్యతరగతి ఆశలు నెరవేరుతాయా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలి’.. కేంద్రంలోని మోదీ సర్కారు దీర్ఘకాలిక లక్ష్యం ఇది. అమెరికా, యూరప్, చైనా ఆర్థికవ్యవస్థలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలోనూ భారత్‌ ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి (7% పైనే)తో సాగిపోతోంది. ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం అమెరికా, చైనా తర్వాత మూడో స్థానానికి చేరుకుంటుందని అంచనా. ఈ స్వప్నం సాకారం కావాలంటే ఉపాధి అవకాశాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అవసరం. పన్నుల ఉపశమనం కలి్పంచాలన్న డిమాండ్లు ఉండనే ఉన్నాయి. రానున్న బడ్జెట్‌లో చరిత్రాత్మక, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఉంటాయంటూ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇప్పటికే సంకేతం పంపారు. దీంతో ఈ నెల 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమరి్పంచే 2023–24 పూర్తి స్థాయి బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.పన్నుల భారం తగ్గించరూ.. ప్రస్తుత పరిస్థితి: ఆదాయపన్ను, జీఎస్‌టీ తదితరాల రూపంలో ప్రజలపై ప్రత్యక్ష, పరోక్ష పన్నుల బాదుడు గడిచిన పదేళ్లలో గణనీయంగా పెరిగిపోయింది. ఇది ఏ స్థాయిలో అంటే.. 2023–24లో కేంద్ర సర్కారు రూ.34.6 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో సమకూర్చుకుంది. ఒక వస్తువు చేతులు మారుతున్న ప్రతి దశలోనూ పన్ను పరిధిలోకి వెళుతోంది. ఉదాహరణకు డీజిల్, పెట్రోల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్, వ్యాట్‌ ట్యాక్స్‌ విధిస్తుంటాయి. వాహనం వాడే ప్రతి ఒక్కరూ ఇంధనం కొనుగోలుపై పన్ను చెల్లిస్తున్నట్టే. వస్తు రవాణాకు వినియోగించే లారీలు, ట్రక్కులు, రైల్వే డీజిల్, విద్యుత్‌ను ఇంధనంగా వినియోగిస్తుంటాయి. ఆ దశలో అవి డీజిల్, విద్యుత్‌పై పన్ను చెల్లిస్తుంటాయి. ఆ చార్జీల భారం వస్తువులపై పడి, చివరికి వినియోగదారుడు తన వంతు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఒక కంపెనీ తన లాభం నుంచి 25 శాతం పన్ను చెల్లించాలి. ఆ తర్వాతే డివిడెండ్‌ పంపిణీ చేస్తుంది. ఈ డివిడెండ్‌ అందుకున్న వారు దానిపై తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా పన్ను చెల్లించాలి. అంటే రెండు దశల్లో డివిడెండ్‌పై పన్ను పడినట్టు అవుతోంది. ఇలా ప్రత్యక్షం కంటే, పరోక్ష పన్నుల భారం ప్రజలపై బాగా పెరిగిపోయింది. వ్యవసాయం– గ్రామీణంప్రస్తుత పరిస్థితి: రైతుల ఆదాయాన్ని, వారి ఆర్థిక స్థితిగతులు పెంచేందుకు కృషి చేస్తామంటున్న మోదీ సర్కారు.. ఈ రంగానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేయడం లేదు. 2023–24 బడ్జెట్‌లో సాగు రంగానికి రూ.1.25 లక్షల కోట్లు కేటాయించారు. దీంతో పోలి్చతే కేవలం 0.6 శాతం పెంచి 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి కేటాయింపులు మాత్రం 4.2 శాతం పెంచి 1.80 లక్షల కోట్లు చూపించారు. అంచనాలు: పంట నష్టాన్ని తగ్గించి, మెరుగైన రేటు వచ్చే దిశగా బడ్జెట్‌లో చర్యలు ప్రకటిస్తారన్న ఆశలు రైతన్నల్లో నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా రైతులు అందరికీ నానో డీఏపీ ఎరువులను అందుబాటులోకి తీసుకురావడం, పంట ఉత్పత్తి అనంతరం నిల్వ, సరఫరా వ్యవస్థ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సాహిస్తామని మధ్యంతర బడ్జెట్‌లో చేసిన ప్రకటనలు ఈ రంగానికి బలాన్నిచ్చేవే. ఇవి కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్లో అదనపు చర్యలు ఏమి ప్రకటిస్తారో చూడాలి. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలన్న డిమాండ్‌ను పరిశీలించవచ్చు. అంచనాలు: పాత పన్ను విధానం నుంచి ప్రజలను క్రమంగా కొత్త విధానంలోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆశయం. పాత విధానంలో పీపీఎఫ్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పిల్లల స్కూల్‌ ట్యూషన్‌ ఫీజులు, ఈఎల్‌ఎస్‌ఎస్, జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియం, గృహ రుణం చెల్లింపులపై గణనీయమైన పన్ను ప్రయోజనాలున్నాయి. అందరూ వీటిని వినియోగించుకోలేరు. కనుక అందరికీ ఉపయోగపడే విధంగా, పారదర్శకంగా ఉండేందుకు మినహాయింపుల్లేని కొత్త పన్ను విధానాన్నే అంతిమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకని నూతన పన్ను విధానంలోకి మళ్లే దిశగా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు చేయవచ్చని అంచనాలున్నాయి. పరిశ్రమ భాగస్వాములు కూడా ఆర్థిక మంత్రిని ఇదే కోరాయి. స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.50వేల నుంచి రూ. లక్షకు పెంచొచ్చన్న అంచనాలున్నాయి. పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల ప్రాథమిక పన్ను మినహాయింపు పదేళ్ల నుంచి అదే స్థాయిలో కొనసాగుతోంది. దీన్ని పెంచాలన్న డిమాండ్లు ఉన్నాయి. కానీ, పాత పన్ను విధానాన్ని నిరుత్సాహపరిచేందుకు అందులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని భావిస్తున్నారు. పన్ను మినహాయింపులను పెంచడం వల్ల ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం పెరిగి, అది వినియోగంలోకి వస్తుందని.. అంతిమంగా దేశ వృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 8.2 శాతం వృద్ధి రేటు ఇక మీదటా గరిష్టాల్లో నిలదొక్కుకునేందుకు ఈ తరహా చర్యలు అవసరమన్న వాదన వినిపిస్తోంది. బీమాపై డిమాండ్లు ఇవీ.. ఇక జీవిత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్‌టీ భారం తగ్గించాలన్న బలమైన డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. వీటిపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతోంది. దేశంలో ప్రతి ఒక్కరికీ బీమాను చేరువ చేసేందుకు పన్ను రేటును 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ఆరోగ్యం, వైద్యం కోసం చేసే ఖర్చులు గణనీయంగా పెరిగిపోయినప్పటికీ సెక్షన్‌ 80డీ కింద హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలకు కలి్పస్తున్న వెసులుబాటులో (60ఏళ్లలోపు ఉంటే రూ.25 వేలు, 60 ఏళ్లు నిండిన వారికి రూ.50 వేలు) గత తొమ్మిదేళ్లుగా ఎలాంటి మార్పులు లేకపోవడాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి పరిశ్రమ తీసుకెళ్లింది. ద్రవ్యోల్బణానికి ముడిపెట్టి, ఈ సెక్షన్‌ కింద హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై పన్ను మినహాయింపు ఏటా ఆటోమేటిక్‌గా పెరిగే విధంగా ఉంటే బావుంటుందని తెలిపింది. ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ) మినహాయింపును పెంచాలన్న డిమాండ్‌ ఉంది. భారీ పన్ను వసూళ్లు అంచనాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకునేందుకు బడ్జెట్‌కు వెసులుబాటు ఉంటుందన్నది విశ్లేషణ.దీర్ఘకాల మూలధన ఆస్తుల నిర్వచనం మారుతుందా? దీర్ఘకాల మూలధన ఆస్తుల నిర్వచనం మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పెట్టుబడులు ఏడాదిలోపు విక్రయించినట్టయితే స్వల్పకాల, ఏడాది ముగిసిన తర్వాత విక్రయించినట్టయితే దీర్ఘకాల మూలధన ఆస్తులుగా ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. స్వల్పకాల మూలధన లాభాలపై 15 శాతం పన్ను, దీర్ఘకాల మూలధన లాభం రూ.మొదటి లక్ష తర్వాత మొత్తంపై 10 శాతం పన్ను అమలవుతోంది. అదే రియల్‌ ఎస్టేట్‌ను 24 నెలలు నిండినప్పుడే దీర్ఘకాల మూలధన ఆస్తిగా చూస్తున్నారు. వివిధ సాధనాల మధ్య గందరగోళం లేకుండా ఏకరూపత తీసుకురావచ్చన్న అంచనాలున్నాయి. అంటే ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన ఆస్తుల కాలాన్ని రెండేళ్లకు పెంచడం లేదంటే రియల్‌ ఎస్టేట్‌ సాధనానికి రెండేళ్లకు బదులు ఏడాది కాలాన్ని దీర్ఘకాల ఆస్తిగా నిర్ణయించొచ్చని భావిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు ఏడాదికే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు కలి్పస్తే మార్కెట్లోకి ఎక్కువ ప్రాపరీ్టలు విక్రయానికి వచ్చి, రేట్ల పెరుగుదల ఒత్తిడి తగ్గుతుందనే అంచనాలు సైతం ఉన్నాయి. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులకు రెండేళ్లకు పెంచితే అది కొంత నిరుత్సాహపరిచే అవకాశం లేకపోలేదు. ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభం మొదటి రూ.లక్షకు పన్ను ఉపశమనం ఉండగా, దీన్ని రూ.2 లక్షలు చేయాలని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) ఆర్థిక మంత్రిని కోరింది.ఉపాధి ప్రస్తుత పరిస్థితి: తలసరి ఆదాయాన్ని పెంచడం ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటి. ప్రపంచంలో టాప్‌–10 ఆర్థిక వ్యవస్థల్లో జీడీపీ పరిమాణం పరంగా 3,942 బిలియన్‌ డాలర్లతో (2024 జూలై 1 నాటికి ఐఎంఎఫ్‌ డేటా) భారత్‌ ఐదో స్థానంలో ఉంది. కానీ, తలసరి ఆదాయం 2730 డాలర్లతో (రూ.2.27 లక్షలు) టాప్‌–10లో చివరి స్థానంలో ఉంది. 2014 నుంచి చూస్తే తలసరి ఆదాయం రెట్టింపైనప్పటికీ.. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే ఇది గణనీయంగా మెరుగుపడాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం వద్దనున్న ఏకైక అస్త్రం ఉపాధి కల్పన. సేవల రంగంపై ఆధారపడిన ఎకానమీని తయారీ వైపు మళ్లించడం ద్వారా ఉపాధి కల్పనను సాధించాలన్నది లక్ష్యం.అంచనాలు: ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద వివిధ రంగాల్లో కొత్తగా తయారీ కేంద్రాల ఏర్పాటు, అదనపు ఉత్పాదకతపై ప్రోత్సాహకాలు అందిస్తోంది. దిగుమతులను తగ్గించి, దేశీయంగా ఆయా ఉత్పత్తుల స్వావలంబన సాధించేందుకు (ఆత్మనిర్భర్‌ భారత్‌), ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేయాలన్న (మేక్‌ ఇన్‌ ఇండియా) లక్ష్యాలు ఇందులో అంతర్లీనంగా ఉన్నాయి. దీంతో దేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడగలవని కేంద్రం భావిస్తోంది. ఆయా దిశల్లో తాజా బడ్జెట్‌ నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.మౌలికంప్రస్తుత పరిస్థితి: దేశం పారిశ్రామికంగా మరింత పురోగతి చెందాలంటే, అందుకు మెరుగైన వసతులు అవసరం. అప్పుడే పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. కేంద్రంలోని మోదీ సర్కారు రహదారులు, రైల్వే, జలమార్గాలకు ప్రాధాన్యాన్ని పెంచింది. రైల్వే వసతుల ఆధునికీకరణపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.అంచనాలు: 2023–24లో రైల్వేలకు రూ.2.41 లక్షల కోట్లు చేయగా, ఈ విడత రూ.2.9–3 లక్షల కోట్లకు పెంచొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు రహదారుల నిర్మాణానికీ కేటా యింపులు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014 నాటికి జాతీయ రహదారుల నిడివి 91,287 కిలోమీటర్లు ఉండగా, 2023 డిసెంబర్‌ నాటికి 1,46,145 కిలోమీటర్లకు పెరిగింది. ఏటా 4,000 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం ఉండగా, దాన్ని, 12వేల కిలోమీటర్లకు విస్తరించారు. జీడీపీలో మూలధన కేటాయింపులను 3.5 శాతానికి పెంచొచ్చని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేస్తోంది. ఎకానమీ పురోగతికి మౌలిక రంగం కీలకమని భావిస్తున్న కేంద్రం ఈ విషయంలో ప్రైవేటు భాగస్వా మ్యాన్ని ప్రోత్సహించడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. బడ్జెట్‌లోనూ ఈ మేరకు నిర్ణయాలు ఉండవచ్చని అంచనా.హెల్త్‌కేర్‌ప్రస్తుత పరిస్థితి: దేశ ఉత్పాదకత పెరిగేందుకు ఆరోగ్యకర సమాజం ఎంతో అవసరం. 2023–24 బడ్జెట్‌లో ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖకు చేసిన కేటాయింపులు రూ.80,517 కోట్లు. మొత్తం బడ్జెట్‌లో 2 శాతంలోపే. 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో 13 శాతం పెంచి రూ.90,658 కోట్లు చూపించారు. ఈ నిధులు మరింత పెరగాల్సిన అవసరం ఉంది. నూతన ఔషధాల ఆవిష్కరణపై చేసే ఖర్చుకు, డయాగ్నోస్టిక్స్‌పైన జీఎస్‌టీ మినహాయించాలని, పీఎల్‌ఐ కింద ఈ రంగానికి ప్రోత్సాహకాలు పెంచాలని పరిశ్రమ కోరుతోంది. 9–14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖ ద్వారా కేన్సర్‌ నుంచి నివారణకు టీకా ఇవ్వడాన్ని సార్వత్రిక టీకా కార్యక్రమం పరిధిలోకి తేవాలన్న డిమాండ్‌ ఉంది.అంచనాలు: కేన్సర్, జీవనశైలి వ్యాధుల నివారణకు వీలుగా ప్రజారోగ్యంపై మరింత పెట్టుబడులు అవసరమన్న సూచనలను బడ్జెట్‌ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకాన్ని మరింత మందికి చేరువ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. వైద్య ఉపకరణాల దిగుమతులపై ప్రపంచంలోనే అత్యధికంగా కస్టమ్స్‌ డ్యూటీలు మన దేశంలోఉన్నాయని, వీటిని తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌ను పరిశీలించవచ్చు.విద్యారంగంవిద్యారంగానికి 2023–24 బడ్జెట్‌తో పోలిస్తే 7% తక్కువగా రూ.1.2 లక్షల కోట్లనే 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి కేటాయించారు. పూర్తిస్థాయి బడ్జెట్‌లో అయినా దీన్ని సరిదిద్దుతారేమో చూడాలి. విద్యా సేవలు, టెస్ట్‌ ప్రిపరేషన్, నైపుణ్య కోర్సులపై 18% జీఎస్‌టీ చాలా ఎక్కువన్న అభ్యంతరం ఉంది. నాణ్యమైన విద్యను అందుబాటు వ్యయాలకే అందించే దిశగా తగినన్ని పెట్టుబడులతోపాటు స్కాలర్‌íÙప్‌లు, ఆర్థిక సాయం, సులభంగా విద్యా రుణాలు లభించేలా చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థలు, ఎడ్‌టెక్‌ కంపెనీలు డిమాండ్‌ చేస్తున్నాయి. విద్యా రుణాలు సులభం కావాలన్నది డిమాండ్‌.ఎంఎస్‌ఎంఈలు దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కలి్పస్తున్న ఈ పరిశ్రమ కేంద్రం నుంచి మరింత సాయాన్ని ఆశిస్తోంది. తక్కువ వడ్డీపై రుణ సాయానికి తోడు, సులభతర రుణాలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పన, సానుకూల పన్ను విధానం, వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా నిబంధనల అమల్లో వెసులుబాటు తదితర రూపాల్లో సహకారాన్ని కోరుతోంది. ప్రతి జిల్లా స్థాయిలో ఆర్థిక కేంద్రాలు ఏర్పాటు చేసి, వసతులు కలి్పంచడం, నైపుణ్యాభివృద్ధి కల్పనతో మరింత మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నాయి. ఎస్‌ఎంఈలకు 45 రోజుల్లోగా చెల్లింపులు జరిగేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని పరిశ్రమ కోరుతోంది. హౌసింగ్‌ అందుబాటు ధరల ఇళ్లు, పర్యావరణ అనుకూల ఇళ్ల ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా డెవలపర్లకు ప్రోత్సాహకాలు కలి్పంచాలని రియల్టీ కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం విజయవంతమైన నేపథ్యంలో.. మరింత మందికి లబ్ధి చేకూరేందుకు ఈ పథకాన్ని 2.0 రూపంలో తీసుకురావాలని డిమాండ్‌ చేస్తోంది. అందరికీ ఇళ్ల లక్ష్యం సాకారం దిశగా బడ్జెట్‌లో చర్యలు ఉంటాయన్న అంచనాలు పెరిగాయి. గృహ రుణాలపై రూ. 5 లక్షల వరకు వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు కల్పించాలని పరిశ్రమ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. ఈ రంగానికి పరిశ్రమ హోదా కలి్పంచాలన్న డిమాండూ ఉంది.పర్యావరణ ఇంధనాలు శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడగా, సోలార్, విండ్, గ్రీన్‌ హైడ్రోజన్‌ తదితర పర్యావరణ అనుకూల ఇంధనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదల లక్ష్యాన్ని చేరుకోవాలంటే పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టుబడులకు ప్రోత్సాహం ఉండాలని, శుద్ధ ఇంధన వనరులకు మళ్లేందుకు, ఈ దిశగా పరిశోధన, అభివృద్ధికి తగినంత ప్రోత్సాహం అందించాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న దశలో ఫేమ్‌ పథకం ద్వారా సబ్సిడీలు తొలగించడం సరికాదని పరిశ్రమ భావిస్తోంది.బ్యాంకింగ్‌ బ్యాంకింగ్‌ ఎకానమీ పురోగతిలో కీలకమని కేంద్రం భావిస్తోంది. ఈ రంగంలో సంస్కరణలకు వీలుగా బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1949, ఇతర చట్టాలకు సవరణలను బడ్జెట్‌లో ప్రతిపాదించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లను ప్రైవేటీకరించాలంటే బ్యాంకింగ్‌ కంపెనీల చట్టం 1970, బ్యాంకింగ్‌ కంపెనీల చట్టం 1980లకు సవరణలు తప్పనిసరి. ఈ రెండు చట్టాలు బ్యాంకుల జాతీయకరణ సమయంలో తెచ్చినవి. వీటిల్లో సవరణలతో ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ప్రైవేటీకరణకు, ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51 శాతం లోపునకు తగ్గించుకునేందకు వీలు లభిస్తుంది.మోదీ సర్కారు రహదారులు, రైల్వేలు, జల్‌శక్తి, కమ్యూనికేషన్లకు పెద్ద పీట వేస్తున్నట్టు గత నాలుగు బడ్జెట్‌ కేటాయింపులు పరిశీలిస్తే తెలుస్తోంది. విద్య, వైద్యానికీ కేటాయింపులు పెంచినప్పటికీ రహదారులు, రైల్వేల స్థాయిలో లేకపోవడాన్ని గమనించొచ్చు. ముఖ్యంగా దేశ రక్షణ కోసమే పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తున్నట్టు ఈ పట్టికను పరిశీలిస్తే తెలుస్తుంది. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Truck Dumps Gravel On Women At Madhya Pradesh Rewa
హార్ట్‌ బ్రేకింగ్‌ వీడియో​: బ్రతికుండగానే మహిళలను మట్టిలో పూడ్చేయత్నం!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బ్రతికుండగానే ఇద్దరు మహిళలను మట్టిలో పూడ్చేసి చంపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కొందరు సదరు మహిళలను రక్షించారు. అయితే, ఈ ఘటనకు భూవివాదమే కారణమని తెలుస్తోంది.వివరాల ప్రకారం.. రేవా జిల్లాలోని హినౌతాలో కొందరు వ్యక్తులు ఓ ట్రక్కులో మట్టిని తీసుకువచ్చి ఇద్దరు మహిళను పూడ్చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే, మన్‌గావా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా, రోడ్డు నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ కొందరు మహిళలు నిరసనలకు దిగారు. The result of 20 years of misgovernance by BJP is that goons have flourished in every district. This viral video is from village Mangava in Rewa district of Madhya Pradesh, in which women were forced to commit murder by some goons. And an attempt was made to take his life.… pic.twitter.com/2oF1KnhwI7— Bhopal Congress (@Bhopalinc) July 21, 2024 ఈ సందర్భంగా రోడ్డు వేస్తున్న భూమిని తాము తీజుకు తీసుకున్నామని ఆందోళన చేపట్టారు. వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నేలపై బైఠాయించిన ఇద్దరు మహిళలను పట్టించుకోని ట్రక్కు డ్రైవర్‌.. అందులోని మట్టిని వారిపై పారపోశాడు. అప్పటికే వాళ్ల నడుము వరకు మట్టి పూడుకుపోయింది. దాంతో అప్రమత్తమైన స్థానికులు వారిద్దరిని రక్షించి, స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను భోపాల్‌ కాంగ్రెస్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని బీజేపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Leaders Attack On YSRCP Supporter At Chandragiri
చంద్రగిరిలో రెచ్చిపోయిన పచ్చమూక.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి

సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పచ్చ మూకల దాడులు పెరిగాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు కపిలేశ్వర్‌ రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో రుయా ఆసుపత్రికి తరలించారు.కాగా, చంద్రిగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పాకాల టౌన్ యూత్ ప్రెసిడెంట్‌ కపిలేశ్వర్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఓట్లవారిపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వర్ చౌదరి, మరో 20 మంది టీడీపీ కార్యకర్తలు కపిలేశ్వర్ రెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో కపిలేశ్వర్‌ రెడ్డి తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, వెంటనే ఆయనను తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. ఇక, ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

YSRCP Demands Special Status To AP In All Party Meeting
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. అఖిలపక్ష భేటీలో వైఎస్సార్‌సీపీ డిమాండ్‌

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితులను వైఎస్సార్‌సీపీ వివరించింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేయగా, టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్‌ చేసింది.ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతాం: విజయసాయిరెడ్డిఅఖిల పక్ష భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో 45 రోజుల్లో 39 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని.. ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతామన్నారు. ఢిల్లీలో బుధవారం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బ్లాక్‌ మెయిల్‌ చేసే మీడియాను అడ్డుకునే చట్టం తీసుకురావాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.కాగా, పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న (శనివారం) ఆయన తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో అనునరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు.రాష్ట్రంలో హత్యలు, హత్యా­యత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండను యావత్‌ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఈ నెల 24వ తేదీ బుధవారం నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని వైఎస్‌ జగన్‌ చెప్పారు.గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరించి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోదామని ఎంపీలకు సూచించారు. ధర్నా అనంతరం పార్లమెంట్‌కు హాజరై రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలనపై గళమెత్తాలని దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను తమ సభల్లోని సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్భోధించారు.

Former SIB Chief Prabhakar Rao is hiding in America
రావును రప్పించగలరా?

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావును అమెరికా నుంచి వెనక్కు రప్పించడం అంత తేలిక కాదని తెలుస్తోంది. ఆయన వైద్యపరమైన కారణాలతో ఆ దేశంలో ఉండటం, ఇంటర్‌పోల్‌ కేవలం బ్లూకార్నర్‌ నోటీసు మాత్రమే జారీ చేసే అవకాశం ఉండటంతో దర్యాప్తు అధికారులు ఆయన డిపోర్టేషన్‌ (బలవంతంగా రప్పించడం) పై మల్లగుల్లాలు పడుతున్నారు. సుదీర్ఘకాలం ఎస్‌ఐబీ చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావు గత డిసెంబర్‌ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి రాజీనామా చేశారు. అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు, తదితర పరిణామాలను గమనించిన ఆయన తిరుపతికి ప్రయాణమై కనీసం కుటుంబీకులకు కూడా చెప్పకుండా అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లో వైద్యం చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. గత నెల 12న ప్రభాకర్‌రావు కుమారుడిని విచారించిన పోలీసులు ఆయన తిరిగి ఎప్పుడు వస్తారని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్‌రావు ఇటీవల ఈ–మెయిల్‌ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాశారు. జూన్‌ నాటికి పూర్తిగా కోలుకుని తిరిగి వచ్చేస్తానని భావించానని, నిరాధార ఆరోపణలతో కలిగిన మానసిక వేదన కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. బ్లూ కార్నర్‌ నోటీసు జారీ అయినప్పటికీ... హైదరాబాద్‌ పోలీసులు ప్రభాకర్‌రావుపై తొలుత ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయించాలని భావించారు. అయితే ఆ విభాగం దృష్టిలో ఈ కేసు అంత తీవ్రమైంది కాదనే ఉద్దేశంతో బ్లూ కార్నర్‌ నోటీసుల జారీ కోసం సీబీఐని ఆశ్రయించారు. ఇవి జారీ అయినా ఇంటర్‌పోల్‌ ప్రభాకర్‌రావు ఆచూకీ కనిపెట్టి, ఆయన కదలికలపై నిఘా ఉంచుతుంది తప్ప బలవంతంగా తిప్పి పంపదు. ఒకవేళ ఏదో ఒకవిధంగా డిపోర్టేషన్‌ ఉత్తర్వులు పొందినా.. అవి అమెరికా న్యాయవ్యవస్థ ఆమోదం పొందాలి. అమెరికా న్యాయవ్యవస్థ వద్ద వెయ్యికిపైగా వివిధ నోటీసులు పెండింగ్‌లో ఉండగా.. ఇప్పటివరకు కేవలం 56 నోటీసుల అమలుకే అనుమతి ఇ చ్చింది. అమెరికా వంటి దేశాల్లో వ్యక్తుల ప్రాణాలు, ఆరోగ్యానికి విలువ ఎక్కువ. ప్రభాకర్‌రావు అక్కడ మెడికల్‌ గ్రౌండ్స్‌పై ఉంటున్నందున ఆయనపై నోటీసు జారీ అయినా డిపోర్టేషన్‌కు అనుమతించే అవకాశాలు చాలా తక్కువే. వీసాగడువులో మతలబులుఎన్నో...తరచూ అమెరికాకు వెళ్లి వస్తున్న ఆయా వ్యక్తుల కుటుంబీకులు, అక్కడే ఉంటున్న ప్రభాకర్‌రావు వంటి వారికి సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల గడువుతో కూడిన వీసాలు లభిస్తుంటాయి. అయితే ఒకసారి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత గరిష్టంగా 180 రోజులలోపు తిరిగి బయటకు వచ్చేయాలనే నిబంధన ఉంది. దీంతో ప్రస్తుతం ఆయన 179 రోజులు అక్కడ ఉండి, ఆపై కెనడా లేదా మరో దేశానికి కొన్ని రోజులు వెళ్లి వస్తే.. మళ్లీ 179 రోజులు అమెరికాలో ఉండే అవకాశం దక్కుతుంది. ప్రభాకర్‌రావు వైద్యం చేయించుకుంటున్న నేపథ్యంలో వీసా గడువు తేలిగ్గా పొడిగించుకునే అవకాశం ఉంది. రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయం ద్వారా ఆయన పాస్‌పోర్టు రద్దుకు ప్రయత్నాలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది కూడా ఆశించిన ఫలితం ఇవ్వదని కొందరు నిపుణులు చెబుతున్నారు.

Sri Dasarathi Krishnamacharya Satha Jayanti Will Start July 22
ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ దివిలో విరిసిన పారిజాతమోఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమోనా మదిలో నీవై నిండిపోయెనే...ఈ పాట ఉన్న సినిమా పేరు చాలామందికి తెలియకపోవచ్చు. సినిమా విడుదలయ్యి 50 సంవత్సరాలయ్యిందని కూడా తెలియకపోవచ్చు. హీరో ఎవరో. హీరోయిన్‌ ఎవరో. కాని పాట నిలిచింది. రాసిన దాశరథి నిలిచారు. పాడిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా. ‘నిదుర మబ్బును మెరుపు తీగవై కలను రేపినది నీవే’ అని ఇదే పాటలో రాశారు దాశరథి. సినిమా సంగీత ఆకాశంలో కొన్ని నిదుర మబ్బులను తన రాకతో దాశరథి చెదరగొట్టారు. కొన్ని దివ్య పద ద్వారాలను తెరిచారు.దివి నుంచి భువికి దిగి వచ్చె దిగి వచ్చెపారిజాతమే నీవై నీవైఇది ‘తేనె మనసులు’ కోసం దాశరథి రాశాక కె.వి.మహదేవన్‌ ట్యూన్‌ చేసిన పాట. కాని ‘ఇద్దరు మిత్రులు’ కోసం సాలూరి రాజేశ్వరరావు హార్మోనియం పెట్టెను ముందరేసుకుని ‘మీరు ట్యూన్‌కి రాస్తారా, రాస్తే నన్ను ట్యూన్‌ చేయమంటారా?’ అని అడిగారు దాశరథిని. బహుశా దాశరథి ఆ క్షణంలో నవ్వుకుని ఉంటారు. నిజాము మీద యుద్ధగళం విప్పి వరంగల్‌ జైలులో బందీ అయినపుడు ఒక రాత్రి ఆయనను ఉన్నట్టుండి ఇతర రాజకీయ ఖైదీలతో కలిపి నిజామాబాద్‌ జైలుకు బయలుదేరదీశారు పోలీసులు.అది డిసెంబర్‌ నెల. రాత్రి. భయంకరమైన చలి. ఎక్కడకు తీసుకెళుతున్నారో తెలియని అయోమయం. దాశరథి ఆ చలిలో, బిక్కచచ్చిన తోటి రాజకీయ ఖైదీలను ఉత్తేజపరుస్తూ కవిత్వం అందుకున్నారు. ఆశువుగా. తెగిపడే కంఠంతో. ఒక్కో కవితా కాగడ. వెచ్చదనం రాజేస్తున్న నెగడు.అలాంటి దాశరథికి– పళ్లు తోముకోవడానికి బొగ్గుముక్క ఇస్తే జైలు గోడలను కవిత్వంతో నింపిన దాశరథికి– ట్యూన్‌ ఇస్తే ఎంత. నేరుగా రాయమంటే ఎంత. ‘ఎలాగైనా పర్వాలేదండీ’ అన్నారు దాశరథి. సాలూరు ట్యూన్‌ ఇచ్చారు. ‘నేను తాంబూలం వేసుకు వస్తాను. ఆలోచిస్తూ ఉండండి’ అని బయటకు వెళ్లి వచ్చిన ఆయన ఎర్రబడ్డ నోటిని ఆశ్చర్యంతో తెరిచారు. పల్లవి రెడీ!ఖుషీ ఖుషీగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూహుషారు గొలిపేవెందుకే నిషా కనులదానాఈ ఖుషీ ఆ నిషా అప్పటి వరకూ తెలుగు పాట ఎరగదు. ఇది దాశరథి ఇచ్చిన హైదరాబాద్‌ టచ్‌. దక్కనీ మిఠాస్‌. పాట హిట్‌ అయ్యింది. దాశరథి నుంచి ‘గాలిబ్‌ గీతాల’ సంపుటిని అంకితం తీసుకున్నందుకు అక్కినేని ‘ఇద్దరు మిత్రులు’ ద్వారా ఇచ్చిన అవకాశం కవికి విజయావకాశంగా మారింది. తెలుగు పాట దాశరథిని చూసి ఇలా అంది –నా కంటి పాపలో నిలిచిపోరానీ వెంట లోకాల గెలవనీరాఇద్దరు హైదరాబాద్‌ కవులు ఒక సంవత్సరం తేడాలో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు. మొదట అక్కినేని ద్వారా దాశరథి (1961). తర్వాత ఎన్టీఆర్‌ ద్వారా సి. నారాయణ రెడ్డి (1962). దాశరథిది మొదటి నుంచి పోరుగీతం. ఆయన స్వయంగా నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు. అజ్ఞాతంలో ఉన్నారు. జైలులో బాధలు పడ్డారు. ఆల్‌ ఇండియా రేడియోలో 1956 నుంచి ’71 వరకూ ఉద్యోగాన్ని కాపాడుకుంటూ సినిమా కవిగా అవకాశాలు ఉపయోగించుకున్నారు.1977 నుంచి ’83 వరకు అంటే ఎన్టీఆర్‌ వచ్చి రద్దు చేసే దాకా దాశరథి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆఖరు ఆస్థానకవి. ఆ పదవిలో ఉండగా సినిమా గీతాలు ఆయన పెద్దగా రాయలేదు. దానికి తోడు 1987లో 62 ఏళ్ల వయసులో ఎదురైన అకాల మరణం దాశరథికి సుదీర్ఘ సినిమా కెరీర్‌ లేకుండా చేసింది. ఆయన సుమారు 620 పాటలు రాసి ఉండవచ్చు. రాసింది తక్కువైనా హిట్‌ అయినవి ఎక్కువ. చెట్టు పిట్ట కూడా పాడుకున్న పాట ఆయనది.గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుందిసెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముందిఅన్నపూర్ణ, ఆదుర్తి ఇలా ఒకటి రెండు అనుబంధాలు తప్ప దాశరథి ప్రత్యేకంగా ఏదో ఒక గ్రూప్‌తో లేదా సంస్థతో కలిసి ఉన్నట్టు లేదు. సినిమా రంగంలో ప్రతిభతో పాటు పి.ఆర్‌ కూడా ముఖ్యం. తిరగబడే కవికి అలాంటి స్వభావం తక్కువ. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత ఉడుకునెత్తురు కవికి సినిమాలో ఆవేశ కావేశాల పాటలు ఏమాత్రం దక్కలేదు. చాలా మటుకు ప్రేమగీతాలు, ఎన్నటికీ మాయని యుగళగీతాలు.ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదిఎన్నటికీ మాయని మమత నాది నీదిదాశరథి కుటుంబ అనుబంధాలను రాశారు. ‘అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’ ఆయనదే. ‘బాబూ వినరా... అన్నాదమ్ముల కథ ఒకటి’... ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట’.... అలాగే కవ్వింతలూ రాశారు... ‘అది ఒక ఇదిలే అతనికి తగులే’... భార్య అలక భర్త వేడుకోలు... ‘ఓ చెలి కోపమా... అంతలో తాపమా’... ఊరడింపు ‘గోరొంక గూటికే చేరావు చిలక... భయమెందుకే నీకు బంగారు మొలక’... దరఖాస్తు... ‘విన్నవించుకోనా... చిన్న కోరిక’... ‘కాజల్‌’ సినిమా కోసం సాహిర్‌ రాసిన ‘ఛూలేనేదో నాజూక్‌ హోటోంకో’ విఖ్యాత గీతాన్ని దాశరథి ఎంత కోమలంగా తెలుగు చేశారో చూడండి. ‘తాగాలి’ కాదు ‘తాకాలి’ అన్నారు.నీ లేత గులాబి పెదవులతోకమ్మని మధువును తాకాలిదాశరథికి కృష్ణ అనుబంధం ఉంది. దైవబంధం ఉంది. ఆయన పాటలు ఆలయాల్లో నేటికీ సుప్రభాత గీతాలు. ‘పాడెద నీ నా నామమే గోపాల’... ‘రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య’, ‘కన్నయ్యా... నల్లని కన్నయ్య’... ‘మనసే కోవెలగా... మమతలు మల్లెలుగా... నిన్నే కొలిచెదరా... కృష్ణా’... ‘నేనె రాధనోయి గోపాలా’... ‘నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో’... ‘మము పాలింపగ నడిచి వచ్చితివా’... వాణి జయరామ్‌కు దాశరథి వల్ల దక్కిన పూలసజ్జ వంటి గీతం చూడండి.పూజలు చేయ పూలు తెచ్చానునీ గుడి ముందే నిలిచానుతీయరా తలుపులను రామా...దాశరథికి వీణ ఇష్టం. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నారు. సినిమా గీతాల్లో కూడా ఆయన ఈ వీణానాదాన్ని పలికించారు. ‘మదిలో వీణలు మ్రోగె’... ‘నీవు రావు నిదుర రాదు’.. ‘వేణుగాన లోలునిగన వేయి కనులు చాలవులే’.... ఇక ఈ పాట?మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోనాఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే....నేటి నుంచి దాశరథి శతజయంతి సంవత్సర వేడుకలు మొదలుకానున్నాయి. సినిమా రంగం, సినీ సంగీత రంగం, సినీ గేయకర్తలు, అభిమానులు సమావేశాలు, సంగీత విభావరులు నిర్వహించుకుని దాశరథి పాటలను మళ్లీ తలుచుకుని పాడుకోవాల్సిన సందర్భం ఇది. అయితే మన సినిమా రంగానికి పెద్దగా ఇటువంటి వాటికి సమయం ఉండదు. కాని ప్రజల వద్ద శ్రోతల వద్ద ఉంటుంది. సత్కవిని తమ నాల్కల యందు నుంచి కడిగేసే మూర్ఖులు ఎంతమాత్రం కారు వారు. పాడుకుంటూ ఉంటారు. పాడుతూనే ఉంటారు. వారికి తనివి తీరదు.తనివి తీరలేదే నా మనసు నిండలేదేఏనాటి బంధమీ అనురాగం – కె

Advertisement
Advertisement
Advertisement
National View all
title
రాష్ట్రపతి పాలన విధించాల్సిందే

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల

title
కాళేశ్వరంపై సొంత నిర్ణయాలు వద్దు

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సహా ఇత

title
రీల్స్‌ కోసం కెమెరా కొనేందుకు ఓనర్‌ ఇంట్లో చోరీ

ఢిల్లీ: ఇన్‌స్ట్రామ్‌లో రీల్స్‌ చేసి ఫేమస్‌ కావాలనుకున్న ఓ ప

title
హార్ట్‌ బ్రేకింగ్‌ వీడియో​: బ్రతికుండగానే మహిళలను మట్టిలో పూడ్చేయత్నం!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది.

title
‘బీజేపీతో పొత్తుపై పునరాలోచించండి’.. సీఎం నితీష్‌కు పార్టీ నేత విజ్ఞప్తి

శ్రీనగర్‌: బీజేపీకి సొంతంగా మెజార్టీ దక్కకపోవటంతో మిత్రపక్షం

International View all
title
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్‌

అమెరికా అధ్యక్ష‍్య ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

title
చైనాపై పడని మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఎందుకో తెలుసా?

మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య ప్రపంచంలోనే చాలా దేశాలను అతలాకుతలం చేశాయి.

title
రష్యా సరిహద్దులో హైటెన్షన్‌.. యూఎస్‌ బాంబర్‌ విమానాలు ప్రత్యక్షం!

మాస్కో: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ రష్యా, అమె

title
అమెరికాలో దారుణం.. భారత సంతతి నవ వరుడు హత్య

వాషింగ్టన్‌: ఇటీవల కాలంలో అమెరికాలో భారత సంతతి వ్యక్తులపై వర

title
బంగ్లాదేశ్‌లో ఆందోళనలు: సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి

NRI View all
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all