T20 World Cup 2021 SL Vs NAM: పసికూన నమీబియాపై శ్రీలంక సూపర్‌ విక్టరీ

T20 World Cup 2021: Sri Lanka Vs Namibia Live Updates And Highlights In Telugu - Sakshi

పసికూన నమీబియాపై శ్రీలంక సూపర్‌ విక్టరీ
నమీబియా నిర్ధేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు ఆరంభంలో తడబడినప్పటికీ మిడిలార్డర్‌ బ్యాటర్లు అవిష్క ఫెర్నాండో(28 బంతుల్లో 30 నాటౌట్‌; 2 సిక్సర్లు), భానుక రాజపక్స(27 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా శ్రీలంక 7 వికెట్ల తేడాతో నమీబియాపై ఘన విజయం సాధించింది. నమీబియా బౌలర్లలో స్మిట్‌, బెర్నార్డ్‌, రూబెన్‌ ట్రంపెల్మాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 
స్కోర్‌ వివరాలు: నమీబియా 96 ఆలౌట్‌.. శ్రీలంక 100/3 

లంక బౌలర్ల ధాటికి 96 పరుగులకే కుప్పకూలిన నమీబియా
లంక బౌలర్లంతా మూకుమ్మడిగా దాడి చేయడంతో పసికూన నమీబియా విలవిలలాడింది. నిర్ణీత ఓవర్లు కూడా ఆడలేక 19.3 ఓవర్లలో 96 పరుగులకే చాపచుట్టేసింది. నమీబియా జట్టులో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్‌ను చేయగలిగారు. వారిలో క్రెయిగ్‌ విలియమ్స్‌(29) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో తీక్షణ 3 వికెట్లు.. లహీరు కుమార, హసరంగ చెరో రెండు వికెట్లు.. చమీరా, కరుణరత్నే తలో వికెట్‌ పడగొట్టారు. 

10 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్‌ 54/2
లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 10 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్‌ 54/2గా ఉంది. క్రీజ్‌లో క్రెయిగ్‌ విలియమ్స్‌(15), గెర్హార్డ్‌(15) ఉన్నారు. మహీశ్‌ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు.

కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న లంక బౌలర్లు..
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా జట్టుకు లంక బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మహీశ్‌ తీక్షణ పసికూనపై చెలరేగి బౌలింగ్‌ చేస్తూ రెండు వికెట్లు పడగొట్టాడు. మూడో ఓవర్‌లో బార్డ్‌(7)ను పెవిలియన్‌కు పంపిన తీక్షణ.. ఆరో ఓవర్లో జేన్‌ గ్రీన్‌(8)ను కూడా ఔట్‌ చేశాడు. 6 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్‌ 30/2. క్రీజ్‌లో క్రెయిగ్‌ విలియమ్స్‌(9), గెర్హార్డ్‌ ఉన్నారు. 

అబుదాబీ: టీ20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ పోటీల్లో భాగంగా సోమవారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో శ్రీలంక, నమీబియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది.
తుది జట్లు: 
శ్రీలంక: కుశాల్‌ పెరీరా(వికెట్‌ కీపర్‌), పాథుమ్‌ నిషంక, దినేశ్‌ చండిమాల్‌, అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్స, దసున్‌ షనక(కెప్టెన్‌), చమిక కరుణరత్నే, వనిందు హసరంగ, దుష్మంత చమీర, మహీశ్‌ తీక్షణ, లాహిరు కుమార.

నమీబియా: స్టీఫెన్‌ బార్డ్‌, జానే గ్రీన్, క్రెయిగ్‌ విలియమ్స్‌, గెర్హాడ్‌ ఎరాస్‌మస్‌(కెప్టెన్‌),  డేవిడ్‌ వీజ్‌, జేజే స్మిత్‌, జాన్‌ ఫ్రిలింక్‌, పిక్కీ యా ఫ్రాన్స్, జాన్‌ నికోల్‌ లోఫ్టీ ఈటన్‌, రూబెన్‌ ట్రంపెల్‌మాన్‌, బెర్నార్డ్‌ షోల్ట్‌.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top