చెన్నై: భారత సంతతి ఆటగాళ్లు సంజయ్ కృష్ణ మూర్తి (33 బంతుల్లో 68; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), కెపె్టన్ మోనాంక్ పటేల్ (30 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ షోతో అదరగొట్టారు. ఫలితంగా టి20 ప్రపంచకప్‌లో అమెరికా జట్టు రెండో విజయం అందుకుంది. గ్రూప్ ‘ఎ’లో ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అమెరికా 31 పరుగుల తేడాతో నమీబియాపై గెలిచింది.
టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అమెరికా నిరీ్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. మోనంక్, జహంగీర్ (22) ఓపెనింగ్ వికెట్‌కు 68 పరుగులు జోడించి మెరుపు ఆరంభమిచ్చారు. తర్వాత సంజయ్, మిలింద్ కుమార్ (28; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 87 పరుగులు జతచేశారు. ఈ రెండు భాగస్వామ్యాలు అమెరికా భారీస్కోరుకు బాట వేశాయి. నమీబియా బౌలర్లపై ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజయ్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
నమీబియా బౌలర్లలో విలెమ్, ఎరాస్మస్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి ఓడింది. లారెన్ స్టీన్‌కాంప్ (39 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. స్మిత్ (31; 1ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. షాడ్లే వాన్‌కు 2 వికెట్లు దక్కాయి. నిరీ్ణత నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అమెరికా రెండు విజయాలు, రెండు పరాజయాలతో నాలుగు పాయింట్లు సాధించి గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానానికి చేరింది.


