హాకీలో మళ్లీ ఓడిన భారత్‌ | Indian Hockey Team lost again | Sakshi
Sakshi News home page

హాకీలో మళ్లీ ఓడిన భారత్‌

Feb 16 2026 8:43 AM | Updated on Feb 16 2026 9:24 AM

 Indian Hockey Team lost again

రూర్కెలా: సొంతగడ్డపై భారత పురుషుల హాకీ జట్టు తమ నిరాశాజనక ప్రదర్శన కొనసాగించి వరుసగా నాలుగో పరాజయం చవిచూసింది. భారత అంచె పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా 2–4 గోల్స్‌ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. భారత్‌ తరఫున ఆదిత్య లలాగే (50వ నిమిషంలో), సంజయ్‌ (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. అర్జెంటీనా జట్టుకు టడియో మారుకి (28వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ అందించగా... టొమాస్‌ డొమెనె (18వ నిమిషంలో), లూసియో మెండెజ్‌ (43వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్‌లో భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా తదుపరి మ్యాచ్‌ల కోసం భారత జట్టు ఆ్రస్టేలియాకు వెళుతుంది. హోబర్ట్‌ వేదికగా ఈనెల 21న స్పెయిన్‌తో, 22న ఆ్రస్టేలియాతో... 24న స్పెయిన్‌తో, 25న 
ఆ్రస్టేలియాతో భారత్‌ మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది.    

Advertisement
 
Advertisement
Advertisement