టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ వర్మ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి ఓవర్‌లోనే అభిషేక్ శర్మ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన తిలక్ తన జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించాడు. ఓ వైపు ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతుంటే తిలక్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ హెడ్‌కోచ్ గంభీర్ అగ్రహానికి గురయ్యాడు.
డ్రింక్స్ బ్రేక్ సమయంలో డగౌట్ నుంచి బయటకు వచ్చిన గంభీర్, తిలక్ వర్మతో చాలా సీరియస్‌గా మాట్లాడాడు. వేగంగా ఆడాలని, టార్గెట్ 170 దాటాలని గంభీర్ గట్టిగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్నర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా 24 బంతుల్లో 104.17 స్ట్రైక్ రేటుతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు.
— crictalk (@crictalk7) February 15, 2026


