IND vs PAK: అరెరే అభిషేక్.. ఇలా చేశావేంటి? | Two ducks in two matches: Abhishek Sharma falls in four balls vs Pakistan | Sakshi
Sakshi News home page

IND vs PAK: అరెరే అభిషేక్.. ఇలా చేశావేంటి?

Feb 15 2026 7:34 PM | Updated on Feb 15 2026 7:48 PM

Two ducks in two matches: Abhishek Sharma falls in four balls vs Pakistan

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌ తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్నాడు. అమెరికాతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో డ‌కౌటైన అభిషేక్‌.. ఇప్పుడు కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్‌లో అదే తీరును క‌న‌బ‌రిచాడు. భార‌త ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ వేసిన పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి అభిషేక్ ఔట‌య్యాడు.

అమెరికాతో మ్యాచ్ త‌ర్వాత అభిషేక్ కడుపు ఇన్ఫెక్షన్ గుర‌య్యాడు. దీంతో న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. అయితే పూర్తి ఫిట్‌నెస్ పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు. దాయాది జ‌ట్టుకు అభిషేక్ చుక్క‌లు చూపిస్తాడు అని భార‌త అభిమానులు భావించారు.

కానీ ఈ పంజాబీ బ్యాట‌ర్ త‌న చెత్త బ్యాటింగ్‌తో అంద‌రిని నిరాశ‌ప‌రిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు అభిషేక్‌ను ఉద్దేశించి పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అఘా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. అభిషేక్ శ‌ర్మ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, మ్యాచ్‌లో ఆడాల‌ని కోరుకుంటున్న‌ట్లు స‌ల్మాన్ పేర్కొన్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే తొలి ఓవ‌ర్ వేసిన సల్మాన్‌.. అభిషేక్‌పై పైచేయి సాధించాడు. దీంతో అభిషేక్‌ను ఔట్ చేసిన అనంత‌రం స‌ల్మాన్ సంబ‌రాల్లో మునిగితేలిపోయాడు.

తుది జ‌ట్లు
భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

పాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్‌), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్

Advertisement
 
Advertisement
Advertisement