పాకిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం | T20 World Cup 2026: India vs pakistan live updates and Highlights | Sakshi
Sakshi News home page

T20 WC 2026 IND vs PAK: పాకిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

Feb 15 2026 6:30 PM | Updated on Feb 15 2026 10:48 PM

T20 World Cup 2026: India vs pakistan live updates and Highlights

India vs pakistan Match live Updates: పాకిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 61 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాక్‌.. భార‌త బౌల‌ర్ల దాటికి 18 ఓవ‌ర్ల‌లో 114 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పాక్ బ్యాట‌ర్ల‌లో ఉస్మాన్ ఖాన్‌(44) ఒక్క‌డే మెరుగ్గా రాణించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. భార‌త బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, బుమ్రా తలా రెండు వికెట్లు సాధించారు.
 

👉16వ ఓవ‌ర్ వేసిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో పాక్ వరుస‌గా రెండు వికెట్లు కోల్పోయింది.  17 ఓవ‌ర్ల‌కు పాక్ స్కోర్‌: 109/7

విజ‌యానికి చేరువ‌లో భార‌త్
79 ప‌రుగుల వద్ద పాక్ ఏడో వికెట్ కోల్పోయింది. 14 ప‌రుగులు చేసిన షాదాబ్ ఖాన్ తిల‌క్ వ‌ర్మ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

పీక‌ల్లోతు క‌ష్టాల్లో పాక్‌
78 ప‌రుగుల వ‌ద్ద పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన మ‌హ్మ‌ద్ నవాజ్‌.. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.
👉ఉస్మాన్ ఖాన్‌(44) రూపంలో పాకిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది.

ఉస్మాన్ ఖాన్ దూకుడు..
9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పాకిస్తాన్ 4 వికెట్ల న‌ష్టానికి 66  ప‌రుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ 40 ప‌రుగుల‌తో దూకుడుగా ఆడుతున్నాడు.

పాక్ నాలుగో వికెట్ డౌన్‌
34 ప‌రుగుల వ‌ద్ద పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 ప‌రుగులు చేసిన బాబ‌ర్ ఆజం.. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 6 ఓవ‌ర్ల‌కు పాక్ స్కోర్‌: 38/4
పాక్ మూడో వికెట్ డౌన్‌
13 ప‌రుగుల వద్ద పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది.  4 ప‌రుగులు చేసిన స‌ల్మాన్ అలీ అఘా.. బుమ్రా బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

పాకిస్తాన్‌కు భారీ షాక్‌
176 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు తొలి ఓవ‌ర్‌లోనే గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సాహిబ్జాదా ఫర్హాన్ డ‌కౌట‌య్యాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో సైమ్ అయూబ్‌(6) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 6 ప‌రుగుల‌కే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది.
పాక్ టార్గెట్ ఎంతంటే?
కొలంబో వేదిక‌గా పాక్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు స‌త్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ విధ్వంసం సృష‍్టించాడు.  40 బంతులు ఎదుర్కొన్న కిష‌న్‌.. 10 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 77 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

అత‌డితో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్‌(32), తిల‌క్ వ‌ర్మ‌(25), శివమ్ దూబే(32) రాణించారు. పాక్ బౌల‌ర్ల‌లో సైమ్ అయూబ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స‌ల్మాన్ అఘా, ఉస్మాన్ త‌రీఖ్, అఫ్రిది త‌లా వికెట్ సాధించారు.

సూర్య కుమార్ ఔట్
159 ప‌రుగుల వ‌ద్ద కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. 32 ప‌రుగులు చేసిన సూర్య‌..  ఉస్మాన్ త‌రీఖ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 19 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్: 159/5

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు
టీమిండియా ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. 15 ఓవ‌ర్ వేసిన సైమ్ అయూబ్ బౌలింగ్‌లో తిల‌క్ వ‌ర్మ‌(25) రెండో బంతికి వికెట్లు ముందు దొరికిపోగా.. నాలుగో బంతికి హార్దిక్ పాండ్యా డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

నిల‌క‌డ‌గా ఆడుతున్న సూర్య‌, తిల‌క్
ఇషాన్ కిష‌న్ ఔటైన అనంత‌రం కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌(21), తిల‌క్ వ‌ర్మ(25) ఆచితూచి ఆడుతున్నారు. 14 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్: 125/2
ఇషాన్ కిష‌న్ ఔట్
ఇషాన్ కిష‌న్ ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. 40 బంతుల్లో 77 ప‌రుగులు చేసిన కిష‌న్‌.. సైమ్ అయూబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 9 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్: 89/2

చెల‌రేగి ఆడుతున్న ఇషాన్‌
పాక్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిష‌న్ చెల‌రేగి ఆడుతున్నాడు. కేవ‌లం 27 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఇషాన్ 72 ప‌రుగులతో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 8 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్: 82/1

దూకుడుగా ఆడుతున్న ఇషాన్‌
5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ వికెట్ న‌ష్టానికి 41 ప‌రుగులు చేసింది. అభిషేక్ తొలి ఓవ‌ర్‌లోనే వెనుదిరిగిన‌ప్ప‌టికి కిష‌న్ మాత్రం(36) దూకుడుగా ఆడుతున్నాడు.

అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్‌
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ డ‌కౌట‌య్యాడు. స‌ల్మాన్ అలీ బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు. ఇషాన్ కిష‌న్(12) మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. 2 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్: 16/1

బౌలింగ్ ఎంచుకున్న పాక్‌
కొలంబో వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న గ్రూపు-ఎ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ బ్లాక్‌బాస్ట‌ర్ మ్యాచ్‌లో భార‌త్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. 

న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మైన విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. దీంతో సంజూ శాంస‌న్‌పై వేటు ప‌డింది. అదేవిధంగా అర్ష్‌దీప్ సింగ్ స్ధానంలో కుల్దీప్ యాద‌వ్‌కు అవ‌కాశం ద‌క్కింది. పాక్ మాత్రం త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు.

తుది జ‌ట్లు
భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

పాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్‌), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్

కాసేపటిలో టాస్‌
టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మెగా పోరుకు స‌ర్వం సిద్ద‌మైంది. మరి కాసేపటిలో కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ షూరూ కానుంది. ఇప్ప‌టికే మైదానానికి చేరుకున్న ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు వార్మాప్ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement