భారత్‌-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లు.. నవ్‌జోత్‌ సింగ్‌ సిద్దూ కీలక వ్యాఖ్యలు | Navjot Singh Sidhu Backs India vs Pakistan Bilateral Series After Asia Cup Rising Stars Fiasco | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లు.. నవ్‌జోత్‌ సింగ్‌ సిద్దూ కీలక వ్యాఖ్యలు

Nov 23 2026 3:54 PM | Updated on Nov 23 2026 4:08 PM

Navjot Singh Sidhu Backs India vs Pakistan Bilateral Series After Asia Cup Rising Stars Fiasco

source: X

భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లపై టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లు మళ్లీ ప్రారంభం కావాలని అభిప్రాయపడ్డాడు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు. క్రికెట్ రెండు దేశాల మధ్య స్నేహబంధాన్ని పెంపొందించగలదని పేర్కొన్నాడు.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా భారత్‌, పాకిస్తాన్-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో సిద్ధూ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఐఎల్‌టీ20 కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధూ.. భారత్, పాక్‌ మధ్య క్రికెట్ సంబంధాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. రెండు దేశాల మధ్య మ్యాచ్‌లు జరగాలా వద్దా అనే నిర్ణయం ప్రభుత్వాలదేనని స్పష్టం చేశాడు. క్రీడలను రాజకీయాలకు దూరంగా చూడాలని కోరాడు.

భారత్‌, పాకిస్తాన్-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్న వాగ్వాదంపై  మాట్లాడుతూ.. గతంలోనూ భారత్, పాక్‌ ఆటగాళ్ల మధ్య మైదానంలో తీవ్ర పోటీ ఉండేదని, అయితే అది క్రీడాస్ఫూర్తికి సంబంధించినదేనని గుర్తుచేశాడు. తాను, పాక్‌ దిగ్గజ బౌలర్‌ వసీం అక్రం మంచి స్నేహితులమని చెప్పాడు. కానీ దేశం తరఫున ఆడుతున్నప్పుడు మాత్రం ఇద్దరం తగ్గమని అన్నాడు.

భారత్-పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు రెండు దేశాలకూ కీలక ఘట్టాలుగా సిద్దూ అభివర్ణించాడు. రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు వాటిని తగ్గించడంలో క్రికెట్ దౌత్యం (క్రికెట్ డిప్లొమసీ) కీలక పాత్ర పోషించగలదని అభిప్రాయపడ్డాడు.

కాగా, భారత్, పాక్‌ మధ్య చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ 2012 డిసెంబర్‌లో జరిగింది. అప్పుడు పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించి రెండు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరగలేదు.

ఇదీ చదవండి: WTC Final: టీమిండియా అవకాశాలు మరింత సంక్లిష్టం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement