Photo Credit: Twitter
న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పారు. వెల్లింగ్టన్ వేదికగా టీమిండియాతో ముగిసిన తొలి టెస్టులో ఈ జోడీ రెండో ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లు (259 బంతులు) ఏకధాటిగా ఆడి టీమిండియా విజయాన్ని అడ్డుకున్నారు. ఇందులో డారిల్ మిచెల్ (186 బంతుల్లో 49 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (126 బంతుల్లో 26 నాటౌట్) కడదాకా నిలిచారు. మొత్తంగా ఇద్దరు కలిసి 259 బంతులెదర్కొని 63 పరుగులు జోడించారు.
ఈ నేపథ్యంలోనే కివీస్ తరఫున టెస్టుల్లో ఒక అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. అదేంటంటే, భారత్‌తో టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో సుదీర్ఘ ఓవర్లు బ్యాటింగ్ చేయడం న్యూజిలాండ్‌కు ఇది రెండోసారి. 2014లో భారత్‌తో జరిగిన టెస్టులో బ్రెండన్ మెక్‌కల్లమ్, బీజే వాట్లింగ్ ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 123 ఓవర్లలో 352 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టెస్టుల్లో ఈ జోడి సాధించిన మారథాన్ పరుగులు ఇప్పటికీ ఆల్ టైమ్ రికార్డుగా ఉండడం విశేషం.
భారత్‌కు కొరకరాని కొయ్యలా..
ఇక న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ డారిల్ మిచెల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరముంది. ఎందుకంటే టీమిండియాతో మ్యాచ్ అంటేనే డారిల్ మిచెల్‌కు పూనకం వస్తుంది. గతంలోనూ భారత్‌తో కివీస్ ఆడిన మ్యాచ్‌ల్లో డారిల్ మిచెల్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడడంతో పాటు జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

Photo Credit: Twitter
భారత్‌తో తలపడే ప్రతిసారి న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ తన దూకుడైన ఆటతో టీమిండియా బౌలర్లకు సవాలు విసురుతూనే వస్తున్నాడు. ఇటీవలి టీ20, వన్డే సిరీస్‌లలో కూడా మిచెల్ కీలక ఇన్నింగ్స్‌లతో మెరిశాడు. తాజాగా తొలి టెస్టులోనూ మిచెల్ కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విజయాన్ని దూరం చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. డారిల్ మిచెల్ భారత్ విజయాలను అడ్డుకోవడం ఇదేమి కొత్త కాదు.
ఈ ఏడాది జనవరిలో టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడింది. మిచెల్ తన చివరి నాలుగు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా మూడు సెంచరీలు బాదడం విశేషం. ఇండియాలో ఈ కివీస్ వీరుడు వరుసగా 130, 134,84, 131 పరుగులు చేశాడు. నాలుగు ఇన్నింగ్స్ ల్లో 159 యావరేజ్ తో 479 పరుగులు చేశాడు.

Photo Credit: Twitter
వన్డే ప్రపంచకప్‌లో సెంచరీలు
అంతకముందు 2023 వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో డారిల్ మిచెల్ (134) శతకం బాది టీమిండియాకు చుక్కలు చూపించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 397 పరుగులు చేయడంతో ఓటమి నుంచి బయటపడింది. అదే టోర్నీలో లీగ్ దశలోనూ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకంతో మెరిశాడు.
మొత్తంగా భారత్‌తో ఆడిన 10 వన్డేల్లో 604 పరుగులు సాధించిన మిచెల్ ఖాతాలో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక ఐదు టెస్టులు కలిపి 275 పరుగులు చేసిన మిచెల్ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
The men of the moment 🤩 Daryl and Glenn walk off the Basin Reserve after facing a combined total of 312 balls on day 5 to secure a draw. https://t.co/MIaJAoXbIU
— BLACKCAPS (@BLACKCAPS) November 23, 2026
Daryl Mitchell and Glen Phillips's valiant effort may have just ended the Indian dream of reaching WTC Final https://t.co/28WovOZev4
— Pakistan Cricket Team USA FC (@DoctorofCricket) November 23, 2026
ఇదీ చదవండి: 63 ఏళ్ల తర్వాత మరోసారి.. భారత్ ఖాతాలో అరుదైన రికార్డు


