NZ Vs IND: వెల్లింగ్ట‌న్‌లో ఇది రెండోసారి మాత్ర‌మే! | This Only-Second Drawn Test-At-Wellinton-out-off-15-Since 2015 | Sakshi
Sakshi News home page

NZ Vs IND: వెల్లింగ్ట‌న్‌లో ఇది రెండోసారి మాత్ర‌మే!

Nov 23 2026 11:52 AM | Updated on Nov 23 2026 12:00 PM

This Only-Second Drawn Test-At-Wellinton-out-off-15-Since 2015

Photo Credit: Twitter

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌, భార‌త్ మ‌ధ్య జ‌రిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ నేప‌థ్యంలో 2015 నుంచి వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన 15 టెస్టుల్లో ఒక మ్యాచ్ డ్రాగా ముగియ‌డం ఇది రెండోసారి మాత్ర‌మే. ఇంత‌క‌ముందు 2018లో కివీస్‌, శ్రీలంక మ‌ధ్య జ‌రిగిన టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో లంక తొలి ఇన్నింగ్స్‌లో 296 ప‌రుగుల ఆధిక్యం సాధించింది. 

రెండో ఇన్నింగ్స్‌లో లంక 287-3 స్కోరు వ‌ద్ద ఉన్న‌ప్పుడు మ్యాచ్ డ్రా అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. నిజానికి ఈ టెస్టులో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 16 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. దీనిని ఉప‌యోగించుకోవ‌డంలో కివీస్ విఫ‌ల‌మ‌వ్వ‌గా, లంక పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

👉ఈ ఏడాదిలో భార‌త్‌కు ఇది వ‌రుస‌గా రెండో టెస్టు డ్రా. ఆగ‌స్టులో కొలంబో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన టెస్టును భార‌త్ డ్రా చేసుకుంది. అయితే టీమిండియా వ‌రుస‌గా రెండు లేదా అంత‌కంటే ఎక్కువ టెస్టులు డ్రా చేసుకోవ‌డం ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇదే. 2014/15 ఆస్ట్రేలియా టూర్‌లో మెల్‌బోర్న్‌, సిడ్నీ టెస్టుల‌ను డ్రా చేసుకున్న భార‌త్‌.. ఆ త‌ర్వాత బంగ్లాదేశ్‌తో జ‌రిగిన టెస్టును కూడా డ్రా చేసుకుంది.

👉ఈ ఏడాది ఒక్క నవంబ‌ర్‌లోనే వివిధ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 2011 నుంచి చూసుకుంటే ఇన్ని టెస్టు మ్యాచ్‌లు డ్రా అయిన సంద‌ర్భాలు రెండు మాత్ర‌మే. 2013 మార్చిలో ఒక‌సారి, 2022 మార్చిలో రెండోసారి నాలుగు టెస్టులు డ్రాగా ముగిశాయి.

ఇదీ చదవండి: ‘గెలుస్తామనుకున్నాం.. ఇలా జరుగుతుందని ఊహించలేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement