గెలిచామన్న సంతోషంలో పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్‌! | PAK Players Overaction-Tilak Varma Confronts-After Sledging Harshit Rana | Sakshi
Sakshi News home page

INDA Vs PAK-A: గెలిచామన్న సంతోషంలో పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్‌!

Nov 23 2026 9:40 AM | Updated on Nov 23 2026 9:42 AM

PAK Players Overaction-Tilak Varma Confronts-After Sledging Harshit Rana

Photo Credit: Twitter

మ్యాచ్ ఏదైనా భారత్‌, పాకిస్తాన్ జట్ల మధ్య భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. క్రీడాస్ఫూర్తికి భంగం కలగనంత వరకు ఆటగాళ్ల మధ్య ఉండే కోపతాపాలు అభిమానులతో పాటు చూసేవాళ్లకు కూడా మంచి కిక్‌ను ఇస్తాయి. కానీ ఆటగాళ్లు చేసే అతి శ్రుతి మించినప్పుడు మాత్రం పరిణామాలు వేగంగా మారుతుంటాయి. ఈ పోలిక పాకిస్తాన్ ప్లేయర్లకు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. 

విషయంలోకి వెళితే.. ఏసీసీ మెన్స్ ఆసియా కప్ సందర్భంగా ఆదివారం ఇండియా ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ హర్షిత్ రాణా పాక్ ప్లేయర్లపై కాస్త దూకుడును ప్రదర్శించాడు. బదులుగా పాక్ ప్లేయర్లు కూడా ధీటుగానే స్పందించారు. ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ, అక్కడితో ఊరుకోని పాక్ ప్లేయర్లు భారత్ బ్యాటింగ్ సమయంలో కాస్త ఓవరాక్షన్ చేశారు. 

వైభవ్ సూర్యవంశీని వెక్కిరించడం.. ఆ తర్వాత తిలక్ వర్మకు కౌంటర్ ఇవ్వడం, హర్షిత్ రానా ఔటై పెవిలియన్ వెళుతున్న సమయంలో పాక్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. క్రికెట్‌లో ప్రత్యర్థిని రెచ్చగొట్టేలా ప్రవర్తిచండం ష‌రా మాములే అయిన‌ప్ప‌టికీ అది కొంత పరిధి వరకు మాత్రమే ఉండాలి. 

కానీ, నిన్న‌టి మ్యాచ్‌లో పాకిస్థాన్ పరిస్థితి పూర్తి భిన్నం. భారత్‌తో మ్యాచ్ అంటే ఆ ఓవర్యాక్షన్ ఇంకాస్త ఎక్కువ అవుతుందనేది నెట్టింట విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇటీవల అండర్-19 ఆసియా కప్, అంధుల ఆసియా కప్ లో ఆ జట్టు తీరును క్రీడాలోకం గమనించింది. అండర్ -19 ఆసియాకప్ లీగ్ స్టేజ్లో భారత్పై గెలవగానే పాక్ ఆటగాళ్లు అతిగా సంబరాలు చేసుకున్నారు. 

ఇక అంధుల ఆసియా కప్ అయితే.. మరీ దారుణం. వర్షం కారణంగా రద్దు అయినా సరే.. కప్పును ఎత్తుకెళ్లిపోయి విమర్శపాలైంది. ఇప్పుడు రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో తొలి నుంచీ రెచ్చగొట్టేలా వ్యవహరించింది. ఒక‌వేళ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భార‌త్‌, పాక్‌లు ఫైన‌ల్ చేరుకుంటే మాత్రం భావోద్వేగాలు మ‌రింత తారాస్థాయికి చేరుకునే అవ‌కాశ‌ముంది.

ఇదీ చదవండి: 'తిల‌క్ వ‌ర్మ‌ను నిందించొద్దు'.. మాజీ ఆట‌గాడిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement