Photo Credit: BCCI Twitter
వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. ఐదోరోజు టీ విరామ సమయానికి న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (24 బ్యాటింగ్), గ్లెన్ ఫిలిప్స్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ జట్టు ఇంకా 146 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో ప్రసిధ్ క్రిష్ణ రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్, వాషింగ్టన్ సుందర్, బుమ్రాలు తలా ఒక వికెట్ పడగొట్టారు.
పిచ్ ఫ్లాట్‌గా ఉండడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చివరి సెషన్‌లో మన బౌలర్లు ఏదైనా అద్భుతం చేస్తే తప్ప టీమిండియా మ్యాచ్ గెలిచేందుకు ఆస్కారం లేదు. 119-2 క్రితంరోజు స్కోరుతో ఐదోరోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ కాసేపటికే అర్థసెంచరీ సాధించిన కాన్వే వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (37) కూడా నాలుగో వికెట్‌గా వెనుదిరగడంతో భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి.
ఈ క్రమంలో డారిల్ మిచెల్ (107 బంతుల్లో 24 నాటౌట్) జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లను విసుగెత్తించగా, టామ్ బ్లండల్ (54 బంతుల్లో 15) నింపాదిగా ఆడాడు. దీంతో గిల్ పదే పదే బౌలర్లను మార్చినప్పటికీ లాభం లేకుండా పోయింది. చివరకు కాంబోజ్ బౌలింగ్‌లో బ్లండెల్ వెనుదిరగడంతో కివీస్ ఐదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి డారిల్ మిచెల్ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.
That'll be Tea on Day 5 Final session coming up shortly Scorecard - https://t.co/SaMcNXtAVG #NZvIND https://t.co/gFrKfDeDk2
— BCCI (@BCCI) November 23, 2026
ఇదీ చదవండి: ‘అతడి ఔట్ కొంపముంచింది.. లేకుంటే మ్యాచ్ ముగించేవాడిని’


