Photo Credit: Twitter
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్స్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమయ్యాడు. మొన్న నేపాల్‌తో మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన వైభవ్ తాజాగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. మొహమ్మద్ ఇమ్రాన్ బౌలింగ్‌లో వైభవ్ పాక్ కెప్టెన్ అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
వైభవ్ ఔటయ్యి పెవిలియన్ వెళుతున్న క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో వైభవ్, పాక్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇది గమనించిన అభిషేక్ శర్మ గొడవ పెద్దది కాకముందే వైభవ్‌ను సముదాయించి అక్కడి నుంచి పంపించేయడం కెమెరాల్లో కనిపించింది. వైభవ్ కూడా కోపంతో పెవిలియన్ వైపు వెళ్లడం కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతంలో లంక ఆటగాళ్లతో గొడవ..
గతంలో శ్రీలంక-ఏతో సిరీస్ సందర్భంగా సహనం కోల్పోయిన వైభవ్ ఆ జట్టు ఆటగాళ్లతో గొడవకు దిగిన సంగతి తెలిసిందే. బహుశా ఇది గుర్తొచ్చి అభిషేక్.. గొడవ పెద్దది కాకముందే వైభవ్‌ను అక్కడి నుంచి పంపించేసి ఉంటాడని అభిమానులు కామెంట్లు చేశారు. మొత్తానికి అభిషేక్ చేసిన పనికి అతడిని అభిమానులు మెచ్చుకోవడం విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో హసన్ నవాజ్ (82 బంతుల్లో 79), ఫర్హాన్ యూసఫ్ (56), మాజ్ సదాఖత్ (59) అర్థసెంచరీలతో రాణించారు. ఓపెనర్ షమిల్ హుస్సేన్ (33) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్గే, విప్రజ్ నిగమ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టగా, ఆయుశ్ బదోని ఒక వికెట్ తీశాడు.
SOORYAVANSHI GONE 🔥 🇵🇰 #CricketKaJashan https://t.co/4KiMuG8VtE
— PCT GEO News (@PakistanCrnrj) November 22, 2026
ఇదీ చదవండి: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియా టార్గెట్ 314 రన్స్


