ఇంగ్లండ్ జట్టు‌కు భారీ ఎదురుదెబ్బ | Will Jacks out of remainder of England white ball tour of Australia | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ జట్టు‌కు భారీ ఎదురుదెబ్బ

Nov 22 2026 5:39 PM | Updated on Nov 22 2026 5:39 PM

Will Jacks out of remainder of England white ball tour of Australia

source: X

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ మిగిలిన మ్యాచ్‌లన్నిటికీ దూరమయ్యాడు. నిన్న జరిగిన తొలి టీ20లో చేతి ఎముక విరగడంతో అతడు సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ఆదివారం అధికారికంగా ప్రకటించింది. జాక్స్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

రిటర్న్ క్యాచ్ పట్టే క్రమంలో గాయం
ఈ మ్యాచ్‌లో జాక్స్‌  బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. బెన్ ద్వార్షుయిస్ కొట్టిన బంతిని రిటర్న్ క్యాచ్‌గా అందుకునే క్రమంలో బంతి అతడి బౌలింగ్ చేతికి బలంగా తాకింది. దీంతో జాక్స్ తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజియో అతడిని పరీక్షించాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో జాక్స్ ఆటను కొనసాగించలేక మైదానం వీడాడు. తొలుత చేతి వేళ్ల మధ్య చర్మం చీలినట్లు కనిపించినా.. పరీక్షల్లో ఎముక విరిగినట్లు తేలింది.

చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయం
జాక్స్ గాయపడిన సమయంలో మ్యాచ్ కీలక దశలో ఉండింది. ఆస్ట్రేలియా విజయానికి చివరి 8 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. జాక్స్ ఓవర్‌లో మిగిలిన రెండు బంతులను హెన్రీ క్రోకోంబ్ పూర్తి చేశాడు. చివరి ఓవర్లో సామ్ కరన్ 11 పరుగులను కాపాడుకోలేకపోయాడు. ఐదో బంతికి జాక్ ఎడ్వర్డ్స్ బౌండరీ బాదడంతో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్‌ బ్రూక్‌ (65) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. అనంతరం నిఖిల్‌ చౌదరి (66) అర్ద సెంచరీతో రాణించడంతో ఆసీస్‌ మరో బంతి మిగిలుండగా లక్ష్యాన్ని చేరుకుంది. బ్యాట్‌తో పాటు బంతితో (2 వికెట్లు) మెరిసిన నిఖిల్‌ చౌదరికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

ఇదీ చదవండి: IND VS PAK: పెను ప్రమాదం తప్పించుకున్న వైభవ్‌ సూర్యవంశీ..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement