ఆసీస్‌ను గెలిపించిన సీఎస్‌కే ఆల్‌రౌండ‌ర్‌ | Jack Edwards-Nikhil Chaudhary Guides AUS-Thrilling Victory Vs ENG-1st T20I | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ను గెలిపించిన సీఎస్‌కే ఆల్‌రౌండ‌ర్‌

Nov 21 2026 5:27 PM | Updated on Nov 21 2026 5:30 PM

Jack Edwards-Nikhil Chaudhary Guides AUS-Thrilling Victory Vs ENG-1st T20I

Photo Credit: Twitter

సొంత‌గ‌డ్డ‌పై ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజ‌యాన్ని న‌మోదు చేసింది. 191 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.5 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో నిఖిల్ చౌద‌రీ (38 బంతుల్లో 66) అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, కెప్టెన్ మిచెల్ మార్ష్ (37), సామ్ హార్ప‌ర్ (32) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. 

చివ‌ర్లో జాక్ ఎడ్వ‌ర్డ్స్ (11 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టును గెలిపించాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో విల్ జాక్స్ రెండు వికెట్లు తీయ‌గా, లియామ్ డాస‌న్‌, హెన్రీ క్రొకొంబ్‌, జేమీ ఓవ‌ర్ట‌న్‌, సామ్ క‌ర్ర‌న్‌, ఆదిల్ ర‌షీద్ త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. కెప్టెన్ హ్యారీబ్రూక్ (28 బంతుల్లో 65; 4 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), అర్థ‌సెంచ‌రీ చేయ‌గా, టామ్ బాంట‌న్ (22 బంతుల్లో 39), జోర్డాన్ కాక్స్ (20 బంతుల్లో 27) రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో జాక్ ఎడ్‌వ‌ర్డ్స్‌, నిఖిల్ చౌద‌రీ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

బౌలింగ్‌లో రెండు వికెట్లు, బ్యాటింగ్‌లో అర్థసెంచరీ సాధించిన నిఖిల్‌ చౌదరీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరుజ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 క్వీన్స్‌లాండ్ వేదిక‌గా మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నుంది. ఇక ఆసీస్‌ను గెలిపించి హీరోగా నిలిచిన జాక్ ఎడ్‌వ‌ర్డ్స్‌ను ఇటీవ‌లే ట్రేడింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ నుంచి సీఎస్‌కేకు మారిన సంగ‌తి తెలిసిందే.

ఇదీ చదవండి: టీమిండియా కెప్టెన్‌గా గిల్‌కు ఊహించని షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement