breaking news
Nikhil Chaudhary
-
ఆఖరి బంతికి సిక్స్.. గెలిపించిన భారత సంతతి క్రికెటర్
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ-2026) టోర్నీ మరో సంచలన మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. టెక్సక్ సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఒక్క వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. టెక్సస్ బౌలర్ అకియల్ హొసెన్ ఎంఎల్‌సీలో తొలి హ్యాట్రిక్‌తో మెరిసినప్పటికీ, భారత సంతతికి చెందిన నిఖిల్ చౌదరీ (27 నాటౌట్) ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి వాషింగ్టన్ ఫ్రీడమ్‌ను గెలిపించి మ్యాచ్ హీరోగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సస్ సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. డొనోవన్ ఫెరీరా (44 నాటౌట్), వియాన్ ముల్డర్ (43 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, సాయితేజ ముక్కామల్ల (37) రాణించాడు. వాషింగ్టన్ బౌలర్లలో నిఖిల్ చౌదరీ 2 వికెట్లు తీయగా, ఫెర్గూసన్, మార్కో జాన్సెస్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 186 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (77), స్టీవ్ స్మిత్ (30) తొలి వికెట్‌కు శుభారంభం ఇచ్చినప్పటికీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన వాషింగ్టన్ ఒత్తిడిలో పడింది. ఒక దశలో 91-1తో పటిష్టంగా కనిపించిన వాషింగ్టన్ లక్ష్యానికి చేరువగా వచ్చే కొద్ది వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే 19.4 ఓవర్లలో 180 పరుగుల వద్ద వాషింగ్టన్ 9వ వికెట్ కోల్పోయింది. ఈ దశలో నిఖిల్ చౌదరీ మూడు భారీ సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు. అకియల్ హొసెన్ 4 వికెట్లు తీయగా, ఆడమ్ మిల్నే, వియాన్ ముల్డర్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ ప్రదర్శనతో అదరగొట్టిన నిఖిల్ చౌదరీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. కాగా ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరీ స్వస్థలం పంజాబ్. మొదట ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన నిఖిల్ చౌదరీ ఆ తర్వాత ఆఫ్ స్పిన్నర్ ఆపై లెగ్ స్పిన్నర్‌గా తన బౌలింగ్‌ను మార్చుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఎంపికైన నిఖిల్ చౌదరీ బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో ఆడాడు. అంతేకాదు బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన రెండో భారత సంతతి క్రికెటర్‌గా నిఖిల్ చౌదరీ నిలిచాడు.pic.twitter.com/YQ4GxeKBsS— crictalk (@crictalk7) June 28, 2026Read: లంక-ఏతో మ్యాచ్.. భారీ ఆధిక్యం దిశగా ఇండియా-ఏ -
AUS vs BAN: ఆసీస్ గడ్డపై ‘మనోడి’ చరిత్ర
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలో సిరీస్‌లో పాల్గొనే పదిహేడు మంది సభ్యుల పేర్లను తాజాగా వెల్లడించింది. ఈ జట్టులో భారత్‌కు చెందిన నిఖిల్ చౌదరికి సెలక్టర్లు చోటివ్వడం విశేషం.మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు ఆసీస్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా.. జూన్ 17, 19, 21 తేదీల్లో మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికఈ నేపథ్యంలో సీఏ తాజాగా బంగ్లాతో సిరీస్‌కు టీ20 జట్టును ప్రకటించింది. బిగ్‌బాష్ లీగ్‌లో రాణించిన ఆటగాళ్లకు సెలక్టర్లు ఈ జట్టులో చోటిచ్చారు. హోబర్ట్ హారికేన్స్ తరఫున సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న నిఖిల్ చౌదరి (Nikhil Chaudhary)కి తొలిసారి జాతీయ జట్టులో అవకాశం దక్కింది.ఆల్‌రౌండ్ నైపుణ్యాలున్న 30 ఏళ్ల నిఖిల్ చౌదరి బంగ్లాదేశ్‌తో సిరీస్‌తో గనుక అరంగేట్రం చేస్తే.. 62 ఏళ్ల తర్వాత ఆసీస్‌కు ఆడిన జన్మతః భారతీయుడైన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. కలకత్తా వేదికగా 1964లో రెక్స్ సెల్లార్స్ అనే భారతీయుడు ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగాడు. గుజరాత్లో జన్మించిన రెక్స్ లెగ్ స్పిన్నర్. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు నిఖిల్‌కు అవకాశం వచ్చింది.ఎవరీ నిఖిల్ చౌదరి?ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి దేశవాళీ క్రికెట్లో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. భారత టెస్టు, వన్డే జట్ల ప్రస్తుత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సహా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు.అదే విధంగా టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లతో కలిసి పంజాబ్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అతడికి ఆశించినంతగా అవకాశాలు రాలేదు. ఇక 2020లో క్వీన్స్‌లాండ్‌లో ఉన్న తన అంకుల్‌ను చూసేందుకు నిఖిల్ చౌదరి ఆస్ట్రేలియాకు వెళ్లాడు.అయితే, కోవిడ్ కారణంగా ప్రయాణాలపై నిషేధం విధించడంతో నిఖిల్ అక్కడే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోనే ఉండాలని నిర్ణయించుకున్న అతడు.. శాశ్వత నివాస హోదా పొందాడు. గత మూడేళ్లుగా బిగ్‌బాష్ లీగ్‌లో సత్తా చాటుతున్న నిఖిల్.. 2024-25లో హోబర్ట్ హారికేన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.అలా దేశీ క్రికెట్లో అవకాశంలెగ్స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్‌కు ఊహించని రీతిలో ఆసీస్ దేశీ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం లభించింది. స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ జాతీయ జట్టు విధుల్లోకి వెళ్లగా అతడి స్థానంలో టాస్మేనియా నిఖిల్‌ను పిలిపించింది.ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్‌లో టాస్మేనియాకు ఆడుతూ.. న్యూ సౌత్ వేల్స్‌తో మ్యాచ్‌లో శతకం (184 బంతుల్లో 163) సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆసీస్ దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీలో శతక్కొట్టిన భారత మూలాలున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.ఏదేమైనా భారత్‌లో అవకాశాలు లేక ఆసీస్‌కు వెళ్లిన నిఖిల్ చౌదరి.. ఇప్పుడిలా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ ఏకంగా ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికకావడం నిజంగా విశేషమే.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్(కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, నిఖిల్ చౌదరి, కూపర్ కానొలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రైలీ మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపా.చదవండి: వైభవ్ మారలేదు.. శ్రీలంకలో మెరుపులు -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కీలక అడుగు
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ నిఖిల్ చౌధరి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరినట్లు తెలుస్తుంది. తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అతను డీసీ ఆటగాళ్లతో కలిసి కనిపించాడు. దీంతో నిఖిల్‌ను జట్టు నుంచి చివరి నిమిషంలో వైదొలిగిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకున్నారన్న టాక్ నడుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన లేనప్పటికీ.. డీసీ మాత్రం నిఖిల్‌ను లాక్ చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. నిఖిల్ భారత మూలాలున్న ఆస్ట్రేలియా ఆటగాడు. ఇతను ఢిల్లీలో జన్మించాడు. కుటుంబంతో సహా చిన్నతనంలోనే ఆస్ట్రేలియాకి వెళ్లిన నిఖిల్.. టాస్మానియా తరఫున క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. 29 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ ఐపీఎల్ 2026 వేలంలో విదేశీ ఆటగాడిగా నమోదు చేసుకున్నప్పటికీ ఎవరూ కొనుగోలు చేయలేదు.నిఖిల్ తాజాగా ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లో హోబార్ట్ హరికేన్స్ తరఫున రాణించాడు. ఈ సీజన్లో అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 153.50 స్ట్రైక్ రేట్‌తో 307 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే నిఖిల్ ఫినిషర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. లెగ్ స్పిన్ బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉన్న నిఖిల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మిడిలార్డర్లో ఉపయోగకరమైన ఆటగాడిగా మారవచ్చు.ఇదిలా ఉంటే, ఢిల్లీ ఈ సీజన్‌ను గెలుపుతో బోణీ కొట్టింది. తాజాగా ముగిసిన మ్యాచ్‌లో ఈ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సమీర్ రిజ్వి (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకరించాడు.ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రేపు ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. -
భారత ఆటగాడి కోటాలో ఐపీఎల్ వేలంలోకి ఎంటరైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ అద్భుతం జరిగింది. ఓ విదేశీ ఆటగాడు భారతీయ ఆటగాడి కోటాలో వేలంలోకి ప్రవేశించాడు. భారత్‌లో (ఢిల్లీలో) పుట్టి, ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్లో భాగంగా ఉన్న 29 ఏళ్ల నిఖిల్ చౌదరి 2026 సీజన్ వేలంలోకి చివరి నిమిషంలో భారత ఆటగాడి కోటాలో ఎంట్రీ ఇచ్చాడు.ఆస్ట్రేలియాలో టాస్మానియా తరఫున పూర్తి స్థాయి ఫస్ట్‌క్లాస్ ఆడుతూ, బిగ్‌బాష్ లీగ్‌లో హోబార్ట్ హరికేన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఖిల్.. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలిచాడు. ఊహించని ఈ పరిణామం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు.ఓ ఆటగాడు విదేశీ లీగ్‌ల్లో ఆడుతూ, ఐపీఎల్లో దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలవడం ఇదే మొదటిసారి. లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్ అయిన నిఖిల్ వేలంలో సెట్ 35లో (ఆల్‌రౌండర్లు) షార్ట్‌లిస్ట్ అయ్యాడు. షార్ట్‌లిస్ట్ అయిన 350 మంది ఆటగాళ్ల జాబితాలో నిఖిల్ పేరు ప్రత్యేకంగా నిలిచింది. టీమిండియాకు ఆడాలన్నదే అతని కల, కానీ..!నిఖిల్‌కు చిన్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలన్నదే కల. ఢిల్లీలో పుట్టి పెరిగిన అతను.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు. అయితే COVID-19 సమయంలో నిఖిల్ పర్యాటకుడిగా వెళ్లి ఆస్ట్రేలియాలో చిక్కుకుపోయాడు.దీంతో అతని కెరీర్‌కు పుల్‌స్టాప్ పడిందని అంతా అనుకున్నారు. అయితే నిఖిల్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాలనుకున్న తన కలను సజీవంగానే ఉంచుకున్నాడు. అందులో భాగంగా అతను ఆస్ట్రేలియా తరఫున తన కొత్త జర్నీని స్టార్ట్ చేశాడు. నిరంతర సాధన చేస్తూ 2023–24 సీజన్లో హోబార్ట్ హరికేన్స్ తరఫున బిగ్ బాష్ లీగ్ ఆడే అవకాశం దక్కించుకున్న నిఖిల్.. తొలి సీజన్లోనే ఆకట్టుకున్నాడు. ఫలితంగా అతనికి ఈ ఏడాదే టాస్మానియా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం కూడా దక్కింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే నిఖిల్ చెలరేగిపోయాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. గత నెలలో బ్యాటర్‌గానూ సత్తా చాటి, న్యూ సౌత్ వేల్స్‌పై శతకంతో విరుచుకుపడ్డాడు. -
మాంసం కొట్టులో పని.. ఆసీస్ గడ్డపై ‘భారత’ క్రికెటర్ సరికొత్త చరిత్ర
ఆస్ట్రేలియా గడ్డపై ఓ ‘భారత’ క్రికెటర్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఆసీస్ ఫస్ట్‌క్లాస్ హిస్టరీలో శతకం బాదిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించాడు. అతడే నిఖిల్ చౌదరి. గిల్ సహచర క్రికెటర్ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి.. దేశీ క్రికెట్లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా ప్రస్తుత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. భారత స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)లతో కలిసి లిస్ట్-ఎ క్రికెట్ ఆడాడు. అయితే, భారత్‌లో అతడికి ఆశించిన మేర అవకాశాలు రాలేదు.ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు వెళ్లిన నిఖిల్ చౌదరి.. కోవిడ్-19 (Covid 19)లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా అతడు భారత్‌కు తిరిగి రావాలని అనుకోలేదు. ఆస్ట్రేలియాలోనే ఉంటూ శాశ్వత నివాసిగా మారిపోయాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ కావాలన్న అతడి కల మాత్రం అలాగే ఉండిపోయింది.మాంసం కొట్టులో పనిఎలాగైనా తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పంతో నిఖిల్ చౌదరి.. శిక్షణ కోసం డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టాడు. మాంసం కొట్టులో పని చేయడంతో పాటు.. పార్శిళ్లు అందించే డెలివరీ బాయ్‌గా.. ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా.. ఇలా ఎన్నో పనులు చేశాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నాడు.కొన్నాళ్ల తర్వాత నిఖిల్ చౌదరి శ్రమకు ఫలితం దక్కింది. ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్‌లో ఆడే అవకాశం అతడికి వచ్చింది. హోబర్ట్ హ్యారికేన్స్‌కు ప్రాతినిథ్యం వహించే సమయంలో నిఖిల్ చౌదరి.. పాకిస్తాన్ ఓవరాక్షన్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది.. దానిని తొడగొడుతూ మరీ సెలబ్రేట్ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది.సరికొత్త చరిత్రఈ క్రమంలోనే ఆసీస్ దేశీ క్రికెట్ జట్ల యాజమాన్యాలను ఆకర్షించిన నిఖిల్ చౌదరికి ఊహించని విధంగా ఓ అవకాశం వచ్చింది. స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు జాతీయ జట్టులోకి వెళ్లగా.. టాస్మేనియా జట్టు నుంచి నిఖిల్‌కు పిలుపు వచ్చింది. ఆ తర్వాత అతడు జట్టులో భాగమైపోయాడు.ఆసీస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో టాస్మేనియాకు ఆడుతున్న నిఖిల్ ఇటీవలే సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూ సౌత్ వేల్స్‌తో మ్యాచ్‌లో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. శతక్కొట్టాడు. 184 బంతుల్లోనే 163 పరుగులు రాబట్టాడు. తద్వారా ఆసీస్ దేశీ రెడ్‌బాల్ టోర్నీలో సెంచరీ చేసిన భారత మూలాలున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్మేనియా న్యూ సౌత్ వేల్స్‌పై ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో గెలవడం విశేషం.ఫాస్ట్ బౌలర్‌గా మొదలుపెట్టి..ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి పంజాబ్‌లో పెరిగాడు. పంజాబ్ తరఫున అన్ని ఏజ్ గ్రూపులలోనూ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌తో సమయం గడిపే అవకాశం అతడికి వచ్చింది. నిజానికి నిఖిల్ తొలుత ఫాస్ట్ బౌలర్ కావాలని భావించాడు.అయితే, కాలక్రమేణా తన నైపుణ్యాలకు మెరుగు దిద్దుకుని లెగ్ స్పిన్నర్‌గా ఎదిగాడు. ఐపీఎల్ ట్రయల్స్‌లో ముంబై ఇండియన్స్ సెలక్షన్‌కు వెళ్లినప్పటికీ నిఖిల్‌కు నిరాశే మిగిలింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన 29 ఏళ్ల నిఖిల్.. అక్కడి స్థానిక క్లబ్‌లలో ఆడుతూ టాస్మేనియా జట్టులో కుదురుకున్నాడు.చదవండి: స్మృతిని మోసం చేసిన పలాష్?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఏం జరిగింది?


