మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ-2026) టోర్నీ మరో సంచలన మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. టెక్సక్ సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఒక్క వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. టెక్సస్ బౌలర్ అకియల్ హొసెన్ ఎంఎల్‌సీలో తొలి హ్యాట్రిక్‌తో మెరిసినప్పటికీ, భారత సంతతికి చెందిన నిఖిల్ చౌదరీ (27 నాటౌట్) ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి వాషింగ్టన్ ఫ్రీడమ్‌ను గెలిపించి మ్యాచ్ హీరోగా నిలిచాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సస్ సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. డొనోవన్ ఫెరీరా (44 నాటౌట్), వియాన్ ముల్డర్ (43 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, సాయితేజ ముక్కామల్ల (37) రాణించాడు. వాషింగ్టన్ బౌలర్లలో నిఖిల్ చౌదరీ 2 వికెట్లు తీయగా, ఫెర్గూసన్, మార్కో జాన్సెస్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 186 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (77), స్టీవ్ స్మిత్ (30) తొలి వికెట్‌కు శుభారంభం ఇచ్చినప్పటికీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన వాషింగ్టన్ ఒత్తిడిలో పడింది. ఒక దశలో 91-1తో పటిష్టంగా కనిపించిన వాషింగ్టన్ లక్ష్యానికి చేరువగా వచ్చే కొద్ది వికెట్లు కోల్పోతూ వచ్చింది.
అయితే 19.4 ఓవర్లలో 180 పరుగుల వద్ద వాషింగ్టన్ 9వ వికెట్ కోల్పోయింది. ఈ దశలో నిఖిల్ చౌదరీ మూడు భారీ సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు. అకియల్ హొసెన్ 4 వికెట్లు తీయగా, ఆడమ్ మిల్నే, వియాన్ ముల్డర్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ ప్రదర్శనతో అదరగొట్టిన నిఖిల్ చౌదరీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.
కాగా ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరీ స్వస్థలం పంజాబ్. మొదట ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన నిఖిల్ చౌదరీ ఆ తర్వాత ఆఫ్ స్పిన్నర్ ఆపై లెగ్ స్పిన్నర్‌గా తన బౌలింగ్‌ను మార్చుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఎంపికైన నిఖిల్ చౌదరీ బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో ఆడాడు. అంతేకాదు బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన రెండో భారత సంతతి క్రికెటర్‌గా నిఖిల్ చౌదరీ నిలిచాడు.
— crictalk (@crictalk7) June 28, 2026


