సెయింట్ లూయిస్: సింక్‌ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద తొలి విజయం అందుకున్నాడు. క్యాండిడేట్స్ టోర్నీ విజేత, ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ సిందరోవ్‌తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద 95 ఎత్తుల్లో గెలుపొందాడు. ఈ గేమ్ ఏకంగా ఆరు గంటలపాటు కొనసాగడం విశేషం. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది.


