చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు | Praggnanandhaa makes history, becomes first Indian to win Grand Chess Tour | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు

Aug 28 2026 8:27 AM | Updated on Aug 28 2026 8:37 AM

Praggnanandhaa makes history, becomes first Indian to win Grand Chess Tour

భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. సెయింట్ లూయిస్ వేదిక‌గా జ‌రిగిన  గ్రాండ్ చెస్ టూర్ ఫైన‌ల్స్‌లో అమెరికా దిగ్గజం ఫాబియానో కరువానాపై అద్భుతమైన పునరాగమనంతో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. 

త‌ద్వారా ఈ చారిత్ర‌త్మ‌క రికార్డును ప్రజ్ఞానంద త‌న పేరిట లిఖించుకున్నాడు. అదేవిధంగా ఛాంపియ‌న్‌గా నిలిచిన ప్రజ్ఞానందకు దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్ మ‌నీ ద‌క్కింది. ఈ విజ‌యంతో వచ్చే ఏడాది జరిగే గ్రాండ్ చెస్ టూర్‌లో నేరుగా పాల్గొనే అర్హతను అత‌డు ద‌క్కించుకున్నాడు.
చదవండి: వారసులొచ్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement