PC: X
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు... రెండో టెస్టులో ఫర్వాలేదనిపించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం లార్డ్స్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు విఫలమయ్యారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.
ఆటకు వరుణుడు ఆటంకం కలిగించగా... వెలుతురులేమి కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ముందే ముగిసింది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (80 బంతుల్లో 61; 10 ఫోర్లు), జోర్డాన్ కాక్స్ (105 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. కెప్టెన్ జో రూట్ (4), ఎమిలియో గే (8), బెన్ డకెట్ (17), హ్యారీ బ్రూక్ (15), డాన్ లారెన్స్ (17) విఫలమయ్యారు.
పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 4 వికెట్లు పడగొట్టగా... మొహమ్మద్ అలీ 3 వికెట్లు తీశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఒత్తిడి కొనసాగించిన పాక్ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టింది. అట్కిన్సన్ (27 బంతుల్లో 34 బ్యాటింగ్; 5 ఫోర్లు), జోష్ టంగ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
తుది జట్లు
పాకిస్థాన్: ఇమామ్-ఉల్-హక్, అజాన్ అవైస్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్, బాబర్ ఆజం(కెప్టెన్), సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అలీ ఉస్మాన్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అలీ
ఇంగ్లండ్: బెన్ డకెట్, ఎమిలియో గే, జోర్డాన్ కాక్స్, జో రూట్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, డాన్ లారెన్స్, జామీ స్మిత్(వికెట్ కీపర్), ఆలీ రాబిన్సన్, గుస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్
చదవండి: వారసులొచ్చారు


