breaking news
England Vs Pakistan
-
బాగానే ఆడావు కానీ.. కాస్త ముఖమైనా దాచుకో: పాక్ దిగ్గజం ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై దిగ్గజ బౌలర్ వసీం అక్రం నిప్పులు చెరిగాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కోచ్‌ల మార్గదర్శనంలోనూ జట్టు చెత్త ప్రదర్శనే కనబరుస్తోందని మండిపడ్డాడు. ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడినా.. స్వదేశానికి తిరిగిరాగానే ఓ ఆటగాడికి ఘనంగా స్వాగతం పలికారని.. ఇదే మన మైండ్‌సెట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.మట్టికరిచి.. 3-0తో వైట్వాష్బాబర్ ఆజం కెప్టెన్సీలో పాక్ జట్టు ఇటీవల ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూడు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో పాక్ 3-0తో వైట్‌వాష్ అయింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్, 103 పరుగులు, రెండో టెస్టులో 194 పరుగులు, మూడో టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 ఫైనల్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించింది పాక్. ఇదిలా ఉంటే.. మూడో టెస్టుకు ముందు పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేయడంతో పాటు.. హెడ్‌కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌పై వేటు వేసింది.రాణించిన రజావుల్లాఈ క్రమంలో మూడో టెస్టుకు కొత్తగా ఏడుగురు ఆటగాళ్లను తీసుకోగా.. వారిలో రజావుల్లా కాస్త మెరుగ్గా ఆడాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చిన 21 ఏళ్ల ఈ రైటార్మ్ మీడియం పేసర్.. పాక్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 63 బంతుల్లో 81 పరుగులు సాధించాడు.ఈ క్రమంలో రజావుల్లాను వకార్ యూనిస్‌తో పోలుస్తూ పాక్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక స్వదేశానికి తిరిగి రాగానే అతడికి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఘాటుగా స్పందించాడు. వకార్ యూనిస్‌తో కలిసి మాంచెస్టర్ ఈవెంట్లో మాట్లాడుతూ..బాగానే ఆడావు.. కనీసం ముఖమైనా దాచుకో‘‘ప్రపంచంలోని అత్యుత్తమ కోచ్‌లను తీసుకువచ్చినా పాక్ జట్టు ఆట తీరులో ఎలాంటి మార్పూ లేదు. ఇంగ్లండ్ చేతిలో కేవలం ఓడిపోలేదు... చిత్తుగా చిత్తుగా పరాజయం పాలై మట్టికరిచాము. ఇక రజావుల్లా.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గొప్పగా ఆడాడు.అతడు ఎంతో ప్రతిభావంతుడు. అయితే, అతడు ఇస్లామాబాద్ చేరుకోగానే దాదాపు ఐదు వేల మంది అతడికి స్వాగతం పలికేందుకు వచ్చారు. పూలమాలలు, బొకేలతో అతడిని సత్కరించారు.ఇంటికి వెళ్లాక సంబరాలు చేసుకోఇంతటి ఘోర పరాభవం తర్వాత జట్టు తిరిగి వచ్చింది. కనీసం నీ ముఖమైనా దాచుకో అబ్బాయ్.. ఇంటికి వెళ్లాక అక్కడ సంబరాలు చేసుకో. మనోళ్ల మైండ్‌సెట్ ఎలా ఉంటుందో ఈ దృశ్యాలు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. జట్టు ప్రదర్శన ఎంత దిగజారినా మనకి మాత్రం సంబరాలు చేసుకోవడం అలవాటైపోయింది’’ అని వసీం అక్రం తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.కాగా పెషావర్‌లోని మార్దాన్లో జన్మించిన రజావుల్లా 2025 నవంబరులో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి పెషావర్ తరఫున దేశీ క్రికెట్లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మూడో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.చదవండి: ఆసీస్‌పై వీరేందర్ సెహ్వాగ్ కుమారుడి విధ్వంసంA GRAND WELCOME OF RAZAULLAH IN ISLAMABAD. 🇵🇰 pic.twitter.com/HU9Q2Ujx3H— Sheri. (@CallMeSheri1_) September 15, 2026 -
బాబర్ ఆజం సంచలన నిర్ణయం!
పాకిస్టాన్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏడేళ్ల తర్వాత తొలిసారి దేశవాళీ రెడ్‌బాల్ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అవును.. మా జట్టుకే ఆడుతున్నాడుఈ విషయాన్ని ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (OGDCL) స్పోర్ట్స్ హెడ్ ఫరా ధ్రువీకరించారు. ‘‘బాబర్ ఆజం యూకే నుంచి సెప్టెంబరు 16న పాకిస్తాన్‌కు తిరిగి వస్తాడు. ఆ మరుసటి రోజు OGDCL జట్టుతో చేరతాడు. ఇప్పటికే బాబర్‌కు సంబంధించి కిట్ ఆర్డర్ చేశాము.ఈ సీజన్లో జట్టు ఆడే రెండు, లేదంటే మూడో మ్యాచ్ నుంచి బాబర్ జట్టుతో ఉంటాడు. ఇది అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’’ అని ఫరా తెలిపారు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందే బాబర్ ఆజం మరోసారి పాకిస్తాన్ టెస్టు సారథిగా తిరిగి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.గాయంతో మొదలు..యూకే టూర్లో భాగంగా తొలుత కౌంటీ క్లబ్ సెలెక్ట్ ఎలెవన్‌తో మ్యాచ్‌లో ఆడిన బాబర్ ఆజం గాయపడ్డాడు. దీంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఇక రెండో టెస్టుతో తిరిగి వచ్చిన బాబర్.. దారుణంగా విఫలమయ్యాడు. లార్డ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 8, 6 పరుగులు చేశాడు.వరుస వైఫల్యాల తర్వాత..ఇక ఆఖరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులకే అవుటైన బాబర్.. రెండో ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. మొత్తంగా 103 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 76 పరుగులతో రాణించాడు. అయితే, కెప్టెన్‌గా మాత్రం బాబర్‌కు చేదు అనుభవం మిగిలింది.బాబర్ ఆజం సారథ్యంలో ఇంగ్లండ్ చేతిలో పాక్ 3-0తో వైట్‌వాష్ అయింది. అంతేగాక మూడో టెస్టులో స్లో ఓవర్‌రేటు కారణంగా జరిమానాతో పాటు పాయింట్ల కోత (11 పాయింట్లు) ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 ఫైనల్ రేసు నుంచి పాక్ అనధికారికంగా నిష్క్రమించింది.చివరగా అప్పుడేఈ నేపథ్యంలోనే బోర్డు ఆదేశాల మేరకు తిరిగి దేశీ రెడ్‌బాల్ క్రికెట్ ఆడేందుకు బాబర్ ఆజం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ దిగ్గజ బ్యాటర్ చివరగా 2019లో క్వైడ్ ఈ ఆజం ట్రోఫీ టోర్నీలో భాగంగా సెంట్రల్ పంజాబ్ సారథిగా వ్యవహరించాడు. నాడు బాబర్ కెప్టెన్సీలో సెంట్రల్ పంజాబ్ టైటిల్ గెలిచింది. ఇక తాజాగా రీఎంట్రీ ఇస్తున్న బాబర్.. ప్రెసిడెంట్స్ ట్రోఫీ గ్రేడ్ 1 ఫస్ట్‌క్లాస్ టోర్నమెంట్లో భాగంగా OGDCL జట్టుకు ఆడతాడు. గెస్ట్ ప్లేయర్‌గా అతడు OGDCLతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పాక్ మీడియా తెలిపింది. ఇక బాబర్ కంటే ముందే పేసర్ షాహిన్ ఆఫ్రిది, టీ20 కెప్టెన్ సల్మాన్ ఆఘా దేశీ రెడ్‌బాల్ క్రికెట్ బరిలో దిగారు.చదవండి: ‘వైభవ్ ఎందుకు ఆడట్లేదని నా భార్య అరిచేసింది’ -
పాకిస్తాన్‌కు మరో భారీ షాక్
తాజాగా ఇంగ్లండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయి బాధలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు, ఆ పరాభవం నుంచి తేరుకోకముందే మరో షాక్ తగిలింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన చివరి టెస్టులో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ జట్టు ఖాతా నుంచి 11 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్లు కోత విధించారు. దీంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా పడింది.ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లు బౌలింగ్ చేసింది. సమయానికి సంబంధించిన అనుమతులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా నిర్ణీత ఓవర్‌రేట్ కంటే 11 ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలింది.ఐసీసీ WTC ప్లేయింగ్ కండిషన్స్లోని ఆర్టికల్ 16.11.2 ప్రకారం నిర్ణీత ఓవర్ల కంటే ప్రతి ఓవర్ తక్కువగా వేసినందుకు ఒక WTC పాయింట్ కోత విధిస్తారు. అదే విధంగా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. అయితే ఈ జరిమానా గరిష్ఠంగా 50 శాతానికి పరిమితం.ఇప్పటికే WTC పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న పాకిస్థాన్, తాజా కోతతో మరింత దారుణ పరిస్థితిలోకి వెళ్లింది. ఈ WTC సైకిల్లో తొమ్మిది టెస్టులు, నాలుగు సిరీస్‌ల తర్వాత ఆ జట్టు పాయింట్స్ పర్సెంటేజ్ 4.63కి పడిపోయింది. దీంతో WTC ఫైనల్‌కు చేరే అవకాశం దాదాపుగా లేనట్లే.చదవండి: ఇంగ్లండ్‌దే మూడో టెస్టు.. పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ -
ఇంగ్లండ్‌దే మూడో టెస్టు.. పాకిస్తాన్ క్లీన్‌స్వీప్
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ వైట్‌వాష్‌కు గురైంది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 24.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లిద్దరు డకౌట్ అయినప్పటికీ, జోర్డాన్ కాక్స్ (59 నాటౌట్), కెప్టెన్ జో రూట్ (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 453 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (75), జేమీ స్మిత్ (69), డాన్ లారెన్స్ (65), ఎమిలో గే (60), ఓలీ రాబిన్సన్ (50) అర్థసెంచరీలు సాధించారు. అయితే ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. జోష్ టంగ్ 4 వికెట్లు తీయగా, రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్లు చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఫాలోఆన్ ఆడిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగులకు ఆలౌటైంది. షాన్ మసూద్ (95), బాబర్ ఆజం (76), రజాఉల్లాహ్ (81), అజన్ అవైస్ (59) అర్థసెంచరీలు సాధించారు. డాన్ లారెన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.సంక్షిప్త స్కోర్లుపాకిస్తాన్ 133 & 449ఇంగ్లండ్ 453 & 130/2👉టెస్టుల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ వైట్‌వాష్‌కు గురవ్వడం ఇది రెండోసారి. 2022-23లో పాక్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా ఇంగ్లండ్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక ఇంగ్లండ్‌కు టెస్టుల్లో ప్రత్యర్థిపై ఇది 15వ క్లీన్‌స్వీప్. అదే సమయంలో పాకిస్తాన్ టెస్టుల్లో వైట్‌వాష్‌కు గురవ్వడం ఇది పదకొండోసారి.👉ఇంగ్లండ్ గడ్డపై ఒక మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క సెంచరీ నమోదు కాకపోవడం ఇది రెండోసారి కాగా, గతంలో 1888 యాషెస్ సిరీస్‌లోనూ ఒక్క సెంచరీ నమోదు కాలేదు. ఇక ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో ఒక టెస్టు సిరీస్‌లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం ఇది ఎనిమిదోసారి.3-0 SERIES SWEEP! 💪 pic.twitter.com/TTCM4ZHvWb— England Cricket (@englandcricket) September 12, 2026ఇదీ చదవండి: #80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్! -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక అర్ద సెంచరీలు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.టెస్టుల్లో అత్యధిక అర్ధశతకాలు69* - జో రూట్68 - సచిన్ టెండూల్కర్66 - ఎస్. చందర్‌పాల్63 - అలెన్ బోర్డర్63 - రాహుల్ ద్రవిడ్62 - రికీ పాంటింగ్రూట్ (62 నాటౌట్)తో పాటు జోర్డన్ కాక్స్(59 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఫలితంగా స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 453, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఇదీ చదవండి: #80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్! -
9వ స్థానంలో సిక్సర్ల సునామీ.. పాక్ ప్లేయర్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టు ఎట్టకేలకు తమ బ్యాటింగ్ పవర్‌ను చూపించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్లు సైమ్ అయూబ్ (0), షఫీక్ (0) డకౌట్‌గా వెనుదిరిగినా.. ఆ తర్వాత అజాన్ అవైస్ (59), షాన్ మసూద్ (95), కెప్టెన్ బాబర్ ఆజం (75) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. అయితే ఈ ముగ్గురు కీలక బ్యాటర్లు అవుటయ్యాక పాకిస్తాన్ త్వరగానే ఆలౌట్ అవుతుందని అంతా భావించారు.రజావుల్లా ఊచకోత..!కానీ అసలు కథ అక్కడే మొదలైంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అరంగేట్ర ఆటగాడు రజావుల్లా విధ్వంసం సృష్టించాడు. టీ20 ఫార్మాట్ రీతిలో విరుచుకుపడుతూ ఎడ్జ్‌బాస్టన్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. పదో నంబర్ బ్యాటర్ అబ్బాస్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో రజావుల్లా కేవలం 43 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 63 బంతులు ఎదుర్కొన్న అతడు 4 ఫోర్లు, 9 సిక్సర్లతో ఏకంగా 81 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశాడు. రజావుల్లా, అబ్బాస్ కలిసి తొమ్మిదో వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ తరఫున 1984 తర్వాత తొమ్మిదో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం.ఇక ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రజావుల్లా పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సరసన నిలిచాడు. 2023 యాషెస్ సిరీస్‌లో లార్డ్స్ వేదికగా స్టోక్స్ 9 సిక్సర్లు కొట్టగా, రజావుల్లా కూడా ఈ మ్యాచ్‌లో 9 సిక్సర్లతో ఆ రికార్డును సమం చేశాడు.అదేవిధంగా టెస్ట్ అరంగేట్రంలో పాకిస్తాన్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన ప్లేయర్‌గా రజావుల్లా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఫహీమ్ అష్రఫ్ పేరిట ఉండేది. 2018లో ఐర్లాండ్‌పై ఫహీమ్ అష్రఫ్ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌తో అష్రఫ్ రికార్డును రజావుల్లా బ్రేక్ చేశాడు. బౌలింగ్‌లో కూడా అతడు నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఇంగ్లండ్ విజయ లక్ష్యం@130బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగుల భారీ స్కోర్ సాధించగల్గింది. దీంతో పర్యాటక జట్టు ఆతిథ్య ఇంగ్లండ్ ముందు కేవలం 130 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. నాలుగో రోజు తొలి సెషన్లో మ్యాచ్ పూర్తి అయ్యే అవకాశముంది.All 8 sixes of Pakistani all-rounder Razaullah earlier today. He hails from Khyber Pakhtunkhwa. pic.twitter.com/5xJtuNEcKC— FrameTheGlobeNews (@FrameGlobeNews) September 12, 2026 -
పాక్‌తో మూడో టెస్టు.. ఇంగ్లండ్ విజయలక్ష్యం 130
పాకిస్తాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు ఇంగ్లండ్ 130 పరుగులు చేయాలి. చివరిదైన మూడో టెస్టులో ఓవర్‌నైట్ స్కోరు 52/2తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 96.4 ఓవర్లలో 449 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టుకు 130 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. పాక్ బ్యాటర్లు అజాన్ అవైస్ (59; 10 ఫోర్లు), షాన్ మసూద్ (95; 12 ఫోర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (76; 11 ఫోర్లు, 1 సిక్స్), రజాఉల్లా (81; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 3 వికెట్లు తీయగా... జోష్ టంగ్, డాన్ లారెన్స్, రాబిన్సన్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 453 పరుగుల భారీ స్కోర్ చేసింది. హ్యారీ బ్రూక్(75), లారెన్స్(65), జేమీ స్మిత్(69), గే(60) హాఫ్ సెంచరీలతో రాణించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాక్ కేవలం 133 పరుగులకు కుప్పకూలిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs AFG: వైభవ్‌కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా -
అరంగేట్రంలోనే పాక్ పేసర్ చెత్త రికార్డు
పాకిస్తాన్ యువ పేసర్ రజావుల్లా టెస్ట్ అరంగేట్రంలోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 4 వికెట్లు తీసి, 6.40 ఎకానమీతో ఏకంగా 148 పరుగులు సమర్పించుకున్నాడు.తద్వారా పాకిస్తాన్ తరఫున టెస్ట్ అరంగేట్రంలో అత్యధిక ఎకానమీతో పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో జాహిద్ మహ్మూద్ అగ్రస్థానంలో ఉన్నాడు. జాహిద్ 2022లో ఇంగ్లండ్‌పై తన టెస్ట్ అరంగేట్రం చేసి, ఆ మ్యాచ్‌లో ఏకంగా 7.3 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా చూసినా టెస్ట్ అరంగేట్రంలో ఇదే అత్యంత చెత్త ఎకానమీగా రికార్డుగా ఉంది.రజావుల్లా పరుగులు ధారాళంగా సమర్పించుకొని, చెత్త రికార్డును మూటగట్టుకున్నా, తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఎమిలియో గే, జో రూట్, జేమీ స్మిత్, రాబిన్సన్ లాంటి కీలక బ్యాటర్లను ఔట్ చేశాడు. అలాగే క్రమం తప్పకుండా 145 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు కేవలం 8 టెస్ట్‌లే ఆడినప్పటికీ, అనుభవజ్ఞుడిలా బౌలింగ్ చేశాడు. రజావుల్లా వేగం చూసి అభిమానులు పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్‌ను గుర్తు చేసుకున్నారు.కాగా, రజావుల్లా తొలుత ఇంగ్లండ్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో లేడు. పాక్ మేనేజ్మెంట్ ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పిలిపించుకోగా.. వారికి ప్రత్యామ్నాయంగా ప్రకటించిన ఆటగాళ్లలో అతడు ఉన్నాడు. అప్పటికే తన వేగంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించిన రజావుల్లా, జట్టుకు ఎంపికైన తొలిసారే తుది జట్టులో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 0-2తో కోల్పోయిన పాక్, మరో ఓటమి దిశగా పయనిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 133 పరుగులకే కుప్పకూలగా.. ఇంగ్లండ్ 453 పరుగులు స్కోర్ చేసి భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో సైతం ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయిన పాక్ జట్టును అజాన్ అవైస్ (43 నాటౌట్), షాన్ మసూద్ (50 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 100-2గా ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 220 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: కోహ్లి స్థానంలో బాబర్..! -
సేమ్ సీన్ రీపీట్! అప్పుడు సెహ్వాగ్.. ఇప్పుడు పాక్ ఓపెనర్
పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ తన టెస్టు క్రికెట్ రీఎంట్రీలో తీవ్ర నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు అనుహ్యంగా పాక్ జట్టులోకి వచ్చిన అయూబ్.. తన లభించిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. ఈ ఆఖరి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతడు డకౌట్ అయ్యాడు.రెండు సార్లు కూడా ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లోనే అతడు అవుట్ కావడం గమనార్హం. వాస్తవానికి తొలుత ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేసిన జట్టులో అయూబ్‌కు చోటు దక్కలేదు. అయితే తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటమి పాలవ్వడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసింది.దీంతో కరేబియన్ లీగ్‌లో ఆడుతున్న అయూబ్‌ను వెంటనే ఇంగ్లండ్‌లో ఉన్న పాక్ జట్టుతో కలవాలని పీసీబీ ఆదేశించింది. దీంతో అతడు ఉన్నపళంగా యూకేకు వెళ్లి ఎడ్జ్‌బాస్టన్‌లో జట్టుతో కలిశాడు. ఇమామ్ ఉల్ హక్ స్ధానంలో ఓపెనర్‌గా అతడికి తుది జట్టులో అవకాశముంది. కానీ అతడు కూడా దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్నాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. "సైమ్ అయూబ్‌ను చివరి టెస్టుకు ఎంపిక చేయడం ఒక తెలివితక్కువ నిర్ణయం. ఎందుకంటే అతడు నేరుగా కరేబియన్ టీ20 లీగ్ నుంచి వచ్చి ఇక్కడ బరిలోకి దిగాడు. టీ20 ఫార్మాట్‌కు, టెస్టు క్రికెట్‌కు చాలా తేడా ఉంటుంది. ఎలాంటి సరైన సన్నాహకాలు లేకుండా, కొంతకాలంగా ఫస్ట్-క్లాస్ క్రికెట్ కూడా ఆడని ప్లేయర్‌ను ఇంగ్లండ్ వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా ఆడించారో అర్థం కావడం లేదు.ఇక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా 'డ్యూక్స్' బాల్‌తో, జోఫ్రా ఆర్చర్, ఓలీ రాబిన్సన్ వంటి పటిష్టమైన ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్‌ను అతడు ఎలా ఎదుర్కొంటాడని సెలెక్టర్లు భావించారో తెలియదు. టెస్టు క్రికెట్ అత్యంత కఠినమైన ఫార్మాట్. అంతేకాకుండా ఇంగ్లండ్ కండిషన్స్‌లో టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ప్రపంచంలో ఏదో మూల టీ20 ఆడుతున్న వ్యక్తిని ఉన్నపళంగా రప్పించి 'గుడ్ లక్' అని మ్యాచ్‌లోకి దింపడం టెస్టు క్రికెట్‌ను అవమానించడమే.గతంలో భారత్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఒక టెస్టు సిరీస్ కోసం వీరేంద్ర సెహ్వాగ్‌ను ప్రత్యేకంగా ఇంగ్లండ్‌కు రప్పించారు, కానీ అతడు రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌట్ అయ్యాడు. నిజానికి అయూబ్ కంటే సెహ్వాగ్ ఎంతో ప్రతిభావంతుడైన క్రికెటర్. అయినప్పటికీ సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఇంగ్లండ్ కఠిన పరిస్థితుల్లో రాణించలేకపోయాడు" అని స్కై స్పోర్ట్స్ డిబేట్లో హుస్సేన్ పేర్కొన్నాడు. -
ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం.. మూడో టెస్ట్‌లోనూ పాక్‌కు మూడినట్టే..!
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే తొలి రెండు టెస్ట్‌లను గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు.. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ భారీ విజయం సాధించేలా కనిపిస్తుంది.ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 133 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 453 పరుగుల భారీ స్కోర్ చేసి, 320 పరుగుల ఆధిక్యం సాధించింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు (ఎమిలియో గే (60), హ్యారీ బ్రూక్ (75), డాన్ లారెన్స్ (65), జేమీ స్మిత్ (69), ఓల్లీ రాబిన్సన్ (50)) ఆటగాళ్లు అర్ద సెంచరీలు సాధించారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ మెరుపు ఇన్నింగ్స్ (32 నాటౌట్) ఆడాడు. మిగతా ప్లేయర్లలో బెన్ డకెట్ 11, జోర్డన్ కాక్స్ 4, కెప్టెన్ రూట్ 8, అట్కిన్సన్ 19, టంగ్ 15 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో రజావుల్లా 4, మొహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ అలీ తలో రెండు, మొహమ్మద్ అబ్బాస్ ఓ వికెట్ తీశారు.133 పరుగులకే కుప్పకూలిన పాక్అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు ఓల్లీ రాబిన్సన్ (3-15), జోఫ్రా ఆర్చర్ (3-25), జోష్ టంగ్ (4-42) ధాటికి పేకమేడలా కూలింది.పాక్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు (సౌద్ షకీల్ (43), మొహమ్మద్ అబ్బాస్ (21), రజావుల్లా (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆ జట్టు స్టార్ బ్యాటర్‌గా చెప్పుకునే బాబర్ ఆజం 7 పరుగులు మాత్రమే చేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిగతా ప్లేయర్లలో సైమ్ అయూబ్ 0, అజాన్ అవైస్ 9, అబ్దుల్లా షఫీక్ 3, షాన్ మసూద్ 5, ఘాజీ ఘోరి 4, మొహమ్మద్ ఇమ్రాన్ 5 పరుగులు మాత్రమే చేశారు.చదవండి: ఫిన్ అలెన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు -
'జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఫామ్‌లోకి వస్తాడు'
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టెస్టు సెంచరీ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులోనూ బాబర్ తీవ్రంగా నిరాశపరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అతనికి ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన బాబర్, యంగ్ పేసర్ జోష్ టంగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.అంతకుముందు లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ అతడు దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. లార్డ్స్ ఓటమి తర్వాత ఎడ్జ్‌బాస్టన్ టెస్టు కోసం పాక్ తమ తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేసింది. అందులో ముగ్గురు అరంగేట్ర ఆటగాళ్లే ఉండటం గమనార్హం. ఈ కీలక టెస్టులో బాబర్ సీనియర్ ఆటగాడిగా జట్టును ముందుండి నడిపిస్తాడని పీసీబీ భావించినప్పటికీ, అతడి ప్రదర్శనలో ఎలాంటి మార్పు రాలేదు.బాబర్ ఆజం టెస్టు ఫార్మాట్లో మూడంకెల స్కోరును అందుకుని మూడేళ్లకు పైగా అవుతోంది. అతడు చివరిసారిగా డిసెంబర్ 2022లో కరాచీ వేదికగా న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి బాబర్ తడబాటు కొనసాగుతూనే ఉంది. ఫామ్ లేమి కారణంగా 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన హోమ్ సిరీస్ మధ్యలోనే అతడిని జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. "బాబర్.. ఇకనైనా నువ్వు మారవా?" అంటూ ఓ యూజర్ 'ఎక్స్'లో పోస్ట్ చేశాడు. "జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఫామ్‌లోకి వస్తాడు" అంటూ మరికొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.చదవండి: ఏషియన్ గేమ్స్.. భారత జట్టులో కీలక మార్పు -
జో రూట్ మరో ఘనత
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ జో రూట్ మరో ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక టెస్ట్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ వా (168), రికీ పాంటింగ్ (168)ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి చేరాడు. పాకిస్తాన్‌తో ఇవాళ మొదలైన మూడో టెస్ట్‌తో రూట్ (169) ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (200), జేమ్స్ ఆండర్సన్ (188) మాత్రమే రూట్ కంటే ముందున్నారు. పరుగుల విషయంలో సచిన్‌ను (15921) వెంటాడుతున్న రూట్ (14208).. ఇప్పుడు మ్యాచ్‌ల విషయంలోనూ అతడి రికార్డును చెరిపి వేసే దిశగా ముందుకు సాగుతున్నాడు.కుప్పకూలిన పాక్ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు ఓల్లీ రాబిన్సన్ (3-15), జోఫ్రా ఆర్చర్ (3-25), జోష్ టంగ్ (4-42) ధాటికి పాక్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది.పాక్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు (సౌద్ షకీల్ (43), మొహమ్మద్ అబ్బాస్ (21), రజావుల్లా (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆ జట్టు స్టార్ బ్యాటర్‌గా చెప్పుకునే బాబర్ ఆజం 7 పరుగులు మాత్రమే చేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిగతా ప్లేయర్లలో సైమ్ అయూబ్ 0, అజాన్ అవైస్ 9, అబ్దుల్లా షఫీక్ 3, షాన్ మసూద్ 5, ఘాజీ ఘోరి 4, మొహమ్మద్ ఇమ్రాన్ 5 పరుగులు మాత్రమే చేశారు.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఇంగ్లండ్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ పేసర్లు -
నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ పేసర్లు
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న నామమాత్రపు మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ పేసర్లు చెలరేగిపోయారు. ఇవాళే ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, పాక్ ఆటగాళ్ల భరతం పట్టింది. పేసర్లు ఓలీ రాబిన్సన్ (3-15), జోఫ్రా ఆర్చర్ (3-25), జోష్ టంగ్ (4-42) నిప్పులు చెరిగే బంతులతో పాక్ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. వీరి దెబ్బకు ఆ జట్టు 133 పరుగులకే కుప్పకూలింది.పాక్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు (సౌద్ షకీల్ (43), మొహమ్మద్ అబ్బాస్ (21), రజావుల్లా (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆ జట్టు స్టార్ బ్యాటర్‌గా చెప్పుకునే బాబర్ ఆజం 7 పరుగులు మాత్రమే చేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిగతా ప్లేయర్లలో సైమ్ అయూబ్ 0, అజాన్ అవైస్ 9, అబ్దుల్లా షఫీక్ 3, షాన్ మసూద్ 5, ఘాజీ ఘోరి 4, మొహమ్మద్ ఇమ్రాన్ 5 పరుగులు మాత్రమే చేశారు.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఇంగ్లండ్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే, పాకిస్తాన్ క్రికెట్లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే ఏడుగురు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయారు. ఆటగాళ్ల క్రమశిక్షణ, ప్రవర్తనపై పీసీబీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఆటగాళ్ల ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని డేటాను పరిశీలించినట్లు నివేదికలు వచ్చాయి.మరోవైపు సిరీస్ మధ్యలో జరిగిన మార్పుల గురించి తనను ముందుగా సంప్రదించలేదని ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం పేర్కొనడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. చదవండి: ఓలీ రాబిన్సన్ 'సెంచరీ'.. 100 ఏళ్లలో అత్యుత్తమం -
ఓలీ రాబిన్సన్ 'సెంచరీ'.. 100 ఏళ్లలో అత్యుత్తమం
పాకిస్తాన్‌తో ఇవాళ మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సైమ్ అయూబ్‌ను ఔట్ చేయడంతో అతడు టెస్ట్‌ల్లో 100 వికెట్లు (24వ టెస్ట్‌లో) పూర్తి చేశాడు. తద్వారా గత 100 ఏళ్లలో అతి తక్కువ సగటుతో (19.34) 100 వికెట్లు పూర్తి చేసిన బౌలర్‌గా నిలిచాడు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కూడా 20 కంటే తక్కువ సగటుతో 100 వికెట్లు పూర్తి చేసినప్పటికీ.. అతడి సగటు రాబిన్సన్ సగటు కంటే కాస్త ఎక్కువగా (19.79) ఉంది. మొత్తంగా గడిచిన 100కు పైగా సంవత్సరాల్లో రాబిన్సన్, బుమ్రా మినహా 20 కంటే తక్కువ సగటులో 100 వికెట్లు తీసిన బౌలరే లేడు.చివరిగా ఇంగ్లండ్‌కే చెందిన సిడ్నీ బార్న్స్ 1901-1914 మధ్యలో 20 కంటే తక్కువ సగటుతో (16.43) 100 వికెట్లు పూర్తి చేశాడు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఏడుగురు మాత్రమే 20 కంటే తక్కువ సగటుతో 100 వికెట్లు పూర్తి చేశారు. ఈ జాబితాలో సిడ్నీ బార్న్స్ టాప్‌లో ఉండగా.. రాబిన్సన్, బుమ్రా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు.అద్భుతమైన పునరాగమనం2026లో టెస్టు జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత 32 ఏళ్ల రాబిన్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతడు, పాకిస్తాన్‌తో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు తీసి మరోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.ప్రస్తుతం పాక్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో రాబిన్సన్ మరోసారి చెలరేగడంతో పాక్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాబిన్సన్ (2-8)తో పాటు జోఫ్రా ఆర్చర్ (2-18), జోష్ టంగ్ (2-8) నిప్పులు చెరగడంతో పాక్ 64 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో ఉంది. సౌద్ షకీల్ (29), మొహమ్మద్ ఇమ్రాన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0తో కైవసం చేసుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్ -
పాక్ సెలక్టర్ పదవికి రాజీనామా.. టీమిండియాపై ప్రశంసలు!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరుపై మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పీసీబీ పెద్దలు విదేశీ కోచ్‌ల విషయంలో ఒకలా.. దేశీ కోచ్‌ల విషయంలో మరోలా వ్యవహరిస్తారని ఆరోపించాడు. ఆటగాళ్లు, కోచ్‌లు మార్పు విషయంలో పీసీబీ తొందరపాటు చర్యలు తీసుకుంటోందని మండిపడ్డాడు.పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభంఅదే సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం క్రమపద్ధతిలో ముందుకు వెళ్తూ రోజురోజుకీ తమ జట్టును మరింతగా అభివృద్ధి చేసుకుంటోందని మిస్బా ప్రశంసించాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిపోగానే.. ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది యాజమాన్యం.అంతేకాదు.. టెస్టు జట్టు హెడ్‌కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను పదవుల నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను వైట్‌బాల్ కోచ్ మైక్ హసన్ చేపట్టాడు. ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపం చెందిన మిస్బా ఉల్ హక్ పాక్ సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకొన్నాడు.వారి విషయంలో మాత్రం ఉదారంగా ఉంటారుఈ క్రమంలో స్థానిక టెలివిజన్ షోలో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్లో విదేశీ కోచ్‌లు, దేశీ కోచ్‌లను వేర్వేరుగా చూస్తారు. విదేశీ కోచ్‌ల పట్ల యాజమాన్యం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుంది. అదే దేశీ కోచ్‌ల విషయంలో మాత్రం ప్రతీ దానికి విమర్శలు వస్తాయి.విదేశీ కోచ్‌లకు అధికారాలు ఎక్కువే ఇస్తారు. కానీ జవాబుదారీతనంలో మాత్రం వారు వెనుకే ఉంటారు. అదే స్థానిక కోచ్‌లు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ ప్రతికూల ఫలితాలు వస్తే ఇక తిట్ల వర్షమే. నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తారు కూడా!ఇక ఒకటీ రెండు మ్యాచ్‌ల తర్వాత ఆటగాళ్లను తొలగించడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. దీని వల్ల ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఒత్తిడిలోనూ రాణించేలా వారికి ఊతం ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తూ మనవాళ్లకు తొందర, హడావుడి ఎక్కువ.టీమిండియాపై ప్రశంసలునిజానికి పాక్ యువ క్రికెటర్లు చాలా మంది ఎక్కువగా వైట్‌బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. రెడ్‌బాల్ క్రికెట్ ఆడేలా వారిని ప్రోత్సహించాలి. ఫోర్-డే మ్యాచ్‌లు మాత్రమే ఉంటే సరిపోదు. దేశీ క్రికెట్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి.90వ దశకం తర్వాత బీసీసీఐ క్రమక్రమంగా జట్టులో మార్పులు చేస్తూ వస్తోంది. లోపాలు సరిచేసుకుంటూ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటోంది. అంతేతప్ప తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదు’’ అని మిస్బా ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.చదవండి: శుబ్‌మన్ గిల్ మెరుపులు -
పాక్ క్రికెట్లో కలకలం.. ఆటగాళ్ల మొబైల్స్ లాక్కున్న పీసీబీ!
పాకిస్తాన్ క్రికెట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు ఉన్నపళంగా జట్టులోని ఏడుగురు ఆటగాళ్లను, ఇద్దరు కోచ్‌లను తొలగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు .. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు ముందు పీసీబీ తమ జట్టు సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.మూడో టెస్టు ముగిసే వరకు ఆ మొబైల్ ఫోన్లు పీసీబీ వద్దే ఉంటాయని పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ చర్యకు గల కారణం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ విషయంపై పీసీబీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ప్రొఫెషనల్ క్రికెట్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై కొన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా వాడకూడదని చెప్పే హక్కు బోర్డుకు లేదు. సాధారణంగా ఆటగాళ్లు స్టేడియానికి వచ్చేటప్పుడు తమ ఫోన్లను సంబంధిత అధికారులకు అందజేస్తారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత వాటిని తిరిగి తీసుకుంటారు. కానీ పీసీబీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటములను చవిచూసింది. దీంతో మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా వంటి స్టార్ ప్లేయర్లతో సహా ఏడుగురిని పీసీబీ స్వదేశానికి తిరిగి పిలిపించింది. వీరితో పాటు కోచ్‌లు సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్లపై కూడా బోర్డు వేటు వేసింది. పీసీబీ తీసుకున్న ఈ హఠాత్తు నిర్ణయాలపై పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగానే, జట్టు సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకుంటూ పీసీబీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
నీకసలు సెన్స్ ఉందా? : ఆసీస్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్లో తలెత్తిన తాజా సంక్షోభంపై ఆ జట్టు మాజీ హెడ్‌కోచ్ జేసన్ గిల్లెస్పి ఘాటుగా స్పందించాడు. ప్యాంట్లు మార్చినంత తేలికగా.. ఎప్పుటికప్పుడు పాక్ జట్టు యాజమాన్యం తమ ప్రణాళికలు, ఆలోచనలు మార్చుకుంటుందని ఘాటు విమర్శలు చేశాడు.కోచ్, ఆటగాళ్లపై వేటుకాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, జట్టులో నిలకడ ఉండదన్న సంగతి తెలిసిందే. ఎప్పుటికప్పుడు అక్కడ కోచ్‌లు, కెప్టెన్లు మారిపోతూ ఉంటారు. తాజాగా ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఆతిథ్య జట్టుతో రెండు టెస్టుల్లో ఓడిపోగానే.. పాక్ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. టెస్టు జట్టు హెడ్‌కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌పై వేటు వేసింది.అదే విధంగా.. దాదాపు ఏడు మంది ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసి స్వదేశానికి పిలిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, 2024లో పాక్ జట్టుకు ఎనిమిది నెలల పాటు హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన గిల్లెస్పి స్పందించాడు. ఆస్ట్రేలియాకు చెందిన వార్తా సంస్థతో మాట్లాడుతూ..వాళ్లను చూస్తే జాలేస్తోంది‘‘పాపం పాకిస్తాన్ ఆటగాళ్లను చూస్తే జాలేస్తోంది. వాళ్ల జీవనాధారం ఆట. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతోనే వాళ్లంతా ఆ జట్టులో ఉన్నారని ఎవరికైనా అర్థమైపోతుంది. సల్మాన్ అలీ ఆఘా తొలి టెస్టులో కెప్టెన్‌గా ఉన్నాడు. రెండో టెస్టు నుంచి అతడిని తొలగించారు.మూడో టెస్టుకు ముందు స్వదేశానికి పిలిపించారు. అసలు ఇదేం తీరు? దీనిని బట్టి సెలక్షన్ కమిటీ ఎంత గందరగోళంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆకిబ్ జావేద్ వచ్చిన తర్వాత సెలక్షన్ కమిటీ చెత్తగా మారిపోయింది. ప్యాంట్లు మార్చినంత తేలికగా వాళ్లు నిర్ణయాలు మార్చేసుకుంటారు.నీకసలు సెన్స్ ఉందా?ఆకిబ్ జావేద్ ఇటీవల నాపై, గ్యారీ కిర్‌స్టెన్‌పై నిందలు వేశాడు. మా వల్ల జట్టు వెనుకబడిందన్నాడు. మరి గత రెండేళ్లుగా అతడే సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు. అప్పుడు కూడా జట్టు పరిస్థితి ఇదే విధంగా ఉండేది. కానీ అతడు మమ్మల్ని నిందిస్తున్నాడు.అసలు సెన్స్ ఉన్నవాళ్లు ఎవరూ ఆకిబ్లా మాట్లాడరు. ఆకిబ్ ముందు తనను తాను అద్దంలో చూసుకోవాలి. తన తప్పుల్ని తెలుసుకోవాలి. అసలు ఆకిబ్ జావేద్‌కు ఇతర సెలక్టర్లతో సత్సంబంధాలు ఉన్నాయో లేదో? ఈ విషయాన్ని పక్కనపెడితే వారితో అసలు మాట్లాడుతూ వారి ఆలోచనలు కూడా తెలుసుకుంటున్నాడా? లేదా అన్నదే ప్రశ్న.ఆటగాళ్లు జట్టులో తాము స్థానం కోల్పోయిన విషయాన్ని మీడియా ద్వారానో.. కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారానో తెలుసుకోవడం కంటే చెత్త విషయం మరొకటి ఉండదు. ఇది వారిని అగౌరవపరచడమే’’ అని జేసన్ గిల్లెస్పి పాక్ బోర్డు, చీఫ్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ తీరుపై నిప్పులు చెరిగాడు. చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్! -
పాక్‌తో చివరి టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ కొనసాగింపు
సెప్టెంబర్ 9 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగబోయే చివరిదైన, నామమాత్రపు మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో యువ పేసర్ సోనీ బేకర్ తన స్థానాన్ని నిలుపుకోగా.. బ్రైడన్ కార్స్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు.కార్స్‌పై గత నెలలో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో వేటు కొనసాగింది. ఆగస్టు 22న డెర్బీలోని ఓ నైట్‌క్లబ్ వెలుపల జరిగిన ఘటనలో పోలీసులు కార్స్‌ను కొద్దిసేపు చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. 31 ఏళ్ల కార్స్ ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణను ఎదుర్కొంటున్నాడు.ఈ నేపథ్యంలో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టుకు అతడి స్థానంలో సోనీ బేకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. తాజాగా మూడో టెస్టుకు కూడా బేకర్‌ను కొనసాగిస్తూ ఇంగ్లండ్ తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. స్క్వాడ్‌లో మరో మార్పు కూడా జరిగింది. పేసర్ మాథ్యూ ఫిషర్‌ను జట్టు నుంచి తప్పించారు. ఈ రెండు మార్పులు మినహా ఇంగ్లండ్ జట్టు యధాతథంగా కొనసాగింది.కాగా, పాకిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. త్వరలో జరుగబోయే మూడో టెస్ట్‌లోనూ గెలిచి పాక్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది.పాక్‌తో మూడో టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టుజో రూట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, ఎమిలియో గే, డాన్ లారెన్స్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, జామీ స్మిత్, జోష్ టంగ్చదవండి: హ్యాట్రిక్ సహా 7 వికెట్లు.. చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్ -
ఆస్పత్రి పాలైన బాబర్ ఆజం!.. అసలేం జరుగుతోంది?
పాకిస్తాన్ క్రికెట్లో సంక్షోభం రోజురోజుకీ ముదిరిపోతోంది. ఇంగ్లండ్ గడ్డ మీద ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓటమిపాలైన పాక్.. మూడో టెస్టుకు ముందు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సెప్టెంబరు 9న ఈ మ్యాచ్ మొదలుకానుండగా.. ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది.ఏడుగురిపై వేటుసీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, తొలి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్లను స్వదేశానికి పంపింది పాక్ బోర్డు. అదే విధంగా టెస్టు జట్టు హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను తప్పించింది.ఇక రిలీజ్ చేసిన ఆటగాళ్ల స్థానాల్లో సయీమ్ ఆయుబ్, అబ్దుల్లా ఫజల్‌తో పాటు పెద్దగా అనుభవం లేని అరాఫత్ మిన్హాస్, మహ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహ్మద్ ఇమ్రాన్ రాంధావా, రజావుల్లాలను ఇంగ్లండ్‌కు పిలిపించింది. ఇక పాక్- ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబరు 9న మూడో టెస్టు మొదలుకానుంది.బాబర్‌కు అస్వస్థతఈ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. తీవ్రమైన జ్వరం, కఫం, గొంతునొప్పితో అతడు ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల పాటు బాబర్‌కు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు సమాచారం.ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ జట్టుకు బాబర్ అస్వస్థతకు గురికావడం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. అయితే, బాబర్ కోలుకుంటున్నాడని.. అతడు మూడో టెస్టు ఆడతాడని పాక్ టీమ్ మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా జియో న్యూస్‌కు తెలిపాడు. మరోవైపు బాబర్ సైతం తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పినట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది.అలా తొలి టెస్టుకు దూరంకాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడి బాబర్ తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 8, 6 పరుగులు చేశాడు.లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఇన్నింగ్స్, 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో మట్టికరిచింది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించే దుస్థితి తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. రెండో టెస్టు సందర్భంగా బ్యాటింగ్ నుంచి తప్పించుకునేందుకు ఇమామ్ ఉల్ హక్ గాయం పేరుతో నాటకాలు ఆడాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించగా.. అతడు తన న్యాయవాది ద్వారా ముందుకు వెళ్లనున్నాడనే వార్తలు వస్తున్నాయి. చదవండి: IND vs AFG: తుదిజట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్! -
'నీవొక డమ్మీ కెప్టెన్.. వెంటనే రాజీనామా చేయ్'
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాక్ జట్టు వరుసగా రెండు టెస్టుల్లో ఘోర ఓటమిని చవిచూసింది. లీడ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైన పాకిస్తాన్, లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులోనూ అదే తీరును పునరావృతం చేసింది. ఆతిథ్య జట్టు చేతిలో 194 పరుగుల తేడాతో ఓడిపోయింది.దీంతో మూడో టెస్టుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్లను జట్టు నుంచి పీసీబీ విడుదల చేసింది. అంతేకాకుండా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లపై కూడా పీసీబీ వేటు వేసింది. ఇవన్నీ సెలక్షన్ కమిటీకి ముందస్తు సమాచారం లేకుండానే జరగడం గమనార్హం.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజామ్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఆటగాళ్లను, కోచ్‌లను పీసీబీ బలిపశువులను చేసిందని, వారికి మద్దతుగా బాబర్ తన కెప్టెన్సీకి వెంటనే రాజీనామా చేయాల్సిందని లతీఫ్ అభిప్రాయపడ్డాడు."జట్టులోని సగం మంది ఆటగాళ్లను ఉన్నపళంగా ఇంటికి పంపించడం సరైన నిర్ణయం కాదు. ఆటలో గెలుపోటములు సహజం. నిజానికి బాబర్ అజామ్ ఇప్పటికే తన కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సింది. అదే అతడి స్థానంలో నేను ఉండి ఉంటే కచ్చితంగా కెప్టెన్సీని వదిలేసేవాడిని.అతడొక డమ్మీ కెప్టెన్‌గా మిగిలిపోయాడు. నాయకుడికి, కెప్టెన్‌కు మధ్య చాలా తేడా ఉంటుంది. నిజమైన నాయకుడు ఎప్పుడూ తన సహచర ఆటగాళ్ల గురించి కూడా ఆలోచిస్తాడు. అసలు ఏడుగురు ఆటగాళ్లను అర్ధాంతరంగా వెనక్కి ఎందుకు పంపాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు. ఇమామ్-వుల్-హక్కు గాయమైందని నాకు తెలుసు. కానీ మిగతా ఆరుగురు చేసిన తప్పేమిటి? చివరికి కోచ్, నీ మెంటార్లను సైతం వెనక్కి పంపేశారు.సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్‌గా పాకిస్తాన్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఉమర్ గుల్ ఎన్నో ఏళ్ల పాటు పాక్ క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. అలాంటి దిగ్గజాలకు అవమానం జరుగుతుంటే బాబర్ నోరుమెదపకుండా మౌనంగా ఉండడం ఏమాత్రం తగదు. పీసీబీకి ఎప్పుడూ ఒక డమ్మీ కెప్టెన్ మాత్రమే కావాలి. ఈ ఘటనతో అది మరోసారి స్పష్టమైందని" లతీఫ్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: IND vs AFG: ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ అన్నారు.. కట్ చేస్తే సీన్ రివర్స్! -
పాక్ క్రికెట్లో సంక్షోభం; మనస్తాపానికి గురై పదవికి రాజీనామా!
పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభం నెలకొంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండు వరుస ఓటములు ఆ జట్టులో ముసలం పుట్టించింది. టెస్టు సిరీస్‌లో పాక్ వరుస ఓటముల కారణంగా పీసీబీ (PCB) జట్టులో భారీ మార్పులు చేసింది. అయితే సెలెక్టర్లతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ప్లేయర్లను తొలగించడం, కోచింగ్ స్టాప్‌ను మార్చడం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన పాకిస్తాన్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ తన పదవికి రాజీనామా చేశాడు. అంతేకాదు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మిస్బా ప్రకటించాడు. అయితే మిస్బా రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించలేదు.అసలేం జరిగింది?లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత పాకిస్థాన్ జట్టులో పీసీబీ భారీ మార్పులు చేసింది. సెలక్టర్లను సంప్రదించకుండానే టెస్టు జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. టెస్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను కూడా వారి పదవుల నుంచి తొలగించినట్లు సమాచారం. మూడో టెస్టుకు ముందు వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హసన్, బౌలింగ్ కోచ్ ఆష్లే నాఫ్కే టెస్టు కోచింగ్ సిబ్బందిలో చేరారు.పాక్ జట్టు నుంచి విడుదలైన ఆటగాళ్లలో మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్ ఉన్నారు. వీరి స్థానంలో సయీమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్‌తో పాటు కేవలం 10 మ్యాచ్‌ల ఉమ్మడి అనుభవం ఉన్న ఐదుగురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చింది.జట్టులోకి వచ్చిన ఐదుగురు కొత్త ఆటగాళ్లు: అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్ రంధావా, రజావుల్లా.2019లో పాకిస్తాన్ హెడ్‌కోచ్ పదవిపాకిస్తాన్ అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా పేరు పొందిన మిస్బా ఉల్ హక్ వీడ్కోలు అనంతరం పీసీబీలో పలు కీలక పదవులు నిర్వహించాడు. 2019లో పాకిస్తాన్ హెడ్‌కోచ్ సహా చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపికయ్యాడు. అయితే కోచింగ్ బాధ్యతలపై దృష్టి పెట్టడానికి 2020 అక్టోబర్‌లో చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 2021లో హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు.2023లో, మిస్బా అప్పటి తాత్కాలిక నిర్వహణ కమిటీ అధిపతి జకా అష్రఫ్ ఆధ్వర్యంలో సలహాదారుగా పీసీబీకి తిరిగొచ్చాడు. ఈ ఏడాది మార్చిలో ఆకిబ్ జావేద్, సర్ఫరాజ్ అహ్మద్, అసద్ షఫిక్లతో పాటు మిస్బా నలుగురు సభ్యుల జాతీయ ఎంపిక కమిటీలో చేరాడు. దీంతోపాటు సంవత్సరానికి 180 రోజులు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తానని పీసీబీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్ తమ చివరి టెస్టును సెప్టెంబర్ 9 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆడనుంది.Misbah-ul-Haq has offered his resignation from the Pakistan men's national selection committee a day after the PCB made wholesale changes to the Test squad and team management https://t.co/Yc5oSoUL0S pic.twitter.com/oApQR5kzRj— Cricinfo (@cricinfo) September 1, 2026చదవండి: గెలిపించిన షమీ, ఇషాన్ కిషన్.. ఫైనల్లో ఈస్ట్‌జోన్ -
సిరీస్ ఓటమి; పాక్ జట్టులో మార్పులు.. కోచ్ పదవి ఊస్ట్!
ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 0-2తో ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసిన పాకిస్తాన్ రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో దారుణ పరాజయం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు ముందు జట్టులో కీలకమార్పులతో పాటు ప్రధానంగా రెడ్‌బాల్ కోచ్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ పదవి ఊస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో వైట్‌బాల్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మైక్ హసన్‌కే టెస్టు కోచ్ బాధ్యతలు అప్పజెప్పాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తోంది. ఇదే గనుక జరిగితే మైక్ హసన్ మూడు ఫార్మాట్లకు హెడ్ కోచ్‌గా ఉండనున్నాడు.వరుస పరాజయాల నేపథ్యంలో టెస్ట్ జట్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పీసీబీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం లండన్‌లోనే ఉన్న మైక్ హెసన్, ఆకిబ్ జావేద్‌తో కలిసి ప్రిన్స్ చార్లెస్ ఏర్పాటు చేసిన ఒక డిన్నర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ పర్యటనలోనే ఆయనకు టెస్ట్ జట్టు బాధ్యతలను కూడా అప్పగించే ప్రక్రియ వేగవంతమైంది.సెప్టెంబర్ 9 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే మైక్ హెసన్ పాకిస్తాన్ జట్టుతో కలవనున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మూడో టెస్ట్ సమయంలో హెసన్ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది సర్ఫరాజ్ అహ్మద్ పదవికి ముగింపు కార్డు పడినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ 18న బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌కు ముందు సర్ఫరాజ్ అహ్మద్‌ను టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమించారు. అయితే ఆయన ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. మొదటి అసైన్‌మెంట్‌లోనే బంగ్లాదేశ్ చేతిలో సొంత గడ్డపై వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో 2 టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో మరో వైట్‌వాష్ దిశగా ప్రయాణిస్తుండటంతో పీసీబీ వేటు వేయక తప్పని పరిస్థితి నెలకొంది.ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ముగిసిన అనంతరం ఇమామ్ ఉల్ హక్‌తో పాటు సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. తాజాగా బాబర్ గైర్హాజరీలో మొదటి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ అఘాను కూడా పీసీబీ జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో సల్మాన్ అఘా స్వదేశానికి తిరిగి రానున్నాడు.🚨SARFARAZ AHMED SACKED FROM TEST COACH 🚨 - Pakistan current Test coach Sarfaraz Ahmed & bowling coach Umar Gul sidelined from test team. - Mike Hesson asked for take charge of Pakistan test team. pic.twitter.com/fDY7iF8fkv— Cricket Central (@CricketCentrl) August 31, 2026చదవండి: సచిన్‌ను వెంటాడిన ఫోబియా వైభవ్‌కు అంటుకుందా? -
గాయం పేరుతో నాటకమా? నిజమని తేలితే నిషేధమే!
పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ గాయం విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రత్యేక అధికారుల బృందం సీరియస్ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. పిక్క కండరాల గాయంతో ఇమామ్-ఉల్-హక్ మూడో టెస్టు ఆడకుండానే స్వదేశానికి తిరుగుపయనమ య్యాడు. లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో తొలి రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇమామ్ పిక్క కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయితే స్కానింగ్‌లో ఇమామ్‌కు స్వల్ప గాయం మాత్రమే అయినట్లు నిర్థరాణ అయింది. నిజానికి ఇమామ్ ఉల్ హక్కు పెద్దగా గాయం కాలేదని, కానీ కఠిన పరిస్థితుల్లో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడానికి భయపడి గాయం పేరుతో ఇలా నాటకాలు ఆడినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఇంగ్లండ్ గడ్డపై ఆడేందుకు భయపడే ఇమామ్-ఉల్-హక్ నకిలీ గాయం పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేశాడని మాజీ పాక్ క్రికెటర్లు ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన పీసీబీ ఇమామ్ గాయం నిజామా? కాదా? అన్నది తేల్చేందుకు అధికార యంత్రాంగంతో విచారణ ప్రారంభించనుంది.గతంలోనూ ఇలాగే..ఇమామ్ ఉల్ హక్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేమీ కొత్త కాదు. 2025లో న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా నేపియర్ వేదికగా తొలి వన్డేకు ముందు తన కాలి కుడి బొటనవేలిలో తీవ్రమైన నొప్పి ఉందని పీసీబీకి ఫిర్యాదు చేశాడు. అయితే ఎక్స్-రేల్లో మాత్రం బొటనవేలులో ఎలాంటి చీలిక లేదా స్థానభ్రంశం జరిగినట్లు ఆధారాలు కనిపించలేదు. పాక్ క్రికెట్ వైద్య బృందం ప్రకారం, ఇమామ్ కాలి బొటనవేలు నుంచి వచ్చింది రక్తం కాదని, అది సిరా గుర్తు అని తమ నివేదికలో తేలినట్లు అప్పట్లో పేర్కొంది. కేవలం న్యూజిలాండ్‌లోని పేస్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడాన్ని తప్పించుకోవడానికే ఇమామ్ ఉల్ హక్ గాయమైనట్లు నటించాడని వార్తలు వచ్చాయి. అవసరమైతే నిషేధం..పీసీబీ విచారణ సమయంలో వారి వద్దకు వచ్చినప్పుడు ఇమామ్ కుంటుతూ నడిచాడని, వాళ్లు వెళ్లిపోయాక బయటకు మాత్రం యథావిధిగా నడుచుకుంటూ వచ్చాడని సమాచారం అందింది. అందుకే ఈసారి పీసీబీ దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ఇమామ్‌కు గాయం నిజమైతే పర్వాలేదు కానీ, ఒకవేళ గాయం తీవ్రత పెద్దగా లేకపోయినప్పటికీ, నటించినట్లు తేలితే మాత్రం ఈసారి అతడిపై కఠిన చర్యలకు ఆస్కారం ఉంటుంది. అవసరమైతే జట్టు నుంచి సస్పెండ్ చేసే యోచనలో ఉన్నాం’’ అని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.ఇక ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ముగిసిన అనంతరం ఇమామ్ ఉల్ హక్‌తో పాటు సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఇక మూడో టెస్టు కోసం పాకిస్తాన్ జట్టులో స్వల్ప మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే చివరి టెస్టు కోసం సయీమ్ అయూబ్, అరాఫత్ మిన్హాస్ సహా ఆరుగురు ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు పిలిపించింది. సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు!ఇక ప్రస్తుతం రెడ్‌బాల్ క్రికెట్ కోచ్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు పటే అవకాశాలున్నాయి. సర్ఫరాజ్ అహ్మద్ స్థానంలో ప్రస్తుతం వైట్‌బాల్ క్రికెట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మైక్ హసన్‌కే బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్‌కు 2-0తో సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ మూడో టెస్టును ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆడనుంది.Read: యూరోపియన్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ విధ్వంసం -
వాళ్లతో పోటీ ఏంటి?: పాక్ పరువు తీసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్!
పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ నాసిర్ హుసేన్ ఘాటు విమర్శలు చేశాడు. అసలు ఇలాంటి జట్టుపై గెలవడం పెద్ద కష్టమేమీ కాదని.. ఇప్పటికైనా సంబరాలు మానుకోవాలని జో రూట్ బృందానికి సూచించాడు. స్థాయికి తగ్గ జట్లపై విజయాలు సాధించడం మాత్రమే ముఖ్యమంటూ పాక్ పరువు తీశాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ మీద 103 పరుగుల తేడాతో గెలిచి ఇంగ్లండ్ పాక్‌ను మట్టికరిపించింది. ఇక లార్డ్స్ వేదికగా రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టు బాబర్ ఆజం బృందాన్ని 194 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 ఫైనల్ రేసు నుంచి పాక్ దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ బాబర్ ఆజం బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.పోస్ట్ మ్యాచ్ ఎక్స్పర్ట్ కామెంట్రీ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ జట్టు పాకిస్తానీ బ్యాటింగ్ లైనపై విజయం ద్వారా తమ ప్రతిభను అంచనా వేయొద్దు. నేను ప్రతీసారి చెబుతున్న మాటే ఇది. పాకిస్తాన్ చాలా చాలా బలహీనమైన జట్టు.ఆస్ట్రేలియా, సౌతాఫ్రియా, ఇండియా వంటి జట్లతో మ్యాచ్‌ల ఫలితాలను బట్టి మాత్రమే ఇంగ్లండ్ జట్టు తమను తాము అంచనా వేసుకోవాల్సి ఉంటుంది’’ అని నాసిర్ హుసేన్ పేర్కొన్నాడు. ఇక ఓటమి అనంతరం తాము తిరిగి పుంజుకుంటామని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై నాసిర్ హుసేన్ స్పందిస్తూ.. పాకిస్తాన్ ఎప్పటికీ తిరిగి పోరాడలేదని కుండబద్దలు కొట్టేశాడు. పాక్ జట్టు మునుపటిలా లేదని.. అయినా సరే వారికి కొంతమంది అనవసరంగా ‘హైప్’ ఇస్తున్నారని పేర్కొన్నాడు. కనీసం మూడో టెస్టులోనైనా కాస్త మెరుగ్గా ఆడాలని బాబర్ బృందానికి సూచించాడు. కాగా ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు.. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అదంతా నాటకం: పాక్ ఓపెనర్‌పై ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్
పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ తీరుపై ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజంగా గాయపడి ఉంటే నాటకాలు ఆడాల్సిన అవసరం లేదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.మరో మ్యాచ్ మిగిలి ఉండగానేఇందులో భాగంగా.. ఆతిథ్య జట్టు చేతిలో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాక్.. రెండో టెస్టులోనూ 194 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఈ సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోగా.. పాక్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.నొప్పితో విలవిల్లాడుతూఇదిలా ఉంటే.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్‌కు బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో భాగంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ గాయపడ్డాడు. మోకాలి నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. మిగిలిన నాలుగు రోజుల ఆటకు అతడు దూరం కావడంతో.. పాక్ పది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్ కొనసాగించింది.నాటకం ఆడాడుఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ బ్యాటర్ మహ్మద్ వసీం ఇమామ్ తన గాయాన్ని ఎక్కువచేసి చూపించాడని.. బ్యాటింగ్ తప్పించుకునేందుకే ఇలా నాటకం ఆడాడని నిందించాడు. మరోవైపు.. నాలుగో రోజు ఆటకు ముందు ఇమామ్ ఉల్ హక్ మోకాలికి పెద్ద బ్యాండేజ్ కట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించాడు. అవసరమైతే ఆఖరి రోజు బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నానట్లు సంకేతాలు ఇచ్చాడు.బిల్డప్ మాత్రమేఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఇమామ్ ఉల్ తీరుపై ఘాటుగా స్పందించాడు. స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అదంతా షో ఆఫ్. కేవలం నాటకం మాత్రమే. తన సహచర ఆటగాళ్లు, మీడియా ముందు తానేదో కష్టపడుతున్నానని చూపే ప్రయత్నం.ఇలాంటివి లోపల చేయొచ్చు. కానీ అందరిముందు ఇలా చేయడం బిల్డప్ మాత్రమే. షార్ట్స్ వేసుకుని మోకాలికి టేప్ చుట్టుకుని చుట్టూ తిరగాల్సిన అవసరంలేదు. నాకైతే ఇది ఎంతమాత్రం నచ్చలేదు. సారీ’’ అంటూ స్టువర్ట్ బ్రాడ్ మండిపడ్డాడు. కాగా రెండో టెస్టులో ఇమామ్ బ్యాటింగ్‌కే రాలేదు. మరోవైపు.. మూడో రోజు ఆట తర్వాత మీడియాతో మాట్లాడిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అలీ.. ‘నాకు ఇమామ్ పరిస్థితి గురించి తెలుసు. కానీ నేనేమీ మాట్లాడకూడదు. వైద్య బృందమే మీకు సరిగ్గా వివరించగలదు’ అని చెప్పాడు. దీనిని బట్టి స్టువర్ట్ బ్రాడ్ అన్న మాటలు నిజమేనేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ వీరవిహారం“He could have practiced comfortably and alone in the indoor facility, but he is coming out suddenly with half-shots and heavy tapping. It’s more like showing to the media and fans, and sorry, I am not impressed at all.”~ Stuart Broad tears into Imam-ul-Haq, accuses Pakistan…— Cricketopia (@CricketopiaCom) August 31, 2026 -
పాకిస్తాన్ ఖేల్ ఖతం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి అవుట్!
ఇంగ్లండ్ గడ్డపై పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల భారీ తేడాతో పాక్ ఘోర ఓటమి చవిచూసింది. దీంతో పర్యాటక జట్టు మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్‌కు సమర్పించుకుంది. లార్డ్స్ టెస్టులో బౌలింగ్ పరంగా పాకిస్తాన్ పర్వాలేన్పించినప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 389 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో కేవలం 194 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ పేసర్ ఓలీ రాబిన్సన్ 4 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు జోష్ టంగ్ మూడు, ఆర్చర్ రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 110 పరుగులకే కుప్పకూలింది.పాక్ ఖేల్ ఖతంకాగా ఈ ఓటమితో పాకిస్తాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్ రేసు దాదాపు నిష్క్రమించినట్లే. ఈ సైకిల్లో ఇప్పటివరకు 8 టెస్టులు ఆడిన పాకిస్తాన్.. కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. 16.67 విజయాల శాతంతో పాక్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి పడిపోయింది. ప్రస్తుత సైకిల్లో పాక్ ఇంకా 5 టెస్టులు ఆడనుంది. ఇక ఇంగ్లండ్ ఈ విజయంతో ఆరువ స్ధానానికి చేరుకుంది. రూట్ సేన విజయాల శాతం 33.44గా ఉంది. ఇంగ్లీష్ జట్టు ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ గెలవాల్సిందే. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తర్వాత స్దానాల్లో ఉన్నాయి. భారత్ ఐదో స్ధానంలో ఉంది. టీమిండియా ఇంకా 7 మ్యాచ్‌లు ఆడనుంది. అందులో ఐదు గెలిచినా గిల్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది.చదవండి: థాయ్‌లాండ్‌తో మ్యాచ్.. స్మృతి మంధన ప్రపంచ రికార్డు -
లార్డ్స్‌లో పాక్ బౌలర్ అరుదైన ఫీట్.. అక్రమ్ వల్ల కాలేదు!
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ ఇంగ్లండ్ గడ్డపై అరుదైన ఫీట్ సాధించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మొహమ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా లార్డ్స్ మైదానంలో ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన ఏడో పాకిస్తాన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అయితే పాక్ దిగ్గజ బౌలర్‌గా పేరొందిన వసీం అక్రమ్‌కు లార్డ్స్ మైదానంలో ఒక్క ఐదు వికెట్ల హాల్ లేకపోవడం గమనార్హం.లార్డ్స్ లో 5 వికెట్లు తీసిన పాక్ బౌలర్లు👉ఖాన్ మొహమ్మద్ (1956లో)👉ముదస్సర్ నజర్ (1982లో)👉వకార్ యూనిస్ (1992లో)👉ముస్తాక్ అహ్మద్ (1996లో)👉మొహమ్మద్ ఆమిర్ (2010లో)👉యాసిర్ షా (2016లో)👉తాజాగా మొహమ్మద్ అబ్బాస్ (2026లో)అంతేకాదు అబ్బాస్ ఐదు వికెట్ల ఫీట్‌తో లార్డ్స్ హానర్స్ బోర్డులోనూ చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అబ్బాస్‌కు ఇదే మొదటి ఐదు వికెట్ల హాల్ కాగా, టెస్టుల్లో ఇది 8వ ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. గతంలో సౌతాఫ్రికా గడ్డపై, బంగ్లాదేశ్ గడ్డపై, వెస్టిండీస్ గడ్డపై.. తాజాగా ఇంగ్లండ్ గడ్డపై కూడా ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన అబ్బాస్ అరుదైన ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా మొమహ్మద్ అబ్బాస్ పాకిస్తాన్ తరఫున 32 టెస్టుల్లో 128 వికెట్లు పడగొట్టాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 389 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. సాద్ షకీల్ (23), షాన్ మసూద్ (15) క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌట్ అయింది.MOHAMMAD ABBAS GETS 5Mohammad Abbas enters the Lord's Honours Board 👏 pic.twitter.com/7HiUwWaFVO— PctMedia (@PctMediaa) August 30, 2026చదవండి: ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు స్టార్ ప్లేయర్ దూరం.. షాక్‌లో సౌతాఫ్రికా! -
గాయంతో కీలక బ్యాటర్ ఔట్.. పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ!
ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. కానీ పాక్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ రెండో టెస్టుకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ విధించిన 389 పరుగులు టార్గెట్‌ను పాకిస్తాన్ ఛేదిస్తుందా లేక చతికిలపడుతుందా అన్నది పక్కనబెడితే, ఇమామ్ ఉల్ హక్ బ్యాటింగ్‌కు రాకపోతే అప్పుడు పాక్ పది మంది బ్యాటర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఇది పాక్‌కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఆట తొలిరోజే ఇమామ్ గాయపడడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. అయితే స్కానింగ్‌లో ఎడమ తొడ కండరాల్లో చీలిక వచ్చినట్లు తేలింది. ఇది గ్రేడ్ -1 టియర్‌గా వైద్యులు పరిగణించారు. దీంతో ఇమామ్-ఉల్-హక్కు పది రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అయితే ఇమామ్ ఉల్ హక్ గాయం విషయమై పీసీబీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే మేనేజ్మెంట్ మాత్రం రిస్క్ తీసుకోవద్దనే భావిస్తోంది. దీంతో ఇమామ్ ఉల్ హక్ సిరీస్‌లో చివరి టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దగా ఫామ్‌లో లేకపోయినప్పటికీ, స్పెషలిస్ట్ బ్యాటర్‌గా పేరున్న ఇమామ్ గాయంతో దూరమవ్వడం పాక్‌కు ఇబ్బంది కలిగించనుంది. రెండో టెస్టులో 10 మందితోనే ఆడాల్సి ఉంటుంది. వెస్టిండీస్‌తో సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు కలిపి కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్, రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ 208 ఆలౌట్..ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటైంది. డాన్ లారెన్స్ (54) అర్ధసెంచరీ సాధించగా, హ్యారీ బ్రూక్ (34), ఎమియో గే (31), రూట్ (24) పర్వాలేదనిపించారు. మొహమ్మద్ అబ్బాస్ 5 వికెట్లు తీయగా, ఖుర్రమ్, మొహమ్మద్ అలీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో పాకిస్తాన్ ముంగిట 389 పరుగుల లక్ష్యం విధించింది. ఛేదనలో పాకిస్తాన్ తడబడుతోంది. 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఓటమి దిశగా పయనిస్తోంది. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ కాగా, పాకిస్తాన్ 110 పరుగులకే కుప్పకూలింది.Read: ‘నోబాల్ వేస్తే ఫ్రీ హిట్ కాదు.. కఠిన శిక్షలు వేయాలి’ -
బౌలర్లతో పోటీపడుతున్న బాబర్ ఆజం
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్‌గా చెప్పుకొనే బాబర్ ఆజం ఇటీవలికాలంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. టెస్ట్ క్రికెట్ అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగా మారింది. ఈ ఫార్మాట్లో అతడు సెంచరీ చేసి ఏకంగా 36 ఇన్నింగ్స్‌లు అవుతుందంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది.ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులే చేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో జోర్డన్ కాక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఈ చెత్త ప్రదర్శన తర్వాత బాబర్ పేరు హైలైట్‌గా మారింది. టెస్ట్ సెంచరీ లేకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో అతడు బౌలర్లతో పోటీపడుతున్నాడు. 2023 తర్వాత టెస్ట్ సెంచరీ లేకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో మిచెల్ స్టార్క్ (50), పాట్ కమిన్స్ (47), మహ్మద్ సిరాజ్ (44), నాథన్ లియోన్ (41) లాంటి బౌలర్లే బాబర్ కంటే ముందున్నారు. ఈ జాబితా టాప్-13లో బాబర్ మినహా ఒక్క స్పెషలిస్ట్ బ్యాటర్ కూడా లేడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి, మొత్తం 357 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 290 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ 110 పరుగులకే కుప్పకూలింది. మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ నెగ్గిన ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం.. పాక్‌కు ఓటమి తప్పదా? -
ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం.. పాక్‌కు ఓటమి తప్పదా?
లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ ఇంగ్లండ్ 350 పరుగుల లీడ్‌కు చేరువలో ఉంది. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులతో ఆడుతోంది. డాన్ లారెన్స్ (37), గస్ అకిన్సన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 342 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆటకు మరో రెండు రోజులు సమయం ఉండడంతో పాక్‌కు మరో ఓటమి తప్పేలా లేదనిపిస్తోంది. నాసిరకం బ్యాటింగ్‌తో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ లార్డ్స్ పిచ్‌పై రెండో బ్యాటింగ్ చేసి 350కి పైగా పరుగుల టార్గెట్‌ను ఛేదించడం కష్టం, ఆ జట్టు బ్యాటర్లు ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా అసాధ్యమని చెప్పొచ్చు. మూడో రోజు ఆటకు వరుణుడు పదే పదే అడ్డు తగలడంతో ఇంగ్లండ్‌కు బ్యాటింగ్‌కు పెద్దగా అవకాశం రాలేదు. ఓవర్‌నైట్ స్కోరు 81-3తో మూడోరోజు ఆట మొదలైన కాసేపటికే ఇంగ్లండ్ రూట్ (24) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుణుడు దంచికొట్టడంతో ఆట నిలిచిపోయింది. వర్షం విరామం అనంతరం ఆట మొదలవ్వగా, హ్యారీ బ్రూక్ (34), డాన్ లారెన్స్ (37 బ్యాటింగ్) ఐదో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత జేమీ స్మిత్ (7) తొందరగానే ఔటయ్యాడు. మరోసారి వర్షం దంచికొట్టడంతో ఇంగ్లండ్ టీ విరామానికి వెళ్లింది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 3 వికెట్లు తీయగా, కుర్రమ్ షెహజాద్ 2 వికెట్లు పడగొట్టాడు.🚨 BIG WICKET FOR PAKISTAN! 🇵🇰- Mohammad Abbas dismisses Harry Brook.A brilliant catch by Mohammad Rizwan! England were 84/4, and Pakistan got their 5th wicket at 128 runs..A HUGE WICKET FOR PAKISTAN! pic.twitter.com/2ODRcq6SZj— Talha Nawaz (@TalhaDigital007) August 29, 2026Read: డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం -
‘బాయ్‌కాట్ విషయమే తెలీదు.. అప్పుడు భోజనం చేస్తున్నాం’
పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులను స్కై స్పోర్ట్స్ ఇంటర్య్వూ చేయడాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిని నిరసిస్తూ లార్డ్స్ టెస్టును బహిష్కరిస్తామని పీసీబీ పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై పాకిస్తాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాడు. ఈ విషయాలేవీ తమకు తెలియదని, ఆటపై మాత్రమే దృష్టి పెట్టామని, ఆ సమయంలో తాము భోజనం చేస్తున్నామని చెప్పడం ఆసక్తి కలిగించింది.అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. లార్డ్స్ టెస్ట్ సందర్భంగా తొలి రోజు ఆట సమయంలో మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ అథర్టన్, ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిమ్, సులేమాన్‌లను ఇంటర్వ్యూ చేశాడు. జైలులో ఉన్న తమ తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందని, కంటిచూపు కూడా తగ్గుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, పాక్ ప్రభుత్వంలో హోం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఈ ఇంటర్వ్యూపై పాక్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్వ్యూను ఆపకపోతే మధ్యాహ్నం సెషన్ నుంచి ఆటను బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ) యూకే ప్రభుత్వ సలహా తీసుకుని, కొద్దిసేపటి విరామం తర్వాత లంచ్ సమయంలో ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. పాకిస్తాన్లో మాత్రం ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ప్రసారాన్ని నిలిపివేశారు. అయితే పీసీబీ బెదిరింపులు ఎలా ఉన్నప్పటికీ, పాక్ ప్లేయర్స్ మాత్రం తొలిరోజు లంచ్ తర్వాత యథావిధిగా మైదానంలో అడుగుపెట్టారు. అయితే మ్యాచ్ బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించిందనే వార్తలను సర్ఫరాజ్ అహ్మద్ తోసిపుచ్చాడు. పీసీబీ నిరసనపై తమకు లేదా తమ ఆటగాళ్లకు ఎలాంటి సమాచారం లేదని, ఆ సమయంలో తామంతా లంచ్ చేస్తున్నామని వివరణ ఇచ్చాడు. తాము ఇలాంటి వివాదాలపై ఎప్పుడు దృష్టి సారించబోమని, కేవలం ఆటపైనే తమ ఫోకస్ ఉంటుందని సర్ఫరాజ్ వెల్లడించాడు.ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించడంతో మూడోరోజు ఆట మొదలుకాలేదు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం పాకిస్తాన్ 110 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఎమియో గే (30), హారీ బ్రూక్ (7) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 261 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: ‘ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.. బలమైన ఆధారాలున్నాయి’ -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
లార్డ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు చేసిన రూట్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. 24 పరుగులు చేసి మహ్మద్ అలీ బౌలింగ్‌లో వికెట్ల ముందు అతడు దొరికిపోయాడు.ఈ మ్యాచ్‌లో రూట్ ఘోరంగా విఫలమైనప్పటికి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో సొంత గడ్డపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన ప్లేయర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. 35 ఏళ్ల రూట్ ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు 7,594 రన్స్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ ఆస్ట్రేలియాలో 7,578 టెస్టు రన్స్ చేశాడు. లార్డ్స్ టెస్టులో 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పాంటింగ్‌ను రూట్ అధిగమించాడు. ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(7216), శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే(7167) మూడు నాలుగు స్ధానాల్లో ఉన్నారు.పట్టు బిగించిన ఇంగ్లండ్ఇక ఈ రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రూట్ సేన ప్రస్తుతం 261 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే కుప్పకూలింది.చదవండి: ఐదో స్థానం.. అయినా రూ. 50 లక్షల నజరానా ఎందుకంటే? -
పాకిస్తాన్ జట్టుపై వాన్ తీవ్ర విమర్శలు
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వివాదాస్పద వ్యాఖ్యాత మైఖేల్ ఆథర్టన్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు చేశాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాక్ బ్యాటింగ్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. 'సెకండ్ డివిజన్ కౌంటీ జట్టు' అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. పాక్ ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రమాణాలు టెస్టు స్థాయికి తగ్గట్టుగా లేవని ధ్వజమెత్తాడు.పాక్ బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించాడు. పాక్ బ్యాటర్లలో ప్రత్యర్ది బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే సామర్థ్యం కనిపించడం లేదని, అందుకే ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీయడానికి పోటీ పడుతున్నారని అన్నాడు.ఇదే సమయంలో అతడు ఇంగ్లండ్ పేసర్లను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇదే ఫామ్‌ను వారు కొనసాగిస్తే భవిష్యత్తులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన బ్యాటింగ్ జట్లను ఇబ్బంది పెట్టగలరని అభిప్రాయపడ్డాడు.కాగా, ఆగస్టు 27న ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 261 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 81-3 స్కోర్ వద్ద కొనసాగిస్తుంది. దీనికి ముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే ఆలౌటైంది. ఓలీ రాబిన్సన్ (4-11), ఆర్చర్ (3-26), టంగ్ (2-27) పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. పాక్జ జట్టులో అజాన్ అవైస్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సౌద్ షకీల్ 16 పరుగులు చేశాడు. వీరు మినహా జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: పాఠాలు నేర్వని పాక్.. ఇంగ్లండ్ దెబ్బకు 110 రన్స్‌కే ఆలౌట్ -
పాఠాలు నేర్వని పాక్.. ఇంగ్లండ్ దెబ్బకు 110 రన్స్‌కే ఆలౌట్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ తమ దారుణ ఆటతీరును కంటిన్యూ చేస్తోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయం చవిచూసిన పాకిస్తాన్ రెండో టెస్టులో పాఠాలు నేర్వలేదు. లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో పాకిస్తాన్ 37.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు వణికిపోయారు. ఓపెనర్ అజాన్ అవైస్ (46), సాద్ షకీల్ (16) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 4 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ 3, జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్‌కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (61), జోర్డాన్ కాక్స్ (55) అర్ధసెంచరీలు సాధించగా, గస్ అకిన్సన్ (45), జోష్ టంగ్ (30 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 4 వికెట్లు తీయగా, మొహమ్మద్ అలీ 3 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా ఇమామ్-ఉల్-హక్ బ్యాటింగ్‌కు రాకపోవడంతో పాకిస్తాన్ 9 మంది బ్యాటర్లతోనే ఆటను కొనసాగించింది. దీంతో తొమ్మిదో వికెట్ పడిన తర్వాత పాక్ ఆలౌటైనట్లు అంపైర్లు ప్రకటించారు.Another humiliating defeat confirmed for Pakistan. 💔- Bowled out for 110 runs, with England leading by 180 runs. Congratulations to England in advance. pic.twitter.com/aAZplAxS9h— Abdullah (@Abdullahhhh_56) August 28, 2026చదవండి: టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన పసికూన -
బాబర్ ఆజం విఫలం.. నడిచినంత సేపు పట్టలేదు!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. లార్డ్స్‌లో అభిమానుల అంచనాల నడుమ బరిలోకి దిగిన అతడు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా బాబర్ ఆజంపై విమర్శల వర్షం కురుస్తోంది.వార్మప్ మ్యాచ్.. గాయపడ్డ బాబర్కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ముందుగా ప్రొఫెషనల్ కౌంటీ క్లబ్ సెలెక్ట్ ఎలెవన్‌తో పాక్ జట్టు వార్మప్ మ్యాచ్ ఆడి గెలిచింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా బాబర్ ఆజం వేలికి గాయమైంది.లార్డ్స్ టెస్టుతో రీఎంట్రీఫలితంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టుకు బాబర్ దూరమయ్యాడు. ఈ క్రమంలో గురువారం లార్డ్స్‌లో మొదలైన రెండో టెస్టుతో అతడు పునరాగమనం చేశాడు. టాస్ గెలిచిన బాబర్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు ఆటలో భాగంగా 290 పరుగులకే ఆలౌట్ అయింది. జోర్డాన్ కాక్స్ (55), జేమీ స్మిత్ (61) అర్ధ శతకాలు బాదగా.. గస్ అట్కిన్సన్ 45 పరుగులతో రాణించాడు.పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ అలీకి మూడు వికెట్లు దక్కాయి. ఖుర్రం షెజాద్, అలీ ఉస్మాన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షాన్ మసూద్ ఒక్క పరుగు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.సింగిల్ డిజిట్ స్కోరువన్డౌన్లో వచ్చిన అబ్దుల్లా షఫీక్ (5)ను జోష్ టంగ్ వెనక్కి పంపగా.. నాలుగో స్థానంలో బాబర్ వచ్చాడు. మొత్తంగా పది బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కేవలం ఎనిమిది పరుగులు చేసి టంగ్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడి ఆట తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ బాబర్ ఆజం మైదానంలోకి ఎంట్రీ ఇస్తున్న వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. ఇందులో బాబర్‌ను ఆహ్వానిస్తూ పలువురు అతిథులు అతడిని చీర్ చేశారు. అయితే, కాసేటికే అతడు పెవిలియన్‌కు చేరాడు. నడిచినంత సేపు పట్టలేదుఈ నేపథ్యంలో.. ‘అతిథులు కుర్చీల్లో సెటిల్ అయ్యేలోపే బాబర్ వెనక్కి వచ్చేశాడు. మనోడితో అట్లా ఉంటది మరి!.. నడిచినంత సేపు పట్టలేదు వెనక్కి రావడానికి’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.ఇక బాబర్ ఇటీవలే టెస్టు కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, సారథిగా రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే అతడు పూర్తిగా నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య రెండో రోజు ఆటకు వర్షం వల్ల అంతరాయం కలిగింది. వాన పడే సమయానికి పాకిస్తాన్ 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఓపెనర్ అజాన్ అవైస్ 43, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఒక పరుగుతో ఉన్నారు.చదవండి: IND vs NZ: టీమిండియా మాస్టర్ ప్లాన్!Babar Azam walks out to bat at Lord’s 🇵🇰 pic.twitter.com/zinQC2atc7— Lord's Cricket Ground (@HomeOfCricket) August 28, 2026 -
ఆర్చర్ అరుదైన ఫీట్.. టెస్టు చరిత్రలో రెండోసారి మాత్రమే!
లార్డ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఒక ఓవర్లో ఆరు బంతులు గంటకు 90 మైళ్ల వేగంతో విసిరి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఇందులో ఐదు బంతులు గంటకు 92 మైళ్ల వేగంతో విసరగా, మరో బంతిని 94 మైళ్ల వేగంతో వేయడం విశేషం. ఆర్చర్ వేసిన అత్యంత వేగవంతమైన బౌలింగ్‌లోనూ పాక్ బ్యాటర్ అజన్ అవైస్ ఒక ఫోర్ కూడా కొట్టడం గమనార్హం. ఇక ఓవర్ విషయానికి వస్తే.. ఆర్చర్ తన తొలి బంతిని గంటలకు 92 మైళ్ల వేగంతో, రెండో బంతిని గంటకు 94 మైళ్ల వేగంతో, మూడో బంతిని గంటకు 92 మైళ్ల వేగంతో, నాలుగు, ఐదు, ఆరు బంతులను కూడా గంటకు 92 మైళ్ల వేగంతో విసిరి సరికొత్త ఫీట్ నమోదు చేశాడు. ఇక ఆర్చర్ ఒక ఓవర్ యావరేజ్ వేగం 92.33గా నమోదైంది.టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు బంతులను తొంబైకి పైగా వేగంతో విసరడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 2024 జూలైలో వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో మార్క్‌వుడ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. ఆనాటి మ్యాచ్‌లో మార్క్‌వుడ్ ఒకే ఓవర్లో ఆరు బంతులను వరుసగా గంటకు 93.9, 96.1, 95.2, 92.2, 96.5, 95.2 మైళ్లవేగంతో విసిరాడు. ఇక ఓవర్లో వేగం యావరేజ్ 94.7గా నమోదైంది. తద్వారా తొలి క్రికెటర్‌గా మార్క్‌వుడ్ నిలిస్తే.. తాజాగా పాక్‌తో టెస్టులో ఓవర్లో ఆరు బంతులు 90కి పైగా స్పీడుతో విసిరిన ఆర్చర్ రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (61), జోర్డాన్ కాక్స్ (55) అర్ధసెంచరీలు సాధించగా, గస్ అకిన్సన్ (45), జోష్ టంగ్ (30 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 4 వికెట్లు తీయగా, మొహమ్మద్ అలీ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.Watch out, Jofra's about! 🚨Shan Masood departs ☝️Match Centre: https://t.co/Z9bsIoMyb6 pic.twitter.com/0IaDNgRU5L— England Cricket (@englandcricket) August 28, 2026Ball 1: 92 MPHBall 2: 94 MPHBall 3: 92 MPHBall 4: 92 MPHBall 5: 92 MPHBall 6: 92 MPHJofra Archer steaming in⚡️ pic.twitter.com/s7jnNHV6zC— PctMedia (@PctMediaa) August 28, 2026 Ball 1: 92 MPHBall 2: 94 MPHBall 3: 92 MPHBall 4: 92 MPHBall 5: 92 MPHBall 6: 92 MPHJofra Archer steaming in⚡️ pic.twitter.com/s7jnNHV6zC— PctMedia (@PctMediaa) August 28, 2026Read: 'కోహ్లి ఉండుంటే ఆ "సైంధవుడి" ఆట సాగేది కాదు!' -
జో రూట్ అరుదైన రికార్డు.. సెకెండ్ ప్లేయర్‌గా
లార్డ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన రెండో ప్లేయర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. ఇది రూట్‌కు 168వ టెస్ట్ మ్యాచ్. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉండేది. బ్రాడ్ తన కెరీర్లో ఇంగ్లండ్ తరపున 167 టెస్టులు ఆడాడు. ఈ జాబితాలో రూట్ కంటే ముందు మరో దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్(188) ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన మూడో ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్, స్టీవ్ వా సరసన రూట్ నిలిచాడు. ప్రస్తుతం అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(200) అగ్రస్థానంలో ఉండగా.. ఆండర్సన్(188) రెండో స్ధానంలో ఉన్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ తడబడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కెప్టెన్ రూట్(4)తో సహా డకెట్(17), హ్యారీ బ్రూక్(15) స్టార్ ప్లేయర్లు విఫలమయ్యారు. ఈ క్రమంలో యువ ఆటగాళ్లు జోర్డాన్ కాక్స్(55), జేమీ స్మిత్(61) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం క్రీజులో గస్ అట్కిన్సన్(34), టంగ్(1) ఉన్నారు. పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ 4 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ అలీ మూడు వికెట్లు సాధించాడు.చదవండి: భారత జట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. కారణమిదే? -
లార్డ్స్ టెస్ట్‌లో పొలిటికల్ హీట్.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును బెదిరించిన పీసీబీ!
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు ఆట లంచ్ విరామం సందర్భంగా ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. లంచ్ బ్రేక్‌లో పాకిస్తాన్ మాజీ ప్రధాని, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కుమారులతో బ్రిటీష్ బ్రాడ్‌కాస్టర్ 'స్కై స్పోర్ట్స్' ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. అయితే ఈ ఇంటర్వ్యూను లంచ్ విరామంలో ప్రసారం చేయవద్దని స్కై స్పోర్ట్స్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేస్తే ఆటను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరించినట్లు 'ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో' తమ కథనంలో పేర్కొంది. కానీ పీసీబీ బెదిరింపులు పట్టించుకోని స్కై స్పోర్ట్స్ యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూను టెల్కాస్ట్ చేసింది. ప్రసారం అయినప్పటికి పాక్ ఆటగాళ్లు లంచ్ బ్రేక్ అనంతరం తిరిగి మైదానంలోకి దిగారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పెద్దలు పీసీబీ అధికారులతో చర్చలు జరిపి శాంతింపజేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇమ్రాన్ కుమారులు సులైమాన్, కాసిమ్లతో ఈ ఇంటర్వ్యూను ఇంగ్లండ్ దిగ్గజం మైఖేల్ అథర్టన్ 18 నిమిషాల పాటు నిర్వహించారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ ప్రధాన మంత్రికి రాసిన లేఖ రాసిన 21 మంది కెప్టెన్లలలో మైఖేల్ అథర్టన్ ఒకరు. ఇక జైలులో ఉన్న తమ తండ్రి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఆథర్టన్‌తో ఇంటర్వ్యూలో సులైమాన్, కాసిమ్లు ఆందోళన వ్యక్తం చేశారు.Complete interview of Former PM Imran Khan’s sons Sulaiman Khan and @Kasim_Khan_1999 with @Athersmike today on Sky Sports.They spoke about Imran Khan’s arbitrary torturous solitary confinement, lack of family meetings, his deteriorating health, and more.… pic.twitter.com/EQEfTfWHXb— PTI UK (@UKPTIOfficial) August 27, 2026చదవండి: PAK vs ENG: ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్న పాకిస్తాన్ -
PAK vs ENG: ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్న పాకిస్తాన్
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు... రెండో టెస్టులో ఫర్వాలేదనిపించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం లార్డ్స్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు విఫలమయ్యారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఆటకు వరుణుడు ఆటంకం కలిగించగా... వెలుతురులేమి కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ముందే ముగిసింది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (80 బంతుల్లో 61; 10 ఫోర్లు), జోర్డాన్ కాక్స్ (105 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. కెప్టెన్ జో రూట్ (4), ఎమిలియో గే (8), బెన్ డకెట్ (17), హ్యారీ బ్రూక్ (15), డాన్ లారెన్స్ (17) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 4 వికెట్లు పడగొట్టగా... మొహమ్మద్ అలీ 3 వికెట్లు తీశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఒత్తిడి కొనసాగించిన పాక్ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టింది. అట్కిన్సన్ (27 బంతుల్లో 34 బ్యాటింగ్; 5 ఫోర్లు), జోష్ టంగ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తుది జట్లుపాకిస్థాన్: ఇమామ్-ఉల్-హక్, అజాన్ అవైస్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్, బాబర్ ఆజం(కెప్టెన్), సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అలీ ఉస్మాన్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అలీఇంగ్లండ్: బెన్ డకెట్, ఎమిలియో గే, జోర్డాన్ కాక్స్, జో రూట్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, డాన్ లారెన్స్, జామీ స్మిత్(వికెట్ కీపర్), ఆలీ రాబిన్సన్, గుస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్చదవండి: వారసులొచ్చారు -
'బాబర్ ఆజం 250 రన్స్ చేయాలి'.. పాక్ జట్టును ఎగతాళి చేసిన బ్రాడ్
పాకిస్తాన్ జట్టును ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మరోసారి ఎగతాళి చేశాడు. లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో పాక్ గెలవాలంటే ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం కనీసం 250కు పైగా పరుగులు చేయాలని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా హెడ్డింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌కు బాబర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో హెడ్డింగ్లీ టెస్టులో పాక్ జట్టు పూర్తిగా తేలిపోయింది. పర్యాటక పాక్ జట్టు ఏకంగా ఇన్నింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. అయితే బాబర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో లార్డ్స్ టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలోనే స్టువర్ట్ బ్రాడ్ 'ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్' పోడ్కాస్ట్లో మాట్లాడుతూ పాక్ జట్టుపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు పోటీ ఇవ్వాలంటే పాకిస్తాన్‌కు అదృష్టం చాలా అవసరం. లార్డ్స్‌లో పాక్ గెలవాలంటే బాబర్ ఆజం కనీసం 250 పరుగులైనా చేయాల్సి ఉంటుంది. పాక్ జట్టులో సరైన ప్లేయర్లు లేరు. కాబట్టి టీమ్ మేనెజ్మెంట్ ఇలాంటి అద్భుతాలు జరగాలని ఆశించాలని బ్రాడ్ పేర్కొన్నాడు.కాగా బాబర్ ఆజం గత కొంత కాలంగా టెస్టు క్రికెట్లో తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచినప్పటికి.. గత నాలుగేళ్ల నుంచి మూడంకెల మార్క్‌ను అందుకోలేకపోతున్నాడు. అతడు చివరగా 2022లో టెస్టు సెంచరీ సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాబర్ డబుల్ సెంచరీ సాధించడం ఆసాధ్యం.చదవండి: Asia Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్ -
నైట్‌క్లబ్ ఘటన ఎఫెక్ట్.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్‌పై వేటు
ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) వేటు వేసింది. పాకిస్తాన్‌తో జరగనున్న రెండో టెస్టుకు అతడిని జట్టు నుంచి తప్పించింది. డెర్బీలోని ఓ నైట్‌క్లబ్ వెలుపల కార్స్ చేతులకు బేడీలు వేసిన దృశ్యాలు కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు కార్స్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడని ECB ప్రకటించింది. ఈ వ్యవహారంపై క్రికెట్ రెగ్యులేటర్ కూడా దర్యాప్తు చేయనుంది.కార్స్ స్థానంలో పేసర్ సోనీ బేకర్‌ను జట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్‌తో జూన్‌లో జరిగిన సిరీస్‌లో బేకర్ టెస్టు అరంగేట్రం చేశాడు.ఇటీవల ఇంగ్లండ్ జట్టులో నైట్‌క్లబ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి ఓ ఘటనపై విచారణ జరుగుతున్న సమయంలోనే అప్పటి కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ గస్ అట్కిన్సన్ను కూడా జట్టు నుంచి తప్పించారు.కాగా, పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టు ఆగస్టు 27న లార్డ్స్‌లో ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. మూడో టెస్ట్ బర్మింగ్హమ్ వేదికగా సెప్టెంబర్ 9న మొదలవుతుంది. చదవండి: పోలీసుల అదుపులో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ -
ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బ; భారత్‌కు కలిసొచ్చిన పాక్ ఓటమి!
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన పాకిస్తాన్ జట్టు ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పాకిస్తాన్ సున్నా పరుగు వద్దే తొలి వికెట్‌ను కోల్పోవడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో ఓలి రాబిన్సన్ బౌలింగ్‌లో అజన్ అవైస్ డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో ఇమామ్-ఉల్-హక్ సున్నా పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో 149 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నా పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోవడం పాక్‌కు ఇది ఏడోసారి. ఈ నేపథ్యంలో అత్యధిక సార్లు సున్నా పరుగుల వద్ద వికెట్ కోల్పోయిన చెత్త జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. పాక్ తర్వాత ఇంగ్లండ్ (5 సార్లు), ఆస్ట్రేలియా (4 సార్లు), భారత్ (రెండు సార్లు), న్యూజిలాండ్ ఒకసారి ఈ ఫీట్‌ను నమోదు చేశాయి.ఇక ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓటమి వల్ల డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ, భారత్‌కు మాత్రం కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో డబ్ల్యూటీసీ సైకిల్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌కు ఇది ఐదో ఓటమి. కేవలం 19.05 శాతం పాయింట్లతో పాక్ 9వ స్థానానికి దిగజారింది. దీంతో వెస్టిండీస్ (20.83 శాతం పాయింట్లు) 8వ స్థానంలో నిలవగా, పాక్‌పై విజయంతో ఇంగ్లాండ్ 29.76 శాతం పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇరు జట్లు ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు ఆస్ట్రేలియా 77.78 శాతం పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా (75 శాతం), న్యూజిలాండ్ (72.22 శాతం) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 53.33 శాతం పాయింట్లతో 5వ స్థానంలో, బంగ్లాదేశ్ 66.67 శాతం పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాయి. శ్రీలంకపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ రెండో మ్యాచ్‌లోనూ గెలిచి, అటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఓడిపోతే, భారత్ 57.57 శాతం పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోవడంతో ఫైనల్ రేసుకు మరింత దగ్గరయినట్లవుతుంది.ఇక హెడ్డింగే వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 171 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకు ఆలౌట్ కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 135 పరుగులకే కుప్పకూలింది.జోఫ్రా ఆర్చర్, ఒల్లీ రాబిన్సన్, జోష్ టంగ్, గుస్ అట్కిన్సన్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు నిలవలేకపోయారు. రాబిన్సన్, టంగ్‌లు చెరో 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తద్వారా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 27నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది.Read: స్టార్క్ దెబ్బకు బంగ్లాదేశ్ విలవిల.. 149 ఏళ్లలో ఇదే తొలిసారి -
జో రూట్ ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రూట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. లీడ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆటలో రూట్ ఈ చారిత్రక ఘనతను సాధించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఓపెనర్ అజాన్ అవాయిస్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంతో రూట్ ఈ రేర్ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ లెజెండరీ బ్యాటర్ ఇప్పటివరకు 219 టెస్టు క్యాచ్‌లను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ (218 క్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా క్యాచ్‌తో స్మిత్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్లుజో రూట్ (ఇంగ్లండ్)-219స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)-218రాహుల్ ద్రవిడ్ (భారత్)-210మహేళ జయవర్ధనే (శ్రీలంక)-205జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)- 200పాక్ చిత్తు ఇక లీడ్స్ టెస్టులో పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌటైన పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో అంతకంటే దారుణ ప్రదర్శన కనబరిచింది. 238 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పాక్ జట్టు.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కేవలం 135 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ పేస్ బౌలర్లు ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. అంతకుముందు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ 409 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. కెప్టెన్ జోరూట్(66), హ్యారీ బ్రూక్(91), లారెన్స్(51), కాక్స్(73) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ విజయంతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన సన్‌రైజర్స్ స్టార్ క్రికెటర్ -
పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
పాకిస్తాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌ను ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైంది. సల్మాన్ అఘా సారథ్యంలోని పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 171 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ పేసర్లు ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్ తలా ఐదేసి వికెట్లు పడగొట్టి పాక్ జట్టును దెబ్బ తీశారు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (61), ఇమామ్-ఉల్-హక్ (42) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కెప్టెన్ జోరూట్(66), హ్యారీ బ్రూక్(91), లారెన్స్(51), కాక్స్(73) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. పాక్ బౌలర్లలో స్పిన్నర్ అలీ ఉస్మాన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 238 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పాక్ జట్టు.. కేవలం 135 పరుగులకే ఆలౌటైంది. పేస్ బౌలర్లు ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. ఈ విజయంతో ఇంగ్లండ్ మూడు టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు లండన్ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన సన్‌రైజర్స్ స్టార్ క్రికెటర్ -
హ్యారీ బ్రూక్ మెరుపులు.. ఇంగ్లండ్ 409 పరుగుల భారీ స్కోర్
లీడ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. తొలుత బౌలింగ్‌లో పాకిస్తాన్‌ను 171 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లీష్ జట్టు.. అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 409 పరుగుల భారీ స్కోర్ సాధించి ఆలౌటైంది.దీంతో ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జోరూట్(66), హ్యారీ బ్రూక్(91), లారెన్స్(51), కాక్స్(73) హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. ముఖ్యంగా బ్రూక్ వన్డే శైలిలో బ్యాటింగ్ చేస్తూ పాక్ బౌలర్లను ఉతికారేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 ఫోర్లు ఉండడం గమనార్హం. కాగా పాక్ బౌలర్లలో స్పిన్నర్ అలీ ఉస్మాన్ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. అంతకుముందు పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ పేసర్లు ఆలీ రాబిన్సన్ (5/51), జోష్ టంగ్ (5/46) పర్యాటక జట్టును దెబ్బ తీశారు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (61), ఇమామ్-ఉల్-హక్ (42) ఆకట్టుకున్నప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు తడబడుతున్నారు. మూడో రోజు లంచ్ సమయానికి పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. -
ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర తిరగరాసిన పాక్ స్పిన్నర్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ స్పిన్నర్ అలీ ఉస్మాన్ చరిత్రను తిరగరాశాడు. హెడ్డింగే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 33 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 23 ఓవర్లు వేసి 92 పరుగులిచ్చి 5 వికెట్ల హాల్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఆడుతున్న అలీ ఉస్మాన్ ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా నిలిచాడు. గతంలో ఇంగ్లండ్ గడ్డపై పర్వేజ్ సాజద్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 5 వికెట్లు పడగొట్టగా, ఇక్బాల్ ఖాసిమ్, షుజాహుద్దీన్లు చెరో మూడు ఇన్నింగ్స్‌ల్లో నాలుగేసి వికెట్లు, ఫవద్ ఆలం ఒక ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు. అంతేకాదు ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా ఇంగ్లండ్ గడ్డపై తక్కువ ఎకానమీతో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్‌గా అలీ ఉస్మాన్ బెస్ట్ ఫిగర్స్ కూడా నమోదు చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లండ్ ఇప్పటికైతే పైచేయిలోనే ఉంది. జో రూట్ సహా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు సాధించింది. రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్లు క్రీజులో ఉన్నారు. హ్యారీ బ్రూక్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోర్డాన్ కాక్స్ (73), జో రూట్ (66), డాన్ లారెన్స్ (51) ఫిఫ్టీలు సాధించారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్ 5 వికెట్లు తీయగా, మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్, మొహమ్మద్ అలీ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది.Only Positive From Pakistan Side Today> ALI USMAN ✨23 Overs • 92 Runs • 5 Wickets pic.twitter.com/kIV1m2vcdB— Usman (@UsmanOffical56) August 20, 2026 A maiden five-wicket haul in Tests for Ali Usman ✨#WTC27 📝: https://t.co/bmrVSU3KD6 pic.twitter.com/N1q4BiyWHg— ICC (@ICC) August 20, 2026చదవండి: 22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా విడుదలైన భారత మాజీ క్రికెటర్ -
రూట్ ప్రపంచ రికార్డు.. పాక్‌తో టెస్టులో భారీ ఆధిక్యం
పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రపంచ రికార్డుతో మెరిశాడు. మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (66 పరుగులు) సాధించిన రూట్ టెస్టు క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన జాబితాలో సచిన్‌తో (200 టెస్టుల్లో 68 అర్ధశతకాలు) కలిసి రూట్ (167 టెస్టుల్లోనే) సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. మరో అర్ధసెంచరీ సాధిస్తే రూట్ టెస్టుల్లో అత్యధిక ఫిఫ్టీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలోనూ రూట్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా, సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో కొనసాగుతు న్నాడు. ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా రూట్‌కు సచిన్ రికార్డును బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఈతరం ఫ్యాబ్-4లో (కోహ్లి, స్మిత్, రూట్, కేన్ విలియమ్సన్) ఇద్దరు ఇప్పటికే రిటైరవ్వగా.. రూట్, స్మిత్ మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు.టెస్టు కెప్టెన్‌గా మరో రికార్డుదీంతో పాటు రూట్ టెస్టుల్లో మరో రికార్డు కూడా అందుకున్నాడు. టెస్టు కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రూట్ (42 ఫిఫ్టీలు) ఐదో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమి స్మిత్ (61), ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్ (54), అలెన్ బోర్డర్ (51) రెండు, మూడు స్థానాల్లో ఉండగా, పాక్ మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ (43 ఫిఫ్టీలు) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక రూట్ సహా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు అర్ధశతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు సాధించింది. రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్లు క్రీజులో ఉన్నారు. హ్యారీ బ్రూక్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోర్డాన్ కాక్స్ (73), జో రూట్ (66), డాన్ లారెన్స్ (51) ఫిఫ్టీలు సాధించారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్ 5 వికెట్లు తీయగా, మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్, మొహమ్మద్ అలీ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది.Joe Root 66(112) Vs Pakistan | 1st Test, 2026 - Leeds | Ball By Ball Highlights pic.twitter.com/gbkZ20BOwC— PctMedia (@PctMediaa) August 20, 2026Most fifties in Test cricket:Joe Root - 68*. Sachin Tendulkar- 68. pic.twitter.com/dScWCVxvSn— Mufaddal Vohra (@mufaddal_vohra) August 20, 2026 -
పాక్ డ్రెసింగ్‌రూమ్‌కి వెళ్లు: నాసిర్ హుసేన్‌కు డీకే కౌంటర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్‌కు భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాకిస్తాన్ ఆటగాడి అవుట్ విషయంలో అంతగా బాధనిపిస్తే.. వారి డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లి సూచనలు ఇవ్వొచ్చుగా అని చురకలు అంటించాడు. అసలేం జరిగిందంటే.. మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.171 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో బుధవారం లీడ్స్ వేదికగా ఇంగ్లండ్- పాక్ మధ్య తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. పాక్ బ్యాటింగ్‌కు దిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులే చేసి ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటింగ్ మొదలుపెట్టగా.. మహ్మద్ అబ్బాస్ పాక్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు.అయితే, మూడో బంతికే ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు భావించిన అబ్బాస్... కెప్టెన్‌ను ఒప్పించి రివ్యూకు వెళ్లాడు. కానీ.. అల్ట్రాఎడ్జ్‌లో బ్యాట్ ఇన్వాల్మెంట్ లేదని వచ్చింది. దీంతో అంపైర్ కాల్ ప్రకారం డకెట్ నాటౌట్‌గా తేలాడు. అయితే, తొమ్మిదో ఓవర్లో అబ్బాస్ బౌలింగ్‌లోనే డకెట్ (15) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగడం విశేషం.పాక్ ఆటగాడి మాదరే కామెంటేటర్ కూడాకాగా తొలి ప్రయత్నంలో డకెట్ తప్పించుకోవడంతో అబ్బాస్ నిరాశ వ్యక్తం చేశాడు. అదే సమయంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న నాసిర్ హుసేన్.. అబ్బాస్ మాదిరే అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ నిర్ణయం పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉండాల్సిందని.. అంపైర్స్ కాల్ వల్లే అబ్బాస్‌కు నిరాశ ఎదురైందన్నట్లుగా మాట్లాడాడు.పాకిస్తాన్ డ్రెసింగ్‌రూమ్‌కి వెళ్లుఇందుకు ప్రతిగా.. పక్కనే ఉన్న దినేశ్ కార్తిక్.. ‘పాకిస్తాన్ డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లి.. DRS (డెసిషన్ రివ్యూ సిస్టమ్) ఎలా పనిచేస్తుందో వాళ్లకు కాస్త నేర్పించండి’ అని చురక వేశాడు. అంపైర్స్ కాల్ విషయంలో నాసిర్ హుసేన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు.కాగా ఎల్బీడబ్ల్యూ విషయంలో రివ్యూకు వెళ్లినపుడు థర్డ్ అంపైర్ పరిశీలనలో బంతి స్టంప్స్‌ను తాకినట్లు తేలినా.. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ అంతకుముందు నాటౌట్ ఇచ్చి ఉంటే.. బ్యాటర్ సేఫ్ అవుతాడు. ఒకవేళ బంతికి తాకపోయినట్లు తేలి.. అంతకుముందు అవుట్‌గా ఇచ్చి ఉంటే బ్యాటర్ అవుట్ అవుతాడు.గతంలో అలా.. ఇపుడు ఇలాఈ నేపథ్యంలో అంపైర్స్ కాల్ నిబంధనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గతంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు నాసిర్ హుసేన్ వీళ్లిద్దరిని విమర్శించి.. అంపైర్స్ కాల్‌కు మద్దతు పలికాడు. ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ ఆటగాడి తరఫున వకాల్తా తీసుకుని అంపైర్స్ కాల్‌ను తప్పుబట్టడంతో డీకే కౌంటర్ ఇచ్చాడు. కాగా నాసిర్ హుసేన్ వీలు చిక్కినప్పుడల్లా పాక్ జట్టుకు మద్దతుగా నిలుస్తాడన్న సంగతి తెలిసిందే.చదవండి: టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 118 పరుగుల తేడాతో భారత్ గెలుపు -
మరో 79 పరుగులు చేస్తే రూట్ ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఓ భారీ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. పాకిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 19) ప్రారంభం కానున్న తొలి టెస్టులో అతడు 79 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ పేరిట ఉన్న హోమ్ టెస్టుల ప్రపంచ రికార్డును బద్దలు కొడతాడు.స్వదేశంలో పాంటింగ్ 154 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 7,578 పరుగులు చేయగా.. రూట్ 153 ఇన్నింగ్స్‌ల్లో 7,500 పరుగులు చేశాడు. రూట్ పాంటింగ్ రికార్డును అధిగమించాలంటే మరో 79 పరుగులు మాత్రమే చేయాలి.స్వదేశంలో అత్యధిక టెస్టు పరుగులు1. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 7,5782. జో రూట్ (ఇంగ్లండ్) – 7,5003. సచిన్ టెండూల్కర్ (భారత్) – 7,2164. మహేల జయవర్ధనే (శ్రీలంక) – 7,1675. జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 7,035మళ్లీ ఇంగ్లండ్ కెప్టెన్‌గా..!బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత జో రూట్ మరోసారి ఇంగ్లండ్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టాడు. 2017 నుంచి 2022 వరకు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన రూట్ 65 టెస్టుల్లో 27 విజయాలు, 27 పరాజయాలు నమోదు చేశాడు.రెండోసారి కెప్టెన్సీ దక్కడం తనకు ప్రత్యేకమైన అవకాశమని రూట్ చెప్పాడు. గత కెప్టెన్సీతో పోలిస్తే ఇప్పుడు తాను ఆటగాడిగా, వ్యక్తిగా ఎంతో మారానని తెలిపాడు. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెకల్లమ్లతో కలిసి పనిచేయడం ద్వారా ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్ ఇవాళ హెడింగ్లే (లీడ్స్)లో ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్ లండన్ వేదికగా ఆగస్ట్ 27న, మూడో టెస్ట్ సెప్టెంబర్ 9న బర్మింగ్హమ్ వేదికగా ప్రారంభమవుతాయి. తొలి టెస్ట్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.తొలి టెస్ట్‌కు బాబర్ దూరంఈ మ్యాచ్‌కు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం దూరమయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌లోనే జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో తొలి టెస్టులో ఆడటం లేదని ఆ జట్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించాడు. బాబర్ స్థానంలో సల్మాన్ ఆఘా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపాడు. -
పాక్ జట్టును అవమానించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్!
ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు బలహీనంగా ఉందని, ఇంగ్లండ్ గడ్డపై ఆ జట్టుకు టెస్టు సిరీస్‌లో మరోసారి వైట్‌వాష్‌కు తప్పదనిపిస్తుందని బ్రాడ్ అంచనా వేశాడు. ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బ్రాడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. హెడ్డింగే వేదికగా ఇవాళ్టి నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.‘కెరీర్ చివరి దశలో ఉన్న 36 ఏళ్ల మహ్మద్ అబ్బాస్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. దీన్నిబట్టే పాక్ జట్టు ఎంత బలహీనంగా ఉందో అర్ధమవుతుంది. గత పర్యటనల్లో ఎదురైన అనుభవమే ఈసారి కూడా పాకిస్తాన్‌కు ఎదురయ్యే అవకాశముంది. ఈసారి మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో పాక్‌ను వైట్‌వాష్ చేస్తుందని భావిస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు.ఆరింటిలో నాలుగు ఓటమిఅయితే బంగ్లాదేశ్ పర్యటనకు ముందే మహ్మద్ అబ్బాస్‌ను టెస్టు జట్టులోకి తిరిగి తీసుకొచ్చారు. అయితే పాక్ జట్టు ఓటములు చవిచూసినప్పటికీ, మహ్మద్ అబ్బాస్ మాత్రం అసాధారణ ప్రదర్శన చేశాడు. తాను ఆడిన మూడు టెస్టుల్లో 18 వికెట్లు తీశాడు. కానీ బ్రాడ్ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో పాకిస్తాన్ ఆశించినంత మేర రాణించలేకపోతుంది. బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్‌కు గురవ్వడంతో పాటు ఆరు టెస్టుల్లో నాలుగింట పరాజయం చవిచూసింది.హెడ్డింగే వేదికగా ఇవాళ్టి నుంచే తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ తమ సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజం లేకుండానే బరిలోకి దిగుతోంది. విండీస్ పర్యటనలో తన ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్న బాబర్ ఆజం.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బెకెన్హమ్లో వార్మప్ మ్యాచ్ సందర్భంగా కుడి చేతికి గాయమైంది. తొలి టెస్టుకు బాబర్ దూరంగాయం తీవ్రత ఎక్కువగా లేనప్పటికీ, పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ దూరమయ్యాడు. దీంతో బాబర్ ఆజం గైర్హాజరీ పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను బలహీనం చేసినట్లయింది. బంగ్లాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టులో చాలా మార్పులు చేసింది. షాన్ మసూద్ స్థానంలో బాబర్ ఆజమ్‌కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే గాయంతో బాబర్ ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు దూరం కావడంతో సల్మాన్ అగా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో విండీస్‌తో టెస్టు సిరీస్‌కు షహీన్ అఫ్రిది, హసన్ అలీ, నసీమ్ షాలకు బదులు మహ్మద్ అబ్బాస్, ఖుర్రమ్ షెహజాద్‌లను ఆడించి మంచి ఫలితాన్ని అందుకుంది. తొలి టెస్టులో ఓడినప్పటికీ, రెండో టెస్టులో బాబర్ ఆజం సేన అద్భుత విజయాన్ని అందుకొని సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఇక బెకెన్హమ్ వేదికగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సౌద్ షకీల్, అబ్దులా షఫీక్, ఉస్మాన్ అలీ, మహమ్మద్ అలీ రాణించడం పాకిస్తాన్‌కు సానుకూలాంశమని చెప్పొచ్చు. ఇక 2024లో చివరిసారి పాక్ గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది.చదవండి: సంజయ్ బంగర్ కూతురు సంచలన ప్రకటన -
బాబర్ ఆజం ఔట్.. కెప్టెన్‌గా సల్మాన్ ఆఘా
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు పాకిస్తాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజం గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన బాబర్.. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో తొలి టెస్టులో ఆడటం లేదని జట్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించాడు. బాబర్ స్థానంలో సల్మాన్ ఆఘా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపాడు.తొలి టెస్ట్ ఆగస్టు 19న లీడ్స్‌లో ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. రెండో టెస్ట్ లండన్ వేదికగా ఆగస్ట్ 27న, మూడో టెస్ట్ సెప్టెంబర్ 9న బర్మింగ్హమ్ వేదికగా ప్రారంభమవుతాయి.టెస్ట్ కెప్టెన్‌గా తొలి అవకాశంఇప్పటికే పాకిస్తాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున సల్మాన్ ఆఘాకు టెస్టు జట్టును నడిపించడం ఇదే తొలిసారి. కీలకమైన ఇంగ్లండ్ పర్యటనలో అతడికి ఇది పెద్ద బాధ్యతగా మారింది.ఇంగ్లండ్ గడ్డపై పాక్‌కు గతంలో పెద్ద అనుకూల ఫలితాలు లేవు. దీనికి తోడు బాబర్ వంటి కీలక బ్యాటర్ తొలి టెస్టుకు దూరం కావడం ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ. కొత్త కెప్టెన్ సల్మాన్ ఆఘా ఏ మేరకు వ్యక్తిగతంగా రాణించి, జట్టును ముందుకు నడిపిస్తాడో చూడాలి. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు బిగ్ రిలీఫ్
ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు పాకిస్తాన్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టిన పాక్ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్‌కు ముందు పాక్‌కు గుడ్ న్యూస్ అందింది. ప్రొఫెషనల్ కౌంటీ క్లబ్ సెలెక్ట్ XI జట్టుతో వార్మాప్ మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ బాబర్ ఆజం తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఇంగ్లీష్ పేసర్ లమ్స్‌డెన్ వేసిన బంతి బాబర్ కుడిచేతికి బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడికి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో ఆజం కేవలం 5 పరుగుల వద్దే రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్స్‌కు కూడా అతడు దూరమయ్యాడు. దీంతో తొలి టెస్టుకు దూరం కానున్నాడని వార్తలు వచ్చాయి.కానీ బాబర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో లీడ్స్ టెస్ట్‌కు అందుబాటులో ఉండనున్నాడు. వైద్య బృందం పరీక్షించి అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హెడింగ్లీ మైదానంలో బాబర్ తీవ్రంగా శ్రమిస్తూ కెమరాలకు చిక్కాడు. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌తో కలిసి వికెట్ కీపింగ్ ప్రాక్టీస్‌లో కూడా పాల్గొన్నాడు. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనుంది.చదవండి: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. కపిల్ దేవ్ సరసన -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు పాక్‌కు భారీ షాక్
ఇంగ్లండ్‌తో కీలకమైన టెస్ట్ సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో ఆగస్టు 19న ప్రారంభమయ్యే తొలి టెస్టులో అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.ప్రస్తుతం పాక్ Professional County Club Select XIతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో మానీ లమ్స్‌డెన్ వేసిన బంతి బాబర్ కింది చేతికి బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బంది పడిన బాబర్ ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగలేదు.బాబర్ గాయం తీవ్రతపై పాక్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. జట్టు వైద్యుడు పరీక్షించిన అనంతరం ముందు జాగ్రత్త చర్యగా మిగిలిన వార్మప్ మ్యాచ్‌కు బాబర్‌ను దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది.బాబర్ దూరమైతే..?2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ రేసులో నిలవాలంటే ఇంగ్లండ్‌పై మంచి ఫలితాలు సాధించడం పాకిస్తాన్‌కు కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాక్ అట్టడుగు స్థానంలో ఉంది. బాబర్ పాక్‌కు అత్యంత కీలకమైన బ్యాటర్లలో ఒకడు. అతను తొలి టెస్టుకు పూర్తిగా ఫిట్‌గా లేకపోతే, జట్టు అతని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకపోవచ్చు.ఈ పరిస్థితిలో షాన్ మసూద్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన మసూద్, బాబర్ స్థానంలో బ్యాటింగ్ ఆర్డర్‌లోకి రావచ్చు.టాప్-10లోకి బాబర్తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్, రెండేళ్ల తర్వాత ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి వచ్చాడు. బాబర్ ఇంగ్లండ్ సిరీస్‌లోనూ ఫామ్‌ను కొనసాగించాలని పాక్ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో అతడు గాయపడటంతో ఆ జట్టుకు ఇబ్బందవుతోంది. -
పాక్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
పాకిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు 16 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. మోకాలి గాయం కారణంగా యువ ఆల్‌రౌండర్ జేకబ్ బేతెల్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో జోర్డాన్ కాక్స్‌కు తుది జట్టులో చోటు దక్కింది.ఓల్లీ పోప్, బ్రైడన్ కార్స్, డాన్ లారెన్స్ తిరిగి చోటు సంపాదించారు. ముఖ్యంగా లారెన్స్ రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు.సర్రే తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతంగా రాణిస్తున్న లారెన్స్ ప్రస్తుతం డివిజన్-1లో రెండో అత్యధిక పరుగుల స్కోరర్‌గా ఉన్నాడు. అతడు ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా, ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో నంబర్-6లో ఆడిన జేమీ స్మిత్ ఏడో స్థానానికి వెళ్లనున్నాడు.బేతెల్ స్థానంలో నంబర్-3లో జోర్డాన్ కాక్స్ బ్యాటింగ్ చేయనున్నాడు. భారత్‌తో గత నెల జరిగిన వన్డే సిరీస్‌లో కుడి మోకాలికి గాయం కావడంతో బేతెల్ పాక్ సిరీస్‌కు దూరమయ్యాడు.పోప్, కార్స్‌కు కూడా పునరాగమనంఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత తొలిసారి ఓలీ పోప్, బ్రైడన్ కార్స్ టెస్టు జట్టులోకి తిరిగి వచ్చారు. గాయం కారణంగా కొంతకాలం క్రికెట్‌కు దూరమైన కార్స్ తిరిగి జట్టులోకి రాగా, బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పోప్‌ను గతంలో జట్టు నుంచి తప్పించారు.ఇక పేసర్ సామ్ కుక్కు కూడా రీకాల్ లభించింది. అతడు గత ఏడాది జింబాబ్వేతో టెస్టు అరంగేట్రం చేశాడు.జో రూట్ మళ్లీ ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ఈ సిరీస్ ఇంగ్లండ్ టెస్టు క్రికెట్లో కొత్త శకానికి నాంది కానుంది. బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, జో రూట్ 2022 తర్వాత మళ్లీ పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.బ్రెండన్ మెకల్లమ్ తర్వాత టెస్టు కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ నియమితుడైనా, అతడు ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి బాధ్యతలు చేపట్టనున్నాడు. అందువల్ల పాక్ సిరీస్‌కు మార్కస్ ట్రెస్కోథిక్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు.పాక్‌తో టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు:జో రూట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, డాన్ లారెన్స్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, జేమీ స్మిత్, జోష్ టంగ్.**ఆగస్టు 19న తొలి టెస్టుఇంగ్లండ్-పాకిస్తాన్ టెస్టు సిరీస్ ఆగస్టు 19న లీడ్స్‌లో ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 27 నుంచి లార్డ్స్‌లో, మూడో టెస్టు సెప్టెంబర్ 9 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది.ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో ఇంగ్లండ్ ఏడో స్థానంలో ఉండగా, పాక్ ఎనిమిదో స్థానంలో ఉంది. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా స్మిత్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు పాకిస్తాన్ క్రికెట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా దక్షణాఫ్రికా మాజీ క్రికెటర్ మైఖేల్ స్మిత్‌ను పీసీబీ నియమించింది. అతడితో రెండేళ్ల కాలానికి గాను పీసీబీ ఒప్పందం కుదుర్చుకుంది. స్మిత్ మూడు ఫార్మాట్లలోనూ పాక్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం పాక్ జట్టు తాత్కాలిక బ్యాటింగ్ కోచ్‌గా నేషనల్ సెలెక్టర్ అసద్ షఫీక్ సేవలు అందిస్తున్నాడు. అయితే ఇప్పుడు అతడి స్ధానంలో ఫుల్-టైమ్ కోచ్‌గా 46 ఏళ్ల స్మిత్ బాధ్యతలు చేపట్టనున్నాడు.ఎవరీ మైఖేల్ స్మిత్?స్మిత్‌కు అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం ఎక్కువగా లేకపోయినప్పటికి.. దేశవాళీ క్రికెట్లో మాత్రం అతడికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2003 నుంచి 2013 మధ్య కాలంలో అతడు ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఎ, టీ20 ఫార్మాట్లలో 175కి పైగా మ్యాచ్‌లు ఆడి 7,000 పైగా పరుగులు చేశారు.కోచ్‌గా కూడా అతడు విజయవంతమయ్యాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్ జట్లకు కోచింగ్ స్టాప్‌లో స్మిత్ భాగమయ్యాడు. అదేవిధంగా ఆస్ట్రేలియాకు చెందిన హోబర్ట్ హరికేన్స్, క్రికెట్ టాస్మేనియా జట్లకు బ్యాటింగ్ కోచ్‌గా అతడు పని చేశాడు. కాగా ప్రస్తుతం విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతున్న పాక్ జట్టు.. అటు నుంచి అటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బాబర్ సేన తలపడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానుంది. -
పాకిస్తాన్‌కు షాకిచ్చి.. బంగ్లాదేశ్‌కు బంపరాఫర్!
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పాకిస్తాన్‌కు షాకిచ్చింది. సమ్మర్లో పాక్‌తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను ఈసీబీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2027కు ముందు ఈసీబీ.. ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య ఏకైక టెస్టు నిర్వహించాలని నిర్ణయించింది.యూటర్న్ఈ విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)తో కూడా చర్చించినట్లు సమాచారం. అయితే, ఈసీబీ తాజాగా యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌ను కాదని బంగ్లాదేశ్‌తో ఈ ఏకైక టెస్టు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. వచ్చే ఏడాది మే నెలలో ఇంగ్లండ్- బంగ్లాదేశ్ మధ్య టెస్టు నిర్వహణకు ఈసీబీ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన వేదికను మాత్రం ఇంకా నిర్ణయించలేదు.ఒప్పందం ప్రకారం..కాగా మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)తో ఈసీబీకి ఓ ఒప్పందం ఉంది. దీని ప్రకారం.. ప్రతీ ఏడాది వేసవిలో లార్డ్స్ వేదికగా రెండు టెస్టు మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ వేదికను లార్డ్స్ నుంచి తరలిస్తున్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌కు బంపరాఫర్ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో నిర్వహించే టెస్టుకు లార్డ్స్‌ను వేదికగా ఎంపిక చేయాలనే యోచనలో ఈసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే బంగ్లాదేశ్‌కు బంపరాఫర్ వచ్చినట్లే!.. బంగ్లా జట్టు చివరగా 2010లో ఇంగ్లండ్‌లో పర్యటించింది. తాజాగా మరోసారి ఏకైక టెస్టు కోసం ఇంగ్లండ్‌కు వెళ్లనుంది.నిజానికి పాకిస్తాన్‌తో నిర్వహించాలనుకున్న ఏకైక టెస్టుకు ఈసీబీ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానాన్ని వేదికగా ఎంపిక చేసింది. అయితే, తాజా నిర్ణయం నేపథ్యంలో బంగ్లాకు చారిత్రాత్మక లార్డ్స్‌లో టెస్టు ఆడే అవకాశం రానుంది. ఇక ఇప్పటి వరకు ఇంగ్లండ్- బంగ్లాదేశ్ మధ్య ఐదు టెస్టు సిరీస్‌లు జరిగాయి. అయితే, సొంతగడ్డపై ఒకే ఒక్క మ్యాచ్‌లో బంగ్లా.. ఇంగ్లండ్‌ను టెస్టు మ్యాచ్‌లో ఓడించగలిగింది.పాకిస్తాన్‌కు ఊరటఅయితే, ఈసీబీ పాకిస్తాన్‌కు ఓ ఊరట కూడా ఇచ్చింది. ఈ ఏడాది ఆగష్టులో పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటన యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. ఇందులో భాగంగా హెడింగ్లీ, లార్డ్స్, ఎడ్జ్‌బాస్టన్ వేదికలుగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 19 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. కాగా 2020 తర్వాత పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. నాడు అజర్ అలీ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడిన పాకిస్తాన్.. బాబర్ ఆజం సారథ్యంలో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడింది.చదవండి: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే! -
ఇలా అయితే పాక్ వరల్డ్‌కప్ గెలవదు: పాకిస్తాన్ కెప్టెన్ భార్య ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. సూపర్-8 దశలో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓటమిపాలైంది. పల్లెకెలె వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.సెమీస్ అవకాశాలు సంక్లిష్టంఫలితంగా పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా, అతడి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌లో పాక్ ఓటమికి సల్మాన్‌ను బాధ్యుడిని చేస్తూ.. అతడి భార్య, కుమారుడిని అభ్యంతరకర రీతిలో పాక్ జట్టు అభిమానులు తిడుతూ పోస్టులు పెట్టారు.అంతేకాదు.. పాక్ గనుక సెమీస్ చేరకుంటే సల్మాన్‌తో పాటు అతడి కుటుంబం కూడా భూమ్మీద ఉండదంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు. ఇలా అయితే పాక్ వరల్డ్‌కప్ గెలవదుఈ నేపథ్యంలో సల్మాన్ అలీ ఆఘా భార్య సబా మంజర్ ట్రోల్స్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ‘‘పాకిస్తానీ అభిమానులారా!... నన్ను లేదంటే.. మా అమాయకపు చిన్నారి కుమారుడిని దూషించడం ద్వారా మనం ప్రపంచకప్ గెలవలేము’’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.కాగా ఇంగ్లండ్ చేతిలో ఓటమి తర్వాత సల్మాన్‌తో పాటు పాక్ జట్టులోని ఆటగాళ్లందరిపై నెట్టింట తిట్ల వర్షం కురుస్తోంది. ఇక పాక్ అభిమానులకు ఇదేమీ కొత్తకాదు. ముఖ్యంగా 1996 వరల్డ్‌కప్‌లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత.. పాక్ క్రికెటర్ల నివాసాలపై దాడులు జరిగాయి. నాటి కెప్టెన్ వసీం అక్రం ఇంటి మీద కూడా నిరసనకారులు దాడికి దిగారు.సెమీస్‌లో తొలి అడుగు ఇంగ్లండ్దేఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలైన టీ20 ప్రపంచకప్-2026లో సూపర్-8 దశ నడుస్తోంది. గ్రూప్-1 నుంచి టీమిండియా, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక బరిలో ఉన్నాయి.సూపర్-8లో భాగంగా పాక్ తొలుత న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ రద్దైపోయింది. దీంతో ఇరుజట్లకు చెరోపాయింట్ వచ్చింది. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. గత మ్యాచ్‌లో శ్రీలంకపై.. తాజాగా పాక్‌పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది ఇంగ్లండ్.చదవండి: NZ vs SL: కివీస్, శ్రీలంకలకు భారీ షాక్!.. పాక్‌కు గుడ్‌న్యూస్? -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ టీమ్
ఇంగ్లండ్ టీ20 జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్‌లో వరుసగా ఐదు ఎడిషన్లలో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్‌లో సెమీస్‌కు చేరడం ద్వారా ఈ ఘనత సాధించింది. వరుసగా 2016, 2021, 2022, 2024, 2026 ఎడిషన్లలో ఫైనల్-4కు చేరింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉండేది. పాక్ వరుసగా 2007, 2009, 2010, 2012 ఎడిషన్లలో సెమీస్‌కు చేరింది. శ్రీలంక వరుసగా 2009, 2010, 2012, 2014 ఎడిషన్లలో ఫైనల్-4కు అర్హత సాధించింది.తాజాగా ఎడిషన్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచిన ఇంగ్లండ్.. తమ మూడో టైటిల్ దిశగా దూసుకుపోతుంది. 2010, 2022 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. తాజాగా పాక్‌పై సూపర్-8 మ్యాచ్‌లో గెలుపుతో గ్రూప్-2 నుంచి దర్జాగా సెమీస్‌కు చేరింది. అంతకుముందు ఇదే దశలో ఆతిథ్య శ్రీలంకపై కూడా గెలిచింది. చివరి సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది.మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడుతున్నాయి. గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఈ గ్రూప్‌లో భారత్ సెమీస్ బెర్త్ కోసం పోరాడాల్సి ఉంటుంది. తదుపరి మ్యాచ్‌ల్లో టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్‌లతో తలపడాల్సి ఉంది.ఇదిలా ఉంటే, పల్లెకెలె వేదికగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కనులపండుగగా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు. అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).అంతకుముందు సాహిబ్జాదా ఫర్హాన్ (63) రాణించడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (25), ఫకర్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
పాక్‌పై మ్యాచ్ విన్నింగ్ శతకం.. రికార్డుల మోత మోగించిన బ్రూక్
టీ20 వరల్డ్‌కప్ 2026లో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్-8 పోరులో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చిన వైనం ప్రతి క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంది.చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కన్నుల పండుగలా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు. అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ మూడంకెల స్కోర్ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్ చేసింది జాక్స్, కర్రన్ మాత్రమే. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).ఈ మ్యాచ్ విన్నింగ్ శతకంతో బ్రూక్ రికార్డుల మోత మోగించాడు. తద్వారా తన జట్టును సెమీస్‌కు కూడా చేర్చాడు. బ్రూక్ సాధించిన ఆ రికార్డులు ఏంటంటే..?టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీహ్యారీ బ్రూక్- 50 బంతులు (తాజా మ్యాచ్‌లో)అలెక్స్ హేల్స్- 60జోస్ బట్లర్- 67టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్లుబ్రూక్- 100 (తాజా మ్యాచ్‌లో)క్రిస్ గేల్- 98 లోర్కాన్ టక్కర్- 94 నాటౌట్రోహిత్ శర్మ- 92ఈ సెంచరీతో బ్రూక్ ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతనికి ముందు జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ ఈ ఘనత సాధించారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ జట్టు సూపర్-8లో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, దర్జాగా సెమీస్‌కు చేరింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే. అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడతాయి. గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఆ గ్రూప్‌లో భారత్ సెమీస్ బెర్త్‌ను సంక్లిష్టం చేసుకుంది. -
బ్రూక్ శతకంతో ఇంగ్లండ్ సెమీస్‌కు
టి20 వరల్డ్ కప్‌లో ‘సూపర్ ఎయిట్స్’లోకి అడుగు పెట్టినా ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్‌లో ఇంకా తడబాటు... వరుసగా నాలుగు మ్యాచ్‌లలో తానూ విఫలం కావడంతో విమర్శల ఒత్తిడి... ఇలాంటి స్థితిలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదనపు బాధ్యత తీసుకున్నాడు... 61 మ్యాచ్‌ల కెరీర్లో తొలిసారి మూడో స్థానంలోకి దిగి జట్టును గెలిపించే భారాన్ని భుజాన వేసుకున్నాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో తనొక్కడే 100 పరుగులు చేసి ఒంటిచేత్తో టీమ్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరుకే పరిమితమైన పాకిస్తాన్... బౌలింగ్‌లో ఇతర బ్యాటర్లను నిలువరించగలిగింది గానీ బ్రూక్‌ను ఆపలేక మ్యాచ్‌ను అప్పగించింది. ఫలితంగా ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి! పల్లెకెలె: టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ వరుసగా ఐదోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ‘సూపర్–8’లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్–2 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై నెగ్గింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఫర్హాన్ (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో తొలి టి20 సెంచరీతో జట్టును గెలిపించాడు. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన ఇంగ్లండ్ ఇప్పుడు పాక్‌పై గెలిచి ముందంజ వేసింది. మరోవైపు పాక్ సెమీస్ చేరే అవకాశాలకు గండిపడింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై తప్పనిసరిగా గెలవడంతో పాటు ఇతర సమీకరణాలు, రన్‌రేట్‌లపై ఆ జట్టు ఆధారపడాల్సి ఉంటుంది. దక్కని శుభారంభం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌కు శుభారంభం లభించలేదు. సయీమ్ అయూబ్ (7), కెప్టెన్ సల్మాన్ ఆగా (5) తమ వైఫల్యాలను కొనసాగించారు. ఈ దశలో ఫర్హాన్, బాబర్ ఆజమ్ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లేలో ఒక్క సిక్సర్ కూడా లేకుండా పాక్ 46 పరుగులు చేసింది. ఆ తర్వాతా ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జట్టు ఒకదశలో వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే కొట్టలేకపోయింది! ఈ క్రమంలో బాబర్ వెనుదిరగ్గా, ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రం కాస్త దూకుడుగా ఆడాడు. మరోవైపు 37 బంతుల్లో ఫర్హాన్ అర్ధసెంచరీ పూర్తయింది. 16 ఓవర్లలో స్కోరు 126/4. అయితే చివరి 4 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే చేసిన టీమ్ 5 వికెట్లు కోల్పోయింది. షాదాబ్ (11 బంతుల్లో 23; 4 ఫోర్లు) కాస్త ధాటిని ప్రదర్శించడంతో స్కోరు 160 పరుగులు దాటింది. హడలెత్తించిన అఫ్రిది ఛేదనలో ఇంగ్లండ్‌ను ఆరంభంలోనే షాహిన్ షా అఫ్రిది దెబ్బ తీశాడు. తన తొలి బంతికే ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన అతను... తన రెండో ఓవర్లో జోస్ బట్లర్ (2)ను, మూడో ఓవర్లో బెతెల్ (8)ను వెనక్కి పంపించాడు. అయితే ఈ స్థితిలో బ్రూక్ ఎదురుదాడితో పరుగులు రాబట్టాడు. నవాజ్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లేలో టీమ్ స్కోరు 53 పరుగులకు చేరింది. తక్కువ వ్యవధిలో బాంటన్ (2), స్యామ్ కరన్ (16) అవుటైనా... మరోవైపు బ్రూక్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా అతను అదే ధాటిని కొనసాగించగా, విల్ జాక్స్ (23 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు) నుంచి చక్కటి సహకారం లభించింది. అలవోకగా షాట్లు ఆడిన బ్రూక్... అఫ్రిది బౌలింగ్‌లో మిడాఫ్ మీదుగా భారీ సిక్స్‌తో శతకం పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కొంత తడబడినా... చివరకు ఐదు బంతుల ముందే ఇంగ్లండ్ గట్టెక్కింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (ఎల్బీ) (బి) ఒవర్టన్ 63; అయూబ్ (సి) బెతెల్ (బి) ఆర్చర్ 7; సల్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 5; బాబర్ (బి) ఒవర్టన్ 25; ఫఖర్ (సి) డాసన్ (బి) రషీద్ 25; షాదాబ్ (రనౌట్) 23; ఉస్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 8; నవాజ్ (ఎల్బీ) (బి) డాసన్ 0; అఫ్రిది (సి) స్యామ్ కరన్ (బి) ఆర్చర్ 2; సల్మాన్ మీర్జా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–14, 2–27, 3–73, 4–122, 5–132, 6–146, 7–146, 8–149, 9–164. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2, ఒవర్టన్ 3–0–26–2, డాసన్ 4–0–24–3, స్యామ్ కరన్ 3–0–24–0, రషీద్ 4–0– 31–1, జాక్స్ 2–0–27–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 0; బట్లర్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 2; బ్రూక్ (బి) షాహిన్ అఫ్రిది 100; బెతెల్ (సి) ఫర్హాన్ (బి) షాహిన్ అఫ్రిది 8; బాంటన్ (సి) ఉస్మాన్ (బి) తారిఖ్ 2; స్యామ్ కరన్ (సి) నవాజ్ (బి) తారిఖ్ 16; జాక్స్ (బి) నవాజ్ 28; ఒవర్టన్ (స్టంప్డ్) ఉస్మాన్ (బి) నవాజ్ 0; డాసన్ (నాటౌట్) 1; ఆర్చర్ (నాటౌట్) 5; మొత్తం (19.1 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–35, 4–58, 5–103, 6–155, 7–160, 8–161. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–30–4, సల్మాన్ మీర్జా 3.1–0–26–0, సయీమ్ అయూబ్ 2–0–21–0, నవాజ్ 3–0–26–2, షాదాబ్ ఖాన్ 3–0–31–0, ఉస్మాన్ తారిఖ్ 4–0–31–2. 3 ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా హ్యారీ బ్రూక్ నిలిచాడు. గతంలో జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ మాత్రమే ఈ ఘనత నమోదు చేశారు. ఓవరాల్‌గా ఏ జట్టు తరఫునైనా టి20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా కూడా బ్రూక్ గుర్తింపు పొందాడు. టి20 ప్రపంచకప్‌లో నేడుశ్రీలంక X న్యూజిలాండ్వేదిక: కొలంబో రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రాణించిన పాక్ బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పల్లెకలే వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.ఓపెనర్ సైమ్ అయూబ్(9), కెప్టెన్ సల్మాన్ అఘా(5) నిరాశపరిచినప్పటికి.. సాహిబ్జాదా ఫర్హాన్(63), ఫఖర్ జమాన్(25), బాబర్ ఆజం(25),షాదాబ్ ఖాన్(23) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లైమ్ డాసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్, జోఫ్రా అర్చర్ తలా రెండేసి వికెట్లు చోప్పున సాధించారు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్ -
ఇంగ్లండ్‌తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న పాక్
టీ20 ప్రపంచకప్-2026లో మరో రసవత్తర పోరుకు తెర లేచింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్,ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో పాక్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫహీమ్ అష్రాప్ స్ధానంలో షాహీన్ అఫ్రిది తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్ -
టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో ఆసక్తికర సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 24) మరో ఆసక్తికర సూపర్-8 సమరం జరుగనుంది. పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ పాకిస్తాన్‌కు డూ ఆర్ డైగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పాక్ సెమీస్ రేసులో ఉంటుంది. లేకపోతే సెమీస్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. మరోపక్క ఇంగ్లండ్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఏ తలనొప్పి లేకుండా సెమీస్‌కు చేరాలనుకుంటే ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. శ్రీలంకపై తొలి సూపర్-8 మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ గ్రూప్-2 టాపర్‌గా ఉంది. ఆ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడంతో ఆ జట్టు నెట్ రన్‌రేట్ (2.550) కూడా మెరుగ్గానే ఉంది. ఈ గ్రూప్ నుంచి తొలి సెమీస్ బెర్త్ దక్కించుకునే అవకాశాలు ప్రస్తుతానికి ఇంగ్లండ్‌కే అధికంగా ఉన్నాయి.పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో ఇరు జట్లు చెరో పాయింట్ పొందాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్ చేతిలో ఓడిన శ్రీలంక -2.550 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులుపాకిస్తాన్-ఇంగ్లండ్ ఇప్పటివరకు 30 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 21, పాక్ కేవలం 9 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో కూడా ఇంగ్లండే పైచేయి సాధించింది. ఇందులో 2022 ఎడిషన్ ఫైనల్ కూడా ఉంది.పిచ్ కూడా వారికి అనుకూలమే..!ఈ మ్యాచ్ జరుగనున్న పల్లెకెలె పిచ్ కూడా ఇంగ్లండ్‌కు అనుకూలంగానే ఉంది. ఈ వేదికపై ఆ జట్టు తొలి సూపర్-8 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టునే చిత్తు చేసింది. దీనికి ముందు ఇదే వేదికపై లంకతో ద్వైపాక్షిక సిరీస్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది. ఇది ఇంగ్లీష్ ఆటగాళ్లకు బాగా కలిసొస్తుంది. మరోపక్క పాక్ ఈ వేదికపై ఇటీవలికాలంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ పిచ్ పరిస్థితులపై కూడా ఆ జట్టుకు అవగాహణ లేదు. ఎటు చూసినా నేటి మ్యాచ్‌లో ఇంగ్లండే హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తుంది.. పాక్‌తో పోలిస్తే ఇంగ్లండ్ ప్రస్తుత టోర్నీలో మెరుగైన ఫామ్‌లో ఉంది. గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్‌పై విజయాలు సాధించి సూపర్-8లోకి అడుగుపెట్టింది. పాక్ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా గ్రూప్ దశలో 3 విజయాలు సాధించి, సూపర్-8లోకి ప్రవేశించినా.. తమకంటే చిన్న జట్లపై గెలిచేందుకు పాక్ ప్లేయర్లు ఆపసోపాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.తుది జట్లు (అంచనా)..ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వారం), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (సి), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా (c), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (wk), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్ -
నాకసలు ఇజ్జత్ ఉందా?.. ఏడుపు వచ్చింది: పాక్ క్రికెటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ (Moin Khan) కుమారుడిగా ప్రేక్షకులకు పరిచయమైన క్రికెటర్ ఆజం ఖాన్ (Azam Khan). పాక్ తరఫున 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆజం.. 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 88 పరుగులే చేశాడు.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టోర్నమెంట్ ముగిసిన తర్వాత.. తిరిగి జాతీయ జట్టులో ఆజం ఖాన్ స్థానం సంపాదించుకోలేకపోయాడు. చెత్త ప్రదర్శన కారణంగా జట్టులో అతడికి చోటు కరువైంది. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి కనీసం వంద పరుగులు కూడా చేయకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.మీమ్ మెటీరియల్ అయ్యేవాడుఇందుకు తోడు ఆజం ఖాన్ భారీ కాయంపై కూడా విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. కనీస ఫిట్నెస్ లేని ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఫీల్డర్‌గానూ ఓ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయాడు. పదే పదే క్యాచ్‌లు డ్రాప్ చేస్తూ మీమ్ మెటీరియల్ అయ్యేవాడు.ఈ విషయాల గురించి ఆజం ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. 2024లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా తాను అవహేళనకు గురయ్యాయని.. తన జీవితంలో అతిగా బాధపడ్డ సందర్భం అదేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.అభ్యంతరకర భాషలో దూషించారు‘‘ఆరోజు మార్క్ వుడ్.. తొలుత నాకు బౌన్సర్ సంధించాడు. నేను దానిని వదిలేశాను. పాకిస్తాన్లో కూడా గంటకు నూటా యాభై కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తారు కాబట్టి.. నాకు అదేమీ కొత్తగా అనిపించలేదు.కానీ ఆ తర్వాత కూడా మార్క్ వుడ్ మళ్లీ బౌన్సర్ వేశాడు. నేను దానినీ ఎదుర్కోలేకపోయాను. అపుడు నా జీవితం స్తంభించిపోయినట్లుగా అనిపించింది. అసలు నాకేం అవుతుందో కూడా అర్థం కాలేదు.నా వేలికి గాయమైన తర్వాత.. నా పని అయిపోయిందని గ్రహించాను. అంతలోనే ఓవల్ స్టేడియంలోని ప్రేక్షకులు నన్ను అభ్యంతరకర భాషలో దూషించడం మొదలుపెట్టారు.నాకసలు ఇజ్జత్ ఉందా? అక్కడ ఒక పాకిస్తానీ రిపోర్టర్.. తాగి ఉన్న ఓ ఇంగ్లిష్ ప్రేక్షకుడిని.. ‘మీ అభిమాన పాకిస్తాన్ ఆటగాడు ఎవరు?’ అని అడిగారు. ఇందుకు బదులుగా అతడు.. ‘ఆజం ఖాన్.. అతడు బ్యాటింగ్ చేయలేడు. ఫీల్డింగ్ చేయలేడు’ అంటూ నాపై సెటైర్లు వేశారు.అది వినగానే నా హృదయం ముక్కలైంది. నాకసలు ఇజ్జత్ (గౌరవం) ఉందా? నా గురించి జనాలు ఇలా అనుకుంటున్నారా? అని బాధలో కూరుకుపోయా. సులువైన క్యాచ్‌లను కూడా జారవిడిచా.ఏడుపు తన్నుకొచ్చి కన్నీళ్లు కారాయి. అసలు నాకే ఇలా ఎందుకు అవుతోంది అనుకుంటూ ఏడ్చేశా’’ అని ఆజం ఖాన్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెబుతూ ఉద్వేగానికి గురయ్యాడు. కాగా నాటి మ్యాచ్‌లో ఆజం ఖాన్ డకౌట్ కాగా.. పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది.లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డకౌట్ బ్యాటర్ ఆజం ఖాన్‌పై మరోసారి విమర్శల వర్షం కురిసింది.చదవండి: వన్డే ఆల్‌టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్‌కు దక్కని చోటు -
స్టోక్స్ పాక్ పర్యటనలో ఉన్నవేళ.. కుటుంబానికి భయానక అనుభవం
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పలు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. స్టోక్స్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ సారథి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.ముసుగు దొంగలు తన ఇంట్లో ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారని స్టోక్స్ తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారని.. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి హానీ జరగలేదన్నాడు. ఈ పని ఎవరు చేశారో తెలియాల్సి ఉందని.. త్వరగా దొంగలను పట్టుకోవడంలో తమకు సహకరించాలని కోరాడు. పాక్ పర్యటనలో ఉన్న సమయంలోఏదేమైనా కష్ట సమయంలో తన కుటుంబానికి పోలీసులు అండగా ఉన్నారని.. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘అక్టోబరు 17, గురువారం.. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు నార్త్ ఈస్ట్‌లో గల కాసిల్ ఈడెన్ ఏరియాలో ఉన్న మా ఇంట్లోకి చొరబడ్డారు. నా భార్యా పిల్లలకు భయానక అనుభవంర్యా నగలు, విలువైన వస్తువులు ఎత్తుకుపోయారు. అందులో మా కుటుంబానికి అతి ముఖ్యమైన వస్తువులు కూడా ఉన్నాయి. దొంగలను పట్టుకునేందుకు దయచేసి నాకు సహాయం చేయండి. నిజానికి ఈ దుర్ఘటన జరిగినపుడు నా భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అయితే, వారిపై దొంగలు ఎలాంటి భౌతిక దాడికి పాల్పడలేదు. కానీ.. ఆ సమయంలో వారి మనఃస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందో.. దాని ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అందుకే ఫొటోలు షేర్ చేస్తున్నానా ఇంట్లో చోరీకి గురైన వస్తువుల ఫొటోలు విడుదల చేస్తున్నాను. వాటిని ఎవరైనా సులువుగా గుర్తించవచ్చు. తద్వారా దొంగలను పట్టుకునే వీలు కలుగుతుంది. మాకెంతో ముఖ్యమైన వస్తువులు పోయినప్పటికీ.. కేవలం వాటిని రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పోస్టు పెట్టడం లేదు.ఈ పని చేసిన దుండగులు ఎవరో కనిపెట్టడం కోసమే వాటి ఫొటోలు షేర్ చేస్తున్నా. విపత్కరకాలంలో మా కుటుంబానికి స్థానిక పోలీసులు అండగా నిలిచారు. వారి మేలు మర్చిపోలేనిది. ఆ దొంగలను పట్టుకునేందుకు మేమంతా తీవ్రం శ్రమిస్తున్నాం’’ అని స్టోక్స్ ఎక్స్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.పాక్ చేతిలో ఘోర ఓటమికాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు స్టోక్స్ ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా తొలి మ్యాచ్‌కు అతడు దూరంగా ఉన్నాడు. అయితే, ఆ తర్వాత అతడు తిరిగి వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆఖరి రెండు టెస్టుల్లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. తద్వారా సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలంpic.twitter.com/1nEmNcrnjQ— Ben Stokes (@benstokes38) October 30, 2024 -
మరీ స్కూల్ పిల్లల్లా ఆడారు: పాక్ మాజీ బ్యాటర్ విమర్శలు.. ఫ్యాన్స్ ఫైర్
భారత క్రికెట్ జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రోహిత్ సేన మరీ స్కూల్ పిల్లల్లా ఆడిందని.. వీరిని ‘పేపర్ టైగర్స్’ అనాలంటూ విమర్శించాడు. అయితే, టీమిండియా అభిమానులు సైతం.. ‘‘మా జట్టు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ షెహజాద్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. కాగా భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో 46 పరుగుల(తొలి ఇన్నింగ్స్)కే ఆలౌట్ అయిన రోహిత్ సేన.. ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అనంతరం పుణె వేదికగా రెండో టెస్టులోనూ 113 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఫలితంగా 0-2తో సిరీస్‌ను చేజార్చుకుంది. తద్వారా పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌లో ఓడిపోయింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ సైతం స్పందించాడు. భారత జట్టుపై న్యూజిలాండ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిందని పేర్కొన్నాడు. రోహిత్ సేన పేపర్‌పై మాత్రమే పటిష్టంగా కనిపిస్తుందని.. మైదానంలో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడటం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.ఏదో చిన్న జట్టుతో పోటీపడ్డట్లుగాఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో.. ‘‘న్యూజిలాండ్ ఇండియాకు వచ్చి టీమిండియానే ఈ స్థాయిలో ఓడించింది. ఏదో చిన్న జట్టుతో పోటీపడ్డట్లుగా సునాయాస విజయం సాధించింది. ఇప్పటి నుంచి టీమిండియాను చాలా మంది పేపర్ టైగర్స్ అంటారు.మొదటి టెస్టులో 46 పరుగులకే ఆలౌట్ అయినపుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రతి ఒక్కరికి చెడ్డరోజు ఒకటి ఉంటుందని చెప్పాడు. మేము కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తాం. కానీ.. రెండో టెస్టులో మీరేం చేశారు? పూర్తిగా ఓటమికి సిద్ధపడ్డట్లే కనిపించారు. బయటివాళ్ల మాటలు పట్టించుకోమని రోహిత్ శర్మ అంటున్నాడు.కానీ.. ఈ రెండు టెస్టులను చూస్తే మీరు ఒత్తిడికి గురవుతున్నారని స్పష్టమైంది. ఏదో స్కూల్ పిల్లలు ఆడుతున్నట్లుగా ఆడారు’’ అని అహ్మద్ షెహజాద్ విమర్శలు గుప్పించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ బదులిస్తూ.. ‘‘పాకిస్తాన్ వరుస ఓటముల తర్వాత ఒక్క సిరీస్ గెలిచింది. మీ సంగతి ఏమిటి?మరి మీ జట్టు చిత్తుగా ఓడినపుడు మీరెందుకు ఇలా మాట్లాడలేదు. టీమిండియా తిరిగి పుంజుకుంటుంది. అయినా.. మా జట్టు ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరింది. ఈసారి కూడా టైటిల్ పోరుకు చేరువైంది. మరి మీ సంగతి ఏమిటి?’’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. కాగా సొంతగడ్డపై చిత్తుగా సిరీస్‌లు ఓడిన పాకిస్తాన్ ఇటీవల ఇంగ్లండ్‌పై 2-1తో టెస్టు సిరీస్ గెలిచిన విషయ తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య నవంబరు 1 నుంచి ముంబైలో మూడో టెస్టు మొదలుకానుంది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాక్.. సిరీస్ కైవసం
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను పాకిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో పాక్ 9 వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై ఘన విజయం సాధించింది. పాక్ గెలుపులో ఆ జట్టు స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కోల్పోయిన 20 వికెట్లను పాక్ స్పిన్నర్లే పడగొట్టారు. పాక్ స్పిన్నర్లలో సాజిద్ ఖాన్ 10 వికెట్లు పడగొట్టగా.. నౌమన్ అలీ 9, జహీద్ మెహమూద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.The wait is over for the Pakistan team 🔥pic.twitter.com/gLY4p3gaur— CricTracker (@Cricketracker) October 26, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (52), జేమీ స్మిత్ (89) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ 6, నౌమన్ అలీ 3, జహీద్ మెహమూద్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ సూపర్ సెంచరీతో (134) పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో నౌమన్ అలీ (45), సాజిద్ ఖాన్ (48 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ 4, షోయబ్ బషీర్ 3, అట్కిన్సన్ 2, జాక్ లీచ్ ఓ వికెట్ పడగొట్టారు.77 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. నౌమన్ అలీ (6/42), సాజిద్ ఖాన్ (4/69) దెబ్బకు 112 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం 36 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 3.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.చదవండి: Pak vs Eng: చెలరేగిన పాక్ స్పిన్నర్లు.. ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం -
Pak vs Eng: చెలరేగిన పాక్ స్పిన్నర్లు.. ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం
Pakistan vs England, 3rd Test Day 3: పాకిస్తాన్‌తో రావల్పిండి టెస్టులో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన కనబరిచింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు 2021లో అబుదాబి వేదికగా 72 పరుగులకే కుప్పకూలింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందగా.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఆతిథ్య పాక్ రెండో మ్యాచ్‌లో జయభేరి మోగించింది.ఆరు వికెట్లతో చెలరేగిన నొమన్ అలీమూడో టెస్టులోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 267 పరుగులకే కట్టడి చేసిన షాన్ మసూద్ బృందం.. రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్ చేసింది. పాక్ స్పిన్నర్లు నొమన్ అలీ, సాజిద్ ఖాన్ ధాటికి తట్టుకోలేక ఇంగ్లిష్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.నొమన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సాజిద్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హ్యారీ బ్రూక్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ బెన్‌స్టోక్స్ 12 పరుగులకే వెనుదిరిగాడు.ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధించిన 36 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించిన పాకిస్తాన్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రెండో రోజు ఆట ఇలా సాగిందిబ్యాటర్ల పట్టుదలకు, బౌలర్ల సహకారం తోడవడంతో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో పాకిస్తాన్ మెరుగైన స్థితిలో నిలిచింది. సిరీస్ నిర్ణయాత్మక పోరులో పాకిస్తాన్ ప్లేయర్లు సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 73/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 96.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ప్లేయర్ సౌద్ షకీల్ (223 బంతుల్లో 134; 5 ఫోర్లు) వీరోచిత సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ల దాడిని సమర్థంగా ఎదుర్కొన్న షకీల్ బౌండరీల జోలికి పోకుండా ఒకటి, రెండు పరుగులు చేస్తూ ముందుకు సాగాడు. ఆఖర్లో స్పిన్ ద్వయం నోమాన్ అలీ (45; 2 ఫోర్లు, ఒక సిక్సర్), సాజిద్ ఖాన్ (48 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాకిస్తాన్‌కు 77 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కెప్టెన్ షాన్ మసూద్ (26), వికెట్ కీపర్ రిజ్వాన్ (25) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. సల్మాన్ ఆఘా (1) విఫలమయ్యాడు. సహనానికి పరీక్షగా మారిన స్లో పిచ్‌పై దాదాపు ఐదు గంటలకు పైగా క్రీజులో నిలిచిన షకీల్... నోమాన్ అలీ, సాజిద్ తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రేహాన్ అహ్మద్ 4, షోయబ్ బషీర్ మూడు వికెట్లు పడగొట్టారు.చదవండి: Ind vs NZ: రోహిత్ శర్మ మరోసారి ఫెయిల్.. నీకేమైంది ’హిట్‌మ్యాన్’?! -
చరిత్ర సృష్టించిన మహ్మద్ రిజ్వాన్..
పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు మైలు రాయిని అందుకున్న పాకిస్తానీ వికెట్ కీపర్‌గా రిజ్వాన్ రికార్డులకెక్కాడు.రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రిజ్వాన్ ఈ రికార్డును సాధించాడు. రిజ్వాన్ కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్(59 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సర్ఫరాజ్ ఆల్‌టైమ్ రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 39 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రిజ్వాన్.. 41.85 సగటుతో 2009 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ కేవలం 25 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.అదేవిధంగా రావల్పిండి టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగించింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది.చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే' -
సౌద్ షకీల్ సూపర్ సెంచరీ.. విజయం దిశగా పాక్!
రావల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ విజయం దిశగా పయనిస్తోంది. పాక్ స్పిన్నర్ల దాటికి పర్యాటక ఇంగ్లీష్ జట్టు విల్లవిల్లాడుతోంది. 77 పరుగుల లోటు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో జో రూట్(5), హ్యారీ బ్రూక్ ఉన్నారు. పాక్ స్పిన్నర్లు నోమన్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. సాజిద్ ఖాన్ వికెట్ సాధించాడు.షకీల్ సూపర్ సెంచరీ..అంతకుముందు పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. పాక్ వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కష్టాల్లో ఉన్న జట్టును తన సెంచరీతో షకీల్ గట్టెక్కించాడు. 223 బంతులు ఎదుర్కొన్న షకీల్ 5 ఫోర్లతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు టెయిలాండర్లు నోమన్ అలీ(45), సాజిద్ ఖాన్(48) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రెహాన్ ఆహ్మద్ 4 వికెట్లతో మెరవగా.. షోయబ్ బషీర్ మూడు, అట్కినసన్ రెండు వికెట్లు సాధించారు. కాగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 267 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.చదవండి: Asia T20 Cup: చెలరేగిన బ్యాటర్లు.. సెమీస్‌లో లంక చేతిలో పాక్ చిత్తు -
PAK VS ENG 2nd Test: 52 ఏళ్లలో తొలిసారి ఇలా..!
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 152 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్నర్లు చెలరేగిపోయారు. నౌమన్ అలీ 11, సాజిద్ ఖాన్ 9 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించారు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధికి చెందిన 20 వికెట్లు ఈ ఇద్దరు స్పిన్నర్లే తీయడం విశేషం. 52 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. సాజిద్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయగా.. నౌమన్ అలీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మూడు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పాక్ సొంతగడ్డపై 11 మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్ డబుల్ హ్యాట్రిక్ పరాజయాల తర్వాత తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పాక్ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 291 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ సెంచరీతో (114) సత్తా చాటగా.. మిగతా ఆటగాళ్లెవ్వరూ కనీసం చెప్పుకోదగ్గ స్కోర్లు కూడా చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ ఏడు, నౌమన్ అలీ మూడు వికెట్లు పడగొట్టారు.75 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. అఘా సల్మాన్ అర్ద సెంచరీతో (63) రాణించాడు. ఇంగ్లీష్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4, జాక్ లీచ్ 3, బ్రైడన్ కార్స్ 2, మాథ్యూ పాట్స్ ఓ వికెట్ పడగొట్టారు.297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను నౌమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) 144 పరుగులకే కుప్పకూల్చారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ టాప్ స్కోరర్‌గా (37) నిలిచాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్ గెలిచిన విషయం తెలిసిందే.చదవండి: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్..
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపరకు బ్రేక్ పడింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో 11 మ్యాచ్‌ల తర్వాత పాక్ జట్టు తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా పాక్‌కు తమ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత దక్కిన తొలి విజయమిది. చివరగా పాక్ జట్టు తమ స్వదేశంలో 2021 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై టెస్టు విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ మ్యాచ్ ముందు వరకు ఒక్క టెస్టు విజయం కూడా పాక్ నమోదు చేయలేకపోయింది.తిప్పేసిన నమాన్..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ పాక్ స్పిన్నర్ నోమన్ అలీ చుక్కలు చూపించాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకున్న పర్యాటక జట్టు కేవలం 144 పరుగులకే కుప్పకూలింది. నోమన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ సాజిద్ ఖాన్ రెండు వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఉంచింది. అయితే ఆ టార్గెట్‌ను చేధించడంలో ఇంగ్లీష్ జట్టు చతకిల పడింది.ఏడేసిన సాజిద్..ఈ మ్యాచ్‌లో మరో పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(119) సెంచరీతో మెరిశాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అదే విధంగా పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 366 పరుగులు చేసింది. కాగా సాజిద్, నోమన్ అలీ కలిపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఇక ఇరు జట్ల మూడో టెస్టు ఆక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. -
PAK VS ENG 2nd Test: బెన్ డకెట్ వరల్డ్ రికార్డు
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన డకెట్ టెస్ట్ క్రికెట్ అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. డకెట్ తన 27 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 2293 బంతులు ఎదుర్కొని 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సౌథీ పేరిట ఉండేది. సౌథీ 2418 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.టెస్ట్‌ల్లో బంతుల పరంగా వేగవంతమైన 2000 పరుగులు..బెన్ డకెట్ 2293 బంతులుటిమ్ సౌథీ 2418 బంతులుఆడమ్ గిల్‌క్రిస్ట్ 2483 బంతులుసర్ఫరాజ్ అహ్మద్ 2693 బంతులువీరేంద్ర సెహ్వాగ్ 2759 బంతులురిషబ్ పంత్ 2797 బంతులుమ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. బెన్ డకెట్ సెంచరీతో (114) కదంతొక్కగా.. జాక్ క్రాలే 27, ఓలీ పోప్ 29, జో రూట్ 34, హ్యారీ బ్రూక్ 9, బెన్ స్టోక్స్ ఒక్క పరుగు చేశారు. జేమీ స్మిత్ (12), బ్రైడన్ కార్స్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నౌమన్ అలీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.చదవండి: రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్ -
బెన్ డకెట్ సెంచరీ.. అయినా కష్టాల్లో ఇంగ్లండ్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఉన్నట్లుండి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతున్న సమయంలో సాజిద్ ఖాన్ (పాక్ స్పిన్నర్) ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇంగ్లండ్ స్కోర్ 124/1 వద్ద ఉన్న సమయంలో సాజిద్ ఖాన్ వరుసగా ఓలీ పోప్ (29), జో రూట్ (34), సెంచరీ హీరో బెన్ డకెట్ (114), హ్యారీ బ్రూక్ (9) వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ 14 పరుగుల వ్యవధిలో నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 239/6గా ఉంది. జేమీ స్మిత్ (12), బ్రైడన్ కార్స్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది.బెన్ డకెట్ సెంచరీబెన్ డకెట్ 120 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. డకెట్‌కు టెస్ట్‌ల్లో ఇది నాలుగో సెంచరీ. ఓపెనర్‌గా బరిలోకి దిగిన డకెట్ ఆది నుంచి పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. డకెట్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 16 బౌండరీలు బాదాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.చదవండి: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్ -
అరంగేట్రం బ్యాటర్ సెంచరీ.. 366 పరుగులకు ఆలౌటైన పాక్
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 7 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. బెన్ డకెట్ 26, జాక్ క్రాలే 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: IPL 2025: ‘కమిన్స్‌ను వదిలేయనున్న సన్‌రైజర్స్! కారణం ఇదే’ -
అతడి స్థానంలో ఆడితే ఏంటి?; శతక ధీరుడిపై బాబర్ పోస్ట్ వైరల్
‘‘అవకాశం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాను.. కానీ ఎప్పుడూ నిరాశ చెందలేదు. నాదైన రోజు వస్తుందని ఓపికగా వేచిచూశా’’.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన పాకిస్తాన్ క్రికెటర్ కమ్రాన్ గులామ్ అన్న మాటలు ఇవి. 29 ఏళ్ల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపాడు.అనూహ్య రీతిలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు పడగా.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చి సెంచరీ బాదాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 224 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫలితంగా కమ్రాన్ గులామ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. శతక ధీరుడిపై బాబర్ పోస్ట్ వైరల్ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కమ్రాన్‌ను కొనియాడుతూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. శతకం బాదిన తర్వాత కమ్రాన్ నేలతల్లిని ముద్దాడుతూ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన బాబర్.. ‘‘చాలా బాగా ఆడావు కమ్రాన్’’ అంటూ అభినందించాడు. కాగా పాకిస్తాన్ తరఫున అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన 13వ క్రికెటర్‌గా కమ్రాన్ గులామ్ రికార్డు సాధించాడు.తొలి ఆటగాడిగా మరో రికార్డుగతంలో పాక్ తరఫున ఖాలిద్ ఇబాదుల్లా (ఆస్ట్రేలియాపై 1966లో), జావేద్ మియాందాద్ (న్యూజిలాండ్‌పై 1976లో), సలీమ్ మాలిక్ (శ్రీలంకపై 1982లో), మొహమ్మద్ వసీమ్ (న్యూజిలాండ్‌పై 1996), అలీ నక్వీ (దక్షిణాఫ్రికాపై 1997లో), అజహర్ మహమూద్ (దక్షిణాఫ్రికాపై 1997లో), యూనిస్ ఖాన్ (శ్రీలంకపై 2000లో), తౌఫీక్ ఉమర్ (బంగ్లాదేశ్‌పై 2001లో), యాసిర్ హమీద్ (బంగ్లాదేశ్‌పై 2003లో), ఫవాద్ ఆలమ్ (శ్రీలంకపై 2009లో), ఉమర్ అక్మల్ (న్యూజిలాండ్‌పై 2009లో), ఆబిద్ అలీ (శ్రీలంకపై 2019లో) ఈ ఘనత సాధించారు. అయితే, ఇంగ్లండ్‌పై ఓ అరంగేట్ర పాకిస్తాన్ ఆటగాడు శతకం బాదడం ఇదే తొలిసారి.తొలిరోజు.. తడబడి.. నిలబడికమ్రాన్ గులామ్ (224 బంతుల్లో 118; 11 ఫోర్లు, ఒక సిక్సర్) శతకం కారణంగా రెండో టెస్టులో పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ముల్తాన్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. కాగా తొలి టెస్టులో ఘోర పరాజయం అనంతరం పలు మార్పులు చేసిన పాకిస్తాన్ జట్టు... కమ్రాన్ గులామ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ అయూబ్ (77; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (7), కెప్టెన్ షాన్ మసూద్ (3), సౌద్ షకీల్ (4) విఫలమయ్యారు. ఒకదశలో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును అయూబ్‌తో కలిసి కమ్రాన్ ఆదుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 149 పరుగులు జోడించడంతో జట్టు కోలుకుంది.మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 29 ఏళ్ల కమ్రాన్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దేశవాళీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసి గత కొంత కాలంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్న అతడికి ఎట్టకేలకు అవకాశం దక్కగా... తొలి టెస్టులోనే సెంచరీతో సత్తా చాటాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, జాక్ లీచ్, కార్స్, పాట్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. మంగళవారం ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ రిజ్వాన్ (37 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆఘా సల్మాన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.బాబర్ స్థానంలో ఆడితే ఏంటి?‘ఈ అవకాశం కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... దాన్నే ఇక్కడ కూడా కొనసాగించా. బాబర్ ఆజమ్ ఓ దిగ్గజం. అతడి స్థానంలో ఆడుతున్నా అనే విషయం పక్కనపెట్టి కేవలం అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకున్నా. క్రీజులోకి వచ్చిన సమయంలో జట్టు ఇబ్బందుల్లో ఉంది.దీంతో ఆచితూచి ఆడాలనుకున్నా. దేశవాళీ అనుభవం బాగా పనికొచ్చింది’ అని కమ్రాన్ అన్నాడు. కాగా కమ్రాన్ గులామ్ ఇప్పటి వరకు 59 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 4377 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే’ -
అరంగేట్రంలోనే సెంచరీ చేసిన పాక్ ప్లేయర్
బాబర్ ఆజమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ పాక్ తరఫున తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన గులామ్.. 224 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన గులామ్.. చాలా బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. The Moments Kamran Ghulam completed his Hundred on Test Debut. 👏He came as Babar Azam's replacement and when came to bat Pakistan were 19/2 & then he smashed Hundred - THE FUTURE OF PAKISTAN. ⭐pic.twitter.com/Z33V23vVgV— Tanuj Singh (@ImTanujSingh) October 15, 2024అతడికి సైమ్ అయూబ్ (77) సహకారం అందించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 86 ఓవర్ల అనంతరం ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (7), సైమ్ అయూబ్ (77), షాన్ మసూద్ (3), కమ్రాన్ గులామ్ (118), సౌద్ షకీల్ (4) ఔట్ కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (31), అఘా సల్మాన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: టీమిండియా చేతిలో ఘోర ఓటమి.. బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌పై వేటు -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. పాక్ తుది జట్టు ప్రకటన
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్ కోసం పాకిస్తాన్ తుది జట్టును ఇవాళ (అక్టోబర్ 14) ప్రకటించారు. తొలి టెస్ట్ ఆడిన పాక్ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. బాబర్ ఆజమ్, నసీం షా, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ స్థానాల్లో కమ్రాన్ గులామ్, నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, జహిద్ మెహమూద్ తుది జట్టులోకి వచ్చారు. ఈ జట్టుకు సారధిగా షాన్ మసూద్ కొనసాగుతుండగా.. వైస్ కెప్టెన్‌గా సౌద్ షకీల్ వ్యవహరించనున్నాడు. రేపటి నుంచి (అక్టోబర్ 15) ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును కూడా ఇవాళే ప్రకటించారు. ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి జట్టులోకి రాగా.. పేసర్ గస్ అట్కిన్సన్ స్థానంలో మరో పేసర్ మాథ్యూ పాట్స్‌ను తుది జట్టులోకి వచ్చాడు. క్రిస్ వోక్స్ స్థానంలో బెన్ స్టోక్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఓలీ పోప్ నుంచి స్టోక్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ కోసం పాక్ తుది జట్టు..సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), సల్మాన్ అలీ అఘా, ఆమెర్ జమాల్, నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, జహిద్ మెహమూద్పాక్తో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, షోయబ్ బషీర్కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: భారత్‌తో టెస్టు సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే? -
పాక్‌తో రెండో టెస్ట్.. ఇంగ్లండ్ కెప్టెన్ రీఎంట్రీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ రేపటి నుంచి (అక్టోబర్ 15) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. స్టోక్స్ గాయం కారణంగా ఇంగ్లండ్ ఆడిన గత నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ జట్టుకు ఓలీ పోప్ నాయకత్వం వహించాడు. పోప్ నాయకత్వంలో ఇంగ్లండ్ నాలుగింట మూడు మ్యాచ్‌లు గెలిచింది. తాజాగా స్టోక్స్ చేరికతో ఇంగ్లండ్ జట్టు బలం మరింత పెరిగినట్లైంది. స్టోక్స్‌ను తుది జట్టులోకి తీసుకున్న క్రమంలో క్రిస్ వోక్స్‌కు తప్పించించి ఇంగ్లండ్ మేనేజ్మెంట్. ఈ మార్పుతో పాటు ఇంగ్లండ్ మేనేజ్మెంట్ మరో మార్పు కూడా చేసింది. తొలి టెస్ట్‌లో ఆడిన గస్ అట్కిన్సన్ స్థానంలో మాథ్యూ పాట్స్‌ను తుది జట్టులోకి తీసుకుంది. స్టోక్స్ జట్టులో చేరిన క్రమంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి స్టోక్స్‌కే అప్పజెప్పాడు.మరోవైపు రెండో టెస్ట్‌కు ముందు పాకిస్తాన్ జట్టు కూడా భారీ మార్పులు చేసింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలను పక్కకు పెట్టింది. ఇంగ్లండ్‌తో తదుపరి ఆడే రెండు టెస్ట్‌లకు వీరు దూరంగా ఉంటారు. వీరితో పాటు డెంగ్యూతో బాధపడుతున్న అబ్రార్ అహ్మద్ కూడా రెండో టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.పాక్‌తో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, షోయబ్ బషీర్కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్ -
బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై దుమారం రేగుతోంది. కొత్త సెలక్షన్ కమిటీ వచ్చీ రాగానే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేయడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బాబర్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తుండగా.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం భిన్నంగా స్పందించాడు.బలిపశువు అతడేపీసీబీ కొత్త సెలక్టర్ల టార్గెట్ బాబర్ కాదన్న బసిత్ అలీ.. షాహిన్ ఆఫ్రిదిని బలిపశువును చేయాలని వాళ్లు ఫిక్సయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. షాహిన్.. షాహిద్ ఆఫ్రిదికి అల్లుడు కావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో వరుస వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాక్ జట్టు.. స్వదేశంలో తాజా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే పునరావృతం చేస్తోంది.మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక జట్టు చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన షాన్ మసూద్ బృందం.. మంగళవారం నుంచి రెండో టెస్టు మొదలుపెట్టనుంది. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో ఓటమి అనంతరం పీసీబీ తమ మాజీ క్రికెటర్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో నూతన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.అది అతడి దురదృష్టంఈ నేపథ్యంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘స్వప్రయోజనాల కోసం బ్యాటింగ్ పిచ్‌ను తయారు చేయించుకున్నారు. అలాంటి పిచ్‌పై బాబర్ ఆడలేకపోవడం, ఫామ్‌లేమిని కొనసాగించడం అతడి దురదృష్టం. అయితే, సెలక్టర్ల టార్గెట్ ఎల్లప్పుడూ షాహిన్ ఆఫ్రిది మాత్రమే. ఇందుకు కారణం షాహిద్ ఆఫ్రిది.షాహిన్ ఆఫ్రిది ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎవరు తన స్నేహితులో, ఎవరు శత్రువులో గుర్తించగలగాలి. చిరునవ్వుతో నీతో మాట్లాడినంత మాత్రాన వాళ్లు నీ ఫ్రెండ్స్ అయిపోతారనుకుంటే పొరపాటు పడినట్లే. తమ మనసులోని భావాలు బయటపడకుండా వీళ్లు(సెలక్టర్లు) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎవరు ఏమిటన్నది తెలుసుకుని మసలుకో షాహిన్’’ అని సందేశం ఇచ్చాడు.అదే విధంగా.. బాబర్ ఆజం విషయంలో అతడి అభిమానులు రచ్చ చేస్తారని.. ఈసారి వాళ్ల పరిస్థితి ఏమిటో అంటూ సెటైర్లు వేశాడు. ఏదేమైనా.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు బాబర్, షాహిన్, నసీం షాలను కొనసాగించాల్సిందని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో రెండు, మూడో టెస్టులకు బాబర్ ఆజంతో పాటు పేస్ బౌలర్లు షాహిన్ అఫ్రిది, నసీమ్ షాలను కూడా సెలక్టర్లు తప్పించారు.ముగ్గురు కొత్త ఆటగాళ్లుతొలి టెస్టులో జట్టు మొత్తం విఫలమైనా వీరిపై మాత్రమే వేటు వేయడం అంటే సెలక్టర్లు ప్రదర్శనకంటే కూడా ఒక హెచ్చరిక జారీ చేసేందుకే అనిపిస్తోంది. వీరి స్థానంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లు కమ్రాన్ గులామ్, హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్‌లను సెలక్ట్ చేశారు. వీరితో పాటు ఇద్దరు సీనియర్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమాన్ అలీలకు కూడా పాక్ జట్టులో చోటు దక్కింది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
పాక్ క్రికెట్‌కు ఏమైంది? పిచ్చి నిర్ణయాలు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడ్డాడు. అత్యుత్తమ ఆటగాడిని జట్టు నుంచి తప్పించడం సెలక్టర్ల తెలివితక్కువతనానికి అద్దం పడుతోందన్నాడు. పీసీబీ అర్థంపర్థంలేని నిర్ణయాలకు ఇది పరాకాష్ట అంటూ విమర్శించాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బాబర్‌పై వేటుముఖ్యంగా టెస్టుల్లో దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. అతడి స్థానాన్ని షాన్ మసూద్‌తో భర్తీ చేసింది పీసీబీ. అయితే, అప్పటి నుంచి పరిస్థితి ఇంకా దిగజారింది. ఆస్ట్రేలియా పర్యటనతో పాటు సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ టెస్టు సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ అయింది.ఫలితంగా మసూద్ కెప్టెన్సీపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ పాక్ వైఫల్యం కొనసాగిస్తోంది. తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇరు జట్ల మధ్య అక్టోబరు 15 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.పీసీబీ మూర్ఖత్వానికి ఇది పరాకాష్టఈ నేపథ్యంలో మిగిలిన రెండు టెస్టులకు ప్రకటించిన జట్టు నుంచి టాప్ బ్యాటర్ బాబర్ ఆజంను తప్పించింది. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్.. ‘‘చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడి ఉంది. అయినప్పటికీ అత్యుత్తమ ఆటగాడు బాబర్ ఆజంను తప్పించింది. పాకిస్తాన్ క్రికెట్ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటోంది.అందులో ఇది పరాకాష్టలాంటిది. ఇంతకంటే తెలివి తక్కువతనం, మూర్ఖత్వం మరొకటి ఉండదు! ఒకవేళ అతడే స్వయంగా విరామం కావాలని గనుక అడిగి ఉండకపోతే!’’ అని ఎక్స్ వేదికగా పీసీబీ విధానాలను, సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.మూడు ఫార్మాట్లలోనూ ఆటగాడిగా, కెప్టెన్‌గా బాబర్ భేష్ తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో బాబర్ ఆజం పాకిస్తాన్ నంబర్‌వన్ బ్యాటర్‌గా ఎదిగాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో పలు కీలక విజయాలు అందించడంతో పాటు కెప్టెన్‌గా కూడా చెప్పుకోదగ్గ ఘనతలు సాధించాడు. అంతేకాదు.. సుదీర్ఘ కాలం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బ్యాటర్‌గా కూడా కొనసాగాడు. అయితే ఇటీవల ఫామ్ కోల్పోయిన అతను టెస్టుల్లో పరుగులు చేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.గడ్డుకాలంచివరగా... డిసెంబర్ 2022లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బాబర్...గత 18 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ శతకం కూడా బాదలేకపోయాడు. ఇర 2023 నుంచి ఆడిన 9 టెస్టుల్లో అతడు సాధించిన పరుగుల సగటు 21 మాత్రమే. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో కూడా బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిన ముల్తాన్ పిచ్‌పై బాబర్ 30, 5 పరుగులు మాత్రమే సాధించడం గమనార్హం. ముఖ్యంగా బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని వికెట్‌పై అతను పేలవంగా ఆడి నిష్క్రమించడం విమర్శలకు తావిచ్చింది.కొత్త సెలక్టర్లు వచ్చారు.. వేటు వేశారు!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో పాక్ ఓడిపోగానే... మాజీ ఆటగాళ్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో పాక్ బోర్డు హడావిడిగా కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఆటగాళ్లే బాబర్‌ను తప్పించాలని నిర్ణయించారు. అయితే, టాప్ బ్యాటర్ బాబర్‌పై వేటు పాక్ క్రికెట్ వర్గాల్లో సంచలన చర్చకు కారణమైంది. ఇటీవల ఫామ్ కోల్పోయినా సరే...ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో అందరికంటే పెద్ద స్టార్ ఆటగాడు అతడేనన్నది వాస్తవం.ఇతరులలో మరో ఆటగాడు అతడి దరిదాపుల్లో కూడా లేడు. జట్టు ప్రదర్శనతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా బాబర్‌కు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఒక దశలో తన నిలకడైన ఆటతో ‘ఫ్యాబ్ 4’తో పోటీ పడుతూ ఐదో ఆటగాడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బాబర్‌పై వేటు నిజంగా అసాధారణమనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మైకేల్ వాన్ కూడా ఘాటుగా స్పందించాడు. కాగా బాబర్ 55 టెస్టుల్లో 43.92 సగటుతో 9 శతకాలు, 26 హాఫ్ సెంచరీలు సహా 3997 పరుగులు చేశాడు.చదవండి: India vs Australia: భారత్ సెమీస్ ఆశలకు దెబ్బ! -
ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లు.. బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిదిపై వేటు
ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండు, మూడు టెస్ట్‌ల కోసం పాకిస్తాన్ జట్టును ఇవాళ (అక్టోబర్ 13) ప్రకటించారు. ఈ జట్టు నుంచి సీనియర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్‌లకు ఉద్వాసన పలికారు. విశ్రాంతి పేరుతో వీరందరిని పక్కకు పెట్టారు. డెంగ్యూతో బాధపడుతున్న అబ్రార్ అహ్మద్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. వీరి స్థానాల్లో హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గులామ్, ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ పాక్ జట్టుకు ఎంపికయ్యారు. తొలి టెస్ట్ కోసం తొలుత ఎంపికై, ఆతర్వాత రిలీజ్ చేయబడిన నౌమన్ అలీ, జహిద్ మెహమూద్ మరోసారి ఎంపికయ్యారు. 16 మంది సభ్యుల ఈ జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సౌద్ షకీల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. పాక్ సెలెక్షన్ ప్యానెల్లోకి కొత్తగా అలీమ్ దార్, ఆకిబ్ జావిద్, అజహార్ అలీ చేరిన విషయం తెలిసిందే. వీరి బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే సీనియర్లపై వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇంగ్లండ్‌తో రెండు, మూడు టెస్ట్‌లకు పాక్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా , జాహిద్ మెహమూద్.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టు భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ -
బాబర్ ఆజంకు భారీ షాక్.. జట్టు నుంచి ఔట్?
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్‌లో జరగనున్న సెకెండ్ టెస్టులో గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని పాక్ జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టుకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంపై వేటు వేయాలని పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ESPNCricinfo నివేదిక ప్రకారం.. అలీమ్ దార్, ఆకిబ్ జావేద్ ,అజహర్ అలీలతో కూడిన సెలక్షన్ కమిటీ ఆజం ప్రదర్శన పట్ల తీవ్ర ఆసంతృప్తితో ఉన్నట్లు సమచాం. ఈ క్రమంలోనే అతనిని జట్టు నుండి తప్పించి యువ ఆటగాడు కమ్రాన్ గులాంకు ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నరట.బాబర్ కథ ముగిసినట్లేనా?బాబర్ గత కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతడు మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసి సుమారు ఏడాది దాటింది. బాబర్ చివరగా గతేడాది ఆగస్టులో నేపాల్‌తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే బాబర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోతున్నాడు. గత 20 నెలలలో టెస్టుల్లో అతడు సాధించిన అత్యధిక స్కోర్ 41 పరుగులే కావడం గమనార్హం. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 17 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 355 పరుగులు మాత్రమే చేశాడు. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 35 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేయాలని పీసీబీ ఫిక్స్ అయినట్లు వినికిడి.చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్ -
కషాల్లో పాకిస్తాన్ క్రికెట్.. ఆ స్టార్ క్రికెటర్‌కు మళ్లీ పిలుపు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరు ఏ మాత్రం మారలేదు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో రెడ్ బాల్ సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది.దీంతో సర్వాత్ర పాక్ జట్టు, మెనెజ్‌మెంట్ విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా జరిగే రెండు టెస్టుకు ముందు తమ జట్టులో పలు మార్పులు పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమా టీవీకి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఖాదిర్ ఖవాజా రిపోర్ట్స్ ప్రకారం.. స్టార్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను తిరిగి జట్టులోకి తీసుకు రావాలని పీసీబీ సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట. అతడితో పాటు కమ్రాన్ గులామ్, మీర్ హంజా, నౌమాన్ అలీ, యువ ఓపెనర్ మహమ్మద్ హురైరాలను కూడా జట్టులో చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇమామ్ ఉల్ హక్ చివరగా పాకిస్తాన్ తరపున గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడికి పాక్ జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటివరకు తరపున 24 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇమామ్..37.33 సగటుతో 1568 పరుగులు చేశాడు. అతడి టెస్టు కెరీర్లో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప -
ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. పాక్ కెప్టెన్‌పై వేటు?
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే తీరును కనబరుస్తోంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమి చవిచూసింది.తొలి ఇన్నింగ్స్‌లో 550కు పైగా పరుగులు చేసి ఆ మ్యాచ్‌లో ఓడిపోయిన మొదటి జట్టు పాకిస్తాన్ చెత్త రికార్డును మూటకట్టుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసిన పాక్ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 220 పరుగులకే కుప్పకూలింది. అటు ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 823 పరుగుల భారీ స్కోర్ చేసింది.మసూద్‌పై వేటు..కాగా గత 40 నెలలగా పాకిస్తాన్ కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా గెలవలేదు. చివరగా 2021లో రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ విజయాన్ని పాక్ నమోదు చేసింది. అప్పటి నుంచి 11 మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు.. రెండు డ్రాలు, తొమ్మిదింట ఓటమి పాలైంది.ఈ క్రమంలో కెప్టెన్ షాన్ మసూద్‌పై వేటు వేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత అతడిని తమ జట్టు పగ్గాలను తప్పించాలని పాక్ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆఖరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు పాక్ వెళ్లనుంది.ఈ టూర్‌కు ముందు పాక్‌కు కొత్త టెస్టు కెప్టెన్ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ ఆఘా సల్మాన్ లేదా వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు పాక్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకున్నాడు. ఇక ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
పాకిస్తాన్ చెత్త రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ జట్టు తమ ఓటముల పరంపరను కొనసాగిస్తోంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్‌లో 47 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమిని చవిచూసింది. 267 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 823 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(317) ట్రిపుల్ సెంచరీతో మెరవగా,జో రూట్(262) డబుల్ సెంచరీ చేశారు.147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిఇక ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ అంత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టెస్టు చరిత్రలోనే తొలి ఇన్నింగ్స్‌లో 550కి పైగా పరుగులు చేసినప్పటికీ, ఆ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా పాక్ నిలిచింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే తొలిసారి. పాక్ కంటే ముందు ఏ జట్టు కూడా మొదటి ఇన్నింగ్స్‌లో అంత భారీ స్కోర్ సాధించి ఆ మ్యాచ్‌ను కోల్పోలేదు.అదేవిధంగా గత 40 నెలలగా పాకిస్తాన్ కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా గెలవలేదు. చివరగా 2021లో రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ విజయాన్ని పాక్ నమోదు చేసింది. అప్పటి నుంచి 11 మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు.. రెండు డ్రాలు, తొమ్మిదింట ఓటమి పాలైంది. అంతేకాకుండా ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ ఆఖరి స్ధానానికి పడిపోయింది. -
పాకిస్తాన్‌కు మరో షాక్.. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి
పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగులతో పాక్‌ను ఇంగ్లీష్ జట్టు చిత్తు చేసింది. 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది. దీంతో మసూద్ సేన ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బ్రూక్, రూట్ విధ్వంసం..అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసం సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్‌ను ఇంగ్లీష్ జట్టు 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్, జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో మెరిశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 454 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్(151), సల్మాన్(104), షఫీక్(102) సెంచరీలతో చెలరేగారు. ఏదమైనప్పటకి పాక్ ఓటమి పాల్వడంతో వారి సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. ఓటమి దిశగా పాక్
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే చివరి రోజంతా బ్యాటింగ్ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసంభవమనే చెప్పాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 115 పరుగులు వెనుకపడి ఉంది. పాక్ చేతిలో మరో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (41), అమెర్ జమాల్ (27) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడి ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..? -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ నమోదైంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ 7 వికెట్ల నష్టానికి 823 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేశారు. టెస్ట్‌ల్లో రెండు, మూడు అత్యధిక స్కోర్లు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉండటం విశేషం. ఇంగ్లీష్ జట్టు 1938లో ఆస్ట్రేలియాపై, 1930లో వెస్టిండీస్‌పై వరుసగా 903 (7 వికెట్ల నష్టానికి), 849 పరుగులు చేసింది.ఇంగ్లండ్, పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి దిశగా సాగుతోంది. నాలుగో రోజు చివరి సెషన్లో పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే మరో 130 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మరో రోజు ఆట మిగిలి ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 823/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ శరవేగంగా వికెట్లు కోల్పోతుంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (36), అమెర్ జమాల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..? -
బాబర్ ఆజమ్.. ఇక మారవా..?
టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పని అయిపోయింది. బాబార్ గత 18 ఇన్నింగ్స్‌ల్లో (654 రోజులుగా) కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతను చివరిసారిగా 2023లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ముల్తాన్ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బాబర్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ చేసిన పిచ్‌పై బాబర్ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయాడు. బాబర్‌తో పాటు సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ జట్టు మొత్తం పేకమేడలా కూలింది. ఆ జట్టు 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది.267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఖాతా తెరవకుండానే తొలి వికెట్.. 29 పరుగులకు రెండు వికెట్లు.. 41 పరుగులకు మూడు వికెట్లు.. అదే స్కోర్ వద్ద నాలుగో వికెట్.. 59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసిన పాక్ ఆటగాళ్లు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇలా వచ్చి అలా ఔటైపోతున్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే మరో 115 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యం.పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (4), అమెర్ జమాల్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్‌ను అధిగమించాలంటే పాక్ మరో 180 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 823 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: T20 World Cup 2024: తండ్రి ఆకస్మిక మరణం.. స్వదేశానికి పయనమైన పాక్ కెప్టెన్ -
PAK vs ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జోసఫ్ ఎడ్వర్డ్ రూట్ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారీ డబుల్ సెంచరీ (262) చేసిన రూట్.. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 20000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 13వ ఆటగాడిగా రికార్డుపుటల్లోకెక్కాడు. రూట్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 350 మ్యాచ్‌లు ఆడి 20079 పరుగులు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి తర్వాత 20000 పరుగులు పూర్తి చేసింది రూట్ ఒక్కడే. విరాట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 535 మ్యాచ్‌లు ఆడి 27041 పరుగులు చేశాడు.కాగా, పాక్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రూట్ డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. సహచురుడు హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడ్డాడు. వీరితో పాటు జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 823 పరుగుల వద్ద (7 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 267 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: టెస్ట్‌ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన బ్రూక్ -
టెస్ట్‌ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన బ్రూక్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 322 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 29 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 317 పరుగులు చేసి ఔటయ్యాడు. టెస్ట్‌ల్లో బ్రూక్ చేసిన ఈ ట్రిపుల్ సెంచరీ రెండో వేగవంతమైనది. బ్రూక్ తన ట్రిపుల్‌ను 310 బంతుల్లో పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 278 బంతుల్లోనే ట్రిపుల్ కంప్లీట్ చేశాడు.టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ హండ్రెడ్స్- సెహ్వాగ్- 278 బంతులు- బ్రూక్- 310 బంతులు- మాథ్యూ హేడెన్- 362 బంతులు- సెహ్వాగ్- 364 బంతులుకాగా, ఈ మ్యాచ్‌లో బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగగా.. జో రూట్ భారీ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. రూట్ 375 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 262 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరితో పాటు జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 823 పరుగుల వద్ద (7 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 267 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: ENG vs PAK: జో రూట్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు సమం -
హ్యారీ బ్రూక్ ఊచకోత.. పాక్‌పై ట్రిపుల్ సెంచరీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్రూక్ విధ్వంసకర ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు.ముల్తాన్ వికెట్‌పై పాక్ బౌలర్లకు బ్రూక్ చుక్కలు చూపించాడు. అతడని ఆపడం ఎవరి తరం కాలేదు. 310 బంతుల్లో 28 ఫోర్లు, 3 సిక్స్‌లతో బ్రూక్ తన తొలి ట్రిపుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.బ్రూక్ ప్రస్తుతం 305 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాడు జో రూట్(262) డబుల్ సెంచరీ సాధించాడు. రూట్‌తో కలిసి హ్యారీ బ్రూక్ నాలుగో వికెట్ 454 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 147 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 795 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 239 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. -
పాక్‌కు చుక్కలు.. హ్యారీ బ్రూక్ విధ్వంసకర డబుల్ సెంచరీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు వరద పారిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే జో రూట్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ చేరాడు. ముల్తాన్ టెస్టులో బ్రూక్ విధ్వంసకర డబుల్ సెంచరీతో మెరిశాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామంలా ఉన్న ముల్తాన్ పిచ్‌పై బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వన్డేను తలపిస్తూ పాక్ బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 18 ఫోర్లు, 1 సిక్సర్‌తో బ్రూక్ తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం 218 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.అది పిచ్ కాదు.. హైవే!తొలి టెస్టుకు సిద్దం చేసిన ముల్తాన్ పిచ్‌పై సర్వాత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వికెట్ ఏ మాత్రం టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కనీసం స్వింగ్, టర్న్ లేకుండా హైవేలా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఎటువంటి పిచ్ టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తుందని విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 658 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(220), జో రూట్(259) ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 414 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 111 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: IND vs BAN: వారెవ్వా హార్దిక్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! వీడియో First Test double ton for Harry Brook 💯💯#PAKvENG | #TestAtHome pic.twitter.com/ZjikCyBQpu— Pakistan Cricket (@TheRealPCB) October 10, 2024 -
ENG vs PAK: జో రూట్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు సమం
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీతో రూట్ చెలరేగాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామం మారిన ముల్తాన్ పిచ్‌పై రూట్ దుమ్ములేపుతున్నాడు. 305 బంతుల్లో 14 ఫోర్లతో రూట్ తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రూట్‌కు ఇది ఆరో టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ప్రస్తుతం 203 పరుగులతో రూట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో హ్యారీ బ్రూక్(174) డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.సచిన్ రికార్డు సమం..ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో మెరిసిన ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన జాబితాలో ఏడో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లి కేన్ విలియమ్సన్, ఆటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, యూనిస్ ఖాన్ సరసన రూట్ నిలిచాడు.ఈ దిగ్గజాలు కూడా టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్(12) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధాన్లాలో కుమార సంగర్కర(11), లారా(9) కొనసాగుతున్నారు. -
PAK VS ENG 1st Test: లక్కీ బ్రూక్..!
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ధీటుగా జవాబిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 492 పరుగులు చేసింది. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 64 పరుగులే వెనుకపడి ఉంది. జో రూట్ (176), హ్యారీ బ్రూక్ (141) అజేయ శతకాలతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) కూడా అర్ద సెంచరీలతో మెరువగా.. ఓలీ పోప్ డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, ఆమెర్ జమాల్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.What happened there?! 😲Brook is rendered lucky 🏏#PAKvENG | #TestAtHome pic.twitter.com/qk5dzRKEYn— Pakistan Cricket (@TheRealPCB) October 9, 2024లక్కీ బ్రూక్ఈ మ్యాచ్‌లో బ్రూక్ 75 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆమెర్ జమాల్ బౌలింగ్‌లో బ్రూక్ ఆడిన డిఫెన్సివ్ షాట్ వికెట్లకు తాకినప్పటికీ బెయిల్స్ కింద పడలేదు. దీంతో బ్రూక్ బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులు లక్కీ బ్రూక్ అని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో బ్రూక్ ఆరో టెస్ట్ సెంచరీని, రూట్ 35వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. -
హ్యారీ బ్రూక్ సెంచరీ.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో బ్రూక్ 118 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో బ్రూక్‌కు ఇది ఆరో సెంచరీ. పాక్‌పై కేవలం ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఇది నాలుగవది. బ్రూక్‌తో పాటు మరో ఎండ్‌లో జో రూట్ కూడా సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరు సెంచరీల మోత మోగించడంతో పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ధీటుగా జవాబిస్తుంది. 85.2 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 427/3గా ఉంది. రూట్ 146, బ్రూక్ 108 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) కూడా అర్ద సెంచరీలతో మెరిశారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా -
అరివీర భయంకర ఫామ్‌లో జో రూట్.. టెస్ట్‌ల్లో 35వ సెంచరీ
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ టెస్ట్ క్రికెట్లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. రూట్ గత మూడేళ్లుగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్లో రూట్ 2021 నుంచి 16 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైచిలుకు పరుగులు చేశాడు. ఈ మధ్యకాలంలో టెస్ట్‌ల్లో ఇన్ని సెంచరీలు కాని, ఇన్ని పరుగులు కాని ఏ ఆటగాడూ చేయలేదు.JOE ROOT, YOU FREAKING LEGEND. 🙇♂️- 35th Test century going past Gavaskar, Younis, Lara and Jayawardene and became England's leading run scorer as well in Tests. The GOAT!! 🐐 pic.twitter.com/uG9pkzpmOf— Mufaddal Vohra (@mufaddal_vohra) October 9, 2024రూట్ ఖాతాలో 35వ సెంచరీతాజాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్ మరో సెంచరీతో మెరిశాడు. రూట్‌కు టెస్ట్‌ల్లో ఇది 35వ సెంచరీ. ఈ సెంచరీతో రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ రికార్డును చేరుకునే క్రమంలో రూట్ సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, మహేళ జయవర్దనే, యూనిస్ ఖాన్ లాంటి దిగ్గజాలను అధిగమించాడు. పైన పేర్కొన్న వారంతా టెస్ట్‌ల్లో తలో 34 సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు..సచిన్-51కల్లిస్-45పాంటింగ్-41సంగక్కర-38ద్రవిడ్-36రూట్-35*ఈ ఏడాది ఐదో సెంచరీరూట్ టెస్ట్‌ల్లో తన రెడ్ హాట్ ఫామ్‌ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాడు. తాజా సెంచరీతో కలుపుకుని రూట్ ఈ ఏడాది ఐదు సెంచరీలు పూర్తి చేశాడు. ఈ ఏడాది టెస్ట్‌ల్లో రూట్, కమిందు మెండిస్ మాత్రమే ఐదు సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ వేదికగా మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ధీటుగా జవాబిస్తుంది. మూడో రోజు రెండో సెషన్ సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. రూట్ (104), హ్యారీ బ్రూక్ (59) క్రీజ్‌లో ఉన్నారు. జాక్ క్రాలే (78), ఓలీ పోప్ (0), బెన్ డకెట్ (84) ఔటయ్యారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా -
జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా
టెస్టు క్రికెట్లో ఇంగ్లంగ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పరుగులు వరదపారిస్తున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రూట్.. ఇప్పుడు పాకిస్తాన్‌పై కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.ముల్తాన్ వేదికగా పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ అదరగొడుతున్నాడు. 82 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న రూట్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో రూట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.కుక్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు..టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 71 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ ఘనత సాధించాడు. రూట్ ఇప్పటివరకు 147 టెస్టులు ఆడి 12473* పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుక్ ఆల్‌టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అదే విధంగా ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15921) అగ్రస్ధానంలో ఉండగా, రెండో స్ధానంలో రికీ పాంటింగ్(13378) పరుగులు చేశాడు.చదవండి: CT 2025: పాక్‌కు బిగ్ షాక్.. భారత్ ఫైనల్ చేరితే వేదిక మారే ఛాన్స్! ఎక్కడంటే? -
ENG vs PAK: పాక్‌తో అట్లుంటది మరి (వీడియో)
ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న స్టార్ ప్లేయర్లు జో రూట్(72), బెన్ డకెట్(80) సెంచరీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా పాకిస్తాన్ టీమ్ మరోసారి తమ పరువు పోగొట్టుకుంది. ఓ చెత్త రివ్యూ తీసుకుని నవ్వులు పాలు అయింది.అసలేం జరిగిందంటే?ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన పాక్ పేసర్ అమీర్ జమాల్ తొలి బంతిని గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే బంతి కాస్త బ్యాట్‌కు దగ్గర వెళ్తూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే వికెట్ కీపర్‌తో పాటు బౌలర్ క్యాచ్‌కు అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు. వికెట్ కీపర్ రిజ్వాన్ కూడా అంత స్పష్టంగా అప్పీల్ చేయలేదు. ఎందుకంటే కనీసం బ్యాట్‌కు తాకిన శబ్ధం కూడా రాలేదు. కానీ జమాల్ మాత్రం రివ్యూకు వెళ్లాలని కెప్టెన్ మసూద్‌కు సూచించాడు. మసూద్ ముందు వెనక ఆలోచించకుండా వెంటనే డీఆర్ఎస్కు సిగ్నల్ చేశాడు. అయితే రిప్లేలో బంతికి, బ్యాట్‌కు మధ్య చాలా గ్యాప్ ఉన్నట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఈజీగా ప్రకటించాడు. బిగ్ స్క్రీన్‌పై రిప్లే చూసిన అభిమానులతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాక్‌తో అట్లుంటది మరి అని కామెంట్లు చేస్తున్నారు. కాగా పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్ సాధించింది.చదవండి: CT 2025: పాక్‌కు బిగ్ షాక్.. భారత్ ఫైనల్ చేరితే వేదిక మారే ఛాన్స్! ఎక్కడంటే? pic.twitter.com/d1uBa82Nh4— Jatin malu (Ja3) (@jatin_malu) October 9, 2024 -
PAK VS ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్న రూట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 59 మ్యాచ్‌లు ఆడిన రూట్ 51.59 సగటుతో 5005 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 20 అర్ద శతకాలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మార్నస్ లబూషేన్ ఉన్నాడు. లబూషేన్ ఇప్పటివరకు 3904 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత కూడా రూట్‌కే దక్కుతుంది.డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు..రూట్-5005లబూషేన్-3904స్టీవ్ స్మిత్-3486బెన్ స్టోక్స్-3101బాబర్ ఆజమ్-2755ఎడిషన్ల వారీగా రూట్ చేసిన పరుగులు..2019-21లో 1660 పరుగులు2021-23లో 1915 పరుగులు2023-25లో 1490 పరుగులురూట్ ఖాతాలో మరో రికార్డు..తాజా ఇన్నింగ్స్‌తో రూట్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఐదోసారి క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సచిన్ అత్యధికంగా ఆరు సార్లు ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగలు పూర్తి చేశాడు. రూట్.. బ్రియాన్ లారాతో (5) కలిసి ఐదు సార్లు ఈ ఘనతను సాధించాడు. రూట్ ఈ ఏడాది 1018 పరుగులు (21 ఇన్నింగ్స్‌ల్లో) చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్‌ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్‌లో ఆమెర్ జమాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 96/1గా ఉంది. జాక్ క్రాలే (64), జో రూట్ (32) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 460 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్‌గా సచిన్ -
PAK VS ENG 1st Test: జమాల్ 'కమాల్' క్యాచ్
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఆమెర్ జమాల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ ఆడిన పుల్ షాట్‌ను జమాల్ 'కమాల్' క్యాచ్‌గా మలిచాడు. మిడ్ వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న జమాల్ ఒంటి చేత్తో సూపర్ మ్యాన్‌లా క్యాచ్ అందుకున్నాడు. జమాల్ కమాల్ విన్యాసాన్ని చూసి ఓలీ పోప్‌కు ఫ్యూజులు ఔటయ్యాయి. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.UNBELIEVABLE CATCH 😲Aamir Jamal pucks it out of thin air to send back the England captain 👌#PAKvENG | #TestAtHome pic.twitter.com/MY3vsto4St— Pakistan Cricket (@TheRealPCB) October 8, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్‌ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్‌లో ఆమెర్ జమాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 96/1గా ఉంది. జాక్ క్రాలే (64), జో రూట్ (32) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 460 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: హాంగ్‌కాంగ్ సిక్సర్స్ టోర్నీలో పాల్గొననున్న టీమిండియా -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. అఘా సల్మాన్ అజేయ శతకం.. పాక్ భారీ స్కోర్
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో రోజు మూడో సెషన్లో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్‌ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్‌లో ఆమెర్ జమాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 1.3 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 7/1గా ఉంది. జాక్ క్రాలే (4), జో రూట్ (3) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: Ind vs Aus: టీమిండియాతో టెస్టులు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్ -
Pak vs Eng: ‘హైవే రోడ్డు మీద కూడా బ్యాటింగ్ చేయలేవు’
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పూర్తిగా విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా అతడి ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. హై వే రోడ్డు మీద సైతం బ్యాటింగ్ చేయడం చేతకాదంటూ సోషల్ మీడియాలో రిజ్వాన్ బ్యాటింగ్‌పై మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.ఓపెనర్ల సెంచరీలుకాగా బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో సొంతగడ్డపై వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్... ఇంగ్లండ్‌తో సిరీస్‌ను మెరుగ్గా ఆరంభించింది. ముల్తాన్ వేదికగా సోమవారం మొదలైన మ్యాచ్‌లో కెప్టెన్ షాన్ మసూద్ (177 బంతుల్లో 151; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (184 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో ఆకట్టుకున్నారు.ఇంగ్లండ్ అనుభవజ్ఞులైన బౌలర్లు ఈ పర్యటనకు దూరంగా ఉండటం పాకిస్తాన్‌కు కలిసివచ్చింది. దీంతో తొలిరోజు పూర్తిగా ఆతిథ్య జట్టు పైచేయి సాధించి.. భారీస్కోరుకు బాటలు వేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. నసీం షా సైతం 33 పరుగులతోఈ క్రమంలో మంగళవారం రెండో రోజు ఆటలో సౌద్ షకీల్ అర్ధ శతకం(177 బంతుల్లో 82 రన్స్) పూర్తి చేసుకోగా.. ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పేసర్ నసీం షా సైతం 33 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, అనూహ్యంగా ఏడో స్థానంలో వచ్చిన స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం నిరాశపరిచాడు.రిజ్వాన్ మాత్రం డకౌట్ఈ వికెట్ కీపర్ 12 బంతులు ఎదుర్కొన్నా ఖాతా తెరవలేకపోయాడు. జాక్ లీచ్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు రిజ్వాన్ ఆట తీరుపై జోకులు పేలుస్తున్నారు. ‘‘ముల్తాన్ పిచ్‌ను హై వే రోడ్డులా మార్చేసినా.. నువ్వు పరుగులు చేయలేవు. బౌలర్లు కూడా బంతిని బాదుతున్నారు. నువ్వు మాత్రం చెత్తగా ఆడుతున్నావు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టుల్లో రిజ్వాన్ రాణించలేకపోతున్నాడు. 2022-23లో జరిగిన సిరీస్‌లోనూ రిజ్వాన్ వరుసగా 29, 46, 10, 30, 19, 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం మధ్యాహ్నం టీ బ్రేక్ సమయానికి పాకిస్తాన్ 138 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 515 పరుగులు చేసింది.చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. భారీ స్కోర్ దిశగా పాకిస్తాన్
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సౌద్ షకీల్(35), నసీం షా(0) ఉన్నారు.అయితే పాక్ బ్యాటర్లలో కెప్టెన్ షాన్ మసూద్, అబ్దుల్లా షఫీక్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 253 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మసూద్ 177 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 151 పరుగులు చేయగా.. షఫీక్ 184 బంతుల్లో 102 పరుగులు చేశాడు.అయితే ఈ మ్యాచ్‌లో కూడా పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 30 పరుగులు మాత్రమే చేసి ఆజం ఔటయ్యాడు.తొలి రోజు ఆట ముగుస్తుందన్న సమయంలో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా బాబర్ పెవిలియన్‌కు చేరాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ రెండు వికెట్లు పడగొట్టగా.. బషీర్,వోక్స్ తలా వికెట్ సాధించారు.చదవండి: కోచ్‌గా పనికిరాడన్నారు కదా: మెకల్లమ్ కామెంట్స్ వైరల్ -
కోచ్‌గా పనికిరాడన్నారు కదా: మెకల్లమ్ కామెంట్స్ వైరల్
ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సోమవారం(ఆక్టోబర్ 7) ప్రారంభమైంది. ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇరు జట్లు తలపడుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకం. కాగా ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు చేపట్టిన దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్.. ఇంకా జట్టుతో చేరలేదు.ఈ సిరీస్ కోసం ఏర్పాటు చేసిన ప్రీ ట్రైనింగ్ క్యాంప్‌లో సైతం జిమ్మీ భాగం కాలేదు. అండర్సన్ ప్రస్తుతం స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న గోల్ప్ టోర్నీ ఆల్ఫ్రెడ్ డన్హిల్ లింక్స్ ఛాంపియన్‌షిప్‌లో బీజీబీజీగా ఉన్నాడు. అతడు జట్టుతో కలిసేందుకు మరో రెండు రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు అతడి తీరును తప్పుబడుతున్నారు. కీలకమైన సిరీస్‌ను పక్కన పెట్టి గోల్ప్ టోర్నీలో పాల్గోనడమెంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే అండర్సన్‌కు ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం మద్దతుగా నిలిచాడు. జిమ్మీ ఇంకా జట్టుతో చేరనప్పటకి వర్చవుల్గా తన సూచనలు అందిస్తున్నాడని మెకల్లమ్ తెలిపాడు."రెండు నెలల క్రితం ఆండర్సన్ కోచ్‌గా పనికిరాడని కొంతమంది అన్నారు. ఇప్పుడేమో అతడు ఇంకా జట్టుతో చేరలేదని విమర్శిస్తున్నారు. వాస్తవానికి మేము కూడా అతడిని మిస్ అవుతున్నాము. ఒక ఆటగాడి నుండి కోచ్‌గా మారిన తక్కువ సమయంలో జిమ్మీ ఎంత ప్రభావం చూపించాడో మాకు ఇప్పుడు ఆర్ధమవుతోంది.ప్రస్తుతం టెక్నాలజీ చాలా అభివృద్ది చెందింది. అతడు తన సలహాలు, సూచనలు ఇవ్వాలంటే జట్టుతో పాటే ఉండాల్సిన అవసరం లేదు. వర్చువల్‌గా అతడు మా బౌలర్లకు సలహాలు, చిట్కాలు అందిస్తున్నాడు. అతడు స్కాట్లాండ్లో జరుగుతున్న గోల్ఫ్ టోర్నీలో ఆడుతున్నాడు. ఈ విషయం మాకు ముందే చెప్పాడు. మేము అందరి కలిసి తీసుకున్న నిర్ణయమిది. జిమ్మీ త్వరలోనే జట్టుతో చేరుతాడు. అతడు 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత తన న్యూ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. కాబట్టి అతడికి తన కుటుంబంతో గడిపే సమయం కూడా ఇవ్వాలి కాదా. జిమ్మీ మా జట్టు పార్ట్‌టైమ్ బౌలింగ్ కన్సల్టెంట్ మాత్రమే. పూర్తి స్ధాయిలో అతడు తన సేవలను అందించడు" అంటూ ఓ ఇంటర్వ్యూలో మెకల్లమ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: అలా ఎలా కొట్టావు హార్దిక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే( వీడియో) -
పాక్ కెప్టెన్ సూపర్ సెంచరీ.. నాలుగేళ్ల నిరీక్షణకు తెర
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై షాన్ విరుచుకుపడ్డాడు. వన్డే తరహాలో దూకుడుగా ఆడుతున్న మసూద్ కేవలం 102 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుతం 104 పరుగులతో మసూద్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా మసూద్‌కు ఇది ఐదో టెస్టు సెంచరీ. అయితే అతడికి నాలుగేళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. మసూద్ చివరగా 2020లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో శతకం సాధించాడు.అంతేకాకుండా 2022 ఏడాది తర్వాత ఓ పాక్ కెప్టెన్ టెస్టుల్లో సెంచరీ చేయడం ఇదే మొదటి సారి. 2022 డిసెంబర్లో పాకిస్తాన్ కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజం.. కివీస్‌తో జరిగిన టెస్టులో సెంచరీ చేశాడు. ఇప్పుడు మళ్లీ రెండేళ్ల తర్వాత మసూద్ సెంచరీతో మెరిశాడు. ఇక 39 ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది. క్రీజులో మసూద్‌తో పాటు షఫీక్(72) పరుగులతో ఉన్నాడు.చదవండి: టీమిండియా అరుదైన ఘనత.. పాకిస్తాన్ వరల్డ్ రికార్డు సమం -
Pak Vs Eng: పాక్ తుదిజట్టు ఇదే.. సూపర్ స్టార్ రీఎంట్రీ
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ తమ తుదిజట్టును ప్రకటించింది. ముల్తాన్ మ్యాచ్‌లో ముగ్గురు సీమర్లను ఆడిస్తున్నట్లు తెలిపింది. కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు దూరమైన స్టార్ బౌలర్, పేస్ దళ నాయకుడు షాహిన్ ఆఫ్రిది ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు. అమీర్ జమాల్ సైతం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.ఆసీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన ఆమీర్బంగ్లాదేశ్తో ఇటీవలి టెస్టులకు ఎంపికైనప్పటికీ ఆమీర్ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అతడు ఫిట్‌గా ఉండటం సానుకూలాంశంగా మారనుంది. కాగా దాదాపు ఏడాది క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగా ఆమీర్ జమాల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 28 ఏళ్ల ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఆ సిరీస్‌లో 18 వికెట్లు తీసి సత్తా చాటాడు.ఆ ముగ్గురూ అవుట్అంతేకాదు.. సిడ్నీ టెస్టులో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి 82 పరుగులు కూడా సాధించాడు. ఇక పేస్ దళంలో షాహిన్, ఆమీర్‌తో పాటు నసీం షా కూడా చోటు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో భాగమైన ఖుర్రం షెహజాద్, మహ్మద్ అలీ, మీర్ హంజాలను ఈసారి యాజమాన్యం పక్కనపెట్టింది.వారి విషయంలో ఎలాంటి మార్పులు లేవుఇక యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కూడా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తుదిజట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడిన టాప్-7 బ్యాటర్ల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ సైతం ఇప్పటికే పాక్‌తో తొలి టెస్టుకు తమ తుదిజట్టును ప్రకటించిది. కెప్టెన్ బెన్ స్టోక్స్ తొడకండరాల నొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా పాకిస్తాన్- ఇంగ్లండ్ మధ్య అక్టోబరు 7ను ముల్తాన్ వేదికగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది. రెండో టెస్టుకు కూడా ముల్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఆఖరి మ్యాచ్ రావల్పిండిలో జరుగనుంది. ఇక ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఎనిమిది, ఇంగ్లండ్ నాలుగో స్థానాల్లో ఉన్నాయి. టాప్‌లో టీమిండియా కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా రెండు, శ్రీలంక మూడో స్థానంలో ఉన్నాయి.పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లుపాకిస్తాన్సయీమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా, అమీర్ జమాల్, షాహిన్ షా అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే , జాక్ లీచ్, షోయబ్ బషీర్.చదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
Pak vs Eng: ‘అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండి’
పాకిస్తాన్ సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో అక్టోబరు 7 నుంచి మూడు టెస్టులు ఆడనుంది. కాగా గత కొన్నాళ్లుగా టెస్టుల్లో పాకిస్తాన్‌కు విజయమన్నదే కరువైంది. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ ఘోర పరాభవం పాలైంది.షాన్ మసూద్ బృందంపై విమర్శలుతొలిసారిగా బంగ్లా చేతిలో టెస్టులో ఓడటమే గాకుండా సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో షాన్ మసూద్ బృందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఈ సిరీస్‌తో పాక్ టెస్టు జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిల్లెస్పికి కూడా చేదు అనుభవం ఎదురైంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో తాజా సిరీస్ జట్టుతో పాటు గిల్లెస్పికి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలో అతడు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా.. సులువుగా పరుగులు రాబట్టడానికి వీలుగా ఉండే ఫ్లాట్ పిచ్ కావాలని కోరిన పాక్ బ్యాటర్ల అభ్యర్థనను నిరభ్యంతరంగా కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండిపాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ‘‘పాక్ టెస్టు జట్టు లోపల ఏం జరిగిందో చెప్తాను. ఫ్లాట్ పిచ్ కావాలని కోరిన పాకిస్తాన్ ఆటగాళ్ల నోళ్లను అతడు మూయించేశాడు. గ్రౌండ్స్‌మెన్ తయారు చేసిన పిచ్‌ను అచ్చంగా అలాగే కొనసాగించాలని నిర్ణయించాడు.ఎక్కువ కష్టపడకుండా సులువుగా పరుగులు రాబట్టాలనే వారి రిక్వెస్ట్‌ను కొట్టిపారేశాడు. పిచ్ క్యూరేటర్, గిల్లెస్పి ఆట రసవత్తరంగా సాగేలా పిచ్‌ను తయారు చేసేందుకే మొగ్గుచూపారు. గ్రాసీ పిచ్‌పై మ్యాచ్ జరిగి మా బౌలర్లు వికెట్లు తీస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు’’ బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.అప్పుడు 3-0తో చిత్తుకాగా అక్టోబరు 7న పాకిస్తాన్ -ఇంగ్లంఢ్ మధ్య ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్టు మొదలుకానుంది. ఇరుజట్ల మధ్య 2022లో పాకిస్తాన్ వేదికగా జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. మరోసారి క్లీన్‌స్వీపే లక్ష్యంగా పాక్ గడ్డపై అడుగుపెట్టింది. చదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
పాక్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! కెప్టెన్ దూరం
పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లీష్ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఆక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఫస్ట్ టెస్టుకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ క్రికెట్ ప్రకటించింది.ముల్తాన్ టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న స్టోక్స్.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరికొంత సమయం పట్టనుంది. దీంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఓలీ పోప్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సే ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు. మరోవైపు ఈ సిరీస్‌తో స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత అతడు ఇంగ్లండ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకపై బ్యాట్, బాల్‌తో సత్తాచాటిన గుస్ అట్కిన్సన్కు కూడా ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ తొలి టెస్టుకు చోటు కల్పించింది.పాక్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే..జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే , జాక్ లీచ్, షోయబ్ బషీర్చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా? -
Pak vs Eng: పాకిస్తాన్‌తో తొలి టెస్టు.. బెన్ స్టోక్స్ దూరం!
పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆల్‌రౌండర్ ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని సమాచారం. దీంతో ఒలీ పోప్ మరోసారి స్టోక్స్ స్థానంలో జట్టును ముందుకు నడిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ది హండ్రెడ్ లీగ్ 2024 సందర్భంగా బెన్ స్టోక్స్ గాయపడిన విషయం తెలిసిందే. నార్తర్న్ సూపర్చార్జెర్స్కు ప్రాతినిథ్యం వహించిన అతడు తొడకండరాల నొప్పితో జట్టుకు దూరమయ్యాడు. దీంతో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ కూడా ఆడలేకపోయాడు.ఈ క్రమంలో ఒలీ పోప్ సారథ్య బాధ్యతలు చేపట్టగా.. ఇంగ్లండ్ శ్రీలంకపై మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, కెప్టెన్సీ పోప్ వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపగా.. అతడు విమర్శల పాలయ్యాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 7 నుంచి పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది.ముల్తాన్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టుఇందుకోసం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ముల్తాన్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే మాట్లాడుతూ.. స్టోక్స్ గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. ‘‘ఇంకో రెండు మూడు వైద్య పరీక్షల తర్వాత అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడో లేదో తెలుస్తుంది. పూర్తిగా కోలుకున్నాడనే అనుకుంటున్నాం.రిస్క్ తీసుకోవడం అనవసరంమ్యాచ్ ఆడేందుకు తను సిద్ధంగా ఉన్నాడు. అయితే, రిస్క్ తీసుకోవడం అనవసరం. మా జట్టు పటిష్టంగా ఉంది. ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్రౌండర్లుగా రాణించగల సమర్థులు ఉన్నారు. అందుకే.. అతడిపై మేనేజ్మెంట్ ఒత్తిడి పెట్టదలచుకోలేదు’’ అని జాక్ క్రాలే మీడియాతో పేర్కొన్నాడు. కాగా క్రాలే సైతం చేతి వేలికి గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతడు శ్రీలంకతో టెస్టులు మిస్సయ్యాడు. అతడి స్థానంలో డాన్ లారెన్స్ ఓపెనింగ్ చేశాడు. పాక్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జోష్ హల్, జాక్ లీచ్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, రెహాన్ అహ్మద్, జో రూట్, షోయబ్ బషీర్, జేమీ స్మిత్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: ఇషాన్ కిషన్ ఆశలపై నీళ్లు చల్లిన టీమిండియా స్టార్ -
Pak vs Eng Tests: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ
పాకిస్తాన్ పర్యటనకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. యువ బౌలర్ జోష్ హల్(Josh Hull).. పాక్‌తో టెస్టు సిరీస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్దారించింది. తొడ కండరాల నొప్పి కారణంగా.. పాకిస్తాన్ టూర్‌కు జోష్ దూరమయ్యాడని తెలిపింది. అతడు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించింది.అరంగేట్రంలో రాణించికాగా లీసస్టర్ఫైర్కు చెందిన లెఫ్టార్మ్ పేసర్ జోష్ హల్ ఇటీవలే ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. సొంతగడ్డపై శ్రీలంకతో ఓవల్ టెస్టు(సెప్టెంబరు 6, 2024) సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసి 53 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.గాయం కారణంగాఅయితే, ఈ మ్యాచ్ తర్వాత జోష్ తొడ కండరాల నొప్పి కారణంగా ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ నాటికి అతడు ఫిట్నెస్ సాధిస్తాడని భావించిన సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేశారు. కానీ.. జోష్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ 16 మంది సభ్యుల జట్టుతోనే పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆరు ఫీట్ల ఏడు అంగుళాల ఎత్తు ఉండే జోష్ హల్కు ఇంగ్లండ్ బోర్డు ప్రత్యామ్నాయ బౌలర్‌ను ప్రకటించకపోవడం ఇందుకు కారణం.వుడ్ కూడా లేడుకాగా దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ పేస్ దళంలో క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. అయితే, మార్క్ వుడ్ శ్రీలంకతో సిరీస్ తర్వాత ఈ ఏడాది తదుపరి సిరీస్లన్నింటికి దూరం కాగా.. ఇప్పుడు జోష్ కూడా అందుబాటులో లేకపోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక అక్టోబరు 7 నుంచి 28 వరకు పాకిస్తాన్- ఇంగ్లండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్న విషయం తెలిసిందే. ముల్తాన్, రావల్పిండి ఇందుకు వేదికలు.పాకిస్తాన్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జాక్ లీచ్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: టీ10 క్రికెట్లో సంచలనం.. స్కాట్లాండ్ క్రికెటర్ సుడిగాలి శతకం -
అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో టెస్టులకు ఎంపికైన కమ్రాన్ గులామ్, మహ్మద్ అలీలను ఈ సిరీస్‌కు పక్కన పెట్టడాన్ని చాలా పాక్ మాజీలు తప్పబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పాక్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ చేరాడు. సెలక్టర్లపై షెహజాద్ విమర్శలు గుప్పించాడు. గులామ్, మహ్మద్ అలీలను జట్టు నుంచి ఎందుకు తప్పించిరంటూ సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించాడు. "కమ్రాన్ గులాంకు మరోసారి మొండి చేయి చూపించారు. దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటకి అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు ఆర్ధం కావడం లేదు. ఎలాగో ఖుర్రం షాజాద్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో జమాల్‌ను సెలక్ట్ చేశారు. జమాల్ సైతం పూర్తి ఫిట్నెస్తో లేడు.అంతేకాకుండా షాహీన్ అఫ్రిది కూడా గాయంతో బాధపడుతున్నాడు. అటువంటిప్పుడు పేసర్ మహమ్మద్ అలీని జట్టులోకి తీసుకోవచ్చుగా. సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. వీరిద్దరితో పాటు మరో యువ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ సైతం డొమాస్టిక్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. అతడిని కూడా జట్టులోకి తీసుకోవడం లేదు.ఇందుకు సెలక్టర్లు ఏమి సమాధానం చెబుతారు? వారు చేసిన తప్పు ఏమిటి? బాబర్ బ్యాటింగ్ చేసే పొజిషన్లోనే బ్యాటింగ్ చేయడమా? కనీసం కమ్రాన్‌కు అయినా ఛాన్స్ ఇవ్వాల్సింది. ఈ జట్టును సెలక్టర్‌గా యూసుఫ్ భాయ్ ఎంపిక చేశాడు.కాబట్టి కమ్రాన్ గులామ్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదో నాకు ఒక్క కారణం చెప్పండి అంటూ" షెహజాద్ మండిపడ్డాడు. కాగా కమ్రాన్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ వన్ డే కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అతడు 49.60 సగటు, 100 స్ట్రైక్-రేట్‌తో 248 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాక్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, మీర్ హమ్జా, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), నసీమ్ షా, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్), షాహీన్ షా ఆఫ్రిది. -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. పాక్ జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ రీఎంట్రీ?
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాభావం పొందిన పాకిస్తాన్.. ఇప్పుడు మరో కఠిన పరీక్షకు సిద్దమైంది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో పాక్ తలపడనుంది. ఆక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు షాన్ మసూద్ సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో ఎడమచేతి వాటం స్పిన్నర్ నోమన్ అలీ , ఆల్‌రౌండర్ అమీర్ జమాల్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. నోమన్‌కు టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. పాక్ తరపున మొత్తం 15 టెస్టులు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు. 37 ఏళ్ల నోమన్ చివరిసారిగా జూలై 2023లో పాక్ తరపున ఆడాడు. అదే విధంగా ఖుర్రం షాజాద్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో జమాల్‌కు చోటు దక్కింది. ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సెలక్ట్ అయిన పాక్ ఆటగాళ్లు ఛాంపియన్స్ వన్డే కప్‌లో భాగమయ్యారు.అయితే ప్రధాన కోచ్ జాసన్ గిల్లెస్పీ సూచన మేరకు ఛాంపియన్స్ వన్డే కప్ ప్లేఆఫ్‌ల నుంచి తప్పుకున్నారు. ఈ సిరీస్ కోసం షాన్ మసూద్ అండ్ కో సెప్టెంబర్ 30న ముల్తాన్‌లో సమావేశం కానున్నారు. అక్టోబర్ 1 నుంచి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించనున్నారు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాక్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, మీర్ హమ్జా, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), నసీమ్ షా, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్), షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: కోహ్లితో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! 155 పరుగులతో విధ్వంసం? -
పాక్‌కు భారీ షాక్.. షాహీన్ అఫ్రిదికి గాయం! ఆ సిరీస్‌కు దూరం?
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందుకు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్‌కు ఆ జట్టు ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా దూరమ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఛాంపియన్స్ వన్డేకప్ 2024లో లయన్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్రిది.. డాల్ఫిన్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు.ఈ మ్యాచ్‌లో అతడి మెకాలికి గాయమైంది. డాల్ఫిన్స్ ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్ వేసిన ఓ డెలివరీ అఫ్రిది మోకాలిగా బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి నొప్పి ఇసుమంత కూడా తగ్గలేదు. దీంతో అతడు ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. కాగా అఫ్రిది మోకాలి గాయం బారిన పడడం ఇదేమి తొలిసారి కాదు. గత రెండేళ్లుగా మోకాలి గాయంతో పోరాడుతున్నాడు. జూలై 2022లో, శ్రీలంకతో జరిగిన తొలిసారి గాయపడ్డ అఫ్రిది.. ఆసియాకప్‌కు దూరమయ్యాడు.గతేడాది కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ అదే మెకాలి గాయం కావడంతో పాక్ జట్టు మెనెజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది. షాహీన్ ప్రస్తుతం పీసీబీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఛాంపియన్స్ వన్డే కప్ ప్లే ఆఫ్స్‌కు దూరకావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.ఇంగ్లండ్‌తో సిరీస్ సమయానికి అఫ్రిది ఫిట్నెస్ సాధించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటించనుంది. ఆక్టోబర్ 7 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. -
పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్.. సిరీస్ అక్కడే
పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణపై పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) స్పష్టతనిచ్చింది. తమ దేశంలోనే ఈ సిరీస్ జరుగుతుందని శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ముల్తాన్, రావల్పిండి ఇందుకు ఆతిథ్యం ఇస్తాయని పేర్కొంది. అక్టోబరు 7 నుంచి 28 వరకు ఇరుజట్ల మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు వెల్లడించింది.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు తమ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ స్వయంగా పేర్కొన్నాడు. అందుకే భారీ మొత్తంలో నిధులు కేటాయించి స్టేడియాల్లో మెరుగైన వసతులతో పాటు.. పలు పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు తెలిపాడు.శ్రీలంక లేదంటే యూఏఈలో అంటూ వదంతులువచ్చే ఏడాది జరుగనున్న ఈ మెగా ఈవెంట్ నాటికి అంతా సిద్ధం చేస్తామని నక్వీ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చే అంశంపై సందేహాలు నెలకొన్నాయి. స్టేడియాల ప్రక్షాళన నేపథ్యంలో పీసీబీ ఇంగ్లండ్‌తో సిరీస్ వేదికను మార్చే యోచనలో ఉందని.. శ్రీలంక లేదంటే యూఏఈలో నిర్వహిస్తారనే వార్తలు వినిపించాయి.అయితే, అనుమానాలన్నింటి పటాపంచలు చేస్తూ పీసీబీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. తమ దేశంలోనే పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబరు 7-11, 15-19 మధ్య జరుగనున్న తొలి రెండు మ్యాచ్‌లకు ముల్తాన్.. అక్టోబరు 24-28 వరకు జరుగనున్న ఆఖరి టెస్టుకు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. నిజానికి కరాచీలో జరగాల్సిన ఈ చివరి టెస్టును అక్కడి నుంచి తరలించడానికి కారణం.. పునరుద్ధరణ కార్యక్రమాలే అని పేర్కొంది. అక్టోబరు 2న ఇంగ్లండ్ జట్టు ముల్తాన్‌కు చేరుకోనున్నట్లు వెల్లడించింది. కాగా పాకిస్తాన్ చివరగా బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడింది.ఘోర పరాభవం నుంచి కోలుకునేనా?ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగమైన ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ ఘోర పరాభవం మూటగట్టుకుంది. టెస్టు చరిత్రలో తొలిసారి బంగ్లా చేతిలో ఓడటమే గాకుండా.. 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. ఫలితంగా మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తదుపరి జరుగనున్న టెస్టు సిరీస్ షాన్ మసూద్ బృందానికి విషమ పరీక్షగా మారింది.చదవండి: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. గావస్కర్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
పాకిస్తాన్‌తో టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టోక్స్ రీఎంట్రీ
అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 17 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 10) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. స్టోక్స్ గాయం కారణంగా తాజాగా ముగిసిన శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్టోక్స్‌తో పాటు జాక్ క్రాలే, జాక్ లీచ్, రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్ జట్టులోకి పునరాగమనం చేశారు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు (డర్హమ్ సీమర్ బ్రైడన్ కార్స్, ఎసెక్స్ బ్యాటర్ జోర్డన్ కాక్స్) చోటు దక్కించుకున్నారు.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే మ్యాచ్‌ల నిర్వహణకు వేదికలు సరిగ్గా లేవన్న కారణంగా ఈ సిరీస్‌ను యూఏఈలో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తుంది. వేదికల మార్పుపై ఈ వారాంతంలో పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా తొలి టెస్ట్.. అక్టోబర్ 15 నుంచి కరాచీ వేదికగా రెండో టెస్ట్.. అక్టోబర్ 24 నుంచి రావల్పిండి వేదికగా మూడో టెస్ట్ జరగాల్సి ఉంది.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ జట్టు 2022లో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్లో పర్యటించింది. ఆ సిరీస్‌ను పర్యాటక ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జోర్డన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జోష్ హల్, జాక్ లీచ్, ఒల్లీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, ఒల్లీ స్టోన్ , క్రిస్ వోక్స్రేపటి నుంచి ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు..ఇంగ్లండ్ జట్టు రేపటి నుంచి (సెప్టెంబర్ 11) స్వదేశంలో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లలో తొలుత టీ20, ఆతర్వాత వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఆసీస్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్..సెప్టెంబర్ 11- తొలి టీ20 (సౌతాంప్టన్)సెప్టెంబర్ 13- రెండో టీ20 (కార్డిఫ్)సెప్టెంబర్ 15- మూడో టీ20 (మాంచెస్టర్)సెప్టెంబర్ 19- తొలి వన్డే (నాటింగ్హమ్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (లీడ్స్)సెప్టెంబర్ 24- చెస్టర్ లీ స్ట్రీట్సెప్టెంబర్ 27- లండన్సెప్టెంబర్ 29- బ్రిస్టల్ -
Pak vs Eng: పాకిస్తాన్లో కాదు శ్రీలంకలో!?
బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. అక్టోబరు 7 నుంచి ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ముల్తాన్, కరాచి, రావల్పిండిలో ఈ మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంది.అయితే, తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ వేదికను విదేశానికి తరలించినట్లు సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా శ్రీలంకలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్‌లోని స్టేడియాల పునరుద్ధరణ కార్యక్రమం నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.అందుకే వేదిక మార్పుకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీని సమర్థవంతంగా నిర్వహించాలంటే పాక్ స్టేడియాల్లో తగిన సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు వివిధ స్టేడియాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. అయితే ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో టెస్టుమ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో సిరీస్ వేదికను తరలించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.కానీ.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును ఇందుకు ఒప్పించడం సహా... యూఏఈ లేదంటే శ్రీలంకలో సిరీస్ నిర్వహించడం పాక్ బోర్డుకు అంతతేలికేమీ కాదు. ఎందుకంటే.. బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్-2024 వేదికగా ఇప్పటికే యూఏఈని ఖరారు చేసింది ఐసీసీ. అక్టోబరు 3- 20 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది.లంక బెస్ట్ ఆప్షన్కాబట్టి యూఏఈలో పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు.. శ్రీలంకలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడా మ్యాచ్‌లు సజావుగా నిర్వహించడం కష్టమేకానుంది. అయితే, లంక కంటే ఉత్తమ ఆప్షన్ లేదు కాబట్టి అక్కడే ఈ సిరీస్‌ను నిర్వహించాలని పాక్ బోర్డు భావిస్తున్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో 0-2తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. పాకిస్తాన్ బంగ్లా చేతిలో టెస్టుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.పాకిస్తాన్లో ఇంగ్లండ్ పర్యటన 2024- ఖరారైన షెడ్యూల్మొదటి టెస్టు- అక్టోబరు 7- అక్టోబరు 11- ముల్తాన్రెండో టెస్టు- అక్టోబరు 15- అక్టోబరు 19- కరాచిమూడో టెస్టు- అక్టోబరు 24- అక్టోబరు 28- రావల్పిండి. -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. వరుసగా నాలుగో విజయం
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. కాగా ఇది పాక్‌కు వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మక్సూద్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షోయబ్ మాలిక్(21) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మీకర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాడీ, స్కోఫీల్డ్ తలా వికెట్ సాధించారు.తిప్పేసిన ఆజ్మల్..197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 117 పరుగులకే కుప్పకూలింంది. పాక్ బౌలర్లలో స్పిన్నర్ ఆజ్మల్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. రజాక్ రెండు, సోహైల్ ఖాన్, మాలిక్ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ మాస్టర్డ్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IND vs SL: భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య -
అంతర్జాతీయ క్రికెట్‌కే సిగ్గుచేటు: పాక్ ఆటగాడిపై విమర్శలు
పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. సొంత జట్టు అభిమానులే అతడి ఆట తీరుపై మండిపడుతున్నారు. బంధుప్రీతితో ఇలాంటి వాళ్లను జట్టుకు ఎంపిక చేస్తే మున్ముందు భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మెగా టోర్నీకి సన్నద్దమయ్యే క్రమంలో బట్లర్ బృందంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది.తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మరోసారి వరుణుడు అడ్డుపడటంతో మూడో టీ20 రద్దైపోగా.. గురువారం నాటి ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. తద్వారా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.పూర్తిగా విఫలంఇదిలా ఉంటే.. తాజా సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండో టీ20లో 10 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసిన మిడిలార్డర్ బ్యాటర్.. నాలుగో టీ20లో డకౌట్ అయ్యాడు.ఇంగ్లండ్ సీనియర్ పేసర్ మార్క్‌వుడ్ దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఐదు బంతులు ఎదుర్కొని సున్నా చుట్టి పెవిలియన్ చేరాడు. కాగా 2021లో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆజం ఖాన్.. ఇప్పటిదాకా పాక్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 88 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేటు 135.38.అయితే, వరల్డ్‌కప్-2024 జట్టులో మాత్రం అనూహ్యంగా అతడికి చోటు దక్కింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనైనా రాణించి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని భావిస్తే.. ఆజం ఖాన్ పూర్తిగా విఫలం కావడం అభిమానులను సైతం నిరాశపరిచింది.ఆజం ఖాన్ జట్టుకు ‘భారమే’ అంటూ ట్రోల్స్ఇక ఈ సిరీస్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓడటంతో అందరి దృష్టి ఆజం ఖాన్‌పై పడింది. వికెట్ కీపర్‌గానూ అతడు విఫలం కావడంతో.. ఆజం ఖాన్ జట్టుకు ‘భారమే’ తప్ప ఏమాత్రం ఉపయోగం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆజం ఖాన్‌పై నెట్టింట భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. అతడి ఆట తీరుకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ.. ‘‘నెపోటిజం అన్న పదానికి అత్యుత్తమ ఉదాహరణగా ఇతడిని చూపవచ్చు.అతడు జట్టులో ఉండాలని కోరుకున్న వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలి. ఇదేదో చిన్న పొరపాటు కాదు.. తీవ్రంగా పరిగణించదగ్గ నేరం. అంతర్జాతీయ క్రికెట్‌కే ఒక రకంగా సిగ్గుచేటు’’ అని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. కాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ తనయుడే ఈ ఆజం ఖాన్!!చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుAzam Khan is an embarrassment to international cricket pic.twitter.com/Ferp0ys5nf— yang goi (@GongR1ght) May 30, 2024Azam Khan is the best example of nepotism in our country. Mediocrity rules here in every department. Shameless people who persisted with him must be charged and sentenced. This is a criminal act not a simple mistake.— Mubasher Lucman (@mubasherlucman) May 30, 2024WHAT A BALL BY MARK WOOD.🤯- This is Brutal from Wood...!!!!! 🔥 pic.twitter.com/9kTgDdrxpi— Tanuj Singh (@ImTanujSingh) May 30, 2024 -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ స్పిన్నర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డుకెక్కింది. చెమ్స్‌ఫోర్డ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో 3 వికెట్లు పడగొట్టిన ఎక్లెస్టోన్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.సోఫీ కేవలం 63 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మార్క్‌ను అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ క్యాథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ పేరిట ఉండేంది. ఆమె 64 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. తాజా మ్యాచ్‌తో క్యాథరిన్ ఆల్‌టైమ్ రికార్డును ఎక్లెస్టోన్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై 178 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 29.1 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. -
ENG vs PAK: ఇంగ్లండ్‌కు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్
కార్డిఫ్ వేదికగా పాకిస్తాన్‌తో జరగనున్న మూడో టీ20కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ మూడో టీ20కు దూరమయ్యాడు. బట్లర్ భార్య లూయిస్ తమ మూడో బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. బట్లర్ పితృత్వ సెలువు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మూడో టీ20కు జోస్ దూరం కానున్నాడు. నాలుగో టీ20కు కూడా అతడి అందుబాటులో ఉండేది అనుమానమే. బట్లర్ గైర్హజరీలో స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఇంగ్లీష్ జట్టును నడిపించనున్నాడు. అయితే తొలుత బట్లర్ టీ20 వరల్డ్‌కప్-2024లోని తమ ప్రారంభ మ్యాచ్‌లకు బట్లర్ దూరమవుతాడని అంతా భావించారు. కానీ అనుకున్న సమయం కంటేముందు తన భార్య బిడ్డకు జన్మనించే అవకాశం ఉంది.దీంతో అతడు ఈ మెగా ఈవెంట్ మొత్తం మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు ఇంగ్లండ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్‌పై ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బట్లర్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. -
చరిత్ర సృష్టించిన బట్లర్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బట్లర్ కేవలం 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 3000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా బట్లర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 115 టీ20 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. 3011 పరుగులు చేశాడు.బట్లర్ అంతర్జాతీయ టీ20 కెరీర్లో 23 ఫిప్టీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అదే విధంగా టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా 1000 పరుగుల మైలురాయిని కూడా బట్లర్ అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(84)తో పాటు విల్ జాక్స్(37), బెయిర్ స్టో(21) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లో షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. రవూఫ్, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. -
చాలా బాధగా ఉంది.. మేము కొన్ని తప్పులు చేశాం: బాబర్ ఆజం
వన్డే వరల్డ్‌కప్-2023ను పాకిస్తాన్ ఓటమితో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజయం పాలైంది. దీంతో సెమీస్ రేసు నుంచి పాకిస్తాన్ అధికారికంగా నిష్క్రమించింది. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 44.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లతో అదరగొట్టగా.. గుస్ అట్కిన్సన్, అదిల్ రషీద్, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో అఘా సల్మాన్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు ఇది ఐదో ఓటమి. వన్డే ప్రపంచకప్‌ల చరిత్రలో ఒక టోర్నీలో పాక్ 5 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు. "ఈ మ్యాచ్‌లో మా ప్రదర్శన చాలా నిరాశపరిచింది. మేము దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో గెలిచినట్లయితే.. పరిస్థితి మరో విధంగా ఉండేది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేశాం. 20-30 పరుగులు అదనంగా ఇచ్చాం. మా స్పిన్నర్లు వికెట్లు తీయలేదు. అది మాపై పెద్ద ప్రభావాన్ని చూపింది. మిడిల్ ఓవర్లో స్పిన్నర్లు వికెట్లు తీయకపోతే ఏ జట్టుకైనా గెలవడం చాలా కష్టం. ఈ టోర్నీలో మేము చేసిన తప్పిదాలను కచ్చితంగా చర్చిస్తాం. తప్పులతో పాటు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. జట్టుకు సారథిగా ఎల్లప్పుడూ 100 శాతం ఎఫెక్ట్ పెడతాను" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బాబర్ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. బుమ్రా దూరం! జట్టులోకి యువ బౌలర్ -
పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్..
వన్డే ప్రపంచకప్-2023ను ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 246 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లతో అదరగొట్టగా.. గుస్ అట్కిన్సన్, అదిల్ రషీద్, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో అఘా సల్మాన్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. జోరూట్(60), జానీ బెయిర్ స్టో(59) పరుగులతో రాణించారు. ఆఖరిలో హ్యారీ బ్రూక్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), డేవిడ్ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 15) మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ ఓటమితో పాకిస్తాన్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. -
జో రూట్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో 1000 పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్.. ఈ అరుదైన మైలు రాయిని రూట్ అందుకున్నాడు. రూట్ ఇప్పటివరకు వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో 25 ఇన్నింగ్స్‌లలో 1034 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 72 బంతులు ఎదుర్కొన్న రూట్.. 4 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో రూట్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన రూట్.. 248 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. -
చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. పాక్ టార్గెట్ 338 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ ఎట్టకేలకు తమ బ్యాటింగ్ విశ్వరూపం చూపించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా వేదికగా పాకిస్తాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. జోరూట్(60), జానీ బెయిర్ స్టో(59) పరుగులతో రాణించారు. ఆఖరిలో హ్యారీ బ్రూక్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), డేవిడ్ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 15) మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇఫ్తికర్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది. చదవండి: WC 2023: వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్‌బై..! -
టాస్ ఓడిన పాక్.. సెమీస్ రేసు నుంచి అవుట్! 2.5 ఓవర్లలో ఛేదిస్తేనే
ICC WC 2023- Is Pakistan Knocked Out: వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ రేసులో నిలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బాబర్ టాస్ ఓడిపోవడంతో పాకిస్తాన్ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా శ్రీలంకపై జయభేరి మోగించి న్యూజిలాండ్ అనధికారికంగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, సాంకేతికంగా పాక్‌కు ఇంకా దింపుడుకళ్లెం ఆశలు ఉండేవి. ఇంగ్లండ్‌పై 287 పరుగులతో గెలవడం లేదంటే.. ఇంగ్లండ్ విధించిన ఎంతటి లక్ష్యాన్నైనా 3 ఓవర్లలోపు ఛేదించడం వంటి సమీకరణలు ఉన్నాయి. అయితే, గత రికార్డుల దృష్ట్యా ఇది ఏ రకంగా చూసినా అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇక తాజాగా ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో పాక్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించడం లాంఛనమే అయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు బాబర్ ఆజం మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ గెలిచి.. రన్‌రేటు భారీగా పెంచుకుంటామని తెలిపాడు. అయితే, అద్భుతం జరిగితే తప్ప అతడి మాటలు నిజమయ్యే ఛాన్స్ లేదు! కాబట్టి పాక్ ఖేల్ టాస్ వద్ద ఖతమైందని చెప్పొచ్చు! కానీ.. బాబర్ చెప్పినట్లు క్రికెట్లో ఎప్పుడు, ఏమైనా జరగొచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారా?! అయితే, పాజిటివిటీకి అది పరాకాష్ట లాంటిదే! సమీకరణాల దృష్ట్యా అలాంటి అవకాశం ఇప్పుడైతే లేదు మరి!! View this post on Instagram A post shared by ICC (@icc) ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది కాబట్టి! ►ఇంగ్లండ్ స్కోరు - 20, 1.3 ఓవర్లలోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించాలి ►ఇంగ్లండ్ స్కోరు - 50, పాక్ 2 ఓవర్లలోనే ఛేదించాలి ►ఇంగ్లండ్ - 100, 2.5 ఓవర్లలోనే పాక్ ఛేదించాలి ►ఇంగ్లండ్ - 150, పాక్ 3.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి ►ఇంగ్లండ్ - 200, 4.3 ఓవర్లలోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించాలి ►ఇంగ్లండ్ - 300, పాక్ 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి. చదవండి: కానిస్టేబుల్ కొడుకు నుంచి టీమిండియా క్రికెటర్ దాకా! సంజూ ఆస్తి ఎంతంటే! -
పాక్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోగా.. న్యూజిలాండ్ తమ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంకపై ఘన విజయం ద్వారా అనధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో.. టాప్-4లో నిలవాలన్న పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే, న్యూజిలాండ్‌ను దాటుకుని బాబర్ ఆజం బృందం ముందుకు వెళ్లాలంటే ఇంగ్లండ్‌పై ఊహించని రీతిలో విజయం సాధించాలి. కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌ను 287 పరుగుల తేడాతో మట్టికరిపించాలి. లేదంటే టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. ఆ జట్టు విధించిన లక్ష్యాన్ని 3 ఓవర్లలోపే ఛేదించాలి. ఎంతటి పటిష్ట జట్టుకైనా ఇది అసాధ్యమే! అయితే, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయంటున్నాడు పాక్ సారథి బాబర్ ఆజం. ఈ మేరకు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన బాబర్.. ‘‘క్రికెట్లో ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు.. ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శనతోనే ముగిస్తాం. రన్ రేటును భారీగా పెంచుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించాం. మైదానంలో వాటిని కచ్చితంగా అమలు చేస్తాం. తొలి 10 ఓవర్లపాటు ఎలా బ్యాటింగ్ చేయాలన్న దానిపైనే ప్రస్తుతం దృష్టి సారించాం. ఆ తర్వాత ఏం చేయాలో పరిస్థితులకు తగ్గట్లు చేసుకుపోతాం. ఒకవేళ ఫఖర్ జమాన్ 20-30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయగలిగితే మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. ఓపెనర్ ఫఖర్ జమాన్‌తో పాటు ఆల్‌రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాత్ర కూడా ఈ మ్యాచ్‌లో కీలకమేనని బాబర్ ఆజం ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అదే విధంగా కెప్టెన్సీ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని.. రెండు బాధ్యతలను తాను సమర్థవంతంగా నెరవేర్చగలనని బాబర్ స్పష్టం చేశాడు. చదవండి: గర్వంగా ఉంది.. మా విజయాలకు కారణం అదే.. వాళ్లు అద్బుతం: హష్మతుల్లా -
CWC 2023: పాక్‌ను సెమీస్‌కు చేర్చేందుకు వసీం అక్రమ్ మాస్టర్ ప్లాన్
ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ సెమీస్‌కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఏదో అత్యద్భుతం జరిగితే తప్ప, దాయాది జట్టు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించలేదు. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ తేడా గెలవడంతో నాలుగో సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు ఆ జట్టు సెమీస్‌కు చేరడం ఖాయమైపోయింది. పాక్ సెమీస్‌కు చేరాలంటే ఆ జట్టు ముందు రెండు ప్రధాన అప్షన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇంగ్లండ్‌తో రేపు (నవంబర్ 11) జరుగబోయే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి అతి భారీ స్కోర్ చేయడం. అనంతరం ప్రత్యర్ధిని 287 పరుగుల తేడాతో ఓడించడం. ఈ మ్యాచ్‌లో పాక్ కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌ను 13 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. అదే 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు ప్రత్యర్ధిని మట్టుబెట్టాల్సి ఉంటుంది. వన్డేల్లో ఒక్కసారి కూడా 400 స్కోరు దాటని పాక్‌కు ఈ టాస్క్ అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో పాక్ టాస్ ఓడితే బరిలోకి దిగకుండానే సెమీస్ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇంగ్లండ్ నిర్ధేశించే ఎంతటి లక్ష్యాన్నైనా పాక్ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది. ఇది ఏ రకంగానూ ఊహకు అందని విషయం. కాబట్టి పాక్ సెమీస్ అవకాశాల విషయంలో ప్లాన్ ఏ ఫెయిల్ అయినట్లే అని చెప్పాలి. ప్లాన్ బి ఏంటంటే.. పాక్ సెమీస్‌కు చేరే అంశంపై ఆ దేశ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ వ్యంగ్యంగా స్పందించాడు. ఓ స్థానిక టీవీ ఛానల్ డిబేట్లో అతను మాట్లాడుతూ పాక్ జట్టుపై సెటైర్లు వేశాడు. ఇంగ్లండ్‌పై తమ జట్టు 400కు పైగా స్కోర్ చేయడం లేదా 287 పరుగుల భారీ తేడాతో గెలవడం వంటివి జరగని పనులు. కాబట్టి పాక్ సెమీస్‌కు చేరాలంటే ఇక మిగిలింది ఒకే ఒక మార్గం. పాక్ తొలుత బ్యాటింగ్ చేసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. ఆపై ఇంగ్లండ్ జట్టును డ్రెస్సింగ్ రూమ్‌లో పెట్టి తాళం వేసి, వారి బ్యాటర్లందరినీ 'టైమ్డ్ ఔట్' అయ్యేలా చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా ప్రకటించబడిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే వసీం అక్రమ్ పాక్ జట్టుపై టైమ్డ్ ఔట్ సెటైర్లు వేశాడు. -
పాక్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి.. టాస్ ఓడినా ఇంటికే..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో సెమీస్ బెర్త్‌లు దాదాపుగా ఖరారైపోయాయి. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ సెమీస్‌కు చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. శ్రీలంకపై భారీ తేడా గెలవడంతో న్యూజిలాండ్ నాలుగో సెమీస్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుని భారత్‌తో పోటీకి సిద్ధమైంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప పాక్, ఆఫ్ఘనిస్తాన్లు సెమీస్‌కు చేరలేవు. 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాక్ ముందుకు.. అక్షరాలా 287 పరుగులు... శనివారం ఇంగ్లండ్‌పై ఇంత భారీ తేడాతో విజయం సాధిస్తేనే పాకిస్తాన్ జట్టు ముందంజ వేసే అవకాశం ఉంటుంది. అంటే పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌ను 13 పరుగులకు పరిమితం చేయాలి! 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. వన్డేల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాక్ జట్టు 400 పరుగుల స్కోరు దాటలేదు. ఇంగ్లండ్ ఏ జట్టుకూ 400 పరుగులు సమర్పించుకోలేదు. ఇంగ్లండ్‌ను నిలువరించడం సంగతేమో కానీ పాక్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఆ జట్టే కనీసం 300 పరుగులు చేసే స్థితిలో లేదు. అసలు 287 పరుగులు చేస్తే గానీ లెక్క రాసే అవకాశం కూడా లేదు! ఇక ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం టాస్ వద్దే పాక్ జట్టు ఖేల్ ఖతం. ఎందుకంటే ఎంతటి లక్ష్యమైనా పాక్ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది! ఇది ఏ రకంగానూ ఊహకు కూడా అందనిది. చదవండి: CWC 2023: సౌతాఫ్రికాతో మ్యాచ్.. ఇలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు..! -
న్యూజిలాండ్‌కు షాక్ తప్పదా? బ్యాడ్‌న్యూస్ ఏమిటంటే..?
WC 2023- Semi Final Race: వన్డే వరల్డ్‌కప్-2023 సెమీస్ రేసులో నిలిచే జట్లపై మూడు రోజుల్లో స్పష్టత రానుంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాప్-4లో నిలిచేందుకు న్యూజిలాండ్, పాకిస్తాన్లతో పాటు.. అఫ్గనిస్తాన్ కూడా పోటీ పడుతోంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఈ మూడు జట్లు నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో ఉన్నాయి. అయితే, రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్.. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్లను దాటి నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో లీగ్ దశలో ఈ మూడు జట్లకు మిగిలిన ఒక్క మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం వస్తుందన్న దానిపైనే సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలో న్యూజిలాండ్, పాక్, అఫ్గన్ విజయం సాధిస్తే రన్‌రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టే సెమీస్‌లో అడుగుపెడుతుంది. ముందుగా న్యూజిలాండ్ బరిలోకి ఈ క్రమంలో ముందుగా... న్యూజిలాండ్ శ్రీలంకతో గురువారం మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో కివీస్ భారీ విజయం గనుక సాధిస్తే సులువుగానే సెమీస్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అయితే, వర్షం రూపంలో కివీస్ జట్టుకు భారీ ప్రమాదం పొంచి ఉంది. accuweather సైట్ వివరాల ప్రకారం గురువారం బెంగళూరులో వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా.. లేదంటే దురదృష్టవశాత్తూ లంక చేతిలో ఓడినా కివీస్‌కు ఎదురుదెబ్బ తప్పదు. అలా అయితే పాక్, అఫ్గన్ మరింత ముందుకు కాగా వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే కివీస్, లంకకు చెరో పాయింట్ మాత్రమే వస్తుంది. అంటే అపుడు కివీస్ ఖాతాలో 9 పాయింట్లు మాత్రమే ఉంటాయి. వర్షం పడక అంతా సవ్యంగా సాగి గెలిస్తే 10 పాయింట్లు వస్తాయి. అయినప్పటికీ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాల తర్వాతే సెమీస్ బెర్తు ఖాయమైంది లేనిదీ తెలుస్తుంది. అయితే, శ్రీలంకతో న్యూజిలాండ్ ఓడిపోతే మాత్రం అఫ్గన్, పాకిస్తాన్ రేసులో మరో ముందడుగు వేస్తాయి. చదవండి: అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్ -
T20 WC: ప్రపంచకప్‌నకు ముందు పాక్ కీలక సిరీస్.. షెడ్యూల్ విడుదల
Pakistan Men And Women To Tour England 2024: టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్ వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. వెస్టిండీస్, యూఎస్ఏలో జరుగనున్న ఈ మెగా టోర్నీకి ముందు పాక్ పురుష, మహిళా జట్లు ఇంగ్లండ్ టీమ్‌తో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. స్వదేశంలో పాకిస్తాన్‌తో వరుస సిరీస్‌లకు సంబంధించిన తేదీలు ఖరారైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. మే 22, 2024 నుంచి ఇంగ్లండ్- పాకిస్తాన్ పురుష జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఇక అంతకంటే ముందుగానే అంటే.. మే 11 నుంచి మహిళా జట్ల మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ సమరం మొదలుకానుంది. ఇంగ్లండ్- పాకిస్తాన్ వుమెన్ టీమ్‌లు మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్- పాకిస్తాన్ తలపడగా.. జో రూట్ బృందం జగజ్జేతగా నిలిచింది. ఇంగ్లండ్‌లో పాకిస్తాన్ పర్యటన-2024 పూర్తి వివరాలు మహిళా జట్ల టీ20, వన్డే సిరీస్ ►తొలి టీ20 మే 11- ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హాం ►రెండో టీ20 మే 17- ది కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్ ►మూడో టీ20 మే 19- హెడ్డింగ్లీ, లీడ్స్ ►మొదటి వన్డే మే 23- డెర్బీ ►రెండో వన్డే మే 26- టాంటన్ ►మూడో వన్డే మే 29- చెల్మ్స్ఫోర్డ్ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ మెన్స్ నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ►తొలి టీ20- మే 22- హెడ్డింగ్లీ, లీడ్స్ ►రెండో టీ20- మే 25- ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హాం ►మూడో టీ20- మే 28- సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ ►నాలుగో టీ20- మే 30- ది ఓవల్, లండన్. చదవండి: 'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే! -
కీపర్ తెలివితక్కువ పనికి మూల్యం చెల్లించుకున్న పాక్
ICC Womens T20 World Cup 2023- ENGW Vs PAKW: మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ వికెట్ కీపర్ సిద్రా నవాజ్ చేసిన తప్పునకు పెనాల్టీ కింద ఇంగ్లండ్‌కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు అంపైర్లు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బ్యాటర్ బ్యాక్‌ఫుట్ షాట్ ఆడింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ కీపర్ సిద్రా నవాజ్‌కు త్రో విసిరింది. అయితే కీపర్ నవాజ్ తన చేతికున్న గ్లోవ్స్‌ను కింద పడేసి బంతిని అందుకుంది. ఆ తర్వాత బంతిని కింద పడేసిన గ్లోవ్స్‌కు కొట్టింది. ఇది గమనించిన అంపైర్లు కొంతసేపు చర్చించుకున్న తర్వాత కీపర్ నవాజ్ తప్పిదాన్ని గుర్తిస్తూ పాక్‌కు పెనాల్టీ విధిస్తూ ఇంగ్లండ్‌కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ నిబంధనల ప్రకారం కీపర్ ఓవర్ పూర్తయిన తర్వాతే చేతికున్న గ్లోవ్స్ తొలగించొచ్చు.. లేదంటే బౌలర్ బంతి విడవకముందు సరిచేసుకోవచ్చు. కానీ ఒక్కసారి బంతి వేశాకా గ్లోవ్స్ తీసేసినా.. కింద పడేసిన గ్లోవ్స్‌పై బంతిని విసరడం నిబంధనలకు విరుద్ధం. ఈ తప్పిదం కింద జట్టుకు పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టు భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 40 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీ జోన్స్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరి ఇన్నింగ్స్‌ల ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో ఫాతిమా సానా రెండు, ఇక్భాల్, నిదా ధార్, హసన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 99 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 114 పరుగుల తేడాతో పాక్‌పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 24న జరగనున్న రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్.. సౌతాఫ్రికాతో ఆడనుంది. మరోవైపు ఫిబ్రవరి 23న(గురువారం) జరగనున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా వుమెన్స్, ఆస్ట్రేలియా అమితుమీ తేల్చుకోనున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: పాక్ కెప్టెన్‌పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు కోహ్లి ప్రపంచ రికార్డు.. లిస్టులో ఎవరున్నారో తెలియదు కానీ: గంభీర్ -
‘టీమిండియాను పాక్ మాత్రమే ఓడించగలదు’.. అవునా! కౌంటర్ అదుర్స్
India vs Australia- World Test Championship: టీమిండియా- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నేపథ్యంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ పాకిస్తాన్ అభిమానికి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. సానుకూల దృక్పథంతో ఉండటం తప్పు కాదంటూనే పాక్ జట్టు వైఫల్యాలు ఎత్తిచూపుతూ సెటైర్లు వేశాడు. కాగా భారత్ వేదికగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఇరు జట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం తొలి టెస్టు ఆరంభం కాగా.. ఆది నుంచి రోహిత్ సేన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ ట్విటిజెన్.. ‘‘భారత గడ్డపై టీమిండియాను ఓడించగల సత్తా కేవలం పాకిస్తాన్‌కు మాత్రమే ఉంది’’ అంటూ కామెంట్ చేశాడు. పాపం.. పాకిస్తాన్! తిక్క కుదిరింది.. ఇందుకు స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘నీ సానుకూల దృక్పథం నాకు నచ్చిందబ్బాయ్! అయితే.. ఒకటి కనీసం సొంతగడ్డపై అయినా మీ జట్టు సిరీస్‌లు గెలవొచ్చు కదా! ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో స్వదేశంలో సిరీస్‌లు ఏమయ్యాయి. విదేశీ గడ్డపై బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్‌ల సిరీస్‌లు అన్నిటిలో పాకిస్తాన్ గెలిచి ఉంటే గనుక ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరి ఉండేది’’ అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన టీమిండియా ఫ్యాన్స్.. ‘‘తిక్క బాగా కుదిర్చావు! దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చావు ఆకాశ్ భాయ్’’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ పోరులో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా ఆఖరి టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్.. ఆసీస్‌పై గెలిస్తే ఫైనల్ చేరడం ఖాయం. మరోవైపు.. ఆస్ట్రేలియా సైతం దాదాపు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక పాకిస్తాన్ సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వైట్‌వాష్‌కు గురవడం సహా ఇతర సిరీస్‌లు గెలవలేకపోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో ముగించింది. చదవండి: IND vs AUS: సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్ స్పిన్నర్‌కు చుక్కలు! వీడియో వైరల్ Todd Murphy: 7 వికెట్లతో చెలరేగిన ఆసీస్ సంచలనం.. మరో రికార్డు! I love your positivity but janaab, aap Apne ghar ki series toh Jeet lo. With Australia, England and NZ at home. Bangladesh, Sri Lanka and WI in away series, Pakistan should have reached the WTC finals already. 🫣🫂 https://t.co/UEo67hQYU9 — Aakash Chopra (@cricketaakash) February 9, 2023 -
ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం.. పాక్ హెడ్ కోచ్‌పై వేటు! బాబర్ కూడా..
ఇంగ్లండ్‌తో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్లో ప్రక్షాళన మొదలైంది. తమ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాకు ఉద్వాసన పలికేందుకు సిద్దమైన పాకిస్తాన్ క్రికెట్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పాక్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్, కెప్టెన్ బాబర్ ఆజంపై కూడా పీసీబీ గవర్నింగ్ కౌన్సిల్ వేటు వేసేందుకు సిద్దమయినట్లు సమాచారం. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం సక్లైన్ ముస్తాక్ తన హెడ్ కోచ్ బాధ్యతలు తప్పుకోనున్నట్లు సమాచారం. అదే విధంగా వచ్చే ఏడాది జూలైలో బాబర్ ఆజం కూడా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. "బుధవారం గడ్డాఫీ స్టేడియంలోని పిసిబి ఛైర్మన్ రమీజ్ రాజా కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పీసీబీ సెలెక్టర్ మహ్మద్ వసీం కూడా పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశంలో టెస్టు కెప్టెన్సీ, హెడ్ కోచ్ సక్లైన్ పాత్ర గురించి చర్చ జరిగింది. టెస్టు కెప్టెన్‌గా బాబర్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకున్నాం. అతడిని వచ్చే ఏడాది జూలై వరకు టెస్టు కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించాం. ఆ తర్వాత పాక్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేస్తాం" అని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా వైట్ బాల్ క్రికెట్లో సారథిగా విజయవంతమైన బాబర్.. టెస్టుల్లో మాత్రం తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించలేకపోయాడు. చదవండి: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్.. టీమిండియా కెప్టెన్‌కు గాయం..? -
ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ ఎఫెక్ట్.. పీసీబీ చైర్మన్‌ను పీకేసిన పాక్ ప్రధాని
Ramiz Raja: స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఎఫెక్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రజాపై పడింది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవంతో పాటు స్వదేశంలో వరుసగా నాలుగు టెస్ట్‌ల్లో ఓటమి, అలాగే ఇంగ్లండ్ సిరీస్‌లో పిచ్‌ల తయారీపై ఆరోపణల నేపథ్యంలో రమీజ్‌కు ఉద్వాసన పలినట్లు పీసీబీ ఇవాళ (డిసెంబర్ 21) ప్రకటించింది. రమీజ్‌పై వేటును పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షెరీఫ్ కూడా సమర్ధించారని, ఇందుకు ఆయన కూడా ఆమోద ముద్ర వేశారని పీసీబీ వెల్లడించింది. రమీజ్ స్థానంలో పీసీబీ నూతన చైర్మన్‌గా నజమ్ సేథీ (78) బాధ్యతలు చేపడతారని, సేథీని స్వయంగా పాక్ ప్రధానే నామినేట్ చేశారని పీసీబీ పేర్కొంది. కాగా, ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉండగా 2021 సెప్టెంబర్‌లో రమీజ్ రజా పీసీబీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. రమీజ్ హయాంలో పాక్ రెండు టీ20 వరల్డ్‌కప్‌లు, 50 ఓవర్ల మహిళ వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంది. రమీజ్.. తన హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అండదండలు ఉండటంతో అతని హవా కొనసాగింది. ప్రస్తుతం ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడంతో రమీజ్‌పై కూడా వేటు తప్పలేదు. పీసీబీ నిబంధనల ప్రకారం బోర్డు అధ్యక్షుడిని ప్రధాని నామినేట్ చేస్తే.. బోర్డు ఆఫ్ గవర్నర్లు అతన్ని అధికారికంగా ఎన్నుకుంటారు. ఇదిలా ఉంటే, పీసీబీ కొత్త చైర్మన్ నజమ్ సేథీ ఈ పదవి చేపట్టడం ఇది తొలిసారి కాదు. 2018లో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకు సేథీ పీసీబీ అత్యున్నత పదవిలో కొనసాగారు. అయితే నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో విభేదాల కారణంగా నజమ్ బోర్డు చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
ఒక్క మాటతో రమీజ్ రాజా నోరు మూయించిన బాబర్! ప్రతి వాడూ..
Pakistan vs England, 3rd Test- Babar Azam: ‘‘ప్రతీ ఫార్మాట్ కోసం ఒక కచ్చితమైన ప్రణాళిక ఉంటుంది. తమ వ్యూహాలకు అనుగుణంగా ఎవరైనా ఎలాగైనా ఆడవచ్చు. అయితే, ఒక్కరోజు లేదంటే ఒక్క వారంలో మార్పు సాధ్యం కాదు. ఆటతీరు మార్చుకోవడానికి, ఆటగాళ్ల మైండ్‌సైట్ మారాలంటే కాస్త సమయం పడుతుంది. అంతేగానీ వెంట వెంటనే ఏదీ జరిగిపోదు. ఒకవేళ మేము డిఫెన్స్ ఆడితే.. దూకుడుగా ఎందుకు ఆడటం లేదని ప్రశ్నిస్తారు. అదే దూకుడుగా ఆడితే.. ఇంకోలా ఆడొచ్చు కదా అంటారు. మనం ఎలా ఆడినా ఇలాంటి పెదవి విరుపులు, ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అందరికి సంతృప్తి కలిగేలా ఆడటం ఎవరికీ సాధ్యం కాదు’’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. ఇంగ్లండ్‌లా ‘బజ్‌బాల్’ విధానాన్ని అవలంబించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజాకు పరక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మార్గదర్శనం, కెప్టెన్ బెన్ స్టోక్స్ నేతృత్వంలో ఇంగ్లండ్ టెస్టుల్లోనూ దూకుడైన ఆట తీరు కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు తమ తమ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లండ్ ఆడిన 10 టెస్టుల్లో తొమ్మిదింట విజయం సాధించడంతో.. బజ్‌బాల్ విధానంపై క్రీడా ప్రపంచంలో చర్చ నడుస్తోంది. బాబర్‌కు చెప్పాను.. ఈ నేపథ్యంలో పర్యాటక ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్రై క్రికెట్ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ మాదిరిగానే.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడాలని బాబర్‌కు సూచించాను. ఇందుకోసం జట్టులో ఎక్కువ మంది టీ20 ప్లేయర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పాను. పాకిస్తాన్ ఇలాంటి ఆటతీరు కచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే. భవిష్యత్ తరం ఇంగ్లండ్ మాదిరిగానే సంప్రదాయ క్రికెట్లోనూ టీ20ల మాదిరి ఆడాలని బలంగా కోరుకుంటున్నా’’ అని రమీజ్ రాజా పేర్కొన్నాడు. మ్యాచ్ ఓడితే ఇంతే! ఈ విషయం గురించి మూడో టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజంకు ప్రశ్న ఎదురైంది. ఈ నేపథ్యంలో పాక్ సారథి ఈ మేరకు పైవిధంగా స్పందించాడు. మ్యాచ్ ఫలితాన్ని బట్టే ఎదుటి వాళ్ల ప్రవర్తన ఉంటుందన్న బాబర్... ఒకవేళ అనుకున్న ఫలితాలు రాకపోతే విమర్శలు వినిపిస్తాయి అని పేర్కొన్నాడు. ప్రతి ఫార్మాట్‌కు ఒక విధానమంటూ ఉంటుందని.. ఒక్కరోజులోనే మార్పు సాధ్యం కాదంటూ రమీజ్ రాజాకు చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల మ్యాచ్‌లో పాక్ వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. దీంతో బాబర్ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: Ben Stokes: పాక్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. కోహ్లి రికార్డు సమం చేసిన స్టోక్స్.. అరుదైన జాబితాలో చోటు Lionel Messi: వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్ ఫోటో -
Pak Vs Eng: పాక్‌ను చిత్తుగా ఓడించి.. కోహ్లి రికార్డు సమం చేసిన స్టోక్స్
Pakistan vs England, 3rd Test: సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవాన్ని మిగిల్చి ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కరాచీలో మంగళవారం ముగిసిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ బృందం ఆతిథ్య పాక్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా స్వదేశంలో ఇలా క్లీన్‌స్వీప్ కావడం పాక్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. కోహ్లి రికార్డు సమం అదే విధంగా.. సొంతగడ్డపై వరుసగా నాలుగు టెస్టులు ఓడిన మొదటి పాకిస్తాన్ కెప్టెన్ కూడా బాబర్ ఆజం కావడం విశేషం. ఇలా మూడో టెస్టుతో పాక్ ఖాతాలో చెత్త రికార్డులు నమోదు కాగా.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ మాత్రం అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా పేరొందిన విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టెస్టుల్లోనూ దూకుడుగా జో రూట్ తర్వాత ఇంగ్లండ్ టెస్టు పగ్గాలు చేపట్టిన స్టోక్స్.. జట్టును విజయపథంలో నడుపుతున్న విషయం తెలిసిందే. కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలిసి సంప్రదాయ క్రికెట్లోనూ దూకుడైన ఆటకు మారు పేరుగా జట్టును మార్చి మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు. ఈ క్రమంలో పాక్‌తో మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవడంతో ఈ ఏడాది స్టోక్స్ ఖాతాలో 9(ఆడిన 10 మ్యాచ్‌లలో) విజయాలు చేరాయి. తద్వారా క్యాలెండర్ ఇయర్లో ఈ ఘనత సాధించిన టెస్టు కెప్టెన్ల జాబితాలో స్టోక్స్ చోటు సంపాదించాడు. ఈ ఫీట్ నమోదు చేసిన ఏడో సారథిగా నిలిచాడు. అంతకుముందు గ్రేమ్ స్మిత్(సౌతాఫ్రికా), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా), స్టీవ్ వా(ఆస్ట్రేలియా), మైకేల్ వాన్(ఇంగ్లండ్), క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్), విరాట్ కోహ్లి(ఇండియా) ఈ ఘనత సాధించారు. సొంతగడ్డపై ఓటమి తప్పలేదు పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3–0తో సొంతం చేసుకుంది. చివరి టెస్టులో గెలుపు కోసం మ్యాచ్ నాలుగో రోజు మంగళవారం ఇంగ్లండ్ మరో 55 పరుగులు చేయాల్సి ఉండగా... 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. బెన్ డకెట్ (82 నాటౌట్; 12 ఫోర్లు), బెన్ స్టోక్స్ (35 నాటౌట్; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు అభేద్యంగా 73 పరుగులు జోడించి ఆటను ముగించారు. సిరీస్‌లోని తొలి టెస్టులో 74 పరుగులతో, రెండో టెస్టులో 26 పరుగులతో ఇంగ్లండ్ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. జట్టులో ఇద్దరు సీనియర్ పేసర్లు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లేకుండా 2007 తర్వాత ఇంగ్లండ్ గెలిచిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. చదవండి: వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు India Players- Ranji Trophy: ఇంట్లో కూర్చోవద్దు.. బీసీసీఐ ఆదేశాలు! మొన్న సంజూ, ఇషాన్.. ఇప్పుడు సూర్య, చహల్ -
Pak Vs Eng: బాబర్ ఓ జీరో.. కోహ్లితో పోల్చడం ఆపండి ప్లీజ్: పాక్ మాజీ క్రికెటర్
Pakistan vs England Test Series 2022: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఆ జట్టు మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా మండిపడ్డాడు. సారథిగా బాబర్ ఓ సున్నా అని, ఇకనైనా అతడిని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో పోల్చడం ఆపేయాలని కోరాడు. కోహ్లితో పోల్చదగిన క్రికెటర్లెవరూ పాక్ జట్టులో లేరంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బాబర్ ఆజం బృందం వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన పాక్... సొంతగడ్డపై దారుణ వైఫల్యం కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా పాక్ ఆట తీరుపై మండిపడ్డాడు. బాబర్ ఆజంకు కెప్టెన్‌గా ఉండే అర్హత లేదంటూ విమర్శించాడు. దానిష్ కనేరియా పాక్ జట్టులో అలాంటి వాళ్లు లేరు ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా కనేరియా మాట్లాడుతూ.. ‘‘దయచేసి ఇప్పటికైనా బాబర్ ఆజంను కోహ్లితో పోల్చడం ఆపేయండి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గొప్ప ఆటగాళ్లు. వాళ్లతో పోల్చదగిన క్రికెటర్లెవరూ పాక్ జట్టులో లేరు. ఒకవేళ ఎవరైనా వాళ్లలా ప్రశంసలు అందుకోవాలంటే ఆటలో రారాజై ఉండాలి. మెరుగైన ప్రదర్శన కనబరచాలి. లేదంటే జీరోలు అవుతారు. ఇక బాబర్ ఆజం కెప్టెన్‌గా ఓ పెద్ద సున్నా. అతడికి నాయకుడిగా ఉండే అర్హత లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో జట్టును ముందుకు నడిపే సామర్థ్యం, నాయకత్వ ప్రతిభ అతడికి లేవు’’ అని బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. ఇగో పక్కన పెడితేనే ఇక ఇంగ్లండ్‌తో సిరీస్ ద్వారా కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నుంచి కెప్టెన్సీ మెళకువలు నేర్చుకునే అవకాశం బాబర్‌కు దక్కిందన్న కనేరియా.. ఇకనైనా ఇగోను పక్కనపెట్టి పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సలహాలు తీసుకోవాలని సూచించాడు. కాగా ఇంగ్లండ్ చేతిలో ఓటమితో బాబర్ ఆజం ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. స్వదేశంలో వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఓడిన మొదటి పాక్ కెప్టెన్‌గా నిలిచాడు. చదవండి: FIFA WC 2022: పోర్చుగల్ స్టార్ రొనాల్డోకు అవమానం.. అర్జెంటీనా ఆటగాడు కూడా FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు -
Pak Vs Eng: ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. బాబర్ ఆజం చెత్త రికార్డు
Pakistan vs England, 3rd Test- Babar Azam: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది పాకిస్తాన్. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన బాబర్ ఆజం బృందం.. ఇలా మరో పరభవాన్ని మూటగట్టుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా తొలి టెస్టులో 74 పరుగులు, రెండో టెస్టులో 26 పరుగులు, మూడో టెస్టులో 8 వికెట్లతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడి ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్ చేసి బెన్ స్టోక్స్ బృందం చరిత్ర సృష్టించింది. మరోవైపు.. పాక్ స్వదేశంలో వరుసగా నాలుగు టెస్టులు ఓడటంతో కెప్టెన్ బాబర్ ఆజం పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఓ క్యాలెండర్ ఇయర్లో పర్యాటక జట్ల చేతిలో పాకిస్తాన్ వరుస మ్యాచ్‌లు ఓడిపోవడం ఇదే తొలిసారి. బాబర్ ఆజం చెత్త రికార్డు ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా చేతిలో 1-0తో పాక్ టెస్టు సిరీస్ కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి రెండు డ్రాగా ముగియగా.. ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 115 పరుగుల భారీ తేడాతో పాక్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఏకంగా 3-0తో వైట్‌వాష్ చేసి సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఈ రెండు సిరీస్‌లలో పాక్‌కు సారథ్యం వహించిన బాబర్ ఆజం.. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఇలా వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిన మొదటి పాకిస్తాన్ కెప్టెన్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. చెత్త కెప్టెన్సీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టులో బాబర్ ఆజం వరుసగా 78, 54 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్టు స్కోర్లు: పాకిస్తాన్: 304 & 216 ఇంగ్లండ్: 354 & 170/2 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హ్యారీ బ్రూక్ (111 పరుగులు) చదవండి: Harry Brook: ఇంగ్లండ్‌కు వరంలా మారాడు.. 39 ఏళ్ల రికార్డు బద్దలు FIFA WC 2022: మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
ఇంగ్లండ్‌కు వరంలా మారాడు.. 39 ఏళ్ల రికార్డు బద్దలు
పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్.. పాక్‌ను వారి సొంతగడ్డపై వైట్‌వాస్ చేసి ఆ జట్టుకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఇక ఈ సిరీస్ ద్వారా హ్యారీ బ్రూక్ రూపంలో ఇంగ్లండ్‌కు మంచి బ్యాటర్ దొరికాడు. ఈ సిరీస్‌లో బ్రూక్స్ మూడు టెస్టులు కలిపి 468 పరుగులు సాధించాడు. 93.60 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన బ్రూక్ ఖాతాలో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హ్యారీ బ్రూక్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అదేంటంటే.. పాక్ గడ్డపై ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఇంతకముందు 1983-84లో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ గోవర్ 449 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇదే సిరీస్‌లో 179 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాదు మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన మార్కస్ ట్రెస్కోథిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ట్రెస్కోథిక్ పాక్ గడ్డపై 12 ఇన్నింగ్స్‌లు కలిపి 445 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా వీరిద్దరి రికార్డులను బద్దలు కొట్టిన హ్యారీ బ్రూక్ పాక్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్తాన్‌కు పరాభవమే ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. బెన్ డకెట్ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. చదవండి: ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్.. సొంతగడ్డపై ఘోర పరాభవం అంపైర్‌కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్.. -
ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్.. సొంతగడ్డపై ఘోర పరాభవం
పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్తాన్‌కు సొంత గడ్డపైనే ఘరో పరాభవం ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. బెన్ డకెట్ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇక పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 50 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు తడబడడంతో 216 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ ముందు 167 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. జాక్ క్రాలీ 41 పరుగులు, రెహాన్ అహ్మద్ 10 పరుగులు చేసి ఔటవ్వగా.. బెన్ డకెట్, స్టోక్స్‌లు మరో వికెట పడకుండా ఇంగ్లండ్‌ను గెలిపించారు. 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి చారిత్రక విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్: 304 ఆలౌట్ & 216 ఆలౌట్ ఇంగ్లండ్: 354 ఆలౌట్& 170/2 🏴 3-0 🇵🇰 Whitewash at home 🫣🥱#ENGvPAK || #PAKvENG #TestCricket #WTC23 pic.twitter.com/XWXxGzpwbc — Diptiman Yadav (@Diptiman_yadav9) December 20, 2022 చదవండి: అంపైర్‌కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్.. -
అంపైర్‌కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్..
ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆఖరి అంకానికి చేరుకుంది. మరో 55 పరుగులు చేస్తే ఇంగ్లండ్ విజయం సాధిస్తుంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఏం చేసినా ఇంగ్లండ్ గెలుపును ఆపడం పాక్‌కు కష్టమే.ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్‌పై గురి పెట్టింది. 17 సంవత్సరాల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ పాక్ జట్టుకు బొమ్మ చూపించింది. ఈ విషయం పక్కనబెడితే.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ లెగ్ అంపైర్‌కు దడ పుట్టించాడు. కొద్దిగా అటు ఇటు అయ్యుంటే అంపైర్ తల కచ్చితంగా పగిలేదే. రెహాన్ అహ్మద్ ఔటయ్యాకా స్టోక్స్ క్రీజులో అడుగుపెట్టాడు. అప్పటికే ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో నుమాన్ అలీ వేసిన ఐదో బంతిని షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే స్టోక్స్ చేతిలో గ్రిప్ జారిన బ్యాట్ స్క్వేర్‌లెగ్‌లో నిలబడిన లెగ్ అంపైర్ పక్కనబడింది. ఈ చర్యతో భయపడిన అంపైర్ హసన్ రాజా కాస్త పక్కకు జరిగి స్టోక్స్‌వైపు చూశాడు. స్టోక్స్ కూడా అయ్యో నేను కావాలని చేయలేదు.. బ్యాట్ గ్రిప్ జారిందంటూ వివరించాడు. ఇదంతా గమనించిన పాకిస్తాన్ ఆటగాళ్లు నవ్వుల్లో మునిగిపోయారు. అయితే అంపైర్ అదృష్టం బాగుంది లేకపోయుంటే కచ్చితంగా ఏదో ఒక చోట తగిలేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి స్టోక్స్ తన చర్యతో అంపైర్ గుండెల్లో దడ పుట్టించాడంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. Ben Stokes has thrown a bat further than I have ever hit a ball I reckon pic.twitter.com/hDKH6gO5tO — Ticker Merchant (@WillMarshall15) December 19, 2022 చదవండి: మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? IND VS BAN 1st Test: విరాట్ కోహ్లిని కాపాడిన రిషబ్ పంత్ -
PAK VS ENG 3rd Test: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బౌలర్
PAK VS ENG 3rd Test Day 3: కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. పురుషుల క్రికెట్లో అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టిన 18 ఏళ్ల 126 రోజుల వయసున్న రెహాన్.. రెండో ఇన్నింగ్స్‌లో 14.5 ఓవర్లలో 48 పరుగులిచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. Rehan Ahmed becomes the youngest debutant to claim a five-for in Men’s Tests 💪#WTC23 | 📝 https://t.co/y5SkcqY16s pic.twitter.com/LoDZE7Yimd — ICC (@ICC) December 19, 2022 గతంలో ఈ రికార్డు ఆసీస్ టెస్ట్ జట్టు సారధి పాట్ కమిన్స్ పేరిట ఉండేది. కమిన్స్ 18 ఏళ్ల 196 రోజుల వయసులో టెస్ట్‌ల్లో (అరంగేట్రం మ్యాచ్) 5 వికెట్ల ఘనత సాధించాడు. తాజాగా రెహాన్.. చాలాకలంగా పదిలంగా ఉండిన కమిన్స్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రెహాన్ ఈ రికార్డుతో పాటు మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యంత పిన్న వయసులో టెస్ట్ అరంగేట్రం చేసిన ఆటగాడిగా రెహాన్ చరిత్ర సృష్టించాడు. రెహాన్‌కు ముందు ఈ రికార్డు బ్రియాన్ క్లోజ్ పేరిట ఉండేది. క్లోజ్.. 1949లో 18 ఏళ్ల 149 రోజుల వయసులో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెగ్ స్పిన్ బౌలర్ అయిన రెహాన్ పాకిస్తాన్ సంతతికి చెందిన వాడు. రెహాన్ తండ్రి నయీమ్ అహ్మద్ పాకిస్తాన్లో జన్మించి, ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. రెహాన్, అతని సోదరులు ఫర్హాన్, రహీమ్‌లు కూడా క్రికెటర్లే కావడం విశేషం. ఇంగ్లండ్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న రెహాన్.. తన తండ్రి పుట్టిన దేశంపైనే విశ్వరూపం ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు నెగ్గిన ఇంగ్లండ్.. మరో 55 పరుగులు చేస్తే మూడో టెస్ట్‌లోనూ విజయం సాధించి పాకిస్తాన్‌ను వారి స్వదేశంలో క్లీన్ స్వీప్ చేస్తుంది. రెహాన్ ధాటికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధి ముందు167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి విజయానికి అతి సమీపంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో పాటు చేతిలో 8 వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంగా తెలుస్తోంది. -
పాక్‌ను దెబ్బేసిన ఇంగ్లండ్ యువ స్పిన్నర్.. క్లీన్ స్వీప్ దిశగా బాబర్ సేన
PAK VS ENG 3rd Test Day 3: కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు నెగ్గిన ఇంగ్లండ్.. మరో 55 పరుగులు చేస్తే మూడో టెస్ట్‌లోనూ విజయం సాధించి పాకిస్తాన్‌ను వారి స్వదేశంలో క్లీన్ స్వీప్ చేస్తుంది. మూడో రోజు ఆటలో పాకిస్తాన్ మూలాలు ఉన్న ఇంగ్లండ్ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఆతిధ్య దేశాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. రెహాన్ (5/48) ధాటికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధి ముందు167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి విజయానికి అతి సమీపంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో పాటు చేతిలో 8 వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంగా తెలుస్తోంది. రెహాన్‌తో పాటు జాక్ లీచ్ (3/72), జో రూట్ (1/31), మార్క్ వుడ్ (1/25) రాణించడంతో పాక్ రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే చాపచుట్టేసింది. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (54), సౌద్ షకీల్ (53) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో ఎదురుదాడికి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలే (41), బెన్ డకెట్ (50 నాటౌట్) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించిన అనంతరం క్రాలేను అబ్రార్ అహ్మద్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన రెహాన్ అహ్మద్ (10)ను కూడా అబ్రార్ అహ్మదే ఔట్ చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి డకెట్‌కు జతగా స్టోక్స్ (10) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 354 పరుగులు చేసి 50 పరుగుల కీలక ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (111) సెంచరీతో, ఓలీ పోప్ (51), బెన్ ఫోక్స్ (64) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో (తొలి ఇన్నింగ్స్) జాక్ లీచ్ 4, రెహాన్ అహ్మద్ 2, రాబిన్సన్, మార్క్ వుడ్, రూట్ తలో వికెట్ పడగొట్టగా.. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, నౌమాన్ అలీ చెరో 4 వికెట్లు, మహ్మద్ వసీం ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
PAK VS ENG: బ్రూక్ సెంచరీ.. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న మూడో టెస్ట్
కరాచీ వేదికగా పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 7/1 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. హ్యారీ బ్రూక్ (150 బంతుల్లో 111; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో, ఓలీ పోప్ (51), బెన్ ఫోక్స్ (64) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌటై, కీలకమైన 50 పరుగుల ఆధిక్యం సాధించింది. పాక్ స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, నౌమాన్ అలీ చెరో 4 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ వసీం జూనియర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండో రోజు ఆఖర్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. పాక్.. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 29 పరుగులు వెనుకపడి ఉంది. అబ్దుల్లా షఫీక్ (14), షాన్ మసూద్ (3) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాచ్‌లో ఇంకా 3 రోజులు మిగిలి ఉండటంతో ఫలితం రావడం ఖాయమని స్పష్టమవుతుంది. తొలి రోజు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. కెప్టెన్ బాబర్ ఆజమ్ (78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. మిగతా వారంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అరంగేట్రం బౌలర్ రెహాన్ అహ్మద్ 2, రూట్, మార్క్ వుడ్, రాబిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. బజ్ బాల్ టెక్నిక్‌ను అమలు చేసి తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించింది. ఫలితం తేలదనుకున్న తొలి టెస్ట్‌లో 74 పరుగుల తేడాతో విజయం సాధించిన స్టోక్స్ సేన.. ముల్తాన్ టెస్ట్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. -
బాధపడకు స్టోక్స్.. నీ త్యాగం ఊరికే పోలేదు!
17 సంవత్సరాల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మూడోటెస్టులోనూ గెలిచి ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు పాక్ మాత్రం ఎలాగైనా టెస్టు గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటుంది. ఇక మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 304 పరుగులకు ఆలౌట్ అయింది. బలమైన బ్యాటింగ్ లైనఫ్ కలిగిన ఇంగ్లండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 327 పరుగులతో ఆడుతుంది. పాక్‌పై ఇంగ్లండ్ 23 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ రనౌట్ అయిన తీరు ఆసక్తిగా నిలిచింది. హ్యారీ బ్రూక్‌తో ఏర్పడిన మిస్ కమ్యూనికేషన్ కారణంగా స్టోక్స్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 33వ ఓవర్లో ఐదో బంతిని బ్రూక్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. బ్రూక్, స్టోక్స్‌లు రెండు పరుగులు తీశారు. అయితే స్టోక్స్ మూడో పరుగు కోసం వస్తున్నాడని బ్రూక్ అంచనా వేయలేదు. బ్రూక్స్ పరిగెత్తాలనుకొనేలేపే పాక్ ఫీల్డర్ బంతిని అందుకొని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరాడు. అప్పటికే స్టోక్స్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వచ్చేశాడు. బ్రూక్స్ కోసం స్టోక్స్ తన వికెట్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే స్టోక్స్ త్యాగం ఊరికే పోలేదు. మిస్ కమ్యూనికేషన్ కారణంగా తన కెప్టెన్‌ను ఔట్ చేశానన్న బాధనో ఏమో తెలియదు కానీ మరోసారి కీలక సెంచరీతో మెరిశాడు బ్రూక్స్. ఈ సిరీస్‌లో బ్రూక్స్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 111 పరుగులు చేసిన బ్రూక్స్ మహ్మద్ వసీమ్ జూనియర్ బౌలింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు. అంతేకాదు పనిలో పనిగా 125 ఏళ్ల రికార్డును కూడా బద్దలుకొట్టాడు బ్రూక్స్. ఇంగ్లండ్ తరపున తొలి ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బ్రూక్స్ నిలిచాడు. ఇంతకముందు కేఎస్ రంజిత్ సిన్హ్జి 418 పరుగులతో ఉన్నాడు. తాజాగా బ్రూక్స్ రంజిత్సిన్హ్జిని అధిగమించాడు. "Utter, utter confusion!" ⚡#PAKvENG | #UKSePK pic.twitter.com/wdyDwg9AIU — Pakistan Cricket (@TheRealPCB) December 18, 2022 చదవండి: 125 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్ ఉగ్రరూపం దాల్చిన పేసర్లు.. రెండు రోజుల్లోనే ఖేల్ ఖతం -
125 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఇటీవలే పాకిస్తాన్‌తో ప్రారంభమైన టెస్టు సిరీస్‌లో బ్రూక్ పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా పాక్‌తో మొదలైన మూడో టెస్టులో మరోసారి సెంచరీతో మెరిసిన హ్యారీ బ్రూక్ 125 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. తొలి ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా హ్యారీబ్రూక్ నిలిచాడు. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన బ్రూక్ ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 480 పరుగులు(12, 153, 87, 9, 108,111) చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. మరో విషయమేంటంటే బ్రూక్ సాధించిన ఆ మూడు సెంచరీలు పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లోనే వచ్చాయి. ఇంతకముందు ఇంగ్లండ్ తరపున కేఎస్ రంజిత్‌సింగ్హ్జి 418 పరుగులు( 62, 154*, 8, 11, 175,8*), టిప్ ఫోస్టర్ 411 పరుగులు(287, 19,49*, 21, 16,19)లు ఉన్నారు. తాజాగా వీరిద్దరిని అధిగమించిన హ్యారీ బ్రూక్ 480 పరుగులతో టాప్ స్థానంలో నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మూడో టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు జరుగుతున్న ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. బెన్ ఫోక్స్ 60, మార్క్‌వుడ్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌట్ అయింది. Harry Brook has broken KS Ranjitsinhji's 125 year-old record for the most runs in a batter's first 6 men's Test inns for England: 436 HARRY BROOK (12, 153, 87, 9, 108, 67*) 418 KS Ranjitsinhji (62, 154*, 8, 11, 175, 8*) 411 Tip Foster (287, 19, 49*, 21, 16, 19) — Mark Puttick (@GryllidaeC) December 18, 2022 చదవండి: చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం బంగ్లాపై టీమిండియా విజయం.. విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు -
తిప్పేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు.. పాకిస్తాన్ ఎంతకు ఆలౌటైందంటే..?
PAK VS ENG 3rd Test Day 1: కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్లు అదరగొట్టారు. వీరి ధాటికి పాకిస్తాన్ తొలి రోజే ఆలౌటైంది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. ఓపెనర్ షాన్ మసూద్ (30), అజహార్ అలీ (45) పర్వాలేదనిపించారు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (8), మహ్మద్ రిజ్వాన్ (19), సౌద్ షకీల్ (23), ఫహీమ్ అష్రాఫ్ (4), నౌమాన్ అలీ (20), అబ్రర్ అహ్మద్ (4) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అరంగేట్రం బౌలర్ రెహాన్ అహ్మద్ 2, రూట్, మార్క్ వుడ్, రాబిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఓపెనర్ జాక్ క్రాలేను డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. బెన్ డకెట్ (4), ఓలీ పోప్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పాకిస్తాన్ స్కోర్‌కు ఇంకా 297 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, 17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. బజ్ బాల్ టెక్నిక్‌ను అమలు చేసి తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించింది. ఫలితం తేలదనుకున్న తొలి టెస్ట్‌లో 74 పరుగుల తేడాతో విజయం సాధించిన స్టోక్స్ సేన.. ముల్తాన్ టెస్ట్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది.


