హ్యారీ బ్రూక్‌ మెరుపులు.. ఇంగ్లండ్‌ 409 పరుగుల భారీ స్కోర్‌ | Pakistan under pressure at Leeds as Brooks 91 drives England to commanding lead | Sakshi
Sakshi News home page

PAK vs ENG: హ్యారీ బ్రూక్‌ మెరుపులు.. ఇంగ్లండ్‌ 409 పరుగుల భారీ స్కోర్‌

Aug 21 2026 5:55 PM | Updated on Aug 21 2026 6:30 PM

Pakistan under pressure at Leeds as Brooks 91 drives England to commanding lead

లీడ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. తొలుత బౌలింగ్‌లో పాకిస్తాన్‌ను 171 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లీష్ జట్టు.. అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది.  తమ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 409 పరుగుల భారీ స్కోర్ సాధించి ఆలౌటైంది.

దీంతో ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ జోరూట్‌(66), హ్యారీ బ్రూక్‌(91), లారెన్స్‌(51), కాక్స్‌(73) హాఫ్‌ సెంచరీలతో కదంతొక్కారు. ముఖ్యంగా బ్రూక్ వన్డే శైలిలో బ్యాటింగ్ చేస్తూ పాక్ బౌలర్లను ఉతికారేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 ఫోర్లు ఉండడం గమనార్హం.

 కాగా పాక్ బౌలర్లలో స్పిన్నర్ అలీ ఉస్మాన్ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. అంతకుముందు పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ పేసర్లు ఆలీ రాబిన్సన్ (5/51), జోష్ టంగ్ (5/46) పర్యాటక జట్టును దెబ్బ తీశారు. 

ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (61), ఇమామ్-ఉల్-హక్ (42) ఆకట్టుకున్నప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ బ్యాటర్లు తడబడుతున్నారు. మూడో రోజు లంచ్‌ సమయానికి పాక్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement