చెత్త ఏరుకుంటూ డబ్బు సంపాదించేవారిని చూశాం. అదేనండి ప్లాస్టిక్ బాటిళ్లు, వేస్ట్ సీసాలను అమ్ముకుంటూ జీవనోపాధిగా మార్చుకున్నవాళ్లు ఉన్నారు. అలాగే రీసైక్లింగ్‌తో కూడా ఆదాయం గడించిన వారు ఉన్నారు. కానీ ఏకంగా ఆ ప్లాస్టిక్‌ని రీసైకిల్ చేసి..ఇతర గృహోపకరణాలుగా మార్చి..లక్షల్లో డబ్బు ఆర్జిస్తూ లక్షాధికారిగా మారడం గురించి విన్నారా..?. ఔను వేస్టునే డబ్బుగా మార్చి ప్రభంజనం సృష్టిస్తున్నాడో వ్యక్తి. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రథమ్ అనే వ్యక్తి షేర్ చేసిన ఈ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం..ఒక కుటుంబ వివాహ వేడుకలో తన కజిన్ చేతికి ఉన్న రోలెక్స్ వాచ్‌ని చూసి మొదలైన ప్రశ్నతో ఈ విషయం వెలుగులో వచ్చింది. తాను పారేసే ప్లాస్టిక్‌ని రీసైక్లింగ్ చేసే వ్యాపారంలో లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలిపాడు.
అయినా చెత్త వ్యాపారం ఈ రేంజ్‌లో డబ్బు తెచ్చిపెడుతుందా అని ప్రథమ్ విస్తుపోయాడు. అయితే అతడు ఉన్నది సంప్రదాయ ప్లాస్టిక్ వ్యాపారం కాదు..దీని వెనుక ఏదో ఉందనే కుతూహలంతో తన కజిన్‌ని అడగగా..కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలను అమ్మడంపై కాకుండా, వాటిని రీసైక్లింగ్ చేయడంపైనే ఇంతలా ఆర్జించడం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పాడు.
కజిన్ చెప్పిన విధానం ప్రథమ్‌ని మరింత ఆశ్చర్యపరిచింది. అదెలాగా చెప్పమని కోరగా.." అతడి కజిన్ తాను ఫ్యాక్టరీ వ్యర్థ సీసాలు, డబ్బాలు, ఇతర ప్లాస్టిక్ స్క్రాప్‌ను తీసుకుని, వాటిని రీసైకిల్ చేసి..ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌గా ప్రాసెస్ చేస్తున్నట్లు వివరించాడు. అయితే తాను వ్యర్థ సీసాలు, డబ్బాలు ప్లాస్టిక్ స్క్రాప్‌ను కిలోకు సుమారు రూ. 13 చొప్పున కొని, వాటిని రీసైకిల్ చేయగా వచ్చిన ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌ని కిలోకు సుమారు రూ. 8 నుంచి 90కి అమ్ముతాం.
దీన్ని కార్లు, ఆటో విడిభాగాలు, ప్లాస్టిక ప్యాకేజింగ్, దుస్తుల ఫైబర్లు, పైపులు, గృహోపకరణాలు, పారిశ్రామిక విడిభాగాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతేగాదు వివిధ రకాల ప్లాస్టిక్‌లకు వేర్వేరు లక్షణాలు ఉంటాయి, కాబట్టి ఆ పదార్థాన్ని వేరు చేయడం రీసైక్లింగ్‌లో ఒక ముఖ్యమైన భాగం అని చెప్పుకొచ్చాడు ప్రథమ్ కజిన్. అంటే నెలకు 50 టన్నుల రీసైక్లింగ్‌ని కిలో రూ. 80ల చొప్పున అమ్మితే దాదాపు 40 లక్షల దాక అమ్మకాలు వస్తాయని చెప్పాడు. అంటే లక్షల్లో ఆదాయం గడించగలమని ప్లాస్టిక్ వ్యర్థా వెనుకున్న వ్యాపారం గురించి చెప్పుకొచ్చాడు.
అప్పుడు అర్థమైంది అతడు వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే వ్యాపారంలో ఉన్నాడని అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు ప్రథమ్. నెటిజన్లు కూడా వావ్ ఇది చాలా తెలివైన ఆలోచన, పారేసే వ్యర్థాలతో కోట్లు గడిస్తున్నాడు. పైగా ప్లాస్టిక్‌ని ముడిసరుగా మార్చడంలోనే అసలైన సంపద ఉందని భలే చూపించాడు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
Recently, I met my cousin at a relative’s wedding.
We rarely talk, but I noticed his limited-edition Rolex.
Curious, I asked, “What do you do?”
He said, “Plastic business.”
I assumed it was normal plastic trading business.
Then I asked, “How are you making so much money?”…— Pratham (@CapitalLens_) August 19, 2026
(చదవండి: ఉద్యోగం చేస్తూనే 64 ఏళ్ల వయసులో ఎంటెక్..! ఓ తండ్రి సక్సెస్ స్టోరీ..)


