సాక్షి, న్యూఢిల్లీ: Rajiv Gandhi birth anniversary భారత్ రత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు,కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు.తన తండ్రి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తండ్రిని కోల్పోయిన తరువాత తన తల్లి సోనియా గాంధీ వ్యక్తిగతంగా అనుభవించిన బాధలను గురించి చెప్పుకొచ్చారు. అలాగే త్వరలో వెలువడనున్న తన తల్లి సోనియా గాంధీ జీవితకథ గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
తల్లికి రాహుల్ సందేశం
"నాన్న మమ్మల్ని విడిచి వెళ్ళిన రోజు నుండి, జీవితంలో నీకెదురైన ప్రతీ సవాలును నువ్వు అంతులేని ధైర్యంతో, గౌరవంతో ఎదుర్కోవడం నేను చూశాను. నువ్వు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నావో, నాన్న తర్వాత నీ జీవితం నిజంగా ఎంత కష్టంగా మారిందో కేవలం ప్రియాంకకు, నాకు మాత్రమే తెలుసు," అని పేర్కొన్నారు. సోనియా గాంధీకి మద్దతు ఇస్తున్న లక్షలాది మంది ప్రజలకు, అభిమానులకు ఆమె కథ త్వరలో చేరబోతున్నందుకు గర్వంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు.
Mama,
I last saw you and Papa together more than 35 years ago. Since the day Papa left, I have watched you face everything life threw at you with never-ending courage and dignity. Only Priyanka and I really know what you have been through, and how difficult your life after Papa… pic.twitter.com/OYumcZ2hnC— Rahul Gandhi (@RahulGandhi) August 20, 2026
"గోప్యతను ఎక్కువగా ఇష్టపడే మీలాంటి వ్యక్తికి మీ అందమైన కథను ప్రపంచానికి చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసు," అన్నారు. రాజీవ్ పుట్టినరోజున, ఆయన తండ్రి "తన అందమైన సోనియా వైపు గర్వంగా నవ్వుతూ చూస్తున్నట్లు" తాను ఊహించుకోగలనని కూడా ఆయన తెలిపారు.

సోనియా గాంధీ రాసిన ' 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) అనే పేరుతో రాసిన ఆత్మకథ త్వరలో విడుదల కానుంది. పెంగ్విన్ రాండమ్ హౌస్ వారి అనుబంధ సంస్థ అయిన ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్ ద్వారా నవంబర్ 10న అంతర్జాతీయంగా ఆవిష్కారం కానుంది. భారతదేశంలో విడుదల తేదీని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఇంకా ధృవీకరించలేదు. y">
भारतीयों के बीच सद्भावना, हर दिल में करुणा और, हर नागरिक को न्याय और लोकतंत्र में समान अधिकार..
पापा, आपकी ये सीख मेरी शक्ति है और आपकी यादें मेरी हिम्मत। आपके सपनों का भारत बनाने का संकल्प हमेशा मेरा मार्गदर्शन करता रहेगा। pic.twitter.com/YsXEFO05Ur— Rahul Gandhi (@RahulGandhi) August 20, 2026
పుస్తకంలో ఏం ఉండబోతోంది?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో సోనియా బాల్యం, భారతదేశానికి రాక, రాజీవ్ గాంధీతో వివాహం, సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ , రాజీవ్ గాంధీలను కోల్పోయిన విషాదకర సంఘటనలు, రాజకీయంలోకి ఆమె ప్రవేశం, 2004 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి గెలిచిన తర్వాత ప్రధానమంత్రి పదవిని అంగీకరించకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం వంటి విషయాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం
మరోవైపు తన వ్యక్తిగత అనుభవాలను మాటల్లో పెట్టడంలో ఉన్న కష్టాన్ని సోనియా గాంధీ గతంలోనే అంగీకరించారు. జీవితం గురించి రాయడం అంత సులభంగా రాలేదన్నారు. అంటే ‘‘నన్ను నేను ఆవిష్కరించుకోవడం, నేను ఎల్లప్పుడూ నాలోతుల్లో దాచుకున్న క్షణాలను, అనుభవాలను పంచుకోవడం," అని ప్రచురణకర్త జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి: ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తి
కాగా రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఆయన భార్య సోనియా గాంధీ, కుమారుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక వీరభూమికిచేరుకుని ఆయనకు ఘన నివాళులర్పించారు. జవహర్ భవన్‌లో జరిగిన 'హరా భరా స్వరాజ్' కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... స్వరాజ్ అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదని, 'స్వీయ పాలన' అని వ్యాఖ్యానించారు. తన తండ్రి నేర్పిన ఐక్యత, కరుణ, సమానత్వం, ప్రజాస్వామ్య సూత్రాలే తనకు బలమని, రాజీవ్ గాంధీ కలల భారతదేశాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని రాహుల్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’


