ఇది కమ్యూనిస్ట్‌–ఇస్లామిస్ట్‌ నిరసనల పరిశ్రమ  | Communist-Islamist cabal running protest industry to undermine Brand Bharat | Sakshi
Sakshi News home page

ఇది కమ్యూనిస్ట్‌–ఇస్లామిస్ట్‌ నిరసనల పరిశ్రమ 

Oct 5 2026 6:30 AM | Updated on Oct 5 2026 6:30 AM

Communist-Islamist cabal running protest industry to undermine Brand Bharat

ఆర్‌ఎస్‌ఎస్‌ ‘ఆర్గనైజర్‌’ ఆరోపణ

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య హక్కులు, నిరసనల పేరుతో భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలోని నడిచే ‘ఆర్గనైజర్‌’ వార పత్రిక పేర్కొంది. ప్రజలను రెచ్చగొట్టడం, ప్రతి అంశంలోనూ కుల భావనలను రేకెత్తించడం, వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీయడమే లక్ష్యంగా కమ్యూనిస్ట్‌–ఇస్లామిస్ట్‌ నిరసన పరిశ్రమ పనిచేస్తోందని పత్రిక ఆరోపించింది. 

ఎన్నికల కమిషన్‌కు, ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్యకు వ్యతిరేకంగా ఇటీవల జరిగిన నిరసనలు ఈ కుట్రలో భాగమేనని పత్రిక సంపాదకుడు ప్రఫుల్ల కేత్కర్‌ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని ప్రతిపక్ష పారీ్టలు ఈ ఆటలో పావులుగా మారుతున్నాయని తన సంపాదకీయంలో పేర్కొన్నారు. ‘‘నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్‌ జనతా పార్టీ సారథ్యంలో జరిగిన నిరసన ఇందుకు ఉదాహరణ. 

యువతకు తామే ఏకైక ప్రతినిధులమని చెప్పుకునేవారు జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టిన ఆందోళనలతో కొత్త నిరసనల సీజన్‌ మొదలెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందంటూ చేపట్టిన ప్రతిపక్షాల ప్రచారం కొంతవరకే సఫలీకృతమైంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న శక్తులు ఇప్పుడు కొత్త అంశాలతో ముందుకొచ్చాయి. ఈ ధోరణి కనీసం 2027 ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు లేదా 2029 వరకు కొనసాగే అవకాశం ఉంది’’ అని కేత్కర్‌ అభిప్రాయపడ్డారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement